ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో మా సొంత టెక్నాలజీతో ప్రయోజనాలు
అల్గోరాండ్ ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థ అల్గోరాండ్ భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తమ సాంకేతికత ఊతమివ్వగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
దేశీయంగా వివిధ రంగాల్లో పలు సవాళ్లను పరిష్కరించేందుకు అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఉదాహరణకు మహిళల సారథ్యంలోని ఎంఎస్‌ఎంఈలకు కొత్త ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక పెద్ద సహకార బ్యాంకు ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరుకార్డ్‌ను రూపొందిస్తోంది. అలాగే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) తమ సభ్యుల కోసం డిజిటల్ హెల్త్ స్కోర్‌కార్డును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
ఇలాంటివి అందరికీ ఆరి్థక సేవలను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేవే. ఇక సప్లై చెయిన్‌లో పారదర్శకత సాధించేందుకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసేందుకు, ఇతరత్రా ప్రజలకు మేలు చేకూర్చే పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదు. బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మొదలైన వాటిపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రోడ్ టు ఇంపాక్ట్, స్టార్టప్ ల్యాబ్‌లాంటి కార్యక్రమాలు స్థానికంగా ప్రతిభావంతులను, ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తోడ్పడతాయి.
అల్గోరాండ్ టెక్నాలజీతో ప్రధానంగా ఫైనాన్స్, సప్లై చెయిన్, హెల్త్‌కేర్, సస్టైనబిలిటీ వంటి కీలక రంగాలు లబ్ధి పొందగలవు. ఫైనాన్స్ విషయానికొస్తే అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీవల్ల లావాదేవీలను వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చు. పారదర్శకత వల్ల సినిమాల నిర్మాణానికి, సీమాంతర వాణిజ్యానికి అవసరమయ్యే నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరిన్ని వనరులు అందుబాటులోకి రాగలవు. సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను చూస్తే ఏఆర్‌వీవో, ఎల్‌డబ్ల్యూ3 లాంటి కంపెనీలు మా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. హెల్త్‌కేర్ విభాగంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చడంలో సేవా వంటి సంస్థల కార్యకలాపాలకు ఇది తోడ్పడుతోంది. టెరానోలాంటి సస్టైనబిలిటీ ప్రాజెక్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ దన్నుతో సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా టీ–హబ్, మన్ దేశీ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నాం.
భారత్‌లో ప్రాజెక్టులు..
టీ–హబ్‌లో మా స్టార్టప్ ల్యాబ్ అనేది టెరానో, ఆ్రస్టిక్స్, ఫిల్మ్‌ఫైనాన్స్, ఎల్‌డబ్ల్యూ3లాంటి బ్లాక్‌చెయిన్ అంకుర సంస్థలకు తోడ్పాటు అందిస్తోంది. 2024 స్టార్టప్ ల్యాబ్‌లో తొలి బ్యాచ్ కంపెనీల్లో ఇప్పటికే అయిందింటిలో ఇన్వెస్ట్ చేసింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్లాక్‌చెయిన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నాస్కామ్‌వంటి సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాం.
ప్రణాళికలు..
స్టార్టప్ ల్యాబ్‌లలో మరిన్ని కొత్త బ్యాచ్‌లు ప్రారంభించడం, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం తదితర ప్రయత్నాల ద్వారా భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు అల్గోరాండ్ కట్టుబడి ఉంది. రోడ్ టు ఇంపాక్ట్ వంటి కార్యక్రమాలను విస్తరించడం, భారతదేశపు విశిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు మరిన్ని బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించండంపైనా దృష్టి పెడుతున్నాం.
డెవలపర్లకు తోడ్పాటు..
రోడ్ టు ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలతో డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై అల్గోరాండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. 2024లో హైదరాబాద్‌లోని తొలి అల్గోరాండ్ స్టార్టప్ ల్యాబ్‌లో 21 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. మరో ఇరవై అంకుర సంస్థలు 2025 నాటికి ప్రోడక్ట్, మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ అంశాలకు సంబంధించి సన్నద్ధంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్‌లలో సుమారు 70 అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ క్లబ్‌లతో యువ డెవలపర్లకు అవసరమైన వనరులు, మెంటార్íÙప్, పోటీపడే అవకాశాలను అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment