జీడీపీలో పదోవంతుకు ఈ విభాగం
ఆర్ధిక సాంకేతికత చోదకం
ఈ కామర్స్ పురోగతీ కారణమే
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్‌కు సానుకూల అంశం.
⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్‌లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది.
⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్‌బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి.
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ మొదట 2014లో డీ–ఎస్‌ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లను చేర్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను 2017లో ఈ లిస్ట్‌లో చేర్చింది. డీ–ఎస్‌ఐబీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి.
మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి...
ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్‌బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment