సిగ్నల్స్‌ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్‌ | Madhya Pradesh Minister Climbs 50 Foot Swing High For Phone Signal | Sakshi
Sakshi News home page

సిగ్నల్స్‌ అందక రంగులరాట్నం ఎక్కిన మంత్రి

Feb 22 2021 9:18 AM | Updated on Feb 22 2021 12:09 PM

Madhya Pradesh Minister Climbs 50 Foot Swing High For Phone Signal - Sakshi

అమ్ఖో గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు మంత్రి 9 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ ఫోన్‌ సిగ్రల్స్‌ అందకపోవడంతో రోజు రంగులరాట్నం ఎక్కి 50 అడుగుల ఎత్తులో కుర్చోని ఫోన్‌ మాట్లాతుంటారు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫోన్‌ సిగ్నల్‌ అందకపోవడంతో ఏకంగా రంగులరాట్నం ఎక్కి ఫోన్‌ మాట్లాడుతున్న మంత్రి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో డిజిటల్‌ ఇండియాపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్‌ క్రియోట్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ మంత్రి బ్రజేంద్రసింగ్‌ యాదవ్‌ ఇటీవల అమ్ఖో గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఆయన 9 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ సరిగా మొబైల్‌  సిగ్నల్స్‌ లేకపోవడంతో ప్రతి  రోజు రంగులరాట్నం ఎక్కి 50 అడుగుల ఎత్తులో కుర్చోని ఫోన్‌ మాట్లాతున్నారు.

ఆయనతో పాటు కెమెరామెన్‌, ఫోటోగ్రాఫర్లు కూడా ఆ రంగులరాట్నం ఎక్కి మంత్రి ఫోటోలు, వీడియోలు కవర్‌ చేస్తున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ‘భగవత్‌ కథ, శ్రీరామ్‌ మహాయగ్య కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఈ గ్రామానికి వచ్చాను. 9 రోజులు ఇక్కడే ఉంటాను. ఈ క్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు నా వద్దకు వస్తున్నారు. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా అందడం లేదు. దీంతో నేను వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకేళ్లలేకపోతున్నా. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకేళ్లేందుకు ప్రతి  రోజు ఈ రంగులరాట్నం ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నా’ అని మంత్రి చెప్పుకొచ్చారు. 

చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement