న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్‌కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్‌లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్‌బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్‌లను విజేతలుగా ఎంపిక చేసింది.
వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్‌గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు.
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
Published Fri, Aug 13 2021 7:46 AM | Last Updated on Thu, Sep 16 2021 2:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment