ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సైతం ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి.
తాజాగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ‘వజీర్ఎక్స్’ 40 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కాయిన్ డెస్క్ తెలిపింది.
వజీర్‌ఎక్స్‌లో 150 మంది పని చేస్తుండగా..వారిలో 50 నుంచి 70 మందికి ఇక ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఫైర్ చేసిన ఉద్యోగులకు 45 రోజుల వేతనం చెల్లించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment