Startup Companies
-
ఐటీ కంపెనీల స్టార్టప్ వేట!
ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీ ఊపందుకోవడంతో చిప్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి. ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్ లాజిక్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్‌లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జోరుగా.. హుషారుగా... గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ యాజ్–ఎ–సర్విస్ (సాస్) స్టార్టప్ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్ ఐటీ ఇంజినీరింగ్ సర్విసుల సంస్థ సైయంట్ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్ అజిమత్ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్ పరిశ్రమలో సైయంట్ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.ఇక మరో మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్మెంట్ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్‌లో 20 శాతం ఇన్ఫోసిస్‌కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్ ఈ ఏడాది జూలైలో చిప్ డిజైన్ స్టార్టప్ ఎక్సెల్‌మ్యాక్స్ టెక్నాలజీస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్ కూడా యూఎస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంపాక్టివ్ను కైవసం చేసుకుంది. బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లకు ఇది దన్నుగా నిలుస్తోంది.తాజా కొనుగోళ్లు ఇలా...⇒ యాక్సెంచర్ – ఎక్సెల్‌మ్యాక్స్ (చిప్ డిజైన్) ⇒ ఇన్ఫోసిస్ – గెలాక్స్ఐ (స్పేస్ టెక్) ⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్) ⇒ జోరియంట్ – మ్యాపిల్ల్యాబ్స్ (క్లౌడ్ మేనేజ్మెంట్) ⇒ సైయంట్ – అజిమత్ ఏఐ (సెమీకండక్టర్) ⇒ పర్సిస్టెంట్ సిస్టమ్స్ – ఆర్కా (డేటా ప్రైవసీ) -
అంతరిక్ష రంగం అభివృద్ధికి ఇవే కీలకం: ఇస్రో చైర్మన్
అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ వాటాను కైవసం చేసుకునేందుకు.. భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. అయితే దీనికి ప్రైవేట్ రంగాలు.. స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా భారత్ అవతరించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్లో ఇండియా వాటా కేవలం 2 శాతం (386 బిలియన్ డాలర్లు) వద్దనే ఉంది. దీనిని 2030నాటికి 500 బిలియన్ డాలర్లకు.. 2047 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని సోమనాథ్ అన్నారు.భారతదేశంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న స్పేస్ శాటిలైట్స్ కేవలం 15 మాత్రమే. ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని పెంచడానికి కృషి చేయాలి. అంతరిక్ష సాంకేతికతలో దేశం నైపుణ్యం.. పెరుగుతున్న ఉపగ్రహాల తయారీ కంపెనీల దృష్ట్యా.. భారతదేశం కనీసం 500 ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని సోమనాథ్ ఉద్ఘాటించారు.ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రైవేట్ సంస్థలు.. కక్ష్యలో శాటిలైట్లను తయారు చేసి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ లాంచ్ప్యాడ్లు కూడా వస్తాయి. 2014లో అంతరిక్ష సంబంధిత స్టార్టప్ కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది. 2024కు ఈ సంఖ్య 250కి చేరింది. 2023లోనే స్పేస్ స్టార్టప్‌లు రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి. 450కి పైగా MSMEలు.. 50కి పైగా పెద్ద కంపెనీలు ఇప్పుడు అంతరిక్ష రంగానికి చురుకుగా సహకరిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.మన దేశంలో మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్, ఇండియన్ స్పేస్ స్టేటన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ఇస్రో.. ప్రైవేట్ రంగాల మధ్య సహకార ప్రయత్నాలే. అంతరిక్ష యాత్రల కోసం చేసిన పరిశోధనల నుంచి ప్రయోజనం పొందే వందలాది విభిన్న రంగాలను ఇస్రో గుర్తించింది. సాంకేతికత బదిలీ కోసం ఎంపిక చేసిన పరిశ్రమలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఇస్రో సుమారు 61 దేశాలకు సహకరిస్తోంది. భారత్ ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి మిషన్లలో NASAతో NISAR, CNES (ఫ్రాన్స్)తో TRISHNA, G20 శాటిలైట్, JAXA (జపాన్)తో లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ వంటివి ఉన్నాయని స్పష్టం చేశారు. -
వారం రోజుల్లో ఒకే వేదికపైకి 900 స్టార్టప్‌లు
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024 ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్ రెండో ఎడిషన్‌ను ప్రారంభించబోతున్నట్లు సంస్థ సీఈఓ పి.రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న దాదాపు 900లకు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులు పాల్గొంటాయని పేర్కొన్నారు.గతేడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మొదటి ఎడిషన్‌లో దాదాపు 400కు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈసారి జరగబోయే ఆస్పైర్ ఈవెంట్ రెండో ఎడిషన్. అయితే ఐఎంసీకు మాత్రం ఇది ఎనిమిదో ఎడిషన్ కావడం విశేషం. ఐఎంసీ 2024ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.ఆస్పైర్ స్టార్టప్ ప్రోగ్రామ్ నిర్వహణలో టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియా, టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ), ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఢిల్లీ వంటి సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ కార్యక్రమంలో 5జీ వినియోగం, ఏఐ, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎంటర్ప్రైజ్, గ్రీన్ టెక్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, స్మార్ట్ మొబిలిటీ, సస్టైనబిలిటీ, టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ వంటి విభాగాల్లో వివిధ సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. దాంతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఈ సందర్భంగా ఐఎంసీ సీఈఓ పి.రామకృష్ణ మాట్లాడుతూ..‘భారత స్టార్టప్ ఎకోసిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది. ఇది విభిన్న రంగాల్లో స్టార్టప్ కంపెనీలు చేసే ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో 1.28 లక్షలకుపైగా స్టార్టప్ కంపెనీలున్నాయి. దాంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. స్టార్టప్ ఎకోసిస్టమ్, సుస్థిర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ సదస్సు తన వంతు కృషి చేస్తోంది’ అన్నారు. -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
కృత్రిమ మేధలో ప్రపంచానికి ఇండియా నాయకత్వం వహించబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
PM Narendra Modi: కృత్రిమ మేధలో లీడర్ ఇండియా
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర చెప్పారు. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్వదేశీ పరిష్కార మార్గాలు కనిపెట్టాలని భారత యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం గతంలోనే ప్రారంభించిన ఏఐ, సెమీ కండక్టర్లు, నేషనల్ క్వాంటమ్ మిషన్ల ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉపాధి, విదేశీ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఏఐ టెక్నాలజీ అనే నూతన శకంలో మనం ఉన్నామని, ఈ రంగంలో భారత్‌దే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు. యువతకు, ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకు ఏఐ టెక్నాలజీ అవధుల్లేని అవకాశాలు అందిస్తోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధలో ఇండియానే లీడర్ అవుతుందంటూ గత ఏడాది అమెరికా సెనేట్‌లో తాను తేలి్చచెప్పానని మోదీ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నానని, తెలుగు, తమిళంతోపాటు ఎన్నో భాషల్లో తన స్టేట్మెంట్లను ప్రజలతో పంచుకుంటున్నానని ఉద్ఘాటించారు. మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదే సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోందని ప్రధాని మోదీ వెల్లడించారు. రూ.వేల కోట్లతో కొత్తగా ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్యంతర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. స్టార్టప్ కంపెనీలకు నిధుల సాయం అందించడానికి ఒక ఉత్తమ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. 2014లో మన దేశంలో కనీసం 100 స్టార్టప్‌లు కూడా లేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.25 లక్షలు దాటిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలతో 12 లక్షల మంది యువత అనుసంధానమై ఉన్నారని వివరించారు. స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో పేటెంట్లు సాధిస్తున్నాయని కొనియాడారు. మనకు 110కుపైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. విద్యాభ్యాసం అంటే ప్రభుత్వం ఉద్యోగం సంపాదించడం అనే ధోరణి గతంలో ఉండేదని, ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడినట్లేనని భావించేవారని గుర్తుచేశారు. అలాంటి ఆలోచనా ధోరణి ఇప్పుడు మారిందని, స్టార్టప్ విప్లవం మొదలైందని అన్నారు. నేటి మన యువత ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో 45 శాతానికిపైగా స్టార్టప్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేనని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌తోపాటు ప్రపంచ మెరుగైన భవిష్యత్తుకు నవీన ఆవిష్కరణల సంస్కృతి చాలా కీలకమని స్పష్టం చేశారు. రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీపై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాల్లో కొందరిని పదేపదే కొత్తగా ప్రారంభించాల్సి వస్తోందని అన్నారు. ఒక రంగంలో స్టార్టప్ కంపెనీ విఫలమైతే మరో రంగంలో ప్రారంభించవచ్చని చెప్పారు. రాజకీయాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. చాలామంది స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని, రాజకీయాల్లో స్టార్టప్‌ల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ అభివాదం -
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
-
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్‌లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు.. స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్‌గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌లు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..
2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్‌గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ
క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్‌కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు. పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు. బర్మింగ్‌హామ్‌లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్‌లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది. మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు. బ్లూస్మార్ట్ ఆలోచన.. రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్‌లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్‌లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్ను లాస్ వెగాస్‌లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు. 2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్‌లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది. -
టెకీల కోసం ఓటు బాట
ఐటీ హబ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు ఐటీ ఉద్యోగులు ఓటు వేసేలా అవగాహన సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు పోలింగ్‌కు దూరంగా ఉంటారనే అపవాదును తొలగించే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి చేరువలో బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఓటింగ్ రోజున సెలవు వచ్చిది కదా అని ఎంజాయ్ చేసే టెకీలను పోలింగ్ కేంద్రం వైపు రప్పించేందుకు కార్పొరేట్ సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటోంది. రాజధానిలో ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీతోపాటు బహుళజాతి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేలా సంస్థలు ఉద్యోగులను ప్రేరేపిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ఎన్నికలపై వర్క్ ఫ్రం హోమ్ ప్రభావం ఆఫీసుల్లో కియోస్క్ లు ఇప్పటికీ పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అవలంబిస్తున్నాయి. ఈ విధానాలు ఐటీ హబ్ నియోజకవర్గాల్లో ఎన్ని కలపై కొంతమేర ప్రభావాన్ని చూపించవచ్చు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమేనని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ఉద్యోగులకు సహాయం చేయడానికి త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టనున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీ కారిడార్‌లోని వివిధ కార్యాలయాల్లో కియోస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ హబ్‌లో పెరిగిన ఓటర్లు.. ఐటీ కేంద్రాలైన మణికొండ, నానక్‌రాంగూడ, నార్సింగి, ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాలు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సంస్థలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ విజయతీరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో టెకీలను పోలింగ్ స్టేషన్లకు రప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. వారిని పోలింగ్ కేంద్రానికి రప్పించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ అంటే మినీ ఇండియా. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారిలో చాలామందికి స్వస్థలాల్లోనే ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఉద్యోగులు స్థానికంగా ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలూ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాయి. కనీసం మూడు నెలలపాటు ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాయి. ఆ తర్వాత బదిలీపై వెళితే ఓటును సంబంధిత నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఓటరు కార్డులో చిరునామాలను అప్‌గ్రేడ్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సాయం అందిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ‘లెట్స్ ఓట్’ అనే స్వచ్ఛంద సంస్థ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, విద్యా సంస్థలతోపాటు ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓటర్ హెల్ప్‌లైన్, సీవిజిల్ వంటి మొబైల్ యాప్‌లపై ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోయినా.. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఓ ప్రతినిధి చెప్పారు. మరోవైపు, ఎన్నికల సంఘం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, కమ్యూనిటీ సెంటర్లు, హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. -
కొంగొత్త ఆవిష్కరణలు..తక్కువ ఖర్చుతో సమస్యకు ఈజీగా చెక్!
భారత స్టార్టప్‌ల హబ్‌గా ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకుపోతుంది. ప్రభుత్వం సైతం వీటికి మంచి ప్రోత్సహం ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే సరికొత్త టెక్నాలజీతో కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకొస్తున్నాయి. అలాంటి కొంగొత్త ఆవిష్కరణలతో జఠిలమైన సమస్యలను చెక్ పెట్టిన హైదరాబాద్‌కి చెందిన మూడు కంపెనీలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 2023 సంవత్సరానికి ఇచ్చే ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఆ స్థార్టప్ కంపెనీలు కనుగొన్న ఆవిష్కరణలు, వాటి ప్రత్యేకత గురించే ఈ కథనం.! కామెర్లకు ఏఐ nLite 360తో చికిత్స అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో నవజాత శిశువుల్లో వచ్చే నియోనాటల్ కామెర్ల సమస్య మరీ ప్రముఖమైనది. దీని కారణంగా నిత్యం వేలాది చిన్నారులు అంగవైకల్యం బారిన పడటం లేదా మరణించడం జరుగుతోంది. దీనికి చెక్ పెట్లేలా ఐఐటీ హైదరాబాద్ ఆధారిత మెడ్‌టెక్ స్టార్టప్ హీమ్యాక్ ఏఐ సాంకేతికతో కూడిన ఫోటోథెరపీ పరికరం 'nLite 360'తో ముందుకు వచ్చింది. ఇది శిశువుల్లో వచ్చే కామెర్ల వ్యాధికి సమర్థవంతంగా చికిత్స అందించగలదు. ఇతర సాధారణ ఫోటోథెరపీ పరికరాల కంటే మెరుగ్గా తక్కువ సమయంలోనే నవజాత శిశువులకు చికిత్స అందించగలదు అని ఈ హీమాక్ సహ వ్యవస్థాపకురాలు అంకిత కొల్లోజు చెప్పారు. సాధారణంగా శిశువుల్లో కామెర్ల వ్యాధి రాగానే వైద్యులు బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెడతారు. ప్రతి నిమిషం ఆ బిడ్డను పర్యవేక్షించాలా ఓ నిపుణుడు ఉంటారు. కానీ ఈ సాంకేతికతో కూడిన పరికరానికి ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పరికరానికి నిర్ధిష్ట సెన్సార్లు ఉంటాయి. అలాగే చికిత్సకు ఎలాంటి ఆటంకం లేకుండా బిడ్డకు తల్లి పాలిచ్చేలా పోర్టబుల్ యూనిట్ ఉంటుంది. ఈ వైద్య పరికరం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా పోర్టబిలిటీ యాక్సిస్ ఉంది. సరైన విద్యుత్ సరఫరాల లేని కుగ్రామాల్లో సైతం సమర్థవంతంగా పనిచేసే విధంగా బ్యాటరీతో నడిచేలా డిజైన్ చేసిన వైద్య పరికరం. చేనేత కష్టాన్ని తీర్చే ఆవిష్కరణ భారతదేశంలో చేనేత రంగం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం. తరతరాలుగా వస్తున్న ఓ సంప్రదాయ కళ. సృజనాత్మక కళకు చెందిన జీవనోపాధి. ఈ వృత్తి చాలా శ్రమతో కూడిన పని. మగ్గం నేయాలంటే సుమారు 20 నుంచి 45 కిలోల బరువులు ఉండే మగ్గం యంత్రాల్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇక నెయ్యాలంటే దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల సార్లు తొక్కాలి. ముఖ్యంగా మనదేశంలో సుమారు 19 లక్షల మందికి పైగా మహిళలకు చేనేత వృత్తే ఆధారం. ఈ వృత్తి అత్యంత కష్టమైనది గాక దీని కారణంగా మోకాళ్లు నొప్పులు, వెన్నునొప్పి వంటి ఇతరత్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు చేనేత కార్మికులు. పలువురు ఈ వృత్తి కారణంగా కాళ్లు పోగొట్టుకున్నావారు ఉన్నారు. అంతేగాదు వికలాంగులు లేదా చేనేత కార్మికుడే ప్రమాదవశాత్తు వికలాంగుడైతే ఈ చేనేత వృత్తి కొనసాగించడం మరింత కష్టం. ఆ సమస్యను నివారించేలా శివకుమార్ మోదా స్థాపించిన మోదా టెక్నాలజీస్ ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. శివకుమార్ ఆయన బృందం చేనెత కార్మికుడి కష్టాన్ని తీర్చేలా మోధా పెడల్ ఆపరేటింగ్ మెషీన్‌ను తీసుకొచ్చింది. మగ్గాలకు ఎలాంటి మార్పులు చేయకుండా ఈ యంత్రాన్ని మగ్గానికి బిగిస్తే సరిపోతుంది. యంత్రానికి అమర్చిన మోటారు బరువులును ఎత్తక్కర్లేకుండా అదే ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. దానికుండే పెడల్ స్విచ్ నొక్కితే చాలు తొక్కాల్సిన పని ఉండదు. దీంతో చేనేత కార్మికుడి మోకాళ్లు, వీపుపై ఎలాంటి భారం పడదు. పైగా హయిగా ఈ వృత్తిని చేసుకోగలుగుతారు. ఈ మిషన్‌తో చేనేత పని ఈజీ అవ్వడమే గాక మన దేశ వారసత్వ వృత్తి కనుమరగవ్వకుండా కాపాడుకోగలుగుతాం. వికలాంగులకు ఈ మిషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుబాటు ధరలోనే ఈ మిషన్ లభించేలా వినూత్నంగా తీసుకొచ్చారు శివ కుమార్, అతడి బృందం. ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని గుర్తించే ఏఐ టూల్ లక్షలాది మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ దగ్గుకి, ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే వచ్చే దగ్గుకు తేడా ఉంటుంది. కేవలం దగ్గు ఆధారంగా ఊరితిత్తుల సమస్య గుర్తించడం ఎలా అన్న ఆలోచనే ఆ ఆవిష్కరణకు నాంది అయ్యింది. ఈ మేరకు సాల్సిట్ వ్యవస్థాపకుడు నారాయణరావు శ్రీపాద ఐదేళ్ల క్రితం ఎయిమ్స్‌లో ఒక ప్రొఫెసర్‌తో దీనిపై జరిపిన చర్చే ఈ ఆవిష్కరణకు మూలం. ఆయన వైద్య రంగంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్ధారించే పరికరాల అవసరాన్ని గ్రహించారు. అంతేగాదు ఆయన దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం అయినప్పుడూ ఆ దగ్గులో అంతర్తీనంగా ఉండే తేడాల బట్టి అది ఉబ్బసం, టీబీ, క్షయం లేక కోరింత దగ్గు అనేది గుర్తించేలా సాంకేతికతను ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనుకున్నారు. ఆ క్రమంలోనే శ్వాశ ఏఐ సాఫ్టేవేర్ టూల్ మన ముందుకు వచ్చింది. ఈ టూల్‌ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అభ్యర్థి దగ్గును పది సెకన్లలో రికార్డు చేసి దేని వల్ల దగ్గు వచ్చిందనేది విశ్లేషిస్తుంది. దీని అనుగుణంగా ప్రజలు తదుపరి టెస్ట్ చేయించుకుని సకాలంలో వైద్యం పొందొచ్చు. పైగా ల్యాబ్ టెస్ట్‌లు చేయించుకోవాలనే భయం తప్పుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఈ వైద్య పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ల్‌కు వెళ్లక్కర్లేకుండా ప్రజలే ఇంటి వద్దే సులభంగా చెక్ చేసుకోగలుగుతారు. దీని వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్‌లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్‌కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్‌లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్‌లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్‌పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్‌నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్‌పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్‌లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్‌లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్‌లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్‌ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
అప్పటిదాకా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం. 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది. ‘కొత్త కోపరేటివ్లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్‌లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. -
పని మధ్యలో ఆఫీసులో కునుకేస్తే! దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేస్తే హడావుడి. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని ఆఫీసుకు పరుగులు పెట్టాలి. ఉదయం 9–10 గంటల నుంచి సాయంత్రం 5–6 గంటల వరకు పనేపని. ఆఫీసు నుంచి బయల్దేరగానే సరుకులు తీసుకెళ్లడమో, మరేదైనా చోటికి వెళ్లడమో ఆలోచనలు. మొత్తంగా అన్నీ కలిసి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఆఫీసులో ఉదయం ఉత్సాహంగానే ఉన్నా.. మధ్యాహ్నం కల్లా నీరసం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే కాసేపు కునుకు తీసి, రీఫ్రెష్ అయ్యేందుకు కంపెనీలు వీలు కల్పిస్తున్నాయి. ‘షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్’ కరోనా మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో ఆఫీసు పని విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోంతో మొదలై హైబ్రిడ్ మోడల్ వరకు చేరాయి. ఇటీవలికాలంలో షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్ (స్వల్ప నిద్ర) విధానం మొదలైంది. ఆఫీసు పని సమయంలో మధ్యలో స్వల్ప విశ్రాంతి తీసుకునే వెసులుబాటును పలు సంస్థలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం కార్యాలయంలోనే నిద్ర పోయేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇలా విశ్రాంతి ఇవ్వటంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని, ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువగా.. సాధారణ ఆఫీసులలో లాగా స్టార్టప్ కంపెనీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అంటూ పనివేళలు ఉండవు. ఉదయం, సాయంత్రం మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలలో ఉద్యోగులకు పనిమధ్యలో కాసేపు విశ్రాంతి ఇస్తే.. అన్ని వేళల్లో ఒకేరకమైన ఏకాగ్రతతో పనిచేయగలుగుతారని నిపుణులు చెప్తున్నారు. ఫర్నిచర్ కంపెనీ వేక్‌ఫిట్ తాజాగా ‘రైట్ టు న్యాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రతి ఉద్యోగి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కునుకు తీయవచ్చు. నిద్ర ఒక్కటే కాదు.. ఆఫీసులో నిద్ర గదులేకాదు.. బ్రేక్ అవుట్ జోన్లు, మీటింగ్‌లు లేనిరోజు వంటి వినూత్న పని విధానాలను కూడా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా మధ్యలో కాసేపు వాకింగ్, ధ్యానం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లను కూడా అందిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు మీటింగ్‌లు లేని వారం, రోజు అని ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు జాబ్ తర్వాత వ్యక్తిగత పనుల షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకునే వీలు ఉంటుంది. ఏ కంపెనీలలో ఉందంటే.. లీసియస్, సింప్లీ లెర్న్, సాల్వ్, నో బ్రోకర్, వేక్‌ఫిట్, రేజర్‌పే వంటి యువ యాజమాన్య కంపెనీలు, స్టార్టప్స్ తమ ఉద్యోగులు ఆఫీసులో స్వల్ప సమయం పాటు కునుకుతీసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. నిపుణులు చెప్తున్న లాభాలివీ.. ►పని మధ్యలో విశ్రాంతి వల్ల ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ►పనిలో ఉత్పాదకత మరింతగా పెరుగుతుంది. ►దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ►మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయగలుగుతారు. ►చీటికి మాటికీ అనారోగ్య సమస్యలతో గైర్హాజరు కావటం తగ్గుతుంది. ►ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుండటంతో ఉద్యోగులకు యాజమాన్యంపై గౌరవం పెరుగుతుంది. వీ హబ్‌లో మదర్స్ రూమ్ పని మధ్యలో కొంత సమయం విశ్రాంతి అనేది మహిళా ఉద్యోగులకు అత్యవసరం. అందుకే వీ–హబ్‌లో మదర్స్ రూమ్, రిలాక్స్ రూమ్ వంటి ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు 24/7 భద్రత, అవసరమైన వసతులను కల్పించినప్పుడే వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. – దీప్తి రావుల, సీఈఓ, వీ–హబ్ కాసేపు నిద్ర మా పాలసీలో భాగం మా కంపెనీలో ఉద్యోగుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మధ్యాహ్నం అరగంట సేపు ఉద్యోగులకు నిద్ర సమయం అనేది పాలసీలో భాగం చేశాం. కాసేపు విశ్రాంతితో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిమీద ఏకాగ్రత చూపుతున్నారు. – ఉమానాథ్ నాయక్, హెచ్ఆర్ హెడ్, వేక్‌ఫిట్ -
స్టార్టప్ కంపెనీల్లో హీరో, హీరోయిన్స్ పెట్టుబడులు
-
స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..!
ఉద్యోగం వెదుక్కోవాలి...అనేది నిన్నటి మాట. స్టార్టప్‌కు బాట వేసుకోవాలి... అనేది నేటి మాట. తమ స్టార్టప్ కలలను సాకారం చేసుకోవడానికి యూత్ ‘స్టార్టప్ స్కూల్ ఇండియా’ వైపు చూస్తుంది... ఎంబీఏ చేస్తున్న అభినయ(గోరఖ్‌పూర్)కు విజేతల కథలు చదవడం అంటే ఇష్టం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న స్టార్టప్ స్టార్లు ఆమెకు స్ఫూర్తి. తనకూ స్టార్టప్ కలలు ఉన్నాయి. కాని అవి పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. ఎలా మొదలు కావాలి...అనే విషయం మీద అభినయకు అవగాహన లేదు. ఇది అభినయ పరిస్థితి మాత్రమే కాదు... దేశంలో ఉన్న ఎన్నో చిన్నపట్టణాల యువత పరిస్థితి...ఇలాంటి వారికి ఇప్పుడు ‘స్టార్టప్ స్కూలు’ రూపంలో ఒక దారి దొరకబోతోంది. గూగుల్ తాజాగా స్టార్టప్ స్కూల్ ఇండియా (ఎస్ఎస్ఐ) గురించి ప్రకటించింది. ‘స్టార్టప్’ అనగానే దేశంలో కొన్ని నగరాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ‘ఇక్కడ మాత్రమే స్టార్టప్‌లకు అనువైన వాతావరణం ఉంది’ అనే భావన ఉంది. మరి చిన్న పట్టణాల పరిస్థితి ఏమిటి? అక్కడ స్టార్టప్‌లకు అవకాశం లేదా? అనే ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంది’ అనే సమాధానం తన స్కూల్ ద్వారా ఇవ్వబోతోంది గూగుల్. దేశంలోని పది చిన్నపట్టణాల్లో, మూడు సంవత్సరాల కాలపరిధిలో, పదివేల మంది స్టూడెంట్స్‌ను స్టార్టప్ రూట్లోకి తీసుకురావాలనేది గూగుల్ స్టార్టప్ స్కూల్ లక్ష్యం. ఇన్వెస్టర్లు, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రోగ్రామర్స్‌ను ఒకే దగ్గరకు తీసుకువచ్చే వేదిక ఇది. ఎఫెక్టివ్ ప్రాడక్ట్ స్ట్రాటజీ, ప్రాడక్ట్ యూజర్ వాల్యూ, రోడ్ మ్యాపింగ్ అండ్ పిఆర్డి డెవలప్మెంట్... మొదలైనవి గూగుల్ కరికులమ్‌లో భాగం కానున్నాయి. వర్కింగ్ ఈవెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు సంబంధించినవి తొమ్మిదివారాల కార్యక్రమంలో ఉంటాయి. ‘ఎన్నో స్టార్టప్‌లతో పనిచేసిన అనుభవం గూగుల్‌కు ఉంది. ఇప్పుడు ఆ అనుభవాలు యూత్‌కు గొప్ప పాఠాలుగా మారుతాయి’ అంటున్నారు మమవర్త్ కో–ఫౌండర్ వరుణ్ అలఘ్. స్టార్టప్‌ల దిశగా యూత్‌ను తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గూగుల్‌కు ఇదే మొదటిసారి కాదు. 2016లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎంటర్ప్రెన్యుర్షిప్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. పదినగరాలలో నిర్వహించిన స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్ (ఎస్ఈసి)కు మంచి స్పందన వచ్చింది. టాప్ 3 విన్నర్స్‌ను సిలికాన్‌వ్యాలీకి తీసుకెళ్లి గూగుల్ లీడర్స్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఇక తాజా‘స్టార్టప్’ స్కూల్ విషయానికి వస్తే... ‘టెక్నాలజీ, ఫైనాన్స్, డిజైన్... మొదలైన రంగాలకు చెందిన మార్గదర్శకులతో ఒక విశాల వేదిక ఏర్పాటు చేయడానికి స్కూల్ ఉపకరిస్తుంది’ అంటున్నారు గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్. దేశంలో స్టార్టప్ కల్చర్ ఊపందుకోవడానికి అనువైన వాతావరణం ఉంది. అంతమాత్రాన ‘అన్నీ మంచి శకునములే’ అనుకోవడానికి లేదు. దాదాపు 90 శాతం స్టార్టప్‌లు అయిదుసంవత్సరాల లోపే తమ ప్రయాణాన్ని ఆపేస్తున్నాయి. లోపభూయిష్టమైన డిమాండ్ అసెస్మెంట్, రాంగ్ ఫీడ్‌బ్యాక్, నిర్వాహణలోపాలు... మొదలైన కారణాలు స్టార్టప్‌ల ఫెయిల్యూర్స్‌కు కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ స్టార్టప్ స్కూల్ పాఠాలు యువతరానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. ‘నా ఫ్రెండ్స్ కొందరు స్టార్టప్ మొదలు పెట్టి దెబ్బతిన్నారు. దీంతో నా స్టార్టప్ కలకు బ్రేక్ పడింది. అయితే ఒకరి పరాజయం అందరి పరాజయం కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి...అనేది తెలుసుకున్నాక నేనెందుకు నా ప్రయత్నం చేయకూడదు అనిపించింది. గూగుల్ స్టార్టప్ స్కూల్ నాలాంటి వారికి విలువైన మార్గదర్శనం చేయనుంది’ అంటుంది దిల్లీ–ఐఐటీ విద్యార్థి ఈషా. -
స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు. వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు. నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్డీఎస్వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఇండియన్ రైల్వేస్ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
Mann Ki Baat: మన స్టార్టప్‌లు సూపర్
న్యూఢిల్లీ: భారత స్టార్టప్ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వీటివల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు’’ అంటూ కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్‌లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్‌ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికార్న్ (రూ.7,500 కోట్ల కనీస టర్నోవర్ ఉన్న స్టార్టప్) కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీతో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమష్టి విలువ 330 బిలియన్ డాలర్ల కంటే కూడా ఎక్కువ! అంటే, రూ.25 లక్షల కోట్ల పై చిలుకు!! ప్రతి భారతీయునికీ గర్వకారణమిది’’ అన్నారు. ‘‘వీటిల్లో 44 యూనికార్న్‌లు గతేడాదే వచ్చాయంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికార్న్‌ల సగటు వార్సిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కవ. పైగా మన యూనికార్న్‌లు ఈ కామర్స్, ఫిన్ టెక్, ఎడ్ టెక్, బయో టెక్ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటార్లు విరివిగా అందుబాటులోకి రావడం మరో సానుకూల పరిణామం’’ అన్నారు. వెంబు శ్రీధర్, మదన్ పడాకీ, మీరా షెనాయ్ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు. మనసుంటే మార్గముంటుంది మన దేశం విభిన్న భాషలు, యాసలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో సుసంపన్నంగా అలరారుతోందని మోదీ అన్నారు. మన బలానికి, ఐక్యతకు ఈ వైవిధ్యమే మూలమని కొనియాడారు. ‘‘సాధించి తీరాలన్న మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షల్లో కన్నడ సబ్జెక్టులో 92 మార్కులు సాధించిన కల్పన అనే ఉత్తరాఖండ్ అమ్మాయే ఇందుకు ఉదాహరణ. ఆమెకు మూడో తరగతిలోనే టీబీ సోకింది. ఒక కంటి చూపు కూడా పోయింది. పైగా ఇటీవలి దాకా కన్నడ భాష గురించి అసలేమీ తెలియదు. అయినా మైసూరుకు చెందిన ప్రొఫెసర్ తారామూర్తి ప్రోత్సాహంతో మూడే నెలల్లో కన్నడపై పట్టు సాధించింది. రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించిన పశ్చిమబెంగాల్లోని పురులియాకు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్దీ ఇలాంటి స్ఫూర్తి గాథే. అలాగే తంజావూరు స్వయం సహాయక బృందం కళాకారులు నాకు పంపిన అమ్మవారి కళాకృతి ఓ వెలకట్టలేని బహుమానం. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’కు ఇవన్నీ ఉదాహరణలే’’ అన్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చార్ధామ్ యాత్రకు భక్తులు ఈసారి భారీగా పోటెత్తుతుండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని చెత్తాచెదారంతో నింపుతుండటం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యతన్నారు. సూర్యోదయాన్ని స్వాగతిస్తూ... ప్రపంచవ్యాప్త రిలే యోగా ప్రపంచ యోగా డేను ఈ జూన్ 21న ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘మానవాళి కోసం యోగా’ పేరిట దేశవ్యాప్తంగా 75 చోట్ల యోగా డే ఈవెంట్లు జరుగుతాయి. అలాగే గార్డియన్ రింగ్ పేరిట జూన్ 21న రోజు పొడవునా ప్రపంచమంతటా పలు దేశాల్లో సూర్యోదయాన్ని యోగా సాధనతో స్వాగతించనున్నాం. ఇది ఒకరకంగా రిలే యోగా ఈవెంట్‌గా సాగుతుంది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వీటిని చేపడతాయి’’ అని వివరించారు. ‘దేశం, జాతి తదితరాలతో సంబంధం లేకుండా యోగాతో ఎందరో శారీరక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. జపనీయుల్లో భారత్ పట్ల ఉన్న ప్రేమను ఇటీవల ఆ దేశంలో పర్యటన సందర్భంగా సన్నిహితంగా గమనించానని మోదీ చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత కళా దర్శకుడు హిరోషీ కొయిటే తొమ్మిదేళ్లుగా మహాభారత్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్టు, నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిసి ఎంతో సంతోషించా. మరో ఇద్దరు జపనీయులు రామాయణంపై జపనీస్‌లో యానిమేషన్ ఫిల్మ్ రూపొందించారు’’ అని వివరించారు. -
పని చేస్తూ.. కునుకు తీసినా ఓకే!
‘నిద్ర తన్నుకొస్తోంది.. కాసేపు కునుకు తీస్తా’ అని పనిచేసే చోట అంటే ఒప్పుకుంటారా..? ‘మీ సేవలు ఇక చాలు’ అనే సమాధానం వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండేదేమో! ఉద్యోగులు కొద్దిసేపు కునుకు తీసేందుకు అభ్యంతరం లేదంటున్నాయి స్టార్టప్ సంస్థలు. పరుపులు, మంచాలు తదితర హోమ్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ‘వేక్ ఫిట్’ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. ‘రైట్ టు న్యాప్’ విధానాన్ని ప్రకటించారు. లంచ్ తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం ఉద్యోగుల హక్కుగా మార్చేశారు. తద్వారా ఉద్యోగుల అవసరాలను గుర్తించే సంస్థగా వేక్ఫిట్ను మార్చేశారు. నైపుణ్య మానవ వనరులు కంపెనీల పురోగతికి ఎంతో అవసరం. స్టార్టప్ సంస్థలు ఈ సూక్ష్మాన్ని గుర్తించే పనిచేస్తుంటాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో వేక్‌ఫిట్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. పనిచేసే చోట సౌకర్యంగా ఉంటేనే.. కరోనా మహమ్మారి అనంతరం ఉద్యోగులు పనికి, ఇంటికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిచేసే చోట సౌకర్యాన్ని, సదుపాయాలకు వారు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎన్నో సర్వేలు ప్రకటించాయి. ఇదంతా డిజిటల్ ప్రపంచం. నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలకు కొరత లేదు. ఆకర్షించే ఆఫర్లతో వారు వేగంగా సంస్థలు మారిపోతున్నారు. అనుభవం కలిగి, నైపుణ్యాలున్నవారు అలా వెళ్లిపోతే.. కంపెనీల్లో కీలక పనులు పడకేస్తాయి. అందుకనే ఉద్యోగుల వలసలు (అట్రిషన్) తగ్గించేందుకు వారిని సంతోషపరిచే పలు నిర్ణయాలను వేక్‌ఫిట్, డ్రీమ్11, ద గుడ్ గ్లామ్ గ్రూపు, బీట్వో, జెప్టో తదితర స్టార్టప్‌లు తీసుకుంటున్నాయి. వేక్‌ఫిట్ తీసుకున్న రైట్ టు న్యాప్ పట్ల ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నిద్ర వరకే పరిమితం అనుకోవడానికి లేదు. పుట్టిన రోజు వేడుక కోసం సెలవు కోరినా ఈ కంపెనీలు అభ్యంతరం పెట్టవు. విహార యాత్రకు వెళ్లొస్తామన్నా.. పంపించి అయిన ఖర్చులను తిరిగి రీయింబర్స్ చేస్తున్నాయి. అంతేకాదు చాట్‌బాట్స్ సాయంతో సంస్థ అందిస్తున్న సేవలపై ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కార్పొరేట్ సంస్కృతిని మార్చేలా కొత్త సంస్థల విధానాలు ఉంటున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగుల్లో మారిన ధోరణి.. ఈ తరహా చర్యలు అదనపు ప్రభావాన్ని చూపిస్తాయని వేక్‌ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ తెలిపారు. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండడం.. తమకున్న నైపుణ్యాలకు కొత్త కొత్త అవకాశాలు పలుకరిస్తుండడం, అననుకూల పనివేళలు ఇవన్నీ కూడా ఉద్యోగులు సంస్థలు వీడేందుకు కారణమవుతున్నాయి. దీంతో ఈ పరిస్థితులను అధిగమిచేందుకు ఉద్యోగులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగుల సౌకర్యాన్ని చూస్తున్నాయి. ఉత్పాదకత పెరుగుతుంది..! మధ్యాహ్నం భోజనం తర్వాత 30 నిమిషాలు నిద్రించడం వల్ల రోజంతా తాజాగా ఉంటారని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పటి వరకు పడిన అలసట 20–30 నిమిషాల నిద్రతో పూర్తిగా తొలగిపోతుందట. ఉద్యోగులు లంచ్ తర్వాత కొద్ది సేపు అలా నడుము వాల్చేందుకు అనుమతిస్తే.. అది కంపెనీల ఉత్పాదకతను కూడా పెంచుతుందేమో చూడాలి. -
భారత్‌లోనే లిస్ట్ చేయండి..
న్యూఢిల్లీ: భారత్‌లోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని, దేశీయంగానే లిస్ట్ చేయాలని అంకుర సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. ఏదో కొంత అధిక మొత్తం నిధులు లభిస్తాయన్న ఆశతో ఇతర దేశాల బాట పట్టొద్దని హితవు పలికారు. ‘ఇది మీ దేశం. దీన్ని మీ మార్కెట్‌గా పరిగణించుకోండి. మీ సంస్థను నమోదు, ఏర్పాటు చేసుకోవడం మొదలుకుని లిస్టింగ్ చేయడం, పన్నులను కట్టడం వరకూ ఇక్కడే చేయాలని కోరుతున్నాను‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన అంతర్జాతీయ యూనికార్న్ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు సృష్టిస్తున్న మేథో సంపత్తిని పరిరక్షించాలని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు ఆయన సూచించారు. అలాగే స్టార్టప్ సంస్థలు స్వీయ నియంత్రణను కూడా పాటించాలని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు , నైతికతకు పెద్ద పీట వేయాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే యువ స్టార్టప్‌ల స్ఫూర్తి దెబ్బతింటుందని గోయల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లోకి పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులు భారీ స్థాయిలో తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఏకీకృత చెల్లింపుల విధానం యూపీఐని ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. యువ జనాభా ఆకాంక్షలతో ప్రస్తుతం చిన్న పట్టణాలు కూడా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. వృద్ధిలోకి వస్తున్న చిన్న వ్యాపారాలకు తోడైతే దేశీయంగా స్టార్టప్ వ్యవస్థలో మరెన్నో యూనికార్న్‌లను సృష్టించడంలో ఇవి కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు. -
తెలంగాణ.. సక్సెస్ఫుల్ స్టార్టప్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విజయవంతమైన స్టార్టప్‌లా పురోగమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ అద్భుత ప్రస్తానం సాగిస్తోందన్నారు. భారత్‌లో ఎగురుతున్న ఏకైక గెలుపుపతాకం తెలంగాణ మాత్రమేనన్నారు. దేశంలో జనాభా పరంగా 12వ స్థానం, భౌగోళికంగా 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. తలసారి ఆదాయం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్డీపీ)లో 130 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిం దని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మిలిపిటాస్‌లో ఇండియన్ కల్చరల్ సెంటర్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’, ‘తెలంగాణలో ఐటీ పెట్టుబడులు’ అనే అంశంపై ఐటీ సర్వ్ అలయెన్స్ బందం నిర్వహించిన వేర్వేరు సదస్సుల్లో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. దేశానికి అన్నపూర్ణ తెలంగాణ పారిశ్రామిక, వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింద ని కేటీఆర్ చెప్పారు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకు లు ఎదురైనా విద్య, వైద్యం, విద్యుత్, సాగునీరు, తాగునీటి రంగాల్లో ఏడేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలను వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా, ఏపీ వంటి రాష్ట్రాలను అధిగమించి దేశానికే అన్నపూర్ణగా రాష్ట్రం మా రిందన్నారు. ఆవిష్కరణలు, మౌళిక వసతులు, స మగ్రాభివృద్ధి అంశాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రా న్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. మరిన్ని పట్టణాల్లో ఐటీ టవర్లు రాష్ట్ర ప్రభుత్వ రూరల్ టెక్ పాలసీలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామని, దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని, మున్మందు మరిన్ని పట్టణాల్లో నిర్మిస్తామని చెప్పారు. విద్యాయజ్ఞంలో భాగంగా మూడేళ్లలో 26 వేల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రవాస భారతీయులు విరాళాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘మన ఊరు.. మన బడి’ ఎన్ఆర్ఐ పోర్టల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వర్చువల్‌గా కేటీఆర్ ప్రారంభించారు. సదస్సుల్లో భారత కాన్సు భహల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. వివిధ సంస్థల కేటీఆర్ ప్రతినిధులతో భేటీ కాలిఫోర్నియాలోని నెవార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే లూసిడ్ మోటార్స్ ప్రతినిధులతో శాన్‌జోస్‌లో మంత్రి కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. లూసిడ్ మోటార్స్ సీఈవో పీటర్ రాలిన్సన్, సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ జేమ్స్ హాకిన్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో లూసిడ్ మోటార్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ ప్రతిపాదించారు. సెమీకండక్టర్లు, ప్యానెల్స్, సోలార్ ఫొటో ఓల్టాయిక్ సెల్స్‌కు అవసరమైన మెటీరియల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ‘అప్లైడ్ మెటీరియల్స్’వైస్ ప్రెసిడెంట్ ఓమ్ నలమాసుతోనూ మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించడంతో పాటు అప్లైడ్ మెటీరియల్స్ పరిశోధన, అభివద్ధి కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించాలని కోరారు. -
దేశంలో జోరుగా స్టార్టప్ కల్చర్.. ప్రపంచంలోనే 3వ స్థానంలో!
దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ భారీగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ(గతంలో బెంగళూరు) భారత స్టార్ట్-అప్ రాజధానిగా మారింది. ఏప్రిల్ 2019 - డిసెంబర్ 2021 మధ్య కాలంలో బెంగళూరులో ఏర్పడిన 4,514 స్టార్టప్ కంపెనీలతో పోలిస్తే ఢిల్లీలో 5,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీలు వెలిసినట్లు నేడు పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22లో తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో(11,308) స్టార్ట్-అప్ కంపెనీలు ఉన్నాయి. జనవరి 10, 2022 నాటికి భారతదేశంలో 61,400కు పైగా స్టార్ట్-అప్ కంపెనీలను గుర్తించినట్లు ఈ నివేదిక తెలిపింది. 2021లో 44 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. దీంతో, అమెరికా & చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో యునికార్న్ సంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. 2021లో అమెరికాలో 487 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందితే, చైనాలో 301 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. జనవరి 14, 2022 నాటికి, భారతదేశంలోని మొత్తం 83 యునికార్న్ కంపెనీల సంపద విలువ 277.77 బిలియన్ డాలర్లు. ఈ స్టార్ట్-అప్ కంపెనీలలో చాలా వరకు కంపెనీలు సేవ రంగంలో ఉన్నాయి. అలాగే, దేశంలోని స్టార్ట్-అప్ కంపెనీలలో ఎక్కువ భాగం ఐటీ/నాలెడ్జ్ ఆధారిత రంగంలో ఉన్నాయి. 2016-17లో 733 స్టార్ట్-అప్ కంపెనీల నుంచి కొత్తగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2021-22 నాటికి 14,000కు చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా, అంతరిక్ష రంగంలో స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2019లో ఉన్న 11 నుంచి 2021 నాటికి 42కు పెరిగింది. ఇస్రో/డివోఎస్ ఎలాంటి స్టార్ట్-అప్ కంపెనీలను నమోదు చేయనందున, స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో స్పేస్ టెక్నాలజీ కేటగిరీ కింద సుమారు 75 స్టార్ట్-అప్ కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాయి. 2021లో 555 జిల్లాలు కనీసం ఒక కొత్త స్టార్ట్-అప్ కంపెనీ వెలిసింది. 2016-17లో 121 జిల్లాలో మాత్రమే ఒక స్టార్ట్-అప్ కంపెనీ స్థాపించబడింది. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!) -
విశాఖ నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు
సాక్షి, అమరావతి: నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖపట్నం వేదిక కానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) కేంద్రాలు విశాఖలో సిద్ధమయ్యాయి. స్టీల్ ప్లాంట్‌లో ఒకటి.. ఏయూలో మరొకటి దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖ స్టీల్‌లో కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు స్టీల్ ప్లాంట్ రూ.10 కోట్లు కేటాయించగా కేంద్రం రూ.30 కోట్లను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రీ–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను జనవరిలో కేంద్రమంత్రుల ద్వారా ప్రారంభించేలా ఎస్టీపీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ నెలకొల్పింది. ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్ మెషీన్స్, సోల్డరింగ్ స్టేషన్లు, హైఎండ్ ఆసిలోస్కోప్స్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. నాస్కామ్ ఏర్పాటు చేసిన సీవోఈని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి విశాఖపట్నంలో పలు భారీ పరిశ్రమలు ఉన్నందున నాలుగో తరం పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సీవోఈలు సిద్ధం కావడంతో స్టార్టప్ కంపెనీలు నగరానికి క్యూ కడతాయని ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమల్లో ఆటోమేషన్‌ను పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఈ రంగంలో కృషి చేస్తున్న అన్ని స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు విశాఖకు రానున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) అంచనా వేస్తోంది. విశాఖలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు నాస్కామ్ తెలిపింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి విద్య, వైద్యం, సంక్షేమ శాఖల్లో ఐవోటీ, ఏఐ టెక్నాలజీని వినియోగించే విధంగా నాస్కామ్ పలు అప్లికేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌తో కలసి డిజిటల్ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఐటీ హబ్‌గా విశాఖ... హైఎండ్ టెక్నాలజీ వినియోగంలో విశాఖను ఒక హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఎస్టీపీఐ, నాస్కామ్లతో పాటు పలు సంస్థలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటి ద్వారా నూతన టెక్నాలజీలో మరిన్ని ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుంది. - మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఏడాదిలో స్టార్టప్స్ రెట్టింపు కీలకమైన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు కావడం ద్వారా విశాఖ నగరం స్టార్టప్ హబ్‌గా మారనుంది. తెలంగాణలో టీ–హబ్ మాదిరిగా ఇండస్ట్రీ–4 సీవోఈకి భారీ డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వరకు స్టార్టప్‌లు ఉండగా ఏడాది వ్యవధిలో రెండు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. – శ్రీధర్, ప్రెసిడెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(ఐటాప్) -
క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా
న్యూఢిల్లీ: క్రిప్టోలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటూ ఒకవైపు ఆర్బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. నియంత్రణలపరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మరోవైపు క్రిప్టో మార్కెట్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. 2021లోనే ఇప్పటి వరకు 100 స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఏర్పాటయ్యాయంటే ఈ మార్కెట్ ధోరణులు ఎలా ఉందీ అర్థం చేసుకోవచ్చు. దేశంలో క్రిప్టో స్టార్టప్‌ల సంఖ్య 400కు చేరుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రిప్టోలకు సంబంధించి పలు రకాల సేవలను ఈ స్టార్టప్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి క్రిప్టో స్టార్టప్‌లు 380 వరకు ఉండగా.. నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) ఆధారిత స్టార్టప్‌లు మరో 12 వరకు ఉన్నాయని సమాచారం. ‘‘కొత్త కాయిన్ల ఏర్పాటుపై ఎన్నో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్ల కమ్యూనిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు ఈ ఏడాది మరింత బలోపేతమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 వరకు స్టార్టప్‌లు కొత్తగా ఏర్పాటు కాగా, 2020లోనూ 50–60 స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి’’ అని క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ‘యూనోకాయిన్’ సహ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్ తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వృద్ధి క్రిప్టోకరెన్సీలకు సంబంధించి చెల్లింపులను అంగీకరించరాదంటూ గతేడాది బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో క్రిప్టో లావాదేవీలు దేశీయంగా నిలిచిపోయాయి. కానీ, ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం క్రిప్టో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందేందుకు సాయపడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2020 పూర్తి సంవత్సరంతో పోలిస్తే.. 2021 మొదటి ఆరు నెలల్లోనే క్రిప్టో స్టార్టప్‌ల నిధుల సమీకరణ 73 శాతం పెరిగింది. బెంగళూరుకు చెందిన క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్, ముంబైకు చెందిన కాయిన్‌డీసీఎక్స్ ఇప్పటికే ‘యూనికార్న్’ స్థాయి విలువల(బిలియన్ డాలర్లు)కు చేరాయి. సగటు ఇన్వెస్టర్ క్రిప్టోల్లో చేసే పెట్టుబడులు ఏడాది క్రితం రూ.6,000–8,000 మధ్య ఉంటే, అది రూ.10,000కు పెరిగింది. రక్షణ కావాలి కానీ, నిషేధం కాదు.. ‘‘విధాన నిర్ణేతలు క్రిప్టోల విషయంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన నియంత్రణలు ప్రవేశపెట్టే ముందు.. క్రిప్టో ఎకోసిస్టమ్ వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నది పరిశ్రమ వర్గాల డిమాండ్‌గా ఉంది. ఫిన్‌టెక్ సంస్థ వాల్రస్ వ్యవస్థాపకుడు అయిన భగబాన్ బెహెరా సైతం ఈ విభాగంలో వృద్ధిని చూసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించడం గమనార్హం. సోషల్ క్రిప్టో ఎక్సేంజ్ డెఫీని ఏర్పాటు చేయాలని బెహెరాతోపాటు ఇతర వ్యవస్థాపకులు నిర్ణయించుకున్నారు. క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్లు తమ ప్రొఫైల్‌ను ఈ సోషల్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవడంతోపాటు, తమ పోర్ట్‌ఫోలియో వివరాలు, తమ ఆలోచనలను పంచుకునే వేదికగా దీన్ని మలచాలన్నది వ్యవస్థాపకుల ఆలోచనగా ఉంది. ‘‘భారత్‌లో క్రిప్టోల ఎన్ఎఫ్టీ విభాగం ఆరంభంలోనే ఉంది. సులభమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, అంతిమంగా క్రిప్టో మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో క్రెడిట్‌కార్డ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సిప్ ప్లాన్‌ను ప్రారంభించాలన్నది ఆలోచన’’ అని బెహెరా తెలిపారు. వృద్ధి అవకాశాలు.. ఎన్ఎఫ్టీల మార్కెట్ మన దేశంలో క్రమంగా బలపడుతోంది. ఎక్సేంజ్‌ల తరఫున అన్ని రకాల ఎన్ఎఫ్టీ స్టార్టప్‌లు.. క్రిప్టో ఎక్సేంజ్‌లు, ఏపీఐలు, టూల్స్, మౌలిక సదుపాయాల వృద్ధికి సంబం ధించి ఇప్పటికే దేశంలో ఏర్పాటయ్యాయి. ‘‘వినోదం, క్రీడలు, యుటిలిటీ ఆధారిత ఎన్ఎఫ్టీల పట్ల ప్రజల్లో మంచి ఉత్సాహం ఉంది. మార్కెట్లో ఎన్ఎఫ్టీలకు సంబంధించి ఫోమో (కోల్పోతామనే ధోరణి) వాతావరణం కూడా నెలకొని ఉంది. ఇది మరికొంత కాలం పాటు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎన్ఎఫ్టికల్లీ వ్యవస్థాపకుడు, సీఈవో తోషేంద్ర శర్మ తెలిపారు. తొందరపడొద్దు.. ప్రశాంతంగా ఉండండి: క్రిప్టో పరిశ్రమ న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం సూక్ష్మంగా వ్యవహరించాలని పరిశ్రమ కోరింది. ఇన్వెస్టర్లు తొందరపాటుతో ఓ ముగింపు నిర్ణయానికి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోలకు సంబంధించి ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలను ఈ బిల్లు నిషేధించనున్నట్టు సమాచారం వెలుగు చూడడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు మొగ్గు చూపించారు. ఫలితంగా కొన్ని క్రిప్టోలు బుధవారం నష్టపోయాయి. ఈ క్రమంలో క్రిప్టో ఎక్సేంజ్‌లు, పరిశ్రమకు చెందిన ఇతరులు స్పందించారు. ‘‘దేశంలో క్రిప్టోల వృద్ధి అవకాశాలపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన క్రిప్టో ఇన్వెస్టర్లు, క్రిప్టో స్టార్టప్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు ఉంటుందని భావిస్తున్నాం. నూతన బ్లాక్‌చైన్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా బిల్లు సౌకర్యవంతంగా ఉండాలి. కొత్త క్రిప్టో కరెన్సీ ఏదైనా కానీ, భారత ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అవ్వడానికి ముందు నిర్ధేశిత ప్రామాణిక విధానం అంటూ ఒకటి ఉండాలి. పన్నుల అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం’’ అని బైయూకాయిన్ సీఈవో శివమ్ తక్రాల్ పేర్కొన్నారు. అందరితో సంప్రదిస్తున్నాం.. ‘‘ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానంగా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు చేస్తున్నాం. కస్టమర్లకు రక్షణ ఉండాలి. ఆర్థిక స్థిరత్వం బలోపేతం కావాలి. క్రిప్టో టెక్నాలజీ విప్లవం నుంచి భారత్ ప్రయోజనం పొందాలన్న దానిపై విస్తృతమైన అంగీకారం వచ్చింది’’ అని కాయిన్‌స్విచ్ కుబేర్ సీఈవో ఆశిష్ సింఘాల్ తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రశాతంగా ఉండాలని సూచిం చారు. ‘‘తగినంత విశ్లేషణ, ఆలోచనతో కూడిన నియంత్రణ విధానం ఈ టెక్నాలజీని విస్తృతంగా మోదించడానికి దారితీస్తుంది’’ అని కాయిన్‌డీసీఎక్స్ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. క్రిప్టోలకు చట్టబద్ధత వద్దు 54 శాతం మంది అభిప్రాయమిదే న్యూఢిల్లీ: దేశంలో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని 54 శాతం మంది అభిప్రాయంతో ఉన్నారు. వీటిని విదేశాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులుగా పరిగణిస్తే చాలని చెప్పారు. డిజిటల్ కమ్యూనిటీ ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 342 జిల్లాల పరిధిలోని 56,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే కింద లోకల్ సర్కిల్స్ సేకరించింది. క్రిప్టో కరెన్సీలను చట్టపరంగా అనుమతించాలని 26 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 87 శాతం మంది భారతీయ కుటుంబాలు క్రిప్టోల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. క్రిప్టోల ప్రకటనల్లో రిస్క్‌ల గురించి స్పష్టంగా పేర్కొనడం లేదని 9,942 మంది చెప్పారు. క్రిప్టోల్లో మిగిలేవి కొన్నే: రాజన్ న్యూఢిల్లీ: క్రిప్టోల్లో చివరికి కొన్నే మిగిలి ఉంటాయని, మిగతవాన్నీ కనుమరుగైపోతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అభిప్రాయపడ్డారు. ‘‘చెల్లింపుల కోసం 6,000కుపైగా క్రిప్టో కరెన్సీలు మనకు నిజంగా అవసరమా? ఒకటి లేదా రెండు లేదంటే కొన్ని మాత్రమే చెల్లింపులకు వీలుగా మిగిలి ఉంటాయి. అది కూడా టెక్నాల జీ అత్యంత ఉపయోగకరంగా ఉంటే. కనుక భవిష్యత్తులో చాలా వరకు క్రిప్టోలు అధిక వ్యాల్యూమ్‌తో కొనసాగడం కష్టమే’’ అని ఒక టీవీ చానల్‌కు రాజన్ చెప్పారు. నియంత్రణలో లేని చిట్‌ఫండ్స్ మాదిరే క్రిప్టోలతోనూ నష్టపోయే సమస్య ఎదురవుతుందన్నారు. -
దూసుకెళ్తున్న దేశీయ స్టార్టప్ సంస్థలు
దేశీయ స్టార్టప్ సంస్థలు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకెళ్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు జనవరి-జూలై 2021 మధ్య కాలంలో దేశీయ స్టార్టప్ సంస్థలలో మొత్తం 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టారు. ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్(ఐవీసీఏ), వెంచర్ ఇంటెలిజెన్స్(వీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2019లో స్టార్టప్ సంస్థలు ఆకర్షించిన 11.1 బిలియన్ డాలర్లు, 2020లో ఆకర్షించిన 13 బిలియన్ డాలర్ల కంటే ఈ ఏడాదిలో చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఉడాన్, లెన్స్ కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఫామ్ ఈజీ, మీషో, పైన్ ల్యాబ్స్, జీటా, క్రెడ్, రేజర్ పే, హెల్తీఫైమీ, బైజుస్, అన్ అకాడమీ, ఎరుడిటస్, వేదాంతు, డుంజో, బిరా 91, బోట్, మామాఎర్త్, మైగ్లామ్, యూనిఫోర్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్, ఎంట్రోపిక్ వంటి సంస్థలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. "ఎఐ/ఎంఎల్, ఎడ్ టెక్, ఫుడ్ టెక్ సంస్థలలో ఈ సంవత్సరం చివరి అర్ధభాగంలో ఎక్కువ మొత్తం ఒప్పందాలు జరగనున్నట్లు" ఐవీసీఏ తెలిపింది. సగటు వెంచర్ క్యాపిటలిస్ట్ ఒప్పందం విలువ 2019-20తో పోలిస్తే 2021లో పెరిగినట్లు నివేదిక తెలిపింది.(చదవండి: ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట.. ఆ ఛార్జీలపై జీఎస్టీ ఉండదు) -
యూనికార్న్‌ల నిపుణుల వేట
బెంగళూరు: ఇన్వెస్టర్ల నుంచి పుష్కలంగా వస్తున్న నిధుల ఊతంతో యూనికార్న్‌లుగా (100 కోట్ల డాలర్ల వేల్యుయేషన్ గలవి) ఎదిగిన దేశీ స్టార్టప్ సంస్థలు ప్రస్తుతం కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం భారీగా నిపుణులను నియమించుకునే ప్రయత్నా ల్లో ఉన్నాయి. వివరాల్లోకి వెడితే.. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 23 స్టార్టప్ సంస్థలు యూనికార్న్ హోదాను దక్కించుకున్నాయి. వీటిల్లో దాదాపు పది పైగా కంపెనీలు తాము భారీగా సిబ్బందిని రిక్రూట్ చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపాయి. అప్‌గ్రాడ్, మొగ్లిక్స్, బ్రౌజర్‌స్టాక్, జెటా, ఎరుడైటస్, ఫార్మ్ఈజీ, భారత్‌పే, గప్‌షప్, మీషో, అర్బన్ కంపెనీ, డ్రూమ్, డిజిట్ ఇన్సూరెన్స్, కాయిన్‌డీసీఎక్స్, క్రెడ్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నా యి. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరణ, విభిన్న విభాగాల్లోకి ప్రవేశంతో స్టార్టప్‌లు సిబ్బందిని పెంచుకోవాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరుడైటస్లో వెయ్యి.. అప్‌గ్రాడ్‌లో 1,500.. ఇటీవలే యూనికార్న్ క్లబ్లో చేరిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ ఎరుడైటస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 1,000 మంది సిబ్బందిని తీసుకునే ప్రణాళికల్లో ఉంది. ఏటా తమ వ్యాపారం సుమారు 2.75 రెట్లు వృద్ధి చెందుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇన్స్ట్రక్షన్ డిజైన్, పాఠ్యాంశాల రూపకల్పన, మార్కెటింగ్, స్టూడెంట్ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక సిబ్బందిని నియమించుకోనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, ఎడ్టెక్ రంగానికే చెందిన అప్‌గ్రాడ్ కూడా తమ దేశ, విదేశ కార్యకలాపాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 మంది పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యకలాపాలు విస్తరిస్తుండటం, కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని సంస్థ వర్గాలు తెలిపాయి. క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపు సేవల సంస్థ క్రెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ సిబ్బంది సంఖ్యను 40% మేర పెంచుకోవాలని భావిస్తోంది. ఫార్మ్ఈజీ, భారత్‌పే, మీషో, అర్బన్ కంపెనీ, కాయిన్‌డీసీఎక్స్, డ్రూమ్ మొదలైన సంస్థలు సుమారు 1,000 మందిని నియమించు కోనున్నాయి. క్లౌడ్ వెబ్, మొబైల్ టెస్టింగ్ ప్లాట్‌ఫాం బ్రౌజర్‌స్టాక్ రాబోయే 18 నెలల్లో భారత్, అమెరికా, ఐర్లాండ్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోనుంది. గప్‌షప్ 300 మందిని రిక్రూట్ చేసుకోవడం ద్వారా తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. భారీ ప్యాకేజీలు... నిపుణులకు డిమాండ్ పెరిగే కొద్దీ వారి వేతన ప్యాకేజీలూ పెరుగుతున్నాయి. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ (ఎసాప్స్)తో పైస్థాయిలో రూ. 5 కోట్లకు మించి ప్యాకేజీలు ఉంటున్నాయి. మెసేజింగ్ ప్లాట్‌ఫాం గప్‌షప్ లాంటి సంస్థలు ఇచ్చే ప్యాకేజీలో జీతాలు, బోనస్‌లు, స్టాక్‌లు భాగంగా ఉంటున్నాయి. ఇటీవల నిధులు సమీకరించిన నేపథ్యంలో ఉద్యోగులు తమ షేర్లను కంపెనీకి తిరిగి విక్రయించే అవకాశం కల్పించినట్లు గప్‌షప్ వర్గాలు తెలిపాయి. తాము కూడా తరచూ ఎసాప్ బైబ్యాక్‌ల ద్వారా ఉద్యోగుల సంపద వృద్ధికి తోడ్పడుతున్నట్లు క్రెడ్ పేర్కొంది. ఇక డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాల విషయానికొస్తే .. ప్రోడక్ట్, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, కంటెంట్, డిజైన్, ఆపరేషన్స్ టీమ్ మొదలైన విభాగాల్లో నిపుణుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఫార్మ్ఈజీ తమ ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఆపరేషన్స్ విభాగాల్లో సీనియర్ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అటు భారత్‌పే తమ స్ట్రాటెజీ, అనలిటిక్స్, టెక్నాలజీ, ఉత్పత్తులు, కార్పొరేట్ సేవల బృందాలు మొదలైన విభాగాల్లో నియామకాలు చేపడుతోంది. అర్బన్ కంపెనీ ప్రధానంగా డిజైన్, రిసెర్చి సహా పలు విభాగాల్లో ఇంజినీర్లను తీసుకుంటోంది. -
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్‌కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్‌లను విజేతలుగా ఎంపిక చేసింది. వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్‌గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు. చదవండి: హైదరాబాద్ వినియోగదారుల ఫోరంలో ఎస్బీఐకి దెబ్బ -
వారికోసం సరికొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో జత కట్టనుంది. గూగుల్ క్లౌడ్, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపార సంస్థల కోసం, ప్రారంభ దశలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఏకీకృత ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలు రూ. 999 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్ ఆన్ సేవలను కూడా పొందవచ్చును. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అందిపుచ్చుకోవడానికి ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్లు ‘వన్ ప్లాన్, వన్ బిల్’తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తోందని వెల్లడించారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ సేవలు... ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు, టెక్ స్టార్టప్ కంపెనీలకు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాలింగ్‌తో పాటు 1జీబీపీఎస్ వరకు అధిక వేగంతో ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇవ్వనుంది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా గూగుల్ వర్క్‌స్పేస్ లైసెన్స్‌ను, డీఎన్ఎస్ సెక్యూరిటీ బై సిస్కో, ఫ్రీ ప్యారలల్ రింగింగ్ సర్వీసులను ఎయిర్టెల్ అందిస్తోంది. హానికరమైన, అవాంఛిత డొమైన్లు, వైరస్లు, సైబర్‌దాడుల నుంచి ఆయా వ్యాపార సంస్థలకు భద్రతను సిస్కో, కాస్పర్‌స్కై అందించనున్నాయి. ఎయిర్ తన కస్టమర్ల భద్రత కోసం కొద్ది రోజుల క్రితమే కాస్పర్స్కైతో చేతులను కలిపింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ హెచ్డీ నాణ్యతతో అపరిమిత, సురక్షితమైన కాన్ఫరెన్సింగ్ వీడియో కాలింగ్ కోసం ఉచితంగా ఎయిర్టెల్ బ్లూజీన్స్ లైసెన్స్‌ను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. -
మహిళా స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు స్థాపించిన స్టార్టప్‌లను వర్గీకరిస్తూ మంగళవారం ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన స్టార్టప్‌లలో మహిళల వాటా 33% ఉంటే, ఇకపై వాటిని మహిళా స్టార్టప్‌లుగా.. స్టార్టప్‌లలో వారివాటా 20% ఉంటే మహిళా ఎంటర్ ప్రెన్యూ ర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో సాంకేతికత లోపం, సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసరించటం, ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత వంటివి వారి ఎదుగదలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐటీశాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయి ఆవిష్కరణల్లో ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు గ్రాంటుగా అందజేస్తుంది. కాగా, ప్రభుత్వం 2017లో ప్రకటించిన ఎస్జీఎస్టీ, పేటెంట్ ధర, ఇంట ర్నేషనల్ మార్కెట్, రిక్రూట్మెంట్ అసెస్మెంట్, పనితీరు ఆధారిత గ్రాంటు తదితర విషయాల్లో గతంలో ప్రకటించిన మార్గదర్శకాల్లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది. -
దూసుకుపోతున్న షేర్‌చాట్, ఇతర స్టార్టప్ కంపెనీలు
ముంబై: భారత్‌లో స్టార్టప్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ క్లబ్‌లోకి చేరగా, ఈ సారి 2021 మొదటి నాలుగు నెలల్లో మరో ఐదు స్టార్టప్ కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. మీషో, గ్రోవ్, షేర్‌చాట్, ఏపీఐ హోల్డింగ్స్, గప్‌షుప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా అవతారమెత్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీల వాల్యూ సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు చేరింది. భారత్‌లో కామర్స్ రంగంలో దూసుకుపోతున్న మీషో కంపెనీ ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ నుంచి సుమారు 300 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సేకరించడంతో కంపెనీ వాల్యూ 2.1 మిలియన్ డాలర్లకు చేరింది. 2017లో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం గ్రోవ్ కంపెనీ టైగర్ గ్లోబల్ నుంచి సుమారు 83 మిలియన్ డాలర్లును సేకరించడంతో కంపెనీ వాల్యూ బుధవారం రోజున ఒక బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌లో 2017లో ప్రారంభమైన గ్రోవ్ 1.5 కోట్లకు పైగా నమోదైన వినియోగదారులతో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. గ్రోవ్‌లో వినియోగదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటిఎఫ్‌లు, ఐపిఓలు, బంగారంలో సరళమైన, ఏలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ ఈజీ ఏపీఐ హోల్డింగ్ వ్యవస్థాపకుడు బుధవారం యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించమని తెలిపారు. ప్రోసస్ వెంచర్స్, టీపీజీ గ్రోత్ నుంచి సుమారు 350 మిలియన్ డాలర్లను సమీకరించిన తరువాత స్టార్టప్ వాల్యూ 1.5 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. మరో మేసేజింగ్ కంపెనీ గప్‌షుప్ గురువారం టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడంతో, కంపెనీ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. చదవండి: SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు -
వ్యాపారాలకు జోరుగా రుణాలివ్వాలి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా రికవరీ బాట పట్టించే దిశగా వ్యాపార సంస్థలకు మరింతగా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే, ఫిన్‌టెక్, స్టార్టప్ సంస్థలకు అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం అయినప్పటికీ.. బడుగు వర్గాలకు తోడ్పాటు అందించడం కోసం బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగడం అవసరమని మోదీ చెప్పారు. ఆర్థిక సేవలకు సంబంధించి బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. కోవిడ్–19 కష్టకాలంలో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలతో 90 లక్షల పైగా ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు లభించాయని ఆయన చెప్పారు. ‘ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లను ఆదుకోవడం, వాటికి రుణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. వ్యవసాయం, బొగ్గు, అంతరిక్షం తదితర రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇక గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, స్వావలంబన భారత లక్ష్యాన్ని సాధించడంలో వారిని కూడా భాగస్వాములను చేసేందుకు తగు విధమైన తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఆర్థిక రంగంపైనే ఉంది‘ అని ప్రధాని తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో రుణ లభ్యత కూడా కీలకంగా మారుతోంది. కొత్త రంగాలు, కొత్తగా వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణ సదుపాయాన్ని ఎలా అందించాలన్న దానిపై ఆర్థిక సంస్థలు దృష్టి పెట్టాలి. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థల కోసం కొత్తగా, మెరుగైన ఆర్థిక సాధనాల రూపకల్పనపై కసరత్తు చేయాలి‘ అని సూచించారు. చిన్న రైతులకు కిసాన్ క్రెడిట్ తోడ్పాటు.. చిన్న రైతులు, పాడి రైతులు మొదలైన వారు అసంఘటిత వడ్డీ వ్యాపారుల చెర నుంచి బైటపడటానికి కిసాన్ క్రెడిట్ ఎంతగానో తోడ్పడిందని మోదీ చెప్పారు. ఇలాంటి వర్గాల వారి కోసం వినూత్నమైన ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రైవేట్ రంగం పరిశీలించాలని సూచించారు. ఆర్థిక సేవల రంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, దీన్ని మరింత పటిష్టంగా.. క్రియాశీలకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. -
విలువైన సంస్థలను సృష్టించాలి
న్యూఢిల్లీ: వేల్యుయేషన్లు, నిష్క్రమించే వ్యూహాలే లక్ష్యంగా పనిచేయకుండా .. శతాబ్దాల పాటు మనుగడ సాగించే సంస్థలను సృష్టించడంపై దృష్టి పెట్టాలని స్టార్టప్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పగలిగే ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించాలని పేర్కొన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశీ మార్కెట్‌ను సంస్థలు ఎంతో విలువైన ఆస్తిగా పరిగణించాలని ప్రధాని అభివర్ణించారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వ హించిన టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం 29వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించే విధంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపైనా ఐటీ కంపెనీలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొత్త ఐడియాలకు దేశంలో కొదవ లేదని, కానీ అవి వాస్తవ రూపం దాల్చేలా సరైన మార్గంలో నడిపించే దిశా నిర్దేశకులు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు సాధిస్తాం.. ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే దిశగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు లక్ష్యాలు సాధించడంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని ప్రధాని తెలిపారు. అదే సమయంలో విస్తృతమైన నెట్వర్క్ ఊతంతో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఐటీ పరిశ్రమ కృషి చేయాలని చెప్పారు. కరోనా వైరస్ కష్టకాలంలోనూ దేశీ ఐటీ రంగం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన కితాబిచ్చారు. నిబంధనలపరమైన అడ్డంకుల కారణంగా గతంలో భారతీయ ఐటీ పరిశ్రమ .. అనేక అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ప్రధాని చెప్పారు. దీనివల్ల డిజిటల్ అంతరాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. కనిష్ట స్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో గరిష్టంగా పాలనను అందించడంలో సాంకేతిక ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దూసుకెళ్తున్న భారత్ .. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు దూసుకెడుతోందని.. సరిహద్దుల్లోని పరిణామాలు, జియోస్పేషియల్ డేటా నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రిస్కులు తీసుకోగలగాలి: ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ నూతన ఆవిష్కరణలకు అంతర్జాతీయ హబ్‌గా భారత్ ఎదగాలంటే విధానాలు, రిస్కు తీసుకునే సామర్థ్యాలు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ అభిప్రాయపడ్డారు. మూడు ఐడియాలొస్తే ఒక్కటి మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని, నవకల్పనల ఆవిష్కరణల్లో ఇలాంటి రిస్కులు తప్పవని నాస్కామ్ సదస్సులో ఆయన పేర్కొన్నారు. డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు, విధానాలు ఇటు దేశ ఎకానమీకి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు అటు సర్వీసులు, సాఫ్ట్వేర్ ఎగుమతుల వృద్ధికి కూడా అనువైనవిగా ఉండాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్ద రిస్కని ఆయన చెప్పారు. -
పేటీఎమ్: వరుసగా ఏడో ఏటా నష్టాలే
ముంబై, సాక్షి: దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎమ్ వరుసగా ఏడో ఏడాదిలోనూ నష్టాలు నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 2,833 కోట్ల నష్టం నమోదైంది. వెరసి పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 వరుసగా ఏడో ఏడాదీ నష్టాలను సాధించినట్లయ్యింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలు 28 శాతం తగ్గాయి. అంతేకాకుండా వ్యయాలను సైతం 20 శాతం తగ్గించుకుంది. దీంతో ఇవి రూ. 5,861 కోట్లకు చేరాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం గతేడాది పేటీఎమ్ రూ. 3,350 కోట్ల ఆదాయం సాధించింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1 శాతం తక్కువ. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) 2022కల్లా వచ్చే ఏడాది(2021-22)కల్లా నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాలని వన్97 లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాటలో పలు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌లలోకి అడుగుపెట్టింది. రుణాలు, బీమా, వెల్త్ మేనేజ్మెంట్, కామర్స్ తదితర విభాగాలలోకి కార్యకలాపాలు విస్తరించింది. కాగా.. యూనిఫైడ్ పేమెంట్ విభాగంలో ఈవ్యాలెట్ బిజినెస్‌కు పోటీ తీవ్రమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పే, మొబిక్విక్, భారత్ పే,అమెజాన్ పే తదితరాలు ఈవ్యాలెట్ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. (స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?) 1.7 కోట్ల మర్చంట్స్ పేటీఎమ్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్ల చిన్నతరహా బిజినెస్‌లు లిస్టయ్యాయి. ఈ కంపెనీలు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా సూక్ష్మ స్థాయి చెల్లింపులను సాధిస్తున్నాయి. తద్వారా చిన్సస్థాయి డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నట్లు టోఫ్లర్ పేర్కొంది. కంపెనీ ఇటీవల బిజినస్ యాప్, సౌండ్‌బాక్స్, బిజినెస్ కాటా తదితర మర్చంట్ మేనేజ్మెంట్ సర్వీసులను ప్రారంభించింది. -
2020: గూగుల్ పే, ఫోన్ పే టాప్ వ్యాలెట్స్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యస్‌బ్యాంకు, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ బ్యాంకు 2020 సంవత్సరానికి అగ్రగామి 10 బ్యాంకుల్లో స్థానం సంపాదించుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, డూచే బ్యాంకు, ఐడీబీఐ టాప్ 10లో వరుసగా ఉన్నాయి. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్‌పే టాప్–2 వ్యాలెట్లుగా నిలిచినట్టు.. విజికీ విడుదల చేసిన ‘ది బీఎఫ్ఎస్ఐ మూవర్స్ అండ్ షేకర్స్ 2020’ నివేదిక ప్రకటించింది. బ్యాంకులు, వ్యాలెట్లు, యూపీఐ, ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల వేగవంతమైన పురోగతి గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తదనంతర పరిణామాలతో బీమాకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది యూపీఐ, వ్యాలెట్లు బాగా వినియోగంలోకి వచ్చాయని, కస్టమర్లకు ఇవి చేరువ కావడానికి నూతన అవకాశాలు వాటికి అందుబాటులోకి వచ్చాయని వివరించింది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందినట్టు పేర్కొంది. ఇక యోనో నంబర్ 1గా నిలవగా, నియో, కోటక్ 811 యాప్‌లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘‘ఎన్బీఎఫ్సీలు ఈ ఏడాది ఎంతో కీలకపాత్ర పోషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) నిధుల అవసరాలకు ప్రధాన వనరుగా మారాయి. కరోనా కాలంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు మరింతగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ విభాగంలో ఎక్స్పోజర్ పెంచుకున్నాయి’’ అని ఈ నివేదిక వివరించింది. -
వయసులో చిన్న.. వ్యాపారంలో మిన్న..!
న్యూఢిల్లీ: చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదాసీదా ఉద్యోగంతో తృప్తిచెందక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతృప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జీరోధా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండిల్ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. ఇంటర్నెట్ వేదికగా విస్తరణ 40 ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హరూన్ ఇండియా సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 ఆఫ్ ఎంటర్ ప్రెన్యుర్స్ అండర్ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్ వర్త్ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్ వేదికగా స్టార్టప్ పెట్టి జాక్ పాట్ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో తొలి 2 స్థానాల్లో ఉన్న జీరోధా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58% పెంచుకున్నారు. జాబితాలో 9వ స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్ అగర్వాల్ సంపద ఈ ఏడాది 40% పడింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం దీనికి కారణం. వీయూ టెక్నాలజీస్ (వూ బ్రాండ్) దేవిత సరాఫ్ సంపద కూడా 33% తగ్గింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత. ‘‘కొందరు స్టార్టప్‌ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా వైదొలగి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు దన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల వృద్ధిపై ఎంతో ప్రభావం చూపింది’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. -
కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు
సాక్షి, హైదరరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పల్లెలకు ఇంటర్నెట్.. విప్లవాత్మక మార్పులు పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు) వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్ ) తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
అమెరికన్ స్టార్టప్ నుంచి.. ఉద్యోగాలు
అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ క్లమియో ఇండియాలో తన సెంటర్‌ను ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. క్లమియో కంపెనీ బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్లో సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్(ఎస్ఏఏఎస్) ఆధారిత డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఇండియాలో ఇప్పటికే ఈ కంపెనీలో 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు క్లమియో వెల్లడించింది. కాగా 2017లో పూజన్ కుమార్, కౌస్తభ్ పాటిల్, ఊన్ జంగ్ అనే ముగ్గురు కలిసి క్యాలిఫోర్నియాలోని శాంటాక్లారా లో క్లమియో స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురు కలిసి సుమారు రూ.1,400 కోట్ల నిధులను సమీకరించారు. క్లౌడ్ ఆధారిత పలు ఏడబ్ల్యూఎస్ సర్వీసుల్ని అందిస్తుంది. ప్రస్తుతమేగాక భవిష్యత్తులోనూ బ్యాక్అప్ అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. మా కంపెనీ గ్లోబల్ టీమ్‌కు సాహయకారిగానేగాక ఫ్రంట్ ఎండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఓరియెంటేషన్‌లో క్లౌడ్ సొల్యూషన్స్‌ను అందిస్తుందని తెలిపింది. దీనిలో ఇంజినీరింగ్ టీమ్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఇండియాలో చాలామంది టెక్నాలజీ నైపుణ్యం కలిగి వారు ఉన్నారని క్లుమియో జీఎం అండ్ ఇంజనీరింగ్ వీపీ సందీప్సోని అన్నారు. ఇక్కడ ల్యాండ్‌లైన్ కమ్యూనికేషన్స్ నుంచి సెల్ఫోన్ల విప్లవం ఎలా వచ్చిందో అదేవిధంగా తరువాతి తరం తమ నైపుణ్యంతో సాఫ్ట్‌వేర్‌ను విస్తృతంగా అభివృద్ధి చేస్తుందని సందీప్ ఒక ప్రకటనలో అన్నారు. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో కొత్త నియమకాలు చేపట్టనుంది. -
ముందుంది మరింత గడ్డుకాలం!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ఉద్దేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వ్యాపారాలు కుదేలవుతున్నాయి. స్టార్టప్ సంస్థలు మరింతగా విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని స్టార్టప్‌లకు యాక్సెల్, కలారి, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, సెకోయా వంటి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు సూచించాయి. కష్టకాలంలో ఉద్యోగాలకు కోత పెట్టకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని పేర్కొన్నాయి. జీతాలు వాయిదా లేదా తగ్గించడం వంటివి పరిశీలించాలని సూచించాయి. వీసీలు ఈ మేరకు స్టార్టప్‌లకు బహిరంగ లేఖ రాశాయి. వచ్చే 21–30 రోజుల్లో అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రణాళికల అమలుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వచ్చే ఏడాది–ఏడాదిన్నర కాలానికి ఎలా ప్రణాళిలు వేసుకోవాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు కుదేలవడంతో వ్యయాలను తగ్గించుకునేందుకు, గడ్డుకాలం గట్టెక్కేందుకు పలు స్టార్టప్ సంస్థలు, డిజిటల్ వ్యాపార సంస్థలు.. సిబ్బందిని తొలగిస్తుండటం, జీతాల్లో కోత పెడుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో తాజాగా వీసీల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వేచి చూసే ధోరణి వద్దు .. ‘భారత్‌లో తొలి దశ ఇన్వెస్టర్లుగా .. మేమంతా దేశీ స్టార్టప్ వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. మేం ఇన్వెస్ట్ చేసిన సంస్థల వ్యవస్థాపకులు, టీమ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి వారంతా బైటపడాలని కోరుకుంటున్నాము‘ అని లేఖలో వీసీ సంస్థలు పేర్కొన్నాయి. నిధుల సమీకరణ, ఉద్యోగుల నిర్వహణ, వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికలు మొదలుకుని ఇన్వెస్టర్లు, వివిధ వాటాదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి ఇందులో పలు సలహాలు, సూచనలు చేశాయి. స్థూలంగా దేశంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోగలగడం స్టార్టప్‌లకు చాలా కీలకమని పేర్కొన్నాయి. ‘అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఒకవేళ పరిస్థితి వేగంగా మెరుగుపడిన పక్షంలో దానికి తగ్గట్లుగా సర్దుకుపోవడానికి కూడా సంసిద్ధత ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత వస్తుందనే ఆశతో.. వేచి చూద్దాం, స్పష్టత వచ్చాకే ఏదో ఒక చర్య తీసుకుందాంలే అనే ధోరణి సరికాదు‘ అని వెంచర్ క్యాపిటల్ సంస్థలు సూచించాయి. ఉద్యోగులు ముఖ్యం... ఈ సందర్భంగా ఏయే అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నదీ వీసీలు వివరించాయి. ‘ముందు ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే వ్యాపారాల కొనసాగింపు, లిక్విడిటీ ఉండాలి ‘ అని పేర్కొన్నాయి. మిగతా వ్యయాలన్నింటినీ సమీక్షించుకుని, తగ్గించుకున్న తర్వాతే సిబ్బంది వ్యయాలపై దృష్టి పెట్టాలన్నాయి. సిబ్బంది తొలగింపు, జీతాల తగ్గింపు వంటి అంశాల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలని సూచించాయి. ఒకవేళ ఉద్యోగులపరమై వ్యయాలను తగ్గించుకోవాల్సి వస్తే.. రిక్రూట్‌మెంట్‌ను తాత్కాలికంగా ఆపడం, జీతాలు వాయిదా వేయడం.. తగ్గించడం, విధుల్లో మార్పుచేర్పులు చేయడం, ప్రమోషన్లు వంటి మదింపు విధానాలను సవరించుకోవడం వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించాలని తెలిపాయి. -
హైదరాబాద్‌లో బయో ఆసియా
సాక్షి, హైదరాబాద్: దశాబ్దకాలంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న పెట్టుబడులు, ఇతర అవకాశాల కోసం ప్రపంచ స్థాయిలో పేరొందిన లైఫ్ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ‘బయో ఆసియా’కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల పాటు జరిగే 17వ బయో ఆసియా సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌కు రావడంలో బయో ఆసియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బయో ఆసియా దోహదపడుతుందని వివరించారు. బయో ఆసియా సదస్సు తర్వాత హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో స్థానిక సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిచయం చేశామని చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీనియర్ ప్రతినిధులు, పరిశోధకులు హాజరవుతారని తెలిపారు. టుడే ఫర్ టుమారో.. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే బయో ఆసియా సదస్సును హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు. ‘టుడే ఫర్ టుమారో’అనే నినాదంతో జరిగే ఈ సదస్సులో ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, పెట్టుబడులకు అనువైన విధానాలు రూపొందించడంపై చర్చిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి 37 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వాములవుతారు. 17వ బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో పాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంపై సదస్సులో చర్చించనున్నారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లకు చవకైన పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారిస్తుంది. లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిపైనా చర్చించనున్నారు. ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అనేక దేశాల నుంచి ఎంపిక చేసిన 75 స్టార్టప్ కంపెనీలు 175 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. -
బైక్ చాల్లే... క్యాబ్ ఎందుకు?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోడ బోడ, హబల్ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్ షేరింగ్! ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్ షేరింగ్ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్ షేరింగ్ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్ షేరింగ్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్ సర్వీస్ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్ బెంగాల్ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్ బైక్ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్ మోటో, రాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్ట్రిప్, వోగో, టాజో, రోడ్పండా, ఆన్బైక్స్, పీఎస్బ్రదర్స్, రాయల్ బ్రదర్స్, వీల్‌స్ట్రీట్ వంటివి ఈ రంగంలో ఉన్నాయి. ఎలా పనిచేస్తాయంటే...? బైక్ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్‌ను తన షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్‌ను తీసుకోవచ్చు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. కస్టమర్ బైక్‌ను బుక్ చేయగానే.. డ్రైవర్ ఎవరు? అతని ప్రొఫైల్? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ? వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కస్టమర్‌కు కూడా ఒక హెల్మెట్‌ను తెస్తాడు. కస్టమర్‌ను గమ్య స్థానంలో డ్రాప్ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్ బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్ టైమ్ రైడ్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, బైక్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి బైక్ షేరింగ్‌లో ఉంటాయి. మహిళల కోసం ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ కంపెనీ కంట్రోల్‌తో అనుసంధానమై ట్రాకింగ్ చేస్తుంటుంది. ఎందుకింత డిమాండ్? ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్‌లిస్ట్ అవుతున్నారు. దీంతో వీకెండ్స్‌లో, రద్దీ సమయంలో క్యాబ్స్ దొరకటం లేదు. ఇది బైక్ షేరింగ్ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంకా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్‌తో పోల్చితే బైక్‌పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో ఎంట్రీ.. ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్ షేరింగ్ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్ షేరింగ్‌ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగటం కూడా బైక్ షేరింగ్ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్ వంటి స్టార్టప్స్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను వినియోగిస్తున్నాయి. సవాళ్లూ ఉన్నాయ్.. ప్రస్తుతం బైక్ షేరింగ్ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్‌లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్ షేరింగ్ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్ షేరింగ్‌కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్ బైక్ ట్యాక్సీకి లైసెన్స్ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు బైక్ షేరింగ్‌ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి.. హైదరాబాద్‌లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్ షేరింగ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్‌లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్ ఉన్నట్లు సమాచారం. బైక్ షేరింగ్‌లో మహిళలూ యాక్టివే.. గడిచిన ఏడాదిగా బైక్ షేరింగ్ డ్రైవర్స్‌గా మహిళలు కూడా నమోదవుతున్నారు. ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్‌ను ఇతరులకు షేర్ చేస్తూ హెల్ప్ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్‌కు మహిళా కస్టమర్‌నే ఇస్తారు. రైడర్ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్ టైం డ్రైవర్ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్ తీసుకుంటా. తర్వాత యాప్ ఆఫ్ చేసి వర్క్‌లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్‌గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు. -
అనుకోకుండా.. ఇన్వెస్ట్ చేశా!
ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెదవి విప్పారు. అనుకోకుండానే తాను స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ‘నేను కొంత అనుకోకుండానే స్టార్టప్ ఇన్వెస్టరుగా మారానని చెప్పవచ్చు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్ సంస్థలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. వాటిని కాస్త అంటరానివిగానే చూసేవాణ్ని. ఎందుకంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట టాటా గ్రూప్‌నకు ప్రయోజనాల వైరుధ్యం ఉండేది. కానీ నేను రిటైరయిన తర్వాత స్వేచ్ఛ లభించడం వల్ల ఆసక్తికరంగా అనిపించిన సంస్థల్లో నా సొంత డబ్బును కాస్త కాస్తగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. అలా అంతకు ముందుతో పోలిస్తే నేను మరికాస్త ఎక్కువ రిస్కులు తీసుకున్నాను. మరో విషయం.. పెట్టుబడులు పెడుతున్నా కదా అని నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని అనుకోవద్దు‘ అని రతన్ టాటా చెప్పుకొచ్చారు. స్టార్టప్స్ ప్రమోటర్లలో కసి, వినూత్న ఐడియాలు, అవి అందించే పరిష్కారమార్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్ చేస్తానని రతన్ టాటా చెప్పారు. ఓలా, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, క్యూర్‌ఫిట్, కార్దేఖో, అర్బన్‌ల్యాడర్, లెన్స్‌కార్ట్ వంటి స్టార్టప్స్‌లో రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. -
సెబీ ‘స్మార్ట్’ నిర్ణయాలు
ముంబై: స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది. రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్ ఏజెన్సీలకు లిస్టెడ్ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్ పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలు.. ► ఎఫ్‌పీఐల నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబం ధనలు మరింత సరళతరమయ్యాయి. ► స్మార్ట్ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో నమోదైన సంస్థలు మునిసిపల్ బాండ్లతో నిధులు సమీకరించవచ్చు. ► ప్రస్తుతం స్టాక్ ఎక్సే్చంజ్‌ల ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫార్మ్పై నమోదైన స్టార్టప్‌లు ఇక నుంచి స్టాక్ సూచీలకు మారవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ► ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు (విజిల్ బ్లోయర్స్) రూ.కోటి దాకా నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు. ► కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్‌ల్లో 25%కి మించకుండా బైబ్యాక్ ఆఫర్ ఉండాలి. ఈ ఆఫర్ 10%కి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ► లిస్టింగైన లేదా లిస్టింగ్ కాబోతున్న ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అంతేకాకుండా రేటింగ్ లేని డెట్ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే పెట్టుబడులను 5 శాతానికే పరిమితం చేయాలని కూడా సూచించింది. ► డెట్ పోర్ట్‌ఫోలియో స్కీమ్‌లు లిస్టింగ్ కాని ఎన్‌సీడీల్లో గరిష్టంగా 10 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు. ► రేటింగ్ లేని డెట్ సాధనాల్లో డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, రెపో ఆన్ జీ–సెక్, ట్రెజరీ బిల్లులను మినహాయిస్తే, కొన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు మిగులుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బిల్స్ రీ–డిస్కౌంటింగ్(బీఆర్డీఎస్), మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, రెపో ఆన్ కార్పొరేట్ బాండ్స్, రీట్స్/ఇన్విట్స్ యూనిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► లిస్టైన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25% నుంచి 35%కి పెంచాలన్న ప్రతిపాదనకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉందని సెబీ పేర్కొంది. అయితే లిస్టైన ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 శాతం వరకూ ఇప్పటికీ, 25 శాతం నిబంధనను అందుకోలేకపోయాయి. అందుకని 35 శాతం పబ్లిక్ హోల్డింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింతగా మదింపు చేయాల్సి ఉందని సెబీ పేర్కొంది. -
ఆధ్యాత్మికం @ ఆన్లైన్!
న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్ టెక్నాలజీస్ లాంటివి ఈ కోవకు చెందినవే. భారత్‌లో మతపరమైన, ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన మార్కెట్ పరిమాణం 30 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. షేర్‌చాట్ లాంటి సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫాంపై 25 మంది పైగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో యోగా గురు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. షేర్‌చాట్ త్వరలో మరింత మందిని తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చిన్న ఆలయాలు, స్వామీజీలతో టైఅప్.. కొత్తగా 20–25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఆధ్యాత్మిక సేవల సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులు, భక్తులను అనుసంధానం చేసే పనిలో ఉన్నాయని మైమందిర్ పోర్టల్‌లో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థ భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ తెలిపారు. ఆన్లైన్లో ఆధ్యాత్మిక గురువుల ఆధారిత కమ్యూనిటీలను తయారు చేయడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. సాధారణంగా కాస్త ఆర్థిక సామర్ధ్యం ఉన్న ఆధ్యాత్మిక గురువులు .. తమ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడే టెక్నాలజీలపై సొంతంగానే నిధులు వెచ్చించుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఆధ్యాత్మిక గురువుకు, ఆలయం, ప్రార్థనామందిరాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో ఓ పేజీ ఉంటోంది. దీంతో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా కాస్త పేరొందిన చిన్న స్థాయి ఆలయాలు, స్థానిక ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలపై ఆధ్యాత్మిక పోర్టల్స్ దృష్టి సారిస్తున్నాయి. పండుగలు, జ్యోతిష్యం వివరాలు కూడా... ‘మేం కాస్త చిన్న స్థాయి గురువులు, ఆలయాలను .. వాటి కంటెంట్‌ను ఇప్పుడు మా ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి తెస్తున్నాం‘ అని ఆర్‌జ్ఞాన్ సహ వ్యవస్థాపకుడు ఉమేష్ ఖత్రి తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి గలవారికి ఈ వెబ్సైట్ ఒక .. ఇన్స్ట్రాగాంలాంటిది. ఆర్‌జ్ఞాన్, మైమందిర్లకు ప్రతి నెలా చెరో అయిదు లక్షల మంది దాకా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరు మతపరమైన కంటెంట్, తమ ఇష్ట దేవతలు.. గురువుల ఫొటోలు, వీడియోలు వీటిలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సైట్లు.. పండుగలు, హిందు క్యాలెండర్లు, జ్యోతిష్యం మొదలైన అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని కూడా యూజర్లకు పంపిస్తుంటాయి. తమ ప్లాట్‌ఫాంపై నాణ్యమైన కంటెంట్ అందించేందుకు కాల్పనిక్ టెక్నాలజీస్ నేరుగా ఆలయాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కాల్పనిక్ టెక్నాలజీస్ దగ్గర 230 ఆలయాలకు సంబంధించిన లైవ్, రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 50 మంది గురువులు, 500 ఆలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించుకుంది. మారుతున్న అభిరుచులు... మతపరమైన, ఆధ్యాత్మికమైన కంటెంట్ విషయంలో భారతీయుల ధోరణులు మారుతున్నాయి. గత మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మందికి తొలిసారిగా సోషల్ నెట్వర్క్ సైట్లు పరిచయమవుతున్నాయి. నగరాల్లో ఉండే వారితో పోలిస్తే ఇలాంటి చిన్న పట్టణాలు, గ్రామాల వారి కంటెంట్ వినియోగ ధోరణుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ‘భారతీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ధోరణులు మారుతున్నాయి. చాలా మంది గుళ్లకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం, వాటిని ఫేస్‌బుక్‌లాంటి వాటిల్లో పోస్ట్ చేయడంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ అవసరమన్న అభిప్రాయం నెలకొంది‘ అని మైమందిర్ వ్యవస్థాపకుడు రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ఇటు భక్తులు, అటు ఆలయం కోణంలో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో విస్తరించని మార్కెట్‌పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులకు లక్షల కొద్దీ సంఖ్యలో భక్తులు ఉంటున్నారు. పాత తరం వారితో పాటు టెక్నాలజీ విపరీతంగా వాడే కొత్త తరం యువత కూడా వీరిలో ఉంటున్నారు. వీరికి ఆశ్రమాలకు వెళ్లేంత సమయం దొరక్కపోవడంతో ఆయా గురువుల ప్రవచనాలను ఆన్లైన్లో వినడానికి మొగ్గుచూపుతున్నారని కాల్పనిక్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశ్వనీ గర్గ్ చెప్పారు. -
జీవశాస్త్ర కంపెనీలకు రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో జీవశాస్త్ర సంబంధిత స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) రూ.400 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ప్రస్తుతం విధివిధానాల రూపకల్పనకు కసరత్తు కొనసాగుతోందని, సీఎస్ఐఆర్ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ నిధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ పంపించామని ఆయన చెప్పారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలోని అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్ సి. మండే మీడియాతో మాట్లాడారు. బయోటెక్ స్టార్టప్ కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్న నిధి రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో పరిష్కారాలు కనుక్కునే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం కొన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. వాటి ఫలితాలిప్పుడు అందరికీ అందుతున్నాయని ‘సాక్షి’అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సికిల్ సెల్ అనీమియా వంటి అరుదైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జన్యు ఆ«ధారిత టెక్నాలజీని అభివృద్ధి చేశామని ఆయన మండే తెలిపారు. చెరకు వ్యర్థాల నుంచి పొటాష్... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పండే చెరకు నుంచి మరింత విలువను రాబట్టేందుకు భావ్‌నగర్‌లోని సీఎస్ఐఆర్ సంస్థ ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించిందని శేఖర్ తెలిపారు. వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి పొటాష్‌ను వెలికితీయగల ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పొటాష్ దిగుమతులను నిలిపివేయవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని నంజుకు తింటున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : ‘షట్‌డౌన్‌ఇండియా, టాక్స్‌టెర్రరిజమ్, షిఫ్ట్‌అవుట్‌ఇండియా’ హాష్ టాగ్‌లతో స్టార్టప్ ఇండియా వ్యాపార వేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి గత కొన్ని వారాలుగా వేలాది విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ‘స్టార్టప్ ఇండియా’ కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశించామని, అందుకు విరుద్ధంగా పన్నుల మోతతో తమను నంజుకు తింటున్నారని వారు వాపోతున్నారు. పన్ను నోటీసులతో కుమ్ముతున్నారని, బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తున్నారని, ముఖ్యంగా సరైన వివరణలేని నిధులంటూ పన్ను అధికారులు బ్యాంకుల నుంచి నేరుగా నిధులను స్వాధీనం చేసుకుంటున్నారని వారు లబోదిబోమంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్ సర్వే’ అధ్యయనంలో 70 శాతం మంది స్టార్టప్ కంపెనీల యజమానులు తమకు ఒక్కటైన ‘ఏంజెల్ పన్ను’ నోటీసు అందిందని వాపోయారు. తమకు మూడు, నాలుగు నోటీసులు వచ్చాయని వారిలో 30 శాతం మంది యజమానులు వాపోయారు. ఓ కంపెనీ నిర్దారిత విలువకన్నా పెట్టుబడుదారుల నుంచి ఎక్కువ ప్రీమియం వస్తే ఆ ప్రీమియంను లాభంగా పరిగణించి 30 శాతం పన్ను విధించడాన్ని ఏంజెల్ పన్నుగా వ్యవహరిస్తారు. రైలు ప్రయాణికులకు భోజనాన్ని సరఫరా చేసే నోయిడాలోని ‘ట్రావెల్‌ఖానా’ స్టార్టప్ కంపెనీ నుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 6వ తేదీన 33 లక్షల రూపాయలను ఉపసంహరించుకున్నారు. బ్యాంకు ఖాతా నుంచి హఠాత్తుగా డబ్బులు మాయం అవడంతో తాము బ్యాంకుకు వెళ్లి వాకబు చేశామని, ఆ సొమ్మును ఆదాయం పన్ను శాఖ అధికారులు డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో తీసుకెళ్లినట్లు తెల్సిందని ట్రావెల్ ఖానా వ్యవస్థాపకులు పుష్పింధర్ సింగ్ తెలిపారు. అలాగే వారు భారతీయ స్టేట్ బ్యాంకు, ఐసీసీఐ బ్యాంకుల్లోని తమ ఖాతాలను స్తంభింపచేశారని ఆయన వాపోయారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సరైన వివరణ లేని కారణంగా వాటిని తాము అనూహ్య పెట్టుబడులుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారని, తమ పెట్టుబడుల్లో నగదు లావాదేవీలే ఉండవని, అన్ని పెట్టుబడులను తాము బ్యాంకు బదిలీల ద్వారానే తీసుకుంటామని ఆయన వివరించారు. అలాంటప్పు అనూహ్య పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల వైద్యుల సేవలను అనుసంధానించే ఐదేళ్ల క్రితం ప్రారంభమైన స్టార్టప్ కంపెనీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఫిబ్రవరి ఆరవ తేదీనే ఈ కంపెనీ బ్యాంకు నుంచి ఆదాయం పన్ను అధికారులు 72 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. భారత దేశంలో ప్రస్తుతం ఏడువేల స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. 2018లో ఈ కంపెనీలు 420 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహించాయి. భారత దేశంలో ఐటీ కార్మికులు తక్కువ వేతనాలకు దొరకడం మూలానా 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ స్టార్టప్ కంపెనీలు వచ్చాయని, సిలికాన్ వ్యాలీ నుంచి వెనక్కి వచ్చి టెకీలు అనేక కంపెనీలు పెట్టారని, పెడుతున్నారని స్టార్టప్ వ్యాపారులు తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహిస్తామని చెప్పడంతో విశ్వసించామని వారు అంటున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి మాత్రం నిరుత్సాహంగా ఉందని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము కంపెనీలను షట్‌డౌన్ చేసుకోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
రక్షణలో స్వావలంబనకు ‘డేర్ టు డ్రీమ్’!
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక టెక్నాలజీల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి టెక్నాలజీలను దేశీయంగానే సంపాదించుకునేందుకు యువ శాస్త్రవేత్తలను, స్టార్టప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రేపటితరం టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు డీఆర్డీవో ‘డేర్ టు డ్రీమ్’పేరుతో పోటీని నిర్వహిస్తోందని తెలిపారు. కృత్రిమ మేధతోపాటు డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, స్మార్ట్ మెటీరియల్స్ వంటి రంగాల్లో అత్యంత ప్రభావశీల, వినూత్న ఆలోచనలు, టెక్నాలజీలతో ముందుకు వచ్చే వారిని ఈ పోటీ ద్వారా గుర్తిస్తామని వివరించారు. స్టార్టప్ కంపెనీలతోపాటు వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చునని, వచ్చే నెలలో పోటీ గడువు ముగుస్తుందని వివరించారు. రక్షణ తయారీ రంగంలో స్వావలంబన అనే అంశంపై ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సుకు డాక్టర్ సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, ఏవియేషన్, రొబోటిక్స్ రంగాల్లో వస్తున్న మార్పులతో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయన్నారు. అందుకు తగ్గట్లుగా భారత్ కూడా తగిన శక్తియుక్తులను సమకూర్చుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. రక్షణ రంగంలో అన్ని రకాల శక్తిసామర్థ్యాలను దేశం కలిగి ఉందని, ఇదే క్రమంలో ఈ రంగంలో స్వాలంబన అనేది ముఖ్యమన్నారు. ఆ దిశగా మరిన్ని పరిశోధనలు జరిపి అధునాతన ఆయుధాలను మన దేశంలోనే తయారు చేసుకునే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా సాంకేతికత రూపుదిద్దుకోవాలన్నారు. విద్యార్ధుల్లో సృజనను ప్రేరేపించేలా ఇంక్యుబేషన్ సెంటర్స్ లాంటివి మరిన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజతంత్రమే ఆధారం: ఆర్ఎన్ రవి, జాతీయ భద్రతా ఉప సలహాదారు బలమైన రాజతంత్రంపైనే దేశ రక్షణ ఆధారపడి ఉంటుందని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు. పూర్వీకులు మనకు నేర్పిన రక్షణరంగ తంత్రాలను మరచిపోయి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య ధోరణిలో పనిచేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా దీన్ని సరిచేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ హస్భినిస్, డాక్టర్ డీబీ షేకత్కర్, మేజర్ జనరల్ ఏబీ గోర్తీ, సంజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
దేశీ స్టార్టప్‌లకు చైనీస్ దన్ను
బీజింగ్: భారీగా నగదు నిల్వలున్న చైనా ఇన్వెస్టర్లు .. ప్రస్తుతం భారత స్టార్టప్ కంపెనీలకు దన్నుగా నిలుస్తున్నారు. గతేడాది ఏకంగా 2 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 12,900 కోట్లు) దేశీ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్టా్టర్టప్ ఇండియా అసోసియేషన్ (ఎస్ఐఏ), వెంచర్ గురుకుల్‌తో కలిసి భారతీయ ఎంబసీ బీజింగ్‌లో నిర్వహించిన సెమినార్లో కేపీఎంజీ ఈ నివేదికను ఆవిష్కరించింది. ‘సాధారణంగానే చైనాకు భారత్ ఆకర్షణీయ పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తోంది. 2015 నుంచి మరింత ఆకర్షణీయంగా మారింది. చైనా సంస్థల నుంచి పెట్టుబడులు చెప్పుకోతగ్గ స్థాయిలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్టార్టప్స్, టెక్నాలజీ సంస్థల్లోకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2017లో భారతీయ స్టార్టప్స్‌లోకి చైనా నుంచి సుమారు రూ.12,900 కోట్లు (2 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్త మార్కెట్లలోకి విస్తరించాలన్న చైనా ఇన్వెస్టర్ల ధోరణులను ఇది ప్రతిబింబిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది. రవాణా, ఫిన్‌టెక్‌లోకి కూడా .. చైనా పెట్టుబడులు అత్యధికంగా ఆకర్షించిన వాటిల్లో ఈ–కామర్స్ సంస్థలు ఎక్కువగా ఉండగా.. రవాణా, ఫైనాన్షియల్ టెక్నాలజీ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆలీబాబా, సిట్రిప్, టెన్సెంట్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. చైనా పెట్టుబడులను అందుకున్న వాటిల్లో పేటీఎం, స్నాప్‌డీల్, మీడియా నెట్, మేక్మైట్రిప్, హైక్, ప్రాక్టో, డైలీహంట్ వంటి దేశీ స్టార్టప్స్ ఉన్నాయి. చిన్న సంస్థల్లో పెట్టుబడులకు 200 మిలియన్ డాలర్ల ఫండ్ .. భారతీయ లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) ఇన్వెస్ట్ చేసేందుకు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) 200 మిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఇండియా పేరిట నిర్వహించిన రెండో దపా ఇన్వెస్ట్మెంట్ సెమినార్ సందర్భంగా ఆ బ్యాంక్ సీఈవో జెంగ్ బిన్ ఈ విషయం వెల్లడించినట్లు భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీబీసీ 2011లో ముంబైలో తమ శాఖను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సెమినార్లో 350 పైచిలుకు చైనా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ మొదలైన వారు పాల్గొన్నారు. భారత్ నుంచి 20 స్టార్టప్ సంస్థలకు చెందిన 42 రెండు మంది భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తలు దీనికి హాజరైనట్లు భారతీయ ఎంబసీ ఆర్థిక, వాణిజ్య కౌన్సిలర్ ప్రశాంత్ లోఖండే తెలిపారు. గతేడాది నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న 12 దేశీ సంస్థల్లో నాలుగింటికి 15 మిలియన్ డాలర్ల దాకా ఫండింగ్ లభించినట్లు భారతీయ ఎంబసీ తెలిపింది.. ప్రస్తుత సదస్సులో 7–8 స్టార్టప్స్‌కి 30 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడుల హామీ లభించవచ్చని పేర్కొంది. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్‌కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్‌తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్‌లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్‌లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్‌లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్‌లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్‌లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్‌కు కిరణ్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టెకీలకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ రంగంలో కొలువులపై కత్తి వేలాడుతున్న క్రమంలో టెకీలకు ఉపశమనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దాదాపు 1000కిపైగా స్టార్టప్‌లు టెక్నాలజీ రంగంలో ప్రారంభమయ్యాయని నాస్కామ్ స్టార్టప్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్ రాకతో వేలాది ఉద్యోగాలు ఊడుతున్న నేపథ్యంలో భారత్ ప్రపంచంలోనే మూడద అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా బలపడటం టెకీలకు ఊరట ఇస్తోంది. కొత్త యూనిట్లను కలుపుకుంటే దేశంలో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 5200కు చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది. 15,000 కోట్ల డాలర్లతో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న భారత ఐటీ రంగం ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో నియామకాల ప్ర్రక్రియలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నూతన టెక్నాలజీలతో పెద్ద ఎత్తున ఈ రంగంలో ఉద్యోగాలకు కోతపడుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది.ఇక స్టార్టప్‌ల హవా పెరగడం, అమెరికాలో ఐటీ వ్యయాలు క్రమంగా పుంజుకోనుండటంతో టెకీల నియామకం క్రమంగా ఊపందుకుంటుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికే సదస్సులు
► ఆదిత్యలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల వెల్లడి టెక్కలి: విద్యార్థుల్లో భయం పొగొట్టి ఆత్మవిశ్వాసం నింపడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివిధ కంపెనీలకు చెందిన స్టార్టప్ ప్రతినిధులు స్పష్టంచేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో టెక్విప్ నిధులతో ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన కేబీహెచ్‌ఎస్, నైపుణ్య టెక్నాలజీ సొల్యూషన్, సదానందా, టెక్నాలజీ, అక్షయ ఆటోమిషన్ కంపెనీల సీఈవోలు శ్రీనివాస్, శ్యాంనరేష్, కృష్ణకిషోర్, జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో విద్యార్థులు భయం విడనాడాలన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిధులు కోరారు. అనంతరం ప్రతినిధులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె.బి.మధుసాహు, టెక్విప్ సమన్వయ కర్త డి.విష్ణుమూర్తి, డీన్ ఫిన్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ ఇన్చార్జి బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆండ్రాయిడ్ వీల్‌చెయిర్.. సూపర్ నాజిల్
స్టార్టప్.. స్టార్టప్.. స్టార్టప్.. ఇటీవల అందరికీ చిరపరిచితమవుతున్న పేరు ఇది. యువతరం కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు.. తద్వారా కొత్త ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. సాఫ్ట్వేర్ రంగాన్ని కాసేపు పక్కనబెడితే.. సామాజిక ప్రభావాన్ని చూపే స్టార్టప్ కంపెనీలూ దేశంలో బోలెడున్నాయి. వాటిల్లో మచ్చుకు రెండింటి గురించి స్థూలంగా.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గౌరవాన్ని కాపాడే వీల్‌చెయిర్.. ప్రమాదం.. తీవ్రవాద దుశ్చర్య.. లేదంటే అంతు చిక్కని రుగ్మత.. ఇలా రకరకాల కారణాల వల్ల కొంతమంది చక్రాల కుర్చీకే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తూంటుంది. అటు ఇటు కదిలేందుకు ఈ చక్రాల కుర్చీలు బాగానే ఉపయోగపడతాయి. మరి.. స్నానం చేయాలంటే? ఉదయాన్నే కడుపులోని బరువు దించేసుకోవాలంటే? ఇతరుల సాయం తప్పనిసరి. దీని వల్ల చాకిరి చేసేవారికీ, చేయించుకునేవారికీ ఇబ్బందే. ఇకపై మాత్రం ఇలా కాదంటున్నారు గణేష్ సోనావాణే. ఆర్కాట్రాన్ పేరుతో ఈయన ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సరికొత్త వీల్‌చెయిర్‌ను సిద్ధం చేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ సాయంతో ఎస్ఏఎస్100 పేరుతో తయారు చేసిన ఈ సరికొత్త వీల్‌చెయిర్ అందుబాటులో ఉంటే స్నానం, బాత్రూమ్ అవసరాలకు ఇతరుల సాయం తీసుకునే అవసరమే ఉండదని అంటున్నారు కాలికట్ ఎన్ఐటీ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ చదివిన గణేష్. సహచరులు నలుగురితో కలసి ఆర్కాట్రాన్ను స్థాపించారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి వీల్చెయిర్లు ఇప్పటికే అందుబాటు ఉన్నాయి. కాకపోతే వాటి ఖరీదు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటుంది. చైనా కంపెనీలు కొన్ని నాసికరం వీల్‌చెయిర్లను రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండే, బ్యాటరీతో పనిచేసే కమోడ్, షవర్ వీల్‌చెయిర్‌ను రూ.13 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు గణేష్ తెలిపారు. చుక్క కూడా వృథా పోనీదు.. పెట్రోల్ బంకుల్లో మీరో విషయం గమనించారా? వాహనంలోకి పెట్రోల్, డీజిల్ వేయించుకునేటప్పుడు.. చివరల్లో ఒకట్రెండు చుక్కల ఇంధనం వృథా అవుతూంటుంది. ఆ.. చుక్కలే కదా అని మనం పట్టించుకోము. కానీ బెంగళూరుకు చెందిన ఫజల్ ఇమ్దాద్ షిర్పూర్వాలా పట్టించుకున్నాడు. ఎందుకంటే.. చుక్క చుక్క కలిసి.. దేశం మొత్తమ్మీద వృథా అవుతున్న ఇంధనం దాదాపు 22 కోట్ల లీటర్లు.. విలువ అక్షరాలా.. 1,300 కోట్ల రూపాయలు కాబట్టి! ఈ వృథాను ఎంత అరికడితే అంత మేరకు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చన్నది తెలిసిందే. అందుకే ఫజల్ ఫియాజ్ టెక్ పేరుతో ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. ఒక్క చుక్క కూడా వృథా కాకుండా సరికొత్త ఫ్యుయెల్ డిస్పెన్సర్ సిద్ధం చేశాడు. వీటిని కొనమని చమురు కంపెనీలను కోరితే.. వారెంటీ ఉన్నందున బంకుల్లో ఇప్పటికే వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లను మార్చడం కష్టమని చేతులెత్తేశారు. దీంతో ఫజల్ వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లకు బిగించుకునేలా ఓ సరికొత్త నాజిల్‌తో కూడిన కిట్‌ను తయారు చేశాడు. దీంతో వారెంటీకి ఎలాంటి సమస్య రాదని ఉన్న వాటిని మార్చాల్సిన అవసరమూ ఏర్పడదని అంటున్నారు. ఆటోడెస్క్ సాయం.. ఐడియాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మాత్రం కష్టం. హైటెక్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటే ఈ పని కొంచెం సులువు అవుతుంది. కానీ వీటి ఖరీదెక్కువ. అందుకే తాము కొత్త కొత్త ఐడియాలతో ముందుకొచ్చే ఇన్నొ వేటర్స్కు సాయం అందించాలని నిర్ణయించామని అంటోంది ఆటోడెస్క్. ఆటోక్యాడ్ వంటి డిజైనింగ్, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసే ఈ సంస్థ ‘ఎంటర్ ప్రెన్యూర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా ఏటా కొంత మంది ఇన్నొవేటర్స్కు తమ సాఫ్ట్‌వేర్‌ను మూడేళ్లపాటు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టార్టప్ కంపెనీలకు ఈ రకమైన సాయం అందించామని, భారత్‌లో ఆర్కాట్రాన్, ఫయాజ్టెక్ వంటి 20 స్టార్టప్‌లకు చేయూత అందిస్తున్నామని సంస్థ సీనియర్ అధికారి జేక్ వేల్స్ ‘సాక్షి’కి తెలిపారు. -
స్టార్టప్ కంపెనీలే యువతకు భవిత
తనను కలిసిన యువకులతో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు యువత భవితకు మార్గం చూపిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. తాము తీసుకొచ్చిన నైపుణ్య విధానం వివిధ వృత్తులు చేపట్టిన యువతకు, కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పలువురు యువకులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్టార్టప్ విధానం తమకు ఉపయోగపడిందని చెప్పిన వారు గెట్ మై టైలర్, గెట్ మై బుక్స్, హైర్ పప్పీ, గ్లోసీ ట్రెండ్స్ పేర్లతో స్టార్టప్‌లను ప్రారంభించామని తెలిపారు. వీటి ద్వారా ఏడాదికి ఆరున్నర కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నట్లు జీబీఐ బిజినెస్ డెవలప్మెంట్కు చెందిన స్వప్న సిద్ధార్థ్ ముఖ్యమంత్రికి చెప్పారు. గెట్ మై టైలర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా టైలరింగ్ వచ్చినవారిని ఆన్లైన్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నామన్నారు. ఈ స్టార్టప్‌ను ప్రారంభించిన రాజమండ్రికి చెందిన తాడిమళ్ల కమలాకర్ 241 మీటర్ల వస్త్రంతో 47 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు ఉన్న చొక్కాను చంద్రబాబుకు చూపించారు. హైర్ పప్పీ.కామ్ ద్వారా ఎవరైనా తాము కొనలేని వస్తువులను ఒకరోజు అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చని మరో యువతి తెలిపింది. తాము కాకినాడ సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా నల్లమడ డ్రైన్ ప్రభావిత ప్రాంతంలోని పెదనందిపాడు, కాకుమాను మండలాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నల్లమడ డ్రైన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
చొక్కా.. చాంతాడంత..
డాబాగార్డెన్స్ (విశాఖ): గెట్ మై టైలర్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన అతి పొడవైన షర్ట్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. 47 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పులో షర్ట్‌ను తయారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు చేయడమే ధ్యేయంగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని హితవు పలికారు. ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి స్టార్టప్ కంపెనీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సూరంపాలెం ఆదిత్యా ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆ కళాశాల విద్యార్థులు ఇంతవరకు నాలుగు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించారని తెలిపారు. స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ గెట్ మై టైలర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా సుమారు ఐదు వేల మంది నిరుద్యోగ యువత దీనిలో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. గృహిణులు, మహిళలు ఇంటి వద్దే ఉండి టైలరింగ్ ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు. -
ఇంటికి సర్వం ఇంటర్ నెట్టే!!
♦ కొనాలన్నా... కట్టించాలన్నా ఆన్లైన్ బాసట ♦ అమ్మాలంటే ఈ వెబ్సైట్లలో లిస్ట్ చేస్తే చాలు ♦ రుణం కావాలన్నా వీటిని ఆశ్రయిస్తే చాలు ♦ డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం స్టార్టప్ సంస్థలు ♦ టెక్నాలజీ సాయంతో నిర్వహణ కూడా ఈజీ ♦ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థలూ క్లిక్ దూరంలోనే ♦ ‘గృహ సీమ’ చుట్టూ రకరకాల కంపెనీలు ♦ 8 బిలియన్ డాలర్ల మార్కెట్లో పోటాపోటీ ఇల్లంటే మాటలు కాదు. కట్టించినా... కట్టింది కొన్నా... రకరకాల తతంగాలు!!. ఇల్లు వెతకటం నుంచి మొదలుపెడితే... రుణం కోసం సరైన బ్యాంకునుఎంచుకోవటం... ఇంటిలోపలి ఇంటీరియిర్స్ను చేయించటం... రంగుల నుంచి ఫర్నిచర్ వరకూ అంతా దగ్గరుండి చూసుకోవటం... ఇవన్నీ అయ్యాకే ఇల్లు పూర్తయి గృహ ప్రవేశం సాధ్యపడుతుంది. సరే! గృహప్రవేశం చేశాం. తరవాతి సంగతో!! ఇంట్లో మనమే ఉంటే... అప్పుడప్పుడు అవసరమయ్యే ఫ్లంబరు, ఎలక్ట్రీషియన్ దగ్గర్నుంచి, రెగ్యులర్‌గా చేయాల్సిన నిర్వహణ పనులు చాలానే ఉంటాయి. ఒకవేళ అద్దెకు ఇవ్వాలనుకుంటే... సరైన వారిని వెదికి పట్టుకోవటం, నెలనెలా వారి నుంచి అద్దె తీసుకోవటం ఇవన్నీ సమస్యలే. ఒకవేళ ఏదో అవసరం ఉండి ఇల్లు అమ్మాలనుకుంటే అది ఇంకా పెద్ద సమస్య. నిజానికి ఈ సమస్యలన్నీ ఒకప్పుడు పెద్దవే. కాకపోతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చిన్నవైపోయాయి. ఎందుకంటే పైన చెప్పిన ప్రతి బాధ్యతనూ తీసుకోవటానికి పదులకొద్దీ ఆన్లైన్ సంస్థలున్నాయి. జస్ట్ కంప్యూటర్పైనో, మొబైల్ యాప్లోనో ఒక క్లిక్ చేస్తే చాలు. తరవాతి కార్యక్రమాలన్నీ అవే చూసుకుంటాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు చాలా పెద్దది కావటంతో ఇపుడు రకరకాల స్టార్టప్‌లు, ఆన్లైన్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆ వివరాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం. ప్రాపర్టీ పోర్టల్స్... నిధుల సమీకరణ నుంచి కొనుగోళ్ల వరకూ..! ఇతర సంస్థల్లోలానే దేశంలో ప్రాపర్టీ పోర్టల్స్‌లో భారీగా నిధుల సమీకరణ, కొనుగోళ్లు, విలీనాలు జరుగుతున్నాయి. డీల్కర్రీ.కామ్, హౌజింగ్.కామ్లు 30 శాతం వాటాలను 70 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. ఇటీవలే ఇండియాహోమ్స్.కామ్ 50 మిలియన్ డాలర్లు, కామన్‌ఫ్లోర్.కామ్ 7.5 మిలియన్ డాలర్లు, గ్రాబ్‌హౌజ్.కామ్ 2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. కొనుగోళ్ల విషయానికొస్తే.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్.. ప్రాపర్టీ రీసెర్చ్ అనాలిసిస్ పోర్టల్ ప్రాపర్జీ.కామ్‌ను కొనుగోలు చేసింది. 200 మిలియన్ డాలర్ల ఈక్విటీతో క్వికర్ హోమ్స్.. కామన్‌ఫ్లోర్.కామ్‌ను కొనుగోలు చేసింది. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాప్‌టైగర్.. మకాన్.కామ్‌ను కొనుగోలు చేసింది. రెండేళ్ల కాలంలో స్క్వేర్యార్డ్స్ సంస్థ.. రియల్లీజింగ్.ఇన్, ల్యూక్స్ రియల్ఎస్టేట్, ఓరిడెన్టెక్ ల్యాబ్స్ అనే మూడు కంపెనీలను కొనుగోలు చేసింది. వర్చువల్ వ్యూ.. రేటింగ్స్..! ప్రాపర్టీ పోర్టల్స్ ఇపుడు టెక్నాలజీ ఆధారంగా వినూత్న సేవలందిస్తున్నాయి. విక్రయంతో పాటు రెంటల్ అగ్రిమెంట్, ప్రాపర్టీ నిర్వహణ, మేనేజ్మెంట్ సర్వీసులనూ అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ డ్రోన్ కెమెరాలు, వర్చువల్ టెక్నాలజీ, త్రీడీ, ఏరియల్ వ్యూ సేవలందిస్తున్నాయి. మ్యాప్ ఆధారిత సెర్చింగ్.. సంబంధిత స్థిరాస్తులున్న ప్రాంతాన్ని మ్యాప్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు. అంతేకాదు అక్కడున్న ఇతర ప్రాపర్టీల వివరాలు, స్థానిక ఆసుపత్రులు, విద్యా సంస్థలు, షాపింగ్ మాళ్లు, పార్కుల వంటి సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రోడ్లు, మెట్రో, బస్ స్టేషన్స్, విమా నాశ్రయం వంటి రవాణా సదుపాయాల వివరాలూ క్షణాల్లో కళ్లముందుంటాయి. బిల్డర్, రేటింగ్... సంబంధిత బిల్డర్/డె వలపర్ తాలూకు ప్రాజెక్టును విక్రయానికి పెట్టడంతో పాటు... తను అంతకు ముందు చేసిన ప్రాజెక్టులేంటి? భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులేంటి? వంటి వివరాలను ప్రాపర్టీ పోర్టల్స్ అందిస్తాయి. దీంతో కస్టమర్లకు ధరల పెరుగుదల ఎలా ఉందనే అంచనా వస్తుంది. పాత ప్రాజెక్ట్‌ల్లోని కస్టమర్ల అభిప్రాయాలను, రివ్యూలను కూడా అందిస్తాయి. ఏ ప్రాంతంలో రియల్టీ డిమాండ్, సప్లయి ఎక్కువగా ఉందో, ఏ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా నివసించాలనుకుంటున్నారో రేటింగ్ రూపంలో సూచిస్తున్నాయి. స్కైవ్యూ ఫీచర్... పోర్టల్స్... డ్రోన్ కెమెరాల ద్వారా ప్రాపర్టీల స్కై వ్యూను చిత్రీకరిస్తున్నాయి. దీంతో ప్రాపర్టీ ఉన్న లొకేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాపర్టీతో పాటూ ఆయా ప్రాంతం, అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చు. వెరిఫైడ్ ప్రాపర్టీస్.. సంబంధిత ప్రాపర్టీలను వెబ్సైట్లలో పొందుపరిచే ముందు ఆయా ప్రాపర్టీ పోర్టల్స్ వాటి వివరాలను ధ్రువపరచుకుంటాయి. దీంతో నాణ్యమైన, లీగల్ సమస్యల్లేని ప్రాపర్టీలను కొనుగోలు చేసే వీలు ఉంటుంది. కొనాలన్నా... అమ్మాలన్నా ఆన్లైన్ స్థిరాస్తి రంగం మొదలైంది ఇక్కడి నుంచే. మీరు ఇల్లు కొనాలనుకుంటే ఈ సంస్థల వెబ్సైట్లలో, యాప్‌లలో సెర్చ్ చేస్తే చాలు. అలాకాక మీ ఇల్లు విక్రయించాలనుకున్నా సరే... ప్రాపర్టీ పోర్టన్సేను సంప్రతిస్తే చాలు. అవే వచ్చి ఫొటోలు తీసుకుని, వివరాలు తీసుకుని ఆన్లైన్లో పెట్టేస్తాయి. ప్రస్తుతం దేశంలో మ్యాజిక్‌బ్రిక్స్, 99 ఏకర్స్, ఇండియా ప్రాపర్టీ, మకాన్, ఐప్రాపర్టీ, ప్రాపర్టీవాలా, క్లిక్ఇండియా, ప్రాప్‌చిల్, కామన్‌ఫ్లోర్, హౌసింగ్, ప్రాపర్టీబజార్, ఇండియాహోమ్స్, ది గార్డియన్, సులేఖ వంటి 50కి పైగా పోర్టల్స్ ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. గతంలో ప్రాపర్టీ ఓనర్లు, మధ్యవర్తుల ద్వారా పాత ఇళ్లను (సెకండ్ హ్యాండ్) విక్రయించేందుకే పరిమితమైన ఈ పోర్టల్స్... ఇప్పుడు నేరుగా డెవలపర్లు/బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని నివాస, వాణిజ్య సముదాయాలను కూడా విక్రయిస్తున్నాయి. దేశంలో ఏడాదికి ఇవి దాదాపు రూ.250 కోట్ల డీల్స్ చేస్తున్నాయని అంచనా. ‘‘జనం పాత పద్ధతులు వదిలేసి ఆన్లైన్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ముందుకొస్తున్నారు. గతేడాది గూగుల్ నిర్వహించినగ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. దేశంలోని 20 నగరాల నుంచి 200 మంది బిల్డర్లు పాల్గొన్న ఈ ఫెస్టివల్లో మొత్తం 300 డీల్స్ జరిగాయి’’. - నరసింహ జయకుమార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్- 99 ఏకర్స్.కామ్ 8 బిలియన్ డాలర్ల మార్కెట్!! ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ సైజు 38 బిలియన్ డాలర్లు. ఇందులో 20 శాతానికి పైగా స్థిరాస్తి రంగానిదేనన్నది అసోచామ్ నివేదిక సారాంశం. ఆఫ్‌లైన్‌ను కూడా కలుపుకొంటే 2020 నాటికి స్థిరాస్తి పరిశ్రమ 180 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐబీఈఎఫ్ సర్వే అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5-6 శాతం వాటా ఈ రంగానిదే. గతేడాది గూగుల్ నిర్వహించిన సర్వేలో.. దేశంలో గతేడాది జరిగిన 43 బిలియన్ డాలర్ల స్థిరాస్తి లావాదేవీల్లో... 31 బిలియన్ డాలర్లు నివాస సముదాయాలు, మిగిలిన 12 బిలియన్ డాలర్లు వాణిజ్య సముదాయాలవేనని తేలింది. 88 శాతం మంది ఆన్లైన్లోనే.. దేశంలో ఆన్లైన్లో 74% ప్రాపర్టీల కోసమే సెర్చ్ చేస్తున్నారని గూగుల్ సర్వేలో తేలింది. ఇందులో 18-34 మధ్య వయస్సున్న 69% మంది సెల్ఫోన్లో ప్రాపర్టీలను ఆరా తీస్తుంటే.. మిగిలిన వారు డెస్క్‌టాప్ ద్వారా చేస్తున్నారు. ఇల్లు కొనాలన్న ఆలోచన రాగానే 88% మంది కస్టమర్లు ఆన్లైన్ బాటే పడుతున్నారట. అమ్మకాల విషయానికొస్తే.. మార్కెటింగ్ ఉద్యోగుల ద్వారా 50%, ఆన్లైన్ ద్వారా 43 శాతం, న్యూస్ పేపర్ల ద్వారా 1 శాతం, ఇతరత్రా 9 శాతం స్థిరాస్తి అమ్మకాలు జరుగుతున్నాయి. వర్చువల్ త్రీడీ టూర్.. ఇల్లు, ఇంటి పరిసరాలను వర్చువల్ త్రీడీ వ్యూ ద్వారా చూడచ్చు. విజువలైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫ్లాట్ ఎంత ఎత్తులో ఉంటుంది? ఫ్లోర్ ప్లాన్‌తో పాటు గదుల విస్తీర్ణాలను 360 డిగ్రీల కోణంలో త్రీడీలో చూడొచ్చు. ఫ్లాట్‌లో వెలుతురు వంటి అంశాలూ తెలుసుకోవచ్చు. ఇల్లు మీది.. బాధ్యత మాది బౌంటీప్రాపర్టీ.కామ్, నిమ్మది.కామ్, ఫస్ట్ ఇంప్రెషన్.కామ్, గ్రేస్టార్.కామ్ సొంతిల్లు ఉన్నా.. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తే మరి ఆ ఇంటిని ఏం చేయాలి? ఎవరికైనా అద్దెకిస్తే అద్దె చెల్లింపులు, ప్రాపర్టీ నిర్వహణ ఎలా? పెపైచ్చు రాత్రికి రాత్రే నకిలీ పత్రాలతో జరుగుతున్న మాయలు సిటీలకు కొత్తేమీ కాదు. వీటికి పరిష్కారం చూపించేవే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసులు (పీఎంఎస్). అంటే మీ పేరిట వీళ్లే మీ ఇంటిని అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారుడికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. క్రమం తప్పకుండా విద్యుత్, ఆస్తి పన్ను చెల్లింపులు పీఎంఎస్ సేవలో ప్రధానం. ఇల్లు నిర్వహణ పీఎంఎస్దే. మీకు ప్రతినిధిగా... మీకు అద్దెదారుడికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత కూడా వీరిదే. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి డీల్ కుదిరేందుకు సహకరిస్తారు. ఏ పనైనా యజమానికి చెప్పే చేస్తారు. ప్రతి సేవకూ ఎంతో కొంత చెల్లించాలి. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. పార్కింగ్, అగ్రిమెంట్ వ్యవధి, ఫర్నిషింగ్ తదితర వివరాలిస్తే ఆన్లైన్లోనే రెంట్ అగ్రిమెంట్‌ను అందిస్తాయి. ఎలక్ట్రికల్ వస్తువులే కాదు... సిమెంట్ కూడా బయ్ఎలక్ట్రిక్.కామ్. బెస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్.కామ్, ఎలక్రికల్స్ (సి బదులు కె).కామ్, టెస్కో.కామ్ కట్టిన ఇల్లు నేరుగా కొనుక్కుంటే సరే. అలాకాక ఇల్లు కట్టుకునేవారి కోసం సిమెంటును కూడా ఆన్లైన్లో అమ్మటం ప్రారంభించింది రిలయన్స్ సంస్థ. సంస్థ తొలుత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనేవారి సౌలభ్యం కోసం ప్రతి బ్యాగుపై యూనిక్ కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు కూడా. కనీసం 25 బ్యాగుల్ని ఆర్డర్ ఇవ్వాలి. 48 గంటల్లోగా డెలివరీ చేస్తారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. రంగులు, కంకర, ఇనుము వంటి నిర్మాణ సామగ్రీ ఆన్లైన్లో కొనవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇక ఎలక్ట్రికల్ స్విచ్చులు, వైర్ల వంటివి కూడా ఆన్లైన్లో కొనచ్చు. ‘‘ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సమాచారంతో పాటు కొనుగోళ్లపై రాయితీలివ్వటం మా ప్రత్యేకత. హావెల్స్, యాంకర్, సఫారియా, రాకో, సూర్య, స్నైడర్, రిచెమ్ వంటి సుమారు 256 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు చానల్ పార్టనర్‌గా కొనసాగుతున్నాం కనక మార్కెట్ రేటు కన్నా 20-30% తక్కువ ధరకే విక్రయిస్తాం.’’ - అజయ్, విజయ్ ఎలక్ట్రికల్స్.కామ్ ఫర్నిచర్, ఇంటీరియర్స్‌కు బోలెడన్ని... కస్టమ్ ఫర్నిష్.కామ్, ఫాబ్ఫర్నిష్.కామ్, అర్బన్‌ల్యాడర్.కామ్, హోమ్డె కార్.కామ్, మస్పర్.కామ్, ఈజీ ఫర్నిష్.కామ్... ఇల్లు కొనుక్కోవటం, కట్టించటం తరవాతేంటి? ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్. దీనికితోడు ఇంటీరియర్ డిజైనింగ్. ఇంట్లోకి అవసరమైన బెడ్స్, వార్డ్రోబ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్స్ వంటి ఫర్నిచర్ కోసం రిటైల్ దుకాణానికెళ్లి బేరమాడటం కొందరి పద్ధతైతే... ఆన్లైన్లో కొనటం మరి కొందరి పద్ధతి. అది కూడా ఇంట్లోని గది సైజులకు తగ్గట్టుగా నచ్చిన రంగు, నచ్చిన మెటీరియల్‌ను అంటే కస్టమైజ్డ్ ఫర్నిచర్‌ను ఎంచుకోవచ్చు. రిటైల్ దుకాణాలతో పోల్చుకుంటే ఆన్లైన్ ధర తక్కువ కూడా. వీటితో పాటు ఇంటీరియర్ డిజైనర్స్ సేవలూ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. ఆన్లైన్లో వివరాలిస్తే... డిజైనర్స్ మన ఇంటికి రావటం...అన్నీ కుదిరితే పని మొదలు పెడతారు. ‘‘మేం రిటైల్ షాపులకన్నా 30 శాతం తక్కువ ధరకే ఫర్నిచర్‌ను అందిస్తున్నాం. రిటైల్ షాపుల్లో అసంఘటిత రంగం ఉత్పత్తులే ఎక్కువగా ఉం డటం, రవాణా చార్జీల భారం వంటివి దీనిక్కారణం. అందుకే చాలా మంది తక్కువ ధరకొస్తుంది కదా అని విదేశాల నుంచి ఫర్నీచర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు’’. - మధుకర్ గంగాడి, సీఈఓ- కస్టమర్ ఫర్నిచర్.కామ్ -
సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్
ఎన్నో వ్యక్తిగత సామాజిక ఆకాంక్షలతో యువతరం ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలు తక్కువ సమయంలోనే మూతపడుతున్నాయి. ఇందుకు కారణాలెలా ఉన్నా, దేశ భవిష్యత్తుకి ఎంతో అవసరమైన ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి, స్టార్టప్ కంపెనీల సమస్యలు అర్థం చేసుకొని వారి ఇబ్బందులు కొంతవరకైనా దూరం చేయడానికి సిటీ యువకుడు సైకిల్ టూర్ మొదలుపెట్టాడు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యాత్ర ఏడాది పాటు కొనసాగనుంది. - ఓ మధు దేశంలోని ముఖ్య నగరాల్లో స్టార్టప్‌ల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకూ పరిష్కారం చూపించే దిశగా ఈ టూర్ ప్రారంభించాడు కొండాపూర్‌లో నివసించే అక్షయ్ గుంతేటి(22). ‘ఇండియా స్టార్టప్ టూర్ ’ పేరిట సాగే ఈ సైకిల్ యాత్ర విశేషాలు అతని మాటల్లోనే... స్టార్టప్‌కు సహాయం చేయాలని.. రెండేళ్ల కిందట డేటింగ్ యాప్ రూపొందించాలనుకున్నాను. దీనికి కేరళలోని కొచ్చి నుంచి ఒక టీం దొరికింది. అది ప్రారంభించాక, అక్కడికి వెళ్లి ఎన్జీఓలు, స్టార్టప్ విలేజ్ చూశాక యాప్ కన్నా.. ఔత్సాహిక వ్యాపారులకు సహాయం చాలా అవసరమనిపించింది. తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం, లోన్ రాకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యల వల్లే 90 శాతం స్టార్టప్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఇన్వెస్టర్‌కి స్టార్టప్ కంపెనీ గురించి తెలియకపోవడం, స్టార్టప్ కంపెనీల వాళ్లకి ఇన్వెస్టర్ దొరకకపోవడం.. ఇవే బిజినెస్ ఫెయిల్యూర్‌కి ముఖ్య కారణమని అర్థమవుతోంది. అలాంటి కొన్ని స్టార్టప్స్‌కి సహాయం చేయాలని నిధియా వి రాజ్, నేను కలిసి ఇండియన్ స్టార్టప్ టూర్‌కి ప్లాన్ చేశాం. సమస్యల పరిష్కారమే ధ్యేయం.. దేశంలోని ఇన్వెస్టర్లు, సలహాదారులు, సిద్ధాంతకర్తలు, ప్రభుత్వ అధికారులను కలిసి స్టార్టప్స్‌పై అధ్యయనం, ఇవి విఫలమవడానికి కారణాలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు కనుక్కోవాలనే లక్ష్యంతో ఈ టూర్ ప్రారంభించాం. దీని కోసం సైకిల్ మీద 10,0020 కి.మీ ప్రయాణిస్తా. దీనిలో 40 మీటప్స్, 30 నగరాల విజిట్ ఉంటుంది. ఇప్పటికే వైజాగ్, విజయవాడ నగరాలను సందర్శించి మార్చి 30న హైదరాబాద్ వచ్చాను. భయం వద్దు.. అనుభవమే ముద్దు.. వెళ్లిన ప్రతి సిటీలో స్టార్టప్ మీటప్స్ నిర్వహించడం, అక్కడి అవసరాలు, అనువైన వ్యాపారాల రిపోర్ట్ తయారు చేయడం, ఇన్వెస్టర్లు ఎవరైనా, ఎక్కడి వారైనా తగిన స్టార్టప్ కంపెనీస్‌కి కనెక్ట్ చేయడం.. తదితర సేవల్ని ఉచితంగా అందిస్తున్నాం. స్టార్టప్ ఫెయిల్యూర్‌కి మరో ముఖ్యమైన కారణం లీగల్ అవేర్నెస్ లేకపోవడం. మీటప్ పెట్టి, లీగల్ ఎక్స్‌పర్ట్‌ని పిలిచి వారితో అవగాహన కల్పిస్తున్నాం. ఫెయిల్ అయినా సరే స్టార్టప్ కంపెనీ పెట్టి అనుభవం గడించిన వారిని నియమించుకోవడానికి పెద్ద కంపెనీలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తాయి. అందుకే స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో సక్సెస్ అవుతామా? లేదా అనే భయం వ ద్దని నా సలహా. సైకిల్ సాగుతోందిలా... ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ టూర్. టూర్లో నా టెంట్లో లేదా ఆఫర్ చేసిన వాళ్ల దగ్గర ఉంటున్నాను. సైక్లింగ్ ద్వారా సేకరించిన డాటాని నా టీమ్ మేనేజ్ చేస్తుంది. చెన్నై, వెల్లూర్, బెంగళూర్, కోయంబత్తూర్, కొచ్చి, కన్యాకుమారి, కాలికట్, మంగళూర్, గోవా, పుణె, నాసిక్, రిషికేశ్, లక్నో... ఇలా 32 నగరాలు తిరిగి చివరకు బెంగళూర్ చేరుకుంటాను. నెల రోజుల పాటు అక్కడే ఉండి తయారు చేసిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించనున్నాం. స్టార్టప్‌కి ఎవరూ చేయూతనివ్వరు. కానీ వాళ్ల ఐడియాలు బాగుంటాయి. అయితే వాళ్లకి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరిస్తే వందలో 10 స్టార్టప్‌లు తప్పక మనగలుగుతాయి. యావత్ స్టార్టప్ కమ్యూనిటీ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి ఆ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలన్నదే మా విజన్. -
మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు
ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీకి కార్మిక శాఖ ఆదేశం న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ప్రారంభమైన మూడేళ్ల దాకా రిటర్నుల దాఖలు నుంచి, తనిఖీల నుంచి వాటికి మినహాయింపులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో, కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసీకి కే ంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత 9 కార్మిక చట్టాలను సక్రమంగా పాటిస్తున్నట్లు స్వయం ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. తొలి ఏడాది ఇందుకు సం బంధించి ఆన్లైన్లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫారం సమర్పిం చాల్సి ఉం టుంది. తదుపరి రెండేళ్లు కూడా తనిఖీలు, రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసనీయమైన ఫిర్యాదు రాతపూర్వకంగా వచ్చిన పక్షంలో ఆయా విభాగాలు తనిఖీలు చేయొచ్చు. -
మొబైల్ స్టార్టప్స్‌లదే భవిష్యత్తు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద కంపెనీలే కాదు ఎం-కామర్స్ (మొబైల్) ఆధారంగా సేవలందించే స్టార్టప్ కంపెనీలకు భవిష్యత్తు ఉంటుందని జీఎస్ఎఫ్ యాక్సలేటర్ వ్యవస్థాపకుడు రాజేష్ చెప్పారు. ఐకెవా, జీఎస్ఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ ఎనిమిది మొబైల్ స్టార్టప్స్ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల వాడకం పెరగటం, వీటి ధరలూ తక్కువగా ఉండటం, ఎక్కడైనా.. ఎప్పుడైనా యాప్స్‌ను వినియోగించుకునే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చన్నారు. విద్యా, వైద్య రంగం, పర్యాటకం, గేమింగ్ వంటి అన్ని రంగాల్లోనూ మొబైల్ స్టార్టప్స్ సేవలందిస్తున్నాయని.. ఇది సాంకేతికాభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. అనంతరం జాల్జ్, న్యూస్‌బైట్స్, గేమ్జోప్, టాక్మోర్, మ్యాజిక్టాప్, పేసెల్ఫీ, రెంట్ ఆన్ గో, టౌనిస్టా వంటి 8 మొబైల్ స్టార్టప్స్ సీడ్ రౌండ్లో నిధుల సమీకరణలో పాల్గొన్నాయి. -
చదువు నుంచి కొలువు వరకూ..!
కెరీర్‌కు సరైన గెడైన్స్గా నిలుస్తున్న జ్ఞాన్‌ఫైండర్, హ్యాపీమైండ్స్ ♦ ట్రెండ్ కు తగ్గ చదువేదో చెప్పే జ్ఞాన్‌ఫైండర్ ♦ అందుకు తగ్గ కొలువెక్కడుందో చెప్పే హ్యాపీమైండ్స్ ♦ నిధుల సమీకరణపై దృష్టిపెట్టిన సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చదువు, కొలువు! చాలా మందికి ప్రధాన లక్ష్యం ఇదే. అయితే సరైన సమయంలో సరైన చదువో, కొలువో దక్కకపోతే అంతే సంగతి. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేయటానికే అన్నట్లు... స్టార్టప్ కంపెనీలు జ్ఞాన్‌ఫైండర్, హ్యాపీమైండ్స్ రెండూ యువతకు ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలో, ఉపాధి అవకాశాలెలా ఉంటాయో.. వంటి సమాచారం మొత్తాన్ని ఉచితంగానే అందిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెండు స్టార్టప్ సంస్థల వివరాలు ఈవారం ‘సాక్షి స్టార్టప్ డైరీలో’.. ఉద్యోగ సమాచారమంతా సెల్‌ఫోన్‌కే.. మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. దాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని ఆశ్రయించింది హ్యాపీమైండ్స్. రూ.3 లక్షల సొంత పెట్టుబడితో 2013 జనవరిలో దీన్ని ప్రారంభించారు లీలాధర్. ఉద్యోగ సమాచారమిచ్చే కన్సల్టెన్సీలు నగరంలో బోలెడన్ని ఉన్నాయిలే అని తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే కన్సల్టెన్సీలకు హ్యాపీమైండ్స్కు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే... ఉద్యోగ భర్తీ సమాచారాన్ని నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు చేరవేయటమే. ఇంకా చెప్పాలంటే నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధి అన్నమాట. హ్యాపీమైండ్స్ సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి హ్యాపీమైండ్స్ను యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యూజర్ తన విద్యార్హతలు, చిరునామా, ఫోన్ నంబర్, రెజ్యూమ్ వంటి వివరాలను నమోదు చేసుకుంటే చాలు. హ్యాపీమైండ్స్లో నమోదైన ఆయా కంపెనీలకు సంబంధించిన ఉద్యోగ భర్తీ, నోటిఫికేషన్ల తాలుకా సమాచారం నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళుతుంది. అవసరమైతే యాప్ నుంచి కంపెనీకి రెజ్యూమ్‌ను కూడా ఫార్వర్డ్ చేయవచ్చు. ►హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరు, పుణె, చెన్నై నగరాల్లో మన చదువుకు తగ్గ కొలువులెక్కడున్నాయి? ఏ కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి? ఏ హోదాలో నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి? జీతభత్యాలెంత? వంటి ఉద్యోగ సంబంధ సమస్త సమాచారాన్నీ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ►ఐటీ, నాన్-ఐటీ రంగాలకు చెందిన సుమారు 30 కంపెనీలు.. 50 బ్రాంచీలు హ్యాపీమైండ్స్లో నమోదు చేసుకున్నాయి. ఇప్పటివరకు 1,500 మంది ఈ యాప్‌ను వినియోగించుకొని ఉపాధి పొందారు. అయితే ఈ సేవలన్నీ యాప్ యూజర్లకు పూర్తిగా ఉచితం. కంపెనీలకు మాత్రం ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5 వేల చార్జీ ఉంటుంది. ►‘‘సంస్థను ప్రారంభించిన తొలి ఏడాది రూ.28 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. గతేడాది రూ.1.97 కోట్లకు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.5 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా టర్నోవర్‌ను సాధించాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 6-8 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని చెప్పారు లీలాధర్. చదువులన్నీ ఒకే వేదికగా.. ఆండ్రాయిడ్, ఐఓస్.. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌లు మాత్రమే కాదు. నేటి ట్రెండ్ కోర్సులు కూడా. రోజుకో కొత్త ఆవిష్కరణ బయటికొస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్‌కు తగ్గ చదువులు లేకపోతే టెక్నాలజీ పరుగులో వెనకబడిపోతాం. అందుకే ఇలాంటి వినూత్న కోర్సులను అంది స్తున్న సంస్థలేంటి? వర్సిటీలేంటి? భవిష్యత్తు ఉపాధి అవకాశాలేంటి? ఈ వివరాలన్నీ అందిస్తోంది ‘జ్ఞాన్‌ఫైండర్.కామ్’. దేశంలో ట్రయినింగ్ ఇనిస్టిట్యూషన్లకు సరైన వేదికంటూ లేదని తెలుసుకున్న ప్రవాస ఐటీ నిపుణులు వంశీ వనపర్తి, సురేష్ కలిసి రూ.50 లక్షల పెట్టుబడులతో 2015 జనవరిలో జ్ఞాన్‌ఫైండర్.కామ్‌ను స్థాపించారు. ►డిమాండున్న కోర్సులు, భవిష్యత్తులో రానున్న కోర్సులు, వాటిని అందిస్తున్న ఇనిస్టిట్యూషన్లు, ఫీజులు, కాలపరిమితి, కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు, జీతభత్యాలు.. ఇలా చదువు నుంచి కొలువు వరకు సమస్త సమాచారాన్నీ ఒకే వేదికగా అందించడమే జ్ఞాన్‌ఫైండర్ ప్రత్యేకత. ►ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, అహ్మదాబాద్, ఢిల్లీ, గోర్గావ్, నోయిడా, కోల్‌కతాల్లోని సుమారు 12 వేల ఇనిస్టిట్యూషన్ల జ్ఞాన్ఫైండర్లో నమోదు చేసుకున్నాయి. 15 వేల మంది విద్యార్థులు సేవలను వినియోగించుకున్నారు కూడా. ప్రస్తుతానికైతే యూజర్లకు, ఇనిస్టిట్యూషన్లకు ఇద్దరికీ ఉచితంగానే సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇనిస్టిట్యూషన్‌కు ఏడాదికి రూ.10-15 వేల చార్జీ వసూలు చేయనున్నట్లు వంశీ వెల్లడించారు. ►కోర్సులు, సంస్థలే కాకుండా.. విద్యార్థులు చేరబోయే కోర్సు తాలుకా వివరాలను ఈ సైట్లో అప్లోడ్ చేస్తే.. ఆ కోర్సుకున్న డిమాండ్ ఎంత? ఏయే నగరాలు, దేశాల్లో ఉపాధి అవకాశాలున్నాయి? వంటి వివరాలు అందిస్తారు. దీంతో విద్యార్థులే స్వయంగా కోర్సు ఎంపిక చేసుకునే వీలుంటుంది. ►విస్డమ్ జాబ్‌పోర్టల్ రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
స్టార్టప్స్ ఫండ్‌కి రూ. 2,000 కోట్లు..
సిడ్బి సీఎండీ ఛత్రపతి శివాజీ ముంబై : స్టార్టప్ సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కోసం రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) సీఎండీ ఛత్రపతి శివాజీ తెలిపారు. అయితే, లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉం టుంది, ఎంత మొత్తం రుణాలు ఇస్తారు తదితర అంశాలను ఆయన వెల్లడించలేదు. స్టార్టప్స్‌కి తోడ్పాటునిచ్చేందుకు బడ్జెట్లో కేటాయించిన రూ. 10,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి ఇవ్వనున్నట్లు శివాజీ తెలిపారు. మిగతా రూ. 8,000 కోట్లను తక్కువ వడ్డీ రుణాల కింద ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలకు నిధులు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని శివాజీ పేర్కొన్నారు. స్కీము కింద 10-12 శాతం వడ్డీ రేటుకే స్టార్టప్స్, చిన్న ..మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రుణాలు పొందవచ్చన్నారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఆరుగురు సభ్యులతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ కూడా ఏర్పాటైందని శివాజీ పేర్కొన్నారు. అటు చిన్న సంస్థల రుణాల రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన ముద్రా బ్యాంకు.. సిడ్బీకి పోటీ కాదన్నారు. ముద్రా బ్యాంకుకీ శివాజీనే సారథ్యం వహిస్తున్నారు. -
స్టార్టప్ కంపెనీలకు రిలయన్స్ చేయూత
వివిధ రంగాల్లో 11 సంస్థల ఎంపిక ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) స్టార్టప్ కంపెనీలకు చేయూతనందించనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జెన్నెక్స్ట్ వెంచర్స్ 11 స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరించనుంది. మైక్రోసాఫ్ట్ వెం చర్స్ భాగస్వామ్యంతో స్టార్టప్‌లకు ఆసరాగా నిలి చేందుకు గతేడాది ఈ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్‌ను రిలయన్స్ ప్రారంభించింది. కాగా, మొత్తం 267 స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకోగా... 11 సంస్థలను ఎంపిక చేసినట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, రిటైల్, మానవవనరులు తదితర రంగాకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి. కాగా, ఎంపికైన సంస్థలకు నవీ ముంబైలోని ఆర్ఐఎల్ కేంద్రంలో నాలుగు నెలల కోర్సును నిర్వహించనున్నారు. కొన్ని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనున్నామని రిలయన్స్, మైక్రోసాఫ్ట్ వెంచర్ సంస్థలు ఇదివరకే సంకేతాలిచ్చాయి. అయితే, తాజా విడతలో ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇరు కంపెనీలూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాము ఎంపిక చేసిన స్టార్టప్‌ల వద్ద అద్భుతమైన వ్యాపార వ్యూహాలు ఉన్నాయని, వీటిని కార్పొరేట్లు, పరిశ్రమ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులకు అవి వివరిస్తాయని ఆర్ఐఎల్ తెలిపింది. వీటిలో కొన్ని స్టార్టప్‌లు ఫోర్టిస్, ఫ్లిప్‌కార్ట్, రేమండ్, క్రెడిట్ సూసీ, డాట్‌క్యాబ్స్, స్నాప్‌డీల్ వంటి కంపెనీల నుంచి వ్యాపార ఒప్పందాలను దక్కించుకున్నాయని పేర్కొంది. -
స్టార్టప్స్ కోసం ‘బిలియన్ డాలర్ బేబీస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎదగాలనే ఆకాంక్ష గల హైదరాబాదీ స్టార్టప్ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం గురువారం బిలియన్ డాలర్ బేబీస్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదిగే సత్తా ఉన్న భారతీయ సంస్థలను గుర్తించి, ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ఈ సందర్భంగా టై సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ వెంకటేష్ శుక్లా తెలిపారు. దీని కింద ఎంపికైన దేశీ స్టార్టప్స్‌కు టై సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు మొదలైన వారి నుంచి వ్యాపార మెళకువలు తదితర అంశాలపై తోడ్పాటు లభించగలదని శుక్లా పేర్కొన్నారు. అలాగే, టై సీఐవో ఫోరం మొదలైన వాటిల్లో పాల్గొనవచ్చని.. అకౌంటింగ్, చట్టాలు, హైరింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ సహాయ, సహకారాలు లభిస్తాయన్నారు. నూతనంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే వారికి బిలియన్ డాలర్ బేబి ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. హైదరాబాద్ యువత వద్ద వినూత్న వ్యాపార ఐడియాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రాజెక్టులో పాల్గొనే ఇతర స్టార్టప్స్‌కి గట్టినివ్వగలరని టై హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. హైదరాబాద్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోండటం హర్షణీయమని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ఎదగాలనుకునే దేశీ తయారీ సంస్థలు ఈ ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఇప్పటికే వెంచర్/ఏంజెల్ ఫండింగ్ పొంది ఉండటంతో పాటు .. ఇటు దేశీయంగాను.. అటు విదేశాల్లోనూ చెప్పుకోతగిన ఫలితాలు సాధించి ఉండాలి. కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఎవరో ఒకరు సిలికాన్ వ్యాలీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. -
త్రీడీ ప్రింటింగ్‌దే ఫ్యూచర్...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా వెలుస్తున్న స్టార్టప్ కంపెనీలు...కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాలేదు. వైద్య రంగంలోనూ వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యాప్‌లే కాదు. ఉత్పత్తులనూ ఆవిష్కరిస్తున్నాయి. ముఖ్యంగా దృష్టి లోపంతో బాధపడే వారికి ఉపయోగపడే కొత్త ఉత్పత్తులకు మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటోంది. దేశంలో తొలి సారిగా అంధుల వినియోగం కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్నోవేషన్ సెంటర్‌ను సృజన పేరుతో నెలకొల్పింది. ఈ సెంటర్ త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తుల అభివృద్ధి , నవీకరణలపై స్టార్టప్ కంపెనీలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని సృజన ప్రాజెక్ట్ డెరైక్టర్ డాక్టర్ ఆంటోనీ విపిన్ దాస్ తెలిపారు. అమెరికాలోని ప్రఖ్యాత మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 35 ఏళ్లలోపు 35 మంది ఇన్నోవేటర్స్‌లో డాక్టర్ ఆంటోనీ మన దేశం నుండి అరుదైన గౌరవాన్ని పొందారు. ఇంజనీరింగ్‌కు మెడిసిన్ తోడైతే ...దాన్ని మించిన వ్యాపార మంత్రం ఉండదంటున్న డాక్టర్ ఆంటోనీతో సాక్షి ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూ వివరాలు ఇవీ... మెడికల్ స్టార్టప్ కంపెనీల వ్యాపార అవకాశాలు? మెడికల్ టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీలకు వృద్ధి అవకాశాలంటే ఆకాశమే హద్దు. హెల్త్‌కేర్ రంగంలో స్మార్ట్‌ఫోన్ ఆధారంగా పలు రకాల రుగ్మతల స్క్రీనింగ్కోసం అప్లికేషన్లు డెవలప్ చేస్తున్నారు. ఉదాహరణకు డయాబీటిస్, కేన్సర్, క్యాటరాక్ట్, చెవి, సర్వికల్ ఇన్ఫెక్షన్స్ లాంటి రుగ్మతల స్క్రీనింగ్ కోసం తక్కువ వ్యయంతో కూడిన అప్లికేషన్లకు ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా ఉంటోంది. అమెరికాలోని ఎంఐటీతో కలిసి ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ఫొటోగ్రఫీని డెవలప్ చేసింది. ఇదొక గొప్ప సంచలనం. క్లినికల్ ఫొటోగ్రఫీ గురించి వివరించండి? కంటి ఆస్పత్రుల్లో స్లిట్ ల్యాంప్ కెమెరా ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. దీని ఖరీదు రూ. 1.5 లక్షలు. అయితే మా సంస్థలోని ఆప్తాల్మాలజిస్ట్ గణేష్ తన టీంతో కలిసి కేవలం ఐ ఫోన్‌ను ఉపయోగించి స్లిట్ ల్యాంప్ కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ఒక్కో ప్రింట్ ధర ఒక డాలర్ కన్నా తక్కువకే ఇవ్వగలుగుతున్నాం. ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ. భవిష్యత్ త్రీ డీ ప్రింటింగ్దేనా? త్రీ డీ ప్రింటింగ్ విప్లవాత్మక టెక్నాలజీ. ముఖ్యంగా అంధులకు ఇదొక వరం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది జైన్ విద్యార్థిని తానియా జైన్ మా సంస్థతో కలిసి తొలిసారిగా బ్రెయిలీ బాషలో రూపొందించిన టాయ్పజిల్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఫిటిల్.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ స్టార్టప్ తన కార్యకలాపాలు నడుపుతోంది. అంధ విద్యార్థులకు వర్ణమాలలోని అక్షరాల ఆకృతి, పళ్లు, కూరగాయలు, పక్షులు, జంతువుల ఆకారాలను త్రీ డీ ప్రింటింగ్ ద్వారా అందుబాటులో ఉంచడంతో వారికి వాటిపై చక్కటి అవగాహన కలుగుతోంది. అంధుల్లో బ్రెయిలీ భాష నేర్చుకున్న వారు పది శాతానికి మించిలేరు. మిగిలిన 90 శాతం మంది అంధ విద్యార్థులకు బ్రెయిలీపై ఆసక్తిని పెంపొందించేందుకు త్రీడీ ప్రింటింగ్ ఆబ్జెక్టులు వారికి వివిధ రకాల భావనలపై అవగాహన కల్గిస్తున్నాయి. స్టార్ట్టప్ కంపెనీ ఫిటిల్ అభివృద్ధి చేసిన ఫిష్ టాయ్ పజిల్ ఉత్పత్తి బాగా హిట్టయింది. ప్రపంచ వ్యాప్తంగా అంధుల పాఠశాలలకు, టీచర్లకు ,పేరెంట్స్‌కు ఇంగ్లిష్ ఆల్ఫాబెట్లు ఏ నుండి జడ్ వరకు ఈ సంస్థ సప్లయ్ చేయనుంది. మెడికల్ స్టార్టప్‌లకు హైదరాబాద్ అనువైందేనా? హైదరాబాద్‌లో చక్కటి ఈకో సిస్టమ్ ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశోధనా సంస్థలు, మెడికల్ టూరిస్టులు...హెల్త్‌కేర్‌లో ఇన్నొవేషన్స్కు ఇది ప్రపంచ వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాక ఏటా వేలాది మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయి సేవలు, ఉత్పత్తుల ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలున్నాయి. సృజన, చొరవ, పట్టుదల ఉంటే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు అపార ఆకాశమే హద్దు. కొత్త వారికి మీరిచ్చే సలహా? గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులు, యువ ఇంజనీర్లు తమ ఆలోచనలతో సంప్రదిస్తే వారికి సరైన దిశా నిర్దేశం చేస్తాం. ఈ రంగంలో వ్యాపార అవకాశాలు అపారం. గ్లోబల్ ఇంపాక్ట్ (ప్రపంచ వ్యాప్తంగా తమ ముద్ర వేసుకునే అవకాశం) ఈ స్టార్టప్ కంపెనీలకుంటుంది. నిధుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త ఆవిష్కరణల కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ‘సృజన’ అనే ఇన్నోవేషన్ కేంద్రాన్ని గతేడాది మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా హెల్త్‌కేర్ రంగంలో వ్యాపార అవకాశాలు వెతికే వారికోసం చక్కటి సూచనలు, సలహాలు, మెంటారింగ్ కార్యక్రమాలు చేపడుతున్నాం.