150 అడుగుల ఎత్తులో 30 సెకన్లు వేలాడింది
జెయింట్ వీల్ నుంచి పట్టు తప్పిన వైనం
బార్‌ను పట్టుకుని ప్రాణాలు దక్కించుకుంది
లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది.
క్యాబిన్ కిందివైపున్న మెటల్‌బార్‌ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్‌బార్‌ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్‌ను సీల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment