infrastructure development
-
7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే... → 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి. → మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది. → గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. → దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. → అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది. → భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి. → మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు. → రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు. → వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్‌పోర్ట్‌లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి. -
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్‌వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ.. ► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి. ►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది. ►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం. ►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది. ►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి. ►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. -
సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్‌తో పాటు ఆర్బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా.. తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. -
సాకారమైన విజయనగరం వాసుల కల
-
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
V-Trans India Limited: మూడేళ్లలో రూ. 3,000 కోట్ల టర్నోవరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థ వీ–ట్రాన్స్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,000 కోట్ల టర్నోవరు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో 600 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనుంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ మహేంద్ర షా ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగానికి, తద్వారా తమ సంస్థ వృద్ధికి ఊతం లభించగలదని ఆయన వివరించారు. దేశీయంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా గిడ్డంగులు, కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు షా చెప్పారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ రాజేష్ షా చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000 పైగా శాఖలు, 50 పైచిలుకు ట్రాన్స్షిప్మెంట్ సెంటర్లు, 2,500 పైగా ట్రక్కులు ఉన్నట్లు ఆయన వివరించారు. -
10 వేల కిలోమీటర్ల డిజిటల్ హైవేలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్హెచ్ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది. -
స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణం..విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్‌షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్‌లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్‌షాపు మొదటి సెషన్లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్‌లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు. ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్‌లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు. తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్‌తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్‌ను అందజేశారు. విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన వర్క్‌షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు. 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
టాప్ గేర్‌లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్‌గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్‌గేర్‌లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్‌పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్‌లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్‌లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్‌గేట్స్ ట్వీట్‌చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్‌కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
రానున్నది బ్యాలెన్స్డ్ బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమతుల్యంగా ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పనతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. పన్నుల పరంగా సౌలభ్యం, ద్రవ్యోలోటును నియంత్రణలో ఉంచి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతారన్న అభిప్రాయాలు నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వినిపించాయి. ‘‘ఎన్నికల ముందు బడ్జెట్ నుంచి ఇన్వెస్టర్లు మూడింటిని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏకీకృత పన్ను నిర్మాణం ఇందులో ఒకటి. దీనివల్ల ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన ద్రవ్య స్థిరీకరణ రెండోది. వృద్ధికి అవరోధాలుగా మారిన సబ్సిడీల స్థిరీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, పీఎస్‌యూల ప్రైవేటీకరణ లేదా స్థిరీకరణపై చర్య లు ఉంటాయని అంచనా వేస్తున్నారు’’అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి తెలిపారు. ఈ నెల ఇప్పటి వరకు మార్కెట్లు ఫ్లాట్‌గా ఒక శ్రేణి పరిధిలోనే ట్రేడ్ అవుతుండడం తెలిసిందే. కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చేంత సానుకూలంగా లేవు. కనుక బడ్జెట్ ప్రతిపాదనలపైనే మర్కెట్ గమనం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.16,500 కోట్ల అమ్మకాలు చేశారు. చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్న చైనా తదితర వర్ధమాన మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం భయాలు కూడా ఇన్వెస్టర్ల మనుసుల్లో ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బడ్జెట్‌కు ముందు ఆరు సందర్భాల్లో మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. గత పదేళ్లలో బడ్జెట్ తర్వాత ఆరు సందర్భాల్లో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్ రోజు నిఫ్టీ–50 ఏడు సందర్భాల్లో నష్టాలను చవిచూసింది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సానుకూలించే చర్యలు బడ్జెట్లో ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుంటాయి. ప్రతికూల ప్రతిపాదనలు ఉంటే నష్టపోతుండడం సహజం. కానీ, ఇది తాత్కాలిక పరిణామంగానే ఉంటుంది. మూలధన లాభాల పన్ను పెంచితే ప్రతికూలం ‘‘వచ్చే బడ్జెట్ ప్రభావం అన్నది అందులోని ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 2023–24 ద్రవ్యలోటును మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తాయి. 6 శాతానికి పైన అంచనాలు ఉంటే అది మార్కెట్లను నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఇది జరగకపోవచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మూలధన లాభాల పన్నును పెంచితే అది మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుందున్నారు. ఆర్థిక వ్యవస్థ లేదా ఖర్చు చేసే ఆదాయం మిగులుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నా కానీ, అవి మార్కెట్‌పై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తాయని జార్విస్ ఇన్వెస్ట్ సీఈవో సుమీత్ చందా అభిప్రాయపడ్డారు. వేతన జీవుల పన్ను శ్లాబుల్లో మార్పులు లేదా కంపెనీల మూలధన వ్యయాలకు ప్రోత్సాహకాలు లేదా పన్నుల తగ్గింపు చర్యలు ఉంటే మార్కెట్లలో ర్యాలీని చూస్తామన్నారు. పీఎల్ఐ పథకం విస్తరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు, పన్ను శ్లాబుల్లో ఉపశమనం చర్యలు ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అన్మి ప్రెసిడెంట్ కమలేష్‌షా అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై చాలా స్వల్పకాలమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు తదుపరి మార్కెట్లను నడిపించే అంశాలుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 ఫెడ్ వ్యాఖ్యలు డోవిష్‌గా ఉండి, ద్రవ్యోల్బణం దిగొస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని జియోజిత్ విజయ్‌కుమార్ అంచనా వేస్తున్నారు. హెల్త్‌కేర్, ఫెర్టిలైజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఇన్సూరెన్స్, తయారీ, డిజిటలైజేషన్, కమ్యూనికేషన్, విద్య, ఎస్ఎంఈ రంగాలకు బడ్జెట్లో ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంటార్ సర్వే అనలైటిక్స్ సంస్థ కాంటార్ బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సర్వే అంశాలను పరిశీలించినట్టయితే.. ► ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపులపై ఆందోళనతో ఉన్నారు. ► ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళకరమని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరమని చెప్పారు. ► సగం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వృద్ధి బాటలో కొనసాగుతుందని భావిస్తుంటే, 31 శాతం నిదానిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ► మెట్రో జనాభాతో పోలిస్తే నాన్ మెట్రోల్లో 54 శాతం మంది ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ► ఆదాయపన్ను మినహాయింపుగా ఉన్న బేసిక్ పరిమితి రూ.2.5 లక్షలను పెంచొచ్చన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అలాగే, గరిష్ట పన్ను 30 శాతం శ్లాబ్‌కు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచొచ్చనే అంచనా వ్యక్తమైంది. ► సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా రాయితీలు పెంచుతారని మూడింట ఒక వంతు మంది చెప్పారు. ► కరోనా మహమ్మారి దాదాపు ముగిసినట్టేనని, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని 55 శాతం మంది కోరుతున్నారు. ► హైదరాబాద్ సహా 12 పట్టణాల్లో గత డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 మధ్య కాంటార్ సర్వే జరిగింది. 21–55 సంవత్సరాల వయసులోని 1,892 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు. చదవండి: (లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్) -
Roger Cook: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూస్తే అసూయగా ఉందని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్.. ట్రేడ్, టూరిజం, సైన్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి రోజర్ కుక్ వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్–పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుక్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. పశ్చిమ ఆస్ట్రేలియాకు ఏపీ అతిపెద్ద భాగస్వామి మాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం. ఏ ఇతర దేశాలతోనూ ఇంత పెద్ద మొత్తంలో ఒప్పందాలు, పెట్టుబడులకు ముందుకు వెళ్లలేదు. భారత్‌లో అతిపెద్ద భాగస్వామి రాష్ట్రంగా ఏపీ ఉంది. భారత్‌లోని 70కి పైగా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలతో పరస్పర సహకారం అందిపుచ్చుకుంటున్నాం. ముంబై తర్వాత వైజాగ్.. పది రోజుల పర్యటనలో భాగంగా మా బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చాం. ఇక్కడకు నేను రావడం ఇదే మొదటిసారి. ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాం. తర్వాత వైజాగ్ వచ్చాం. ఇది చాలా అద్భుతమైన నగరం. ముంబై తర్వాత పర్యాటక రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్న నగరమిదే. ఇక్కడ టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం. భారత్‌లో ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకతని సంతరించుకుంది. ఇందులో వైజాగ్ మరింత ప్రత్యేకంగా ఉందనడంలో ఎలాంటి సందేహంలేదు. రెండు నగరాల కంటే మిన్నగా.. ముందుగా ఢిల్లీలో సదస్సు నిర్వహించినప్పుడు ఎక్కువగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ముంబైలో టూరిజంపైనే సింహభాగం చర్చించాం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క రంగంపైనే దృష్టిసారించలేదు. ఢిల్లీ, ముంబై కంటే మిన్నగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై మంత్రులు, ప్రభుత్వాధికారులు చక్కగా వివరించారు. పారిశ్రామిక అభివృద్ధి బాగుంది.. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగుంది. పశ్చిమ ఆస్ట్రేలియా, ఏపీకి మధ్య వివిధ రంగాల్లో సారూప్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ఎనర్జీ రంగంలో ఇరు ప్రాంతాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఎనర్జీ రంగంతో పాటు అంతర్జాతీయ విద్య, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయం మొదలైన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి నడవాలని నిర్ణయించాం. సీఎం జగన్ ఆలోచనలు అద్భుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా కచ్చితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుచేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు అసూయ పుట్టించేవిగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొత్త పోర్టుల అనుసంధానం నిజంగా అద్భుతమైన నిర్ణయం. ముఖ్యమంత్రిని తమ బృందం కలవాలని అనుకున్నాం. వరదల కారణంగా ఆయన బిజీగా ఉన్నట్లు చెప్పారు. అందుకే త్వరలోనే మరోసారి ఏపీలో పర్యటిస్తా. సీఎం జగన్‌తో భేటీ అవుతాను. -
మౌలికానికి గతి ‘శక్తి’
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్‌ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు. సిసలైన పీపీపీ విధానం.. ఇన్ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది. దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్‌పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు. పుష్కలంగా డేటా.. గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు. -
మౌలిక రంగంపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవరోజు వర్చువల్ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది. -
మౌలిక వసతుల కల్పనకు రూ.1,392 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు నాబార్డు చేయూతనిచ్చింది. వైఎస్సార్, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన బోధనాస్పత్రుల నిర్మాణానికి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు రూ.1,392.23 కోట్ల రుణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ వెల్లడించారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద ఈ సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ► వైఎస్సార్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న మూడు బోధనాస్పత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, స్పెషలైజ్డ్ క్లినికల్ కమ్ సర్జికల్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్.. వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సీజీఎం తెలిపారు. వైద్య విద్యకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ► మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ కన్సల్టేషన్ రూమ్‌లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూమ్, డయాలసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఓటీ కాంప్లెక్స్, ఓపీడీ, జనరల్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకొస్తాయని చెప్పారు. ► రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డు తగిన తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3 వేల 92 కోట్ల రూపాయల సాయం అందించామని, ఈ నిధులతో 25 వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం, మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించినట్టు చెప్పారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకూ నాబార్డు సాయం అందించినట్టు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావర్ వివరించారు. -
రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేసి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని మనం మురిసిపోతున్నాం కానీ, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుని ప్రయాణికులపై బాదడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల జేబుకి ఇక చిల్లు పడడం ఖాయం. ఈ స్టేషన్లలో లెవీ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆయా స్టేషన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. మోదీ చిన్నతనంలో టీ అమ్మిన స్టేషన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఫీజుని వారు ప్రయాణించే తరగతులని బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా వసూలు చేస్తారు. ఈ లెవీ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారి నుంచి రూ.50, స్లీపర్ క్లాసు ప్రయాణికులకు రూ.25, జనరల్ బోగీలలో ప్రయాణించే వారి నుంచి రూ.10 వసూలు చేయనున్నట్టుగా రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ వెల్లడించింది. ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరని కూడా మరో 10 రూపాయలు పెంచనున్నారు. సబర్బన్ రైల్వే ప్రయాణాలకు మాత్రం ఈ లెవీ ఫీజులు ఉండవు. -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
ఈ నెల 13న గతి శక్తి ప్లాన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 13న ఆవిష్కరించనున్నారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు. -
బూమ్ బూమ్.. ఇన్ ఫ్రా..!
బలమైన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఈ సదుపాయాలపైనే ఎన్నో పరిశ్రమల ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. అందుకనే కేంద్ర సర్కారు మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి భారీ ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)ను ప్రకటించింది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వే, విద్యుత్ తదితర రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించనుంది. తద్వారా 2024–25 నాటికి రూ.6 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల విస్తరణకే కేంద్రం ఖర్చు చేయనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏల కారణంగా మౌలిక సుదుపాయాల ప్రాజెక్టులకు కొంత కాలం పాటు రుణ లభ్యత కఠినంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ రంగంలోని పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఓ సారి దృష్టి సారించొచ్చు. ఇన్ఫ్రా స్టాక్స్ దీర్ఘకాలం కోసం నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటే.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎల్అండ్టీ: 2007 నవంబర్‌లో ఎల్అండ్టీ షేరు ధర రూ.972. గతేడాది మార్చిలో ఇదే షేరు రూ.815వరకు తగ్గగా.. ప్రస్తుతం రూ.1,740 సమీపంలో ఉంది. కొన్ని రంగాల్లోని షేర్లు ఇదే కాలంలో ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. కానీ, మౌలిక రంగ షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్నాయి. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగంలో ఎల్అండ్టీ దిగ్గజం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఈ కంపెనీకి చెందిన సబ్సిడరీలు (మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీస్) ఐటీ రంగంలో మెరుగ్గా రాణిస్తున్నాయి. ఇది కూడా అదనపు బలం. 2020–21 సంవత్సరం ఆదాయంలో మౌలిక రంగ వ్యాపార వాటా 45 శాతంగా ఉంది. రూ.3.2 లక్షల కోట్ల ఆర్డర్‌బుక్‌తో కంపెనీ పటిష్టంగా కనిపిస్తోంది. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: ప్రభుత్వ ప్రణాళికలతో ఎక్కువగా ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల మేర రహదారుల విస్తరణను కేంద్రం చేపట్టనుంది. ఈ సంస్థకు రుణ భారం తక్కువగా ఉంది. 20 ఏళ్ల మంచి ట్రాక్ రికార్డు కూడా సొంతం. ఈక్విటీతో పోలిస్తే 1.37 రెట్ల రుణ భారం కలిగి ఉంది. ఆదాయం, నికర లాభాల్లో మంచి వృద్ధిని చూపిస్తోంది. రూ.12,095 కోట్ల విలువైన ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఆదాయంలో 20 శాతం వృద్ది నమోదు చేస్తామన్న అంచనాలను కంపెనీ ప్రకటించింది. ఎల్అండ్టీ మాదిరి వైవిధ్య వ్యాపారాలతో కూడిన కంపెనీ ఇది కాదు. కల్పతరు పవర్‌ట్రాన్స్‌మిషన్: విద్యుత్ సరఫరా, ఆయిల్ అండ్ గ్యాస్ పైపులైన్లు, రైల్వే, రహదారుల నిర్మాణంలోని కంపెనీ ఇది. ఆదాయాల్లోనూ మంచి వైవిధ్యం ఉంది. 