సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ డిజిటల్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వారు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో వీరి కొరత ఎక్కువగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత ఏడాదిగా ఇండియా ఇంక్‌లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు బాగా కొరత ఏర్పడిందని, దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించే వారికి 25-35 శాతం ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపాయి. వీటిలో టాప్ రోల్స్‌కు వార్షిక వేతనం రూ.2 కోట్లకు పైన ఉంటుందని, వేరియబుల్స్ వంటి వాటిని మొత్తం కలుపుకుని, కొన్ని సందర్భాల్లో వీరి వేతనాలు రూ.4 కోట్ల వరకు ఉంటున్నాయని తెలిసింది. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో, డిజిటల్ లావాదేవీలు పెరిగి సైబర్ సెక్యురిటీ టాలెంట్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీలు కూడా సైబర్ అటాక్స్‌తో బెంబేలెత్తుతున్నాయి. దీంతో సైబర్ ప్రొఫిషెనల్స్ నియామకాలపై ఎక్కువగా దృష్టిసారించాయి.
తమ క్లయింట్ల బోర్డుల్లో చాలామంది సైబర్ సెక్యురిటీ కోసం కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు సెర్చ్ సంస్థలు హంట్ పార్టనర్స్, ట్రాన్‌సెర్చ్ పేర్కొన్నాయి. 18 నెలల క్రితం వరకు కూడా సైబర్ సెక్యురిటీ నిపుణులు సమస్యల్లో ఉన్న ఐటీ సర్వీసులను మాత్రమే చూసుకునే వారని, కానీ ప్రస్తుతం వీరు కంపెనీల్లో బోర్డుల్లో స్థానం సంపాదించడమే కాకుండా.. మొత్తం వ్యాపారాలు వారిపై ఆధారపడేలా చేసుకున్నారని కేపీఎంజీ సైబర్ సెక్యురిటీ లీడ్, పార్టనర్ అతుల్ గుప్తా చెప్పారు. నాయకత్వ స్థానాల్లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు డిమాండ్ బాగా ఉందని, అదేవిధంగా తక్కువ స్థాయిలో కూడా వీరికి ప్రాధాన్యం ఉందని కార్న్ ఫెర్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవ్‌నీత్ సింగ్ తెలిపారు. సైబర్ సెక్యురిటీ అధినేతలకు వార్షిక వేతనం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉందని గుప్తా చెప్పారు. ముఖ్యంగా కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో వీరికి డిమాండ్ బాగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment