
హాపూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్‌లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.
ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.
ఆ బాలిక బ్లేడ్‌తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#हापुड़
♦नाबालिग ने दुकानदार पर ब्लेड से हमला किया
♦सामान वापस न करने पर नाबालिका हुई आक्रोशित
♦दुकानदार गंभीर हालत में अस्पताल में भर्ती
♦सीसीटीवी में कैद हुई पूरी घटना
♦पिलखुवा कोतवाली क्षेत्र का मामला@hapurpolice pic.twitter.com/H9LkuAJsJp— Knews (@Knewsindia) May 4, 2025