హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ సమావేశం | CII Telangana Organized its Annual Session And Conference on Telangana | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ సమావేశం

Published Sat, Mar 8 2025 7:29 PM | Last Updated on Sat, Mar 8 2025 7:46 PM

CII Telangana Organized its Annual Session And Conference on Telangana

భారత పరిశ్రమల సమాఖ్య (CII) తెలంగాణ, తన యాన్యువల్ సెషన్ & కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా.. హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా, పరిశ్రమ నాయకులు గ్రీన్ ఛాంపియన్‌లకు వనమహోత్సవ్ అవార్డులను అందజేశారు. అంతే కాకుండా సీఐఐ తెలంగాణ.. సీఐఐ ఆదిలాబాద్ జిల్లా జోన్‌ను ప్రారంభించింది.

పరిశ్రమలు 4.0 నుంచి 5.0కు సాగాలని, దీనికోసం తెలంగాణ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడంపై సీఐఐ తెలంగాణ నివేదికను విడుదల చేసింది. అంతే కాకుండా.. 2025-26 సంవత్సరానికి సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మెరెడ్డి ఎన్నికయ్యారు.

సీఐఐ సమావేశంలో ఈవై ఇండియా మేనేజింగ్ పార్టనర్ రోహన్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. జీసీసీలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఆవిర్భవించాయని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 7000 స్టార్టప్‌లు, 51 ఇంక్యుబేషన్ సెంటర్లు, దాదాపు 300 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం ఆవిష్కరణ కేంద్రంగా అవతరించిందని అన్నారు. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో.. సీఐఐ సదరన్ రీజియన్ & సైయెంట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, చంద్ర టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఆర్ నందిని, సీఐఐ తెలంగాణ చైర్మన్ & భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ & ఎలికో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనితా దట్ల మొదలైనవారు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement