టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో మహా కుంభమేళా వెబ్‌సైట్‌లు, యాప్‌లపై సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి భద్రత కల్పించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్(IIT Kanpur) ముందుకొచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)ను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
నిపుణుల బృందం పర్యవేక్షణ
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) అలహాబాద్‌కు చెందిన ఎక్స్‌పర్ట్‌తో కలిసి యూపీ పోలీసు సిబ్బందికి సాయం చేసేందుకు సిద్ధమైంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బృందం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణ, నిరంతరం ఆడిట్ నిర్వహిస్తుంది.
వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలు
సైబర్ దాడులు, రాన్సమ్‌వేర్, పోర్ట్ స్కానింగ్(Scanning) వంటి వాటిని నివారించడానికి ఈ బృందం వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలు నిర్వహించనుంది. ఈవెంట్ వెబ్‌సైట్‌లు, అప్లికేషన్‌ల నిరంతరం పర్యవేక్షించనుంది. మహాకుంభ్ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌లు కొన్నిసార్లు వల్నరబిలిటీ ఆడిట్(హానికర కంటెంట్‌ను జొప్పించడం)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NIIPC), కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ద్వారా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టిక్యూసీ)తో సహా వివిధ నిపుణుల ఏజెన్సీలు నిత్యం ఆడిట్లను నిర్వహిస్తాయి. భద్రతా బలహీనతలను గుర్తించడానికి, పరిష్కరించడానికి ఈ ఆడిట్‌లు సహాయపడతాయి.
ఇదీ చదవండి: నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
యూపీ పోలీసుల సహకారంతో..
నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన యూపీ పోలీసులతో సైబర్ సెక్యూరిటీని సమన్వయం చేస్తున్నారు. నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా బెదిరింపులు వంటివి వస్తే సత్వర చర్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment