Accelerator
-
‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా తెలంగాణ..!’
స్టార్టప్స్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్పేస్, యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పలు కార్యచరణను రూపొందించింది. బ్లాక్ చైయిన్ టెక్నాలజీ విషయంలో ఆయా స్టార్టప్స్‌గా అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ మరో మహాత్తార కార్యానికి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా క్రిప్టో ఎక్స్ఛేంజీల గ్లోబల్ అగ్రిగేటర్ కాయిన్‌స్విచ్ కుబేర్, తెలంగాణ ప్రభుత్వ మద్దతు గల తెలంగాణ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’ను ఆవిష్కరించాయి. ఇందుకు టెక్నాలజీ పరిశోధనా యాజమాన్య సేవల సంస్థ లుమోస్ ల్యాబ్స్‌తో జతకలిశాయి. ఆయా స్టార్టప్స్‌కు మార్గదర్శిగా..! బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఆయా స్టార్టప్స్‌లను ప్రోత్సహించడం, అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. డీప్-టెక్ బ్లాక్‌చైన్ స్టార్టప్స్‌కు తగిన మార్గదర్శకత్వాన్ని, అక్రెడిషన్ను అందించనున్నాయి. ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు నెర్వస్ నెట్వర్క్, స్టెల్లార్, స్ట్రీమర్, ఫైల్‌కాయిన్, నియో ప్రొటోకాల్ ‘ప్లాటినం స్పాన్సర్లు’ గా వ్యవహరించనున్నాయి. నాలుగు నెలల పాటు..! ప్రాథమిక దశకు చెందిన వెబ్2, వెబ్3 స్టార్ట్ప్స్, బ్లాక్‌చైన్ డెవలపర్లు తాము ఆవిష్కరించిన వినూత్న బ్లాక్‌చైన్ పరిష్కారాలను వచ్చే నాలుగు నెలల పాటు ‘ఇండియా బ్లాక్‌చైన్ యాక్సెలరేటర్’కు ప్రతిపాదించవచ్చు. తద్వారా లైట్‌స్పీడ్, వుడ్‌స్టాక్ ఫండ్ల నుంచి 7 లక్షల డాలర్లకు పైగా పెట్టుబడిని సంపాదించే అవకాశం ఉంది. బ్లాక్‌చైయిన్ క్యాపిటల్‌గా..! తెలంగాణను ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: ఆంక్షలు ఎత్తేయడం ఆలస్యం ఆకాశయానానికి సై -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్‌ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్‌తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్‌కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్‌లను విజేతలుగా ఎంపిక చేసింది. వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్‌గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు. చదవండి: హైదరాబాద్ వినియోగదారుల ఫోరంలో ఎస్బీఐకి దెబ్బ -
స్టార్టప్ ఇండియాతో అమెజాన్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఇందులో భాగంగా స్టార్టప్ ఇండియా, సెకోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో చేతులు కలిపినట్లు, స్టార్టప్స్ కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొపెల్ (ఏజీఎస్‌పీ) పేరిట రూపొందించిన ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశ, విదేశాలకు చెందిన అమెజాన్ లీడర్స్, స్టార్టప్ ఇండియాకి సంబంధించిన వెంచర్ క్యాపిటలిస్టులు, సీనియర్ లీడర్లు.. మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన 10 అంకుర సంస్థలకు ఆరు వారాల పాటు ఈ–కామర్స్ ద్వారా ఎగుమతుల వ్యాపారాన్ని పెంచుకునేందుకు తోడ్పడే మెళకువలను వివరిస్తారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఆయా స్టార్టప్‌లు తమ తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేందుకు అమెజాన్ తోడ్పాటు అందిస్తుంది. అంతే గాకుండా సెకోయా క్యాపిటల్, ఫైర్‌సైడ్ వెంచర్స్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలకు తమ వ్యాపార సామర్థ్యాలను గురించి వివరించేందుకు కూడా స్టార్టప్‌లకు అవకాశం దక్కుతుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (గ్లోబల్ ట్రేడ్) అభిజిత్ కామ్రా తెలిపారు. వీటిలో మూడు అంకుర సంస్థలు.. అమెజాన్ నుంచి 50,000 డాలర్ల గ్రాంట్ కూడా దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. -
బ్రేక్ అనుకుని ఎక్సిలేటర్ పై కాలు.. అంతలో!
స్టాక్‌హోం: కారు నడుపుతున్న మహిళ పొరపాటున బ్రేక్ అనుకుని ఎక్సిలేటర్పై కాలువేయటంతో వేగం పుంజుకుంది. దీంతో ఆ కారు హెల్త్ సెంటర్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్వీడన్ రాజధాని స్టాక్హోంమ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వార్డ్సెంట్రల్ హొగ్దాలెన్ హెల్త్ సెంటర్ వద్దకు కారులో వచ్చిన మహిళ(80) బ్రేక్ వేయాలనుకుని ఎక్సిలేటర్పై కాలు వేసింది. లోపల ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రురాలిని వెంటనే హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగతా ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్రా లేదని పోలీసులు వివరించారు. ఏప్రిల్ 7 వ తేదీన ఓ వ్యక్తి తన ట్రక్‌ను జనాలపైకి నడపటంతో ఐదుగురు చనిపోగా 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం వెనుక ముస్లిం తీవ్రవాదుల హస్తం ఉందని తేలింది. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరిగినా తీవ్రవాద హస్తం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. -
మృత్యువుకు దొరికారు
నిండు జీవితాల్ని బలిగొన్న కొత్త కారు {బేక్ వేసేందుకు బదులు యాక్సిలేటర్ నొక్కిన డ్రయివర్ వాయువేగంతో దూసుకొచ్చిన వాహనం ఇద్దరు మృతి... 15 మందికి తీవ్ర గాయాలు పోలీసుల అదుపులో రావికమతం మాజీ మండల ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు బుధవారం ఉదయం 9 గంటలు. కొత్త కారు బయల్దేరింది. చూస్తుండగానే వేగం అందుకుంది. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఏం జరిగిందో తెలియలేదు... అడ్డొచ్చినవాళ్లందరినీ ఢీకొంది. రహదారి రక్తం చిమ్మింది. ఇద్దరి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పదిహేను మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముచ్చట పడి కొనుక్కున్న కారు మృత్యుపాశమై నిలిచిం ది. కారు నడపడంలో అనుభవ రాహిత్యం నిండుప్రాణాల్ని బలిగొంది. రావికమతంలో టీడీపీ నేత, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు నడుపుతూ బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్‌ను నొక్కేయడం ఇంతటి విషాదానికి కారణమైంది. రావికమతం : రావికమతం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు కొన్నారు. భార్యతో కలిసి కారులో బుధవారం ఉదయం చోడవరం బయల్దేరారు. ఇంటికి సమీపంలోనే అడ్డొచ్చిన ఒక ఐస్ పెట్టె వ్యాపారిని తప్పించబోయారు. బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ నొక్కేయంతో కారు వాయువేగంతో దూసుకుపోయింది. రోడ్డుపై సైకిల్‌పై వెళ్తున్న గుమ్మాళ్లపాడుకు చెందిన డొంకిన పోతురాజు (47)ను ఢీకొంది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆటోను బలంగా ఢీకొట్టడంతో అది గాలిలో ఎగిరిపడింది. అందులో ప్రయాణిస్తున్న పిల్లవానిపాలేనికి చెందిన పుప్పాల అప్పలకొండ (62) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అనంతరం బైక్‌పై వెళ్తున్న మళ్ళ రమణబాబు (52), శీర నూకరాజు (47)లపై నుంచి దూసుకుపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. సైకిల్, బైక్ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలోని గుమ్మాళ్లపాడుకు చెందిన గొర్లె రాజిబాబు, కోటవురట్ల మండలానికి చెందిన పల్లా రమణ), బంగారుమెట్టకు చెందిన మొల్లి పెంటమ్మ, దొండపూడికి చెందిన పొలుమూరి రాజారావు, మజ్జి అప్పారావు, రావికమతానికి చెందిన ముక్కా సత్తిబాబు, ఆటో డ్రయివర్ రెడ్డి మహేష్, టి.అర్జాపురానికి చెందిన ఒకే కుటుంబంలోని రొంగలి రమణమ్మ, కొండమ్మ, శైతి, నమ్మి రామకృష్ణ, మరుపాకకు చెందిన పుర్రె గణేష్, పెదగొట్టివాడకు చెందిన శీర చినతల్లి, నర్సీపట్నానికి చెందిన డిగ్రీ విద్యార్థిని టి.శ్రావణిలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తకోట ఇన్చార్జి సీఐ దాశరథి, ఎస్ఐ శిరీష్‌కుమార్, రావికమతం ఎస్ఐ సురేష్‌కుమార్ క్షతగాత్రులను నర్సీపట్నం, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, జిల్లా బీజేపీ నేత గల్లా రాజేశ్వరరావు మృతుల బంధువులను ఓదార్చి క్షతగాత్రులను పరామర్శించారు. కారు యజమాని గంటా ఈశ్వరరావును ఎస్ఐ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.