న్యూఢిల్లీ: హరిద్వార్ కేంద్రంగా నడిచే ప్రముఖ విద్యా సంస్థ గురుకుల కంగ్రి.. క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును ఆఫర్ చేయనుంది. కోర్సు పూర్తయిన తర్వాత గురుకుల కంగ్రి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది. గురుకుల కంగ్రికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది.
మల్లగుల్లాలు
ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వారు ఇప్పటికే ఇందులో భారీ ఎత్తు పెట్టబడులు పెడుతున్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా క్రిప్టో వైపు చూస్తున్న యువత ఇండియాలోనే ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇచ్చే అంశాన్ని ఇటీవల కేంద్ర కేబినేట్ పరిశీలించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ కాయిన్ తేవాలనే డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు క్రిప్టోకి వ్యతిరేకంగా వద్దంటూ గళం విప్పాయి. దీంతో క్రిప్టో అనుమతుల విషయంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.
చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్
Comments
Please login to add a commentAdd a comment