CII
-
భారత 'శ్రమ'కు మస్త్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్నదేశం మనదే. అత్యధికంగా ఉద్యోగ, కార్మిక శక్తి లభ్యత ఉన్న దేశం కూడా భారతే. ఈ భారతీయ వర్క్‌ఫోర్స్‌ను ఇప్పుడు కొన్ని దేశాలు కళ్లకద్దుకొని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత ఉద్యోగ, కార్మిక శక్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అమెరికా వద్దన్నా..డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఆ దేశంలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆసియా, యూరప్‌లో మనవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారత కార్మిక శక్తికి ఇప్పటికే పశ్చిమాసియా అతిపెద్ద జాబ్ మార్కెట్‌గా ఉంది. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ దేశాల్లో 30 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించవచ్చని కేంద్ర కార్మికశాఖ అంచనా వేసింది.ఒక్క సౌదీ అరేబియాలోనే పదేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభించవచ్చని పేర్కొంది. ఆ దేశంలో నిర్మాణ, రిటైల్, రవాణా, స్టోరేజీ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు.సీఐఐతో కలిసి ‘ఫ్రేమ్‌వర్క్’ తయారీసౌదీ, ఖతార్, ఒమన్, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియాలో భారత వర్క్‌ఫోర్స్‌కు అవకాశాలు పెంచేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో కలిసి కేంద్ర కార్మికశాఖ ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. కార్మికుల నైపుణ్యాలు, విద్యార్హతలను గుర్తించి పై దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటం ఈ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని అధికారవర్గాలు తెలిపాయి. ఒమన్‌లో ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఖతార్‌లో ఆతిథ్యం, ఏవియేషన్, స్పోర్టింగ్ ఈవెంట్లతో ముడిపడిన పరిశ్రమలు.. జపాన్‌లో నర్సింగ్, ఆతిథ్యం, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్టేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగాల్లో భారతీయులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, దక్షిణాఫ్రికా, కువైట్, గుయానా, కెనడా, మలేసియాలలో కూడా భారత వర్కర్లకు అవకాశాలు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.యూఏఈ అతిపెద్ద మార్కెట్వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. మనదేశంలో అందుబాటులో ఉన్న వర్క్‌ఫోర్స్ తదితర అంశాలపై విశ్లేషణ కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో నమోదైన డేటాను కేంద్ర కార్మికశాఖ విశ్లేషించింది. దీని ప్రకారం యూఏఈ భారత వర్కర్లకు అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తున్నట్టు వెల్లడైంది. 2023–24లో ఇజ్రాయెల్‌లో భారత వర్కర్లకు గణనీయంగా ఉద్యోగాలు లభించాయి. నిపుణులకు జర్మనీ ఆహ్వానంజర్మనీలో వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల మంది భారతీయ వర్కర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. జర్మనీ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఆ దేశంలో 70 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఏర్పడనుంది. ఆస్ట్రేలియాలో నర్సులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఫిన్లాండ్లో హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం భారతీయులకు కాంట్రాక్టు, ప్రాజెక్టు ఆధారిత ఉపాధి అధికంగా ఉంది. కానీ, ఫుల్‌టైమ్ ఉద్యోగాల కల్పనకు మనదేశం మొగ్గుచూపుతున్నట్టు కార్మికశాఖ చెబుతోంది. -
రాష్ట్రం రూపు రేఖలు మార్చేలా హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల అభివృద్ధికి అర్బన్ మొబిలిటీయే పునాది ‘నగరాల అభివృద్ధి, వాటి భవిష్యత్తులో అర్బన్ మొబిలిటీ పునాదిగా పనిచేస్తుంది. ప్రజలు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో వేగంగా గమ్యాన్ని చేరుకునేలా రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడవుతున్నాయి..’అని సీఎం చెప్పారు. మచిలీపట్నం పోర్టుతో అనుసంధానిస్తాం ‘ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. డ్రైపోర్టు నిర్మాణంతో తెలంగాణను వేర్‌హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తాం. 1.2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే రెండింతలుగా వంద కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మిస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు ఉండగా, కొత్తగా ఓఆర్ఆర్ వెలుపల 360 కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మిస్తాం. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను అనుసంధానం చేసేలా రేడియల్ రింగు రోడ్లు నిర్మిస్తాం. రింగు రోడ్లకు అనుబంధంగా రైల్వే లైన్లు నిర్మించే ఆలోచన ఉంది..’అని రేవంత్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటాం పొరుగు రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా కొనసాగుతూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని సీఎం రేవంత్ చెప్పారు. దావోస్‌లో ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులతో కలిసి రేవంత్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మేము సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నదుల నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం. ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతోంది. మా అత్యంత పెద్ద బలం హైదరాబాద్, అలాగే యువత. మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..’అని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కోరారు. భారతదేశం–రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన – భవిష్యత్తు.. వంటి పలు అంశాలపై ముగ్గురు సీఎంలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘లక్ష కోట్ల మొక్కల్లో..’భాగస్వాములమవుతాం భూమండలంపై లక్ష కోట్ల మొక్కలు నాటే సంకల్పంలో తాము భాగస్వాములు అవుతామని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నికోల్ శ్వాబ్ సమక్షంలో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు ప్రమాణం చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకానికి చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. -
ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా భారత్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది. మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్/సూపర్వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్మెంట్, మేనేజీరియల్/సూపర్వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి. -
సులభతర వ్యాపారానికి పది చర్యలు
వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు పది పాయింట్ల అజెండాను భారతీయ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, నియంత్రణపరమైన కార్యాచరణను సులభంగా మార్చడం, పారదర్శకతను పెంచడం లక్ష్యాలుగా బడ్జెట్‌కు ముందు సీఐఐ ఈ సూచనలు చేయడం గమనార్హం. కేంద్రం, రాష్ట్రం, స్థానిక స్థాయిలో అన్ని నియంత్రణపరమైన అనుమతులను జాతీయ సింగిల్ విండో విధానంలోనే మంజూరు చేయాలి.కోర్టుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని (ADR) తీసుకురావాలి.పర్యావరణ నిబంధనల అమలును క్రమబద్దీకరించేందుకు వీలుగా ఏకీకృత కార్యాచరణను ప్రవేశపెట్టాలి. అన్నింటితో ఒకే డాక్యుమెంట్‌ను తీసుకురావాలి.వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలకు భూమి ఎంతో అవసరం. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించాలి. భూమి రికార్డులను డిజిటైజ్ చేయడం, వివాదాల్లో ఉన్న భూముల సమాచారం అందించడం లక్ష్యాలుగా ఉండాలి.భూసమీకరణలో పరిశ్రమకు సహకరించేందుకు వీలుగా.. చాలా రాష్ట్రాల్లో భూముల సమాచారాన్ని అందించే ‘ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (IILB)’ను కేంద్రం నిధుల సహకారంతో జాతీయ స్థాయి ల్యాండ్ బ్యాంక్‌గా అభివృద్ధి చేయొచ్చు. పరిశ్రమల దరఖాస్తుల మదింపును నిర్ణీత కాల వ్యవధిలో ముగించేందుకు, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలకు చట్టబద్ధమైన కాల పరిమితి నిర్ణయించాలి.కార్మిక చట్ట నిబంధనలు ఇప్పటికీ కష్టంగానే ఉన్నాయి. నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయాలి. అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర కారి్మక చట్ట నిబంధనల అమలుకు కేంద్రీకృత పోర్టల్‌గా శ్రమ్ సువిధ పోర్టల్‌ను అమలు చేయాలి. అథరైజ్డ్ ఎకనమిక్ ఆపరేటర్ (AEO) కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఎన్నో ప్రాధాన్య అనుమతులకు మార్గం సుగమం అవుతుంది. ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రతఆర్థిక వృద్ధి కోసం తప్పదు..‘నియంత్రణ కార్యాచరణను సులభతరం చేయ డం, నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం వచ్చే కొన్నేళ్ల కాలానికి ప్రాధాన్య అజెండాగా ఉండాలి. భూమి, కార్మికు లు, వివాదాల పరిష్కారం, పన్ను చెల్లింపులు, పర్యావరణ అంశాలకు సంబంధించి నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎంతో అవకాశం ఉంది. ఇది పోటీతత్వాన్ని పెంచడంతోపాటు ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది’అని సీఐ ఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
‘ప్రాధాన్యతా’ రుణాల విధానాల్లో సంస్కరణలు అవసరం
ప్రాధాన్యతా రంగాల రుణాలకు (పీఎస్ఎల్) సంబంధించిన విధానాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రాజెక్టులు, ఆరోగ్య సంరక్షణ, వినూత్న ఉత్పత్తుల తయారీ వంటి వర్ధమాన రంగాలు, అత్యధికంగా ప్రభావం చూపగలిగే పరిశ్రమలను కూడా ఈ విభాగంలో చేర్చాలని ప్రతిపాదించింది.ఇందుకోసం కొత్తగా డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ల (డీఎఫ్ఐ) ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేసే అవకాశాలను పరిశీలించాలని సీఐఐ పేర్కొంది. ఇప్పటికే నిర్దిష్ట రంగాల అవసరాలను ప్రస్తుతం ఉన్న సిడ్బీ, నాబ్‌ఫిడ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్) మొదలైనవి తీరుస్తున్నాయని సీఐఐ వివరించింది. పీఎస్ఎల్ విధానం విజయవంతమైనప్పటికీ.. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా దానికి తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం పైగా ఉన్నప్పుడు పీఎస్ఎల్ కేటాయింపు 18 శాతంగా ఉండేదని.. ప్రస్తుతం సాగు రంగం వాటా 14 శాతానికి తగ్గిపోయినప్పుడు కూడా అదే తీరు కొనసాగుతోందని సీఐఐ పేర్కొంది. ఆర్థిక వృద్ధికి భారీగా తోడ్పడగలిగే సత్తా ఉన్నప్పటికీ మౌలిక రంగం, వినూత్న ఉత్పత్తుల తయారీకి పీఎస్ఎల్ పరంగా తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త పరిస్థితులు, జీడీపీలో నిర్దిష్ట రంగాల వాటా, వాటి వృద్ధి అవకాశాల ఆధారంగా పీఎస్ఎల్ విధానాన్ని ప్రతి 3–4 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని సీఐఐ తెలిపింది. -
ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్ అయిదు దేశాల జాబితాలో యూరప్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదీ చదవండి: ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లు
దేశంలో 2030 నాటికి దాదాపు రూ.67 లక్షల కోట్లు విలువ చేసే గృహాల కొరత ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలకు 3.12 కోట్ల కొత్త ఇళ్లు అవసరం అవుతాయని ఇండస్ట్రీ బాడీ సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం జరిగిన ఒక సమావేశంలో సంయుక్తంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి.నివేదికలోని వివరాల ప్రకారం..పెరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల 2030 నాటికి దేశంలోని వివిధ పట్టణ కేంద్రాల్లో 2.2 కోట్ల గృహాలు అవసరం అవుతాయి.ఇందులో 2.1 కోట్ల గృహాలు(95.2 శాతం) ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందుబాటులో ఉండాలి.ప్రస్తుతం 1.1 కోట్ల యూనిట్ల ఇళ్ల కొరత ఉంది. మొత్తంగా 2030 నాటికి వీటి డిమాండ్ 3.2 కోట్లకు చేరనుంది.ఈమేరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ .67 లక్షల కోట్ల రియల్టీ వ్యాపారం జరుగుతుందని అంచనా.ప్రస్తుతం గృహాల కొనుగోలు రుణ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) రూ.6.9 లక్షల కోట్లు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) రూ .6.2 లక్షల కోట్ల రుణ విలువను కలిగి ఉన్నాయి.భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు అందజేసే గృహ రుణ వాటా మరింత పెరగనుంది.కొత్తగా ఇళ్లు కొనేవారు దాదాపు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని అంచనా.మొత్తం రూ.67 లక్షల కోట్ల మార్కెట్లో దాదాపు రూ.45 లక్షల కోట్లు బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు ప్రజలకు ఫైనాన్సింగ్ ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..‘2030 నాటికి దేశంలో పెద్దమొత్తంలో గృహాలు అవసరం అవుతాయి. అప్పటివరకు చాలా ఇళ్ల కొరత కూడా ఏర్పడనుంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ ఏర్పడుతుంది’ అన్నారు. -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
పుంజుకున్న ‘వ్యాపార విశ్వాస సూచీ’
న్యూఢిల్లీ: సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండు త్రైమాసికాల గరిష్ట స్థాయి 68.2కు చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో పరిశ్రమల్లో ఉత్సాహం వ్యక్తమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐఐ నిర్వహించిన మొదటి సర్వే ఇది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సీఐఐ తెలిపింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పండుగల సీజన్ ఈ వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. సీఐఐ 128వ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే 2024 సెపె్టంబర్లో జరిగింది. అన్ని రంగాలు, ప్రాంతాల నుంచి 200 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు సుదీర్ఘకాలం పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరిగిపోవడం, వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించాయి. మరోవైపు వినియోగం మెరుగుపడడం, వర్షాలు మెరుగ్గా పడడం, సంస్కరణల పట్ల సానుకూల ధోరణి వంటి సానుకూలతలనూ పేర్కొన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం సానుకూలమన్నారు. 2024–25 మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు పెట్టుబడులు, అంతకుముందు ఆరు నెలల కాలంతో పోలి్చతే పుంజుకున్నట్టు సర్వేలో 59 శాతం కంపెనీలు తెలిపాయి. రేట్ల కోతపై అంచనాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మొదలు పెట్టొచ్చని 34% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) ఆరంభం కావొచ్చని 31% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
త్వరలో సింగిల్ ఫైలింగ్
ముంబై: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సింగిల్ ఫైలింగ్ ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి రాగలదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ వెల్లడించారు. దీనితో, లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలు తాము వెల్లడించాల్సిన సమాచారాన్ని ఒక ఎక్సే్చంజీలో ఫైలింగ్ చేస్తే రెండో ఎక్సే్చంజీలో కూడా అది ఆటోమేటిక్‌గా అప్లోడ్ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఫైనాన్సింగ్ 3.0 సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మాధవి ఈ విషయాలు తెలిపారు. సెబీ మాజీ హోల్‌టైమ్ సభ్యుడు ఎస్కే మొహంతి సారథ్యంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసింది. మరోవైపు, నెలకు అత్యంత తక్కువగా రూ. 250 నుంచి ప్రారంభమయ్యే సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రతిపాదన కూడా త్వరలో సాకారం కాగలదని కాగలదని మాధవి వివరించారు. అన్ని ఆర్థిక సాధనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక పరిణామం కాగలదని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఐపీవో పత్రాలు..: భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాలను బహుళ భాషల్లో అందుబాటులోకి తేవాలన్న నిబంధనను కూడా ప్రవేశపెట్టే యోచన ఉందని మాధవి చెప్పారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో పాలుపంచుకునేందుకు ఐపీవో ప్రాస్పెక్టస్ 15–16 ప్రాంతీయ భాష ల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇన్వెస్టరు తీరుకు అనుగుణమైన వివిధ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సాధనాలను ప్రవేశపెట్టడంపై పరిశ్రమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు.‘హోల్డ్’లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ‘ఆఫర్’జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తును సెబీ ‘హోల్డ్’లో పెట్టింది. ‘పరిశీలన జారీ చేశాం. దీంతో నిలుపుదల చేశాం’అని సెబీ పేర్కొంది. కారణాలను తెలియజేయలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 16న ఐపీవో పత్రాలను సెబీకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సమరి్పంచడం గమనార్హం. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం.. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 19 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం (ఎంటీపీఏ) ఉండగా.. 60 ఎంటీపీఏ చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవోకు ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్: వీఎఫ్ఎక్స్ సేవల కంపెనీ ‘ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్’ ఐపీవోకి రావాలనుకుంటోంది. ఎన్ఎస్ ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌పై (సూక్ష్మ కంపెనీలకు ఉద్దేశించిన) లిస్ట్ అయ్యేందుకు వీలుగా పత్రాలు సమరి్పంచింది. ఐపీవోలో భాగంగా 36.94 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. సమీకరించే నిధులతో ముంబైలోని అంధేరిలో ఉన్న స్టూడియో, ఆఫీస్ నవీకరణ, అంధేరిలోనే కొత్త శాఖలో సౌండ్ స్టూడియో సెటప్ ఏర్పాటుకు వినియోగించనుంది. లక్నోలో నూతన బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయంపై, రూ.5.34 కోట్ల లాభాన్ని ప్రకటించింది.ఐపీవో షేర్లు.. వారంలోనే విక్రయం!లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది స్వల్పకాల దృష్టితోనే వస్తున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. ఐపీవోలో తమకు కేటాయించిన షేర్లలో 54 శాతం మేర (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయిస్తున్నారు. ఐపీవో ధరతో పోలి్చతే లాభాలతో లిస్టింగ్ అయ్యేవి ఎక్కువ ఉంటుండగా, కొన్ని నష్టాలతో లిస్ట్ కావడం లేదా లిస్ట్ అయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. అయితే, నష్టాలతో లిస్ట్ అయిన వాటి కంటే, లాభాలతో లిస్ట్ అయిన వాటిని విక్రయించే స్వభావం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐపీవోలలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రిటైల్ కోటా సైతం పదులు, వందల సంఖ్యలో అధిక సబ్‌్రస్కిప్షన్లను అందుకుంటోంది. దీంతో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్ల ధోరణి తెలుసుకునేందుకు సెబీ లోతైన అధ్యయనం నిర్వహించింది. 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో 144 ఐపీవోలకు సంబంధించిన డేటాను విశ్లేíÙంచింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగిలిన ఇన్వెస్టర్లు 54 శాతం మేర షేర్లను (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయించారు. ఇందులో 50.2 శాతం షేర్లు వ్యక్తిగత ఇన్వెస్టర్లకు చెందినవి కాగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం 63.3 శాతం షేర్లను వారంలోనే విక్రయించారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 42.7 శాతం షేర్లను లిస్ట్ అయిన వారంలోపే విక్రయించి లాభాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీవోల్లో పాల్గొన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం మేర తమకు కేటాయించిన షేర్లను ఏడాదిలోపు విక్రయించినట్టు సెబీ అధ్యయనంలో తెలిసింది. -
Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్కడ్ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ 12.37 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్కడ్ చెప్పారు. -
కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా. పరిస్థితిని చక్కదిద్దా.. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని నేనే తీసుకొచ్చా. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తా.. బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’..– సీఐఐ ప్రతినిధులతో, మెడ్‌టెక్ జోన్‌లోని భాగస్వాములు, సిబ్బందితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వ్యాఖ్యలు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మెడ్‌టెక్ జోన్‌ను సందర్శించారు. అక్కడ తయారు చేసిన పరికరాల ప్రదర్శనని తిలకించారు. గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ మెడికల్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ మెటీరియల్స్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సదస్సుల్లో మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో విశాఖపట్నంలోనే 8 రోజులు ఉంటూ.. పరిస్థితి మొత్తం చక్కదిద్దిన తర్వాతే వెళ్లాననీ, అదీ తన పని తీరని చెప్పారు. దీంతో విస్తుపోయిన మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ‘హుద్ హుద్ మయంలో ఉన్నారు’ అని చెప్పారు. వెంటనే చంద్రబాబు సర్దుకుని అవును హుద్‌హుద్ సమయంలో ఉన్నానని అన్నారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మెడ్‌టెక్ జోన్‌కి చాలా ఇబ్బందులొచ్చాయని, ఆటంకాలు సృష్టించారని చెప్పారు. జితేంద్ర శర్మ దీన్ని కాపాడారన్నారు. గత ప్రభుత్వం దీనికి ఎలాంటి సహకారం అందించలేదని అన్నారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక ఐటీ పార్క్ క్రియేట్ చేశానని, రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ క్రియేట్ చేశానని చెప్పుకొన్నారు. మూడోసారి సీఎం అయ్యాక 275 ఎకరాల్లో మెడికల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశానన్నారు. ఇది రూ. 10 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ మూడూ చాలా సంతృప్తినిచ్చాయని అన్నారు. మెడ్‌టెక్ జోన్ త్వరలోనే గ్లోబల్ హబ్‌గా మారబోతోందని, దానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ సమయంలో 20 రాష్ట్రాల వారు ఇక్కడ తయారైన సామాగ్రినే వినియోగించినప్పటికీ ఏపీలో గత ప్రభుత్వం వినియోగించలేదని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ పాలసీలు తెవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హాస్పిటల్స్, యూనివర్సిటీలు, డయాగ్నసిస్ సెంటర్స్ భాగస్వామ్యంతో నూతన ఆలోచనల్ని ఆవిష్కరించాలని చెప్పారు. ట్రిపుల్ ఐటీల్ని తానే ప్రారంభించానని చెప్పారు. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని తానే తీసుకొచ్చానన్నారు. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తానని ప్రకటించారు. లండన్, సింగపూర్‌ను మోడల్‌గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.పీ4 విధానంలో భాగస్వామ్యం కండిరాష్ట్ర అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ (పీ4) విధానంలో భాగస్వామ్యం కావాలని సీఐఐ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామన్నారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయన్నారు. ఆర్థికంగా దేశం నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలు పేదరికంలో మగ్గుతుండటం దేశానికి మంచిది కాదన్నారు. 4, 5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఐఐ 2వ యూనివర్సిటీని అమరావతిలో ప్రారంభించాలని కోరారు.పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేంఅనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ అక్విడెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అన్నారు. తన హయాంలో దార్లపూడిలో కాలువ పనులు 70 శాతం జరిగితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2 శాతమే జరిగాయన్నారు.గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఒక భూతం ఉందిని, దన్ని పూర్తిగా కంట్రోల్ చేసే భూత వైద్యులు ప్రజలేనంటూ వ్యాఖ్యలు చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరిగితే తానే అడ్డుకున్నానని అన్నారు.ఆ 500 ఎకరాలు జీఎంఆర్‌కే!సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సంస్థ జీఎంఆర్‌కు మరో 500 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ భూమిని ఏ విధంగా ఉపయోగిస్తారో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆయన గురువారం అనకాపల్లి నుంచి హెలికాప్టర్లో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి, నిర్మాణంలో ఉన్న రన్‌వేపై దిగారు. ఈ విమానాశ్రయంతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయని, తర్వాత శ్రీకాకుళం జిల్లా కూడా కలుస్తుందని మీడియాతో చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే 20న తలపెట్టిందని, తర్వాత వీళ్లు (వైఎస్సార్సీపీని ఉద్దేశించి) వచ్చి ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి తెచ్చారని వ్యాఖ్యానించారు. 500 ఎకరాలపై లేనిపోని సమస్యలు సృష్టించారన్నారు. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేట వద్ద విమానాశ్రయాలు నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.ప్రజాప్రతినిధులకు చేదు అనుభవంమెడ్టెక్ జోన్ గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉంది. అయినా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన పల్లా శ్రీనివాస్‌కు, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుని అక్కడి కార్యక్రమంలో వేదిక పైకి ఆహ్వానించలేదు. దీంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు.వలంటీర్లతో పనేముంది? మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వలంటీర్లతో పనేముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో విశాఖ ఎయిర్‌పోర్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వలంటీర్ల వ్యవస్థను ప్రస్తావించారు. వలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. తొలిసారిగా సచివాలయ ఉద్యోగులతో అద్భుతంగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇక వలంటీర్లతో పనేముందంటూ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి బీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలని, ఈ బీచ్రోడ్ని శ్రీకాకుళం వరకూ వెయ్యాలని సూచించారు.దేశవ్యాప్త నిరసనతో దాడులపై వెనక్కిటీడీపీ మూకలు విశాఖలోని డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై దాడి చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ దాడులను దేశం మొత్తం ఖండించడంతో సీఎం చంద్రబాబు వెనక్కితగ్గేలా మాట్లాడారు. ఇకపై దాడులు, ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదనీ, చట్ట ప్రకారం ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. -
‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది. -
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి వేగవంతానికి వీలుగా మోదీ సర్కారు కారి్మక, భూ, సాగు సంస్కరణలు చేపట్టాలని పరిశ్రమల సంఘం సీఐఐ కేంద్రానికి సూచించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే అంచనాలు విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 8 శాతం మేర నమోదవుతుందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్‌పురి అంచనా వేశారు. సీఐఐ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన ఎన్నో విధానపనరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్టు చెప్పారు. ‘‘అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఆధారపడి ఉన్నాయి. మన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తృతం చేయడం, పెట్టుబడులు, వినియోగం, సాధారణ వర్షపాతంపై అంచనాలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి’’అని పురి వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పుంజుకున్నట్టు చెప్పారు. జీఎస్టీలో మూడు రకాల రేట్లే ఉండాలని, పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించే స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్‌ను యూనికార్న్‌లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్‌ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్‌ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : హోటల్ వెస్టిన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదస్సు ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపక అవకాశాలు’అంశంపై సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తాం.. ఇందులో భాగంగా 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం.స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని..గతంలో అవుటర్ రింగ్‌రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఐఐ సదస్సులో సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం.పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. గర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. -
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ.. ► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి. ►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది. ►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం. ►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది. ►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి. ►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. -
బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం.. భారత క్రీడారంగంలో తొలి లీడర్‌గా..!
ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏ వ్యక్తికి దక్కని అరుదైన గౌరవం బీసీసీఐ కార్యదర్శి జై షాకు దక్కింది. షా.. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. CONGRATULATIONS to BCCI Honorary Secretary @JayShah on being awarded the Sports Business Leader of the Year Award at the @FollowCII Sports Business Awards 2023. A first for any leader in Indian Sports administration, this recognition is truly deserved! His leadership has left an… pic.twitter.com/FkPYyv9PI3 — BCCI (@BCCI) December 5, 2023 క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబర్చినందుకు గాను ఈ ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. షా ఆధ్వర్యంలో ఇటీవల వన్డే వరల్డ్‌కప్, దానికి ముందు శ్రీలంకలో ఆసియా కప్ జరిగిన విషయం తెలిసిందే. షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్ (WPL) పురుడుపోసుకుంది. ఇతని ఆధ్వర్యంలోనే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది. షా తన నాయకత్వ లక్షణాలతో ప్రపంచ క్రికెట్‌ను కూడా ప్రభావితం చేశాడు. ఇటీవల భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023కు విజయవంతంగా నిర్వహించడం ద్వారా అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంలోనూ షా కీలకపాత్ర పోషించాడు. క్రికెట్‌కు అతను చేసిన ఈ సేవలను గుర్తించే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఉత్తమ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా ఎంపిక చేసింది. -
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో దేశీయంగా డేటా సెంటర్లలోకి దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ గణనీయంగా మెరుగుపడటంతో స్టోరేజీ సామర్థ్యాలకు డిమాండ్ పెరగడం, క్లౌడ్ కంప్యూటింగ్.. ఐవోటీ.. 5జీ వినియోగం, ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియ మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘కోవిడ్ మహమ్మారి అనంతరం భారత డేటా సెంటర్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. 2020 నుంచి మొత్తం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించింది. గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి‘ అని నివేదిక పేర్కొంది. 2023 ఆగస్టు ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 819 మెగావాట్ల మేర సామర్థ్యాలతో డేటా సెంటర్లు ఉన్నాయి. 2026 నాటికి విస్తీర్ణం 2.3 కోట్ల చ.అ.కు, సామర్థ్యం 1800 మెగావాట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్తగా అందుబాటులోకి రాబోయే డేటా సెంటర్ సామర్థ్యాల్లో సగ భాగం ముంబైలోనే ఉండొచ్చని పేర్కొంది. మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్టర్ల ఆసక్తి.. స్థిరమైన ఆదాయం, మెరుగైన రాబడు లు పొందేందుకు డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వివరించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఆపరేటర్లతో అంతర్జాతీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు, డెవలపర్లు చేతులు కలుపుతున్నారు. సైట్ల కొరత ఉన్న మార్కెట్లలో డెవలపర్లు భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ముందుగానే స్థలాన్ని సమకూర్చుకుని ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
ఆరు పట్టణాల్లో పెరిగిన గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్పేస్ - అక్కడే అధికం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల (గ్రీన్ సర్టిఫైడ్) ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో గడిచిన మూడున్నరేళ్లలో 36 శాతం పెరిగి 342 చదరపు అడుగులకు చేరుకుంది. 2019 నాటికి గ్రీన్ ఆఫీస్ స్పేస్ 251 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, వాణిజ్య సంఘం సీఐఐ సంయుక్తంగా ఓ నివేదిక రూపంలో తెలియజేశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈఎస్జీ నియంత్రణలపై దృష్టి సారించడం.. ఆధునిక, ప్రీమియం, పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులకు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో డిమాండ్‌ను పెంచుతుందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది. ఈఎస్జీ, దాని అమలుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆధునిక, టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ అనుకూల వసతులకు రానున్న త్రైమాసికంలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి పర్యావరణ అనుకూల కార్యాలయ వసతుల్లో 68 శాతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలోనే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లో 51.9 మిలియన్ చదరపు అడుగుల మేర పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులు ఉంటే, బెంగళూరులో 104.5 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 70.2 మిలియన్లు, ముంబైలో 56.6 మిలియన్లు, చెన్నైలో 32.6 మిలియన్లు, పుణెలో 26.2 మిలియన్ చదరపు అడుగుల చొప్పున ఈ వసతులు ఉన్నట్టు వెల్లడించింది. పర్యావరణ అనుకూల, ఇంధన ఆదా కార్యాలయ భవనాలకు దేశీ, బహుళజాతి కంపెనీల నుంచి డిమాండ్ పెరిగినట్టు అర్బన్ వోల్ట్ సహ వ్యవస్థాపకులు అమల్ మిశ్రా ఈ నివేదికలో పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలపై పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శమన్నారు. -
స్పేస్ కంపెనీలకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో (స్పేస్) పనిచేసే కంపెనీలకు పన్ను మినహాయింపులు కలి్పంచడం వల్ల గణనీయమైన వృద్ధికి ఊతమిచి్చనట్టు అవుతుందని డెలాయిడ్–సీఐఐ నివేదిక సూచించింది. పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించేందుకు, తుది ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోడీపడేందుకు వీలుగా.. చేపట్టాల్సిన పన్ను సంస్కరణలపై వివరణాత్మకమైన అధ్యయనం చేపట్టాలని పేర్కొంది. ‘‘భారత సర్కారు స్పేస్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని ప్రారంభించింది. పన్ను మినహాయింపులు, పన్నురహితం దిశగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తం వ్యాల్యూ చైన్ ప్రయోజనం పొందుతుంది’’అని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రంగానికి సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న చర్యలు, వాటి ప్రభావంపై విస్తృత అధ్యయనం అవసరమని సూచించింది. దీన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకుని, భారత్ అదనంగా తన వంతు చర్యలను అమలు చేయాలని, ఇండియన్ స్పేస్ పాలసీ 2023ను ఎప్పటికప్పుడు నవీకరించాలని కోరింది. అంతర్జాతీయ, భారత అంతరిక్ష రంగం మార్కెట్ పరిమాణం.. ఈ రంగానికి సంబంధించిన విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, పెట్టుబడుల వ్యూహాలు, ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో చురుకైన భాగస్వామ్యాల దిశగా పనిచేస్తోందని.. తద్వారా అంతరిక్ష పరిశోధనా అభివృద్ధికి, స్పేస్ టెక్నాలజీల వృద్ధికి దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ భాగస్వామ్యాలు మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, పరిశోధనా ల్యాబ్‌లకు చేరుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. -
ఏసీసీ బ్యాటరీకి మహర్దశ
న్యూఢిల్లీ: దేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ భారీ వృద్ధిని చూడనుంది. డిమాండ్ ఏటా 50 శాతం కాంపౌండెడ్ చొప్పున (సీఏజీఆర్) పెరుగుతూ, 2022 నాటికి ఉన్న 20 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) నుంచి.. 2030 నాటికి 220 గిగావాట్ అవర్‌కు చేరుకుంటుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ వృద్ధికి స్థానికంగా అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ, బలమైన స్థానిక సరఫరా మద్దతునిస్తాయని పేర్కొంది. మొత్తం వ్యాల్యూచైన్ (మెటీరియల్ ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ఇంటెగ్రేషన్)లో అధిక భాగాన్ని భారత్ స్థానికంగానే తయారు చేసే స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ అధ్యయనం కోసం 6డబ్ల్యూరీసెర్చ్ సాయాన్ని సీఐఐ తీసుకుంది. ‘‘వాహనం పవర్‌ట్రెయిన్‌ను బ్యాటరీ నడిపిస్తుంది. మెరుగైన బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) అభివృద్ధికి వీలుగా, బ్యాటరీ టెక్నాలజీలో పురోగతి అవసరం. తయారీ సామర్థ్యాల ఏర్పాటు, జాతీయ స్థాయిలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా బలోపేతం చేయడమే కాకుండా.. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్‌కు అధిక నాణ్యత, వినూత్నమైన బ్యాటరీ మెటీరియల్స్‌ను సరఫరా చేసే విశ్వసనీయ సరఫరా వ్యవస్థలు అవసరం’’ అని సీఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ అయిన విపిన్ సోది తెలిపారు. మైనింగ్‌ను ప్రోత్సహించాలి.. కోబాల్ట్, నికెల్, లిథియం, కాపర్ మైనింగ్, రిఫైనింగ్‌ను దేశీయంగా ప్రోత్సహించాలని సీఐఐ నివేదిక సూచించింది. బ్యాటరీ తయారీలో వినియోగించే కీలకమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. బ్యాటరీ తయారీని పెంచేందుకు వీలుగా పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో మద్దతుగా నిలవాలని అభిప్రాయపడింది. అలాగే, ఖనిజాల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు (ఆర్అండ్డీ) ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీ కోసం ఇతర దేశాలతో సహకారం ఇచ్చిపుచ్చుకోవడం, బ్యాటరీ కెమికల్స్ పరిశ్రమ పర్యావరణ ఇతర అనుమతులు, లైసెన్స్‌లను పొందే విషయంలో నియంత్రణలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కేంద్ర సర్కారు 20 గిగావాట్ అవర్ ఏసీసీ తయారీకి వీలుగా ఉత్పత్తి ఆధారిత అనుసంధాన పథకం కింద (పీఎల్ఐ) రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దేశీయంగా బ్యాటరీల ముడిసరుకు ఉత్పత్తి ► ఎల్ఎఫ్పీ తయారీలో ఆల్ట్‌మిన్ బ్యాటరీల్లో కీలకమైన క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ (క్యామ్)కి సంబంధించిన ముడి సరుకు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ)ని తొలిసారి దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ఆల్ట్‌మిన్ శ్రీకారం చుట్టింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖలో భాగమైన ఏఆర్‌సీఐ తోడ్పాటుతో పైలట్ ప్రాతిపదికన 10 మెగావాట్ల సామర్ధ్యంతో ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు మౌర్య సుంకవల్లి, కిరీటి వర్మ తెలిపారు. దీనిపై దాదాపు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. విద్యుత్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామరŠాధ్యన్ని 3 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు 2025 నాటికి 25 గిగావాట్లు, 2030 నాటికి 150 గిగావాట్ల సామర్ధ్యం అవసరమవుతుందని చెప్పారు. ఎల్ఎఫ్పీ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్ఎఫ్పీకి అవసరమయ్యే లిథియంను బొలీవియా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. -
ఆఫ్రికా వైపు దేశీ ఇన్ఫ్రా కంపెనీల చూపు..
న్యూఢిల్లీ: దేశీ ఇన్ఫ్రా కంపెనీలు తాజాగా ఆఫ్రికాలో పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏటా 130–176 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. భారత్–ఆఫ్రికా అభివృద్ధిలో భాగస్వామ్యం అంశంపై జరిగిన 18వ సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆఫ్కాన్స్ ఎండీ ఎస్ పరమశివన్ ఈ విషయాలు తెలిపారు. ఆఫ్రికాలో ఇన్ఫ్రా అభివృద్ధి నిధులకు సంబంధించి 60–160 బిలియన్ డాలర్ల మేర లోటు ఉందని ఆయన చెప్పారు. వివిధ విభాగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గత దశాబ్దకాలంలో ఆఫ్రికా ఏటా సగటున 80 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించింది, ఈ పెట్టుబడుల రేటు అత్యధికమని పరమశివన్ చెప్పారు. ఇంధన రంగంలో అత్యధికంగా పెట్టుబడులు రాగా, రవాణా .. ఇన్ఫ్రా రెండో స్థానంలో, జల మౌలిక సదుపాయాలు మూడో స్థానంలో ఉన్నాయని వివరించారు. ఆఫ్రికాలో రవాణాపరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు 50 శాతం నుంచి 175 శాతం మేర పెరిగిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా మార్కెట్లో ఆఫ్రికన్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, పోటీపడే పరిస్థితి ఉండటం లేదని పరమశివన్ చెప్పారు. 3 కోట్ల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఆఫ్రికాలో 84,000 కి.మీ. మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత కొన్నేళ్లలో ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ 11 బిలియన్ డాలర్ల ఇవ్వగా, పలు కంపెనీలు తోడ్పాటు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. -
సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. అలాగే, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమాని సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్–బేరర్లను ఎన్నుకున్నారు. -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
రామేశ్వర్‌రావుకు సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ టైకూన్, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావును సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన సీఐఐ గ్రీన్ సిమెంటెక్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. రామేశ్వర్రావు తరఫున ఆయన కుమారుడు వైస్ చైర్మన్ జూపల్లి రామురావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్లో రామేశ్వర్రావు సీఐఐ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. -
CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం
‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. సీఐఐ దక్షిణ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది. సీఐఐ చైర్మన్ టీజీ త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్ అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్ ఐకాన్ అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు. -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5–7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇతర టెలికం సంస్థలు ఇంకా పూర్తిగా కవర్ చేయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ సర్వీసులు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కోలకు గట్టి పోటీనివ్వడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో టెలికం సేవలకు బీఎస్ఎన్ఎల్ కీలకంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏటా రూ. 500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెంచే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. నవకల్పనలు, అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేస్, రక్షణ శాఖ తగు తోడ్పాటు అందిస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైల్వేస్ ఇప్పటికే 800 స్టార్టప్‌లతో, రక్షణ శాఖ 2,000 పైచిలుకు స్టార్టప్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వివరించారు. -
బీ20 చెయిర్‌గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించండి.. ఆర్బీఐకి సీఐఐ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది. దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది. -
3.8 బిలియన్ డాలర్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: దేశంలో గిడ్డంగుల స్థలానికి డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో దేశంలో 22.3 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్ ఉందని, దీని కోసం 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం ఉందని సీఐఐ – అనరాక్ ‘ఇండియా వేర్‌హౌసింగ్’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ రంగం 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులను కలిగి ఉందని అనరాక్ క్యాపిటల్ ఎండీ అండ్ సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు. 2018లో 3.4 కోట్లుగా చ.అ.లుగా ఉన్న గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలం 2021 నాటికి 4.85 కోట్ల చ.అ.లకు పెరిగింది. ఏటా 12.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. అలాగే 2018లో 3.78 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌస్ స్థలం సరఫరా.. 2021 నాటికి 10.6 వార్షిక వృద్ది రేటుతో 5.1 కోట్ల చ.అ.లకు చేరింది. ఏడు ప్రధాన నగరాలలోని గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలానికి డిమాండ్ ఉంది. 37 శాతం వాటాతో అత్యధికంగా 16 కోట్ల చ.అ. గిడ్డంగి స్థలంతో పశ్చిమాది నగరాలు (ముంబై, పుణే) తొలిస్థానంలో ఉన్నాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటా 32 శాతంగా కాగా.. భీవండి, చకన్, పన్వెల్, తలోజా వంటి పశ్చిమాది నగరాల వాటా 41 శాతంగా ఉంది. వేర్‌హౌస్ స్థలం అద్దె అత్యధికంగా ముంబైలో చ.అ.కు రూ.27 కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో రూ.20గా ఉన్నాయి. -
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
65 శాతం పర్యావరణ అనుకూల విద్యుత్
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు. 15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు. ‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్‌పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్‌కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్‌ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
బయోటెక్ రంగానికి సత్వర అనుమతులు కావాలి
న్యూఢిల్లీ: బయోఫార్మాలో భారత్ మరింత బలమైన పాత్ర పోషించేందుకు పరిశ్రమల మండలి సీఐఐ కీలక సూచనలు చేసింది. బయోటెక్ రంగానికి వేగవంతమైన నియంత్రణ ప్రక్రియ, అనుమతులు అవసరమని పేర్కొంది. ఉత్పత్తిని ప్రవేశపెట్టడంలో జాప్యం చోటుచేసుకుంటే అది భారీ నష్టానికి దారితీస్తుందని ప్రస్తావించింది. బయోటెక్ రంగాన్ని మూడు మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాలు, ఉప కమిటీలు నియంత్రిస్తున్నాయంటూ.. వాటి మధ్య సమన్వయం బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది జాప్యానికి దారితీస్తోందని, దీన్ని పరిహరించాల్సిన అవసరాన్ని సూచించింది. ‘రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియన్ లైఫ్ సైన్సెస్ ః2047’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతానికి బయోసిమిలర్ బ్యాచ్‌ను సమీక్షించేందుకు 20–25 రోజులు, తయారీ సైకిల్‌కు 45–90 రోజుల సమయం తీసుకుంటోంది. ఈ అంతరాలను తొలగించేందుకు పరిశ్రమకు చెందిన నిపుణులతో సలహా మండళ్లను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ తరహా వ్యవహారాల్లో నిపుణులతో కూడిన సలహా మండళ్ల నుంచి సలహాలు పొందొచ్చు’’అని సీఐఐ నివేదిక పేర్కొంది. విధానాల రూపకల్పన, అమలులో స్వయంప్రతిపత్తి అవసరమని తెలిపింది. సమయం, పరిశోధన, అభివృద్ధి ప్రభావం బయోసిమిలర్ ఔషధ ఉత్పత్తి ధరపై గణనీయంగా ఉంటుందని పేర్కొంది. చైనాను ఉదహరిస్తూ.. ఏకైక అనుమతుల విండో అయిన ‘చైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అలాగే, యూఎస్ఎఫ్డీఏ కూడా విధానాల రూపకల్పన, అమలును ఒకే గొడుగు కింద చూస్తున్నట్టు గుర్తు చేసింది. 2030 నాటికి అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో బయోఫార్మా వాటా 40 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. -
ఐటీతో పాటు ఈ రంగంలో దూసుకెళ్తున్న భారత్!
బెంగళూరు: దేశీ ఐటీ రంగం వృద్ధి బాటలో దూసుకెడుతున్న నేపథ్యంలో భారత్ రాబోయే కొన్నేళ్లలో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్‌లకు (సాస్) హబ్‌గా ఎదగనుంది. ఇందుకు భారీ కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలు ఊతంగా నిలవనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన ’ఇండియా: తదుపరి అంతర్జాతీయ సాస్ రాజధాని’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 50 పైచిలుకు సాస్ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే దేశీయంగా వివిధ విభాగాల్లో 100కు పైగా యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ఉన్నాయని నివేదిక పేర్కొంది. సాస్ స్టార్టప్‌లకు హబ్‌గా భారత్ అత్యంత వేగంగా ఎదుగుతోందని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రతిభావంతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని 80 శాతం మంది సాస్ ప్రమోటర్లు అభిప్రాయపడ్డారు. కస్టమర్లను పెంచుకునేందుకు సాస్ ప్రోడక్టులపై మరింతగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది తెలిపారు. సాస్ సేవలు అందించే సంస్థలు కొత్త క్లయింట్లను దక్కించుకోవడంపైన, వివిధ ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ప్రస్తుత కస్టమర్లు జారిపోకుండా అట్టే పెట్టుకోవడంపైనా మరింతగా దృష్టి పెడుతున్నాయి. మార్కెట్ వ్యూహం విషయంలో పేరొందిన క్లయింట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక విభాగాలను లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. ► ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో సాస్ స్టార్టప్‌లలోకి వచ్చిన నిధులు .. గతేడాది మొత్తం మీద వచ్చిన నిధుల పరిమాణాన్ని దాటేశాయి. ►దేశీయంగా వినియోగదారుల ఆధారిత సా స్ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ► 2025 నాటికి భారత్‌లో సాస్ మార్కెట్ అనేక రెట్లు పెరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ సాస్ మార్కెట్లో భారత్ వాటా 2 నుంచి 4 శాతంగా ఉండగా.. ఇది ఏడు నుంచి 10% వరకూ పెరగనుంది. ► దేశీయంగా 2018లో ఒకే ఒక సాస్ యూనికార్న్ ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 18కి చేరింది. అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సాస్ వ్యవస్థగా భారత్ మూడో స్థానంలో ఉంది. ►2019తో పోలిస్తే 2021లో దేశీయంగా సాస్ కంపెనీల సంఖ్య రెట్టింపయ్యింది. పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి ఆరు బిలియన్ డాలర్లకు ఎగిశాయి. -
అయిదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి పని చేస్తామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్పర్సన్ సుచిత్ర ఎల్లా తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ద్విముఖ వ్యూహాన్ని రూపొందించామని బుధవారమిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రమోట్ చేయడంతోపాటు, వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని వివరించారు. -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
దక్షిణాదికి ఛాంపియన్ రంగాలు కావాలి
చెన్నై: వృద్ధికి మద్దతునిచ్చే, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే రంగాలను దక్షిణాది రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరం ఉందని సీఐఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్ సుచిత్ర కే ఎల్లా సూచించారు. అప్పుడు 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అవి సృష్టించుకోగలవన్నారు. వ్యాపార సులభతర నిర్వహణలో దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలు ముందుండడం పట్ల ఆమె అభినందనలు తెలియజేశారు. 2025 నాటికి దక్షిణ ప్రాంతం 1.5 ట్రిలియన్ డాలర్ల (రూ.117 లక్షల కోట్లు) ఆర్థిక కార్యకలాపాల స్థాయికి చేరుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ.. వ్యాపార నిర్వహణకు అనుకూల ప్రదేశమని చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణలో దక్షిణాది రాష్ట్రాలకు మెరుగైన ర్యాంకులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈ అనుకూలతలను ఆసరాగా చేసుకుని, వృద్ధిని పెంచుకునేందుకు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యాపార నిర్వహణకు సంబంధించి వ్యయాలు, సులభత విధానాలు, వేగంగా కార్యకలాపాలు అనే అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్‌తో దన్ను
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చేయూత.. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను (ఈసీఎల్జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్‌రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్‌లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. -
రియల్టీలో టెక్నాలజీకి డిమాండ్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇది ప్రాప్‌టెక్ సంస్థలకు అవకాశాలను విస్తృతం చేయనుంది. ఈ దృష్యా పెట్టుబడులకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. 2025 నాటికి ఈ కంపెనీల్లో వార్షిక పెట్టుబడులు బిలియన్ డాలర్లకు (రూ.7,700 కోట్లు) చేరుకోవచ్చని సీఐఐ, కొలియర్స్ సంస్థలు అంచనా వేశాయి. 2020లో ప్రాప్ టెక్నాలజీ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు 551 మిలియన్ డాలర్లు(రూ.4,242 కోట్లు)గా ఉన్నాయి. సీఐఐ, కొలియర్స సంయుక్తంగా ‘రియల్ ఎస్టేట్ 3.0: టెక్నాలజీ లెడ్ గ్రోత్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. కరోనా మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు దారితీసినట్టు తెలిపింది. ఈ టెక్నాలజీ సాయంతోనే ఉన్న చోట నుంచే రిమోట్‌గా పనిచేసేందుకు వీలు పడిందని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు.. ‘‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కరోనాకు పూర్వం వినియోగించారు. అయితే ఈ తరహా టెక్నాలజీల వినియోగం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టితో స్మార్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, వాయు నాణ్యతను ఆటోమేటెడ్‌గా ఉంచే సిస్టమ్స్ వినియోగం పెరిగినట్టు తెలిపింది. ఏఐ, వీఆర్, ఐవోటీ, బ్లాక్ చైన్ రియల్ ఎస్టేట్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ మరింత సమర్థవంతగా మారుతుందని పేర్కొంది. భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని టెక్నాలజీ మరింత పారదర్శకంగా మారుస్తుందని అంచనా వేసింది. ఆవిష్కరణలు ఘనం.. ప్రాపర్టీ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. ప్రణాళిక దగ్గర్నుంచి, డిజైన్, నిర్మాణంగ టెక్నిక్‌లు, వసతుల నిర్వహణ, పాపర్టీ నిర్వహణ వరకు అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినట్టు తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ప్రాప్‌టెక్ బాగా వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. కాకపోతే గోప్యత, డేటా భద్రత, కొనుగోలుదారులు, నిర్మాణదారులపై పడే వ్యయాలు, విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీల అమలుకు ఉన్న సవాళ్లుగా పేర్కొంది. ‘‘మాన్యువల్‌గా కార్మికులకు డిమాండ్ తగ్గడంతో కొందరికి ఉపాధి నష్టం కలగొచ్చు. అదే సమయంలో ప్రత్యేకమైన కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది’’అని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో టెక్నాలజీ వినియోగం వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఆస్తి విలువ పెరుగుతుందని రెలోయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అన్నారు. -
ఈ చర్యలతో ధరల స్పీడ్ తగ్గుతుంది
న్యూఢిల్లీ: బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. సీఐఐ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా ఫిన్సర్వ్ సీఎండీ కూడా అయిన సంజీవ్ బజాజ్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తన మొట్టమొదటి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మనం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థలోకి మారామని నేను నమ్ముతున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మొత్తంగా కాకపోయిన, కనీసం దానిలో కొంత భాగమైనా కట్టడి జరుగుతుందని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం కట్టడి, అవసరమైనమేరకు వడ్డీ రేట్ల కదలికలపై విధాన రూపకర్తల నిర్ణయాలు, దీనికితోడు బలమైన రుతుపవనాలపై ఆశల వంటి పలు అంశాలు ఈ సంవత్సరం ద్వితీయార్థం నాటికి మనల్ని మంచి స్థానంలో ఉంచుతాయని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం పెరుగుదల రెండు అంశాలపై ప్రస్తుతం ఆధారపడి ఉంది. అందులో ఒకటి డిమాండ్. మరొకటి సరఫరా వైపు సవాళ్లు. ► సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంపు ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని మనం భావించాలి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల వల్ల వృద్ధికి కలిగే విఘాతాలను సెంట్రల్ బ్యాంక్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై మనం దృష్టి పెట్టాలి. ఈ అంశానికి సంబంధించి మేము ఆర్బీఐ నుండి స్పష్టమైన దిశను ఆశిస్తున్నాము. తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ మేరకు ప్రకటనలు వెలువడతాయని భావిస్తునాము. ► అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4–8.2 శాతం శ్రేణిలో ఉంటుందని సీఐఐ అంచనావేస్తోంది. ► 2022–23కి సంబంధించి ‘బియాండ్ ఇండియా @75: పోటీతత్వం, వృద్ధి, సుస్థిరత, అంతర్జాతీయీకరణ’ అన్న థీమ్‌ను సీఐఐ అనుసరిస్తుంది. ఆయా అంశాలపై దృష్టి సారిస్తుంది. ► ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నుంచి బయటపడ్డానికి కేంద్రం బలమైన విధాన సంస్కరణలతో ముందుకు నడవాలని మేము సూచిస్తున్నాము. ► ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు, వ్యవస్థలో బలమైన డిమాండ్, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), వ్యవసాయ రంగం తోడ్పాటు వంటి అంశాలు దేశ ఎకానమీకి సమీప కాలంలో తోడ్పాటును అందిస్తాయని విశ్వసిస్తున్నాం. ► ఇంధన ఉత్పత్తులపై పన్నులను కొత్త తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తక్షణం కొంత కట్టడి చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో పన్నుల వాటా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై పన్ను తగ్గింపునకు సంబంధించి కేంద్రం– రాష్ట్రాలు సమన్వయంతో కృషి చేయాలని సీఐఐ కోరుతోంది. ► 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు, 2030–31 నాటికి 9 ట్రిలియన్ డాలర్ల మైలురాళ్లతో 2047 నాటికి అంటే భారత్‌కు స్వాతంత్యం వచ్చి 100 ఏళ్లు వచ్చేనాటికి దేశం 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ► భారత్ వృద్ధికి సేవలు, తయారీ రెండు యంత్రాల వంటివి. ప్రభుత్వ సానుకూల విధానాలు ముఖ్యంగా పీఎల్ఐ పథకం వంటి చర్యలు 2047–48 ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ రంగాన్ని బలోపేత స్థానంలో నిలబెడతాయని ఆశిస్తున్నాం. జీడీపీలో ఈ రంగం వాటా 27 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► ఇక సేవల రంగం వాటా కూడా జీడీపీలో 55 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. 2047 నాటికి అప్పటి సమాజం, సమాజ అవసరాలపై పరిశ్రమ ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఫిన్‌టెక్, ఇ–కామర్స్ మొదలైన డిజిటల్ విప్లవ అంశాలు భారతీయ పరిశ్రమకు అపారమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఆయా అంశాలు సమాజ అవసరాలను తీర్చడానికి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాయి. ఇవన్నీ ‘‘భారతదేశం ః100’’ ఎజెండాలో అంతర్భాగంగా ఉంటాయి. – సంజీవ్ బజాజ్ -
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ గ్రోత్ ఎంతంటే!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.5 శాతం నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రన్ అభిప్రాయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 7.2 శాతం అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ఎకానమీపై సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయాలు ఇవీ... ►కోవిడ్–19 మహమ్మారి తదుపరి వేవ్‌ను, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలను తట్టుకోడానికి దేశం సిద్ధంగా ఉండాలి. ఈ సవాళ్లను దేశం ఎదుర్కొంటుందన్న భరోసా ఉంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి పథాన్ని నిలుపుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. ప్రత్యేకించి ఎగుమతి విషయంలో మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. భారతదేశ పురోగతిలో ఎగుమతులు కీలక భాగమవుతాయి. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా సవాళ్లు ప్రపంచ సప్లై చైన్‌పై ప్రభావం చూపుతుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా 7.5–8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ► కోవిడ్ సవాళ్లకు సంబంధించి అనుభవాలు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్ ఉన్న ప్రతిసారీ, అది భారతదేశాన్ని కూడా తాకుతుంది. కాబట్టి, భవిష్యత్తులో వచ్చే వేవ్‌లను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలి. ►కోవిడ్‌ను ఎదుర్కొనడానికి పరిశ్రమ పటిష్ట రక్షణాత్మక ప్రోటోకాల్‌లను కలిగి ఉంది. మహమ్మారి నిర్వహణలో అలాగే ఇన్ఫెక్షన్లు పెరిగినప్పటికీ సురక్షితంగా పనిచేయడంలో సామర్థ్యానికి సంబంధించి మంచి అనుభవాన్ని సముపార్జించింది. ► గతంలో మైక్రో–కంటైన్మెంట్ (తక్కువ పరిధిలో ఆంక్షలు) వ్యూహం భారతదేశానికి బాగా పనిచేసింది. మళ్లీ భారీగా లాక్డౌన్ విధించే అవకాశం ఉండబోదని పరిశ్రమ విశ్వసిస్తోంది. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను నిర్వహించడంలో విస్తృతంగా ఆమోదించబడిన సూత్రం ఏమిటంటే, కఠినమైన లాక్డౌన్లకు వెళ్లడం కంటే దానితో జీవించడం నేర్చుకోవడం. దీనిని భారత్ అర్థం చేసుకుంది. ► చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల పరిశ్రమల మార్జిన్లు, వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. అయితే భారతదేశంలో స్టాగ్ఫ్లేషన్ (ధరలు పెరుగుతూ, వస్తు డిమాండ్ పడిపోవడం) వంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నాం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5–8 శాతం పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ 8.2 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది. సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిధిలోనే (2–6 శాతం) ఉంటుందని విశ్వసిస్తున్నాం. ►మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఎత్తివేసినందున, వినియోగ డిమాండ్ బలంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా కాంటాక్ట్–ఇంటెన్సివ్ రం గాలలో ఈ పరిస్థితి నెలకొనడం హర్షణీయం. ప్రపంచ ఎగుమతుల్లో కోకింగ్ కోల్ కీలకమైనది. ఈ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా దాదాపు 11 శాతం. ఉక్కుకు సంబంధించి కీలకమైన ముడి పదార్థం ఇది. సరఫరా అంతరాయాలు ఈ ఇన్పుట్ ధర పెరగడానికి కారణమయ్యాయి, ఇది భారతీయ ఉక్కు తయారీ సంస్థలపై ప్రభావం చూపుతోంది.గ్లోబల్ బొగ్గు ధరలు వార్షిక ప్రాతిపదికన ఇప్పటివరకు 400 శాతానికి పైగా పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తితో పాటు అనేక తయారీ పరిశ్రమలలో కీలకమైన ముడి పదార్థంగా ఉండటం వల్ల ఆయా రంగాల వ్యయ భారాలు భారీగా పెరిగవచ్చు. యుద్ధ ప్రభావాల నుంచి తప్పించుకోలేం... యుద్ధ పరిణామాల నుంచి భారత్ తప్పించుకోలేదని నరేంద్రన్ స్పష్టం చేశారు. ఆయన దీనిపై ఏమన్నారంటే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల గురించి పరిశీలిస్తే, మనం నివసిస్తున్న, పెరుగుతున్న ప్రపంచీకరణ, పరస్పరం అనుసంధానిత ప్రపంచంలో, ఏ దేశమూ దాని రాజకీయ సరిహద్దుల వెలుపల ఉత్పన్నమయ్యే సంఘటనల నుండి పూర్తిగా రక్షించబడదు. ఈ నేపథ్యంలో రష్యా లేదా ఉక్రెయిన్‌తో భారత్ ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ యుద్ధం ప్రభావం భారత్‌పై తప్పనిసరిగా ఉం టుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మార్చిలో బేరల్‌కు 128 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 100 డాలర్ల పైన కొనసాగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని, పలు రంగాలలో ఇన్పుట్ వ్యయ భారాలను పెంచే విషయం. -
జొమాటో, స్విగ్గీలకు షాక్! విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: రెస్టారెంట్ భాగస్వాములతో (ఆర్పీ) వ్యాపార లావాదేవీల్లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీ అనుచిత విధానాలకు పాల్పడుతున్న అభియోగాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిష్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) చేసిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా డైరెక్టర్ జనరల్ (డీజీ)కి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక ఆధారాలు బట్టి చూస్తే ప్లాట్‌ఫామ్‌లు తమకు వాటాలు కొన్ని బ్రాండ్లను ప్రోత్సహిస్తుండటం వల్ల మిగతా రెస్టారెంట్లపై పోటీపరంగా పడుతున్న పభ్రావాల గురించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం కనిపిస్తోందని సీసీఐ 32 పేజీల ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. అలాగే జొమాటో, స్విగ్గీల ఒప్పందాల ప్రకారం వాటి ప్లాట్‌ఫామ్‌లపై తప్ప ఆర్పీలు తమ సొంత సరఫరా వ్యవస్థలో తక్కువ రేట్లు లేదా అధిక డిస్కౌంట్లు ఇవ్వడానికి లేకుండా విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో ఈ రెండు సంస్థలదే ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో ఈ తరహా ఒప్పందాల వల్ల పోటీ దెబ్బతింటుందని సీసీఐ వ్యాఖ్యానించింది. చదవండి: స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
ఆ బిల్లు తెస్తే.. పెట్టుబడులకు ప్రమాదమే
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినట్లుగా ప్రతిపాదిత డేటా భద్రత బిల్లును అమల్లోకి తెస్తే భారత్‌లో వ్యాపారాల నిర్వహణ పరిస్థితులు గణనీయంగా దెబ్బతింటాయని పలు అంతర్జాతీయ పరిశ్రమల సమాఖ్యలు కేంద్రానికి లేఖ రాశాయి. దీని వల్ల విదేశీ పెట్టుబడులు రావడం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంబంధిత వర్గాలతో విస్తృతంగా సమాలోచనలు జరపాలని కోరాయి. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, యూరప్, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు డజను పైగా పరిశ్రమల అసోసియేషన్లు మార్చి 1న కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు లేఖ రాశాయి. గూగుల్, అమెజాన్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న ఐటీఐ, జేఈఐటీఏ, టెక్‌యూకే, అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్, బిజినెస్ యూరప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లులోని నిబంధనల వల్ల దేశీయంగా కొత్త ఆవిష్కరణల వ్యవస్థకు, తత్ఫలితంగా లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్య సాకారానికి విఘాతం కలుగుతుందని లేఖలో పేర్కొన్నాయి. వ్యక్తిగతయేతర డేటాను కూడా బిల్లు పరిధిలో చేర్చడం, సీమాంతర డేటా బదిలీతో పాటు డేటాను స్థానికంగానే నిల్వ చేయాలంటూ ఆంక్షలు ప్రతిపాదించడంపై పరిశ్రమ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధనలను అమలు చేస్తే భారత్‌లో వ్యాపారాలను సులభతరంగా నిర్వహించే వీల్లేకుండా పరిస్థితులు దిగజారుతాయని, స్టార్టప్ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆదాయ వనరులు అడుగంటినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అభినందించింది. రూ.7,880 కోట్లతో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు రూ.3,820 కోట్లతో ఆధునికీకరణకు శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీఐఐ ఏపీ విభాగం స్వాగతించింది. రెండేళ్లుగా కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు ఇచి్చనందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ నియంత్రణతో పాటు పరిశ్రమలు, వ్యాపార వ్యవహారాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఐఐ పేర్కొంది. ఈమేరకు సీఐఐ విడుదల చేసిన పత్రంలో కొన్ని సూచనలు చేసింది. చదవండి: AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం ►ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్న దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజల శక్తి తిరిగి పూర్వ స్థాయికి చేరుకునేందుకు ఆరి్థక కార్యకలాపాల పునరుద్ధరణ కీలకం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 25 శాతం ఆక్యుపెన్సీలో ఉంటే తగిన జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అదే 25 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే సామాజిక కార్యకలాపాలను పరిమితం చేయాలి. కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 50 నుంచి 75 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే మైక్రో జోన్ల్లో కార్యకలాపాలపై నియంత్రణ, రద్దీని నివారించడానికి లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు అవసరం. 75 శాతానికి మించి బెడ్లు నిండితే లాక్‌డౌన్‌తో పాటు అదనపు ఆంక్షలు అమలు చేయాలి. పరిశ్రమలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాపారాల కొనసాగింపు, స్థిరత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ సి.కె.రంగనాథన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆరి్థక మాంద్యాన్ని అధిగమించాలంటే వ్యాపార లావాదేవీలను కొనసాగించడం అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఏపీ ప్రభుత్వంతో కలసి సీఐఐ పని చేస్తోందని చెప్పారు. మహమ్మారి సమయంలో పరిశ్రమలకు మద్దతిచి్చనందుకు ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు తెలియజేస్తోందని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఐఐ ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ డి.తిరుపతిరాజు ప్రశంసించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమ వర్గాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాయని తెలిపారు. -
ఎకానమీపై ‘థర్డ్‌వేవ్’ ఎఫెక్ట్.. వృద్ధికి గొడ్డలిపెట్టు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్‌ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. - క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం. - కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. - అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్‌లంత తీవ్రత మూడవ వేవ్‌లో ఉండదని భావిస్తున్నాం. బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ! - రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ - పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్‌వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్‌ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్‌లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.! - సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు - కరోనా ఒమిక్రాన్‌తో ఆంక్షల వల్ల అనిశ్చితి - ఆర్థికవేత్తల అంచనా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్డౌన్లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్‌ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్‌లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది. కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్‌పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. చదవండి:ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..? -
దేశీ ఓటీటీ మార్కెట్ రూ.1,12,500 కోట్లు..
న్యూఢిల్లీ: దేశీ ఓటీటీ స్ట్రీమింగ్ పరిశ్రమ వచ్చే దశాబ్ద కాలంలో 22–25 శాతం మేర వార్షిక వృద్ధి సాధించనుంది. 13–15 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. మీడియా, వినోద రంగాలపై పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అన్ని రకాల కంటెంట్ అందిస్తున్న దాదాపు 40 పైగా సంస్థలతో, తీవ్రమైన పోటీ ఉన్న వర్ధమాన దేశాల మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఆరేళ్లుగా చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, గత ఆరేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం మొదలైనవి డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు గణనీయంగా తోడ్పడుతున్నాయని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అమెరికాతో పోలిస్తే భారత మార్కెట్లో మాత్రమే ప్రత్యేకంగా 70–90 శాతం తక్కువ రేట్లకు ఓటీటీలు అందిస్తుండటం మరో సానుకూలాంశమని వివరించింది. దేశీ ఒరిజినల్ కంటెంట్ రూపకల్పనలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌తో విదేశాల్లోని ప్రవాస భారతీయులకు కూడా భారతీయ ఓటీటీ సంస్థలు మరింత చేరువ కావడానికి ఆస్కారం ఉందని నివేదిక వివరించింది. సబ్స్క్రిప్షన్స్ ఆదాయం గత కొన్నాళ్లుగా ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)తో పోలిస్తే ఎస్‌వీవోడీ (సబ్స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)కి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీని కూడా అధిగమించగలదని తెలిపింది. దేశీయంగా ఆహా, ఆల్ట్ బాలాజీ, జీ5, ఎరోస్ నౌ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్, సోనీలివ్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ మీడియా, వినోద పరిశ్రమ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకుంది. 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. చదవండి:ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే.. -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. సీఐఐ అభ్యర్థన మేరకే..! ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్లైన్ మర్చెంట్స్ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డ్‌లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..! -
భారత ఎకానమి వృద్దిపై టాప్ కంపెనీల సీఈవోలు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: దేశీ ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో తిరిగి పుంజుకుని, 9–10 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో అంచనాలు నెలకొన్నాయి. అయితే, తయారీ, సర్వీసుల రంగాలపై కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావాలపైనా ఆందోళనలు కూడా భయపెడుతున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో సుమారు 100 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 56 శాతం మంది సీఈవోలు.. 2021–22లో ఎకానమీ 9 శాతం నుంచి 10 శాతం స్థాయిలో వృద్ధి చెందవచ్చని భావించగా.. అంతకు మించి ఉండవచ్చని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, తమ వ్యాపారాల సెంటిమెంటుపై 35 శాతం మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ (2019–20) స్థాయిలో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం 10–20 దాకా పెరగవచ్చని 35 శాతం మంది, 20 శాతానికి మించి వృద్ధి చెందవచ్చని 33 శాతం ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్థూల లాభాలు 20 శాతం పెరుగుతాయని 35 శాతం మంది సీఈవోలు, 10–20 శాతం వృద్ధి నమోదు కావచ్చని 17 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ‘మౌలిక సదుపాయాల కల్పనపై మరింతగా దృష్టి పెట్టడం, లిక్విడిటీని పెంచేందుకు సకాలంలో చర్యలు తీసుకోవడం, సంస్కరణలు మొదలైనవి పరిశ్రమ వర్గాల్లో ఆశాభావాన్ని పెంచాయి‘ అని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. - ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా సర్వీసుల రంగంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని 55% మంది సీఈవోలు, తయారీ కార్యకలాపాలు దెబ్బతినొచ్చని 34% మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. - తమ తమ రంగాల్లో సరఫరాపరమైన సమస్యలు నెలకొన్నప్పటికీ.. వ్యాపార వృద్ధిపై మూడొంతుల మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు. - కంపెనీల సామర్థ్యాల వినియోగం 70–100 % వరకూ ఉండగలదని 59% మంది సీఈవోలు అంచనా వేస్తున్నారు. - ఎగుమతులపరంగా 2019–20తో పోల్చి చూస్తే 20% వృద్ధి ఉండొచ్చని 35% మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. పది శాతం మంది మాత్రం 50% పైగా ఉండొచ్చని ధీమాగా ఉన్నారు. చదవండి: జీడీపీ అంచనాల్లో మార్పులు.. కారణమిదే ? -
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు
న్యూఢిల్లీ: క్రిప్టోలు లేదా డిజిటల్ టోకెన్లను ప్రత్యేక తరగతికి చెందిన సెక్యూరిటీలుగా పరిగణించాలని సీఐఐ అభిప్రాయపడింది. వీటికి ప్రస్తుత సెక్యూరిటీలకు అమలు చేస్తున్న నియంత్రణలు, నిబంధనలు కాకుండా.. కొత్త తరహా నియంత్రణలను రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిప్టోల జారీపై కాకుండా.. లావాదేవీలు, భద్రతపైనే నియంత్రణపరమైన దృష్టి ఉండాలని సూచించింది. సీఐఐ ఇతర సూచనలు - ఆదాయపన్ను చట్టం, జీఎస్టీ చట్టాల పరిధిలో క్రిప్టోలు/డిజిటల్ టోకెన్లను ప్రత్యేక తరగతి సెక్యూరిటీలుగా.. క్యాపిటల్ ఆస్తులుగా చూడాలి. - చట్ట ప్రకారం పన్నులు విధించాలి. - ప్రజల ప్రయోజనాల దృష్ట్యా క్రిప్టో/డిజిటల్ టోకెన్ల జారీపై చట్టబద్ధమైన అధికారం ఆర్బీఐకే ఉండాలి. అదే సమయంలో ఆర్బీఐ కాకుండా ఇతర ఏ సంస్థ అయినా జారీ చేసేట్టు అయితే అందుకు అనుమతి తీసుకునే విధానం ఏర్పాటు చేయాలి - ‘కేంద్రీకృత ఎక్సేంజ్‌లు, కస్టడీ సేవలు అందించే సంస్థలు తప్పకుండా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. - ఫైనాన్షియల్ మార్కెట్ ఇంటర్మీడియరీలకు మాదిరే కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను పాటించాలి. - ఈ సంస్థలు క్రిప్టోల లావాదేవీలు, వ్యాలెట్ల సేవలను ఆఫర్ చేయడానికే పరిమితం కాకుండా.. యూజర్లకు సంబంధించిన క్రిప్టో ఆస్తులకు రక్షణ కల్పించేలా చట్టపరమైన బాధ్యతను తీసుకునేలా చూడాలి. - ఈ బాధ్యతకు మద్దతుగా క్రిప్టో ఎక్సేంజ్‌లు కొంత క్యాపిటల్‌ను హామీ నిధిగా నిర్వహించాలి. ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థలు నిర్ధేశించే సమాచార వెల్లడి నిబంధనలను అమలు చేయాలి. సమావేశాల నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే క్రిప్టోలు, అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం సభ ముందుకు తీసుకొస్తామని ఆమె ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో సీఐఐ సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. అనుమతిస్తే.. నియంత్రణలకు ముప్పు: సుబ్బారావు క్రిప్టో కరెన్సీలను అనుమతిస్తే నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్బీఐకి ఉన్న నియంత్రణాధికారం బలహీనపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఎన్ఎస్ఈ, న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ మన దేశంలో అంత బలంగా ఉండకపోవచ్చన్నారు. ‘‘క్రిప్టో అనేది ఆల్గోరిథమ్‌ల ఆధారితంగా ఉంటుంది. వీటివల్ల నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై కేంద్ర బ్యాంకు నియంత్రణ కోల్పోతుందన్న ఆందోళన ఉంది. మానిటరీ పాలసీకి సైతం క్రిప్టోలు విఘాతం కలిగిస్తాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి’’ అని సుబ్బారావు పేర్కొన్నారు. దేశంలో కరెన్సీ వినియోగం తగ్గిపోతోందంటూ.. డిజిటల్ చెల్లింపులు ఆదరణ పొందుతున్నట్టు చెప్పారు. చదవండి: క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..! -
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులను కేంద్రం యూపీ, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోంది. తెలంగాణ చెల్లించే ప్రతిపైసా తిరిగి రాష్ట్రానికే రావాలని మేము కోరు కోవడం లేదు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో కనీ సం సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వ డం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పునస్స మీక్షించి, వాటిని నెరవేర్చాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘మ్యాన్ఎక్స్ 2021’ సదస్సులో కేటీఆర్ కీలకోప న్యాసం చేశారు. ‘పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు, భూములు, విద్యుత్, శాంతి భద్రతలతోపాటు మానవ వనరులు కూడా ముఖ్యమే. దీని కోసం ఐఐఎం, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ కరీంనగర్, ఐసెర్, ట్రైబల్ వర్సిటీలు, మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. బుల్లెట్ ట్రైన్ వచ్చినా ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్తుందే తప్ప హైదరాబాద్ లేదా దక్షిణాదికి ఎందుకు రాదు? దేశం స్వయం స్వావలంబన దిశగా పయనించాలనుకుంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలి’ అని వ్యాఖ్యానించారు. ఏడున్నరేళ్లుగా శూన్యహస్తం.. ‘దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5శాతం సమకూరుస్తోంది. భౌగోళికంగా 12వ అతిపెద్ద రాష్ట్రమైనా మా కంటే పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ప్రగతిశీల విధానాలతో దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషి స్తున్న తెలంగాణను వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేంద్రానికి అనేక వినతలు చేశాం. స్థానికంగా ఉద్యోగాల కల్పన కోసం భారీ పారిశ్రామిక పార్కులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చైనా వంటి పెద్ద దేశాలతో ఉత్పత్తి రంగంలో పోటీ పడాలంటే చిన్న పారిశ్రామిక పార్కులతో సాధ్యం కాదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన మెగా పారిశ్రామిక పార్కులు ఫార్మాసిటీ, మెగా టెక్స్టైల్ పార్కులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలి. 2014కు ముందు నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చెప్పడం లేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో అండగా నిలిచాం.. కోవిడ్.. లాక్డౌన్ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కాపాడుకునేందుకు కేంద్రంతో అనేకమార్లు సమన్వయం చేశాం. అయితే వీటిని ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ కంటి తుడుపు కాకుండా ఉద్యోగాల కల్పన, పురోగతికి దోహదం చేసేలా ఉండాలి. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఎంఎస్ఎంఈలపై ఆశించిన ప్రభావం చూపలేదు. కోవిడ్ సమయంలోనూ తెలంగాణలో అనేక ప్రముఖ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. తైవాన్, కొలంబియా, పోలండ్, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చాయి’అని కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ఎగుమతులు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలు, ఉత్తమ స్టార్టప్‌లు తదితరాలకు సంబంధించి ఆరు కేటగిరీల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తరఫున విజేతలకు కేటీఆర్ అవార్డులు అందజేశారు. సీఐఐ భాగస్వామ్యంతో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్’అవార్డులను కూడా అందజేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయల్, సీఐఐ కన్వీనర్ శోభా దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయవాడ నడుమ పారిశ్రామిక కారిడార్ల కోసం అనేక విన తులు చేశాం. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీలో పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని కేంద్రం ప్రకటించినా.. ఏడున్నరేళ్లుగా శూన్య హస్తమే ఎదురవుతోంది. – కేటీఆర్ -
ఆన్లైన్ సేల్స్ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. చదవండి: రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..! -
ఈ ధర ఇళ్ల కొనుగోలుపైనే జనం అమితాసక్తి
న్యూఢిల్లీ: దేశంలో అధిక శాతం ప్రజలు (35 శాతం) రూ.90 లక్షల్లోపు ఇంటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్లలోపు ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వేలో 34 శాతం మంది చెప్పారు. 2020 ద్వితీయ ఆరు నెలల్లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే 10 శాతం పెరుగుదల కనిపించింది. అంతకుముందు సర్వేలో 27 శాతం మందే అందుబాటు ధరల ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సీఐఐ, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఆన్లైన్ సర్వే నిర్వహించాయి. 4,965 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు చెప్పిన అభిప్రాయాలను పరిశీలించినట్టయితే.. ►80 శాతం మంది నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే నిర్మాణం పూర్తయ్యే దశలోని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 20 శాతం మందే కొత్తగా ఆరంభించిన ప్రాజెక్టుల్లో కొనుగోలుకు సంసిద్ధంగా ఉన్నారు. ► 34 శాతం మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నవారు రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల బడ్జెట్లోని వాటి కోసం చూస్తున్నారు. 35 శాతం మంది రూ.45–90 లక్షల పరిధిలోని వాటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ►అందుబాటు ధరల్లోని ఇళ్లకోసం (రూ.45లక్షల్లోపు) చూస్తున్నవారు 27 శాతం మంది ఉన్నారు. ► ధర తర్వాత ఎక్కువగా చూసే అంశం డెవలపర్ విశ్వసనీయత. 77 శాతం మంది విశ్వసనీయమైన డెవలపర్ల నుంచే ఇళ్లను కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ►ఆన్లైన్లో ఇళ్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. కరోనాకు ముందు మొత్తం ఇళ్ల కొనుగోలు ప్రక్రియలో 39 శాతం ఆన్లైన్లో కొనసాగగా.. ఇప్పుడు 60 శాతానికి చేరుకుంది. ►ఇళ్ల కోసం అన్వేషణ, డాక్యుమెంటేషన్, న్యాయ సలహాలు, చెల్లింపులు దేశ హౌసింగ్ రంగానికి సానుకూలతలుగా అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి పేర్కొన్నారు. ►వ్యక్తిగత అవసరాల కోసం రెండో ఇంటిని కొనుగోలు చేస్తామని 41 శాతం మంది సర్వేలో చెప్పారు. ►ఎత్తయిన కొండ, పర్వత ప్రాంతాలు 53 శాతం మంది ఎంపికగా ఉన్నాయి. ►బెంగళూరు, పుణె, చెన్నై ఎన్ఆర్ఐల ఎంపికల్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ‘‘గృహ రుణాలపై వడ్డీరేట్లు కనిష్టాల్లో ఉండడం ఇళ్ల విక్రయాలు పెరిగేందుకు ప్రధానంగా మద్దతునిస్తున్న అంశం. తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో తక్కువ రుణ రేట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని 82 శాతం మంది చెప్పారు’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఇళ్ల ధరలు పెరుగుతాయ్ పెరుగుతున్న డిమాండ్ వల్ల నివాస భవనాల మార్కెట్ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో నిర్మాణ సామగ్రి కోసం వ్యయాలు అధికమవుతున్నందున ఇళ్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. సీఐఐ అనరాక్ వెబినార్ కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఈ అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా మొదటి, రెండో విడతల తర్వాత ఇళ్ల విక్రయాలు పుంజుకోవడం తమను ఆశ్చర్యపరిచినట్టు చెప్పారు. పెద్ద బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయని పేర్కొన్నారు. ఈ వెబినార్‌కు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి మధ్యవర్తిగా వ్యవహరించారు. ‘‘ధరలు పెరగడం తప్పనిసరి. నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయి. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోపాటు సరఫరా సమస్యలు కూడా కారణమే. డెవలపర్లు చిన్న, పెద్దవారైనా మెరుగైన నిర్వహణ చరిత్ర ఉంటే ఇక ముందూ మెరుగ్గానే కొనసాగొచ్చు. కానీ, పరిశ్రమలో స్థిరీకరణ, వృద్ధిని స్పష్టంగా చూస్తున్నా’’ అని ఒబెరాయ్ రియాలిటీ చైర్మన్, ఎండీ వికాస్ ఓబెరాయ్ తెలిపారు. ఇళ్ల ధరలు వచ్చే ఏడాది కాలంలో 15 శాతం వరకు పెరగొచ్చని శ్రీరామ్ప్రాపర్టీస్ ఎండీ ఎం.మురళి సైతం ఇదే కార్యక్రమంలో భాగంగా చెప్పారు. చదవండి : అడోబ్ అప్డేట్స్ అదుర్స్ -
ఆశావహంగా ఆదాయాల రికవరీ
న్యూఢిల్లీ: వ్యాపారాలను సులభతరంగా నిర్వహించడమనేది క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ కష్టతరంగా ఉండటం, వ్యాపార నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం ప్రైవేట్ రంగం ఆకాంక్షలను దెబ్బతీస్తోందని కార్పొరేట్లు భావిస్తున్నారు. అయితే, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రకటనలతో 2021–22లో కంపెనీల పనితీరు మెరుగుపడగలదని ఆశిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు 117 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) ఇందులో పాల్గొన్నారు. 2019–20 (కరోనా పూర్వం) ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాలు 10 శాతం వృద్ధి చెందగలవని 46 శాతం మంది సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధి సాధన మీద ప్రైవేట్ కంపెనీల్లో ఉండే కసిపై క్షేత్ర స్థాయి సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 51 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. పెట్టుబడి కాకుండా వ్యాపార నిర్వహణకు అయ్యే ఇతరత్రా వ్యయాలు భారీగా ఉంటున్నాయని 32 శాతం మంది సీఈవోలు తెలిపారు. -
ఈ ఏడాది ఎయిరిండియా సహా 10 సంస్థల అమ్మకం
కోవిడ్‌పరమైన అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది. మార్చి ఆఖరు నాటికి పలు సంస్థలను ప్రైవేటీకరించడం పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే సీఐఐ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, బీఈఎంఎల్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర 10 సంస్థల విక్రయం ఈ ఏడాది పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం, నియంత్రణ చేతులు మారిన పక్షంలో ఆయా సంస్థలకు మెరుగైన వేల్యుయేషన్లు లభించడానికి పాండే వివరించారు. ఎయిరిండియా తదితర సంస్థల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మదింపు, ఆర్థిక బిడ్లను ఆహ్వానించే దశలో ఉందని పేర్కొన్నారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల విలువ చేసే మౌలిక సదుపాయాల ఆస్తుల మానిటైజేషన్ (విక్రయం లేదా లీజుకివ్వడం వంటివి) ప్రణాళికను ఖరారు చేయడంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పాండే తెలిపారు. -
ఏపీలో పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి: సీఐఐ వెల్లడి
సాక్షి, అమరావతి/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ ప్రకటించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో పాటు ఇతర పారిశ్రామిక ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో ఏపీలో పర్యటిస్తోన్న ఏపీ, తెలంగాణ బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందం సోమవారం సమావేశమైంది. ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులపై బ్రిటన్ బృందం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రా భోజనం అదుర్స్.. విజయవాడకు వచ్చిన ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ పనితీరు, మహిళా సాధికారిత కోసం తీసుకుంటున్న చర్యలను ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో బ్రిటిష్ కమిషన్ పొలిటికల్ అడ్వైజర్ నళిని రఘురామన్, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయిజ్ ఉన్నారు.అలాగే, గుంటూరు జిల్లా కాజ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగన్ హోటల్‌ను ఆండ్రూ ఫ్లెమింగ్ సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్‌కు వచ్చిన ఆయన ఆంధ్ర వంటకాలను ఇష్టంగా తిన్నారు. ఆంధ్ర భోజనం చాలా బాగుందని కితాబిచ్చారు. అనంతరం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. -
రూ.75 లక్షల కోట్లకు ప్రాపర్టీ మార్కెట్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.75 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న డిమాండ్‌కు తోడు, గడిచిన ఏడేళ్లలో చేపట్టిన ఎన్నో సంస్కరణలు (రెరా తదితర) రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా 2019 నాటికి ఉన్న 5.5 కోట్ల నుంచి 2030 నాటికి 7 కోట్లకు పెరుగుతుందన్నారు. రియల్టీ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. నమూనా అద్దెచట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్టు మిశ్రా చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలియజేసింది. కరోనా రెండు విడతల్లోనూ రియల్ఎస్టేట్ పరిశ్రమపై గట్టి ప్రభావం పడిందన్న ఆయన.. డిమాండ్ తిరిగి కోలుకున్నట్టు చెప్పారు. 2021–22 మొదటి మూడు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్–జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరిగినట్టుగా పలు నివేదికలను ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కీలకమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు. పట్టణాల్లోని జనాభా ప్రస్తుతమున్న 46 కోట్ల నుంచి 2051 నాటికి 88 కోట్లకు పెరుగుతుందన్నారు. కనుక రియల్ ఎస్టేట్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుబాటులోకి 1,222 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రధాన మంత్రి –కేర్స్ నిధి కింద మంజూరు చేసిన 1,222 ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఆగస్ట్ 15 నాటికి పనిచేయడం మొదలుపెడతాయని మిశ్రా తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన అవసరాలను భారత్ స్వీయం గా తీర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాలను సరఫరా చేసినట్టు చెప్పారు. -
కరోనా సెకండ్‌వేవ్: ఎకానమీ కష్టాలు!
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్ తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2021లో రెండంకెల్లో వృద్ధి రేటు ఉన్నా 2020లో అతి తక్కువ స్థాయి గణాంకాలే(బేస్ ఎఫెక్ట్) ఇందుకు ప్రధాన కారణమవుతోందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా, పాక్షిక లాక్డౌన్ వల్ల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలువురు సీఈవోలు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు సీఐఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సెకండ్‌వేవ్ కేసుల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 1.4 శాతం నష్టం జరగనుందని బ్రిటిష్ బ్రోకరేజ్ దిగ్గజం– బార్ల్కేస్ అంచనావేస్తోంది. కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా కేసుల తీవ్రత, ధరల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత తత్సంబంధ సవాళ్లు తిరిగి ఎకానమీ రికవరీ వేగంపై అనుమానాలను సృష్టిస్తున్నాయి. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యలో గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో సీఐఐ, మూడీస్, బార్ల్కేస్ అంచనాలను వేర్వేరుగా పరిశీలిస్తే.. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) ఆర్థికాభివృద్ధి బాటలో అవరోధమే: మూడీస్ ► భారత్ వృద్ధి సానుకూల అంచనాలకు కోవిడ్–19 తాజా కేసులు సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతకు సెకండ్‌వేవ్ అవరోధమే. అయినా జీడీపీ 2021లో రెండంకెల్లో వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. దీనికి ప్రధాన కారణం గత ఏడాది అతి తక్కువ స్థాయి (బేస్ ఎఫెక్ట్) గణాంకాలు కావడమే. ► 2020లో దేశ వ్యాప్తంగా జరిగిన కఠిన లాక్డౌన్ తరహా పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకపోవచ్చు. లాక్డౌన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా మాత్రమే పరిమితమవవచ్చు. దీనివల్ల 2020లో జరిగిన ‘లాక్డౌన్’ నష్టం తిరిగి 2021లో ఏర్పడదు. ► ఏప్రిల్ 12 వరకూ చూస్తే, భారత్ కోవిడ్–19 వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,70,179గా ఉంది. భారత్‌లో యువత తక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంది. ► వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడంసహా కోవిడ్–19 కట్టడికి తీసుకునే పలు చర్యలు భారత్‌ను ‘క్రెడిట్–నెగటివ్’ ప్రభావం నుంచి తప్పిస్తాయి. ► ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2021లో 12 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. అయితే వృద్ధి అంచనాలను తాజా పరిస్థితులు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కేసులు పెరగడం ఆర్థిక క్రియాశీలతను అలాగే కన్జూమర్ సెంటిమెంట్‌నూ దెబ్బతీస్తుంది. ► కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కమోడిటీ ధరల పెరుగుదల డిమాండ్‌కు అవరోధంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులను భారత్ ఇప్పటికే ఎదుర్కొంటోంది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్ కొంత ఎక్కువగానే ఉంది. ► దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర సెకండ్‌వేవ్‌కు కేంద్రంగా నిలవడం గమనార్హం. ఏప్రిల్ 12 నాటికి యాక్టివ్ కేస్లోడ్లో 50 శాతం ఇక్కడే ఉంది. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు ) వారానికి 1.25 బిలియన్ డాలర్ల నష్టం: బార్లే్కస్ ♦ సెకండ్‌వేవ్ తీవ్రత వ్యాపారాలు, రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్ల వల్ల వారానికి ఆర్థిక వ్యవస్థ సగటున 1.25 బిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.75 చొప్పున చూస్తే దాదాపు రూ. 9,375 కోట్లు) నష్టం జరుగనుంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో దాదాపు 140 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) నష్టపోతుంది. నియంత్రణలు తక్కువగా ఉన్న వారం రోజుల క్రితం వారానికి ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 0.52 బిలియన్ డాలర్లే. ♦ మే నెల వరకూ ప్రస్తుత ఆంక్షలు కొనసాగితే ఇటు ఆర్థిక వ్యవస్థకు అటు వాణిజ్య కార్యకలాపాలకు రెండింటికీ కలిసి దాదాపు 10.5 బిలియన్ డాలర్ల నష్టం జరగనుంది. ♦ రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్ డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ♦ సెకండ్‌వేవ్ కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ♦ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదవుతుంది. దీనికి బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. కాగా కేసులు మరింత తీవ్రతరం కావడం, కఠిన లాక్డౌన్ పరిస్థితులు తలెత్తితే వృద్ధి రేటు మరింత పడిపోడానికే అవకాశం ఉంది. ♦ తాజా అంచనాల ప్రకారం, మే నెలాంతానికి కొత్త కేసుల పెరుగుదల సంఖ్యలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ విస్తృతి, మెరుగైన వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పనకు చర్యలు వంటి అంశాలు భారత్ సమీప భవిష్యత్ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఉత్పత్తి పతనంపై సీఈవోల ఆందోళన: సీఐఐ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పాక్షిక లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడుతుందని 75 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. కరోనా.. లాక్డౌన్ అంశాలపై సీఐఐ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్మెంట్, కరోనా నియంత్రణ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటివి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రత చెందకుండా నియంత్రిస్తున్నప్పటికీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలపై మహమ్మారి ప్రభావం పడకుండా చూడాల్సి ఉందని సీఐఐ పేర్కొంది. ఇందుకు తగిన చర్యలు అవసరమని పలు పరిశ్రమల సీఈవోలు అభిప్రాయపడ్డారని తెలిపింది. సీఈవోలు పాక్షిక లాక్డౌన్ పెడతారని భావిస్తున్నారని, అదే జరిగితే వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, సరకు రవాణాకు అంతరాయం ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. సీఐఐ నిర్వహించిన పోల్ సర్వేలో 710 మంది (75శాతం) సీఈవోలు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపింది. సరకు రవాణాపై నియంత్రణ తీసుకొస్తే తమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని 60శాతం సీఈవోలు తెలిపారని సీఐఐ వెల్లడించింది. సరకు రవాణాకు అనుకూలించే పర్యావరణ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తే ఉత్పత్తి నష్టపోతామని 56 శాతం సీఈవోలు తెలిపారు. ఈ పోల్ సర్వేలో 68శాతం ఎంఎస్ఎంఈ సీఈవోలతోపాటు తయారీ, సేవల రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమలు ఆరోగ్య, భద్రత ప్రోటోకాల్స్ పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయని 96 శాతం సీఈవోలు చెప్పగా... పాక్షిక లాక్డౌన్ కన్నా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం మంచిదని 93శాతం సీఈవోలు పోల్ ద్వారా వెల్లడించారని సీఐఐ పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలు విధించినప్పటికీ కార్మికులను అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలని, సరకు రవాణా ఆగకుండా చూడాలని 60శాతం సీఈవోలు తెలిపారు. ఈ సమయంలో కార్మికులు, పరిశ్రమ సిబ్బంది ఆరోగ, భద్రత ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా చూడాలని వారు తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠిన అమలు: టీవీ నరేంద్రన్ సీఐఐ అధ్యక్షుడు(ఎన్నికైన) టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమూహాలుగా ఒకే చోట చేరడం, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి తరచూ నిర్వహించే కార్యక్రమాలపైనా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీకా మహోత్సవ్‌లో పరిశ్రమల కార్మికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్లోని 65 కార్యాలయాలను కోరామని తెలిపారు. 10.5 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు: గోల్డ్‌మన్ శాక్స్ భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉండొచ్చని లోగడ వేసిన అంచనాలను తాజాగా 10.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం విధిస్తున్న లాక్డౌన్లు వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. -
‘నెవర్ బిఫోర్’ బడ్జెట్ లో బ్యాంకింగ్ !
‘‘ఈ దఫా ఇంతకు ముందెన్నడూ చూడని (నెవర్ బిఫోర్) విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది...’’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసిన వ్యాఖ్య ఇది. దీనితో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్‌పై అన్ని రంగాలకు సంబంధించి ఉత్కంఠత నెలకొంది. ఎకానమీకీ వెన్నెముకగా భావించే బ్యాంకింగ్లోనూ ప్రస్తుతం ఇదే విషయమై చర్చ మొదలైంది. మొండిబకాయిల భారం నుంచి మూలధన సమస్యల వరకూ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకింగ్‌కు రానున్న బడ్జెట్లో ఎటువంటి స్థానం లభించనుందన్నదే ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం. మొండిబకాయిల తీవ్రత... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అంతర్జాతీయ రేటింగ్, బ్యాంకింగ్ సేవల దిగ్గజాలు పలు సానుకూల విశ్లేషణలు చేస్తున్నాయి. అయితే ప్రతికూలతల విషయానికి వచ్చే సరికి బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ముందు వరుసలో ఉంటోంది. భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని భారత్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ప్రస్తావించడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొనడం గమనార్హం. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ‘మొండి’ భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. నిధుల కొరత... తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో బ్యాంకింగ్ క్యాపిటల్ అడక్వెసీ రేషియో (సీఏఆర్) 2020 సెప్టెంబర్‌లో 15.6 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ నాటికి కనీసం 14 శాతానికి పడిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ఇది 12.5 శాతానికైనా పడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వాటాదారులు ఎవ్వరూ ఎటువంటి మూలధనాన్ని అందించలేకపోతే 2021 సెప్టెంబర్ నాటికి నాలుగు బ్యాంకులు కనీస మూలధన స్థాయిని నిర్వహించడంలోసైతం విఫలమయ్యే అవకాశం ఉందని స్వయంగా ఆర్బీఐ నివేదిక పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఈ తరహా బ్యాంకుల సంఖ్య తొమ్మిదికి చేరవచ్చన్న అందోళనా ఉంది. నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక డిపాజిట్లు పెరుగుతుండగా, రుణాలు తగ్గుతుండడం మరో సమస్య. ఎన్‌బీఎఫ్‌సీల స్థితీ అంతంతే! దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ)ల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. రుణ మార్కెట్లో ఎన్బీఎఫ్సీలు ప్రధాన మధ్యవర్తిత్వ సంస్థలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఇవి నిధుల లభ్యత, పాలనా, సాల్వెన్సీ (తీసుకున్న రుణాలు తీర్చే సామర్థ్యం) సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రానున్న బడ్జెట్లో ఈ ఒత్తిళ్లను తగ్గించే చర్యలు ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల మద్దతు అవసరమన్న వాదనా ఊపందుకోవడం లిక్విడిటీ సవాళ్లకు అద్దం పడుతోంది. ‘బ్యాంకులు కనీసం 50 శాతం నిధులను చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫీసీల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ తీసుకొచ్చిన టీఎల్టీఆర్వో 2.0కు స్పందన తగిన విధంగా లేదన్న విమర్శ ఉంది. ఇక ఎన్బీఎఫ్సీ వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలు లక్ష్యంగా ఆర్బీఐ ఇటీవలే నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. బడ్జెట్లో ఆశిస్తున్న దేమిటి? బాసెల్ నిబంధనలు బ్యాంకింగ్ మూలధనానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న బాసెల్ నిబంధనలను మరో మూడు సంవత్సరాలు పక్కకు పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకింగ్ నుంచి మరింత నిధుల లభ్యత సమకూరుతుందని విశ్లేషిస్తున్నారు. క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పొడిగింపు చిన్న, లఘు మధ్య తరహా పరిశ్రమలు బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యవసర రుణ లభ్యత పొందడానికి కీలకమైన పథకం ఇది. 100 శాతం రుణ హామీ కేంద్రం నుంచి బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు దీనివల్ల లభిస్తోంది. ఆర్థికవ్యవస్థలో కీలక విభాగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్న ఈ స్కీమ్‌ను మార్చి 31 తరువాతా పొడిగించేట్లు బడ్జెట్లో చర్యలు ఉండాలి. డిజిటలైజేషన్ భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయి. బ్యాంకింగ్‌లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటలైజేషన్ విధానాలు అనుసరించడం వల్ల తమ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని, సత్వర సేవలు పొందడానికి ఇదే ఒక మార్గమని వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్ నుంచి నిధులు ఉద్దీపనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక లిక్విడిటీ మార్కెట్లకు ఊతం ఇస్తున్న నేపథ్యంలో, బ్యాంకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన చర్యలు ఉండాలి. ప్రభుత్వ క్లిష్ల ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకింగ్‌కు తగిన ద్రవ్య లభ్యతకు ‘మార్కెట్ ద్వారా నిధుల’ సమీకరణ కీలకాంశం. మరింత మూలధనం 2019–20 వరకూ గడచిన 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.3,85,000 కోట్లను సమకూర్చింది. కరోనా సవాళ్లు, తీవ్ర మొండిబకాయిల సమస్య నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులకు మరింత మూలధన మద్దతు అవసరం. తక్షణం బ్యాంకింగ్‌కు మరో రూ.లక్ష కోట్ల మూలధనం అవసరం అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేటీకరణ – విలీనాలు కొత్త బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనాల దిశగా చర్యలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. సంస్కరణలకు పెద్దపీట బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణల విషయానికి వచ్చే సరికి ప్రైవేటీకరణ, విలీనాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో ‘ఒక బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (హోల్డింగ్ కంపెనీ) ఏర్పాటు ఆవశ్యకతపై చర్చ జరుగుతోంది. దీనితోపాటు పటిష్ట మూలధనంతో కూడిన ఒక డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ) ఏర్పాటు అవసరం ఉందన్నది నిపుణుల విశ్లేషణ. తద్వారా జాతీయ మౌలికరంగ పథకం (ఎన్ఐపీ)అవసరాలు తీర తాయని వారు సూచిస్తున్నారు. ఎన్ఐపీ కింద గుర్తించిన ప్రాజెక్టుల అమలుకు 2020–25 నాటికి రూ.111 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. -
బ్యాడ్ బ్యాంక్‌లు ఎక్కువే కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్య పరి ష్కారానికి పలు బ్యాడ్ బ్యాంకుల అవసరం ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలంటూ పరిశ్రమల మండలి సీఐఐ కోరింది. బడ్జెట్ ముందు ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పలు సూచనలు చేసింది. బ్యాంకుల బ్యాలన్స్షీట్లలోని నిరర్థక ఆస్తుల కొనుగోలుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను అనుమతించాలని కోరింది. ‘‘కరోనా పరిణామం తర్వాత మార్కెట్ ఆధారితంగా సరైన ధర నిర్ణయించే యాంత్రాంగం అవసరం. అంతర్జాతీయంగా, దేశీయంగా నిధుల లభ్యత భారీగా ఉన్నందున ఒకటికి మించిన బ్యాడ్ బ్యాంకులు ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించగలవు. రుణ క్రమాన్ని తిరిగి గాడిన పెట్టగలవు’’ అంటూ సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్‌కోటక్ చెప్పారు. మార్కెట్ ఆధారిత బలమైన యంత్రాంగం ఉంటే.. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎటువంటి భయాలు లేకుండా విక్రయించుకోగలవన్నారు. స్వచ్ఛమైన బ్యాలన్స్ షీట్లతో అప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలవని.. దాంతో ప్రభుత్వం మూలధన నిధుల సాయం చేయాల్సిన అవసరం తప్పుతుందని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుండడంతో పరిశ్రమ నుంచి రుణాల కోసం వచ్చే డిమాండ్లను బ్యాంకులు తీర్చాల్సి ఉంటుందన్నారు. -
ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2021–22) ఈ దఫా ‘ఇంతకు ముందెన్నడూ చూడని’ (నెవ్వర్ బిఫోర్) విధంగా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని, వృద్ధిబాటలోకి దూసుకుపోయే బడ్జెట్‌ను ఈ సారి ప్రవేశపెడుతున్నట్లు ఆమె వివరించారు. మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ తరహా బడ్జెట్, 100 సంవత్సరాల భారత్ ముందెన్నడూ చూసి ఉండదని ఆమె అన్నారు. ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) టెలీమెడిసిన్ నిర్వహణలో నైపుణ్యత పెంపు అంశాలపై పెట్టుబడుల పెంపు ప్రస్తుత కీలక అంశాలని శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె అన్నారు. ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్ రూపకల్పనలో అందరి భాగస్వామ్యం అవసరం అని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ పార్లమెంటులో 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి ఈ రంగాన్ని ప్రస్తావించడం గమనార్హం. మెడికల్ టెక్నాలజీలో అవకాశాలు: ఫార్మా కార్యదర్శి అపర్ణ దేశంలో మెడికల్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్.అపర్ణ తెలిపారు. ఈ రంగం వృద్ధి బాటలో ఉందని, మరింత విస్తరణకు అవకాశం ఉందని అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో మెడికల్ టెక్నాలజీ భవిష్యత్ అన్న అంశంపై శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘భారత్‌లో 4,000 పైచిలుకు హెల్త్‌టెక్ స్టార్టప్స్ ఉన్నాయి. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్ఫూర్తికి ఇది నిదర్శనం. యువతలో ఉన్న స్వాభావిక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగానికి అపూర్వ ఆర్థిక సహాయాన్ని చూశాం. దేశంలో తొలిసారిగా మెడికల్ టెక్నాలజీ రంగానికి వచ్చే అయిదేళ్లపాటు సుమారు రూ.7,500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వైద్య పరికరాల పార్కుల రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఈ ఆర్థిక మద్దతు కొనసాగుతోంది. వైద్య పరికరాలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఉన్నాయి’ అని వివరించారు. -
ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయ్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఆర్థిక సంస్కరణల జోరు కొనసాగుతుందని .. పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. కోవిడ్–19 మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మల్చుకుందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చిందని ఆమె తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బహుళ జాతి సంస్థల జాతీయ సదస్సు–2020లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారీ సంస్కరణల అమలు అవకాశాలను ప్రధాని నరేంద్ర మోదీ చేజారనివ్వలేదు. దశాబ్దాలుగా వెలుగుచూడని అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇదే జోరు ఇకపైనా కొనసాగుతుంది. సంస్కరణలకు సంబంధించి క్రియాశీలకంగా మరెన్నో చర్యలు తీసుకుంటున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పన్ను వివాదాలు సత్వరం పరిష్కారమయ్యేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. సంస్కరణల అజెండాకు కొనసాగింపుగా ఆరు రాష్ట్రాల్లో ఫార్మా, వైద్య పరికరాలు, ఏపీఐల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారీ జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. నిబంధనలు మరింత సరళతరం.. విదేశీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా ఏకీకృత సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్ నుంచి ఆశిస్తున్న అంశాలన్నీ రాబోయే బడ్జెట్లో పొందుపర్చబోతున్నట్లు మంత్రి వివరించారు. మోదీ ఇటీవల 20 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీ కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయా సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరితో ప్రధాని విడివిడిగా సమాలోచనలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. పలు సార్వభౌమ ఫండ్ సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సీతారామన్ వివరించారు. -
గ్లోబల్ వర్చువల్ సమ్మిట్: మంత్రి మేకపాటికి ఆహ్వానం
సాక్షి, అమరావతి : 'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021'కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించే ఈ భారీ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా పాల్గొనాలని ఆహ్వానించింది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. చదవండి: రిమోట్ వర్క్‌పై తర్వలోనే ఎంవోయూలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఐఐ రీజనల్ డైరెక్టర్ సతీష్ రామన్ శుక్రవారం మంత్రి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో సీఐఐతో భాగస్వామ్యానికి మంత్రి మేకపాటి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో 'ఒక జిల్లా-ఒక వస్తువు'పై పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు సీఐఐ ప్రతిపాదన అందించింది. ఎమ్ఎస్ఎమ్ఈ, నైపుణ్యం, వైద్య, మౌలికసదుపాయాల కల్పన, సీఎస్ఆర్ నిధుల అంశాలపై మంత్రి మేకపాటితో సీఐఐ రీజనల్ డైరెక్టర్ చర్చించారు. -
అదానీ–జీవీకే ఎయిర్పోర్ట్ ఒప్పందానికి సీఐఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్ చానెల్) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
సానుకూల విధానాలతోనే పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి పెట్టుబడులు రప్పించేందుకు సానుకూల విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల ఎలక్ట్రానిక్ వాహన పాలసీని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శనివారం ‘ఇండియా ఎట్ 75’ సదస్సులో ‘స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడుల మేళవింపు– భారత్‌లో సాంకేతిక పునరుద్ధరణ’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. కోవిడ్ మహ మ్మారి సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంటి నుంచి పనిచేయడం, డిజిటల్ సొల్యూషన్ తదితరాలను ఆచరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో భారత్ ప్రముఖ పాత్ర భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక సాంకేతిక మానవ వనరులు ఉండటంతో రెండు దశాబ్దాలుగా ప్రముఖపాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా మన స్థానాన్ని పటిష్టం చేసేందుకు కోవిడ్ సంక్షోభం సరైన వేదికగా పనిచేస్తుందన్నారు. 28.6 ఏళ్ల సగటు ఆయుర్దాయువు ఉన్న మానవ వనరుల్లో భారత్‌లో ఎక్కువగా ఉండటం అనుకూలించే అంశమని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్తూ వ్యవసాయం, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ రిటైల్, రోబో డెలివరీ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. 5జీ సాంకేతికత భారత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతోపాటు టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), బ్లాక్ చెయిన్, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించా రు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
155 కంపెనీలు.. 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పెట్టుబడులు, భారీగా ఉపాధి కల్పన రూపంలో భారతీయ సంస్థలు అమెరికా ఎకానమీ వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. భారత మూలాలున్న దాదాపు 155 కంపెనీలు అమెరికాలో 22 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. 1.25 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి. ’అమెరికా నేల, భారతీయ మూలాలు 2020’ పేరిట రూపొందించిన ఓ సర్వే నివేదికలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ అంశాలు వెల్లడించింది. అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా భారతీయ కంపెనీల పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాలు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చింది. అత్యధిక కంపెనీలు న్యూజెర్సీలో..: భారతీయ కంపెనీలు అత్యధికంగా న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, జార్జియా రాష్ట్రాల్లో ఉన్నాయి. పెట్టుబడుల పరంగా చూస్తే అత్యధికంగా టెక్సాస్ (9.5 బిలియన్ డాలర్లు), న్యూజెర్సీ (2.4 బిలియన్ డాలర్లు), న్యూయార్క్ (1.8 బిలియన్ డాలర్లు), ఫ్లోరిడా (915 మిలియన్ డాలర్లు), మసాచుసెట్స్ (873 మిలియన్ డాలర్లు)లో ఇన్వెస్ట్ చేశాయి. ఉపాధి కల్పన సంగతి తీసుకుంటే అత్యధికంగా టెక్సాస్‌లో 17,578 ఉద్యోగాలు, కాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ (8,057), న్యూయార్క్ (6,175), ఫ్లోరిడాలో 5,454 ఉద్యోగాలు కల్పించాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 77% కంపెనీలు వచ్చే అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో, 83 శాతం కంపెనీలు మరింత మంది స్థానికులను రిక్రూట్ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
ఆర్ధిక వృద్ధికి ఐదు సూత్రాలు:మోదీ
-
మోదీ మేడిన్ ఇండియా మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా మేడిన్ ఇండియా ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశగా స్వయం సమృద్ధి దిశగా చర్యలు కీలకమని చెప్పారు. బలమైన ఆకాంక్ష, సమ్మిళిత వృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, వినూత్న ఆలోచనలు వంటి పంచ సూత్రాలు స్వయం సమృద్ధికి అవసరమని చెప్పారు. భారత పరిశ్రమలు, మన సామర్ధ్యం, సాంకేతికత పట్ల సర్వత్రా విశ్వాసం ఉందని అన్నారు. కోవిడ్-19 బారి నుంచి ప్రజలను కాపాడుకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తేవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం సీఐఐ 125వ వార్షికోత్సవాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్డౌన్ నుంచి మనం అన్‌లాక్ మోడ్‌లోకి వచ్చామని అన్నారు. ముందస్తు లాక్‌డౌన్‌తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌తో దీర్ఘకాల వృద్ధికి బాటలు పరిచామన్నారు. ఉపాథి అవకాశాలు పెంచేందుకు సంస్కరణలు అవసరమని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకునేలా చూడాలని ఆర్థిక వ్యవస్థ బలోపేతమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు అవసరమని అన్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు ఈ ట్రేడింగ్ విధానం ప్రవేశపెడతామని, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వినూత్న ఆలోచనలతో అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యమని అన్నారు. చదవండి : వీధి వ్యాపారులకు రూ. 10 వేలు