implimentation
-
పట్టణాలకు అభివృద్ధి కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. 142 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో దేశంలోనే 46.8 శాతం పట్టణీకరణతో మూడోస్థానంలో ఉన్న తెలంగాణ మరో మూడేళ్లలో మొదటిస్థానానికి ఎగబాకబోతోందని ఇటీవల నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ‘తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు వరద కాలువల అభివృద్ధి, మురుగునీటి శుద్ధికేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.3,809 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ రూపొందించిన ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఇప్పటివరకు 117 పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,219 కోట్లు కేటాయించింది. అందులో రూ.72.68 కోట్లతో చేపట్టిన సిద్దిపేట భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.75.76 కోట్ల సిరిసిల్ల తాగునీటి సరఫరా ప్రాజెక్టు, రూ.160.05 కోట్ల నిజామాబాద్ మురుగునీటి సరఫరా పనులు, రూ.81.41 కోట్లతో చేపట్టిన సూర్యాపేట డ్రైనేజ్ పథకం పనులు 71 శాతం పూర్తయ్యాయి. 12 నగరాల్లో రూ.1,616 కోట్ల ప్రణాళికలు జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్ రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, సిద్దిపేటలో 2015 నుంచి 2020 వరకు రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికల అమలుకు రూ.1,616 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటిలో నీటి సరఫరాకు సంబంధించి రూ.1,441 కోట్లతో 27 పనులు, రూ.40 కోట్లతో 35 పార్కు పనులు, 2 పట్టణాల్లో మురుగునీటి పారుదలకు సంబంధించి రూ.184 కోట్లతో 4 పనులు చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. -
సీఏఏ అమలుకు ‘ఆన్లైన్’!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్న నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రత్యేక అథారిటీ పర్యవేక్షణలో మొత్తం ఆన్లైన్లో ఈ ప్రక్రియను ముగించే అవకాశాలపై సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతమున్న పౌరసత్వ విధానం ప్రకారం.. దరఖాస్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటారు. ఆ విధానాన్ని తొలగించి, మొత్తం ఆన్లైన్లో ఈ ప్రక్రియ జరిపేందుకు కేంద్ర హోం శాఖ ఆలోచిస్తోంది. ‘ఒక కొత్త అథారిటీని ఏర్పాటు చేసి.. ఆ అథారిటీ ఆధ్వర్యంలో దరఖాస్తు స్వీకరణ నుంచి, డాక్యుమెంట్ల పరిశీలన, పౌరసత్వ జారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో జరిపే విషయంపై ఆలోచిస్తున్నాం’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం ప్రక్రియ ఆన్లైన్ అయితే, ఏ స్థాయిలో కూడా రాష్ట్రాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. మరోవైపు, సీఏఏ అమలును రాష్ట్రాలు తిరస్కరించలేవని, ఆ అధికారం వాటికి లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి. అస్సాం టూరిజంకు భారీ నష్టం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన ఆందోళనల కారణంగా రాష్ట్ర పర్యాటక రంగానికి డిసెంబర్లో రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. జనవరిలో మరో రూ. 500 కోట్లు నష్టపోయే అవకాశముందని అస్సాం టూరిజం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారని అధికారులు తెలిపారు. అస్సాం సాంస్కృతిక యోధుడు ఓఝా మృతి సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న అస్సాం సాంస్కృతిక, నాటక రంగ ప్రముఖుడు ఒయినింటమ్ ఓఝా(88) మంగళవారం కన్నుమూశారు. మూడు రోజుల క్రితం వరకు కూడా సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. సరిహద్దు బంగ్లా గ్రామాల్లో మొబైల్ బంద్ భారత్ సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లోని గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ సేవలను నిలిపివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి సరిహద్దుల్లో ఒక కిలోమీటరు పరిధిలో మొబైల్ నెట్వర్క్ సేవలను నిలిపివేసినట్లు దేశ సర్వీస్ ప్రొవైడర్లు గ్రామీణ్ఫోన్, టెలిటాక్, రోబి, బంగ్లాలింక్ సంస్థలు వెల్లడించాయి. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దేశమంతా, అన్ని రాష్ట్రాలు ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. సీఏఏను ఉపసంహరించాలని కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని అమోదించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో ఉన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను పార్లమెంటే చేయాలి. అసెంబ్లీలు కాదు. ఆ చట్టాలు దేశమంతా అమలు జరగాలి’ అని స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ తీర్మానంపై స్పందిస్తూ.. తీర్మానం చేసే ముందు, సీఎం విజయన్ న్యాయ నిపుణులను సంప్రదిస్తే బావుండేదని వ్యాఖ్యానించారు. సీఏఏ భారతీయులకు కానీ, భారతీయ ముస్లింలకు కానీ సంబంధించిన విషయం కాదన్నారు. -
అమల్లోకి మాస్టర్‌ప్లాన్
చర్చలేకుండానే ఏకగ్రీవంగా ఆమోదం ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోని వైనం నిరసన తెలిపిన ప్రతిపక్ష కార్పొరేటర్లు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరం చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలను కలుపుతూ రూపొందించిన నూతన మాస్టర్‌ప్లా¯ŒSకు నగరపాలక మండలి ఆమోదముద్ర వేసింది. మాస్టర్‌ప్లా¯ŒSపై చర్చించి ఆమోదించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ శనివారం సమావేశమైంది. మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. తూతూ మంత్రంగా చర్చ జరిపి మమ అనిపించేశారు. ప్రారంభించిన కొద్ది సేపటికే చర్చను ముగించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మాస్టర్‌ప్లా¯ŒSపై సమగ్రంగా చర్చించి, సభ్యుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా అధికార పార్టీ కార్పొరేటర్లు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, ప్రతిపక్ష సభ్యులతో పనిలేదని, ఏకగ్రీవంగా ఆమోదించాలని మేయర్‌పై ఒత్తిడి తేవడంతో మాస్టర్‌ప్లా¯ŒSకు ఆమోద ముద్ర వేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు నండూరి వెంకట రమణ, గొర్రెల సురేష్‌ల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్ఐ మోహ¯ŒSరావుపై చర్యలు : కమిషనర్ ప్రత్యేక పన్నుల పేరుతో ఇంటి యజమానుల నుంచి పన్నులు వసూలు చేసిన ఆర్ఐ మోహ¯ŒSరావును సస్పెండ్ చేయనున్నట్టు కమిషనర్ విజయరామరాజు కౌన్సిల్లో తెలిపారు. సమావేశం ప్రారంభంలో ఆర్ఐ వ్యవహారాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఆర్ఐ చర్య వల్ల నగరపాలక సంస్థకు నష్టం జరగలేదని, నగదు సంస్థ బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని తెలిపారు. ఆక్రమణలు తొలగించండి నగరంలో రోడ్లు, డ్రెయినేజీలను ఆక్రమించి ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని ఎమ్మెల్యే గోరంట్ల, ఆకుల అధికారులకు సూచిం చారు. ఇందులో ఏ పార్టీ వారినీ ఉపేక్షించవద్దని ఆదేశించారు. మాస్టర్‌ప్లా¯ŒSను రూపొందించుకోవడం కాదని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నా. సభ్యులు లెవనెత్తిన పలు సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఫణిరామ్, సిటీ ప్లానర్ సాయిబాబా, ఎస్ఈ యోహా ¯ŒS, ఇతర అధికారులు పొల్గొన్నారు. ఇష్టారీతిన రహదారుల ప్రణాళిక మార్పు అధికార పార్టీ నేతలు తమకు కావాల్సినట్టు మాస్టర్‌ప్లా¯ŒSలో మార్పులు చేర్పులు చేశారని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, విప్ మింది నాగేంద్ర కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపించారు. పాత మాస్టర్‌ప్లా¯ŒSలో ఉన్న రోడ్లను ఇప్పుడు మాయం చేశారని ఆధారాలతో కౌన్సిల్లో ప్రస్తావించారు. శానిటోరియం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా, జాతీయ రహదారిని క్రాస్ చేసుకుంటూ ఏవీ అప్పారావు రోడ్డుకు కలుపుతూ పాత మాస్టర్‌ప్లా¯ŒSలో ఉండగా, తాజా ప్లా¯ŒSలో ఆ రోడ్డును హౌసింగ్ బోర్డు వరకే ప్రతిపాదించారని, దీన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆ రోడ్డు కొనసాగింపు సాధ్యం కాదని ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల తేల్చి చెప్పారు. ఈ సమయంలో కల్పించుకున్న డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు మాస్లర్ప్లా¯ŒSను ఆమోదించాలని మేయర్‌ను కోరారు. కనీసం తమ అభ్యంతరాలను నమోదు చేయాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, బాపన సుధారాణి, పిల్లి నిర్మల డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోని మేయర్ మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదించి, సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. మేయర్ తీరుపై ప్రతిపక్ష కార్పొరేటర్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
ఉద్దేశ్యం మంచిదే.. ఆచరణలో వికటించింది
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు దేవీచౌక్, కల్చరల్ (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్ల రద్దు ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆచరణలో వికటించిందని చాంబర్ ఆఫ్ కామర్సు రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జై¯ŒS అన్నారు. లోక్‌సత్తా పౌర నిఘా వేదిక ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఇండియా ఇండిపెండె¯Œ్స సెంటరులో ఆర్థిక నిపుణులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పెద్ద నోట్ల రద్దులో చట్ట నిబద్ధత అనే అంశంపై సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జై¯ŒS మాట్లాడారు. నోట్ల రద్దు సంగతి కొందరికి ముందే తెలిసిపోయిందన్నారు. సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కార్యకర్త జె.రవి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తోందని విమర్శించారు. జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిప్రతినిధి బీఎ¯ŒS వర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు సీబీఐ వంటి దర్యాప్తు సంఘాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.రాష్ట్ర బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు సమావేశానికి పంపిన సందేశంలో ముందుగానే అస్మదీయులకు లీకులు ఇచ్చి, అన్నీ సర్దుకున్నాక ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు మాట్లాడుతూ హోం వర్కు చేయకుండా తీసుకున్న చర్య అన్నారు. ఖాతాదారునిపై నిబంధనలు విధించడం చట్ట విరుద్ధమని లోక్‌సత్తా పౌర నిఘా వేదిక కన్వీనర్ ఎంవీ రాజగోపాల్ పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతపాటిశర్మ మాట్లాడుతూ సముద్రంలో నీరు ఎంత ఉన్నా, దాహం తీరడానికి గుక్కెడు నీరు లేకపోతే ప్రయొజనం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS అల్లు బాబి మాట్లాడుతూ హీరోలు కావాలనుకుని నేతలు జీరోలయ్యారని విమర్శించారు. ఆడిటర్ టి.వీరభద్రరావు, న్యాయవాది వల్లూరి సురేష్, జె.కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.