
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
ఎన్‌హెచ్‌ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment