స్టార్టప్స్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్పేస్, యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పలు కార్యచరణను రూపొందించింది. బ్లాక్ చైయిన్ టెక్నాలజీ విషయంలో ఆయా స్టార్టప్స్‌గా అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ మరో మహాత్తార కార్యానికి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా క్రిప్టో ఎక్స్ఛేంజీల గ్లోబల్ అగ్రిగేటర్ కాయిన్‌స్విచ్ కుబేర్, తెలంగాణ ప్రభుత్వ మద్దతు గల తెలంగాణ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’ను ఆవిష్కరించాయి. ఇందుకు టెక్నాలజీ పరిశోధనా యాజమాన్య సేవల సంస్థ లుమోస్ ల్యాబ్స్‌తో జతకలిశాయి.
ఆయా స్టార్టప్స్‌కు మార్గదర్శిగా..!
బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఆయా స్టార్టప్స్‌లను ప్రోత్సహించడం, అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. డీప్-టెక్ బ్లాక్‌చైన్ స్టార్టప్స్‌కు తగిన మార్గదర్శకత్వాన్ని, అక్రెడిషన్‌ను అందించనున్నాయి. ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు నెర్వస్ నెట్‌వర్క్, స్టెల్లార్, స్ట్రీమర్, ఫైల్‌కాయిన్, నియో ప్రొటోకాల్ ‘ప్లాటినం స్పాన్సర్లు’ గా వ్యవహరించనున్నాయి.
నాలుగు నెలల పాటు..!
ప్రాథమిక దశకు చెందిన వెబ్2, వెబ్3 స్టార్ట్‌ప్స్, బ్లాక్‌చైన్ డెవలపర్లు తాము ఆవిష్కరించిన వినూత్న బ్లాక్‌చైన్ పరిష్కారాలను వచ్చే నాలుగు నెలల పాటు ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు ప్రతిపాదించవచ్చు. తద్వారా లైట్‌స్పీడ్, వుడ్‌స్టాక్ ఫండ్‌ల నుంచి 7 లక్షల డాలర్లకు పైగా పెట్టుబడిని సంపాదించే అవకాశం ఉంది.
బ్లాక్‌చైయిన్ క్యాపిటల్‌గా..!
తెలంగాణను ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చదవండి: ఆంక్షలు ఎత్తేయడం ఆలస్యం ఆకాశయానానికి సై
Comments
Please login to add a commentAdd a comment