Blockchain Technology
-
వెబ్3తో భారత్‌లో భారీగా కొలువులు.. భారీ వేతనాలకు ఆస్కారం!
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత కొత్త తరం వెబ్3 రంగంతో భారత్‌లో ఉపాధి కల్పనకు ఊతం లభించగలదని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రైమస్ పార్ట్నర్స్ ఒక నివేదికలో తెలిపింది. దీని వల్ల భారీ వేతనాలు లభించేందుకు ఆస్కారమున్న 20 లక్షల పైచిలుకు కొలువులు రాగలవని పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా వెబ్3 రంగంలోని 900 పైగా సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరింంది. 2022లో మొత్తం వెబ్3 డెవలపర్ కమ్యూనిటీలో మన వాటా 11 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఆరోగ్య సేవల్లో గోప్యత, విద్య, వోటింగ్ సిస్టమ్స్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఇది ఉపయోగపడుతోందని వివరింంది. దీన్ని బాధ్యతాయుతంగా అనుసంధానం చేయగలిగితే పరిశ్రమల ముఖచిత్రం మారిపోగలదని ఈ నివేదికలో ప్రైమస్ పార్ట్నర్స్ పేర్కొంది. వెబ్ 3.0 అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఒక టెక్నాలజీ, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి పురోగతి చెందటానికి పది సంవత్సరాల సమయం పట్టినట్లు తెలిసింది. ఇప్పడు వెబ్ 3.0 పూర్తిగా డెవలప్ కావడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో భారీ కొలువులు లభిస్తాయని స్పష్టమవుతోంది. వెబ్ 3.0 వల్ల మెరుగైన అనుభవాలు, డేటా భద్రత, గొప్ప ఆర్థిక అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలను తెస్తుందని అంచనా వేస్తున్నారు. వీటి వల్ల వినియోగదారుల డేటా చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి కొన్ని సాంకేతికలు నేర్చుకోవాల్సి ఉంటుంది. -
బ్లాక్‌చెయిన్ ప్రమాణాలపై బీఐఎస్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలకు కూడా ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలోనూ పురోగమిస్తోందని ఆయన చెప్పారు. అటు పసిడి హాల్‌మార్కింగ్‌కు నిర్దేశించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని తివారీ స్పష్టం చేశారు. పాత నిల్వలను విక్రయించుకునేందుకు జ్యుయలర్లకు రెండేళ్ల పైగా గడువును ఇచ్చామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేసేలా తప్పనిసరిగా 6 అంకెల హాల్‌మార్క్ విశిష్ట గుర్తింపు సంఖ్యతోనే (హెచ్‌యూఐడీ) విక్రయించాలన్న నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకే తాము ప్రమాణాలను రూపొందిస్తున్నామని తివారీ వివరించారు. ఇతర దేశాలతో కూడా వాణిజ్యం జరిపేందుకు వీలుగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి జరిగే ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పటిష్టమైన సాంకేతిక భద్రత అవసరమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ తరహా అభిప్రాయానికొచ్చారు. దీనికోసం అత్యంత పటిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రత వ్యవస్థను కల్పించే యోచనలో ఉన్నారు. దీనితోపాటే ఎంసెట్ పేపర్ రూపకల్పన, వాటిని కంప్యూటర్లు, సర్వర్లలో నిక్షిప్తం చేసిన విధానాలపై నిపుణులతో కలిసి అధికారులు లోతైన సమీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పేపర్ తయారీలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు, సాంకేతిక నిపుణుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇదే కోణంలో పేపర్లను భద్రత పరిచిన తర్వాత సంబంధిత సర్వర్లు, కంప్యూటర్లను ఎవరైనా వినియోగించారా? అనే కోణంలో సమాచార సేకరణకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్‌కు ప్రశ్నపత్రాల సర్వర్లకు సంబంధించిన ప్రతీ ఐపీ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు ఇతర రాష్ట్రాలతో సహా రాష్ట్రానికి చెందిన మొత్తం 2.50 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మేఘాలయాలో జరుగుతున్న అఖిల భారత విశ్వవిద్యాలయాల సమావేశంలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్ భద్రతపై సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ముట్టుకున్నా ‘బ్లాక్’అలారం.. ఎంసెట్ పేపర్ల భద్రతకు వాడబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి దీన్ని సర్వర్లకు, కీలకమైన కంప్యూటర్ డివైస్‌కు అనుసంధానం చేస్తే ఏ ఇతర వ్యక్తి ముట్టుకున్నా తక్షణమే కీలకమైన వ్యక్తులకు సంకేతాలిస్తుంది. ఇప్పటి వరకూ డివైజ్‌లోకి ఎవరెవరు? ఏ ఐపీ అడ్రస్‌తో వెళ్ళారనే రహస్య సమాచారం అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో క్రిప్టోగ్రఫీ విధానంలో పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్లకు బాధ్యులెవరు? ఏయే సమయాల్లో వాళ్ళు డివైజ్‌లోకి వెళ్ళాలి? అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ టెక్నాలజీ మెమోరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు ప్రవేశించినా, అందుకు భిన్నంగా వెళ్ళినా తేలికగా ముందే గుర్తించడం ఈ సాంకేతికత ప్రత్యేకగా చెబుతున్నారు. అత్యంత రహస్యమైన వ్యవస్థను అంతకంటే రహస్యంగా భద్రతపర్చడమే కాకుండా, హ్యాక్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే విధానం ఇందులో ఉందని చెబుతున్నారు. దీన్ని పక్కాగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తుల గురించి అధికారులు జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా పాస్వర్డ్స్, సమాచార ప్రవేశం ఎవరెవరికి ఏ మేర ఇవ్వాలనే విషయాలపై స్పష్టతకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్లే ఏం జరిగినా వారినే బాధ్యులను చేయవచ్చని చెబుతున్నారు. ప్రత్యేక భద్రతపై పరిశీలిస్తున్నాం ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పూర్తి భద్రత కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఉన్నత విద్యా మండలితో కలిసి ఈ విషయంలో చర్చలు జరుపుతాం. మేఘాలయ వీసీల సమావేశంలో ఉన్నప్పటికీ కీలకమైన ఈ అంశంపై దృష్టి పెట్టాం. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నదీ త్వరలో వివరిస్తాం. - ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ జేఎన్టీయూహెచ్) ఎన్క్రిప్షన్ కూడా అవసరమే ఎంసెట్ వంటి కీలకమైన ప్రశ్నపత్రాలకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత మంచిదే. దీంతోపాటే, ఎన్క్రిప్షన్ విధానం అత్యంత ముఖ్యం. దీనివల్ల ప్రశ్నపత్రం ఎవరికైనా చిక్కినా ఏమీ అర్ధంకాని భాషలో ఉంటుంది. దీన్ని కేవలం వ్యాల్యూడ్ యూజర్ మాత్రమే డీకోడ్ చేయడం సాధ్యం. క్రిప్టోగ్రఫీ భాషా విధానంతో దీన్ని రూపొందించారు. విశ్వసనీయమైన వ్యక్తులకు అధికారం ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకుంటే పేపర్ లీక్ వంటి ఘటనలకు ఆస్కారమే ఉండదు. - ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ (వీసీ, అనురాగ్ యూనివర్సిటీ, సైబర్‌క్రైం ఫ్యాకల్టీ నిపుణులు) -
ఇదేం టెక్నాలజీరా బాబు.. ఆత్మనే అమ్మేస్తున్నావ్ !
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే మార్కెట్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఐస్‌క్రీం మొదలు కారు వరకు అన్ని ఈ కామర్స్ వేదికగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇప్పుడే మార్కెట్లో మరింత అడ్వాన్స్మెంట్ చోటు చేసుకుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంతో ఏకంగా ఆత్మలనే అమ్మకానికి పెడుతున్నారు. నెదర్లాండ్స్‌కి చెందిన హాగ్ ఆర్ట్ అకాడమీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థి స్టిన్ వాన్ షైక్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)గా తన సోల్ (ఆత్మ)ని అమ్మకానికి పెట్టాడు. ఓపెన్ సీ మార్కెట్ ప్లేస్‌లో సోల్ ఆఫ్ స్టైనస్ పేరుతో అమ్మకానికి సంబంధించిన వివరాలు అతడు పోస్ట్ చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆత్మనే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా నెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు ఆరా తీయగా తన ఆత్మను అమ్మేందుకు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఎన్ఎఫ్టీ రూపంలో ఉన్న తన ఆత్మను బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో క్రిప్టో చెల్లింపుల ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించాడు. ఒక్కసారి ఒప్పందం పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు ఉండవని ముందే స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని ఆత్మను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపించగా అత్యధికంగా 0.1 ఇథేరియం ( 347 డాలర్లు) వరకు ధర పలుకుతోంది. బిడ్ ముగిసే లోపు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఆత్మను కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేయవచ్చనే సందేహాన్ని కూడా అతడే నివృత్తి చేశాడు. తన ఎన్ఎఫ్టీ రూపంలో తన ఆత్మను సొంతం చేసుకున్నవారు... వారి వారి మత విశ్వాసాలకు తగ్గట్టుఉగా తన ఆత్మను పార్టులు పార్టులుగా లేదా ఏకమొత్తంగా మొక్కుగా చెల్లించుకోవచ్చని సూచిస్తున్నాడు,. అవసరమైతే ఆత్మబలిదానం(త్యాగం) చేసుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. గత రెండేళ్లుగా ఎన్ఎఫ్టీ మార్కెట్ పుంజుకుంటోంది. అమితాబ్ బచ్చన్, మహేంద్ర సింగ్ధోని వంటి వారు తమ ప్రతిభకు సంబంధించిన అంశాలను ఎన్ఎఫ్టీలుగా అమ్మకానికి పెట్టారు. రామ్ గోపాల్ వర్మ్ సైతం డేంజరస్ సినిమాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అందుబాటులో ఉంచారు. అయితే వీటన్నింటీని బీట్ చేస్తూ నెదర్లాండ్ స్టూడెంట్ ఏకంగా ఆత్మనే అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు. చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..! -
ఘోస్ట్ సినిమా షూటింగ్లో నాగార్జున
-
అమితాబ్, సచిన్, ధోని బాటలో నాగార్జున ! ఈ చర్చలు అందుకేనా?
ఒకప్పుడు సినిమా తెరపై సైకిల్ చెయిన్ తెంపి నాగార్జున సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ సైకిల్ చెయిన్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఇప్పుడు నాగార్జున కొత్తగా బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త ఇంట్రెస్ట్ ఫ్యూచర్లో ఏ సంచలనాలకు కేంద్రం కానుందో.... వెండితెర హీరోగానే కాదు సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో పేరుంది. కొత్త టాలెంట్‌ని పట్టుకోవడంలో భవిష్యత్తుని సరిగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడంలో ‘కింగ్’ని దిట్టగా చెప్పుకుంటారు. మరోసారి నాగార్జున తన ఇమేజ్‌కి తగ్గట్టుగా కొత్త స్టెప్ వేయబోతున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ! స్పెషల్ మీటింగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా షూటింగ్లో భాగంగా నాగార్జున ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. నాగార్జునతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, విదేశీయులు పోటీ పడ్డారు. అయితే దీనికి భిన్నంగా నాగార్జునానే ఓ వ్యక్తితో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు ఆ వ్యక్తి ప్రత్యేకతలను చెబుతూ ఏకంగా ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది. ఫ్యూచర్ టెక్నాలజీ దుబాయ్‌లో షూట్లో ఉన్న నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఫుల్‌క్రేజ్ ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సర్వీస్ అందిస్తున్న ఓఎక్స్ పాలిగాన్ సంస్థ కో ఫౌండర్ సందీప్ నైల్వాల్ని కలిశారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇతర ఫ్యూచర్ టెక్నాలజీలపై చర్చించామని నాగార్జున స్వయంగా తెలిపారు. It was nice to meet and chat with @sandeepnailwal Co-founder @0xPolygon !!the man who put india on the world map of blockchain and talk about future tech!! Godbless🙏 pic.twitter.com/kRbSpczyeM — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2022 ఎవరీ సందీప్ ముంబైకి చెందిన సందీప్ నైల్వాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకి వచ్చాక ఏంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత డెలాయిట్, వెల్స్పన్ సంస్థల్లో పని చేశారు. 2017లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేసే మాటిక్ సంస్థను స్థాపించాడు. అనంతరం 2019లో దాన్ని ఓఎక్స్పాలిగాన్గా మార్చాడు. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ఇండియా క్రిప్టో కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశీ క్రిప్టో అడ్డా ఇండియాకు సంబంధించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, ఈథేరియం లావాదేవీలు, బినాన్స్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవహరాలకు ఈ సంస్థ పెట్టింది పేరు. ఈ సంస్థ యూజర్ బేస్‌లో మూడు లక్షల మంది క్రిప్టో ట్రేడర్లు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో 27 బిలియన్ డాలర్ల విలువైన ఈథేరియమ్, బినాన్స్, స్మార్ట్చైయిన్ లావాదేవీలను నిర్వహించింది. బ్లాక్‌చెయిన్ బాట పట్టిన సెలబ్రిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్మేన్లు, సినిమా పర్సనాలిటీస్, స్పోర్ట్స్ ఐకాన్స్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వ్యక్తులు ఇప్పటికే క్రిప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేయగా సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోని వంటి మూవీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లను రిలీజ్ చేస్తున్నారు. కింగ్ మదిలో ఏముందో ? ఈ నేపథ్యంలో నాగార్జున సందీప్ నైల్వాల్ని కలుసుకోవడం బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున త్వరలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టవచ్చంటూ కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు ఎన్ఎఫ్టీలు తీసుకు రావచ్చని అనుకుంటున్నారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుకి సంబంధించిన సినిమా విశేషాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన బ్లాక్‌చెయిన్ గురించి నాగార్జున తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: ఎన్ఎఫ్టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు! -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్‌స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. -
అదిరిపోయే ఆఫర్! క్రిప్టో కరెన్సీపై ఉచిత కోర్సు
న్యూఢిల్లీ: హరిద్వార్ కేంద్రంగా నడిచే ప్రముఖ విద్యా సంస్థ గురుకుల కంగ్రి.. క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును ఆఫర్ చేయనుంది. కోర్సు పూర్తయిన తర్వాత గురుకుల కంగ్రి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది. గురుకుల కంగ్రికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది. మల్లగుల్లాలు ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వారు ఇప్పటికే ఇందులో భారీ ఎత్తు పెట్టబడులు పెడుతున్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా క్రిప్టో వైపు చూస్తున్న యువత ఇండియాలోనే ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇచ్చే అంశాన్ని ఇటీవల కేంద్ర కేబినేట్ పరిశీలించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ కాయిన్ తేవాలనే డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు క్రిప్టోకి వ్యతిరేకంగా వద్దంటూ గళం విప్పాయి. దీంతో క్రిప్టో అనుమతుల విషయంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
బ్లాక్ చైన్.. సేఫ్టీకి కీ చైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికత వినియోగం పెరుగుతుండటంతో మున్ముందు పెరిగే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక వేస్తోంది. తెలంగాణను ‘ప్రపంచ బ్లాక్‌చైన్ రాజధాని’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే ‘తెలంగాణ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్’అనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా దేశంలోని స్టార్టప్‌లకు సాయం కోసం ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సలేటర్’ను ప్రారంభించింది. దేశంలో బ్లాక్‌చైన్ స్టార్టప్ వాతావరణాన్ని పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సర్కారు చెప్పింది. ధరణి వెబ్సైట్ నుంచి మొదలు.. ‘ధరణి’వెబ్సైట్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తోంది. భూ రికార్డుల్లో అనధికార లావాదేవీలు, దిద్దుబాట్లు జరగకుండా చూడటంతో పాటు భూ రికార్డులను శాశ్వతంగా భద్రపరిచేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ సంస్థల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రూపొందించిన ‘టీ చిట్స్’మంచి ఫలితాలిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీ నిధి లావాదేవీలకు క్రెడిట్ రేటింగ్ ఇచ్చేందుకు కాగ్నిటోచైన్ అనే స్టార్టప్ ‘బీ పోస్ట్’సేవలను తీసుకొచ్చింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఈ వివరాలను బీ పోస్ట్ పంచుకుంటుంది. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు సర్టిఫికెట్ల జారీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం ఎస్ఎస్సీ సర్టిఫికెట్లను ఈ టెక్నాలజీ ద్వారానే ఇస్తున్నారు. మున్ముందు మరిన్ని రంగాలకు.. స్టార్టప్ రంగంలో రాబోయే తరంగా చెప్పుకునే వెబ్2, వెబ్3 స్టార్టప్‌లు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడి పరిష్కారాలు కనుగొనడంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇలా బ్లాక్ చైన్‌పై పని చేసే స్టార్టప్‌లకు సహకారాన్ని ‘టీ బ్లాక్ యాక్సలేటర్’, ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సలేటర్’ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. టీ బ్లాక్ యాక్సలేటర్ కింది ఇప్పటికే 8 స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. అలాగే ఫిన్‌టెక్, వినోదం, సుస్థిరాభివృద్ధి, మౌళిక వసతులు, అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఆరోగ్య రక్షణ వంటి రంగాల్లో బ్లాక్‌చైన్ స్టార్టప్‌లు చాలా పరిష్కారాలు చూపొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయికి టెక్నాలజీని తీసుకెళ్లి, బ్లాక్‌చైన్ వినియోగం పెంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. ‘దేశ ఐటీ రంగంలో బ్లాక్‌చైన్ రంగం విస్తరణకు అవసరమైన నైపుణ్యం, సదుపాయాలపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది’అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే? బ్లాక్ టెక్నాలజీ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. ఈ టెక్నాలజీలో బ్లాక్ అంటే ఒక భాగం. ఈ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వాళ్లు ఏదైనా లావాదేవీ గాని, ఇతరత్రా పనిగాని చేస్తే ఇచ్చే వాళ్లు, పుచ్చుకునేవాళ్ల వివరాలతో ఓ బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బ్లాక్‌లో ఉన్న వాళ్లు ఇంకేదైనా లావాదేవీ చేస్తే ఇంకో బ్లాక్ ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ కలిపి చైన్ మాదిరి తయారవుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఎక్కడ ఏ బ్లాక్‌లో మార్పు జరిగినా మిగతావాళ్లు ఆమోదిస్తేనే జరుగుతుంది. ఈ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వాళ్లకు సీక్రెట్ కోడ్ ఇస్తారు. వాళ్లు మాత్రమే అందులోకి లాగిన్ అవగలరు. వేరేవాళ్లు, హ్యాకర్లు ఎవరైనా లాగిన్ కావాలని ప్రయత్నిస్తే క్షణాల్లో మిగతా వాళ్లకు తెలియజేసి అప్రమత్తమయ్యేలా బ్లాక్‌చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంటే ఈ టెక్నాలజీని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యమే. -
‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా తెలంగాణ..!’
స్టార్టప్స్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్పేస్, యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పలు కార్యచరణను రూపొందించింది. బ్లాక్ చైయిన్ టెక్నాలజీ విషయంలో ఆయా స్టార్టప్స్‌గా అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ మరో మహాత్తార కార్యానికి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా క్రిప్టో ఎక్స్ఛేంజీల గ్లోబల్ అగ్రిగేటర్ కాయిన్‌స్విచ్ కుబేర్, తెలంగాణ ప్రభుత్వ మద్దతు గల తెలంగాణ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’ను ఆవిష్కరించాయి. ఇందుకు టెక్నాలజీ పరిశోధనా యాజమాన్య సేవల సంస్థ లుమోస్ ల్యాబ్స్‌తో జతకలిశాయి. ఆయా స్టార్టప్స్‌కు మార్గదర్శిగా..! బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఆయా స్టార్టప్స్‌లను ప్రోత్సహించడం, అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. డీప్-టెక్ బ్లాక్‌చైన్ స్టార్టప్స్‌కు తగిన మార్గదర్శకత్వాన్ని, అక్రెడిషన్ను అందించనున్నాయి. ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు నెర్వస్ నెట్వర్క్, స్టెల్లార్, స్ట్రీమర్, ఫైల్‌కాయిన్, నియో ప్రొటోకాల్ ‘ప్లాటినం స్పాన్సర్లు’ గా వ్యవహరించనున్నాయి. నాలుగు నెలల పాటు..! ప్రాథమిక దశకు చెందిన వెబ్2, వెబ్3 స్టార్ట్ప్స్, బ్లాక్‌చైన్ డెవలపర్లు తాము ఆవిష్కరించిన వినూత్న బ్లాక్‌చైన్ పరిష్కారాలను వచ్చే నాలుగు నెలల పాటు ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు ప్రతిపాదించవచ్చు. తద్వారా లైట్‌స్పీడ్, వుడ్‌స్టాక్ ఫండ్ల నుంచి 7 లక్షల డాలర్లకు పైగా పెట్టుబడిని సంపాదించే అవకాశం ఉంది. బ్లాక్‌చైయిన్ క్యాపిటల్‌గా..! తెలంగాణను ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: ఆంక్షలు ఎత్తేయడం ఆలస్యం ఆకాశయానానికి సై -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయంటే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీతో ఎలాంటి మోసాలకు తావు ఉండదు. ఎందుకంటే లావాదేవీలు మొత్తం పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో నడుస్తాయి. అసలు ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది, వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి తెలుసుకుందాం... బ్లాక్‌చెయిన్‌తో బోలెడు ప్రయోజనాలు... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో కేవలం క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 1. నగదు చెల్లింపులు/వసూళ్లు 2. స్టాక్ ఎక్స్చేంజీ తరహా ఆర్థిక వ్యవహారాలు 3. ఇన్సూరెన్స్ సేవలు. 5. రియల్ ఎస్టేట్. 6. వ్యక్తిగత సమాచార భద్రత 7. ఎన్నికల ఓటింగ్: మీ వ్యక్తిగత సమాచారం మొత్తం బ్లాక్చెయిన్లలో ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా ఓటింగ్ నిర్వహించడం సులువు. భద్రంగా, ఎలాంటి అవ్యవహారాలకు తావు లేకుండా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ 8. ప్రభుత్వ ఫథకాల వితరణ: రేషన్ సరుకుల నుంచి ఇళ్లపట్టాల వరకూ ప్రతి ఒక్కటి అర్హులకు మాత్రమే దక్కేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయపడుతుంది. మోసాలకు తావులేదు. అమలు చాలా చౌక కూడా. డిజిటల్ వ్యవహారాల కంటే వేగంగా లబ్ధిదారులకు సాయం అందుతుంది. 9. ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాల (ఐఓటీ) భద్రత. బ్లాక్ చెయిన్ పనిచేసేదిలా... కొనుగోలు, కాంట్రాక్ట్ వంటి వ్యవహారం కోసం అభ్యర్థన ఈ అభ్యర్థన నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల (నోడ్)కు ప్రసారమవుతుంది. అభ్యర్థన తాలూకు సమాచారంతో ఒక బ్లాక్ ఏర్పడుతుంది. నోడ్ కంప్యూటర్లు ఆమోదిస్తాయి. అప్పటికే ఉన్న బ్లాక్‌లకు ఈ కొత్త బ్లాక్ లింక్ ఏర్పరచుకుని నిక్షిప్తమవుతుంది. ఇలా బ్లాక్‌ల శ్రేణి ఉండటం వల్లనే దీన్ని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటారు. ఇతర అంశాల సమాచారంతో కలిపి ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక బ్లాక్ సిద్ధమవుతుంది. వ్యవహారంలో క్రిప్టోకరెన్సీ, స్మార్ట్కాంట్రాక్ట్, మెసేజీల్లాంటి ఏ సమాచారమైనా ఉండవచ్చు. ప్రతి బ్లాక్‌లోని సమాచారం భద్రంగా ఉంటుంది. మార్పులు చేయాలంటే.. ఆ వ్యవహారంలో పాల్గొన్న నోడ్ల అనుమతి తప్పనిసరి. చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!