జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు ఆదివారం శ్రీనగర్లో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పుకార్లు షికార్లు చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కిష్ట్‌వార్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన మత ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు. దీంతో ఆ జిల్లాతోపాటు మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ నిరంతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఘర్షణ చెలరేగే అవకాశం ఉండదిని నిఘా సమాచారం మేరకు ముందస్తూ చర్యల్లో భాగంగా ఉధ్దంపుర్ జిల్లాలో ఆదికారులు ఆదివారం కర్ప్యూ విధించారు.