master plan
-
HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’
సాక్షి, హైదరాబాద్: 👉‘నాగోల్ నుంచి కుంట్లూర్ వరకు రెండువందల అడుగుల వెడల్పుతో రోడ్డు ఉన్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. రోడ్డు వస్తుందో, రాదో తెలియదు కానీ మా స్థలం రోడ్డు మధ్యలో ఉన్నట్లు చెప్పి ఎల్ఆర్ఎస్ నిరాకరించారు. ఏళ్లు గడిచాయి. అక్కడ రోడ్డు నిర్మించలేదు. అలాగని మాస్టర్‌ప్లాన్ సవరించలేదు. నాతో పాటు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయాను’ నాగోల్‌కు చెందిన రాంరెడ్డి ఆందోళన ఇది. తప్పుల తడకలాంటి హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ కారణంగా ఆ స్థలాన్ని అమ్ముకోలేక, ఎలాంటి నిర్మాణం చేపట్టలేక మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నారాయన. 👉‘తుర్కయంజాల్ సమీపంలో ఒక వ్యక్తి గతంలో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో 150 ఫీట్ల రోడ్డు పోతున్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌లో ఉందన్నారు. కానీ.. ఆ ప్లాట్ పక్కనే ఉన్న మరో ప్లాట్‌కు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఇదే అంశంపై సదరు బాధితుడు హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘మాస్టర్‌ప్లాన్ ఒక్కటే తమకు ప్రామాణికం’ అని సెలవిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి పరిష్కారం లభించలేదు.వేలాది తప్పులు.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 2031 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2013 బృహత్ ప్రణాళికను రూపొందించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ, ఎంసీహెచ్, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ అథారిటీ, హెచ్ఎండీఏ ప్రణాళాకలన్నింటినీ కలిపి బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కానీ.. అప్పట్లో దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయకపోవడంతో అంతులేని తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు లేని చోట ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు మాస్టర్ ప్లాన్‌లో నమోదైంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని వందలాది గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లు, ఊళ్లు మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అయిదు మాస్టర్ప్లాన్లను సమన్వయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 3000కు పైగా తప్పులు ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. దీంతో 50 వేల మందికి పైగా బాధితులు ఎల్ఆర్ఎస్ను తీసుకొనే అవకాశం కోల్పోయారు. ఆ తప్పులు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలింది నిరాశే.. సమగ్ర మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నష్టపోయిన బాధితులకు ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ‘ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, మాస్టర్‌ప్లాన్‌లో తప్పులను సవరిస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిరాశా నిస్పృహలే మిగులుతున్నాయి’అని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు 2031 మాస్టర్ ప్లాన్‌ను సవరించి కొత్తది రూపొందించేందుకు అయిదారేళ్లుగా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. మాస్టర్‌ప్లాన్–2041 రానుందన్నారు. ఆ తర్వాత ట్రిపుల్ వన్ జీఓలోని ప్రాంతాలన్నింటినీ కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని 7,200 చ.కి.మీలకు వర్తించేలా మహా మెగా మాస్టర్‌ప్లాన్ అన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రిపుల్ ఆర్ వరకు వర్తించేలా సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని భావిస్తోంది. మాస్టర్‌ప్లాన్– 31 కారణంగా నష్టపోయిన బాధితులు దశాబ్ద కాలంగా ఎలాంటి పరిష్కారం లభించక పడిగాపులు కాస్తూనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 2050 బృహత్ ప్రణాళిక.. తెలంగాణ మూడు భాగాలుగా విభజించి 2050 వరకు దశలవారీగా చేపట్టాల్సిన అభివృద్ధిపై బృహత్ ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న భూభాగాన్ని సబర్బన్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రీజినల్ రింగ్‌రోడ్డు నుంచి ఉండే మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్‌గా పరిగణిస్తారు. ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధి ప్రస్తుతం ఉన్న 7,200 చ.కి.మీ నుంచి సుమారు 10 వేల చదరపు కి.మీ వరకు పెరగనుంది. ఈ మొత్తం భూభాగానికి వర్తించేవిధంగా ‘మెగా మాస్టర్ ప్లాన్ –2050’ని రూపొందిస్తారు. ఇందులో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర ప్రజా రవాణా సదుపాయాల ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. -
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్.. రూ.17,212 కోట్ల అంచనా వ్యయం!
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా మురుగు నీరు చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.17,212.69 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ ‘సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం 2.0 కింద మాస్టర్ ప్లాన్‌ను చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించింది. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు నీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది. శివారుతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో సైతం సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేకుండాపోయింది. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన మురుగు కాల్వలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం 9,769 కిలో మీటర్లు మాత్రమే పైపులైన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 2,656 కి.మీ, ఓఆర్ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా.. పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. దీంతో సమగ్ర కార్యాచరణలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. 80 శాతం మురుగు.. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీలో చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల పొడవునా మురుగు కలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలు ఉండగా, మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మురుగు నీరు మూసీలో చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. అందులో భాగంగానే పైపులైన్ నెట్వర్క్ వ్యవస్థ విస్తరణతో పాటు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచినట్లు తెలుస్తోంది.7,034 కి.మీ సీవరేజీ నెట్వర్క్.. హైదరాబాద్‌తో పాటు శివారు, అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన స్థానిక సంస్ధల (యూఎల్బీ) పరిధిలో సుమారు 7,034 కి.మీ పొడవున మురుగునీటి పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మొత్తమ్మీద ఓఆర్ఆర్ యూఎల్బీల పరిధిలో 27 పురపాలక సంఘాలను కలుపు కొని సుమారు 4,378 కి.మీ, జీహెచ్ఎంసీ పరిధి లోని శివారు, కోర్ సిటీ పరిధిని కలుపుకొని దాదా పు 2,656 కి.మీ పొడవున సీవరేజీ నెట్వర్క్ పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీలోని శివారు పరిధిలో మూడు ప్యాకేజీల్లో తొమ్మిది సర్కిల్స్ కలుపుకొని 2,232 కి.మీ, కోర్‌సిటీ పరిధిలోని 4 జోన్లలో 424 కి.మీ పైపులైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రూ.4 వేల కోట్లతో సీవరేజీ ప్లాంట్లు.. మరోవైపు మూసీపై మురుగు నీటిశుద్ధి కోసం సుమారు 62 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర సర్కారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రాజెక్టును సైతం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటికే మూడు ప్యాకేజీల్లో మొత్తం 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మాణాల ద్వారా సుమారు 1259.50 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల అమృత్ పథకం కింద 39 ఎస్టీపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా మూసీలో పూర్తిగా శుద్ధి చేసిన జలాలనే వదిలేలా మరికొన్ని ఎస్టీపీల నిర్మాణాలకు ప్రతిపాదించింది. చదవండి: హైదరాబాద్‌లో మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి? -
60 రోడ్లు.. 1,712 కిలోమీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. 200 అడుగుల వెడల్పుతో.. రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్‌గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్‌లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది. లీ అసోసియేట్స్‌కు 10 రేడియల్ రోడ్లు ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. మూడు దశల్లో రేడియల్ రోడ్ల స్వరూపమిదీ: ఫేజ్–1: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ. » 5 రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ గుండా సాగుతాయి. » ఓఆర్ఆర్తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు–17 నుంచి కంకాల్ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లే మెదక్, నాగ్‌పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్ సాగుతుంది.ఫేజ్–2: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ. » ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంటుంది. ళీ ఇక ఆదిబట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్‌పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి.. మునీరాబాద్ నుంచి రంగంపేట.. ఓఆర్ఆర్ ఇంద్రజీత్ మెహతా నుంచి తియల్పూర్.. ఎగ్జిట్ నంబర్–4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్ నంబర్–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్.. జన్వాడ ఎస్‌ఆర్‌ఆర్‌సీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్.. ఎగ్జిట్ నంబర్–15 నుంచి మధురాపూర్.. ఎగ్జిట్ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్ రోడ్లు ఉంటాయి.ఫేజ్–3: లింక్ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ. » ఫేజ్–1 లేదా ఫేజ్–2లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వరకు ఉంటాయి. » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ 18 లింక్ రోడ్లు. అలాగే ఓఆర్ఆర్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి. » రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్ నుంచి వట్టిపల్లి.. గున్గల్ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్‌రోడ్ నుంచి చీపునుంతల.. కడ్తాల్ నుంచి చుక్కాపూర్.. రూప్సింగ్ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్ రోడ్లు నిర్మిస్తారు. -
ప్రత్యామ్నాయ నేతాన్ని తయారుచేస్తున్న బీఆర్ఎస్
-
వైఎస్ వివేకా కేసు..బయటపడ్డ కుట్ర..పుత్రిక డ్రామా
-
మూసీ సుందరీకరణకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్‌ను చేసింది. ఆక్రమణలే అడ్డంకి.. మూసీ రివర్ ఫ్రంట్‌ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు. నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది. జంట జలాశయాల నుంచి రోజూ నీరు గుజరాత్లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సబర్మతి.. మూసీ కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్‌లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు ట్రంక్ లైన్‌కు రూ.3,000 కోట్లు రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ. ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ. -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
జైల్లో బాబు మాస్టర్ ప్లాన్..
-
శాంతంగా మాట్లాడిన కేసీఆర్...కారణం ఇదేనా
-
మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష
-
పుంగనూరు ఘటనాస్థలిలో ఆ రెండు వేల మంది ఎవరనే దానిపై దర్యాప్తు
-
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
ఈటల, కిషన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర కసరత్తు చేస్తోన్న కాంగ్రెస్
-
తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్
-
GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే!
హైదరాబాద్: జీఓ 111 పరిధిలో ఎలాంటి మాస్టర్‌ప్లాన్ లేకుండానే భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం లేదు. ప్రస్తుతం బయో కన్జర్వేషన్ జోన్‌లోని భూములను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ) కింద వివిధ రకాలుగా వినియోగంలోకి అనుమతులను ఇస్తారు. ప్రభుత్వ అనుమతితో భూ యజమానులు తమ భూమిని పారిశ్రామిక, నివాస, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం మార్చుకోవచ్చు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూములను, నాలా భూములను ప్రత్యేక కమిటీ ద్వారా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ద్వారా నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేస్తున్నట్లుగానే జీఓ 111 పరిధిలోని బయో కన్జర్వేషన్ భూములను కూడా మార్చుకొనేందుకు సదుపాయం ఉంటుందని ఒక అధికారి వివరించారు. ప్రస్తుతం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించడం లేదు. బఫర్ జోన్ పరిధిని ఎంత వరకు అనుమతించాలనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ఎన్నికలు.. ► మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానించడం మొదలుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేవరకు కనీసం18 నెలల సమ యం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం జరిగినా 2 సంవత్సరాలు కూడా దాటవచ్చు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండానే భూముల బదలాయింపునకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన జీఓ 168 ప్రకారం సీఎల్‌యూ అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హెచ్ఎండీఏ కమిషనర్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఆమోదంతో భూమిని మార్పు చేస్తారు. ► మరోవైపు జీఓ 111 పరిధిలోని శంషాబాద్, మెయినాబాద్, గండిపేట, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూములలో ఇప్పటికే సుమారు 70 శాతం భూములు సినీ, రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆయా వర్గా లకు చెందిన భూయజమానులు తమ అవసరాలకు అనుగుణంగా సీఎల్‌యూ తీసుకొనే అవ కాశం ఉంది. భూ వినియోగ మార్పిడికి అనుమ తిచ్చే క్రమంలో జల వనరులు, అడవులు, కొండలు, గుట్టలు, నాలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వెసులుబాటు కల్పించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల తర్వాతే ఒకే నగరం–ఒకే ప్రణాళిక.. ● ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం మొత్తం 5 మాస్టర్ప్లాన్లతో కూడి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్), సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఏడీఏ), ఓఆర్ఆర్ మాస్టర్ప్లాన్లతో పాటు 2013లో హెచ్ఎండీఏ రూపొందించిన 2030–31 మాస్టర్ ప్లాన్ కూడా అమల్లో ఉంది. ఈ అయిదు ప్రణాళికల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక రకాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ● అన్నింటిని కలిసి ఒకే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం గతంలోనే కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జీఓ 111 తొలగించనున్నట్లు ప్రకటించిన అనంతరం ‘ఒకే నగరం–ఒకే ప్రణాళిక’ లక్ష్యంతో బృహత్తర ప్రణాళిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఒకసారి సమావేశమైంది. కానీ ముందుకు వెళ్లలేదు. ఒకే నగరం – ఒకే ప్రణాళిక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం చర్యలు చేపట్టింది. ఎన్నికల తర్వాత ఈ ప్రతిపాదనను తిరిగి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. -
పట్టణ మాస్టర్ ప్లాన్లకు ఏకరూప మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు. రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్ఎఫ్పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్బీలు), 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్‌ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వచ్చే నెల 13లోపు నిర్ణయం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కొనసాగుతుందా? రద్దయిందా? ఫిబ్రవరి 13వ తేదీలోగా నిర్ణయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులను సంప్రదించకుండానే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఇది చట్టవిరుద్ధ మని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ పార్టీ ఇన్ పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసినట్లు మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింద న్నారు. కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. -
మెప్పించి.. ఒప్పించేలా!.. మాస్టర్ప్లాన్లపై మళ్లీ అధ్యయనం
సాక్షి, వరంగల్: మాస్టర్ ప్లాన్ల విషయంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు అనుగుణంగా వాటి అభివృద్ధికి మాస్టర్ప్లాన్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని సుమారు 91 నగరాలు, పట్టణాలకు బృహత్తర ప్రణాళికల రూపకల్పన తక్షణ కర్తవ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మాస్టర్ప్లాన్లను కొలిక్కి తేవడంతోపాటు కొత్త మున్సిపాలిటీలలో అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మాస్టర్‌ప్లాన్ – 2041 రూపకల్పన జరుగుతుంటే కొన్నిచోట్ల వీటిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూములు, పంట స్థలాలు కోల్పోతున్నవారు ఆందోళనలకు దిగుతున్నారు. కామారెడ్డి, జగిత్యాలలో పెల్లుబుకిన నిరసనలతో ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు మాస్టర్ప్లాన్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపడంతో అవి రద్దయ్యాయి. నిర్మల్‌లో కూడా ఉపసంహరించుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికీ పాతవే.. కొత్తవాటికి కలగని మోక్షం.. రాజధాని హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్‌లో 1972 నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా, నిజామాబాద్‌కు 1974 నాటి ప్రణాళికే ఉంది. పదికిపైగా మున్సిపాలిటీల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్ప్లాన్లే అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 142 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. ఇందులో ఎనిమిదింటికి ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా పెద్దపల్లి మాస్టర్‌ప్లాన్‌ను మాత్రం ఆమోదించారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 45 పురపాలికలు ఉండగా.. మాస్టర్ప్లాన్ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. మొత్తం మీద వీటిల్లో కొత్తగా ఏర్పాటైన 59 మున్సిపాలిటీలకు నాలుగేళ్లు పూర్తయినా అసలు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన దిశగా అడుగులే పడలేదు. వరంగల్ ‘కుడా’ మాస్టర్‌ప్లాన్ నమూనా ప్రత్యామ్నాయాల పరిశీలన.. మొత్తం మీద మాస్టర్ప్లాన్లు అవసరమైన 91 నగరాలు, పట్టణాలలో 68 కొత్తవాటికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. మహబూబాబాద్, ఆంధోల్–జోగిపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ మాస్టర్ప్లాన్లు ఆమోదం కోసం సిద్ధంగా ఉండగా, మరో 15 ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేందుకు కసరత్తు పూర్తయింది. తాజాగా రద్దయిన కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ పట్టణాలకు ప్రత్యామ్నాయ మాస్టర్ప్లాన్లు రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పట్టణాలతో పాటు, మిగతా వాటికి కొత్తగా రూపొందించే మాస్టర్ప్లాన్లలో నివాస ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, మిశ్రమ వినియోగం వంటి వాటితో పాటు ప్రభుత్వ వినియోగం, గ్రీన్ కవర్లో భాగంగా అడవులు, బఫర్‌జోన్, పర్యావరణ/ప్రత్యేక భూ వినియోగ జోన్, రోడ్లు, రవాణా వ్యవస్థలు.. వాటికి ప్రతిపాదించిన భూమి విస్తీర్ణం, భూ వినియోగ విధానం తదితర అంశాలపై మరోసారి అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. సీఎం పేషీలో వరంగల్ ఫైల్.. 34 నెలలుగా పెండింగ్.. వరంగల్ మాస్టర్‌ప్లాన్–2041 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 34 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా ఇంకా 50 ఏళ్ల కిందటి ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. వాస్తవానికి 2041 వరకు సిటీ అవసరాలకు సరిపోయేలా 2013 లోనే అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దాన్ని 2020 మార్చిలో ఆమోదించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. సీఎం ఆమోదం కోసం పంపారు. 10.50 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్ స్మార్ట్ సిటీ కావాలన్నా.. కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం ఆమోదమే తరువాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా వరంగల్ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన జరిగింది. దానికి అనుగుణంగా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అనుమతులు ఇస్తారు. మాస్టర్ ప్లాన్ సీఎం పేషీలో పెండింగ్‌లో వుంది. ఆమోదం పొందితేనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. – ఎ.అజిత్‌రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కుడా, వరంగల్ ఓఆర్ఆర్కు అవతల ఇండస్ట్రియల్ జోన్ ఉండాలి వరంగల్ మాస్టర్‌ప్లాన్‌లో ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఇండస్ట్రియల్ జోన్ నిర్ణయించాలి. రహదారుల కనెక్టివిటీకి అనుగుణంగా అభివృద్ధి ఉండాలి. రెండో పెద్ద నగరం చుట్టూరా భవిష్యత్‌లో ఐటీ, వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించి, సవరించి వెంటనే ఆమోదించాలి. – బొమ్మినేని రవీందర్ రెడ్డి, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, వరంగల్ మిశ్రమ వినియోగం కింద తీసుకోవాలి మాస్టర్ప్లాన్లు ఎక్కడ అమలు చేసినా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. చాలాచోట్ల రాజకీయ జోక్యంతో విలీన గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లోకి తీసుకుంటున్నారు. ప్రతిపాదిత వరంగల్ మాస్టర్ ప్లాన్‌లో రైతులు, ఇతరుల నుంచి 3 వేల ఫిర్యాదులు అందాయి. పంట భూములను మిక్స్డ్ ల్యాండ్ యూజ్ (మిశ్రమ భూ వినియోగం)గా తీసుకుంటే వ్యతిరేకత రాదు. – పుల్లూరి సుధాకర్, అధ్యక్షులు, ఫోరం ఫర్ బెటర్ తెలంగాణ -
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
రైతుల ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఉద్యమాలతో కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లు రద్దు అయ్యాయని, బీఆర్ఎస్ సర్కార్‌ను తరిమికొట్టే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది రైతన్నల విజయమని, వారి ఉద్యమస్ఫూర్తికి అభినందనలు అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ రద్దు పోరులో నేను కూడా పాల్గొన్నాను. నాతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు. పోలీసులు మాపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు’ అని సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. -
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ రద్దుకు తీర్మానం
-
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం
-
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన పాలక వర్గం