Internet connectivity
-
10 వేల కిలోమీటర్ల డిజిటల్ హైవేలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్హెచ్ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది. -
టెలికాం కంపెనీల మధ్య డేటా యుద్ధం
-
ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ.3,050 కోట్ల జరిమానా
• టెలికం శాఖకు ట్రాయ్ సిఫారసు • జియోకు ఇంటర్కనెక్షన్ సర్వీసులివ్వకపోవడమే కారణం న్యూఢిల్లీ: కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇంటర్ కనెక్టివిటీ సర్వీసులు నిరాకరించిన ఫలితంగా భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లపై రూ.3,050 కోట్ల జరిమానా విధించాలని టెలికం శాఖకు రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం సిఫారసు చేసింది. ఎయిర్టెల్, వొడాఫోన్ విషయంలో జమ్మూ- కాశ్మీర్ మినహా 21 సర్కిళ్లకు రూ.50 కోట్ల చొప్పున, అలాగే ఐడియాపై ఇంతే మొత్తాన్ని 19 సర్కిళ్లకు విధించాలన్నది ట్రాయ్ సిఫారసుల సారాంశం. మూడు టెలికం సంస్థల ధోరణి పోటీ తత్వానికి, వినియోగదారుల ప్రయోజనానికి విఘాతమని పేర్కొంది. సెప్టెంబర్ 5న జియో సేవలను ప్రారంభించింది. అయితే తనకు తగిన సంఖ్యలో ఇంటర్కనెక్షన్ పోర్ట్స్‌ను అందించడానికి పోటీ కంపెనీలు నిరాకరించినట్లు ట్రాయ్‌కి జియో ఫిర్యాదు చేసింది. దీనివల్ల తన నెట్‌వర్క్‌పై భారీగా ‘కాల్ వైఫల్యాలు’ వచ్చినట్లు వివరించింది. కాగా జరిగిన పరిణామంపై వ్యాఖ్యానించడానికి టెలికం కంపెనీలు నిరాకరించాయి. -
9 వేల కోట్ల డాలర్లకు భారత్ ఈ కామర్స్!
* 2021కల్లా చేరే అవకాశం * ఈటెయిలింగ్ ఇండియా అంచనా ముంబై: ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం 1,300 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2021 కల్లా 9,000 కోట్ల డాలర్లకు (రూ. 5.5 లక్షల కోట్లు) పెరుగుతుందని ఈటెయిలింగ్ ఇండియా వ్యవస్థాపకులు అశిష్ జలాని చెప్పారు. ఈ 700 శాతం వృద్ధి కారణంగా కంపెనీల భవిష్యత్ ఆన్లైన్ ప్రకటనల బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా మార్పులు, చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో రిటైల్ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఈ కామర్స్ పరిశ్రమ కొన్ని సంవత్సరాల్లోనే పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగిందని వివరించారు. యాపిల్ సంస్థ కారణంగా సంగీత పరిశ్రమలో భారీగా మార్పులు, చేర్పులు వచ్చినట్లుగానే ఈ కామర్స్ పరిశ్రమ రిటైల్ రంగాన్నే కాకుండా ప్రకటనల రంగాన్ని కూడా బాగానే ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో అధికులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి సంస్థల మొత్తం ట్రాఫిక్‌లో 35 శాతం స్మార్ట్ఫోన్ల ద్వారానే వస్తోందని వివరించారు. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో వేల సంఖ్యలో కొత్త వినియోగదారులు అందుబాటులోకి వస్తారని వివరించారు. ఈ ఏడాది చివరి కల్లా అమెరికాలో కంటే కూడా భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని గూగుల్ ఇండియా ఇటీవలనే పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2018 కల్లా భారత్‌లో అన్లైన్ వినియోగదారుల సంఖ్య 50 కోట్లుగా ఉంటుందని అంచనాలున్నాయన్నారు. -
జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బంద్
జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు ఆదివారం శ్రీనగర్‌లో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పుకార్లు షికార్లు చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన మత ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు. దీంతో ఆ జిల్లాతోపాటు మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ నిరంతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఘర్షణ చెలరేగే అవకాశం ఉండదిని నిఘా సమాచారం మేరకు ముందస్తూ చర్యల్లో భాగంగా ఉధ్దంపుర్ జిల్లాలో ఆదికారులు ఆదివారం కర్ప్యూ విధించారు.