Optical fiber
-
10 వేల కిలోమీటర్ల డిజిటల్ హైవేలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్హెచ్ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది. -
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్- స్టెర్టెక్.. జూమ్
ఊగిసలాట మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 96 పాయింట్లు పుంజుకుని 39,140ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,547 వద్ద ట్రేడవుతోంది. కాగా.. సానుకూల వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఆప్టికల్ ఫైబర్ సేవల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో ఈ రెండు కౌంటర్లూ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్లిక్స్ గ్రూప్‌తో విలీనానికి వీలుగా సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకున్నట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రెండు సంస్థల మధ్యా ఇందుకు అవసరమైన పరిశీలన పూర్తయినట్లు తెలియజేసింది. ఈ ఏడాది జూన్‌లో క్లిక్స్ గ్రూప్‌ను బ్యాంకులో విలీనం చేసుకునేందుకు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. తద్వారా క్లిక్స్ క్యాపిటల్కున్న రూ. 1900 కోట్ల ఫండ్‌తోపాటు.. రూ. 4,600 కోట్ల ఆస్తులు బ్యాంకుకు బదిలీకానున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 22.40 వద్ద ఫ్రీజయ్యింది. స్టెరిలైట్ టెక్నాలజీస్ ఆధునిక ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్టెరిలైట్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. తద్వారా కస్టమర్లకు ప్రపంచస్థాయి సర్వీసులను ఎయిర్టెల్ అందించే వీలుంటుందని తెలియజేసింది. ఎయిర్‌టెల్‌కు చెందిన 10 సర్కిళ్లలో ఆప్టికల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తాజా నెట్వర్క్ ద్వారా 5జీ, ఫైబర్ టు హోమ్, ఐవోటీ తదితర సర్వీసులను ఎయిర్టెల్ సమర్ధవంతంగా అందజేయవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో స్టెరిలైట్ టెక్నాలజీస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 165 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 167 వరకూ ఎగసింది. -
రిలయన్స్ జియోకు ట్రిబ్యునల్‌లో విజయం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఆప్టికల్ ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్ స్కీమ్ ప్రకారం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ వాదించింది. -
హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ఖమ్మం జెడ్పీసెంటర్:జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేగంగా ఆన్లైన్ సేవలందించేందుకు ఆప్టికల్ ఫైబర్ఆధారిత హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి పేర్కోన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తనచాంబర్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనుల ప్రగతిపై అటవీశాఖ,పవర్‌గ్రిడ్,బిఎస్‌ఎన్‌ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్కు ద్వారా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1800 కిలో మీటర్ల మేర ఆప్టికల్ కేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వరకు 500 కిలో మీటర్ల భూగర్భం గుండా వేసినట్లు తెలిపారు. అటవీమార్గం ద్వారా కేబుల్ వేసే సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతోమాట్లాడి పరిష్కరించాలన్నారు. రాత పూర్వకంగా ఆమోదం పొందాలన్నారు. జిల్లాలో ఖమ్మం అర్బన్, జూలూరుపాడు,గార్ల, సింగరేణి మండలాల్లో కేబుల్ వేసే పనులు పూర్తయినట్లు తెలిపారు. ఆర్అండ్బీ,పీఆర్,అటవీశాఖలకు సంబంధించి రోడ్డు క్రాసింగ్ ఉన్నట్లయితే ముందుగా ఆయా శాఖల అధికారులకులిఖిత పూర్వకంగా తెలపాలన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సహకరించాలన్నారు. మండల స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక మండల పరిషత్ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. మళ్లీ 15 రోజుల్లో సమావేశం ఉంటుందని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ సతీష్,పవర్‌గ్రిడ్ డీజీఎం వీఆర్‌రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాత్రంతా మాట్లాడుకో..!
ఈనెల 1 నుంచి ఉచిత కాల్స్ ల్యాండ్ లైన్ నుంచి ఏ ఫోన్‌కైనా.. బీఎస్ఎన్ఎల్ అపూర్వ కానుక కరీంనగర్ క్రైం : ల్యాండ్ ఫోన్లకు ఆదరణ పెంచేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త పథకం ప్రవేశపెట్టింది. మే డే సందర్భంగా ల్యాండ్ ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జిల్లాలో 23 వేలకు పైగా ల్యాండ్ లైన్ వినియోగదారులు, 9 వేలకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులున్నారు. మొబైల్ రాకతో క్రమంగా వినియోగదారులు సంఖ్య తగ్గిపోరుుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకనే వారు తప్ప ల్యాండ్ ఫోన్లు వినియోగించేవారే లేరు. ల్యాండ్‌ఫోన్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడునే అవకాశం కల్పించింది. బీఎస్ఎన్ఎల్తో పాటు ఇతర ఆపరేటర్లకు చెందిన ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితం మాట్లాడుకునే అవకాశం కల్పించింది. లోకల్, ఎస్డీడీ కాల్స్ కూడా ఉచితమే. కొత్త కనెక్షన్ కోసం రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ అద్దె పట్టణాల్లో ఈ నెల 1 నుంచి రూ.220, గ్రామీణపరిధిలో రూ.160. యువతే టార్గెట్ మారుతున్న నగర జీవన ైశె లిలో రాత్రి 11 తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఈక్రమంలో రాత్రి వేళల్లోనే కుర్రకారు ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీరే కాకుండా వివిధ ఉద్యోగాలు చేసే వారు సైతం రాత్రి వేళనే తీరిగ్గా ఉంటుండడంతో ఈ పథకానికి క్రేజీ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా హైదారాబాద్ వంటి మహానగరాల్లో ఉన్న ఆప్టికల్ ఫైబర్ ఫర్ హోమ్ పథకాన్ని జిల్లాలోనూ ప్రవేశపెట్టాలని కొంతకాలంగా వినియోగదారులు కోరుతున్నారు. జిల్లాలో ఉన్న అండర్ గ్రౌండ్ కేబుల్స్‌తో ఇంటర్నెట్ వేగం బాగా తగ్గుతోందని దీనికి తోడు అనేక చోట్ల అతుకులుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇప్పటికైనా డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్య కల్పించాలని కోరుతున్నారు.