CII Telangana
-
హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ సమావేశం
భారత పరిశ్రమల సమాఖ్య (CII) తెలంగాణ, తన యాన్యువల్ సెషన్ & కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా.. హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా, పరిశ్రమ నాయకులు గ్రీన్ ఛాంపియన్లకు వనమహోత్సవ్ అవార్డులను అందజేశారు. అంతే కాకుండా సీఐఐ తెలంగాణ.. సీఐఐ ఆదిలాబాద్ జిల్లా జోన్‌ను ప్రారంభించింది.పరిశ్రమలు 4.0 నుంచి 5.0కు సాగాలని, దీనికోసం తెలంగాణ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడంపై సీఐఐ తెలంగాణ నివేదికను విడుదల చేసింది. అంతే కాకుండా.. 2025-26 సంవత్సరానికి సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మెరెడ్డి ఎన్నికయ్యారు.సీఐఐ సమావేశంలో ఈవై ఇండియా మేనేజింగ్ పార్టనర్ రోహన్ సచ్దేవ్ మాట్లాడుతూ.. జీసీసీలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఆవిర్భవించాయని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 7000 స్టార్టప్‌లు, 51 ఇంక్యుబేషన్ సెంటర్లు, దాదాపు 300 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం ఆవిష్కరణ కేంద్రంగా అవతరించిందని అన్నారు. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో.. సీఐఐ సదరన్ రీజియన్ & సైయెంట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ డాక్టర్ ఆర్ నందిని, సీఐఐ తెలంగాణ చైర్మన్ & భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ & ఎలికో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనితా దట్ల మొదలైనవారు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్
సీఐఐ తెలంగాణ బడ్జెట్ ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసేలా నిలిచిందని సీఐఐ తెలంగాణ వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, అందుబాటు గృహాలు, గ్రామీణ రహదారులు నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్, అభివృద్ధి వంటి గ్రామీణ భారతానికే పెద్ద పీట వేశారని’’ బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. ‘అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రకరకాల సమస్యల్లో ఉన్నాయి. మన దేశానికి ఇదే సరైన సమయం. బడ్జెట్ కేటాయింపులను ఆసరా చేసుకొని ఆర్ధికాభివృద్ధిని పరుగులు పెట్టించాలని’ సీఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర్ రావు పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులు, స్కిల్ డెవలప్మెంట్, రహదారుల నిర్మాణం, యువతలో స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటితో ఈ బడ్జెట్ గ్రామీణ బడ్జెట్‌గా నిలిచిందని సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ వీ రాజన్న తెలిపారు. అయితే లైఫ్ సైన్స్, బయో రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు కల్పించలేదని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కే ఇల్లా పేర్కొన్నారు. దేశ మొత్తం జీడీపీలో 16 శాతం వాటా ఉండే మహిళలకు ఈసారి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవీ చేయలేదని ఎలికో ఇండియా వైస్ చైర్పర్సన్ వనిత దాట్ల పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిజిక్వెస్ట్ ఇండియా లి. ఎండీ కే బసి రెడ్డి, డైనాటెక్ ఇండస్ట్రీస్ ఎండీ కే హరీష్‌రెడ్డి, గటీ లి. ఫౌండర్ అండ్ ఎండీ మహేంద్ర అగర్వాల్, పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.