Digital revolution
-
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్‌కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2017లో ఈ లిస్ట్‌లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
పేద పిల్లల విద్యకు మహర్దశ
-
ఇ–సంజీవనితో డిజిటల్ విప్లవం
న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్ విప్లవం తన సత్తా చాటుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇ–సంజీవని యాప్ దీనికి నిదర్శనమని చెప్పారు. ఆన్లైన్లో మెడికల్ కన్సల్టేషన్ చేసే ఈ యాప్ ద్వారా 10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యాప్ ప్రాణ రక్షణగా మారిందని చెప్పారు. ఈ యాప్ ఒక్కటి చూసి భారత్ డిజిటల్ పవర్ ఏంటో చెప్పవచ్చునని అన్నారు. ఒక డాక్టర్, ఒక రోగితో మాట్లాడిన ఆయన, ఇ–సంజీవని యాప్ ఎంత ఉపయోగకరమో వివరించారు. ‘‘ఇది మనం సాధించిన అతి పెద్ద ఘనత. భారత దేశ ప్రజలు టెక్నాలజీని మన జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం. కరోనా సమయంలో ఈ యాప్ ప్రజలందరికీ ఒక వరంలా మారడం మనం కళ్లారా చూశాము’’ అని ప్రధాని చెప్పారు. ఇక నగదు చెల్లింపుల్లోనూ యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. సింగపూర్‌కు చెందిన పేనౌకి కూడా యాక్సెస్ లభించడంతో రెండు దేశాల ప్రజల మధ్య కూడా డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరంగా మారాయన్నారు. యూపీలో కొత్తగా నియమితులైన పోలీసులనుద్దేశించి మోదీ మాట్లాడారు. లక్నోలో ఉద్యోగ మేళాలో 9 వేల మందికి ఆయన నియామక పత్రాలిచ్చారు. నేడు కర్ణాటకకు ప్రధాని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో ప్రధాని పర్యటించడం ఇది ఐదోసారి! -
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్‌వర్క్‌లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్‌గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్‌కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్‌లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్‌తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్‌పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్‌ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్‌కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్‌లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్‌కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
సంపన్న దేశాల్లో అగ్రగామిగా భారత్
న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాల విషయంలో వెనుకబడినప్పటికీ.. టెక్నాలజీని విరివిగా ఉపయోగించే భారీ యువ జనాభా ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించే స్థాయిలో భారత్ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. అత్యంత సంపన్నమైన టాప్ 3 దేశాల జాబితాలో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 24వ మొబికామ్ సదస్సులో అంబానీ ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజిటల్ విప్లవం చోటు చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ‘1990లలో రిలయన్స్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నప్పుడు దేశ జీడీపీ 350 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఇది 3 ట్రిలియన్ డాలర్లకు చేరువగా ఉంది. భారత్ ఈ స్థాయికి చేరుకోగలదని ఊహించినవారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రస్తుతం టాప్ 3 సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో ముందుకు దూసుకుపోతోంది‘ అని అంబానీ చెప్పారు. ప్రస్తుతం అత్యధిక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ కేంద్రంగా భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పపంచానికి భారత్ సారథ్యం వహించగలదని, తదుపరి ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించగలదని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. -
‘బిమ్స్టెక్’తో కలిసి పనిచేస్తాం
కఠ్మాండు: ప్రధాన రంగాల్లో బిమ్స్టెక్ సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో జరుగుతున్న బిమ్స్టెక్ నాలుగో సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా అడ్డుకట్టకు సభ్య దేశాల మధ్య అనుసంధానం పెరగాలని ఆకాంక్షించారు. వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు అవకాశాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతం. జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట ‘బిమ్స్టెక్ సభ్య దేశాలతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడేందుకు భారత్ కట్టుబడి ఉంది. భారత్ విధానాలైన పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్ ఈస్ట్‌లకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంగా మారింది. అలాగే మనందరి భద్రత, అభివృద్ధికి సంబంధించి బంగాళాఖాతానికి ప్రాధాన్యత ఉంది. సభ్య దేశాల్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలతో ఇబ్బంది పడని దేశం లేదు. బిమ్స్టెక్ విధివిధానాలకు లోబడి మాదకద్రవ్యాల సంబంధిత అంశాలపై సదస్సు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ సమస్య ఒక దేశానికి సంబంధించిన శాంతిభద్రతల అంశం కాదు. దీనిని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. తరచూ వరదలు, తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తు సంభవించే హిమాలయాలు, బంగాళాఖాతం మధ్య బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయని.. అందువల్ల మానవతా సాయం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో సభ్య దేశాలు సహకారం, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ‘శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఏ ఒక్క దేశం ఒంటరిగా ముందుకు సాగలేదు. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతలో సహకారం.. సభ్య దేశాల ఉమ్మడి లబ్ధి కోసం వ్యవసాయ పరిశోధన, స్టార్టప్స్ తదితర అంశాల్లో సదస్సు నిర్వహిస్తామని, బంగాళాఖాతం ప్రాంతంలోని కళలు, సంస్కృతి, ఇతర అంశాలపై పరిశోధన కోసం నలంద యూనివర్సిటీలో ‘బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ సాంకేతికత రంగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌కు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహకారాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని దేశాలతో అనుసంధానంలో ఈశాన్య రాష్ట్రాలు కీలక ప్రాత పోషిస్తాయని, ఆ రాష్ట్రాల్లో చేపడుతోన్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్ని బిమ్స్టెక్ దేశాలకు విస్తరించవచ్చని చెప్పారు. ‘నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’లో చదివేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు స్కాలర్షిప్ అందచేస్తామన్నారు. బిమ్స్టెక్ వేదికగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు. పుతిన్‌తో మోదీ భేటీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస.. రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది. -
రాష్ట్రంలో డిజిటల్ విప్లవం
- ఐటీ, డిజిటల్ టెక్నాలజీలపై ప్రభుత్వ దృష్టి: కేటీఆర్ - హైదరాబాద్‌లో ఐసీటీ 4డీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం డిజిటల్ విప్లవం ముంగిట్లో ఉందని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, నెలకు 20 కోట్ల లావాదేవీలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో తొమ్మిదో ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ (ఐసీటీ 4డీ)’అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దాదాపు 74 దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ విస్తృత వినియోగంపై చర్చలు జరుగనున్నాయి. సోమవారం ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఐటీ, డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించేందుకు టీ–ఫైబర్ ప్రాజెక్టు చేపట్టామని, దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 600 సేవలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ మొబైల్ అప్లికేషన్ల ద్వారా కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటరైన టీ–హబ్‌లో ప్రస్తుతం రెండు వందలకుపైగా స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. ఐటీలో మాంద్యం..భారత్‌కు పెద్ద అవకాశం ఐటీ రంగంలో నెలకొన్న మాంద్యం పరిస్థితులను భారతదేశం గొప్ప అవకాశంగా మలుచుకోవాలని, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి అంతర్జాతీయ సంస్థలను నడిపే సామర్థ్యం భారతీయులకు ఉన్నప్పుడు.. ఆ స్థాయిలో ఐటీ ఉత్పత్తులను తయారు చేయగల శక్తిసామరా>్థ్యలూ ఉన్నాయన్నది తన విశ్వాసమని పేర్కొన్నారు. తెలంగాణలో ఐటీ రంగం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి సాధించిందని, ఈ వివరాలను జూన్ ఒకటిన వార్షిక నివేదికలో తెలియజేస్తామని చెప్పారు. కాగా.. ఈ కార్యక్రమంలో కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ ష్కూలైర్ థోర్ప్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారతదేశం డిజిటల్ టెక్నాలజీలను మెరుగైన రీతిలో ఉపయోగించుకుంటోందని కొనియాడారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్, నాస్కామ్ చైర్మన్ బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ ఇండియా విప్లవభేరి
-
డిజిటల్ ఇండియా విప్లవభేరి
మోగించిన మోదీ! ⇒ డేటా భద్రతకు పటిష్టమైన చర్యలు... ⇒ టాప్ ఐటీ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ ⇒ ఎం-గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత చేరువ ⇒ పేపర్‌లెస్ లావాదేవీలే లక్ష్యం ⇒ ప్రజలందరికీ డిజిటల్ లాకర్లు... సాంకేతిక సృజనాత్మకతకు పుట్టినిల్లు.. హైటెక్ పరిజ్ఞానానికి ప్రపంచ కేంద్రం.. డిజిటల్ ప్రపంచానికి రాజధాని అయిన సిలికాన్ వ్యాలీ వాకిట.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాల ముంగిట.. ‘డిజిటల్ ఇండియా’ విప్లవభేరిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోగించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చేందుకు తన ప్రణాళికలను ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థల సీఈఓలతో శనివారం రాత్రి విందు భేటీలో బయటపెట్టారు. పేదలు, ప్రభుత్వ పథకాలను అందుకోలేనివారికి చేరువకావడంతో పాటు దేశంలో ప్రజల జీవన గమనాన్ని సమూలంగా మార్చివేసే లక్ష్యంతోనే డిజిటల్ ఇండియాకు అంకురార్పణ చేశామన్నారు. హైవేలతో పాటు ఐ-వేలు కూడా అవసరమంటూ.. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజలను డిజిటల్‌గా అనుసంధానించటం తమ లక్ష్యమని చెప్పారు. పల్లెలను స్మార్ట్ ఎకనమిక్ హబ్‌లుగా మార్చటమే ధ్యేయంగా.. దేశంలోని ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించటాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పేపర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే సంకల్పమంటూ.. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుందన్నారు. ఇంకా భారత ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని చర్యలను వివరించారు. నరేంద్రమోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవానికి తమ సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్కామ్ దాదాపు రూ. వేయి కోట్లు మేర నిధులను అందించనున్నట్లు పాల్ జాకబ్స్ ప్రకటించారు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ విజ్ఞప్తికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ ఆదివారం ఫేస్బుక్, గూగుల్ ప్రధాన కార్యలయాలను సందర్శించి.. సీఈఓలతో పాటు ఇతర ప్రతినిధులతో ముచ్చటించారు. ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం. చౌక బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలకు మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ గుజరాతీ సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పిస్తాం. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. డిజిటల్ లిటరసీ (పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మేం ఈ చర్యలు చేపడుతున్నాం. - సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అమ్మకు కన్నీటి అభిషేకం సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో ముఖాముఖి సందర్భంగా.. అమ్మ ప్రస్తావన వచ్చినపుడు భావోద్వేగంతో.. కళ్లలో నీళ్లు ఉబికివస్తుండగా.. ప్రధాని మోదీ చెప్పిన మాటలివి. శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు. మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే 500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు. ఐ-వేస్ కూడా అవసరం... 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది. స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు. -
డిజిటల్ విప్లవం ముంగిట్లో భారత్
కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.శర్మ {పజలందరికీ డిజిటల్ లాకర్లు ఇండియా జియోస్పాటియల్ ఫోరం ప్రారంభం హైదరాబాద్: భారతదేశం డిజిటల్ విప్లవం ముంగిట్లో ఉందని, సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా దేశ పౌరులందరికీ వినూత్నమైన సేవలు అందించనున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ఆధార్ ఆధారిత డిజిటల్ సంతకం, వ్యక్తిగత ధ్రువపత్రాలన్నింటినీ నిక్షిప్తం చేసుకునేందుకు ప్రజలందరికీ డిజిటల్ లాకర్లు ఏర్పాటు చేయడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ఆయన చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ సేవల తీరుతెన్నులే మారిపోతాయన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం ప్రారంభమైన ఇండియన్ జియోస్పాటియల్ ఫోరమ్ 17వ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ కార్యక్రమాల్లో జియోస్పాటియల్ ఇన్ఫర్మేషన్(జీఐఎస్) అత్యంత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. దాదాపు 75 కోట్ల ఆధార్ కార్డులు, 90 కోట్ల సెల్‌ఫోన్ వినియోగదారులు, 13.5 కోట్ల జన్‌ధన్ యోజన లబ్ధిదారుల రూపంలో భారత్‌లో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. వీటితోపాటు ప్రభుత్వం డిజిటల్ సంతకాల సేకరణకు, ధ్రువపత్రాలను ఆన్లైన్లో స్టోర్ చేసుకునేందుకు డిజిటల్ లాకర్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో భూ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చకపోవడం వల్ల అనేక ఇబ్బందులొస్తున్నాయన్నారు. పట్టణాలు, నగరాల ప్లానింగ్ మొదలుకుని, వ్యర్థాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, గుర్తింపు తదితర అనేకాంశాల్లో ఎంతో ఉపయోగమున్న జీఐఎస్ టెక్నాలజీని అన్ని రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పా రు. కేంద్ర ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేష్ నాయక్, ఎల్ అండ్ టీ, రోల్టా ఇండియా సీఈవోలు కె.వెంకటరమణన్, కె.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సృజనకు సరితూగే కెరీర్!
మీడియా - ఎంటర్టైన్మెంట్.. ప్రసార మాధ్యమాలు (మీడియా).. జాతి హృదయ స్పందనను కళ్లకు కట్టే అత్యుత్తమ సాధనాలు. సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు.. అదే విధంగా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరికీ రోజంతా శ్రమించి కాస్త సేద తీరేందుకు వినోదం (ఎంటర్టైన్మెంట్) ఓ ఆహ్లాదకరమైన మార్గం. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ప్రసారమాధ్యమాలు, వినోదరంగం (ఎం అండ్ ఈ)లో నిపుణులైన మానవవనరులకు డిమాండ్ తథ్యం. ఈ నేపథ్యంలో కెరీర్ అవకాశాలపై ఫోకస్.. ఫిక్కీ-కేపీఎంజీ రిపోర్టు ప్రకారం 2013లో దేశంలో మీడియా, ఎంటర్టైన్మెంట్ (ఎం అండ్ ఈ) మార్కెట్ విలువ రూ.91,800 కోట్లు. ఇది 2018 నాటికి రూ.2.27 లక్షల కోట్లకు చేరుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది. ‘ఇండియా ఎంటర్టైన్మెంట్, మీడియా అవుట్‌లుక్ 2014’ ప్రకారం ఎం అండ్ ఈ పరిశ్రమ గతేడాది రూ.1.12 లక్షల కోట్ల రెవెన్యూ దక్కించుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరం ఆర్జించిన దానికంటే 19 శాతం అధికం. టెలివిజన్, ఇంటర్నెట్ రంగాలు శరవేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో టెలివిజన్, ఫిల్మ్, ప్రింట్, వైర్డ్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్, వైర్డ్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్, గేమింగ్, రేడియో, మ్యూజిక్ వంటివి కీలక విభాగాలు. ఆనంద నగరం.. భాగ్య నగరం: హైదరాబాద్ మహానగరంలో ప్రసార మాధ్యమాలు, సినీ రంగం ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా; చలనచిత్ర పరిశ్రమ; వీడియోగేమ్స్; ఎఫ్ఎం రేడియో వంటి వాటి అభివృద్ధికి భాగ్యనగరం మంచి వేదికగా నిలుస్తోంది. వీటితో పాటు గేమ్‌సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడం వినోద రంగం అభివృద్ధికి ఊతమిస్తోంది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఎం అండ్ ఈ పరిశ్రమలో అందిపుచ్చుకోవాలేగానీ అవకాశాలకు కొదువలేదు! ‘‘కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అద్భుత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు అద్దంపట్టేలా ఇటీవల టీవీ చానెళ్లలో పెరుగుతున్న వినోద కార్యక్రమాలు యువతరం ఆలోచనలకు కళాత్మక రూపాలే. సినిమా అంటే కేవలం నటన, దర్శకత్వం మాత్రమే కాదు.. అందులో 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే టీవీ, సినిమా రెండింటిలోనూ రాణించవచ్చు’’ అంటున్నారు సినీ దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి. మీడియాలో పెనుమార్పులు: దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. అందువల్ల విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండటంతోపాటు ఆకర్షణీయ ఆదాయం, సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో యువత జర్నలిజం కెరీర్ వైపు ఆకర్షితులవుతున్నారు. వీరు న్యూస్ రిపోర్టింగ్, ఎడిటింగ్, సర్క్యులేషన్, అడ్వర్టైజింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ తదితర విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. టీవీ చానెళ్లు, వెబ్సైట్లు, రేడియో తదితరాల్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలుంటాయి. వీటిలో యాంకరింగ్, యాక్టింగ్, ప్రొడక్షన్, బ్రాడ్‌కాస్టింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ విభాగాల్లో మంచి అవకాశాలుంటాయి. సృజనాత్మకత, నూతన త్వం: సినిమా, టీవీ విభాగాల్లో డెరైక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఇంజనీర్, స్క్రీన్‌ప్లే, యాంకరింగ్, న్యూస్‌రీడింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్.. ఇలా వివిధ అవకాశాల్లో అర్హత, సమర్థతనుబట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సృజనాత్మకత, నూతనత్వాన్ని ప్రతిబింబించడం ద్వారా కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అప్రంటీస్, అసిస్టెంట్ డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు బృందాన్ని నడిపించగల నాయకత్వ లక్షణాలు ఉంటే డెరైక్టర్ స్థాయికి ఎదగొచ్చు. సినిమా, సీరియళ్ల చిత్రీకరణ తర్వాత దృశ్యాలను సరైన క్రమంలో పేర్చడం ఎడిటర్ బాధ్యత. సమయస్ఫూర్తి, సృజనాత్మకత, కళాత్మకత అనేవి ఎడిటింగ్ రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు. అడ్వర్టైజింగ్ సంస్థలు, మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్ కంపెనీలు, టీవీ, ఫిల్మ్ స్టూడియోలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఇన్పుట్ ఎడిటర్ స్థాయికి చేరొచ్చు. ఆర్థిక వెసులుబాటు ఉంటే సొంతంగా ప్రొడక్షన్‌హౌస్ ఏర్పాటుచేసుకోవచ్చు. ప్రారంభ వేతనం రూ.20వేల వరకు ఉంటుంది. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటే నెలకు రూ.లక్ష వరకు ఆర్జించవచ్చు. మీడియా-కోర్సులు: నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా, ఇగ్నో, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థలు జర్నలిజం కోర్సులను అందిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్ (న్యూఢిల్లీ) సంస్థ.. ఇంగ్లిష్ జర్నలిజం, హిందీ జర్నలిజం, అడర్వర్టైజింగ్-పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తోంది. జర్నలిజంలో పీజీ కోర్సును అందుబాటులో ఉంచింది. డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు www.iimc.nic.in. వెబ్‌డిజైనింగ్, మల్టీమీడియా కోర్సుల్లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (www.jnafau.ac.in) రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల్లో కోర్సులు అందిస్తోంది. సినీ, టెలివిజన్- కోర్సులు , సంస్థలు - నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ వంటి వాటిలో సినీ, టెలివిజన్ కోర్సులున్నాయి. - ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (నోయిడా), సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (కోల్‌కతా), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) వంటి ప్రముఖ సంస్థల్లో యాక్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, డెరైక్షన్ తదితర అంశాల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత అవకాశాలు ప్రపంచం మనుగడ ఉన్నంత కాలం మీడియా ఉంటుంది. భవిష్యత్తులో ఈ రంగంలో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకొని, నైపుణ్యాలు పెంచుకుంటే ఈ రంగంలో త్వరగా ఎదిగేందుకు అవకాశముంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అనువుగా తయారవ్వాలి. - ప్రొఫెసర్ వాసుకి బెలవాడి, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, హెచ్‌సీయూ. చిత్ర పరిశ్రమలో కళాత్మక అవకాశాలు నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్‌మేకింగ్ అంటే ఆసక్తి. 2013 టోఫెల్ స్కాలర్షిప్ రావడంతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాను. ఏటా పది వేల డాలర్లు ఇస్తారు. ఫిల్మ్, ఎకనామిక్స్‌లో మేజర్ డిగ్రీలు చేస్తున్నా. ఫిల్మ్ మేకింగ్ నా లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు ఉండాలన్నదే నా కోరిక. సినిమాలంటే కేవలం పాటలు, ఫైట్స్ మాత్రమే కాదు.. అవి జీవితాలను ప్రతిబింబించేలా ఉండాలి. సృజనాత్మకత ఉన్నవారికి వినోదరంగం అద్భుతమైన వేదిక అనేది నా అభిప్రాయం. - అలీజానూర్ఖాన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా. డిజిటల్ మీడియాదే హవా నాకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ‘అమ్మాయివి కెమెరాతో నీకేంటి పని..’ అని కొందరు విమర్శించినా, నాన్న ప్రోత్సాహంతో దాన్నే కెరీర్‌గా మార్చుకున్నా. నా అర్హత పత్రాలు పంపడంతో అమెరికాలోని రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో రూ.1.20 కోట్ల స్కాలర్‌షిప్‌తో సీటు లభించింది. ప్రస్తుతం డిజిటల్‌యుగం నడుస్తోంది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలేగానీ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో అవకాశాలకు కొరతలేదు’’ -పూజా అపర్ణ కొల్లూరి, రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్, అమెరికా.