Giant Wheel
-
సిగ్నల్స్ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ఏకంగా రంగులరాట్నం ఎక్కి ఫోన్ మాట్లాడుతున్న మంత్రి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో డిజిటల్ ఇండియాపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్ క్రియోట్ చేసి షేర్ చేస్తున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రి బ్రజేంద్రసింగ్ యాదవ్ ఇటీవల అమ్ఖో గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఆయన 9 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ సరిగా మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రతి రోజు రంగులరాట్నం ఎక్కి 50 అడుగుల ఎత్తులో కుర్చోని ఫోన్ మాట్లాతున్నారు. ఆయనతో పాటు కెమెరామెన్, ఫోటోగ్రాఫర్లు కూడా ఆ రంగులరాట్నం ఎక్కి మంత్రి ఫోటోలు, వీడియోలు కవర్ చేస్తున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ‘భగవత్ కథ, శ్రీరామ్ మహాయగ్య కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఈ గ్రామానికి వచ్చాను. 9 రోజులు ఇక్కడే ఉంటాను. ఈ క్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు నా వద్దకు వస్తున్నారు. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా అందడం లేదు. దీంతో నేను వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకేళ్లలేకపోతున్నా. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకేళ్లేందుకు ప్రతి రోజు ఈ రంగులరాట్నం ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నా’ అని మంత్రి చెప్పుకొచ్చారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి పెళ్లి విందు: తుపుక్మంటూ రోటీ మీద ఉమ్మేసి -
ఇదిగో బామ్మ... అదిగో వాన!
బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. నేను మా అక్కయ్య దగ్గర ఉండి చదువుకునేవాడిని. మా ఓనర్ బామ్మగారు చాదస్తురాలు. మడి,మడి అంటూ ఆఖరికి పిడకలు, కట్టెలను కూడా తడిపేసి అవి ఆరిన తరువాతనే వంట చేసుకునేది.ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టారు. బామ్మగారి మనవరాలు ‘‘అన్నయ్యా! ఎగ్జిబిషన్కు తీసుకువెళ్ళరా’’ అని అడిగింది. ఎగ్జిబిషన్కు మనవరాలితో పాటు బామ్మ కూడా వచ్చింది.అక్కడ రంగు రంగుల దీపాలను, రంగులరాట్నాలను చూసి ఎంతో సంబరపడిపోయారు బామ్మ.ఎవరైనా తాకుతారేమోనని దూరంగా నడుస్తున్న ఆమెను మెల్ల మెల్లగా జెయింట్వీల్ దగ్గరకు చేర్చాం.‘‘దీంట్లో తిరుగుతూ ఉంటే విమానంలో వెళుతున్నట్లే ఉంటుంది’’ అని చెప్పి జెయింట్వీల్ ఎక్కించాం.మొదట్లో ఎక్కడానికి తటపటాయించిన బామ్మ ఆ తరువాత ఎక్కింది. జెయింట్వీల్ తిరగడం ప్రారంభమై వేగం పుంజుకుంది. ఇంతలో ఒక్కసారిగా...‘‘ఓరి త్రాష్టపు వెదవా! వాన కురుస్తోందిరా. ఆపి చావరా’’ అంటూ గావుకేక పెట్టారు బామ్మగారు.ఆ కేకకు జడుసుకొని అతి కష్టం మీద జెయింట్వీల్ను ఆపారు.‘‘వానా? ఎక్కడ బామ్మగారు?’’ అని నోరు తెరుస్తూ పైకి చూశాడు జాయింట్వీల్ తిప్పే వ్యక్తి.అసలు విషయం ఏమిటంటే బామ్మగారి సీటు పైన సీట్లో కూర్చున్న పిల్లవాడు జాయింట్వీల్ వేగానికి భయపడి పాస్ పోశాడు. అవే వానతుంపరలు!అప్పటి నుంచి ఎగ్జిబిషన్ అనే మాట వినబడితే చాలు బామ్మ గుర్తుకు వస్తుంది. రాని వాన గుర్తొస్తుంది. తెగ నవ్వొస్తుంది! – పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట, గుంటూరు జిల్లా -
అనంతపురం: కదిరి ఎగ్జిబిషన్లో అపశ్రుతి
-
జైంట్వీల్ విరిగి పడి చిన్నారి మృతి
-
జాయింట్వీల్పై నుంచి పడి అర్చకుడు మృతి
కర్నూలు(మహానంది): జాయింట్ వీల్ నుంచి కిందపడి ఒక అర్చకుడు మృతిచెందాడు. వివరాలు...మహానంది పుణ్యక్షేత్రంలో జాయింట్వీల్పై నుంచి పడటంతో శివకుమార్ శర్మ (32) అనే అర్చకుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అర్చకుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. శర్మ సొంతూరు ఆళ్లగడ్డ మండలం పెద్దకంబళూరు. ప్రస్తుతం మహానందిలో నివసిస్తున్నాడు.