Digital India
-
డిజిటల్ ఇండియాకు బ్లాక్‌చెయిన్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థ అల్గోరాండ్ భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తమ సాంకేతికత ఊతమివ్వగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దేశీయంగా వివిధ రంగాల్లో పలు సవాళ్లను పరిష్కరించేందుకు అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఉదాహరణకు మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక పెద్ద సహకార బ్యాంకు ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరుకార్డ్ను రూపొందిస్తోంది. అలాగే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) తమ సభ్యుల కోసం డిజిటల్ హెల్త్ స్కోర్‌కార్డును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఇలాంటివి అందరికీ ఆరి్థక సేవలను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేవే. ఇక సప్లై చెయిన్‌లో పారదర్శకత సాధించేందుకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసేందుకు, ఇతరత్రా ప్రజలకు మేలు చేకూర్చే పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదు. బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మొదలైన వాటిపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రోడ్ టు ఇంపాక్ట్, స్టార్టప్ ల్యాబ్లాంటి కార్యక్రమాలు స్థానికంగా ప్రతిభావంతులను, ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తోడ్పడతాయి. అల్గోరాండ్ టెక్నాలజీతో ప్రధానంగా ఫైనాన్స్, సప్లై చెయిన్, హెల్త్‌కేర్, సస్టైనబిలిటీ వంటి కీలక రంగాలు లబ్ధి పొందగలవు. ఫైనాన్స్ విషయానికొస్తే అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీవల్ల లావాదేవీలను వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చు. పారదర్శకత వల్ల సినిమాల నిర్మాణానికి, సీమాంతర వాణిజ్యానికి అవసరమయ్యే నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరిన్ని వనరులు అందుబాటులోకి రాగలవు. సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను చూస్తే ఏఆర్వీవో, ఎల్‌డబ్ల్యూ3 లాంటి కంపెనీలు మా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. హెల్త్‌కేర్ విభాగంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చడంలో సేవా వంటి సంస్థల కార్యకలాపాలకు ఇది తోడ్పడుతోంది. టెరానోలాంటి సస్టైనబిలిటీ ప్రాజెక్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ దన్నుతో సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా టీ–హబ్, మన్ దేశీ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. భారత్‌లో ప్రాజెక్టులు.. టీ–హబ్‌లో మా స్టార్టప్ ల్యాబ్ అనేది టెరానో, ఆ్రస్టిక్స్, ఫిల్మ్ఫైనాన్స్, ఎల్‌డబ్ల్యూ3లాంటి బ్లాక్‌చెయిన్ అంకుర సంస్థలకు తోడ్పాటు అందిస్తోంది. 2024 స్టార్టప్ ల్యాబ్‌లో తొలి బ్యాచ్ కంపెనీల్లో ఇప్పటికే అయిందింటిలో ఇన్వెస్ట్ చేసింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్లాక్‌చెయిన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నాస్కామ్వంటి సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాం.ప్రణాళికలు.. స్టార్టప్ ల్యాబ్‌లలో మరిన్ని కొత్త బ్యాచ్‌లు ప్రారంభించడం, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం తదితర ప్రయత్నాల ద్వారా భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు అల్గోరాండ్ కట్టుబడి ఉంది. రోడ్ టు ఇంపాక్ట్ వంటి కార్యక్రమాలను విస్తరించడం, భారతదేశపు విశిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు మరిన్ని బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించండంపైనా దృష్టి పెడుతున్నాం. డెవలపర్లకు తోడ్పాటు.. రోడ్ టు ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలతో డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై అల్గోరాండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. 2024లో హైదరాబాద్‌లోని తొలి అల్గోరాండ్ స్టార్టప్ ల్యాబ్‌లో 21 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. మరో ఇరవై అంకుర సంస్థలు 2025 నాటికి ప్రోడక్ట్, మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ అంశాలకు సంబంధించి సన్నద్ధంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్‌లలో సుమారు 70 అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ క్లబ్‌లతో యువ డెవలపర్లకు అవసరమైన వనరులు, మెంటార్íÙప్, పోటీపడే అవకాశాలను అందిస్తున్నాం. -
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్‌కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2017లో ఈ లిస్ట్‌లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
ఆన్లైన్ గేమింగ్‌కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్‌కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
డిజిటల్ ఇండియా కల సాకారమవుతోంది - విజయసాయి రెడ్డి
యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గణనీయమైన పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత నెలలో (2023 ఆగష్టు) యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. అంటే దీని విలువ సుమారు రూ. 15.18 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. జులై (9.88 బిలియన్స్) నెల కంటే ఆగష్టు (10.24 బిలియన్స్) నెలలో యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరిగినట్లు స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలు జరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు 'విజయసాయి రెడ్డి' ట్వీట్ చేస్తూ.. 2023 ఆగష్టు నెలలో యూపీఐ ట్రాన్సక్షన్స్ 10 బిలియన్ మార్కుని దాటాయి. ఇది గొప్ప విజయమనే చెప్పాలి. ఇండియాలో యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయని ఈ డేటా స్పష్టం చేస్తోంది. డిజిటల్ ఇండియా కల సాకారమయ్యేలా కనిపిస్తోందన్నారు. डिजिटल इंडिया का सपना साकार होता नजर आ रहा है। अगस्त 2023 में यूपीआई लेनदेन 10 बिलियन के आँकड़े को पार कर गया। यह बहुत बड़ी उपलब्धि है। इस आँकड़े से साफ है कि भारत में यूपीआई लेनदेन बढ़ रहा है। pic.twitter.com/2JKr4L112Z — Vijayasai Reddy V (@VSReddy_MP) September 4, 2023 -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్‌కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్‌లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్‌ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్‌కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్‌ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్‌ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్‌బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్‌ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్‌ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
వేరబుల్ గ్యాడ్జెట్స్‌కి నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్‌లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్‌లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్‌హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్ యాప్‌లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్‌లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్‌కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డిజిటల్ ఇండియా విజన్‌కు సహకరిస్తాం
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా విజన్’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీతో తన భేటీ చక్కగా జరిగిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. తర్వాత మోదీ ట్వీట్ చేశారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు బెంగళూరు: భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. ఇది రాయాల్సిన, మాట్లాడుకోవాల్సిన చరిత్ర అని చెప్పారు. బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్’ కాదు: సత్య నాదెళ్ల ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే చాట్ రోబో ‘చాట్‌జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్‌జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్ కాదను తాను గట్టిగా చెప్పడంతో చాట్‌జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు. -
డిజిటల్ బిల్లు ముసాయిదా కమింగ్ సూన్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా బిల్లు ముసాయిదా డిసెంబర్ ఆఖరు కల్లా సంప్రదింపుల కోసం సిద్ధం కాగలదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యక్తిగతయేతర డేటా యాజమాన్య అధికారాలు, డేటా పోర్టబిలిటీ తదితర అంశాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. సమకాలీనమైనదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా చట్టం ఉంటుందని మంత్రి చెప్పారు. 22 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్థానంలో కేంద్రం దీన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఇటీవలే డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు ముసాయిదా విడుదల చేసింది. మరోవైపు, ’వేరబుల్స్’ (వాచీలు మొదలైనవి)కి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింప చేసే యోచన ఉందని చంద్రశేఖర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వేరబుల్స్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. -
మరో మైలురాయి: జియో 5జీ సేవల్లో తొలి రాష్ట్రంగా గుజరాత్
సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) ‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు) గుజరాత్లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్‌లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది. ⇒ JioTrue5G కనెక్టివిటీ ⇒ అధునాతన కంటెంట్ ప్లాట్‌ఫారమ్ ⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక ⇒ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్‌ఫోర్స్‌లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్‌గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్‌లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300..మరి ఇప్పుడు ఎంతుందో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలిసారి 5జీ నెట్ వర్క్ సర్వీసుల్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని..దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. అనంతరం 5జీ నెట్ వర్క్‌ల వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో ఒక కొత్త శకం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! ►5 జీ నెట్ వర్క్ ప్రారంభం అవ్వడం 130 కోట్ల మంది భారతీయులకు గొప్ప బహుమతి. దేశ అపరిమిత సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు సాక్షాత్కారంగా నిలుస్తాయి. ►ప్రపంచ సాంకేతిక విప్లవంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. 5జీతో టెలికాం టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ యువతకు అనేక ఉపాధి అవకాశాల్ని అందిస్తుంది. ►పొడక్ట్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా ఖర్చులు, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌లు అనే నాలుగు స్తంభాలపై డిజిటల్ ఇండియా విజయం ఆధారపడి ఉంది. మనం ఆత్మ నిర్భర్ అయినప్పుడే ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుతాయి. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నేడు వాటి సంఖ్య 200కు పెరిగింది. న్యూ ఇండియా ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉంది. ►కమ్యూనికేషన్ రంగంలో కనెక్టివిటీ చాలా ముఖ్యం. 2014 లో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆరు కోట్ల మంది ఉంటే ప్రస్తుతం 80 కోట్లకు మందికి పైగా ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ 100 గ్రామ పంచాయతీల నుండి ఇప్పుడు 170,000 పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించ బడి ఉన్నాయి. ►డిజిటల్ ఫస్ట్ విధానంతో మనం ఆన్లైన్ చెల్లింపుల వంటి పౌర కేంద్రీకృత సేవల (robust network) నెట్‌వర్క్‌ను నిర్మించడంలో విజయం సాధించాం. డిజిటల్ ఇండియా ప్రతి పౌరుడికి అనేక అవకాశాల్ని అందించింది. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ►ఇంతకుముందు 1జీబీ డేటా ధర సుమారు రూ. 300. ఇప్పుడు అది రూ.10. టెక్నాలజీ - టెలికాం అభివృద్ధితో, భారతదేశం పరిశ్రమ 4.0 విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, భారతదేశ శతాబ్దం’ అంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైర్లు’ -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి!
బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ నినాదం ’ఇంటెల్ ఇన్సైడ్’ తరహాలో ’డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్‌లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. డీఐఆర్–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్‌సెట్‌ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు వివరించారు. -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ మళ్లీ వచ్చింది
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రిలయన్స్ డిజిటల్ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్ క్రిడెట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్సైట్ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
జియో ఫేషియల్ టెక్నాలజీలో యువతను ప్రోత్సహించాలి
మాదాపూర్: మ్యాపింగ్, సర్వే, సెర్చింగ్లలో జియో ఫేషియల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని.. ఈ టెక్నాలజీలో యువతను, పరిశోధకులను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న జియో స్మార్ట్ ఇండియా–2021ను మంగళవారం గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారతీయులే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కేంద్రం డిజిటల్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఇస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది!
అనారోగ్యంతో పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు లత భర్త. ఊళ్లో ఉన్న భార్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. భర్త గురించే ఆమె ఆలోచనలన్నీ... ఎలా ఉన్నాడో ఏమో! భర్త దగ్గర మాత్రమే సెల్‌ఫోన్ ఉంది. లత దగ్గర లేదు. తనకు అవసరం అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త తన ఫోన్ ఇచ్చేవాడు. అలాంటి లత చేతిలోకి ఇప్పుడు సెల్‌ఫోన్ వచ్చింది. దాంతో గతంలో మాదిరిగా ఆమె ఇతరుల మీద ఆధారపడడం లేదు. తానే భర్తకు ఫోన్ చేసే మాట్లాడుతుంది. వీడియో కాల్స్ మాట్లాడడం కూడా నేర్చుకుంది. లతది మహారాష్ట్రలోని నింబోర గ్రామం. ఇప్పుడు అదే మహారాష్ట్రలో భానుపూరి గ్రామానికి వెళదాం...జ్యోతి దేవ్కర్ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతుంది. తాను కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త ఫోన్‌పైనే ఆధారపడేది. ఇప్పుడు తన దగ్గర కొత్త ఫోన్ ఉంది. మాట్లాడడమే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వస్తువుల గురించి తెలుసుకోవడం నుంచి ఆన్లైన్ పేమెంట్స్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన పూర్ణ కూలి పనులు చేసుకుంటుంది. అంతో ఇంతో చదువువచ్చు. ఒకప్పుడు సెల్ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే...ఎవరినో ఒకరిని బతిమిలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ఫోన్. ‘మాట్లాడడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏంజరుగుతుందో తెలుసుకో గలుగుతున్నాను’ అంటుంది పూర్ణ. ఉన్నట్టుండి వీరి చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి? సతార జిల్లా (మహారాష్ట్ర) కేంద్రంగా పనిచేసే ‘మన్‌దేశీ’ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి మాత్రమే కాదు ఎంతోమంది పేద మహిళలకు సెల్ఫోన్లను ఉచితంగా ఇచ్చింది. ఇవ్వడమే కాదు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పించింది. ‘నాకంటూ సెల్‌ఫోన్‌లేదు..అని ఈరోజుల్లో ఎవరూ అనరు’ అనుకుంటాంగానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే సెల్‌ఫోన్‌లేని పేద మహిళలు, వాటి గురించి ఏమీ తెలియని మహిళలు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్ జెండర్ గ్యాప్’ ఎక్కువగా ఉందని రకరకాల రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదమహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు ఇచ్చింది మన్‌దేశీ. విచిత్రమేమిటంటే ఉచితంగా ఇచ్చినా ‘ఈ ఫోన్లతో మేమేం చేసుకోవాలమ్మా’ అనేంత అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి సెల్‌ఫోన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, సులభంగా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ‘తీసుకోవాలా వద్దా? అని మా భర్తను అడిగి చెబుతాను’ అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్...మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు సెల్‌ఫోన్ వాడడంపై అప్రకటిత నిషేధం ఉంది. కొన్ని గ్రామీణప్రాంతాల్లో ‘మహిళలు వాడకూడదు’ అంటూ సెల్ఫోన్లపై నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్లే కావచ్చు...ఫోన్ కొనగలిగే స్థాయి ఉండికూడా కొనలేకపోవడం. దీనికితోడు వారెవ్వరికీ దానిని ఆపరేట్ చేయడం కూడా రాదు. బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఉన్న సుందర్‌బడి గ్రామంలో పెళ్లికాని అమ్మాయిలు సెల్‌ఫోన్ వాడితే రెండు వేలు, పెళ్లయిన మహిళలు వాడితే పదివేల రూపాయల జరిమానా విధిస్తారట! అందుకే...సెల్‌ఫోన్ ఇవ్వడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించే కాన్యాచరణ కూడా చేపట్టింది మన్‌దేశీ. ఫలితంగా ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకుచ్చి ప్రపంచంతో అనుసంధానం కావడానికి సెల్‌ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది అనేదానిపై విస్తృత ప్రచారం చేస్తుంది మన్‌దేశీ. చదవండి: Social Star: పైజమా పాప్‌స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా.. -
ఈ-సెక్యూరిటీలో చైనా కంటే ఇండియానే బెటర్.. సర్వేలో సంచలన విషయాలు
ఒకటి గుడ్ న్యూస్, మరొకటి బ్యాడ్ న్యూస్. ఇంటర్నెట్ స్పీడులో భారత్ వెనుకంజలో ఉంటే..ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విషయంలో దక్షిణాసియా చెందిన 8 దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. వరల్డ్ వైడ్‌గా చైనా కంటే భారత్ మెరుగ్గా ఉంది. యూకేకి చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ (వీపీఎన్) 'సర్ఫ్‌షార్క్' సంస్థ ప్రపంచ దేశాల్లో సర్వే నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా 110 దేశాల్లో 6.9 బిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లని సర్వే చేసింది. ఇంటర్నెట్ ఆఫార్డబులిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ, ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ల పనితీరు వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించింది. ఇందులో 'డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2021'(డీక్యూఎల్)లో భారత్ 59వ స్థానం దక్కించుకుంది. గతేడాదికంటే రెండు స్థానాలు తగ్గాయి. మొత్తం 110 దేశాలకు ర్యాకింగ్ ఇచ్చారు. అదే విధంగా ఈ సర్వేలో పలు విభాగాలకు కేటాయించిన ర్యాంకుల్లో ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ 33వ ర్యాంక్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ 36వ ర్యాంక్, ఇంటర్నెట్ అఫార్డబులిటీ 47వ ర్యాంక్, ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రెచ్చర్ 91వ ర్యాంక్‌లు దక్కాయి. ఇంటర్నెట్ క్వాలిటీ, స్పీడ్ విషయంలో 67వ ర్యాంక్ సాధించగా.. ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ (12.33 ఎంబీపీఎస్) తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. చైనా కన్నా మనమే బెటర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో భారత్ వెనుకంజలో ఉన్నా ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విషయంలో చైనా కంటే ముందజలో ఉంది. టెక్నాలజీ విషయంలో ప్రపంచంలో తమకు మించిన దేశం మరొకటి లేదని చైనా ప్రచారం చేసుకుంటున్నా..భద్రత విషయంలో మిగిలిన దేశాల ఎదుట పరువు పొగొట్టుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ-సెక్యూరిటీలో విభాగంలో భారత్ గతే డాదికంటే ఈ ఏడాది 76శాతం మెరుగైన ఫలితాల్ని రాబట్టి 36 వ ర్యాంక్‌ను సాధించి చైనాను వెనక్కి నెట్టింది. ఏసియా స్థాయిలో 17వ స్థానం..దక్షిణ ఆసియా దేశాల్లో ప్రథమ స్థానంలో ఇండియా ఉంది. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ 95వ స్థానంలో ఉండగా.. ఇంటర్నెట్ సామర్ధ్యం గతేడాది కంటే ఈ ఏడాది 75 శాతం తగ్గి 47వ ర్యాంక్ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌తో పోలిస్తే, మన దేశంలో ఇ-ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది. ఇంటర్నెట్ ధర, ఇంటర్నెట్ సామర్ధ్యం, ఇ-సెక్యూరిటీ, ఇ-గవర్నమెంట్లో మాత్రం ఎక్కుగా ఉంది. అగ్రస్థానంలో డెన్మార్క్ డీక్యూఎల్ సర్వేలో అత్యధిక ర్యాంకులు సాధించిన 10 దేశాలలో ఐరోపాకి చెందిన 6 దేశాలున్నాయి. మొత్తం 110 దేశాల సర్వేలో మొదటి ఐదు స్థానాల్లో డెన్మార్క్ వరుసగా రెండో సారి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. దక్షిణ కొరియా 2వ స్థానం, ఫిన్లాండ్ 3 వ స్థానం, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఉన్నాయి. దిగువన ఇథియోపియా, కంబోడియా, కామెరూన్, గ్వాటెమాల ,అంగోలా ఐదు దేశాలు ఉన్నాయి. చదవండి: చైనా మూర్ఖపు నిర్ణయంతో.. -
రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. అమ్మకాలు ప్రారంభించిన రెండు రోజుల్లో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. రెండు రోజుల్లో రూ 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ఓలా గ్రూప్ సీఈఓ భవీష్ అగర్వాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొలి రోజు సేల్స్‌ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ ట్వీట్ చేశారు ఆటోమోటివ్ పరిశ్రమలో మాత్రమే కాదు, భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇది ఘనమైన రికార్డు అని ఒకే ఉత్పత్తికి ఒక రోజు (విలువ ప్రకారం) అత్యధిక అమ్మకాలలో ఇదొకటి అన్నారు. ఇదే కదా డిజిటల్ ఇండియా అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆన్లైన్ అమ్మకానికి మొదటి రోజు, కంపెనీ రూ 600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. 48 గంటల సేల్ నిన్నటితో (సెప్టెంబరు 16) ముగిసింది. అయితే కస్టమర్లు స్కూటర్‌ను ఆన్లైన్లో రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తదుపరి సేల్ దీపావళి సందర్బంగా నవంబర్ 1 నిర్వహించనుంది. కేవలం రూ. 499 వద్ద ఆన్లైన్లో ప్లాట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్ చేసినా, రిజర్వేషన్లు olaelectric.com ఓపెన్‌లో ఉంటుందని ఓలీ సీఈఓ తెలిపారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రోలను కొనుగోలు చేయాలనుకుంటే ఇపుడే రిజర్వ్ చేసుకోవాలనికోరారు అలాగే ఇప్పటికే రిజర్వ్ చేసుకుని, కొనుగోలు చేయని వారు కూడా నవంబర్ 1న తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చని చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఓలా ఎస్ 1 ధర 1 లక్ష రూపాయలు, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అంతేకాదు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్ 1 గరిష్ట వేగం గంటలకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ఉంటుంది. ఎస్ 1 ప్రో గరిష్ట వేగం 181- 115 కి.మీ.ల మధ్య ఉంటుంది. Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven't already. Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR — Bhavish Aggarwal (@bhash) September 17, 2021 -
టెక్ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే
Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే... హరిత విప్లవం... 1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి. మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్ పియరీ పాల్ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్ ల్యాబ్స్ తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు. చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా క్షీర విప్లవం... స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్ యూరప్ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లో కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైంది. 1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్ కురియన్ గుజరాత్‌లోని ఆనంద్‌కు రావడం, అమూల్ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్‌తో పాటు అమూల్‌లో పనిచేసిన హెచ్.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్–19తో సతమతమవుతున్న సమయంలో భారత్ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! చదవండి : సిరులిచ్చే.. సోయగాల చేపలు! ఉపగ్రహాలు, సమాచార విప్లవం... 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఛైర్మన్‌గా విక్రమ్ సారాభాయ్ సమాచార ప్రసారాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది. దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్‌ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ తయారీల్లో... మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్‌లో మూడో వంతు భారత్‌లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే సోవియెట్ యూనియన్ సాయంతో హైదరాబాద్‌లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఏర్పాటు జరిగింది. నేషనల్ కెమికల్స్ లాబొరేటరీ, రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. సి–డాట్‌తో టెలికామ్ రంగంలో పెనుమార్పులు... స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్ స్విచ్ తయారవడంతో టెలికామ్ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ టెక్నాలజీ సీ–డాట్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు! రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఐబీఎం, ఐసీఎల్... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్‌కు తెచ్చి అధిక ధరలకు లీజ్‌కు ఇచ్చేవి ఈ కంపెనీలు. నేషనల్ శాంపిల్ సర్వే, అణురియాక్టర్ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్ యంత్రాల అవసరమైతే భారత్‌కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు.. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. ∙గిళియార్ గోపాలకృష్ణ మయ్యా