గ్రామ కంఠాలు, ‘అసైన్డ్’ విషయం తేల్చండి
మాస్టర్ ప్లాన్ సంగతి తర్వాత చుద్దాం
అవగాహన సదస్సును అడ్డుకున్న రైతులు, స్థానికులు
తుళ్లూరు : గ్రామకంఠాల విషయంలో కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న రైతులు గురువారం నిర్వహించిన మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సులో ఆందోళనకు దిగారు. ప్లానింగ్ కమిషన్ డెరైక్టర్లు, ల్యాండ్ డెరైక్టర్లు ముందుగా వచ్చి మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించబోగా, ఒక్కసారిగా రైతులు మాస్టర్ ప్లాన్ ముందు సీఆర్‌డీఏ తేల్చాల్సిన గ్రామ కంఠాల విషయం, అసైన్డ్ భూముల విషయం, అర్హులైనవారికి అందాల్సిన రూ. 2,500 పింఛను సమస్యలను పరిష్కరించిన అనంతరమే మాస్టర్ ప్లాన్‌పై సదస్సు నిర్వహించాలని పట్టుబట్టారు. గ్రామ కంఠాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందని రైతులు మండిపడ్డారు. ఒక సందర్భంలో గ్రామంలోని కొందరు పెద్ద రైతులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి గ్రామ కంఠాలను వారు అనుకున్న విధంగా స్థలాలు కేటాయించి, భూ సమీకరణకు ఇచ్చిన రైతులు మాత్రం ఎకరాకు పది సెంట్లు మాత్రమే స్థలం ఇవ్వడంపై ఇరువర్గాల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన రైతు పెద్దలు రైతాంగం విషయంలో మాట్లాడవద్దని, దీని ఫైల్ సిద్ధం చేసిన అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకు సదస్సును బహిష్కరిస్తున్నామని సభను నిలిపివేశారు.
రాజధాని లేకపోరుునా పర్వాలేదు..
ఇదే క్రమంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎక్స్‌ప్రెస్ వేలో ఇళ్లు తొలగించాల్సిన సర్వే నంబర్లకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మాకు రాజధాని లేకపోయినా పరవాలేదు, మా ఇళ్లను తొలగించవద్దంటూ ఆందోళన చేశారు. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ ఒకేతాటిపై ఉన్నామని, అందరికీ న్యాయం చేసేలా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తీసుకురావాలని సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. అనంతరం జేసీ, కమిషనర్ సమావేశానికి వస్తున్నారని, ప్రకటించినప్పటికీ సీఆర్‌డీఏ నిర్ణయించిన సమయంలో రాకుండా రైతులు వెళ్లిన తర్వాత ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి ఏం చేస్తారంటూ , అవగాహన సదస్సుకు రావాల్సిన అవసరం లేదంటూ గ్రామ రైతులు అనౌన్స్ చేశారు.
ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై వారంలో పరిష్కారం
భూ సమీకరణలో భాగంగా సీఆర్‌డీఏకు భూములు ఇచ్చిన 29 గ్రామల విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై వారం రోజుల్లో పరిష్కారం చూపుతామని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన రైతులకు పైవిధంగా హామీ ఇచ్చారు. రైతాంగానికి సంబంధించి హెల్త్ కార్డుల పంపిణీ విషయం కూడా త్వరలోఅమలు జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.
రైతు కమిటీ నాయకులతో సమావేశం
విషయం తెలుసుకున్న సీఆర్‌డీఏ కమిషర్ శ్రీకాంత్ తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో రైతు కమిటీ నాయకులు, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతుల అన్ని డిమాండ్‌లకు అంగీకరిస్తూ, గ్రామ కంఠాల ఫైల్ రైతులు ఆశించిన విధంగా సిద్ధం చేసి రెండు రోజుల్లో బహిర్గం చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా ఇళ్లు కోల్పోనున్న ప్రజలను పిలిపించి వారితో చర్చించి వారి ఇష్టాలకనుగుణంగా మాట్లాడుతామని, అనంతరమే అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలపారు. జేసీ చెరుకూరి శ్రీధర్, ల్యాండ్ డెరైక్టర్ చెన్నకేశవులు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, ఐటీ డెరైక్టర్ ప్రభాకర్‌రెడ్డి, రైతు నేతలు దామినేని శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్‌కుమార్, జొన్నలగడ్డ రవి, జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర పాల్గొన్నారు.
తుళ్లూరు సదస్సు బహిష్కరణ
Published Fri, Jan 22 2016 2:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement