న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం.
2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్‌బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ..
► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి.
►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది.
►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం.
►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్‌బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది.
►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి.
►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment