
భగవద్గీత అనువాదం గొప్ప విషయం
పాలకొల్లు సెంట్రల్: భగవద్గీతను వంద భాషల్లో అనువాదం చేయాలనే సంకల్పం చాలా గొప్ప విషయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో గజల్ శ్రీనివాస్ సంగీతం సమకూర్చి గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత (తెలుగు) లోకార్పణ కార్యక్రమం సేవ్ టెంపుల్ భారత్, సూర్యనారాయణమూర్తి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తండ్రి కేశిరాజు నరసింహరావు చేతులు మీదుగా భగవద్గీత లోకార్పణ కార్యక్రమం ఆవిష్కరించారు. ఈ సందర్భంగాగజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీతను దాదాపుగా వంద భాషల్లో అనువదించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 భాషల్లో భగవద్గీత రికార్డింగ్ పూర్తయ్యిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి, అంగర రామ్మోహన్, యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయ వర్మ, డీటీడీసీ బాబు, పెండ్ర వీరన్న, చినిమిల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు.