awareness seminar
-
సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సక్సెస్ సాధ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోషల్ మీడియాకు వీలైనంత దూరం ఉంటే సక్సెస్ త్వరగా సాధ్యమవుతుందని సివిల్స్ ఆలిండియా 136 ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహ అన్నారు. సక్సెస్ అయ్యాక మాత్రం సోషల్ మీడియాలో మనమే ఉంటామని చెప్పారు. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషయాన్ని ఎంత తొందరగా ఆకళింపు చేసుకుంటామనే దాన్నిబట్టి ఎన్ని గంటలు చదవాలనే దానిపై ప్రణాళిక నిర్దేశించుకోవాలని సూచించారు. నెగెటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. ఓటములను గెలుపునకు నాందిగా భావించాలని చెప్పారు. తాను మూడు విడతల్లో విఫలమై, మూడో విడతలో ఒకే ఒక్క మార్కుతో సివిల్స్ ర్యాంక్ కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా నాలుగో విడతలో విజేతగా నిలిచానన్నారు. స్నేహితులతో ఎప్పటికప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా అనేక సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్నేహ పేర్కొన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలను రోజూ కచ్చితంగా చదవి నోట్స్ తయారు చేసుకోవాలని వివరించారు. ‘సాక్షి’ తరపున జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్నేహను సన్మానించి మెమొంటో అందజేశారు. -
అన్ని అంశాల్లో వ్యవసాయ మండళ్లు భాగస్వామ్యం: కన్నబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే మంచి ఉద్దేశంతో సీఎం.. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టు సాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు తమ సూచనలను అందిస్తాయని వెల్లడించారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని మంత్రి కన్నబాబు అన్నారు. -
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దళితబంధుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వంద శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళిత బంధు లబ్ధిదారులకు గుర్తింపు కార్డు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఐడీకార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని తెలిపారు. పథకం అమలు తీరు సమాచారమంతా పొందుపరుస్తామన్నారు. పథకం అమలులో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారుడు ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని భరోసానిచ్చారు. లబ్ధిదారులకు దళిత బీమా వర్తింపజేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మంత్రి సహా, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ, ఉన్నతాధికారులు ఈ కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. కొంచెం ఆలస్యమైనా దశల వారీగా దళిత బీమాను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
అవినీతి, వివక్ష ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు
-
పాలకులం కాదు.. మనం సేవకులం: సీఎం జగన్
కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు అందరికీ అభినందనలు. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా, ఏకపక్షంగా తిరుగు లేని నమ్మకాన్ని ప్రజలు మనపై ఉంచారు. ఈ విజయంతో మన బాధ్యత మరింత పెరుగుతుందని అందరం గుర్తుంచుకోవాలి. ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో, మన నుంచి ఏం ఆశిస్తున్నారోమీలో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి అవగాహనతోనే ఉంటారు. మనం పాలకులం కాదు.. మనం సేవకులం అని గుర్తెరగాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదగాలి. మన దగ్గరకు ఎవరైనా అర్జీ తీసుకువచ్చినప్పుడు వారితో మనం మాట్లాడే తీరు, వారి పట్ల మనం చూపించే అభిమానం వారి మనసులో ఎప్పటికీ నిలబడిపోతుంది. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. సేవకులం అని సదా గుర్తుంచుకోండి. అవినీతి, వివక్షకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి. వివక్ష అన్నది ఎక్కడా ఉండకూడదు. మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హులైతే ప్రభుత్వ పథకాలు అందించాలి. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామన్న భరోసా కల్పించడమే లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల రెండు రోజుల సదస్సు విజయవాడలో గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంపై వారికి దిశా నిర్దేశం చేశారు. పరిశుభ్రత, రక్షిత తాగు నీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు అందిస్తుందని తెలిపారు. 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తూ నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాల ద్వారా దాదాపు రూ.లక్ష కోట్లు ప్రజలకు వినమ్రంగా అందించామని వివరించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సామాజిక న్యాయం.. అక్కచెల్లెమ్మలకు పెద్దపీట ► ‘‘మొత్తం 87 చోట్ల ఎన్నికలు జరిగితే ఏలూరు కార్పొరేషన్లో కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించలేదు. మిగిలిన 86 చోట్ల పదవుల్లో మునుపెన్నడూ లేని రీతిలో సామాజిక న్యాయాన్ని పాటించి చూపించ గలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్ట ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 67 పదవులు ఇచ్చాం. అంటే 78 శాతం పదవులు ఈ అణగారిన వర్గాలకే ఇవ్వడం గర్వకారణం. ఇక అక్కచెల్లెమ్మలకు చట్ట ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 52 పదవులు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. అంటే ఏకంగా 61 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ► మామూలుగా ఎన్నికలప్పుడు సామాజిక న్యాయం చేస్తామని, అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తామని రకరకాల మాటలు చెబుతుంటారు. పార్టీ మేనిఫెస్టోలో కూడా తీసుకువస్తారు. కానీ ఎన్నికలు అయ్యాక అవన్నీ కూడా పక్కన పెట్టడం, అక్కచెల్లెమ్మలను పట్టించుకోకపోవడం, మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేయడం చూశాం. కానీ అందుకు భిన్నంగా ఇవాళ కార్పొరేషన్, మునిసిపల్ పదవుల్లో నిజాయితీగా సామాజిక న్యాయాన్ని చేశామని, అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేశామని సగర్వంగా చెబుతున్నాను. భరోసా కల్పించాలి... ►ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రెండు రోజులు మీకు ఎంతో ఉపయోగపడ్డాయని భావిస్తున్నాను. మీ సందేహాలు నివృత్తి చేసి ఉంటారని అనుకుంటున్నా. ►రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 1.43 కోట్ల జనాభా.. అంటే రాష్ట్రంలో 30 శాతం జనాభా ఉంది. అంత జనాభాకు మీరు ప్రతినిధులుగా ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పట్టణాలు, నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం ప్రజలకు కల్పించాలి. పరిశుభ్రత – తాగునీరు ► ఈ రోజు పరిశుభ్రతకు మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం జూలై 8న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి వార్డుకు రెండు వాహనాల చొప్పున రాష్ట్రంలో ఏకంగా 8 వేల వాహనాలను కేటాయిస్తున్నాం. ► ప్రతి ఇంటికి రకరకాల చెత్తబుట్టలు ఇచ్చి ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. పరిశుభ్రత తరువాత అంతే ప్రాధాన్యత అంశం రక్షిత తాగు నీరు. రక్షిత తాగు నీరు ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రతి మునిసిపాలిటీలోనూనీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసే పనులు చేపడుతున్నాం. ► ఇప్పటికే 50 మునిసిపాలిటీలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తాము. సచివాలయాలపై సూచనలు ఇవ్వండి ► గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలు అందిస్తున్నారు. ఆ వ్యవస్థను ఇంకా మెరుగు పరిచేందుకు నిరంతరాయంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా. ► ఇంకా ఎక్కడైనా మెరుగ్గా చేయొచ్చని మీకు అనిపిస్తే సూచించండి. మీరు మీ సలహాలు, సూచనలు నేరుగా సీఎం ఆఫీసుకు తెలియజేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రూ.లక్ష కోట్లు ప్రజలకు అందించాం ► మనందరి ప్రభుత్వం 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తోంది. ఎక్కడా వివక్ష, లంచానికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిదీ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 22 నెలల్లో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని సగర్వంగా తెలియజేస్తున్నా. ►ఎక్కడా అవినీతి లేదు. వివక్ష లేదు. అర్హత ఉన్న వారందరికీ అందించాం. ప్రతి చోటా సోషల్ ఆడిటింగ్ చేసి జాబితాలు ప్రదర్శించాం. ఈ 22 నెలల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది. నాడు–నేడు, ఆర్బీకేలు.. ► శిథిలావస్థకు చేరిన స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ‘నాడు–నేడు’తో ఆ మార్పులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారబోతున్నాయి. ఇంకా శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు కూడా ‘నాడు–నేడు’తో పూర్తిగా మారబోతున్నాయి. అవన్నీ ఇప్పటికే మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ► వార్డు స్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం కూడా మీ కళ్లెదుటే కనిపి స్తోంది. గ్రామాల్లో రైతులకు ప్రతి అడుగులో అండగా నిల్చేలా, వారికి ఎంతో చేయూతనిచ్చేలా, రైతులు ఏ అవసరాలకూ ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఊళ్లోనే అన్ని సదుపాయాలు అంటే విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను స్థాపించాం. ఇవన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ► ఈ వ్యవస్థలోకి మీరు రావడంతో ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. దేవుని దయ మీ పట్ల, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ► సదస్సులో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలక మండళ్ల సభ్యులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ నాయక్ పాల్గొన్నారు. లే అవుట్లలో వసతులు ► చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పట్టణాల్లో పేదలకు రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. మొత్తం 17 వేల లే అవుట్లలో యూఎల్బీ, యూడీఏ పరిధిలోనే 16 వేల లే అవుట్లు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద మురికి వాడలుగా మారిపోతాయి. అది ఒక ఆప్షన్. ► లేదూ... వాటిని పట్టించుకుంటాము అంటే.. దేశం మొత్తం మన వైపు చూసేలా కాలనీలను అభివృద్ధి చేయొచ్చు. అందమైన కాలనీలుగా మారతాయి. అక్కడ ఉన్న వారిని సంతోష పెట్టే విధంగా చేయొచ్చు. అది రెండో ఆప్షన్. ఈ రెండో ఆప్షన్ కోసం అందరూ కృషి చేయాలని కోరుతున్నా. ► ఆ కాలనీల్లో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ డ్రైనేజీ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్ స్టాప్‌లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉంటాయి. తొలిసారిగా భూగర్భ కేబుళ్లు వేయబోతున్నాం. ఆ స్థాయిలో మనమంతా కలసికట్టుగా వాటిని అభివృద్ధి చేయబోతున్నాం. మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు ► పట్టణ ప్రాంతాల్లో ఎంఐజీ అంటే మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ఎలాంటి లిటిగేషన్లు లేని స్థలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ మేరకు జిల్లా కేంద్రాలు, పెద్ద మునిసిపాలిటీలలో ఒక్కో చోట 50 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు భూమిని సేకరించి, లాభాపేక్ష లేకుండా ప్లాటింగ్ చేసి, లీగల్ సమస్యలు లేకుండా పట్టాలు ఇస్తాం. ► ఇక్కడ కూడా మోడల్ లే అవుట్లు తయారవుతాయి. ఫుట్‌పాత్‌లు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్టాండ్లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కుటుంబానికి ఒకటి చొప్పున ప్లాట్ ఇవ్వబోతున్నాం. సే నో టు కరప్షన్ ► ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి ఎలా పని చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. వలంటీర్లు ఎలా పని చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలంటే అవినీతి అన్నది ఎక్కడా ఉండకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మీరు అందరూ ‘సే నో టు కరప్షన్’. అవినీతికి తావు లేకుండా చేయాలి. అలాగే వివక్ష ఉండకూడదు. ► మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హత ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి, వివక్ష ఉండకూడదు. ఈ రెండూ కచ్చితంగా పాటించాలి. మీరు బాధ్యతాయుతమైన స్థానాల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ రెండూ గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి. చదవండి: వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’ -
కదం తొక్కిన పాలమూరు సర్పంచ్‌లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సర్పంచ్‌లు నిరసనబాట పట్టారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు, జనాభా ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, గ్రామ పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ తదితర డిమాండ్లు ఆమోదించాలని నినదించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని వైట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాటు చేసిన సర్పంచ్ల అవగాహనాసదస్సును బహిష్కరించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి భారీర్యాలీలుగా వైట్‌హౌస్‌కు చేరుకున్న సర్పంచ్‌లు లోపలికి వెళ్లకుండా అరగంటపాటు బయట ఆందోళనకు దిగారు. అప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి వచ్చి సర్పంచ్‌లను సముదాయించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌లు చివరికి లోపలికి వచ్చి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తీరుపై మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు నా మాట వినకపోతే వెళ్లిపోతా. పరిస్థితి ఇలా ఉంటుం దనుకుంటే అధికారులతోనే సమీక్ష పెట్టుకునేవాళ్లం. పాలమూరు నుంచే సదస్సులు ప్రారంభించాలనుకున్నాం. మీరిలా చేయడం నన్ను బాధించింది’అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ సర్పంచ్ల సదస్సు పూర్తయింది. ఇప్పటికిప్పుడే మార్పు అసాధ్యం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు ఇప్పటికిప్పుడే అసాధ్యమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ గౌరవవేతనం మంజూరుకు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి. కొంతమంది ఉపసర్పంచ్లు సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో చర్చించి నేరుగా అవి మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఉపసర్పంచులు వారంరోజుల్లో సంతకం చేయకుంటే వారి చెక్‌పవర్‌ను రద్దు చేసి ఆ అధికారం మీకు నమ్మకస్తుడైన వార్డ్‌మెంబర్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అందుకూ ఓ పద్ధతి ఉంది. మీరు ముందుగా అధికారులకు పిటిషన్ ఇవ్వాలి. ఒకవేళ అధికారులూ స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. సర్పంచ్‌లను సముదాయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
నేడు కందకాలపై సదస్సు
వైఎస్సార్ జిల్లా సొండిపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ ఆరోగ్యపురం సమీపంలోని కత్తిరాళ్లబండ వద్ద గల డా. జనార్థన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 25న ఉ. 9.30 గం.కు స్వల్ప ఖర్చుతో కందకాల ద్వారా వాననీటి సంరక్షణపై అవగాహన సదస్సు జరగనుంది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి(99638 19074), ఉపాధ్యక్షుడు ముత్యంరెడ్డి(94419 27808) అవగాహన కల్పిస్తారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. వెంకటేశ్వరరెడ్డి– 82473 85931 -
మదుపరులకు... ముందుచూపు అవసరం
సాక్షి, నెల్లూరు: ‘ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న డబ్బుతో ఏదో ఒకదానిపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలని చూస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు మదుపరులు ముందుచూపుతో వ్యవహరించాలి’ అని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్(సీడీఎస్ఎల్) రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆదివారం మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక శాతం ప్రజలు ఒకే ఆదాయంపై ఆధార పడుతున్నారని.. రెండు ఆదాయాలుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమన్నారు. ఇందుకు పొదుపు ఒక్కటే సరిపోదని, భవిష్యత్తులో ధరలను తట్టుకునే లా రాబడినిచ్చే సాధనాల్లో మదుపు చేయాలని సూచించారు. ఎంత పొదుపు చేయాలన్నది ఎవరికి వారు లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. నష్ట భయం ఉన్నచోటే అధిక రాబడికి అవకాశం స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డీమ్యాట్ ఖాతా. ఆదాయపు పన్నులశాఖ జారీచేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా ఈ ఖాతాను ప్రారంభించేందుకు వీలుంటుందని శివప్రసాద్ చెప్పారు. డిజిటల్ రూపంలోనే షేర్లను భద్రపర్చుకోవచ్చన్నారు. మదుపరులు వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలను ఎంచుకోవచ్చన్నారు. నష్టం వాటిల్లే భయం ఉన్న చోట రాబడి అధికంగానే ఉంటుందని వివరించారు. -
16, 17 తేదీల్లో టీఎమ్మార్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 16, 17వ తేదీల్లో టీఎమ్మార్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 ఎన్నికలే ప్రామాణికంగా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాలలో నిర్మాణపరమైన కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళేందుకు కార్యకర్తలను సిద్ధం చేయడమే వారి లక్ష్యం అన్నారు. 23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని రాజకీయాల వైపు మళ్ళించడంలో అనేక లోటుపాట్లు జరిగాయన్నారు. బహుజన రాజకీయాలపై పట్టు సాధించడానికి అధిక శాతం ఉన్న అణగారిన కులాలను చైతన్యం చేస్తూ, సామాజిక తెలంగాణ సాధించే దిశగా ముందుకు వెళతామన్నారు. కార్యక్రమానికి ప్రముఖ మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మేకల నరేందర్, నాగారం బాబు, బి. చంద్రయ్య, కె.వెంకట్, రమేశ్, జాన్సీ, శ్యాంరావు, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. -
పోటా.. పోటీ !
♦ ఆర్ఎస్ఎస్లో సభ్యుల కోసం గ్రామాల్లో తీవ్ర ప్రయత్నాలు ♦ వర్గాల వారీగా ఎమ్మెల్యేలకు పేర్లు ప్రతిపాదిస్తున్న నాయకులు ♦ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో నియామకాలకు కసరత్తు ♦ అవగాహన సదస్సులలో చర్చిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ♦ అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ద్వితీయశ్రేణి నేతల హడావుడి ♦ ఇవేం పదవులంటూ భగ్గుమంటున్న ప్రతిపక్ష పార్టీలు సాక్షిప్రతినిధి, నల్లగొండ : రైతు సమన్వయ సమితుల (ఆర్ఎస్ఎస్)తో గ్రామాల్లో అధికార పార్టీ నేతల హడావుడి నెలకొంది. ఈనెల 9 వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నియామకాలు పూర్తి చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టడంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సుల కోసం గ్రామాలబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 566 రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో ఈ కసరత్తు మొదలైంది. కొన్ని గ్రామాల సభ్యుల నియామకాలు చేసినా.. ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. ఈ నియామకాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. గ్రామస్థాయి అధికార పార్టీ నేతలనే ఆర్ఎస్ఎస్లలో నియమిస్తున్నారని.. అధికారులు చేతులు ఎత్తేయడంతో అంతా ఆ పార్టీనే చూసుకుంటుందని, అసలు ఇవేం పదవులు..? అంటూ మండిపడుతున్నారు. జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో.. ఒక్కో గ్రామానికి 15మంది సభ్యులను నియమించాలి. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 8,490 మంది సభ్యుల నియామకాలు చేయాలి. గ్రామస్థాయిలో ఆర్ఎస్ఎస్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పదవుల కోసం.. గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఇతర పార్టీలనుంచి టీఆర్ఎస్లో చేరడంతో చాలా గ్రామాల్లో వర్గాలున్నాయి. అయితే ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి తమనుంచి ఈ పేర్లు ఉండాలని ప్రతిపాదిస్తున్నారు. ఒక్కో గ్రామంలో మూడు, నాలుగు వర్గాలు ఉండడం.. ఎమ్మెల్యేలకు వేర్వేరుగా జాబితా ఇస్తున్నారు. దీంతో ఈ నియామకాలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పార్టీలోని అన్ని వర్గాలకు సంబంధించిన గ్రామస్థాయి ముఖ్య నేతలను ఎమ్మెల్యేలు తమ వద్దకు పిలిపించుకొని నచ్చజెబుతున్నా.. ఎవరికివారు తమ వర్గం వారే ఎక్కువ మంది సభ్యులుగా ఉండాలని పట్టుబడుతున్నారు. ఒక తాటిపైకి రాని గ్రామాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మాత్రం.. చివరకు మేం ఫైనల్ చేస్తాం..‘మీరు వెళ్లండి’ అంటూ పంపిస్తున్నారు. దీంతో పదవులు మాకే వస్తాయని, పక్కవర్గానికి ఒక్క సభ్యుడు కూడా ఇవ్వరంటూ గ్రామస్థాయి నేతలు ఆశల పల్లకిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఎంపిక చేసే 15 మంది సభ్యుల్లో ఎవరికి గ్రామంలో పట్టుంది, ఎక్కువగా చదువుకున్నది ఎవరు..?, అని తమ అనుంగు మండలస్థాయి నేతల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి సభ్యుడు కావడమే కీలకం.. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సభ్యుల విషయంలో ఉత్తర్వులను సవరించి తాజాగా వెలువరించింది. గ్రామ స్థాయి సభ్యులుగా నియమితులైన వారిలో ఒక్కరిద్దరిని మండలస్థాయి, అక్కడినుంచి జిల్లా స్థాయికి తీసుకుంటామని పేర్కొంది. దీంతో గ్రామ ఆర్ఎస్ఎస్ సభ్యుడి పదవి కీలకమైంది. మండల, జిల్లాస్థాయి పదవుల కోసం పోటీపడే నేతలు ముందుగా వారి గ్రామంలో సభ్యుడై ఉండాలి. గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లుగా మాజీ ప్రతినిధులుగా ఉన్న వారంతా ఈ పదవులకు పోటీ పడుతున్నారు. గ్రామస్థాయిలో వీరు తమపేర్లు పెట్టాలని ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో.. గ్రామంలో ఉన్న నేతలు మాత్రం వాళ్లు ఇంతకు ముందే ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవించారని.., మళ్లీ వారికి ఇవ్వొద్దని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని.. ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట గ్రామనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట.. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ఆ పార్టీ ముఖ్య నేతలే ఈ పదవుల పంపకాల బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎంపీని తీసుకెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామంలో బలంగా పనిచేసిందేవరు..?, తమ సర్పంచ్‌లు సూచించే పేర్లలో ఎవరు తమకు విశ్వాసపాత్రులుగా ఉంటారోనని లెక్కలేసుకుంటూ.. ఎవరిని ఆర్ఎస్ఎస్లల్లో పెట్టాలన్న యోచనలో ఉన్నారు. రైతు సమన్వయ సభ్యుల నియామకాల కోలాహలంతో మొత్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను తలపించే వాతావరణమే ఏర్పడింది. వర్గాలుగా ఎవరికివారు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ తమకే అన్ని పదవులు వస్తాయంటూ చర్చల్లో మునిగారు. ‘ఎమ్మెల్యేలు.. మేం ఫైనల్ చేస్తాం’ అని చెప్పినా తమకు ఎప్పుడు పిలుపువస్తుందోనని నియోజకవర్గ నేతలను ఆరా తీస్తున్నారు. -
కేన్సర్ ఎవేర్నెస్ కలిగించాలి: హీరోయిన్
నటి గౌతమి ఇటీవల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుండడంతో పాటు, రాజకీయపరమైన అంశాలపైనా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రిని కూడా కలిశారు. కాగా బ్రెస్ట్ కేన్సర్ అవగాహన కార్యక్రమం, రక్తదాన కార్యక్రమాలు కరూర్‌లో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమి బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రసంగించారు. అనంతరం గౌతమి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్‌పై నగర మహిళల్లో మంచి అవగాహన ఏర్పడుతున్నా, గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కలగాల్సి ఉందన్నారు. మహిళలు బ్రెస్ట్ కేన్సర్ గురించి ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, వైద్య పరికరాలను గ్రామాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం గురించి వివరించడానికే తాను ప్రధానమంత్రిని కలిశానని తెలిపారు.అదే సమయంలో తమిళ రైతు సమస్యలపై స్పందించిన గౌతమి, దేశానికి వెన్నుముక రైతేనన్నారు. అలాంటి రైతుల కోరికలను ఎవరైనా నెరవేర్చాల్సిందేనని పేర్కొన్నారు. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికే సదస్సులు
► ఆదిత్యలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల వెల్లడి టెక్కలి: విద్యార్థుల్లో భయం పొగొట్టి ఆత్మవిశ్వాసం నింపడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివిధ కంపెనీలకు చెందిన స్టార్టప్ ప్రతినిధులు స్పష్టంచేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో టెక్విప్ నిధులతో ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన కేబీహెచ్‌ఎస్, నైపుణ్య టెక్నాలజీ సొల్యూషన్, సదానందా, టెక్నాలజీ, అక్షయ ఆటోమిషన్ కంపెనీల సీఈవోలు శ్రీనివాస్, శ్యాంనరేష్, కృష్ణకిషోర్, జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో విద్యార్థులు భయం విడనాడాలన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిధులు కోరారు. అనంతరం ప్రతినిధులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె.బి.మధుసాహు, టెక్విప్ సమన్వయ కర్త డి.విష్ణుమూర్తి, డీన్ ఫిన్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ ఇన్చార్జి బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య విద్యపై అవగాహన సదస్సు
జమ్ము (విజయనగరం రూరల్) : మున్సిపాలిటీ పరిధిలోని జమ్ము ప్రాథమిక పాఠశాలలో స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యవిద్యపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకోడు పీహెచ్సీ వైద్య పర్యవేక్షకుడు కేబీవీ సత్యనారాయణ వేసవిలో అంటువ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శశికళ, మంత్రి రామ్మోహనరావు, అనురాధ, సీఆర్పీ కృష్ణ, తిరుమల నర్సింగ్‌హోమ్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వైద్యులు సహకరించాలి
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(అర్బన్) : జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీలు, పీఎంపీలు సహకరించాలని జేసీ–2 రాజ్‌కుమార్ కోరారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం దోమలపై దండ యాత్ర– పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి జ్వరం వచ్చినా గ్రామాల్లో మొదట పీఎంపీ, ఆర్ఎంపీ దగ్గరకు ప్రజలు వైద్యం కోసం వెళ్తారన్నారు. ఎలీసా పరీక్ష చేయకుండా, లక్షణాలను బట్టి డెంగీ అని నిర్ధారించకూడదని సూచించారు. దోమలు నివారణకు, పరిసరాల పరిశుభ్రత కోసం వైద్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సహకరిస్తునాన్నారని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, పీఎంపీ అధ్యక్ష, కార్యదర్శిలు శాఖవరపు వేణుగోపాల్, షేక్ సత్తార్, తెలుగునాడు పారామెడిక్స్ అసోసియేషన్ నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు. -
'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు'
విజయవాడ: ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులతో సీఐడీ శనివారం అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను సీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురి కావొద్దని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో రూ. 2,670 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, తర్వలోనే అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు. -
ఏఈ పరీక్షలపై అవగాహన సదస్సు
మధురానగర్ : ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ అకాడమీలో ఏపీపీఎస్సీ భర్తీచేసే ఏఇఇ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల సమాచారంపై ఈనెల 28వ తేదీ ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ బీ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు అంశాలపై సుశిక్షితులైన సిబ్బంది తెలియచేస్తారన్నారు. సాయంత్రం 5గంటలనుంచి 7గంటలవరకు జరుగుతుందన్నారు. బీటెక్, సివిల్, మెకానికల్ పట్టభద్రులందరూ హాజరు కావచ్చని తెలిపారు. -
24న వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు
వికారాబాద్ రూరల్: శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్ శాఖ ఆధ్వర్యలో ఈనెల 24న స్థానిక జ్ఞానకేంద్రంలో సేవాసంస్థలోని సేవాదళ్ సభ్యులకు, ఇతర పౌరులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు సేవాసమితి కన్వీనర్ డా.కె సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సులో చర్చనీయ అంశాల్లో భాగంగా శ్రీ సత్యసాయి అవతార తత్వం ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో సేవాసంస్థల పాత్ర, పట్టిష్టవంతమైన బాలవికాస్ నిర్మాణంలో భావినాయకుల పాత్ర, భక్తులు, కార్యకర్తలు, సత్యసాయి సంస్థలో కన్వీనర్ పాత్ర, సత్యసాయి అవతారంలో స్త్రీల పాత అనే అంశాలపై పున్నయ్య, ఫణీంద్రకుమార్, ప్రకాశ్‌రావు, వీఎస్ఆర్కే ప్రసాద్, సక్కుబాయి చంద్రకళ మాటాట్లాడుతారని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక విభాగంలో భాగంగా జిల్లాలో వ్యక్తిత్వ వికాస సదస్సుకు ప్రముఖ విద్యావేత్త హారతీద్వారకనాథ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. విద్యావేత్తలు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బరువు కాదు.. బాధ్యత
♦ హెల్మెట్ వినియోగం తప్పనిసరి ♦ యువత బాధ్యతతో మెలగాలి ♦ ‘సాక్షి’ అవగాహన సదస్సులో డీటీసీ బసిరెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి ‘సెల్ ఫోన్ స్క్రీన్‌పై చిన్న గీత పడకూడదని స్క్రీన్ గార్డు.. కిందపడితే ఎక్కడ చెడిపోతుందోనని ప్లిప్ కవర్ వేయించుకోవడంపై నేటి యువత ఎంతో శ్రద్ధ చూపుతోంది. బైక్‌పై వెళ్తున్నప్పుడు కిందపడితే శరీరంలో ప్రధాన భాగమైన తలకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏమిటన్న దానిపై ఇసుమంత జాగ్రత్త తీసుకోవడం లేదు. ప్రాణం కంటే సెల్ ఫోన్ విలువైందా..? పిల్లలు ప్రయోజకులై పేరు తెస్తారని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు.. అడిగిందల్లా కాదనకుండా అప్పు చేసైనా కొనిస్తారు. అలాంటి వారి ఆశలపై నీళ్లు చ ల్లి కడుపు కోత మిగల్చ కూడదు. బైక్‌లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురై వృుతి చెందిన వారిలో అత్యధికులు విద్యార్థులు కావడం ఆందోళన కలిగిస్తోంది. కన్నవారి కలలను నిజం చేయడం కోసమైనా బైక్‌పై వెళ్తున్నప్పుడు భారంగా కాక బాధ్యతగా భావించి హెల్మెట్ పెట్టుకోవాలి’ అని కడప నగర శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. వైవీయూ/ఎడ్యుకేషన్ :రహదారి భద్రత, వ్యక్తిగత భద్రత అన్నవి మనందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని కందుల గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘రహదారి భద్రత - హెల్మెట్ వినియోగం’ అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. బసిరెడ్డి విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే సెల్‌ఫోన్‌కు గీతలు పడకుండా స్క్రీన్గార్డ్ వేయించుకుంటారని, ఎంతో విలువైన తలకు హెల్మెట్ ధరించడానికి ఎందుకు ఆలోచిస్తారని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 943 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 336 మంది చనిపోయారన్నారు. ఇందులో 256 ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటుచేసుకోగా 80 మంది మరణించారన్నారు. వీరిలో అధికశాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలనే తలకు గాయం కావడం ద్వారా మరణించారన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల పిల్లలు సైతం బైక్‌రైడింగ్‌లో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. విద్యార్థులకు చదువుకునే రోజుల్లో వాహనాలపై మోజు ఉంటుందని అయితే ఆ మోజులో ప్రాణాలను ఫణంగా పెట్టే విన్యాసాలు తగవని పేర్కొన్నారు. అటువంటి విన్యాసాల ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే మీ తల్లిదండ్రుల పడే ఆవేదనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 18 సంవత్సరాలలోపు వారు ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకూడదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు నేరుగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో పాటు పరీక్షకు హాజరై లెసైన్స్‌లు పొందాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగసాధనలో సఫలం కావాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమానికి సాక్షి బ్యూరో ఇన్చార్జి ఎం.బాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా. సాక్షి బ్రాంచ్ మేనేజర్ సుప్రియ, ఎడిషన్ ఇన్చార్జి రంగాచార్యులు, కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. వి.ఎస్.ఎస్. మూర్తి, ఖాజాపీర్లు ప్రసంగించారు. అంతకు ముందు రవాణ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లు, రహదారి భద్రతపై రూపొందించిన గీతాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ బి.వి. నాగిరెడ్డి, కళాశాల పీడీ నారాయణ, ప్రకాష్‌రెడ్డి, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భారీ కాయంతో.. భారీ మూల్యం..
‘ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ’ అనే అంశాలపై.. ‘సాక్షి’, జీఎస్ఎల్ ఆస్పత్రుల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ హోటల్లో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి ప్రకటనల విభాగం ఏజీఎం రంగనాథ్ సదస్సును ప్రారంభించారు. * ఒకే వేదికపై 12 విభాగాల వైద్య నిపుణుల సలహాలు * ‘సాక్షి’, జీఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ‘సాక్షి’, జీఎస్ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ అనే అంశాలపై రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి అడ్వర్టైజ్మెంట్ ఏజీఎమ్ రంగనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఊబకాయంతో అనేక సమస్యలు వచ్చాయని, తనకు బీపీ, షుగర్ మెండుగా ఉండడంతో అధికబరువు తగ్గించుకునే యోచనపై అయిష్టంగానే ఉండేవాడినన్నారు. దీనికి కారణం బేరియాట్రిక్ సర్జరీపై లేనిపోని అపోహాలు, అనుమానాలేనన్నారు. అయితే కొంతమంది వైద్యనిపుణుల సూచనలతో ఈ సర్జరీ చేయించుకున్నానని, దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోందన్నారు. తిరిగి తన జీవితం నూతనత్వంలోకి వచ్చినట్టుందన్నారు. జీఎఎస్‌ఎల్ వ్యవస్థాపకులు గన్ని భాస్కరరావు మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీ అంటే చాలామందిలో ఎన్నో అపోహలున్నాయని, దీనిని పోగొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఇది చాలా ఖరీదైనదని, చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయనే ధోరణిలో ప్రజలున్నారన్నారు. అవన్నీ అపోహలేనన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సర్జరీ రూ.10 లక్షలపైనే ఉంటుందని, తాము కేవలం రూ.2 లక్షలకు అందిస్తున్నామని అన్నారు. ఈ సర్జరీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) 40 ఉన్నవారికి, ఎక్సర్సైజులు, ఆహారం మార్పుతో పాటు బరువు తగ్గే అన్నిరకాల వ్యాయామాలు చేసినా ఫలితం లేనివారికి మంచి ఫలితాలిస్తుందన్నారు. సదస్సుకు వచ్చిన వారికి ఉచితంగా ఆర్బీఎస్, ఎఫ్బీఎస్, బీఎంఐ పరీక్షలతో పాటు డైట్ కంట్రోల్ కౌన్సెలింగ్, వెయిట్ కంట్రోల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహీధర్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ హరిబాబు, డాక్టర్ సోమనాథ్ దాస్, సాక్షి అడ్వర్టైజ్మెంట్ ఆర్ఎం కొండలరావు, యాడ్ ఆఫీసర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వంశపారంపర్య వ్యాధులను తగ్గించుకోవచ్చు వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉన్నపుడు తమకూ ఆ వ్యాధి సోకుతుందనే భయంతోనే ఆ కుటుంబీకులు బతుకుతారు. అయితే ఈ సర్జరీతో ఆ భయాన్ని చాలావరకూ పొగొట్టుకోవచ్చు. దాని బారినపడే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఊబకాయం కేన్సర్ ఎందుకువస్తుందనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. - డాక్టర్ ఆనందరావు, కేన్సర్ వైద్యనిపుణుడు నాలో ఉన్న భయం పోయింది ఈ అవగాహన సదస్సుతో అనేక విషయాలు తెలిశాయి. నాలో ఉన్న భయం పోయింది. కేన్సర్, వంశపారంపర్యం అనే అంశంపై వైద్య నిపుణులు చక్కని సూచనలతో కూడిన సలహాలను ఇచ్చారు. ఇప్పటివరకూ ఏవేవో బ్యూటీసెంటర్లు, డైట్కంట్రోల్ ట్రీట్మెంట్లు తీసుకున్నా. ఫలితం లేదు. ఈ సర్జరీ ఫలితాలు బాగా తెలుసుకున్నాను. - యు.మంగాదేవి, తాళ్లూరు ఒకే వేదికపై ఇంతమంది డాక్టర్లు మనకున్న సమస్యలను తెలుసుకోవాలంటే అనేకమంది డాక్టర్లను కలవాలి. అయితే ‘సాక్షి, జీఎఎస్‌ఎల్ ఆసుపత్రి వారు ఒకే వేదికపై 12 విభాగాల వైద్యులను తీసుకువచ్చారు. ఇది చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మహిళలకు ఈ చికిత్సపై రాయితీలు అందిస్తే బాగుంటుంది. - ప్రియాహాసిని, రాజమహేంద్రవరం ఊబకాయం తగ్గించుకుంటే సమస్యలు దూరం ఊబకాయం తగ్గించుకుంటే శరీరంలో ఉత్పన్నమయ్యే సమస్యలు దూరమౌతాయి. అధికబరువు వల్ల ఎముక సంబంధ సమస్యలతో పాటు కీళ్ల వ్యాధులు వస్తాయి, వీటినుంచి ఎదురయ్యే జబ్బులకు అధిక బరువు తగ్గించుకోవడంతో చెక్ పెట్టవచ్చు. వంశపారంపర్యంగా ఉన్న జబ్బుల నుంచి సైతం ఈ చికిత్సతో కాపాడుకునే అవకాశం ఉంది. - డాక్టర్ సుధీర్శాండిల్య, అధికబరువు, కీళ్ల వ్యాధులు వైద్య నిపుణులు వ్యాధుల పుట్టిల్లు ఊబకాయం శరీర బరువు పెరిగిందంటే అనేక సమస్యలకు మనమే దారిచూపించినట్టు. దీన్ని ఆదిలోనే ఆపాలి. చాలామంది ఎన్నో రకాల పద్ధతులు ఉపయోగించి దీన్ని అధిగమించేందుకు పలు ప్రయత్నాలు చేసి విఫలమైన కేసులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ బేరియాట్రిక్ సర్జరీ మంచి అవకాశం. ఈ సర్జరీ తర్వాత అనేక రకాల జబ్బులు, సమస్యల నుంచి బయటపడవచ్చు. - డాక్టర్ సమీర్ రంజన్‌నాయక్ ముందు సంకల్పం ఉండాలి ఏ పనైనా ప్రారంభించాలంటే ముందు సంకల్పం ఉండాలి. ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. చాలా బాగుంది. దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. చికిత్సవల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగాం. - ఆర్.నాగలక్ష్మి, కొవ్వూరు ఇటువంటి సదస్సులు ఇంకా జరగాలి ప్రజలకు ఉపయోగపడే ఈ సదస్సులు మరిన్ని జరగాలి. మంచి కార్యక్రమం. ఇది జనంలోకి వెళితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అపోహలు తొలగిపోయాయి. బేరియాట్రిక్ సర్జరీ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంది. - ఎస్.రాంబాబు, రాజమహేంద్రవరం -
తుళ్లూరు సదస్సు బహిష్కరణ
-
తుళ్లూరు సదస్సు బహిష్కరణ
గ్రామ కంఠాలు, ‘అసైన్డ్’ విషయం తేల్చండి మాస్టర్ ప్లాన్ సంగతి తర్వాత చుద్దాం అవగాహన సదస్సును అడ్డుకున్న రైతులు, స్థానికులు తుళ్లూరు : గ్రామకంఠాల విషయంలో కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న రైతులు గురువారం నిర్వహించిన మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సులో ఆందోళనకు దిగారు. ప్లానింగ్ కమిషన్ డెరైక్టర్లు, ల్యాండ్ డెరైక్టర్లు ముందుగా వచ్చి మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించబోగా, ఒక్కసారిగా రైతులు మాస్టర్ ప్లాన్ ముందు సీఆర్డీఏ తేల్చాల్సిన గ్రామ కంఠాల విషయం, అసైన్డ్ భూముల విషయం, అర్హులైనవారికి అందాల్సిన రూ. 2,500 పింఛను సమస్యలను పరిష్కరించిన అనంతరమే మాస్టర్ ప్లాన్‌పై సదస్సు నిర్వహించాలని పట్టుబట్టారు. గ్రామ కంఠాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందని రైతులు మండిపడ్డారు. ఒక సందర్భంలో గ్రామంలోని కొందరు పెద్ద రైతులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి గ్రామ కంఠాలను వారు అనుకున్న విధంగా స్థలాలు కేటాయించి, భూ సమీకరణకు ఇచ్చిన రైతులు మాత్రం ఎకరాకు పది సెంట్లు మాత్రమే స్థలం ఇవ్వడంపై ఇరువర్గాల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన రైతు పెద్దలు రైతాంగం విషయంలో మాట్లాడవద్దని, దీని ఫైల్ సిద్ధం చేసిన అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకు సదస్సును బహిష్కరిస్తున్నామని సభను నిలిపివేశారు. రాజధాని లేకపోరుునా పర్వాలేదు.. ఇదే క్రమంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎక్స్‌ప్రెస్ వేలో ఇళ్లు తొలగించాల్సిన సర్వే నంబర్లకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మాకు రాజధాని లేకపోయినా పరవాలేదు, మా ఇళ్లను తొలగించవద్దంటూ ఆందోళన చేశారు. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ ఒకేతాటిపై ఉన్నామని, అందరికీ న్యాయం చేసేలా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తీసుకురావాలని సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. అనంతరం జేసీ, కమిషనర్ సమావేశానికి వస్తున్నారని, ప్రకటించినప్పటికీ సీఆర్డీఏ నిర్ణయించిన సమయంలో రాకుండా రైతులు వెళ్లిన తర్వాత ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి ఏం చేస్తారంటూ , అవగాహన సదస్సుకు రావాల్సిన అవసరం లేదంటూ గ్రామ రైతులు అనౌన్స్ చేశారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై వారంలో పరిష్కారం భూ సమీకరణలో భాగంగా సీఆర్డీఏకు భూములు ఇచ్చిన 29 గ్రామల విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై వారం రోజుల్లో పరిష్కారం చూపుతామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన రైతులకు పైవిధంగా హామీ ఇచ్చారు. రైతాంగానికి సంబంధించి హెల్త్ కార్డుల పంపిణీ విషయం కూడా త్వరలోఅమలు జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. రైతు కమిటీ నాయకులతో సమావేశం విషయం తెలుసుకున్న సీఆర్డీఏ కమిషర్ శ్రీకాంత్ తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో రైతు కమిటీ నాయకులు, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతుల అన్ని డిమాండ్లకు అంగీకరిస్తూ, గ్రామ కంఠాల ఫైల్ రైతులు ఆశించిన విధంగా సిద్ధం చేసి రెండు రోజుల్లో బహిర్గం చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా ఇళ్లు కోల్పోనున్న ప్రజలను పిలిపించి వారితో చర్చించి వారి ఇష్టాలకనుగుణంగా మాట్లాడుతామని, అనంతరమే అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలపారు. జేసీ చెరుకూరి శ్రీధర్, ల్యాండ్ డెరైక్టర్ చెన్నకేశవులు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, ఐటీ డెరైక్టర్ ప్రభాకర్‌రెడ్డి, రైతు నేతలు దామినేని శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్‌కుమార్, జొన్నలగడ్డ రవి, జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర పాల్గొన్నారు. -
జరీబు రైతు గరం..గరం..
భూములు ఇచ్చిన చోటే స్థలాలు ఇవ్వాలి.. లేకుంటే రాజధాని నిర్మాణ పనులను సాగనివ్వం అప్పుడు ఇంటింటికీ తిరిగిన మంత్రులు ముఖం చాటేశారు.. ఇప్పుడు వస్తున్న అధికారుల హామీలను ఎలా నమ్మాలి.. ప్రభుత్వ వైఖరిపై మండిపడిన రైతు సంఘం నేతలు ఉద్దండ్రాయునిపాలెంలో సీఆర్డీఏ కమిషనర్‌పై ప్రశ్నలు గుప్పించిన గ్రామస్తులు, మహిళలు గుంటూరు : రాజధాని మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సుల్లో అధికారులు ఎన్ని మాయమాటలు చెబుతున్నా, జరీబు రైతులు వెనుకంజ వేయడం లేదు. తాము ఏ గ్రామంలో భూములు ఇచ్చామో అక్కడే స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగనిచ్చేది లేదంటున్నారు. అవసరమైతే రాజధానిని వేరే ప్రాంతానికి తరలించుకోండని అధికారులను హెచ్చరిస్తున్నారు. అవగాహన సదస్సులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజధాని భూ సమీకరణకు సహకరించిన టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరుకు ఆవేదన చెందుతున్నారు. తమ మాటలు నమ్మి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం రోజుకో మాట చెబుతుంటే, రైతులకు సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, గ్రామాల్లో తిరగలేకపోతున్నామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో రైతులు తిరుగుబాటు చేయడంతో సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ ఆదివారం తుళ్ళూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, రైతుల సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఉద్దండ్రాయునిపాలెంలో రైతు సంఘనేత అనుమోలు సత్యనారాయణ, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రలు ఫ్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు ఇప్పుడు అవగాహన కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, అప్పుడు జరీబు ప్రాంతంలోనే స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనిపించడం లేదని, ఇప్పుడు అధికారులు ఇచ్చే హామీలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రతీ అంశానికి చట్టబద్ధత కల్పించాలని, మాస్టర్‌ప్లాన్‌ను తెలుగు లోకి అనువదించి అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రోడ్ గ్రిడ్ ఏర్పాటుతో అనేక గ్రామాల్లోని ఇళ్లు, నివేశన స్థలాలు పోయే పరిస్థితి ఉంటే, వాటికి సమాధానం చెప్పకుండా ఇలా ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కార్యక్రమాన్ని త్వరగా ముగించి వెళ్ళిపోయారు. -
తిరుగుబాటు
రాజధాని మాస్టర్ ప్లాన్‌ను తిప్పికొట్టిన రైతులు తుళ్లూరు, మంగళగిరి మండలాల అవగాహన సదస్సుల్లో అధికారులపై మండిపాటు గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూములు, రహదారులపై స్పష్టతఇవ్వాలని డిమాండ్ అమరావతి మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో అధికారులకు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ‘మా సందేహాలు నివృత్తి చేసిన తరువాతనే సదస్సులు కొనసాగించండి...లేకుంటే తిరుగుముఖం పట్టండి’ అని రైతులు మండిపడుతున్నారు. గుంటూరు : రాజధాని గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సులు ఘర్షణ వాతావరణంలో జరుగుతుండడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. భూ సమీకరణ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు నచ్చచెప్పి, 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ తరువాత రైతుల సందేహాలను తీర్చకుండా, అవగాహన సదస్సులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం పట్ల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 12 నుంచి గ్రామాల వారీగా సదస్సులు... రాజధాని నిర్మాణంపై సింగపూర్ కంపెనీలు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి డిసెంబరు నెలాఖరులో ప్రభుత్వానికి ఇచ్చాయి. ఈ ప్లాన్‌పై ప్రజల అభ్యంతరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్లాన్ వివరాలను వెబ్సైట్లోనూ, సీఆర్డీఏ కార్యాలయాల్లో పరిశీలన నిమిత్తం ఏర్పాటు చేసింది.మాస్టర్‌ప్లాన్ ఆంగ్లభాషలో ఉండడం, ఆ వివరాలు పూర్తిగా రైతులకు అర్థం కాకపోవడంతో జిల్లా యంత్రాంగం రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 12 నుంచి గ్రామాల వారీగా జరిగే సదస్సుల వివరాల షెడ్యూలు విడుదల చేసింది. ఆ మేరకు మంగళవారం తుళ్లూరు మండలం నేలపాడు, శాఖమూరు, అనంతవరం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో సిబ్బంది, అధికారులతో కూడిన రెండు బృందాలు పర్యటించాయి. అయితే గ్రామ కంఠాలు, నిమ్మతోటల భూములను ఏ కేటగిరీ కింద పరిగణించాలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత నీయలేదు. అసైన్డ్భూములు, లంక భూములు, రాజధాని గ్రామాల్లో ఆరు లైన్ల రహదారుల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టతనీయలేదు. వీటిపై కొందరు రైతులు తమ సందేహాలను వ్యక్తం చేశారు. మరి కొంత మంది రైతులు తాము ఇచ్చిన భూములకు స్థలాలు ఎక్కడ ఇస్తారు? ఇచ్చిన స్థలాల్లో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది? వంటి ముఖ్య ప్రశ్నలను లేవనెత్తారు. వాటికీ అధికారులు సమాధానం చెప్పలేకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా స్పష్టత లేని అంశాలపై ప్రభుత్వ నిర్ణయం వెంటనే వెలువడాలని, లేకుంటే సదస్సులు కొనసాగనీయమని రైతులు హెచ్చరించారు. నీరుకొండ, కురగల్లులోనూ ఇంతే.. మంగళగిరి మండలం నీరుకొండ, కురగల్లు గ్రామాల్లోని రైతులు బుధవారం అవగాహన సదస్సులను నిలువరించడంతో అధికారులు తిరుగుముఖం పట్టారు. గ్రామ కంఠాలు, అసైన్డు భూములు, రాజధానిలో రహదారుల నిర్మాణం విషయాలను తేల్చిన తరువాతే సదస్సులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అవగాహన కార్యక్రమాలు ప్రస్తుతం తమకు అవసరం లేదని, రాజధాని మాస్టర్ ప్లాన్ అంతా తెలుసని, సమస్యలు పరిష్కరిస్తేనే కార్యక్రమం కొనసాగుతుందంటూ అధికారులను హెచ్చరించారు. దీంతో అధికారులు సదస్సులు నిర్వహించకుండానే వెనుదిరిగారు. -
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
120 ఆటోల సీజ్ డ్రైవర్లకు అవగాహన సదస్సు పట్నంబజారు ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 120 ఆటోలను పోలీసు పేరెడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈస్ట్, వెస్ట్ సిఐలు టి. మురళీకృష్ణ, యు. శోభన్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధాన కూడళ్ళలో తనిఖీలు నిర్వహించారు. లెసైన్సులు, ధృవీకరణ పత్రాలు సరిగా లేని ఆటోలను సీజ్ చేసి పేరెడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. అనంతర వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లెసైన్సులు కలిగి ఉండాలన్నారు. ఒకసారి దొరికిన ఆటో డ్రైవర్ మరోమారు దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకోవటంతో పాటు కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. ఇక తనిఖీలు ముమ్మరం ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవటం, మద్యం సేవించి వాహనాలు నడపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకపై తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఈస్ట్ ట్రాఫిక్ సిఐ టి. మురళీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ స్టేడియం, మార్కెట్ సెంటర్, హిందూ కళాశాల కూడలి వద్ద ఆటో సంచారం అధికంగా ఉందని, నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వెస్ట్ ట్రాఫిక్ సిఐ యు. శోభన్‌బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై విద్యార్థులు ముగ్గురు వరకు ఎక్కి తిరుగుతున్నారని, వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటో వాలాలకు జరిమానాలు విధించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు సూర్యనారాయణ, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, సాయిబాబా, బుచ్చిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోనలో సీన్ రిపీట్!
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చుక్కెదురు.. బుద్దాలపాలెంలో కుర్చీలు విసిరేసిన గ్రామస్థులు సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది. బుద్దాలపాలెంలో భూసేకరణపై మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు చుక్కెదురైంది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కొల్లు మాట్లాడుతూ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ చేస్తున్నామని, భూములు సేకరిస్తామే తప్ప గ్రామాలను ఖాళీ చేయించబోమని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ.. ‘మాతో సంప్రదింపులు జరపకుండా మీ ఇష్టానుసారం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేది లేదు. అప్పటి వరకు ఈ సమావేశంలో మాట్లాడవద్దు’ అంటూ అడ్డుతగిలారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాతే మీరు గ్రామానికి రావాలి. అప్పటివరకు మీ మాటలు వినేది లేదు. తక్షణమే ఈ సభను రద్దు చేయాలి’ అని గ్రామస్థులు నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడబోతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు వారి ఎదురుగా ఉన్న కుర్చీలను పైకి విసిరేశారు. సమావేశం జరిగే అవకాశం లేకపోవటంతో మంత్రి, ఎంపీ వెనుదిరిగారు.