న్యూఢిల్లీ: చాలా రంగాల్లో అమ్మకాలు, ఆర్డర్లలో బలమైన వృద్ధి కనిపిస్తోందని, ఇది ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదని తెలియజేస్తోందని, పెట్టుబడులు పుంజుకోనున్నాయని సీఐఐ పేర్కొంది. స్థిరమైన నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తోడ్పడుతున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ రాకేశ్ భారతీ మిట్టల్ అన్నారు. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు గ్రామీణంగా బలమైన వినియోగం కనిపిస్తోందని చెప్పారు.
ముందు చూపుతో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ కంపెనీల పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తోందన్నారు. డిమాండ్ కూడా పుంజుకుంటోందని చెప్పారు. భారత్‌లో తయారీ, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, క్లీన్ ఎనర్జీ ఇతర కార్యక్రమాలు ప్రభావం చూపిస్తున్నాయని, అదే సమయంలో ప్రపంచ ఆర్థిక రంగం రికవరీ, సాధారణ వర్షపాత అంచనాల నేపథ్యంలో 2018–19లో వృద్ధి రేటు 7.3–7.7 శాతం మధ్య ఉంటుందని సీఐఐ అంచనా వేస్తున్నట్టు రాకేశ్ భారతీ మిట్టల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment