వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు పది పాయింట్ల అజెండాను భారతీయ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, నియంత్రణపరమైన కార్యాచరణను సులభంగా మార్చడం, పారదర్శకతను పెంచడం లక్ష్యాలుగా బడ్జెట్‌కు ముందు సీఐఐ ఈ సూచనలు చేయడం గమనార్హం.
కేంద్రం, రాష్ట్రం, స్థానిక స్థాయిలో అన్ని నియంత్రణపరమైన అనుమతులను జాతీయ సింగిల్ విండో విధానంలోనే మంజూరు చేయాలి.
కోర్టుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని (ADR) తీసుకురావాలి.
పర్యావరణ నిబంధనల అమలును క్రమబద్దీకరించేందుకు వీలుగా ఏకీకృత కార్యాచరణను ప్రవేశపెట్టాలి. అన్నింటితో ఒకే డాక్యుమెంట్‌ను తీసుకురావాలి.
వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలకు భూమి ఎంతో అవసరం. ఆన్‌లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించాలి. భూమి రికార్డులను డిజిటైజ్ చేయడం, వివాదాల్లో ఉన్న భూముల సమాచారం అందించడం లక్ష్యాలుగా ఉండాలి.
భూసమీకరణలో పరిశ్రమకు సహకరించేందుకు వీలుగా.. చాలా రాష్ట్రాల్లో భూముల సమాచారాన్ని అందించే ‘ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (IILB)’ను కేంద్రం నిధుల సహకారంతో జాతీయ స్థాయి ల్యాండ్ బ్యాంక్‌గా అభివృద్ధి చేయొచ్చు.
పరిశ్రమల దరఖాస్తుల మదింపును నిర్ణీత కాల వ్యవధిలో ముగించేందుకు, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలకు చట్టబద్ధమైన కాల పరిమితి నిర్ణయించాలి.
కార్మిక చట్ట నిబంధనలు ఇప్పటికీ కష్టంగానే ఉన్నాయి. నాలుగు లేబర్ కోడ్‌ల అమలు చేయాలి. అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర కారి్మక చట్ట నిబంధనల అమలుకు కేంద్రీకృత పోర్టల్‌గా శ్రమ్ సువిధ పోర్టల్‌ను అమలు చేయాలి.
అథరైజ్డ్ ఎకనమిక్ ఆపరేటర్ (AEO) కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఎన్నో ప్రాధాన్య అనుమతులకు మార్గం సుగమం అవుతుంది.
ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రత
ఆర్థిక వృద్ధి కోసం తప్పదు..
‘నియంత్రణ కార్యాచరణను సులభతరం చేయ డం, నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం వచ్చే కొన్నేళ్ల కాలానికి ప్రాధాన్య అజెండాగా ఉండాలి. భూమి, కార్మికు లు, వివాదాల పరిష్కారం, పన్ను చెల్లింపులు, పర్యావరణ అంశాలకు సంబంధించి నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎంతో అవకాశం ఉంది. ఇది పోటీతత్వాన్ని పెంచడంతోపాటు ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది’అని సీఐ ఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment