
న్యూఢిల్లీ: కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 13న ఆవిష్కరించనున్నారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు.