- చర్చలేకుండానే ఏకగ్రీవంగా ఆమోదం
- ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోని వైనం
- నిరసన తెలిపిన ప్రతిపక్ష కార్పొరేటర్లు
అమల్లోకి మాస్టర్‌ప్లాన్
Published Sun, Dec 4 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం నగరం చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలను కలుపుతూ రూపొందించిన నూతన మాస్టర్‌ప్లా¯ŒSకు నగరపాలక మండలి ఆమోదముద్ర వేసింది. మాస్టర్‌ప్లా¯ŒSపై చర్చించి ఆమోదించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ శనివారం సమావేశమైంది. మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. తూతూ మంత్రంగా చర్చ జరిపి మమ అనిపించేశారు. ప్రారంభించిన కొద్ది సేపటికే చర్చను ముగించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మాస్టర్‌ప్లా¯ŒSపై సమగ్రంగా చర్చించి, సభ్యుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా అధికార పార్టీ కార్పొరేటర్లు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, ప్రతిపక్ష సభ్యులతో పనిలేదని, ఏకగ్రీవంగా ఆమోదించాలని మేయర్‌పై ఒత్తిడి తేవడంతో మాస్టర్‌ప్లా¯ŒSకు ఆమోద ముద్ర వేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు నండూరి వెంకట రమణ, గొర్రెల సురేష్‌ల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోలేదు.
ఆర్‌ఐ మోహ¯ŒSరావుపై చర్యలు : కమిషనర్
ప్రత్యేక పన్నుల పేరుతో ఇంటి యజమానుల నుంచి పన్నులు వసూలు చేసిన ఆర్‌ఐ మోహ¯ŒSరావును సస్పెండ్ చేయనున్నట్టు కమిషనర్ విజయరామరాజు కౌన్సిల్‌లో తెలిపారు. సమావేశం ప్రారంభంలో ఆర్‌ఐ వ్యవహారాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఆర్‌ఐ చర్య వల్ల నగరపాలక సంస్థకు నష్టం జరగలేదని, నగదు సంస్థ బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని తెలిపారు.
ఆక్రమణలు తొలగించండి
నగరంలో రోడ్లు, డ్రెయినేజీలను ఆక్రమించి ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని ఎమ్మెల్యే గోరంట్ల, ఆకుల అధికారులకు సూచిం చారు. ఇందులో ఏ పార్టీ వారినీ ఉపేక్షించవద్దని ఆదేశించారు. మాస్టర్‌ప్లా¯ŒSను రూపొందించుకోవడం కాదని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నా. సభ్యులు లెవనెత్తిన పలు సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఫణిరామ్, సిటీ ప్లానర్ సాయిబాబా, ఎస్‌ఈ యోహా ¯ŒS, ఇతర అధికారులు పొల్గొన్నారు.
ఇష్టారీతిన రహదారుల ప్రణాళిక మార్పు
అధికార పార్టీ నేతలు తమకు కావాల్సినట్టు మాస్టర్‌ప్లా¯ŒSలో మార్పులు చేర్పులు చేశారని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, విప్ మింది నాగేంద్ర కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపించారు. పాత మాస్టర్‌ప్లా¯ŒSలో ఉన్న రోడ్లను ఇప్పుడు మాయం చేశారని ఆధారాలతో కౌన్సిల్‌లో ప్రస్తావించారు. శానిటోరియం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా, జాతీయ రహదారిని క్రాస్ చేసుకుంటూ ఏవీ అప్పారావు రోడ్డుకు కలుపుతూ పాత మాస్టర్‌ప్లా¯ŒSలో ఉండగా, తాజా ప్లా¯ŒSలో ఆ రోడ్డును హౌసింగ్ బోర్డు వరకే ప్రతిపాదించారని, దీన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆ రోడ్డు కొనసాగింపు సాధ్యం కాదని ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల తేల్చి చెప్పారు. ఈ సమయంలో కల్పించుకున్న డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు మాస్లర్‌ప్లా¯ŒSను ఆమోదించాలని మేయర్‌ను కోరారు. కనీసం తమ అభ్యంతరాలను నమోదు చేయాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, బాపన సుధారాణి, పిల్లి నిర్మల డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోని మేయర్ మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదించి, సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. మేయర్ తీరుపై ప్రతిపక్ష కార్పొరేటర్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
Advertisement
Advertisement