విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికే సదస్సులు
► ఆదిత్యలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల వెల్లడి
టెక్కలి: విద్యార్థుల్లో భయం పొగొట్టి ఆత్మవిశ్వాసం నింపడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివిధ కంపెనీలకు చెందిన స్టార్టప్ ప్రతినిధులు స్పష్టంచేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో టెక్విప్ నిధులతో ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన కేబీహెచ్‌ఎస్, నైపుణ్య టెక్నాలజీ సొల్యూషన్, సదానందా, టెక్నాలజీ, అక్షయ ఆటోమిషన్ కంపెనీల సీఈవోలు శ్రీనివాస్, శ్యాంనరేష్, కృష్ణకిషోర్, జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో విద్యార్థులు భయం విడనాడాలన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిధులు కోరారు. అనంతరం ప్రతినిధులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె.బి.మధుసాహు, టెక్విప్ సమన్వయ కర్త డి.విష్ణుమూర్తి, డీన్ ఫిన్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ ఇన్‌చార్జి బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.