ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్
సీఐఐ తెలంగాణ
బడ్జెట్ ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసేలా నిలిచిందని సీఐఐ తెలంగాణ వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, అందుబాటు గృహాలు, గ్రామీణ రహదారులు నిర్మాణం, స్కిల్ డెవలప్‌మెంట్, అభివృద్ధి వంటి గ్రామీణ భారతానికే పెద్ద పీట వేశారని’’ బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. ‘అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రకరకాల సమస్యల్లో ఉన్నాయి. మన దేశానికి ఇదే సరైన సమయం. బడ్జెట్ కేటాయింపులను ఆసరా చేసుకొని ఆర్ధికాభివృద్ధిని పరుగులు పెట్టించాలని’ సీఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర్ రావు పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులు, స్కిల్ డెవలప్‌మెంట్, రహదారుల నిర్మాణం, యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ వంటి వాటితో ఈ బడ్జెట్ గ్రామీణ బడ్జెట్‌గా నిలిచిందని సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ వీ రాజన్న తెలిపారు.
అయితే లైఫ్ సైన్స్, బయో రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు కల్పించలేదని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కే ఇల్లా పేర్కొన్నారు. దేశ మొత్తం జీడీపీలో 16 శాతం వాటా ఉండే మహిళలకు ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేవీ చేయలేదని ఎలికో ఇండియా వైస్ చైర్‌పర్సన్ వనిత దాట్ల పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిజిక్వెస్ట్ ఇండియా లి. ఎండీ కే బసి రెడ్డి, డైనాటెక్ ఇండస్ట్రీస్ ఎండీ కే హరీష్‌రెడ్డి, గటీ లి. ఫౌండర్ అండ్ ఎండీ మహేంద్ర అగర్వాల్, పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.