తెలంగాణ నగరాలకు రూ. 1673 కోట్లు!
అటల్ మిషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కింద తెలంగాణలోని 12 నగరాలకు కలిపి మొత్తం రూ. 1673 కోట్లను రాబోయే ఐదేళ్లలో వెచ్చించనున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 832 కోట్లను సాయంగా అందిస్తుంది. ఇందులో భాగంగా వరంగల్ నగరంలో నీటి సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు రాబోయే మూడేళ్లలో రూ. 425 కోట్లు వెచ్చించనున్నారు. కేంద్ర ప్రయోజిత పథకమైన 'అమృత్' కింద మొత్తం ఈ రూ. 1673 కోట్లు వెచ్చిస్తారు. మొత్తం నిధులను 2019-20 లోగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 703 కోట్లు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ఆమోదించారు. దాంతో ఈ మిషన్ కింద పెట్టుబడుల మొత్తం రూ. 1673 కోట్లకు చేరుకుంది.
అమృత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందించాలని, అందులో ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు మురుగునీటి పైపులైన్లను విస్తరించడం, నగరాల్లో ప్రతియేటా బహిరంగ, హరిత ప్రాంతాలను విస్తరించడం తప్పనిసరి అని లక్ష్యం విధించారు. ఇందుకు దేశవ్యాప్తంగా 500 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో తెలంగాణ రాష్ట్రంలోనివి 12 ఉన్నాయి.
నగరం |
నీటిసరఫరా (రూ. కోట్లలో) |
మురుగునీటి వ్యవస్థ (రూ. కోట్లలో) |
పార్కులు (రూ. కోట్లలో) |
మొత్తం (రూ. కోట్లలో) |
వరంగల్ | 424.26 | 0 | 1.44 | 425.70 |
సిద్దిపేట | 0 | 100 | 1.5 | 101.5 |
ఖమ్మం | 47.84 | 0 | 1 | 48.84 |
మహబూబ్‌నగర్ | 41.58 | 0 | 1.5 | 43.08 |
నిజామాబాద్ | 4.52 | 26 | 1.79 | 32.31 |
కరీంనగర్ | 24.98 | 0 | 1.5 | 26.48 |
నల్లగొండ | 11.28 | 0 | 0.75 | 12.03 |
మిర్యాలగూడ | 4.07 | 0 | 1.80 | 5.87 |
సూర్యాపేట | 1.45 | 0 | 1.28 | 2.70 |
జీహెచ్ఎంసీ | 0 | 0 | 2.02 | 2.02 |
రామగుండం | 0 | 0 | 1.50 | 1.50 |
ఆదిలాబాద్ | 0 | 0 | 0.95 | 0.95 |