2020–21 ఆదాయంలో 37 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వచి్చంది. అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికతో ఉంది. 2021 మార్చి నాటికి ఈక్విటీతో పోలిస్తే రుణభారం 0.66 రెట్లుగా ఉంది. కంపెనీ చేతిలో రూ.29,313 కోట్ల ఆర్డర్లు ఉండడంతో భవిష్యత్తు వ్యాపార వృద్ధికి చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు కనీస పరిజ్ఞానానికితోడు.. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్పులను పరిశీలించి, అవసరమైతే పెట్టుబడి నిర్ణయాలను సమీక్షించుకునే తీరిక కూడా ఉండాలి. అందుకే నేరుగా స్టాక్స్ అందరికీ అనుకూలం కాదు. తగినంత సమయం వెచి్చంచలేని వారు.. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టే ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని మౌలిక రంగ కంపెనీల్లోనే పెడతాయి. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్: ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తోంది. దేశ వృద్ధి పథంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంటుంది. అంటే ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్ఫ్రా కంపెనీలే కాకుండా.. మెటీరియల్స్, ఇండ్రస్టియల్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 61 శాతం ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసి ఉంది. కనుక మార్కెట్ కరెక్షన్లలో నష్టాల రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వైవిధ్యమైన పథకంగా దీన్ని చూడొచ్చు. 2009 సెపె్టంబర్లో పథకం మొదలు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్షిక రాబడులు 16 శాతానికి పైనే ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిర్మాణం, సిమెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్ట్స్, విద్యుత్ కంపెనీల్లో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. 2013 జనవరిలో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి వార్షిక సగటు రాబడులు 18.53 శాతంగా ఉన్నాయి. అయితే, ఏదో ఒక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే థీమ్యాటిక్ ఫండ్స్ (ఇన్ఫ్రా, ఫార్మా, ఐటీ.. ఇలా)లోరిస్క్ పాళ్లు ఎక్కువ. కనుక పెట్టుబడులకు తగినంత వైవిధ్యం ఉండేలా చూడాలి. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇన్ఫ్రాలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. థీమ్యాటిక్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో వాటిని వెనక్కి తీసుకోవడమూ అంతే ముఖ్యం. ఇన్విట్లు పెట్టుబడిపై క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారు, కొంత రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్ఫ్రా కంపెనీలు ఏర్పాటు చేసే ప్రత్యేక పెట్టుబడుల వాహకాలే ఇని్వట్‌లు. కంపెనీలు తమ నిర్వహణలోని కొన్ని ప్రాజెక్టులను ఇని్వట్ కిందకు బదిలీ చేయడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు. అలా సమకూరిన నిధులను అవి నూతన ప్రాజెక్టుల నిర్వహణ, రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం ఇన్విట్లు 80% నిధులను ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలి. ఒక్కో యూనిట్ వారీ నికర మిగులు పంపిణీ ఆదాయం (ఎన్డీఎస్) నుంచి 90 శాతం వాటాదారులకు ప్రతీ త్రైమాసికానికి ఒక పర్యాయం పంపిణీ చేయాలి. అలా అని ప్రతీ క్వార్టర్‌కు కచి్చతంగా ఇంత చొప్పున వస్తుందని ముందే అంచనా వద్దు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన ఇని్వట్లలో షేర్ల మాదిరే క్రయ, విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కంపెనీల వాటాలు షేర్ల రూపంలో ఉంటే.. ఇన్విట్‌లకు సంబంధించి యూనిట్లు ట్రేడవుతుంటాయి. కనుక షేర్ల మాదిరే, మూలధన లాభాలు, నష్టాలకు అవకాశం ఉంటుంది. డెట్, ఈక్విటీల కలయికగా (హైబ్రిడ్) దీన్ని చూడొచ్చు. ఇన్విట్ ఐపీవోల్లో కనీస పెట్టుబడి రూ.10,000–15,000. లిస్టింగ్ తర్వాత ఇంతకుముందు కనీసం 100 యూనిట్లను కొనుగోలు చేయడం, విక్రయించడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు షేర్ మాదిరే ఒక్కో యూనిట్ చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు. లిస్టింగ్‌లో ఇవీ... పవర్‌గ్రిడ్ ఇని్వట్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఐఆర్బీ ఇని్వట్ ఫండ్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో పవర్‌గ్రిడ్ ఇని్వట్ అన్నది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబం ధించినది. ఇండియాగ్రిడ్ ట్రస్ట్‌ను కేకేఆర్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్ మిషన్ స్పాన్సర్ చేస్తున్నాయి. . ఇండియాగ్రిడ్ ప్రతీ త్రైమాసికానికి ఒక్కో యూనిట్‌పై రూ.3ను పంపిణీ చేస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రా నిర్వహణలోని ఇని్వట్ ఫండ్ పరిధిలో టోల్ ఆధారిత రహదారి ప్రాజెక్టులున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ ఆధారంగా ఐఆర్బీ ఇన్విట్ ఆదాయంలోనూ అస్థిరతలు ఉంటుంటాయి. ప్రతీ యూనిట్‌కు 2018–19లో ఎన్డీఎస్ 12.25గా ఉండగా, ఆ తర్వాతి రెండేళ్లలో రూ.10, రూ.8.5కు తగ్గడం గమనార్హం. కరోనా లాక్డౌన్ల ప్రభావం ఈ సంస్థ ఆదాయంపై పడింది. ఇండియా గ్రిడ్ ఆరంభం నుంచి ఏటా పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను అదనంగా చేర్చుకుంటూ వస్తోంది. దీంతో 2017–18లో రూ.448 కోట్ల ఆదాయం కాస్తా.. 2020–21 నాటికి రూ.1,675 కోట్లకు విస్తరించింది. భవిష్యత్తులో మరిన్ని ఇని్వట్‌లు కూడా ఐపీవోకు రానున్నాయి. లాభాలపై పన్ను.. ఇన్విట్‌లను కొనుగోలు చేసి, తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభం, నష్టాలు ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయి. ఇని్వట్ల నుంచి అందుకునే ఆదాయం వాటాదారుల వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎవరికి వారే తమ ఆదాయ పన్ను శ్లాబు ఆధారంగా ఈ మొత్తంపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. నూతన కన్సెషనల్ పన్ను విధానాన్ని ఇని్వట్ నిర్వహణలోని ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇన్విట్‌లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి లాభం వస్తుంది. అప్పుడు రూ.లక్షకు మించిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. వీటిపై 15 శాతం పన్ను ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపై సమగ్ర అవగాహన కోసం నిపుణులను సంప్రదిస్తే మంచిది. 2005–08 మధ్యకాలంలో ఇన్ఫ్రా స్టాక్స్‌లో పెద్ద బూమ్ కనిపించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత తిరిగి మౌలిక సదుపాయాల కంపెనీల స్టాక్స్ పెద్దగా ర్యాలీ చేసింది లేదు. తలకుమించిన రుణ భారంతో కొన్ని కనుమరుగు అయిపోగా.. నాణ్యమైన కంపెనీలు గట్టిగా నిలబ డ్డాయి. వీటికితోడు ఇని్వట్ రూపంలో కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా ఇన్ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్లు తమ రిస్క్, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షల ఆధారంగా అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్‌వర్క్‌లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్‌వర్క్‌లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్‌వర్క్‌లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్‌వర్క్‌లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్‌తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
గతిశక్తి స్కీముతో ఇన్ఫ్రాకు ఊతం
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రాబోయే గతిశక్తి స్కీముతో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించగలదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనితో రవాణా వ్యయాలు తగ్గి, సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయని .. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యామ్చామ్) 29వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. రహదారి రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ అనుమతిస్తోందని, ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని అమెరికాకు చెందిన బీమా, పెన్షన్ ఫండ్లను ఆహా్వనించారు. రూ. 100 లక్షల కోట్ల గతి స్కీమును ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్లో అమల్లోకి తేనున్నారు. జాతీయ ఇన్ఫ్రా పైప్‌లైన్ (ఎన్ఐపీ) విధివిధానాల రూపకల్పనకు గతిశక్తి మాస్టర్‌ప్లాన్ తోడ్పడుతుందని గడ్కరీ చెప్పారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగడంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. -
భారత్ ఆస్తులను ధ్వంసం చేయండి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో భారత్ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అఫ్గాన్‌లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్‌కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్‌ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్ పార్లమెంట్ భవనం.. ఉన్నాయి. -
‘దిశ’ మౌలిక వసతుల కోసం రూ.4.50 కోట్లు
సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం ఏర్పరచిన దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నిధులతో గ్యాస్ క్రోమటోగ్రఫీ పరికరాలు 2, ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం స్పెస్టోక్సోపీ పరికరాలు 3, హైయండ్ ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్లు 2, ఫోరెన్సిక్ హార్డ్‌వేర్‌రైట్ బ్రాకర్ కిట్ ఒకటి, యూఎఫ్‌ఈడీ పీసీ ఒకటి, డీవీఆర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ ఒకటి, ఫోరెన్సిక్ ఆడియో ఎనాలిసిస్, స్పీకర్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి కొనుగోలు చేస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. -
దశలవారీగా మౌలిక వసతులు..
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడి సరికొత్త హంగులతో ముస్తాబు కానుంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అన్నిరకాల మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యకు అతి త్వరలో చెక్ పడనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించింది. వీటి వినియోగానికి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మౌలికవసతుల తీరుపై చర్చించిన అనంతరం ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మౌలికవసతుల ఆవశ్యకతపై ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ నిర్ణీత ఫార్మాట్లో సమాచారం సేకరించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మూడు దశల్లో వసతులు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం పాఠశాల విద్యా శాఖను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని మంత్రులు నిర్ణయానికి వచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారం పనులు ప్రారంభించనున్నారు. నమూనాగా ఢిల్లీ, ఏపీ స్కూళ్లు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇప్పటికే ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఆ రాష్ట్రాల్లో మౌలిక వసతుల తీరుపై అధ్యయనం చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. ఈ రెండింటిలో ఒక రాష్ట్రంలో అనుసరిస్తున్న తీరును ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోనుంది. ఇలా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పూర్తిస్థాయి భవనం, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ఫర్నెచర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సామగ్రి, బోధన, అభ్యసన పరికరాలు తదితరాలు సమకూరుస్తారు. వీటితోపాటు డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశ బోధన కోసం డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తారు. -
AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీ, విశాఖలోని నాయుడుపేట క్లస్టర్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020–21లో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు రూ.2,705 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.968.34 కోట్లను పెంచి రూ.3,673.34 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను పరిశ్రమల శాఖకు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీకి రూ.200 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.60.93 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్‌కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.250 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. రొయ్యల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రాయితీల నిమిత్తం రూ.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. కోవిడ్ సమయంలోనూ కొత్త పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం వెన్నాడుతున్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, తద్వారా 39,578 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో మరో 117 కంపెనీలు రూ.31,668 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. వీటిద్వారా 67,716 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కేవలం ఎంఎస్ఎంఈ రంగంలో రూ.4,383.24 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 87,944 మందికి ఉపాధి లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. తద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 30 వేల మందికి ఉపాధి లభించనుంది. చదవండి: AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు -
‘ఇన్ఫ్రా’ జాతీయ బ్యాంకుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు (నాబ్‌ఫిడ్ బిల్లు/నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్) రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ సంస్థపై పార్లమెంటు పర్యవేక్షణ లేదన్న అంశాన్ని లెవనెత్తారు. సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ డిమాండ్ చేశారు. చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఈ సంస్థకు సంబంధించి ఆడిట్ నివేదికలను ఏటా పార్లమెంటు పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ‘అధీకృత మూలధనం రూ.10లక్షల కోట్లను సమకూర్చనున్నాం. రూ.20,000 కోట్లను ఈక్విటీ కింద, రూ.5,000 కోట్లను గ్రాంట్ కింద ప్రభుత్వం మంజూరు చేసింది’’ అని మంత్రి తెలిపారు. సౌర్వభౌమ హామీ ఉంటుందని.. ఆర్బీఐ నుంచి రుణం పొందొచ్చన్నారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నాబ్‌ఫిడ్ రుణ వితరణ చేస్తుందన్నారు. కాగా, నాబ్‌ఫిడ్ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్ పాండా పేర్కొన్నారు. -
గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు..
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో పాటు ఎల్ఎన్జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు. చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
సిమెంట్ షేర్ల లాభాల కాంక్రీట్
ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఉన్నట్టుండి సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు సిమెంట్ కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19కు విధించిన లాక్‌డవున్‌ల నుంచి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సిమెంట్ రంగ కంపెనీలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సిమెంట్ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం. జోరుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ సిమెంట్ 6.25 శాతం జంప్‌చేసి రూ. 1,677 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,683 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. శ్రీ సిమెంట్ షేరు 6.7 శాతం దూసుకెళ్లి రూ. 21,780 వద్ద కదులుతోంది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం పెరిగి రూ. 4,623 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 4,628ను తాకింది. ఈ బాటలో రామ్‌కో సిమెంట్స్ 3.4 శాతం పుంజుకుని రూ. 781కు చేరింది. ఇంట్రాడేలో రూ. 782ను తాకింది. మంగళం సిమెంట్ సైతం 4.25 శాతం ఎగసి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 207కు చేరింది. ఇతర కౌంటర్లలో డెక్కన్ సిమెంట్స్ 2.6 శాతం లాభంతో రూ. 325 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 330కు చేరింది. శ్రీ దిగ్విజయ్ 3 శాతంపైగా వృద్ధితో రూ. 66 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ సైతం 1 శాతం బలపడ్డాయి. కారణాలేవిటంటే? ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంట్‌కు రిటైల్ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల 50 శాతం గ్రామాల నుంచి వృద్ధి కనిపించినట్లు చెబుతున్నారు. ఇది కోవిడ్-19 అన్‌లాక్, పండుగల సీజన్ కారణంగానే నమోదైనప్పటికీ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మరింత మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇదేవిధంగా పట్టణ ప్రాంతాల నుంచి సైతం నెమ్మదిగా సిమెంట్ విక్రయాలు పుంజుకుంటున్నట్లు తెలియజేశారు. సిమెంటు రంగానికి ప్రధానంగా గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాలు జోష్‌నిస్తాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అల్ట్రాటెక్, ఏసీసీ వంటి సిమెంట్ రంగ దిగ్గజాలు ఆకర్షణీయ పనితీరు చూపడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. -
రహదారులపై ప్రధానంగా దృష్టి
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 22 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు అసంఖ్యాకంగా వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల సరసన భారత్ కూడా నిలవగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3.10 లక్షల కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 8,250 కోట్ల వ్యయంతో చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది కాగలదని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యుత్ శాఖ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని, అలాగే రహదారుల వెంబడి గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనుందని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సంబంధించి ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. సుమారు రూ.1 లక్ష కోట్లతో తలపెట్టిన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కూడా వీటిలో ఉందని ఆయన తెలిపారు. ‘వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు, హైవేలు వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులు అమలవుతున్న వేగం చూస్తుంటే వచ్చే రెండేళ్లలో భారత్ ముఖ స్వరూపం మారిపోతుందని ధీమాగా చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే రహదారులు, టన్నెల్స్, వంతెనలు మొదలైన వాటిని మన దేశంలో కూడా చూడవచ్చు‘ అని గడ్కరీ చెప్పారు. 2 నెలల్లో జోజిలా టన్నెల్ పనులు ప్రారంభం... జమ్మూకశ్మీర్‌కి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీ–మోర్ టన్నెల్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినట్లు, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,379 కోట్లు. సాధారణంగా చలికాలంలో భారీగా మంచు కురుస్తుండటం వల్ల జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసివేయాల్సి వస్తుంటుంది. అయితే, ఏడాది పొడవునా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రవాణాకు అవరోధం లేకుండా చూసేందుకు జీ–మోర్, జోజిలా తదితర టన్నెల్స్ ఉపయోగపడనున్నాయి. జోజిలా టన్నెల్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. లార్సన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి దిగ్గజాలు దీనికోసం పోటీపడ్డాయి. -
రూ. లక్ష కోట్లతో వ్యవసాయ నిధి!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కిసాన్ నిధులతోపాటు రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించనున్నట్లు శనివారం ఓ అధికారిక ప్రకటన తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర తోమర్‌తోపాటు లక్షలాది మంది రైతుల ఆన్లైన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సామాజిక స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని ఆ ప్రకటనలో వివరించారు. ఈ సదుపాయాల ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు మెరుగైన విలువ లభిస్తుందని, వృథా తగ్గుతుందని అంచనా. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
ఇన్ఫ్రా అభివృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి బహుళ విధాలుగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన వివరించారు. భారత్ స్వయం సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను నిర్మించుకోవడం కీలకమని ఠాకూర్ వివరించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చే అయిదేళ్లలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ. 111 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ గత నెలలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామాల్లో మూడో ఫేజ్ విద్యుత్ కనెన్షన్లు, మరింత మెరుగైన గురుకుల విద్యా సౌకర్యాలు తదితర అంశాలకు వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. సోమవారం డీఎస్ఎస్ భవన్లో జరిగిన ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో గిరిజనుల జనాభా దామాషా ప్రకారం కేటాయించిన నిధులను ఆయా శాఖల్లో ఏ మేరకు ఖర్చు చేస్తున్నాయన్న అంశంపై ఎస్టీ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం సత్యవతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక నిధి కింద గత బడ్జెట్లో ఎస్టీలకు రూ.7,184 కోట్లు కేటాయిస్తే.. సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, మిగతావి ఈ ఏడాది లోపు ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు. ఈ నెల 6 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజన సంక్షేమానికి ఎక్కువ నిధులు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. -
రుణాల ఫిర్యాదులకు ప్రత్యేక సెంటర్: సీతారామన్
చెన్నై: లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ..ఎమ్ఎస్ఎమ్ఈల ఏర్పాటుకై ప్రజలు బ్యాంకులను సంప్రదిస్తే, హేతుబద్ద కారణం లేకుండా బ్యాంకులు నిరాకరించినట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి త్వరలోనే ఆర్థిక శాఖ ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్ సిద్దంగా ఉంటుందని, అలాగే రుణాలను నిరాకరించిన ఉద్యోగిపై సంబంధిత బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపింది. దేశంలో ఎమ్ఎస్ఎమ్ఈల పునాదులు బలంగా ఉన్నాయని ..వాటిని మరింత అభివృద్ధి చెందే విధంగా మౌళిక సధుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెరుగైన మౌలిక సధుపాయాల కల్పన వల్ల ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు.. ఇన్ఫ్రాకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘సమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందిస్తుంది’ అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. రూ. 1.13 లక్షల కోట్ల మోసాలు.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాం కులు, ఆర్థిక సంస్థల్లో ఏకంగా రూ. 1,13,374 కోట్ల మోసాలు చోటు చేసుకున్నా యని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మోసాలను సత్వరం గుర్తించేందుకు, నివారించేందుకు 2015లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, సమస్యల గుర్తింపు, పరిష్కారం, అదనపు మూలధనం అందించడం, సంస్కరణలు వంటి చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.1.68 లక్షల కోట్ల మేర తగ్గి రూ.7.27 లక్షల కోట్లకు చేరాయని మంత్రి వివరించారు. ఎల్ఐసీ పాలసీదారుల ప్రయోజనాలు కాపాడతాం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాల విక్రయ అంశంలో పాలసీదారుల ప్రయోజనాలను కచ్చితంగా పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. లిస్టింగ్ వల్ల ఎల్ఐసీలో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. వాటాలు ఎంత మేర విక్రయించవచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎల్ఐసీ చట్టాన్ని సవరించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎల్ఐసీలో కేంద్రానికి 100% వాటా ఉంది. -
‘పల్లె’కు ఓకే..!
ఆర్థిక మందగమనం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లపై అత్యధికంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాల లక్ష్యాలు పూర్తవడంతో తదుపరి దశలను వేగంగా అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పల్లెల్లో 2022 మార్చినాటికి అదనంగా 1.95 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సుమారు రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. మరో లక్ష గ్రామ పంచాయతీలకు (2020–21)లో బ్రాడ్‌బ్యాండ్(ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్)ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అటు వ్యవసాయంతో పాటు ఇటు గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గ్రామీణ సంక్షేమ పథకాలకు ఎంతంటే... 2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.1,17,647 కోట్లు (సవరించిన అంచనా(రూ.1.22 లక్షల కోట్లు) ‘ఉపాధి’కి హామీ... 2020–21 కేటాయింపు: రూ.61,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు) ► ఉపాధి హామీకి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. సవరించిన అంచనాలతో పోలిస్తే భారీగా తగ్గింది. ► చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది. ► ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. విద్యుత్తుకు మరింత ఊతం... (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు ► వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ► 2017లో సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు. ► ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. ► ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఇచ్చారు. ► ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. స్వచ్ఛ భారత్‌కు దన్ను... 2020–21 కేటాయింపు: రూ.12,300 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు. ► 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ► బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ► గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. ► పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. ► పూర్తిగా ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే. ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకం కిందకు తీసుకొచ్చారు. పల్లె రోడ్లు పరుగులు 2020–21 కేటాయింపు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు) ► దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించారు. ► పీఎంజీఎస్‌వై రెండో దశలో రోడ్లను మెరుగుపరడం, మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ► 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్గ్రేడేషన్ను పూర్తి చేశారు. ► వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019–20లో ఇందుకు 13 రాష్ట్రాలను ఎంపిక చేశారు. గ్రామీణ టెలిఫోనీ... 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు ► భారత్ నెట్ ఫేజ్1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ► దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు. ► ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆఫ్టిక్ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. ‘జల్ జీవన్’తో స్వచ్ఛమైన నీరు.... 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు 2019–20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు ► దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. ► గతేడాది బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. దీనిలోభాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు. ► స్థానిక స్థాయిలో సమీకృత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్) కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే. ► 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలు కు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇంటికి ఇంకాస్త ఆసరా... 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం. ► పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. ► ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. ► అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. -
‘మౌలిక ప్రాజెక్టుల కోసం ఎన్ఐపీ’
సాక్షి, న్యూఢిల్లీ : మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు పర్యవేక్షణకు నేషనల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎన్ఐపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగ ప్రతినిధులు ఉంటారని చెప్పారు. 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా రానున్న ఐదేళ్లలో రూ 100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక ప్రాజెక్టులను టాస్క్‌ఫోర్స్ గుర్తించిందని అన్నారు. వీటికి అదనంగా మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా మౌలిక రంగంలో వెచ్చిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపాదిత ఎన్ఐపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 39 శాతం మేర సమాన వాటా కలిగిఉంటాయని చెప్పారు. ప్రైవేట్ రంగ వాటా 22 శాతం కాగా 2025 నాటికి ఇది 30 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత నాలుగు నెలలుగా టాస్క్‌ఫోర్స్ బృందం మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, మౌలిక రంగ కంపెనీలు, డెవలపర్లతో పలుమార్లు వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపిందని మంత్రి వెల్లడించారు. ఎన్ఐపీ కింద రూ 25 లక్షల కోట్ల ఇంధన ప్రాజెక్టులు చేపట్టనున్నారని తెలిపారు. 2020 ప్రధమార్ధంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతుందని పేర్కొన్నారు. -
వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్.. పాతబస్తీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్‌కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సల్వకాలమే అవి సక్సెస్.. హైదరాబాద్‌లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్ ఇయర్ చాలెంజ్’అంటూ స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు. పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్టీఎస్! హైదరాబాద్‌లో బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు. చేనేతకు పెద్ద ఫ్యాన్.. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్‌లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్ మీడియా లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. ఇంకా వెతుకుతున్నా.. తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ కోరిక మేరకు కేటీఆర్ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు. జగన్ పాలన.. మంచి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..! అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీహబ్–టీవర్క్స్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
ఓఎస్డీగా అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, పులివెందుల : పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) ప్రత్యేక అధికారిగా అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకుడుగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డిని ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డూటీ(ఓఎస్డీ)గా ..పులివెందుల ప్రాంత అభివృద్ధి అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలోని పైఅంతస్తులో పాడా ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం అనిల్‌కుమార్‌రెడ్డి పాడా ఆఫీస్‌కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. అక్కడి సిబ్బందికి ఆఫీస్‌కు సంబంధించిన పలు విషయాలపై సూచనలు చేశారు. అనిల్‌కుమార్‌రెడ్డిని పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు తనపై నమ్మకంతో ఓఎస్డీగా నియమించడం జరిగిందన్నారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గంలోని గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పాడా నిధులతో వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతానన్నారు. పట్టణ కన్వీనర్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజధాని కోసం రూ.37,112 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూ. 55,343 కోట్లతో రూపొందించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధానిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.51,867 కోట్లు వ్యయం అవుతుందని.. ఇందులో రూ. 37,112 కోట్లను అప్పుగా తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనకు అంగీకరించింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులను తనఖా పెట్టడం ద్వారానూ.. పబ్లిక్ బాండ్స్ ద్వారానూ రూ. 500 కోట్లను సేకరించడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ బాండ్స్ ద్వారా సేకరించే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం అంగీకరించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రివర్గం సమావేశ మైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత అభివృద్ధి పథకానికి 715 మిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ రుణం(ఈఏపీ) తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. రాజధానిలో సచివాలయం, శాఖాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన రూ.4,900 కోట్ల నిధుల సమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. కేసుల ఎత్తివేత.. ఖైదీలకు క్షమాబిక్ష.. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులపై పెట్టిన కేసులనూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించడానికి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలు ►వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, 40 నుంచి 79 శాతం అంగ వైకల్యం గల వారికి ఇస్తున్న రూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచాలని నిర్ణయించింది. 80 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు పెన్షన్ రూ.1,500 నుంచి రూ.3,000లకు పెంపు. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పెన్షన్ రూ. 2500 నుంచి రూ. 3500లకు పెంపు. ► ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అదనంగా మరో 3.55 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వులపై ఆమోదముద్ర. ► పసుపు కుంకుమ–2 పథకం కింద అదనంగా రూ. పది వేలు మంజూరుకు ఆమోదం. ► నాయీ బ్రాహ్మణుల హెయిర్ కటింగ్ సెలూన్లకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్. ► చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు బ్యాంకు రుణాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంచినీటి సరఫరా సంస్థకు రూ. 1,765 కోట్లు మంజూరు. ►తొమ్మిది జిల్లాలలో తారు (బిటి) రోడ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతు పనులకు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల ద్వారా రూ.1500 కోట్లు పొందడానికి అనుమతి. ► పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2 శాతం పన్ను తగ్గిస్తూ లోగడ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యాట్ చట్టంలో సవరణల్ని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు ముసాయిదాకు ఆమోదం. ► ‘భూధార్’ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు ఆమోదం. ► రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకానికి ఆమోదం. ►కర్నూలు జిల్లా బనవాసిలో ఉన్న మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మంజూరుకు ఆమోదం. ► విశాఖలో ఐటీ పార్కు అభివృద్ధికి భీమునిపట్నం కాపులుప్పాడలో 76.88 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. ► కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో ఎకరా రూ.2.5 లక్షల చొప్పున 2,467.28 ఎకరాల భూమి గ్రీన్కో ఎనర్జీస్ సంస్థకు కేటాయింపు. ► కర్నూలు జిల్లా పెట్నికోటలో ఎకరా రూ.3,60,000 విలువకు 6.72 ఎకరాల భూమి ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి కేటాయింపు. ►సహకార చక్కెర కర్మాగారాలకు షరతులు లేకుండా రూ.200 కోట్ల రుణ సేకరణకు ఆమోదం. ► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికేవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. -
విదేశీ కంపెనీలపై ఎంత ప్రేమో..
-
జనం సొమ్ము.. సింగపూర్ సోకు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన స్టార్టప్ ఏరియా వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లుగా తయారైంది. స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) తాజాగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాల విలువైన భూములను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వంటి మౌలిక వసతుల ఏర్పాటుకయ్యే పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఇందుకు రూ.5,500 కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే గుండుసున్నా అని చెప్పక తప్పదు. స్టార్టప్ ఏరియా పేరిట ఇచ్చిన భూములను సింగపూర్ కంపెనీలు ప్లాట్లుగా మార్చి ఎంచక్కా విక్రయించుకుంటాయి. అందులో షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు నిర్మించి, వ్యాపారాలు కూడా చేసుకుంటాయి. విదేశీ కంపెనీలపై ఎంత ప్రేమో.. స్టార్టప్ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు. విలువైన భూములను సింగపూర్ కంపెనీలకు ఇచ్చే బదులు ప్రభుత్వమే స్వయంగా అక్కడ ప్లాట్లు వేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుంది కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి నోటి వెంట సమాధానం రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరుస్తూ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది సులభంగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విషయంలో చేసుకున్న రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు పూర్తిగా సింగపూర్ కంపెనీలకే అనుకూలంగా ఉండడంతో అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం తీవ్రంగా వ్యతిరేకించారు. సింగపూర్ కంపెనీలు పెట్టే పెట్టుబడిలో ప్రభుత్వ రాయితీలు 20 శాతానికి మించి ఇవ్వరాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా సింగపూర్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతాయని, ఆ ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని అజేయ కల్లాం తేల్చిచెప్పారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సింగపూర్–అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల బదులు ఈ సంస్థే రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు చేసుకుంటుందని సీఆర్డీఏ పేర్కొంది. ఒప్పందం చేసుకునే సంస్థ మారిపోవడాన్ని ప్రస్తుత ఆర్థిక శాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర తప్పుపట్టారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ఆర్థిక భారం పడదని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఒప్పందాలన్నీ తప్పుల తడకలే స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇటీవల సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ విస్తుపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడదని గతంలో పేర్కొని, ఇప్పుడు మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు ఎలా అడుగుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పంపాలని ఆదేశించింది. అయితే, ఈ వివరాలను ఆర్థిక శాఖకు పంపించకుండా సీఆర్డీఏ తాత్సారం చేస్తోంది. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ తప్పుల తడకలేనని, అందువల్లే సీఆర్డీఏ వెనుకాడుతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒప్పందాలను లోతుగా అధ్యయనం చేసిన తరువాతే మౌలిక వసతులకు నిధులు ఇచ్చేది లేనిది తేల్చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది. -
పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీ టాప్
న్యూఢిల్లీ: అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 17లలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా జాబితా రూపొందించింది. -
విద్యా వ్యవస్థను మారుస్తున్నాం
-
విద్యా వ్యవస్థను మారుస్తున్నాం: కడియం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాలు అంచనా, అధ్యయనం లేకుండా ఇబ్బడిముబ్బడిగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అనుమతించి.. విద్యా ప్రమాణాలు దెబ్బతినడానికి కారణమయ్యాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. తాము కళాశాలల సంఖ్య పెంచకుండా.. ఉన్నవాటిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గురువారం శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్‌పై చర్చకు కడియం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. వివిధ మార్గాల్లో రూ.1,500 కోట్లు సమీకరించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. భారీగా పోస్టుల భర్తీ.. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి 8,792 మంది కొత్త ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారని కడియం చెప్పారు. ఇక జూనియర్ కళాశాలలకు 1,202 పోస్టులు, డిగ్రీ కాలేజీలకు 1,384, పాలిటెక్నిక్‌లకు 519, విశ్వవిద్యాలయాలకు 1,551 పోస్టులు మంజూరు చేశామని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందిని ఎలా రెగ్యులరైజ్ చేయవచ్చనే మార్గాలను పరిశీలిస్తున్నామని కడియం తెలిపారు. -
తెలంగాణ నగరాలకు రూ. 1673 కోట్లు!
అటల్ మిషన్ ఇన్వెస్ట్మెంట్స్ కింద తెలంగాణలోని 12 నగరాలకు కలిపి మొత్తం రూ. 1673 కోట్లను రాబోయే ఐదేళ్లలో వెచ్చించనున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 832 కోట్లను సాయంగా అందిస్తుంది. ఇందులో భాగంగా వరంగల్ నగరంలో నీటి సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు రాబోయే మూడేళ్లలో రూ. 425 కోట్లు వెచ్చించనున్నారు. కేంద్ర ప్రయోజిత పథకమైన 'అమృత్' కింద మొత్తం ఈ రూ. 1673 కోట్లు వెచ్చిస్తారు. మొత్తం నిధులను 2019-20 లోగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 703 కోట్లు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ఆమోదించారు. దాంతో ఈ మిషన్ కింద పెట్టుబడుల మొత్తం రూ. 1673 కోట్లకు చేరుకుంది. అమృత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందించాలని, అందులో ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు మురుగునీటి పైపులైన్లను విస్తరించడం, నగరాల్లో ప్రతియేటా బహిరంగ, హరిత ప్రాంతాలను విస్తరించడం తప్పనిసరి అని లక్ష్యం విధించారు. ఇందుకు దేశవ్యాప్తంగా 500 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో తెలంగాణ రాష్ట్రంలోనివి 12 ఉన్నాయి. నగరం నీటిసరఫరా (రూ. కోట్లలో) మురుగునీటి వ్యవస్థ (రూ. కోట్లలో) పార్కులు (రూ. కోట్లలో) మొత్తం (రూ. కోట్లలో) వరంగల్ 424.26 0 1.44 425.70 సిద్దిపేట 0 100 1.5 101.5 ఖమ్మం 47.84 0 1 48.84 మహబూబ్‌నగర్ 41.58 0 1.5 43.08 నిజామాబాద్ 4.52 26 1.79 32.31 కరీంనగర్ 24.98 0 1.5 26.48 నల్లగొండ 11.28 0 0.75 12.03 మిర్యాలగూడ 4.07 0 1.80 5.87 సూర్యాపేట 1.45 0 1.28 2.70 జీహెచ్ఎంసీ 0 0 2.02 2.02 రామగుండం 0 0 1.50 1.50 ఆదిలాబాద్ 0 0 0.95 0.95 -
డీటీహెచ్, కేబుల్ నెట్వ ర్క్స్‌లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సర్వీసులతోపాటు డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్స్ విభాగాల్లో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పరిమితిని 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కేబుల్ నెట్వర్క్స్, డీటీహెచ్, మొబైల్ టీవీ, హెచ్ఐటీఎస్, టెలిపోర్ట్స్లలో 74 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంపు ప్రతిపాదనలను మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ చానల్స్ విషయంలో ప్రస్తుతం ఉన్న 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలనే చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను 2013లో ట్రాయ్ రూపొందించింది. -
వృద్ధి లక్ష్యం 9-10 శాతం..
కొలంబియా వర్సిటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూయార్క్: భారత్ 9 నుంచి 10 శాతం శ్రేణిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇదే స్థాయిలో దాదాపు పదేళ్లు వృద్ధి రేటు కొనసాగాలని ఆకాంక్షించారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరికం సమస్య పరిష్కారం దిశలో ఇది కీలకమని వివరించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జైట్లీ, కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ విభాగం నిర్వహించిన ఒక సమావేశంలో ‘భారత్ ఆర్థిక వ్యవస్థ-ముందడుగు’ అన్న అంశంపై మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ప్రస్తుత ఏడాది భారత్ వృద్ధి లక్ష్యం 8 శాతం. వచ్చే 10 ఏళ్లు, ఆ పైన 9 నుంచి 10 శాతం శ్రేణిలో జీడీపీ వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్య సాధనపై తాను ఆశావహంగా ఉన్నానని సైతం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదాహరణకు చైనాను తీసుకోండి. ఈ ఆసియా దేశం సగటున 30 సంవత్సరాలు దాదాపు 9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. పలు రంగాల్లో వృద్ధి సాధించింది. మనమూ ఇదే బాటన నడవడానికి తగిన కృషి చేయాల్సి ఉంది. మీరు పరిశ్రమల పక్షమా? లేద పేదల పక్షమా? అన్న అంశంపై భారత్‌లో రాజకీయ చర్చ సాగుతుంటుంది. ఈ రెండు అంశాల మధ్యా ఘర్షణాత్మక పరిస్థితి ఉంది. ఈ తరహా రాజకీయ చర్చను మొదట సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటి చర్చ ఒకటి బయటకు రావడానికి గత ప్రభుత్వం చేసిన తప్పే కారణం. వనరుల పంపిణీపై వారు దృష్టి సారించలేదు. వృద్ధి రేటుకు ఊపునిచ్చే చర్యలనూ మర్చిపోయారు. భారత్ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తుకు విదేశీ పెట్టుబడులు ఎంతో అవసరం. పెట్టుబడులకు సంబంధించి దేశం అంతర్గత శక్తి భారీగా లేదు. ఈ విషయంలో బ్యాంకుల పరిస్థితి కూడా అంతంతే. అందువల్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి భారీగా వచ్చే అవకాశం ఉందో... ఆయా దిశల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆయా పెట్టుబడులు దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి, పేదరికం నిర్మూలనకు దోహదపడాలి. ఈ చర్యలన్నీ 9 నుంచి 10% వృద్ధి శ్రేణిలో దేశాన్ని నిలబెడతాయి. సబ్సిడీలు లక్ష్యాలను చేరుకునేలా తగిన చర్యలు తీసుకుంటాం. హేతుబద్దీకరణ, పారదర్శకత లక్ష్యంగా ఈ చొరవ కొనసాగుతుంది. కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు... కొలంబియా మాజీ ప్రొఫెసర్ అరవింద్ పనగరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పనగరియా నియమితులైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ప్రెసిడెంట్ లీ బోలింగర్, ఆర్థికవేత్త-ప్రొఫెసర్ జగదీశ్ భగవతి, ఐక్యరాజ్యసమితిలో భారత్ రాయబారి అశోక్ ముఖర్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇక మున్సిపల్ బాండ్ల లిస్టింగ్
స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ ‘ముని బాండ్ల’పై సెబీ ముసాయిదా నిబంధనలు న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పొదుపు మొత్తాలు ఉపకరించేలా చూసే దిశగా.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్తగా మున్సిపల్ బాండ్ల లిస్టింగ్, ట్రేడింగ్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను మంగళవారం వెల్లడించింది. వీటి ప్రకారం ‘ముని బాండ్స్’ (మునిసిపల్ బాండ్లు) జారీ చేసే సంస్థలు ఆర్థికంగా పటిష్టమైన ట్రాక్ రికార్డు కలిగి ఉండాలి. బాండ్ల వ్యవధి కనీసం మూడేళ్లు ఉండాలి. అలాగే, ఆయా సంస్థలు.. తాము దేని కోసం నిధులు సమీకరిస్తున్నాయో ఆ ప్రాజెక్టు వ్యయంలో కనీసం 20 శాతమైనా సొంతంగా పెట్టాల్సి ఉంటుంది. రిస్కు ఎక్కువగా ఇష్టపడని దేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్రధానంగా ఫిక్సిడ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు లేదా బంగారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ముని బాండ్స్ ఉపయోగపడగలవని సెబీ పేర్కొంది. వీటిపై సంబంధిత వర్గాలు జనవరి 30 లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని వివరించింది. పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా 8 శాతం దాకా వడ్డీ రేటు ఇచ్చే బాండ్లను మాత్రమే పన్ను ప్రయోజనాలిచ్చే బాండ్లుగా ప్రకటించే వీలుంది. అయితే, 8 శాతం మాత్రమే స్థిర వడ్డీ రేటును ప్రతిపాదిస్తే బాండ్లపై ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి కనపర్చకపోవచ్చని సెబీలో భాగమైన కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటైజేషన్ అడ్వైజరీ కమిటీ అభిప్రాయపడింది. దీన్ని బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుసంధానించి చలన వడ్డీ రేటు ఉండేలా చూస్తే ప్రయోజనం ఉండగలదని భావిస్తోంది. ఇప్పుడు కూడా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్లు జారీ చేస్తున్నప్పటికీ.. ఈ మార్గంలో సమీకరించిన మొత్తాలు కేవలం రూ. 1,353 కోట్లు మాత్రమే. 1997లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా రూ. 125 కోట్ల విలువ చేసే బాండ్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో జారీ చేసింది. ఆ తర్వాత 1998లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రూ. 100 కోట్లు సమీకరించింది. హైదరాబాద్,వైజాగ్ సహా నాసిక్, చెన్నై, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇలాంటి బాండ్లను జారీ చేశాయి. అయితే, ముని బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేసేందుకు గానీ ట్రేడింగ్ చేసేందుకు గానీ ఇప్పటిదాకా అనుమతి లేదు. సాధారణంగా అమెరికా సహా సంపన్న దేశాల్లో మున్సిపల్ బాండ్లు బాగా ప్రాచుర్యంలోనే ఉన్నాయి. -
నేపాల్‌కు రూ. 6 వేల కోట్ల రుణం
మొత్తం 10 ఒప్పందాలపై ఎంవోయూలు నేపాల్ ప్రధాని కోయిరాలాతో భారత ప్రధాని మోదీ భేటీ రక్షణ సహా కీలకాంశాలపై చర్చ ఇరు దేశాల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం నేపాల్‌లో రూ. 500, రూ.1000 నోట్లపై నిషేధం ఎత్తివేత కఠ్మాండు: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా నేపాల్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి భారత్ సుమారు రూ.6,100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అలాగే వివిధ రంగాల్లో పొరుగు దేశంతో కలసి పనిచేసేందుకు 10 ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం నుంచి నేపాల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం కఠ్మాండు చేరుకున్న భారత ప్రధాని మోదీ... నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలాతో సమావేశమై వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య రక్షణ సహా కీలక రంగాల్లో సహకారం గురించి ఆయనతో మోదీ మాట్లాడారు. అనంతరం 10 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో నేపాల్‌కు సుమారు రూ. 6,100 కోట్ల ఆర్థిక సాయం పై షరతుల ఖరారు ముఖ్యమైనది. నిర్దేశిత ప్రాంతాల్లో వాహన ప్రయాణాలకు అనుమతినిచ్చే మోటారు వాహనాల ఒప్పందంతోపాటు, కఠ్మాండు-వారణాసి, జానక్‌పూర్-అయోధ్య, లుంబినీ-బోధ్ గయ మధ్య ట్విన్ సిటీ ఒప్పందాలు, పర్యాటక, పోలీసు, సంప్రదాయ ఔషధాల వాడకం, అరుణ్ నదిపై 900 మెగావాట్లతో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కఠ్మాండులోని బార్ ఆస్పత్రిలో భారత్ రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రామా సెంటర్‌ను మోదీ ప్రారంభించారు. అలాగే నేపాల్‌కు ధ్రువ్ హెలికాప్టర్‌తోపాటు బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను నేపాల్ ప్రధానికి కానుకలుగా ఇచ్చారు. కఠ్మాండు-ఢిల్లీ మధ్య పశుపతినాథ్ ఎక్స్‌ప్రెస్ పేరిట బస్సు సర్వీసును కోయిరాలాతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో కదలిక రావడం సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడు ఇరు దేశాలు సత్వర ముందడుగు వేయగలుగుతాయన్నారు. ముఖ్యంగా నేపాల్‌లో భారత కరెన్సీ రూ. 500, రూ. 1,000 నోట్ల వాడకంపై పదేళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇకపై నేపాల్‌కు వెళ్లే పర్యాటకులు ఈ నోట్లతో కూడిన రూ. 25 వేల విలువైన కరెన్సీని వెంట తీసుకెళ్లొచ్చు. ట్రామా సెంటర్ ప్రారంభం: భారత ప్రభుత్వం రూ. 150 కోట్ల వ్యయంతో కఠ్మాండులోని బీర్ ఆస్పత్రిలో నిర్మించిన 200 పడకల ట్రామా సెంటర్ (అత్యవసర చికిత్సా కేంద్రం)ను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఏకాభిప్రాయ సాధన ద్వారా నేపాల్ రాజ్యాంగాన్ని వచ్చే ఏడాది తొలినాళ్లలోగా రాసుకోవాలని అన్ని రాజకీయ పక్షాలను కోరారు. ఈ విషయంలో తమకు ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేకపోవడం వల్ల సాయం చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నామన్నారు. ఈ ట్రామా సెంటర్లో 14 ఐసీయూ లు, ట్రామా వార్డులో 150 పడకలు, ఆరు ఆపరేషన్ థియేటర్లు మొదలైనవి ఉన్నాయి. నేపాల్‌కు బోధి వృక్షం మొక్క, ధ్రువ్ హెలికాప్టర్ భారత్, నేపాల్‌లు పంచుకుంటున్న బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా భారత్‌లోని గయలో బుద్ధ భగవానుడు 2,600 ఏళ్ల క్రితం జ్ఞానం పొందిన బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ప్రధాని మోదీ మంగళవారం నేపాల్‌కు కానుకగా ఇచ్చారు. ట్రామా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. బుద్ధుడు పుట్టిన లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం ఆవరణలో ఈ మొక్కను తమ దేశ రాయబారి ఈ నెల 28న నాటుతారన్నారు. అలాగే నేపాల్‌తో సంబంధాల బలోపేతం విషయంలో భారత్ నిబద్ధతను చాటుతూ ప్రధాని మోదీ ఆ దేశానికి ధ్రువ్ మార్క్-3 రకానికి చెందిన అత్యుధునిక తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)ను బహూకరించారు. కఠ్మాండులోని నేపాల్ సైనిక పెవిలియన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ ప్రధాని, రక్షణ మంత్రి అయిన సుశీల్ కోయిరాలాకు దీన్ని అందించారు. సుమారు రూ. 60 కోట్ల నుంచి రూ. 80 కోట్ల మధ్య ఖరీదు చేసే ఈ హెలికాప్టర్ ఇద్దరు పైలట్లు, 14 మంది ప్రయాణికులతో ప్రయాణించగలదు. -
‘తమ్ముళ్ల’ స్వలాభం.. అభివృద్ధికి శాపం
పదేళ్ల పాటు అధికారం లేకపోవడం వల్ల తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయన్న విషయంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో అన్ని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. ప్రతి పనీ తమకే కావాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పాడైన రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు 151 పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా 76 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో 2,664 రోడ్డు పనుల కోసం రూ.493.06 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కూడా 1,583 పనులు ప్రాంరభానికి నోచుకోలేదు. హెచ్ఎల్సీ, యాడికి కెనాల్, మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ (అనంతపురం) ఆధునికీకరణ పనుల కోసం రూ.1,084.83 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు కూడా నత్తను తలపిస్తుండడంతో తుంగభద్ర జలాశయం నుంచి వస్తున్న నీటిలో చాలావరకు ఇంకి పోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానికి గానూ సర్వశిక్షా అభియాన్ ద్వారా 716 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఒక్కో గదికి గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.6.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.7.30 లక్షల చొప్పున మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 58 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తమ పార్టీ కార్యకర్తలకే పనులు అప్పగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. విద్యాశాఖాధికారులకు హుకుం జారీ చేయడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. అనంతపురం సర్వజనాస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.89 కోట్లు మంజూరు చేయాలంటూ గత ఏడాది ఆస్పత్రి కమిటీ ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో పశు వైద్యశాలలకు 64 భవన నిర్మాణాల కోసం రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.8.55 కోట్లు మంజూరయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా ఇంత వరకు భవన నిర్మాణాలు ప్రారంభ ం కాలేదు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) పరిధిలో ఒక్కో గోపాలమిత్ర సెంటర్ నిర్మాణానికి రూ.7.50 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. జిల్లాకు 114 సెంటర్లు కేటాయించగా.. అందులో 56 సెంటర్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తక్కిన పనులు మొదలు పెట్టలేదు. జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ శాఖలలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, దోబీఘాట్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు బీఆర్ జీఎఫ్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.43.91 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పనికూడా ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 53 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేసిన ‘ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్’ నిర్మాణానికి 2011లో రూ.35 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు శిలాఫలకం వేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్‌లో సాంకేతిక సమస్యల వల్ల జిల్లాలో 75,093 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు దాదాపు రూ.46 కోట్ల మేర బిల్లులు పెండింగ్ పడ్డాయి. స్వయం ఉపాధికి సంబంధించి 9,154 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రూ.43.05 కోట్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు కింద జిల్లాకు రూ.68 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. రాజకీయ కారణాలతో స్టోర్ డీలర్లను తొలగిస్తుండడంతో కార్డుదారులకు రేషన్ సక్రమంగా అందక అవస్థ పడుతున్నారు.