ఖమ్మం జెడ్పీసెంటర్:జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేగంగా ఆన్‌లైన్ సేవలందించేందుకు ఆప్టికల్ ఫైబర్‌ఆధారిత హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి పేర్కోన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తనచాంబర్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనుల ప్రగతిపై అటవీశాఖ,పవర్‌గ్రిడ్,బిఎస్‌ఎన్‌ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్కు ద్వారా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 1800 కిలో మీటర్ల మేర ఆప్టికల్ కేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వరకు 500 కిలో మీటర్ల భూగర్భం గుండా వేసినట్లు తెలిపారు. అటవీమార్గం ద్వారా కేబుల్ వేసే సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతోమాట్లాడి పరిష్కరించాలన్నారు. రాత పూర్వకంగా ఆమోదం పొందాలన్నారు. జిల్లాలో ఖమ్మం అర్బన్, జూలూరుపాడు,గార్ల, సింగరేణి మండలాల్లో కేబుల్ వేసే పనులు పూర్తయినట్లు తెలిపారు.
ఆర్‌అండ్‌బీ,పీఆర్,అటవీశాఖలకు సంబంధించి రోడ్డు క్రాసింగ్ ఉన్నట్లయితే ముందుగా ఆయా శాఖల అధికారులకులిఖిత పూర్వకంగా తెలపాలన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సహకరించాలన్నారు. మండల స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక మండల పరిషత్ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. మళ్లీ 15 రోజుల్లో సమావేశం ఉంటుందని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ సతీష్,పవర్‌గ్రిడ్ డీజీఎం వీఆర్‌రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు
Published Thu, May 14 2015 4:38 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement