'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు'
విజయవాడ: ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులతో సీఐడీ శనివారం అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను సీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురి కావొద్దని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో రూ. 2,670 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, తర్వలోనే అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు.