Kumbh Mela
-
పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫోటోలపై ట్రోల్స్.. పోతిన మహేష్ రియాక్షన్
-
జనం ప్రాణాలంటే విలువేది?
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి? తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్‌ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్‌కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు. ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్‌ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు. మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు. -
రాజధానిలో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 12 మందిని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్‌ఫామ్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్‌ఫామ్‌లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్‌ఫామ్, 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. -
కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా
మైసూరు: కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు. ‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైనా దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్‌రాజ్‌గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు. -
Sonal Chauhan : మహా కుంభమేళాలో బాలయ్య హీరోయిన్ పవిత్ర స్నానం (ఫోటోలు)
-
ప్రయాగరాజ్ వెళ్తున్న ట్రైన్‌పై మధ్యప్రదేశ్‌లో రాళ్ల దాడి
-
మేఘాలే తాకింది ఆ ‘మోనాలిసా’..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు (Prayagraj) వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది. కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే అకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు. ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్.. ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్.. వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్మకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా (Monalisa) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైక్‌లు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు. చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ‘మోనాలిసా’తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ.. ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. (ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి) -
స్వచ్ఛ కుంభమేళా
(మహా కుంభమేళా ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ పరిసరాలు వీలైనంత మేర పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 13న మొదలై 45 రోజులు నిరంతరం కొనసాగే.. భూమిపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి పరిశుభ్రత, పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సాధారణంగా ఎక్కడైనా ఒక లక్ష మంది ప్రజలతో ఒక సభ జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎనిమిది రోజులపాటు రోజూ సరాసరి కోటి మందికి పైగా యాత్రికులు మహా కుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతాన్ని సందర్శిస్తున్నా.. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పరిశుభ్రత కోసం 20,000 మంది సఫాయి సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లు..ప్రయాగరాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పది వేల ఎకరాల విస్తీర్ణంలో మహా కుంభమేళా ఉత్సవాలు కొనసాగుతుండగా, యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు, 5,000 యూరినల్స్ కేంద్రాలు, 350 కమ్యూనిటీ టాయిలెట్లు, 10 టాయిలెట్ కాంపె్లక్స్లు ఏర్పాటుచేసింది. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది సిబ్బందితో పాటు 12 కిలోమీటర్ల పొడవున్న 44 పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో 5,000 మంది పనిచేస్తున్నారు. త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసేందుకు 40 కాంపాక్టరు మోటార్లు వినియోగిస్తుండగా, ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తరలించేందుకు 120 టిప్పర్లను వినియోగిస్తున్నారు.పారిశుధ్య కార్మికులకు బీమాఇక మహాకుంభమేళా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులతో పాటు బోట్మెన్లకు స్వచ్ఛ కుంభ్ ఫండ్ నిధుల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా పాలసీలు అందజేశారు. అలాగే, ప్లాస్టిక్ వస్తువు వినియోగంపై ముందే శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది సిబ్బంది కుంభమేళాకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్న యజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభానికి నెలల ముందే ప్రయాగరాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే 400 పాఠశాలల్లో ఉపాధ్యాయులు, 4 లక్షల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం 1,249 కి.మీ. పైపులైన్లు.. ఇక మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసేందుకు రోజూ భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే 1,249 కిలోమీటర్ల పొడవునా మంచినీటి పైపులైన్లును ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుద్ధిచేసిన తాగునీటిని ఆ పైపులైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా 56,000 చోట్ల కుళాయిలు ఏర్పాటుచేశారు. 85 గొట్టపు బావులు, 30 జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్‌తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు, సిబ్బందిని నియమించారు. ఆకుపచ్చ మహాకుంభ్.. మహా కుంభమేళాలో భాగస్వాములయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం రెండేళ్లుగా భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది. పది ప్రాంతాల్లో చిన్నచిన్న వనాలను రూపొందించింది. మహా కుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగరాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ, నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నగరానికి దారితీసే 18 ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం డ్రైవ్‌లు కొనసాగాయి. కదంబ, వేప, అమల్టాస్ వంటి స్థానిక జాతులకు చెందిన 50,000 మొక్కలు రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా నాటారు. -
ఇప్పటిది ఓకే.. మరి అప్పట్లో..
ప్రస్తుత కుంభమేళా కనీసం రూ.2–4 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుందన్నది ఓ అంచనా. మరి అప్పట్లో అంటే 1870లో అలహాబాద్‌లోనే బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన కుంభమేళాలో ఎంత వచ్చి ఉంటుంది? కరెక్టుగా చెప్పాలంటే.. రూ.41,824! ఇందులో పావు వంతు క్షురకుల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చినదే. అప్పటి కుంభమేళాలో భక్తజనం కోసం 2,500–3,000 మంది క్షురకులను పెట్టారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్నందుకు గానూ వీరి నుంచి రూ.4 చొప్పున పన్ను వసూలు చేశారు. ఈ కుంభమేళాతో వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు.. అలాగే అల్ఫ్రెడ్ పార్క్, అలహాబాద్ మ్యూజియం, వైద్య సదుపాయాల కోసం వెచ్చించింది. తర్వాత 1882లో జరిగిన కుంభమేళాలో రూ.49,840 మేర ఆదాయం వచ్చిందట. -
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో మహా కుంభమేళా వెబ్సైట్లు, యాప్‌లపై సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి భద్రత కల్పించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్(IIT Kanpur) ముందుకొచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)ను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.నిపుణుల బృందం పర్యవేక్షణఐఐటీ కాన్పూర్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) అలహాబాద్‌కు చెందిన ఎక్స్‌పర్ట్‌తో కలిసి యూపీ పోలీసు సిబ్బందికి సాయం చేసేందుకు సిద్ధమైంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బృందం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణ, నిరంతరం ఆడిట్ నిర్వహిస్తుంది.వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలుసైబర్ దాడులు, రాన్సమ్వేర్, పోర్ట్ స్కానింగ్(Scanning) వంటి వాటిని నివారించడానికి ఈ బృందం వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలు నిర్వహించనుంది. ఈవెంట్ వెబ్సైట్లు, అప్లికేషన్ల నిరంతరం పర్యవేక్షించనుంది. మహాకుంభ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లు కొన్నిసార్లు వల్నరబిలిటీ ఆడిట్(హానికర కంటెంట్‌ను జొప్పించడం)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NIIPC), కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ద్వారా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టిక్యూసీ)తో సహా వివిధ నిపుణుల ఏజెన్సీలు నిత్యం ఆడిట్లను నిర్వహిస్తాయి. భద్రతా బలహీనతలను గుర్తించడానికి, పరిష్కరించడానికి ఈ ఆడిట్లు సహాయపడతాయి.ఇదీ చదవండి: నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణంయూపీ పోలీసుల సహకారంతో..నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన యూపీ పోలీసులతో సైబర్ సెక్యూరిటీని సమన్వయం చేస్తున్నారు. నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా బెదిరింపులు వంటివి వస్తే సత్వర చర్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు
-
మహాజన సమ్మేళనానికి శ్రీకారం
విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి, అక్కడి నుండి శివుడి జటా జూటంలో పడి, హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నదని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా అక్కడ జరుపుతారు.12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమ యాన్ని ‘కుంభమేళా’ అనీ, ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అనీ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ‘మాఘీమేళా’ అనీ పిలుస్తారు. ‘కుంభము’ అంటే బాండము అనీ, ‘కలశం’ అనీ మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభ మేళా జరుగుతుంది. ‘సూర్యుడు మకర రాశిలో, బృహ స్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా’, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధ కుంభమేళా జరుగుతుంది.కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగు తున్న సాంప్రదాయిక ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, అఖాడాలు ముందు నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా అను సరిస్తారు. అనంతరం ‘షాహిస్నాన్’ (పుణ్యస్నానాలు) ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు.వీరంతా ‘ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలు మూలల నుండి 128 ఆరాధన మార్గాలకు చెందిన ‘సంత్ సమ్మేళనం’, 27వ తేదీన ‘యువ సంత్’ (యువ సన్యా సుల) సమ్మేళనం జరుగబోతున్నది ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్ని వేశం కుంభమేళ. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017లో అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొ న్నట్లు, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ఆధ్యా త్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తు చేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరు గుబాటు ఆందోళనలు జరగడానికి, స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. నానా సాహెబ్ పీష్వా, ధుంధుపంత్, బాలాసాహెబ్ పేష్వా, తాంతియా తోపే, ఝాన్సీరాణి లక్ష్మిబాయి, రంగోజి బాపు, జగదీష్పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలను కూడా భాగస్వాములు కావాలనే సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును, రొట్టెలను ప్రసా దంగా పంచి పెట్టాలని ఇక్కడే నిర్ణయించారు. ఈ సంవత్సరం ప్రయాగరాజ్ ‘మహా కుంభమేళా’ జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగ బోతోంది. కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్‌కు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. భక్తులకు ఏర్పాట్లు సౌకర్యాల నిమిత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రూ. 2,100 కోట్లు విడు దల చేయాలని నిర్ణయించింది. అలాగే కుంభ మేళ్లా జరిగే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా భారీగా నిధులను కేటా యించి ఈ అద్భుత యజ్ఞాన్ని నిర్వహించ తలపెట్టడం ముదావహం. మహా కుంభమేళా జరిగే స్థలాలుగంగానదిలో (హరిద్వార్– ఉత్తరాఖండ్) క్షిప్రానదిలో (ఉజ్జయిని– మధ్యప్రదేశ్)గోదావరి నదిలో (నాసిక్– మహారాష్ట్ర)గంగా నదిలో (ప్రయాగ్‌రాజ్–ఉత్తరప్రదేశ్;గంగా, యమునా, అంతర్వాహినిగా ప్రవహి స్తున్న సరస్వతి నది సంగమం వద్ద.)ముఖ్యమైన రోజులు1. పౌష్య పూర్ణిమ: జనవరి 13 సోమవారం2. మకర సంక్రాంతి: జనవరి 14 మంగళవారం– మొదటి షాహిస్నానం.3. మౌని అమావాస్య (సోమవతి): జనవరి 29 బుధవారం– రెండవ షాహిస్నానం.4. వసంత పంచమి: ఫిబ్రవరి 3 సోమవారం– మూడవ షాహిస్నానం.5. మాఘీ పూర్ణిమ: ఫిబ్రవరి 12 బుధవారం6. మహాశివరాత్రి: ఫిబ్రవరి 26 బుధవారం – ఆకారపు కేశవరాజు ‘ వీహెచ్‌పీ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ -
ఆన్లైన్ బుకింగ్‌పై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్‌లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సూచించింది. ఆన్ లైన్లో హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్ బుకింగ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, లింక్‌లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ లింక్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.టీజీసీఎస్బీ సూచనలు..⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్సైట్లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్‌లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయండి.⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. -
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా
మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతకలిగిన మహాసమారోహం. గంగా నదీ తీరంలో కూడే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. మహా కుంభ మేళాకు సుమారు 40 కోట్ల్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. పురాణాల ప్రకారం, దేవతలు అసురులు అమృతాన్ని పొదేందుకు కలసి సముద్ర మథనాన్ని నిర్వహించారు. అమృతపు కుంభం (పాత్ర)నుంచి నాలుగు బిందువులు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్‌లలో పడ్డాయి. అవి పడ్డ ఈ నాలుగు ప్రదేశాలూ కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా స్థిరపడ్డాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (మునుపటి అలహాబాద్) లో జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.కుంభమేళాలో పాల్గొనడం పాపవిమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. భారతదేశంలోని వివిధ ్రపాంతాల నుండి వచ్చిన సాధువులు, నాగసాధువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమారోహంలో పాల్గొంటారు. ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం, భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. పండితులు, ఆధ్యాత్మిక గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై ఆసక్తికరమైన చర్చలు నిర్వహిస్తారు. ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ...ఈసారి కుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ్రపాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నదీజలాల శుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఉత్సవంలో పాల్గొనడం అందరూ సుకృతంగా భావిస్తారు. ‘కుంభమేళా భారతదేశపు ఆధ్యాత్మికత, ఐక్యత, విశ్వభావనల ప్రతీక. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పే ఈ‘మహాకుంభమేళా’ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు పవిత్ర గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో జరగనుంది. చరిత్ర...మరో పారాణిక గాథ ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ‘నీవు అమృతభాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్భలపై ఉంచితే నీవు, నీ తల్లి విముక్తులు కాగలరు. అప్పుడు నేను వెంటనే ఆ అమృతాన్ని దేవలోకం తీసుకొని వెళ్తాను’ అని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే ఆ కలశం నుంచి భూలోకం లో నాలుగు నదులలో నాలుగుచోట్ల కొన్ని అమృతం చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశాలను పుణ్యస్థలాలుగా... పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ్రపారంభమైంది.ధర్మరక్షణ కోసం...కుంభమేళాలో సాంప్రదాయిక ఊరేగింపు జరిగేటప్పుడు నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండ గా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ,’ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’.పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంటుంది.అలనాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్‌ను సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 లో బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు. తులసీ రామాయణాన్ని రచించిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.వెల్లివిరిసే సమరసత...పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్లమంది ప్రజలు కలిసి వచ్చి ్రపాంతీయ, భాషా, కుల భేదాలు మరచి తరతమ భేదాలు లేకుండా కుంభమేళా సందర్భంగా కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ ఆవాసాలు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుణ్యస్నానాలు మాత్రమే కాదు..కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునులచేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ్రపాంతంలోనే ఉండి కఠినసాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న ఎన్నో విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. పాటించవలసిన మంచిని బోధించి సమాజానికి మార్గదర్శనం చేసి చూపించే ఈ çకుంభమేళాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం అవసరం. కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు1. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో,2. మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షీరాబ్ది నదిలో,3. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో 4. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని‘కుంభమేళా’ అని. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ’మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 2025 మేళా ముఖ్యమైన తేదీలు జనవరి 13 పూర్ణిమ సందర్భంగా, మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 03 వసంత పంచమి, ఫిబ్రవరి 12మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. -
కుంభమేళ వెనుక నమ్మలేని సైన్స్
-
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?
జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఆలయాలు, ఆశ్రమాలకు మరమ్మతులు చేశారు. కొన్ని చోట్ల కారిడార్లు నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మైమరచిపోవడం ఖాయమనినిపించేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని భరద్వాజ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పర్యాటక శాఖ కారిడార్‌ను నిర్మించింది. ఈ కారిడార్‌కు ఇరువైపులా మహర్షి భరద్వాజునికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చిన చిత్రాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సీతారాములకు ఇక్కడి నుండే భరద్వాజ మహర్షి చిత్రకూట్‌కు వెళ్లే మార్గం చూపాడని చెబుతారు. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ద్వారా సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్‌రాజ్‌తో ముడిపడి ఉన్నాయి.ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ దేవుడు ఈప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచాడని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలో ప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగలోని గంగా యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ తీర్థరాజం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శేష భగవానుని సూచనల మేరకు బ్రహ్మ దేవుడు అన్ని తీర్థయాత్రల పుణ్యాన్ని తూచాడు. తీర్థ ప్రదేశాలు, ఏడు సముద్రాలు, ఏడు ఖండాలు ఒక వైపు ఉంచారు. మరోవైపు తీర్థరాజం ప్రయాగను ఉంచారు. ఈ నేపధ్యంలో తీర్థరాజం ప్రయాగ అత్యంత బరువుతో భూమిని తాకిందట.కాగా పర్యాటక శాఖ ప్రయాగ్‌రాజ్‌లో పలు ఆలయాల పునరుద్ధరణకు ఎర్ర ఇసుకరాయిని వినియోగించింది. ఇవి ఎంతో మన్నికైన రాళ్లుగా గుర్తింపుపొందాయి. మరోవైపు స్థానిక అధికారులు కుంభమేళా సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో 10 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్లెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు.ఇది కూడా చదవండి: World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది? -
అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది.గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా, 12 పూర్ణకుంభమేళాల తరువాత మహాకుంభమేళా వస్తుంది. ఇది కూడా చదవండి: భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు -
పేదోడి రైళ్లకు సెలవు!
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో.. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో.. గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది. డివిజన్ కేంద్రం గుంతకల్‌కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్రైళ్లే దిక్కయ్యాయి రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు. ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇతర రైల్వేజోన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు. మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవురైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్‌రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు. సామాన్యుడు అంటే చిన్నచూపు పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో జనరల్బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్‌రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరుపేదలను ఇబ్బందులు పెట్టారు... తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు. – పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు -
పుణ్యక్షేత్రాల ప్రయాగరాజ్
ప్రయాగరాజ్: మహా కుంభమేళాకు ఆతిథ్యమివ్వనున్న ప్రయాగరాజ్(Prayagraj) పుణ్యక్షేత్రాల నగరంగా కీర్తికెక్కింది. దాదాపు 1,400 సంవత్సరాలుగా చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల చైనాకు ఆకర్షణ నాటినుంచే బలంగా ఉందని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడవ శతాబ్దపు చైనీస్ యాత్రికుడు యాత్రికుడు జువాన్జాంగ్ తన రచనలలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది. హర్షవర్ధనరాజు పరిపాలనలో... చరిత్రలోకి వెళ్తే.. హ్యూయెన్ త్సాంగ్ అని కూడా పిలుచుకునే జువాన్జాంగ్ 16 ఏళ్ల పాటు భారతదేశంలోని (India) వివిధ ప్రాంతాలపై అధ్యయనం చేశారు. అందులో భాగంగా ప్రయాగరాజ్నూ సందర్శించారు. క్రీ.శ. 644లో హర్షవర్ధన రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాన్ని ఆయన ప్రశంసించారు. ధాన్యం సమృద్ధిగా ఉందని చాటి చెప్పారు. అలాగే అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్‌రాజ్‌ను ఆయన అభివర్ణించారు. ప్రయాగరాజ్, దాని పరిసరాల్లోని ప్రజలు ఎంతో వినయంగా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని, అంకితభావంతో నేర్చుకుంటున్నారని తన రచనల్లో వర్ణించారు. అందుకే ప్రయాగరాజ్‌కు ‘తీర్థరాజ్’ (అన్ని పుణ్యక్షేత్రాల రాజు) బిరుదును వచ్చిందని వాస్తవాన్ని పురావస్తు సర్వేలు, అధ్యయనాలు మరింత బలపరుస్తున్నాయి. ఆసక్తికర వర్ణణలు.. ప్రయాగరాజ్ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి జువాన్జాంగ్ ‘సి–యు–కి’పుస్తకంలో రాశారని పురావస్తుశాఖ పేర్కొంది. జువాన్జాంగ్ రచనలు పురాతన కాలంలో ప్రయాగరాజ్ గురించి ఆసక్తికరంగా వర్ణించాయి. ‘ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవాలు జరిగాయని, 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎందరో మహారాజులు, పాలకులు పాల్గొన్నారు. ఈ గొప్ప రాజ్యం యొక్క భూభాగం సుమారు 1,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంది.ప్రయాగ రాజ్ రెండు పవిత్ర నదులైన గంగా, యమునా మధ్య ఉంది.’అని జువాన్జాంగ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రస్తుతం కోట లోపల పాతాళపురి ఆలయం గురించి కూడా రాశారు. ఇక్కడ ఒకే నాణే న్ని సమర్పించడం, వెయ్యి నాణేలను దానం చేయడంతో సమానమని ప్రజలు నమ్ముతున్నారని లిఖించారు. ప్రయాగరాజ్‌లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసించే విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా– 2025 (Maha Kumbh Mela 2025) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను పంచుకుంది. -
Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుంచి జరగబోయే మహాకుంభమేళాకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది రుద్రాక్షలు ధరించి ఇక్కడికి వచ్చిన ‘రుద్రాక్ష్ వాలే బాబా’ గీతానంద్ గిరి అందరినీ ఆకర్షిస్తున్నారు.గీతానంద్ గిరి మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12 ఏళ్లుగా రుద్రాక్ష ధారణ తపస్సు చేస్తూ వస్తున్నాను. 'రుద్రాక్ష' శివునికి ప్రీతికరమైనది. అలహాబాద్ అర్ధ కుంభమేళా నుంచి నేను రుద్రాక్షలు ధరించడం మొదలుపెట్టాను. నా తపస్సు రాబోయే అర్ధ కుంభమేళాతో ముగుస్తుంది. దీనికి ఇంకా ఆరేళ్లు మిగిలివుంది. నేను 11 కిలోల బరువు కలిగిన రుద్రాక్షలను తొలుత ధరించాను. ఇప్పుడు రుద్రాక్షల బరువు 45 కిలోలకు చేరింది. నేను మొత్తం 1.25 లక్షల 'రుద్రాక్షలను ధరించాల్సి ఉంది. ఇది 925 దండలుగా వస్తుంది. తాను చేస్తున్న ఈ తపస్సు దేశంలో సనాతన ఉద్ధరణకేనని గీతానంద్ గిరి తెలిపారు. #WATCH | Prayagraj, Uttar Pradesh: 'Rudraksh Wale Baba' Gitanand Giri who is in the city for Maha Kumbh Mela 2025, says, "...This is my 'tapasya' of 12 years. 'Rudraksh' is dear to Lord Shiv...I started from Allahabad Ardha Kumbh Mela and it will culminate in the upcoming Ardha… pic.twitter.com/9z9z4lah41— ANI (@ANI) December 16, 2024ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబోయే మహాకుంభమేళా కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదని, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక, పవిత్ర మనోభావాలకు ఆధారమని పండితులు చెబుతున్నారు. కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుండగా, మహాకుంభమేళా ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది.ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా. హిందువులు మహాకుంభమేళాను అత్యున్నతమైన ఉత్సవంగా భావిస్తారు. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ప్రత్యేక ఖగోళ స్థితిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ సమయంలో గంగా, క్షిప్రా, గోదావరి నదుల నీరు చాలా పవిత్రంగా మారుతుందని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
ఈసారి ప్లాస్టిక్‌రహిత కుంభమేళా: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం(డిసెంబర్ 15) కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.వేలాది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయనున్నారు.కుంభమేళా జరిగే రోజులను పవిత్ర మైన రోజులుగా హిందువులు భావిస్తారు. ఈసారి ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా జరగనుంది. తెలంగాణ నుంచి వేలాది భక్తులు కుంభమేళాలో పాల్గొననున్నారు’అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి
దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని ప్రాంతాలను తప్పనిసరిగా దర్శిస్తుంటారు. ఆ వివరాలు..త్రివేణీ సంగమంమహా కుంభమేళాలో స్నానానికి అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇది. ఇక్కడే కుంభ స్నానం ఆచరిస్తారు.నాగ్ వాసుకి ఆలయంప్రయాగ్రాజ్లోని నాగ్ వాసుకి దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ ఆలయ శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు.శయన హనుమంతుడుప్రయాగ్రాజ్లోని దర్గంజ్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని సంకట్ మోచన హనుమాన్ దేవాలయం అని అంటారు. సమర్థ గురు రాందాస్ ఇక్కడ హనుమంతుని శయన విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.ఆలోప్ శంకరి ఆలయంప్రయాగ్రాజ్లోని అలోపి బాగ్‌లోని అలోప్ శాంకరీ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం సంగమ తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు.వేణుమాధవ దేవాలయంప్రయాగ్రాజ్లోని నిరాలా రోడ్లో ఉన్న ఈ ఆలయంలో విష్ణువు ధరించిన పన్నెండు రూపాల విగ్రహాలు ఉన్నాయి. శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కుంభమేళాకు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తుంటారు.ప్రయాగ్‌రాజ్ మ్యూజియంప్రయాగ్రాజ్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రయాగరాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ గంగా గ్యాలరీని దర్శించి, పలు శాస్త్రీయ అంశాలు తెలుసుకోవచ్చు.శంకర విమాన మండపంప్రయాగ్రాజ్లో 130 అడుగుల ఎత్తైన శంకర విమాన మండప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్య, కామాక్షి దేవి, తిరుపతి బాలాజీ తదితర విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఆనంద్ భవన్ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఇది దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసం. దీన్ని మ్యూజియంగా మార్చి దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడ ఉంచారు.విక్టోరియా మెమోరియల్ప్రయాగ్రాజ్లో ఇటాలియన్ పాలరాయితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. నాడు ఒక గొడుగు కింద క్వీన్ విక్టోరియా విగ్రహం నెలకొల్పారు. తరువాత విగ్రహం తొలగించినప్పటికీ, గొడుగు అలానే కనిపిస్తుంటుంది.తేలియాడే రెస్టారెంట్గంగా నదిలో తేలియాడే రెస్టారెంట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. గంగానదిలో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పడవలో కూర్చొని భోజనం చేయవచ్చు? అలాగే గంగా ఒడ్డున జరిగే కార్యక్రమాలను కూడా చూడవచ్చు.ఇది కూడా చదవండి: Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది? -
నాగా సాధువులు కుంభమేళాలోనే ఎందుకు కనిపిస్తారు? కారణమిదే..
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు తరలివస్తారు?నాగా సాధువులు హిందూ ధర్మంలోని సాధువుల తరగతికి చెందినవారు. వీరిని తపోధనులని కూడా అంటారు. వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు. వీరు యుద్ధ కళలో ప్రవీణులుగా గుర్తింపు పొందారు. కఠినమైన తపస్సు, పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనలతో వీరు నిత్య జీవనం సాగిస్తుంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు వీరు తరలివస్తుంటారు. వీరిని చూసేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు. సమాజానికి దూరంగా ఉంటామని ప్రమాణంనాగా సాధువులు నిత్యం ధాన్యంలో ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటామని భగవంతుని ముందు ప్రమాణం చేస్తారు. అందుకే వారు జనావాసాలకు దూరంగా ఏకాంతంగా జీవిస్తుంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వారు బయటకు వస్తుంటారు. ఈ సందర్భంగా నాగా సాధువులు వారిలో వారు కలుసుంటారు. తమ అనుభవాలను, ఆలోచనలను పరిస్పరం పంచుకుంటారు. దీనికి వారు కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. కుంభమేళా సందర్భంగా నాగా సాధువులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే వారు భక్తులకు జ్ఞానబోధ చేస్తారు. తమ తపఃశక్తులను ప్రదర్శిస్తుంటారు.ఆకాశమే తమ దుస్తులుగా భావిస్తూ..నాగా సాధువులు నగ్నంగా ఉంటారు. ఆకాశామే తమ దుస్తులుగా భావిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగా సాధువులకు బాగా తెలుసు. చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. నిరాహారులుగా ఉంటూ కఠినమైన తపస్సు ఆచరిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారికి జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన అఖారాలతో సంబంధం ఉంటుంది. కుంభమేళా తర్వాత వీరు తిరిగి తమ నివాసస్థానాలైన అడవులు, కొండలకు చేరుకుంటారు.మహాకుంభమేళాకు పురాతన చరిత్రకుంభమేళా సందర్భంగా గంగా, యమున సరస్వతి సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం సుదూర తీరాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. మహాకుంభమేళా పురాణకాలం నాటిదని చెబుతారు. అమృత కలశం కోసం దేవతలు- రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు, నాలుగు అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా అంటారు.మహాకుంభమేళా జరిగే పుణ్యదినాలుమొదటి పుణ్య స్నానం- జనవరి 13(పుష్య పూర్ణిమ)రెండవది- జనవరి 14 (మకర సంక్రాంతి మూడవది- జనవరి 29(మౌని అమావాస్య) నాల్గవది- ఫిబ్రవరి 3(వసంత పంచమి) ఐదవది-ఫిబ్రవరి 12 ( మాఘ పూర్ణిమ) చివరిది- ఫిబ్రవరి 26(మహాశివరాత్రి)ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ
న్యూఢిల్లీ: మహాకుంభమేళాకు వెళ్లేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గల సంగమ నది ఒడ్డున భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం(ఐఆర్సీటీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవి వీఐపీ తరహాలో ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.ఈ సౌకర్యాలను అందుకునేందుకు ఈరోజు(శనివారం) నుంచి బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సంగమంలో ప్రత్యేకంగా టెంట్ సిటీని సిద్ధం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దీనికి మహాకుంభ్ గ్రామ్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ఈ టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌కు పర్యాటక రంగంలో కొత్త గుర్తింపుగా మారనుంది. దీనిలో బస చేసేందుకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. Mahakumbh Mela 2025: మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..ఐఆర్సీటీసీ డైరెక్టర్ (పర్యాటకం, మార్కెటింగ్) రాహుల్ హిమాలయన్ మాట్లాడుతూ డేరా నగరంలో బస చేసేందుకు ఒక వ్యక్తికి రాత్రికి రూ. 6000 (పన్నులు అదనంగా) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇలా బుక్ చేసుకున్నవారికి అల్పాహారంతో సహా డబుల్ ఆక్యుపెన్సీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే సొమ్ము రిఫండ్ ఇవ్వనున్నామన్నారు. టెన్త్ సిటీలో బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కస్టమర్ సపోర్ట్ (వాయిస్) ఫోను నంబరు 1800110139కు కాల్ చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు -
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
సర్వం సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు. ఈనెల 14న మండమెలిగె పండుగ మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది. -
తెలంగాణ కుంభమేళాకు వేళాయె
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజునే ఈ మహా ఉత్సవం మొదలవుతుంది. దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడిమెలిగె పండుగ జరుగుతుంది. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు తలస్నానాలు అచరించి తల్లుల అలయాలను శుద్ధి చేసి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క పూజారి సిద్దబోయిన మనీందర్ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా, ఆడపడుచులు పసుపు, కుంకమలు, పూజారులు, వడ్డెలు పవిత్ర జలం, దూపం, యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టి గడ్డి ఉంచగా, ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా. పూజారులు అమ్మవారికి దూప, దీపాలు వెలగించి పూజలు నిర్వహించి యాటను నైవేద్యంగా సమర్పించారు. కన్నెపెల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడిమెలిగె పండగ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సారలమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు. బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం ఆనవాయితీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మండమెలిగె పండుగ జరుగుతుంది. జాతరకు మరో 13 రోజులే... పనుల పూర్తిలో ఇంకా జాప్యమే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే ఉంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. గతేడాది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో రూ.105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలా వరకు పూర్తి కాలేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది. కొందరు భక్తులు జాతరకు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటోంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు 365వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు. గూడూరు, వరంగల్ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలాలేవు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 189 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అతిపెద్ద జాతరకు ఆ కమిటీనే వేయలే.. మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2012 వరకు సజావుగానే సాగినా 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటులో ప్రతీసారి జాప్యమే అవుతోంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే జాతర నిర్వహించారు. 2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు. 2018 మహాజాతరకు కాక లింగయ్యను చైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 2020, 2022 జాతరలు పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం ప్రకారం ఆదివాసీలనే నియమించాలని కూడా కోరుతున్నారు. అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి మహాజాతరను ధరకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా? లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. -
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు
డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై శనివారం కుంభమేళా నిర్వహణ అధికారి సంజయ్ గుంజ్వాల్ వివరణ ఇచ్చారు. గంగానదిలో స్నానాలు చేసిన వారిని కోవిడ్-19 "సూపర్-స్ప్రెడర్" అని పిలవడం సరికాదన్నారు. హరిద్వార్‌లో జనవరి 1 నుంచి నిర్వహించిన 8.91 లక్షల ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కేవలం 1,954 (0.2 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కుంభమేళా డ్యూటీలో పాల్గొన్న 16,000 మంది పోలీసు సిబ్బందిలో కేవలం 88 (0.5శాతం) మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు. కుంభమేళా ప్రారంభం నుంచి ముగిసే వరకు హరిద్వార్ వ్యాప్తంగా కోవిడ్ డేటాను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఈ విషయాలు తెలిసినట్టు పేర్కొన్నారు. ‘సూపర్ స్ప్రెడర్’’ కుట్ర కుంభమేళాపై ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనే అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగినట్టు గుంజ్వాల్ మీడియాకు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నాటికి హరిద్వార్‌లో 144 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కుంభమేళా నిర్వహణ కాలం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 55.55 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..అందులో 17,333 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మార్చి నుంచే భక్తుల తాకిడి మొదలైందని, మహాశివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని మేళా ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. ఈ సంవత్సరం కుంభంమేళా నిర్వహణ కాలంలో భక్తులు మూడు సార్లు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సమయంలో 34.76 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఏప్రిల్ 12 (సోమావతి అమావాస్య)రోజున 21 లక్షల మంది, ఏప్రిల్ 14 (మేష్ సంక్రాంతి)నాడు 13.51 లక్షల మంది, ఏప్రిల్ 27( చైత్ర పూర్ణిమ) రోజున 25,104 మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు) -
Kumbh Mela 2021: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతో పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే చేసుకున్న పాపాలు పోతాయని పెద్దలు చెప్పిన మాట ఏమో కానీ, ప్రస్తుతం మహా కుంభ్‌మేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో గంగానది పుణ్య స్నానాలు ప్రజల పాలిట పాపాలుగా మారుతున్నాయి. గంగా స్నానం చేసి తమ ప్రాంతాలకు తిరిగి వెళుతున్న అనేక మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశాయి. కుంభ్‌మేళాలో పాల్గొని తిరిగి వస్తున్న యాత్రికులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. కుంభ్‌మేళాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో ‘నిర్వాణి అఖాడా’ సాధువు మృతి తాజాగా మహా కుంభ్‌మేళాలో పాల్గొన్న నిర్వాణి అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ కపిల్‌దేవ్ కరోనా సంక్రమణతో గురువారం మరణించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఆయన హరిద్వార్‌కు వెళ్ళారు. అయితే అక్కడ కుంభ్‌మేళాలో పాల్గొన్న అనంతరం జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు డెహ్రాడూన్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆసుపత్రి అధికారులు అందించిన సమాచారం ప్రకారం మహా మండలేశ్వర్ కపిల్‌దేవ్ గురువారం కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. కుంభ్‌మేళా సమయంలో కరోనా వైరస్ సంక్రమణతో మరణించిన మొదటి ప్రధాన సాధువు కపిల్ దేవ్. మరోవైపు సునామీలా దూసుకెళ్తున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ప్రజలను సామూహిక ప్రదేశాలకు వెళ్ళకుండా అప్రమత్తం చేయాల్సింది పోయి, ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ ప్రకారం కుంభ్‌మేళా కొనసాగుతుందని అధికారులు చేసిన ప్రకటనపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కుంభ్‌మేళాను మర్కజ్‌తో పోల్చరాదని చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. సంక్రమణ వేగానికి అడ్డుకట్టవేసేందుకు ఎక్కువమంది ఒకే ప్రాంతంలో గుమికూడరాదని చెబుతున్నప్పటికీ, దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్మేళాలోని పరిస్థితులు అందరిని భయపెడుతున్నాయి. ఈ నెల 27న చివరి షాహీ స్నానాలు హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ్‌మేళాలో రోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా స్నానం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు షాహీ స్నానాల సమయంలో ఒక్కరోజులో కనీసం 20 లక్షల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు. కుంభమేళాలో ఈ నెలలో మరో ముఖ్యమైన తేదీ అయిన 27న చైత్ర పౌర్ణమి సందర్భంగా షాహీ స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈనెలాఖరు వరకు జరుగనున్న కుంభ్‌మేళాను రెండు వారాల ముందుగానే ముగిస్తారని జరిగిన ప్రచారంపై ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగాయి. మహా కుంభ్‌మేళా కార్యక్రమం రద్దుకు సాధువులు అంగీకారం తెలుపలేదు. కుంభమేళా సాధారణంగా జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కోవిడ్‌తో ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నప్పటికీ అత్యధిక శాతం మంది పట్టించుకున్న దాఖలాలే లేవు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్న మహా కుంభ్‌మేళాలో కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ, అవి నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో కుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్గా మారిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉత్తరాఖండ్ కోవిడ్ స్టేట్ కంట్రోల్ రూమ్ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 10 నుంచి, 14వ తేదీ వరకు హరిద్వార్‌లో పరీక్షలు చేయించుకున్న వారిలో 2,167 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. కేసులు పెరుగుతున్న కారణంగా హాజరయ్యేవారి సంఖ్యను పరిమితం చేసే అవకాశంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ చదవండి: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్.. రుద్రభూముల్లో మృతదేహాల క్యూలు కరోనా సెకండ్‌వేవ్; మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు -
డిలీట్ చెయ్, లేదంటే చంపేస్తాం: యాంకర్‌కు బెదిరింపులు
కరోనాను ఖాతరు చేయకుండా ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాకు భారీ సంఖ్యలో జనం హాజరైన విషయం తెలిసిందే. బైసాకీ స్నానం ఆచరించేందుకు బుధవారం ఒక్కరోజే సుమారు 6 లక్షల మంది భక్తులు హరిద్వార్‌కు వెళ్లారు. దీనిపై బాలీవుడ్ టీవీ యాంకర్ కరణ్ వాహి స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ బాబాల సంప్రదాయానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ లేదా? గంగా జలాలతో స్నానం ఆచరించడానికి బదులు ఇంట్లోనే కొన్ని మగ్గుల నీళ్లు గుమ్మరించుకోవచ్చు కదా! అని రాసుకొచ్చాడు. బహుశా కరోనా సమయంలో ఇంత రిస్క్ ఎందుకు? అన్న ఉద్దేశ్యంతోనే అతడు ఇలా అని ఉండొచ్చు, కానీ జనాలకు మాత్రం అతడి వ్యాఖ్యలు మింగుడుపడలేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నావంటూ కరణ్మీద విరుచుకుపడ్డారు. ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయంటూ అతడి మీద ఒత్తిడి తీసుకువచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో షాకైన యాంకర్ తనకు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లను స్క్రీన్షాట్లు తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. 'నాకు చాలా బెదిరింపులతో కూడా మెసేజ్‌లు వచ్చాయి. చంపుతామని కూడా అంటున్నారు. అంటే మీరు హిందువు అయినంత మాత్రాన కోవిడ్ నిబంధనలు గాలికొదేయాలా? రూల్స్ బ్రేక్ చేసే ముందు మీరు హిందువుకు అసలైన అర్థం తెలుసుకోండి' అని ఘాటు రిప్లై ఇచ్చాడు. చదవండి: నెటిజన్ అడగ్గానే వాట్సాప్ నెంబర్ చెప్పేసిన హీరోయిన్ కరోనాపై ఆటం బాంబు పేల్చిన రామ్‌గోపాల్ వర్మ -
హరిద్వార్ లో కుంభమేళా పవిత్ర స్నానాలు
-
కుంభమేళాలో కరోనాతో జాగ్రత్త
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్‌లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది. కుంభమేళా జరిగిన షాహి స్నాన్ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్ పంపాలని కోరింది. చదవండి: జనతా కర్ఫ్యూకి ఏడాది ‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’ -
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
-
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
న్యూఢిల్లీ : ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో "#BoycottHindustanUnilever" అనే హాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. సదరు కంపెనీ భారతీయుల మనోభావాలను ముఖ్యంగా హిందువులను, వారి సంప్రదాయలను కించపరుస్తోంది.. కాబట్టి ఆ కంపెనీ ఉత్పత్తులను బ్యాన్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ యాడ్‌లో ఓ వ్యక్తి తన ముసలి తండ్రిని వదిలించుకోవడం కోసం కుంభమేళాకు తీసుకువస్తాడు. జన సమూహంలో తన తండ్రిని వదిలేసి ముందుకు వెళ్తాడు. అంతలోనే ఓ తండ్రి తన కుమారుడు జన సమూహంలో తప్పిపోకుండా ఉండటానికి కొడుకు చేతిని తన చేతికి కట్టేసుకుంటాడు. అది చూసి ఆ యువకుడిలో మార్పు వస్తుంది. తండ్రిని వెతుక్కుంటు వెనక్కి వెళ్తాడు. తర్వాత ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌తో పాటు ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు కొత్త సంప్రదాయాలను తీసుకురాకండి. ఇది కుంభమేళాను, హిందువుల సంప్రదాయాలను అవమానించడమే’ అంటూ మండి పడుతున్నారు. ‘హిందుస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ #BoycottHindustanUnilever" హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా విమర్శించిన వారిలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. ‘ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నిజస్వరూపానికి నిదర్శనం ఈ యాడ్. మన దేశాన్ని ఆర్థికంగా, సిద్ధాంతపరంగా తక్కువ చేసి చూపించడమే వారి ప్రధాన అజెండా. వారి వరకూ ప్రతీది చివరకూ ఎమోషన్స్‌ను కూడా వస్తువుగానే పరిగణిస్తారు. ఇలాంటి కంపెనీ ఉత్పత్తులను మనం ఎందుకు నిషేధించకూడదం’టూ రాందేవ్ బాబా ట్వీట్ చేశారు. From East India Co to @HUL_News that’s their true character. Their only agenda is to make the country poor economically & ideologically. Why shld we not boycott them? For them everything, every emotion is just a commodity. For us parents are next to Gods #BoycottHindustanUnilever https://t.co/suozbymLBI — Swami Ramdev (@yogrishiramdev) March 7, 2019 -
పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని విరాళం
సాక్షి, న్యూఢిల్లీ : కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ 21 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రధాని ఇటీవల కుంభమేళాలో వారి సేవలకు గాను పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ పారిశుద్ధ్య కార్మికులు నిజమైన కర్మ యోగులని ప్రశంసించారు. ప్రధాని ఇటీవల తీసుకున్న సామాజిక వితరణ చర్యల్లో భాగంగా కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులకు రూ 21 లక్షల విరాళం అందచేశారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) బుధవారం ట్వీట్ చేసింది. ప్రధాని సామాజిక సేవా కార్యక్రమాల్లో చూపిన చొరవ, ప్రకటించిన సాయాలకు సంబంధించిన పలు ఉదంతాలను పీఎంఓ ఈ ట్వీట్లో ప్రస్తావించింది. -
‘ఈసారి మునక వేయకుండా ఉండలేకపోయారు’
లక్నో : కుంభమేళాకు విచ్చేసిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాత్ ఈసారి గంగలో మునక వేయకుండా ఉండలేకపోయారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగరాజ్(అలహాబాద్)లో జరుగుతున్న కుంభమేళా సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన యోగి మాట్లాడుతూ.. ‘ 2013లో మారిషస్ ప్రధాని ఇక్కడికి వచ్చినపుడు కాలుష్యం, పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, సరైన వసతులు లేకపోవడంతో గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెళ్లిపోయారు. దూరం నుంచే గంగాదేవికి నమస్కరించారు. అయితే ఈసారి మాత్రం ఆయన గంగా నదిలో మునక వేసి తరించారు’ అని పేర్కొన్నారు. ఈసారి 3200 మంది ఎన్నారైలు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే గంగా ప్రక్షాళన కొనసాగుతోందని యోగి వ్యాఖ్యానించారు. 2019 కుంభమేళాకు దాదాపు 3200 మంది ఎన్నారైలు తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 70కి పైగా దేశాలకు చెందిన రాయబారులు గంగాస్నానం ఆచరించారని, ఇదొక రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా పేరుగాంచింది. ఈ ఆధ్మాత్మిక వేడుకకు యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఇక మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో పరిసరాలన్నీ శివన్నామ స్మరణతో మారుమ్రోగిపోయాయి. -
నేటితో ముగియనున్న కుంభమేళా..
ప్రయాగరాజ్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సోమవారం చివరి రోజు మహాశివరాత్రి కావడంతో దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ ఒక్కరోజు 60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. భారీస్ధాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా మేజిస్ర్టేట్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్, ఫతేపూర్ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా నేటితో ముగియనుంది. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
‘పీఎం–కిసాన్’కు శ్రీకారం
గోరఖ్‌పూర్/ప్రయాగ్‌రాజ్: ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం–కిసాన్) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000 డబ్బును ఆయన బదిలీ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే ఈ మొత్తం అందుతుందని మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు పదేళ్లకు ఒకసారి మాత్రమే, ఎన్నికలకు ముందు రైతులు గుర్తొస్తారని ఆయన విమర్శలు చేశారు. గోరఖ్‌పూర్‌లోని భారతీయ ఎరువుల కార్పొరేషన్‌కు చెందిన మైదానంలో మోదీ మాట్లాడుతూ ‘ఎన్నికలు వస్తున్నాయంటే ఓట్ల కోసం వాళ్లు (విపక్షాలు) రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. పదేళ్లకోసారి, ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్లు వ్యవసాయదారులను గుర్తు చేసుకుంటారు. వాళ్ల బండారాన్ని ఈ సారి మోదీ బయటపెడతాడని వాళ్లకు తెలీదు’ అని అన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తమ ప్రభుత్వం రూ.75 వేల కోట్లతో ఈ పీఎం–కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందనీ, ఇదేమీ తాము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదని తెలిపారు. ‘రుణమాఫీ చేయడం సులభమే. మాకూ అదే సౌకర్యంగా ఉండేది. రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం మేం కూడా తాయిలాలను ప్రకటించి ఉండొచ్చు. కానీ అలాంటి పాపానికి మేం ఒడిగట్టలేం. రుణమాఫీ వల్ల కొంత మంది రైతులకే ప్రయోజనం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. పీఎం–కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. వాళ్లకు రైతుల శాపం తగులుతుంది పీఎం–కిసాన్ పథకానికి అర్హులైన రైతుల జాబితాను పంపకుండా కొన్ని రాష్ట్రాలు రాజకీయాలు చేస్తున్నాయనీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని వారికి రైతుల శాపం తగులుతుందని మోదీ పేర్కొన్నారు. ఆ శాపం వారి రాజకీయాలను నాశనం చేస్తుందన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ లక్ష్యంగా మోదీ విమర్శలు చేస్తూ.. ‘పదేళ్లలో కేవలం రూ. 52 వేల కోట్ల రుణాలను వారు మాఫీ చేశారు. ఇక నుంచి మా ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు ఏటా రూ. 75 వేల కోట్లు ఇవ్వనుంది. పంటల కనీస మద్దతు ధర పెంపు అంశాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు. 2007 నుంచి ఆ దస్త్రం కదలలేదు. దీంతో రైతులు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశం గత ప్రభుత్వాలకు లేదు. కాబట్టే వారు సరైన నిర్ణయాలను తీసుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అందుబాటులో అన్ని వనరులను వినియోగించుకుంటాం. నిజాయితీతో పనిచేస్తాం’ అని చెప్పారు. రైతుల కోసం గతంలో ప్రభుత్వాలు తెచ్చే పథకాలు కేవలం కాగితాలపైనే కనిపించేవని మోదీ దుయ్యబట్టారు. ‘పీఎం–కిసాన్ వల్ల రైతులు మోదీకి మద్దతుగా ఉంటారని మా ప్రత్యర్థులు నైరాశ్యంలోకి వెళ్లారు. మేం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలం. కాంగ్రెస్, మహా కల్తీ కూటమి, ఎస్పీ, బీఎస్పీ.. వాళ్లంతా ఒక్కటే’ అని అన్నారు. జయలలితకు మోదీ నివాళి.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 71వ జయంతి సందర్భంగా మోదీ ఆమెకు నివాళి అర్పించారు. తమిళనాడు రాష్ట్రాభివృద్ధికి ఆమె చేసిన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న కుంభమేళాలో మోదీ ఆదివారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వాళ్లే నిజమైన కర్మ యోగులంటూ వారి సేవలను మోదీ కొనియాడారు. గంగా హారతి ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కూడా మోదీ కడిగారు. వారికి అంగవస్త్రాలను బహూకరించారు. వారి సేవల వల్లే కుంభమేళా ప్రదేశం శుభ్రంగా ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు బాగుండాలని త్రివేణి సంగమం వద్ద తాను కోరుకున్నట్లు మోదీ ట్విట్టర్లో చెప్పారు. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అవసరమైనదంతా తాము చేశామని మోదీ చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగ్రమూకలను తుడిచిపెట్టేస్తాం చివరి ‘మన్‌కీ బాత్’లో ప్రధాని న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రస్థావరాలతో పాటు ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్నవారిని తుడిచిపెట్టేయాలని భారత సైన్యం నిర్ణయించిందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణత్యాగం ఉగ్రవాద సంస్థలను పునాదులతో సహా పెకిలించడానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి అడ్డంకులను దాటుకుని ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరిదైన 53వ మాసాంతపు ‘మన్‌కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2 నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
-
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన ఆదివారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం మోదీ సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వాళ్లే నిజమైన కర్మ యోగులంటూ వారి సేవలను మోదీ కొనియాడారు. గంగా హారతి ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కూడా మోదీ కడిగారు. వారికి అంగవస్త్రాలను బహూకరించారు. వారి సేవల వల్లే కుంభమేళా ప్రదేశం శుభ్రంగా ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు బాగుండాలని త్రివేణి సంగమం వద్ద తాను కోరుకున్నట్లు మోదీ ట్విట్టర్లో చెప్పారు. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అవసరమైనదంతా తాము చేశామని మోదీ చెప్పారు. -
దిగంబరత్వం.. బూడిద..పరమేశ్వరుని అంశ
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళాకు పేరుంది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది. మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట. అవి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఈ నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా, 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధ కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం మార్చి 4 (మహా శివరాత్రి) తో ముగుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 12 కోట్ల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే కుంభమేళ అనగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు నాగసాధువులు. ఒళ్లంతా బుడిద పూసుకుని, దిగంబరంగా లేదా అర్థ నగ్నంగా తిరుగుతూ.. మరేదో లోకం నుంచి వచ్చిన వారిలా కనిపించే నాగసాధువులను కుంభమేళా ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చిన ఆత్మలుగా భావిస్తారు. దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే సైన్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారనే ప్రతీతి. అఖరాలలో నివసించే వీరు కుంభమేళా కోసం తరలి వస్తారు. ఈ కుంభమేళా ఉత్సవాల్లో బందీప్ సింగ్ అనే వ్యక్తి నాగసాధులకు సంబంధించిన అరుదైన ఫోటోలతో పాటు ఆసక్తికర సమాచారాన్ని కూడా అందించారు. దిగంబరత్వం.. బూడిద నాగ సాధువులు శ్మశాన బూడిదను మాత్రమే ఒంటికి పట్టించుకుంటారు. ఇలా బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుంచి విముక్తి అయ్యానని తెలపడం. ఐహిక వాంఛల నుంచి విముక్తి అయ్యాము... వైరాగ్య పంథాలో పయనిస్తున్నామని ప్రకటించడం. సాధరణ మానవునికి ఉన్న వాంఛలను తాము జయించామని తెలపడం కోసం ఇలా దిగంబరంగా తిరుగుతారు. వ్యవసాయదారుడైన సురేశ్వర్ గిరి(60) కుటుంబంతో పాటు వృత్తిని వదిలి సన్యాస దీక్ష తీసుకుని నాగ సాధువుగా మారారు. తలకు, ఒంటికి పట్టిన బూడిదను వదిలించు కోవడం కోసం తన జటాలను విదిలిస్తుండగా తీసిన ఫోటో శ్మశాన నివాసి అయిన పరమేశ్వరుని అంశను చూపిస్తున్నట్లుగా గోచరిస్తుంది. రుద్రాక్ష ధారణ పరమేశ్వరుని మూడో కన్నుగా రుద్రాక్షను పరిగణిస్తారు. చాలామంది నాగ సాధువులు కేజీల కొద్ది రుద్రాక్షలను ధరిస్తారు. నాగబాబా శక్తి గిరి (54) రుద్రాక్షలనే వస్త్రాలుగా ధరించాడు. సుమారు 70 కిలోల బరువున్న 1,25,000 రుద్రాక్షలను ఒంటిపై ధరించాడు. మరో నాగబాబా రాజ్ పూరి 21 కిలోల బరువున్న శివలింగాన్ని తల మీద ధరించాడు. చబి సంప్రదాయం ఐహిక వాంఛల్ని ముఖ్యంగా లైంగిక కోరికల్ని వదిలేసి పూర్తి బ్రహ్మచర్యంతో, దేహంలోని ప్రతి అవయవాన్ని బలోపేతం చేసుకునేందుకు కఠిన శిక్షణలు పొందుతారు నాగ సాధువులు. లైంగిక వాంఛల్ని వదిలేసుకున్నామనే దానికి నిదర్శనంగా ఈ చబి సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిలో భాగంగా మర్మాంగాలతో సాహసోపేతమైన పనులను చేస్తారు. ఈ ఫోటోలో నాగబాబా కమల్ పూరి ప్రదర్శిస్తున్నది చబి ఆచారాన్నే. మర్మాంగాన్ని రాడ్‌కు చుట్టి దాని మీద మరో వ్యక్తిని నిల్చోబెట్టాడు. కొందరు రాడ్ బదులు కత్తిని కూడా ఉపయోగిస్తారు. ఊర్ధ్వబాహు హఠ యోగ దీన్ని సాధన చేసేవారు.. ఏళ్ల పాటు ఒక చేతిని గాల్లోకి లేపే ఉంచాలి. కిందకు దించకూడదు. శరీరం మీద మెదడు పూర్తి పట్టు సాధించడం కోసం ఇలాంటి కఠిన సాధనలు చేస్తారు. ఉజ్జయినికి చెందిన నాగబాబా రాధే పూరి గత పన్నేండేళ్లుగా దీన్ని సాధన చేస్తున్నాడు. మరిజునా.. ఏకాగ్రతతో, తదేక దీక్షగా సాధనను కొనసాగించడం కోసం మరిజునాను పీలుస్తామని వెల్లడించాడు నాగబాబా రాజు పూరి. ఎరుపెక్కిన కళ్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనికునిలా.... చిల్లం నుంచి పొగ పీల్చడంతో అతని కళ్లు ఎర్రబడ్డాయి. సంప్రదాయాన్ని కాపాడే యోధులుగానే ప్రజలు తమను గుర్తించాలనుకుంటారు వీరు. -
కుంభమేళాలో కోటిన్నర మంది
ప్రయాగ్‌రాజ్: వసంత పంచమి సందర్భంగా ఆదివారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలకు బారులు తీరారు. కుంభమేళాలో నిర్వహించే షాహీ స్నానాల్లో ఇదే ఆఖరు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1.5 కోట్ల మంది కుంభమేళా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. సూర్యోదయానికి ముందు దాదాపు 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఈ నెల 9 వరకు దాదాపు 16.44 కోట్ల మంది కుంభమేళాకు హాజరైనట్లు అధికారులు చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మకర సంక్రాం (జనవరి 15) నుంచి ప్రారంభమైన కుంభమేళా మహాశివరాత్రి (మార్చి 4) తో ముగుస్తుంది. ఆదివారం వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రామనామమే డబ్బు! కుంభమేళాలో ప్రధాన ఆకర్షణల్లో ‘రామ్నామ్ బ్యాంక్’ ఒకటి. దీనిలో భక్తులకు 30 పేజీలు ఉన్న పుస్తకాలను ఇస్తారు. ఒక్కో పేజీలో 108 కాలమ్స్ ఉంటాయి. వీటిలో రామనామాన్ని రాయాల్సి ఉంటుంది. రాయడం పూర్తయ్యాక ఈ పుస్తకాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నామాలన్నీ అతని అకౌంట్లో జమ అవుతాయి. ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశామని.. రామ్నామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారి తెలిపారు. కుంభమేళాలో మహంత్ రాథే పూరీ అనే వ్యక్తి కుడి చేతిని పైకి లేపి స్టాట్యూ ఆఫ్ లిబర్టీలా నిల్చున తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 2011 నుంచి తాను ఇలానే ఉన్నానని పూరీ చెప్పాడు. ప్రపంచశాంతి కోసమే ఇదంతా అని ఆయన తెలిపాడు. ‘డబుల్ కొకోనట్ పామ్ సీడ్’ పేరిట ప్రదర్శించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన కొబ్బరి విత్తనం బరువు 30 కిలోలు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విత్తనమని అధికారులు వెల్లడించారు. సీఎం కృతజ్ఞతలు.. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినందుకు గానూ అఘోరాలు, సాధువులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వచ్చారని చెబుతోన్న ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మండిపడ్డారు. ఏ లెక్కల ప్రకారం 15 కోట్ల మంది వచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. -
చెత్త వేస్తే..వేడి వేడి టీ..స్పెషల్ ఏటీఎం
కుంభమేళాలో ఒక స్పెషల్ ఏటీఎం ఆకర్షణీయంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా ఒక టీ ఏటీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. దీని విశేషమేమింటే.. చెత్త లేదా పనికిరాని బాటిళ్లను ఈ మెషీన్లో వేస్తే.. వేడి వేడి టీ మీకు అందిస్తుంది ఈ టీ ఏటీఎం మెషీన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి అధికారులు ఇన్నోవేటివ్ ఐడియా తో ముందుకు వచ్చారు. అటు పుణ్యం.. ఇటు పురుషార్ధం అన్నమాట.. కుంభమేళాలో చలితో వణకుతున్న భక్తులకు వేడి వేడి టీ ఉపశమనాన్ని ఇవ్వడంతోపాటు.. నగర శుభ్రతకు కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కుంభమేళాలో ఇలాంటి తొలిసారిగా ఇలాంటి ఏటీఎం ను వాడుతున్నామని.. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా ఈ మెషీన్ పనిచేస్తుందని చెప్పారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకుంటున్న ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధకుంభమేళా సందడి మొదలైంది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ మహా ఉత్సవంలో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. -
త్రివేణి సంగమం.. విహంగ వీక్షణం..!!
-
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
-
సన్యాసులకు రాందేవ్ బాబా సూటిప్రశ్న
ప్రయాగరాజ్ : కుంభమేళా వేదికగా పొగతాగడం మానుకోవాలని యోగా గురు రాందేవ్ బాబా సాధుసంతులను కోరారు. ‘మనం ఎన్నడూ పొగతాగని రాముడు, కృష్ణుడు వంటి దేవతలను ఆరాధిస్తాం..మరి మనం వాటికి ఎందుకు దూరంగా ఉండకూడ’దని సన్యాసులను ప్రశ్నించారు. స్మోకింగ్‌ను విడిచిపెడతామని మన మంతా ప్రతినబూనాలని పిలుపుఇచ్చారు. ‘సమున్నత లక్ష్యం కోసం మనం తల్లితండ్రులను, ఇంటిని విడిచిపెడతాం..అలాంటిది మనం పొగతాగడాన్ని ఎందుకు మానుకోలే’మని అన్నారు. ఇక పలువురు సన్యాసుల నుంచి ఆయన పొగగొట్టాలను సేకరించి, పొగతాగడం మానివేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తాను నిర్మించి మ్యూజియంలో ఈ పొగగొట్టాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చారు. తాను యువతను పొగాకు, స్మోకింగ్‌ను వదిలివేసేలా చేశానని, మహాత్ములచే ఆ పని ఎందుకు చేయించలేనన్నారు. కాగా 55 రోజుల పాటు సాగే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కుంభమేళాలో పలు దేశాల నుంచి 13 కోట్ల మంది పాల్గొని పవిత్ర గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు చెబుతున్నారు. -
‘ఆయన గంగా నదిని అపవిత్రం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న ఫోటోపై సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎం యోగి తన కేబినెట్ సహచరులతో కలిసి కుంభమేళాలో స్నానం చేసే ఫోటోను ట్వీట్ చేసిన శశి థరూర్ దానికి ఇచ్చిన క్యాప్షన్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. యోగి స్నానం చేసిన అనంతరం గంగా జలాలను శుద్ధిచేయాల్సిన అవసరం ఉందని, వారు చేసిన పాపాలు నది నుంచి కొట్టుకుపోవాలని థరూర్ వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలను యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తిప్పికొట్టారు. శశి థరూర్ తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు గంగా నదిలో మునకేయాలని ఆయన సలహా ఇచ్చారు. కుంభమేళా ప్రాధాన్యతను శశి థరూర్ సరైన రీతిలో అవగాహన చేసుకోలేదనేందుకు ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు థరూర్ ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో వెల్లడిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘మీరు చాలా తప్పులు చేశారు..వాటిని దిద్దుకునేందుకు కుంభ్‌లో పుణ్యస్నానం ఆచరించండి..మీ పాపాలను పోగొట్టుకోండి’అంటూ శశి థరూర్‌కు యూపీ మంత్రి హితవు పలికారు. -
కుంభమేళాలో యూపీ కేబినెట్ భేటీ
అలహాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా దాదాపు ఆయన మంత్రివర్గం మంగళవారం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కుంభమేళా వద్దే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు, సాధువులు కూడా ఈ పుణ్యతిథి సందర్భంగా స్నానాలు ఆచరించారు. కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు నిర్ణయాలను ఆమోదించింది. అలహాబాద్ నుంచి (ప్రస్తుత పేరు ప్రయాగ్‌రాజ్) పశ్చిమ యూపీని కలిపే 600 కి.మీ. గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోద ముద్ర వేసింది. దీనికోసం రూ.36 వేల కోట్లను కేటాయించనుంది. ప్రపంచంలోనే ఇది పొడవైన రహదారిగా చెబుతున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకే కాకుండా, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం ఇప్పటికే ప్రతిపాదించిన మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించారు. -
అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో మహా జనయజ్ఞం..
-
కుంభమేళాలో అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ప్రదేశంలో శనివారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 12లోని ఓ టెంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో కూడా ఏ ఒక్కరికి గాయాలు కాలేదని, ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ అక్కడి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. సరిగ్గా అర్థకుంభమేళా ప్రారంభం ముందు రోజే ఇక్కడ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత సోమవారం దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో తాత్కాలిక నిర్మాణాలు, అక్కడే పార్క్ చేసిన ఓ కారు కాలిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. -
ప్రారంభమైన కుంభమేళా..
అలహాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా ప్రారంభమైంది. ప్రయగ్‌రాజ్‌లో మంగళవారం ఉదయం 5.15 గంటలకు రాజయోగ స్నానాలతో కుంభమేళా ఉత్సవం మొదలైంది. అర్ధ కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభామేళా పూర్తయ్యేసరికి 4,300 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి భక్తులకు అక్షయ్ వాత్, సరస్వతి కుప్ల వద్ద పూజల చేసుకునే అవకాశం కల్పించారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం 100 హెక్టార్లలో గుడారాలు ఏర్పాటు చేసింది. మకర సంక్రాంతి సందర్భంగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయిన ఈ మహా జనయజ్ఞం మార్చి 4వ తేదీ వరకు అంటే మహాశివరాత్రి దాకా కొనసాగనుంది. 12 ఏళ్లలో రెండు పర్యాయాలు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అర్థ కుంభ్‌గా పిలుస్తుంటారు. కానీ, యూపీ ప్రభుత్వం ఇటీవల ఆ పేరును కుంభ్‌గా మార్చింది. ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించే అఖాడాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. తాత్కాలిక మహానగరి సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 50 రోజులపాటు సాగే ఈ క్రతువులో 12 కోట్ల మంది వరకు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గంగా–యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది. ఇందులో 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 20 వంతెనలు, ఇంకా ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు..ఇలా ఒక నగరంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. కుంభ్ నగరిలోకి అత్యవసర సేవలందించే వాటిని తప్ప మిగతా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఇక్కడ 15 రాష్ట్ర ప్రభుత్వాలు 261 కార్యక్రమాలను చేపట్టాయి. యూపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు 28, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు ఈ కుంభమేళా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళా కంటే దాదాపు మూడు రెట్లు నిధులు అంటే రూ.4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ, చాలా లోపాలున్నాయి. మా టెంట్లో లైట్లు బిగించటానికి రూ.200 లంచం ఇవ్వాల్సి వచ్చిందని జునా అఖాడాకు చెందిన ఓ సాధువు తెలిపారు.లౌడ్ స్పీకర్లలో వినిపించే ఆధ్యాత్మిక గీతాలు.. దిగంబర దేహ మంతటా విబూధి రేఖలు, గంజాయి నింపిన చిలుంలను పీలుస్తూ నాగా సాధువులు చేసే ఆనంద నృత్యాలు.. వీటన్నిటినీ ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకునే విదేశీ యాత్రికులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దీంతోపాటు ఇక్కడ మత రాజకీయాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. మేళా సందర్భంగా అయోధ్యలో రామాలయంపై వివిధ హిందుత్వ సంస్థలు ‘ఇప్పుడు నీవు రామ మందిరం నిర్మించ లేకుంటే ముందు తరాల వారికి ఎలా మొహం చూపిస్తావు’ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశాయి. 13 అఖాడాలు 8వ శతాబ్దానికి చెందిన హిందూ గురువు ఆదిశంకరాచార్య సనాతన ధర్మాన్ని రక్షించే లక్ష్యంగా సాధువులకు చెందిన వివిధ సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అఖాడాలను నెలకొల్పారు. ఒక్కో అఖాడా ఒక్కో సిద్ధాంతం, ఆచార సంప్రదాయాలను పాటిస్తాయి. ఆరాధన విధానాన్ని బట్టి శైవ, వైష్ణవ, ఉదాసీన్ అనే మూడు ముఖ్యమైన అఖాడాలున్నాయని అఖిల భారతీయ అఖాడా పరిషత్(ఏబీఏపీ) అధ్యక్షుడు నరేంద్ర గిరి తెలిపారు. మొత్తం 13 అఖాడాల్లో ఏడు శైవ, మూడు వైష్ణవ, 2 ఉదాసీన, ఒక సిక్కు అఖాడాలున్నాయని తెలిపారు. అఖాడా అంటే అఖండం, విడదీయరానిదని అర్థం అని ఆయన వివరించారు. జునా అఖాడా అతి ప్రాచీనమైంది, అన్నిటి కంటే పెద్దదిగా చెబుతుంటారు. జన వాక్కు ‘సౌకర్యం, అసౌకర్యాల గురించి ఆలోచించొద్దు. ఆ గంగామాతను స్మరించుకోండి. మీ కష్టం, అలసట అంతా దూరమవుతుంది..’ అన్నారు కనౌజ్ నుంచి కుంభ్నగరికి చేరుకున్న ప్రమోద్ ప్రకాశ్(55) అక్కడున్న మిగతా వారిని చూపిస్తూ. ఈయన బరువైన మూడు బ్యాగులను మోసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చారు. ‘స్వచ్ఛమైన భక్తిభావం ఇక్కడి వారిలో చూస్తున్నాం. కుంభమేళా నిర్వహణ కూడా చాలా బాగుంది. మేం మాటల్లో చెప్పలేం. ఈ అద్భుతాన్ని ఎవరైనా చూసి నమ్మాల్సిందే. ఇంతపెద్ద కార్యక్రమం, అసంఖ్యాక జనం, కొంత గందరగోళం అనిపించినా, ప్రతి ఒక్కటీ సజావుగా సాగిపోతోంది. వీటన్నిటి వెనుకా ఏదో అతీతశక్తి ఉంది’ అన్నారు ఇటలీ నుంచి వచ్చిన అలాసియో దంపతులు. పిల్లలు తప్పిపోకుండా ట్యాగ్లు కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్)ట్యాగ్‌లను అందజేస్తున్నారు. వొడాఫోన్ కంపెనీ సహకారంతో 40వేల ట్యాగ్‌లను సమకూర్చుకున్నట్లు డీఐజీ వివరించారు. అత్యంత పవిత్రమైన 6 త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు పవిత్రమైనవి ఆరు రోజులు. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబు తారు. భద్రత నీడలో కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అభినయ్ పాండే తెలిపారు. మేళాలో బందోబస్తు కోసం 20వేల పోలీసులు, 6 వేల హోంగార్డులు, 40 పోలీస్ స్టేషన్లు, 40 ఫైర్ స్టేషన్లు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర బలగాలను మోహరించినట్లు చెప్పారు. 30 మహిళా పోలీస్స్టేషన్లు, సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చేరుకునేలా 317 పోలీస్ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. డ్రోన్ కెమెరాలు, వాచ్ టవర్లు, బ్యాగేజీ స్కానర్లు, ఆధునిక సమాచార వ్యవస్థను నెలకొల్పామన్నారు. ‘1, 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర కమాండ్–కంట్రోల్ రూం నెలకొల్పాం. భారీగా జనం గుమికూడినా, తొక్కిసలాటలు జరిగే అవకాశమున్నా వెంటనే గుర్తించేందుకు వీడియో అనలిటిక్స్‌ను వినియోగిస్తున్నాం. ఉగ్రవాదులు, అనుమానితులను గుర్తించేందుకు త్రినేత్ర యాప్‌ను వాడుకలోకి తెచ్చాం’ అని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు -
కుంభమేళా క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం
లక్నో : మరో 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే కుంభమేళా ప్రారంభం కంటే ముందే ఓ అపశృతి చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ కుంభ మేళ క్యాంప్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు.. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేపటి నుంచి కుంభమేళా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. #WATCH Fire fighting operations underway at a camp of Digambar Akhada at #KumbhMela in Prayagraj after a cylinder blast. No loss of life or injuries reported. pic.twitter.com/qcbh8IPl5Y — ANI UP (@ANINewsUP) January 14, 2019 -
కుంభ్ జియో ఫోన్ : ఆఫర్లేంటంటే..
సాక్షి, ముంబై: 2019 కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం టెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. భక్తుల సౌకర్యార్థం ఒక స్పెషల్ జియోఫోన్‌ను లాంచ్ చేసింది. తద్వారా జనవరి 15 నుంచి మార్చి 4 వరకు కొనసాగే ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే130 మిలియన్లమందికి పైగా భక్తులకు విశేష సేవలందించేందుకు సిద్ధమైంది. కుంభ మేళా, ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని డిజిటల్ సొల్యూషన్స్ అందించడానికి కుంబ్ జియో ఫోన్‌ను తీసుకొచ్చింది.1991 హెల్ప్‌లైన్ ద్వారా సహాయంతోపాటు, ఉచిత వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను అందించన్నుట్టు జియో ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో ఒక యాప్‌ను అందిస్తోంది. తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు జియో తెలిపింది. అలహాబాద్ కుంభమేళా సందర్భంగా యాత్రీకులకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కుంభ్ జియో ఫోన్‌ను ఆ విష్కరించింది. ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ కుంభ్ జియో ఫోన్ ద్వారా కుంభమేళాకు సంబంధించి ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. అలాగే కుంభ్ రేడియో ద్వారా 24x7 భజనలు, ఇతరభక్తి సంగీతాన్ని వినే అవకాశాన్ని కూడా కల్పించింది. కుంభమేళా ప్రదేశం రూట్‌మ్యాప్‌తో పాటు బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారాన్ని కూడా ఎప్పటికపుడు అందిస్తుంది. ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. కుంభ్ జియో ఫోన్ ఫీచర్లు 1991 హెల్ప్‌లైన్ నంబరు ద్వారా ప్రత్యేక సేవలు కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యేక బస్సులు, రైళ్లకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ టికెట్స్ బుకింగ్, రైల్వేక్యాంప్ మేళా కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించే సదుపాయం. ఇలా ముఖ్యమైన సందేశాలు, ప్రకటనలు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటాయి. -
కుంభమేళాలో జియో సేవలు
న్యూఢిల్లీ: అలహాబాద్‌లో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు సంబంధించి ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదలచేసినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. మార్చి 4వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవంలో పాల్గొనేవారు తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తోంది. జనం మధ్యలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుకోవడం కుంభమేళాలో క్లిష్టతరం కాగా, ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని రిలయన్స్ జియో వివరించింది. తప్పిపోయే కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. -
మంచిని పంచుదాం..పెంచుదాం!
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సానుకూల(పాజిటివ్) విషయాలను వైరల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతికూల అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించారు. ప్రజల ఉమ్మడి కృషి కారణంగా భారత్ 2018లో పలు అద్భుతాలను సాధించిందన్నారు. ఆశయం బలంగా ఉంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయని తెలిపారు. 2019లో కూడా భారత అభివృద్ధి, పురోగతి ఇలాగే సాగాలని ..సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. 2018లో చివరి మాసాంతపు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై ముచ్చటించారు. ఏడాదిలో అనేక విజయాలు... ‘మనమంతా కలిసి సానుకూల అంశాలను వైరల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి తెలుసుకుంటారు. ప్రతికూల వార్తలు, అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. కానీ చుట్టూ సానుకూల విషయాలను వ్యాప్తిచేసే ప్రయత్నం నిజంగానే జరుగుతోంది. చాలా వెబ్సైట్లు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయి. ఇలాంటి వార్తల లింక్స్‌ను విస్తృతంగా పంచుకోండి. తద్వారా సానుకూలతను వైరల్ చేయవచ్చు’ అని మోదీ సూచించారు. 2018లో ఎన్డీయే ప్రభుత్వ సాధించిన కీలక విజయాలపై మాట్లాడుతూ..‘ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఆవిష్కరించాం. దేశంలోని ప్రతీపల్లెకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రజల దృఢ సంకల్పంతో పరిశుభ్రత అన్నది 95 శాతం దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు. కానీ స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి అక్టోబర్ 21న ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాం. తొలి భారత హోంమంత్రి సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటుచేశాం. ఈ ఏడాదే భూ, జల, వాయు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది’ అని మోదీ వెల్లడించారు. యువతకు గొప్ప అవకాశం... యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాపై స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు పరిశుభ్రత కూడా పరిఢవిల్లుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యువతకు కుంభమేళా గొప్ప అవకాశం’ అని పేర్కొన్నారు. అలాగే ఈసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవుతారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో∙గాంధీ జాతి వివక్షపై మొదటిసారి పోరాడి, మహాత్ముడిగా మారారని గుర్తుచేశారు. అండమాన్ ప్రజలు దేశానికే ఆదర్శం అండమాన్ దీవుల్లో మోదీ పర్యటన కార్ నికోబార్ / పోర్ట్‌బ్లెయర్ : 2004లో విరుచుకుపడ్డ సునామీ దుష్ప్రభావం నుంచి అండమాన్ ప్రజలు శరవేగంగా కోలుకున్నారని ప్రధాని కితాబిచ్చారు. అండమాన్ దీవుల్లో ఉంటున్న ప్రజల సంక్షేమానికి, భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్ నిరోబార్ దీవుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రశంసించిన మోదీ, ఈ విషయంలో అండమాన్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రజలు ప్రధాన భూభాగాన్ని, ద్వీపాలను వేరుగా చూస్తారనీ, తనకు మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల కంటే పోర్ట్బ్లెయరే ప్రధాన భూభాగమని అన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా రూ.50 కోట్లతో గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్ నికోబార్‌లోని బీజేఆర్ స్టేడియంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. కొబ్బరి పొట్టు కనీస మద్దతు ధరను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. సావార్కర్ గదిలో ధ్యానం.. పర్యటనలో భాగంగా పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించిన ప్రధాని.. బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన గదిలో నేలపై ధ్యాన ముద్రలో కూర్చున్నారు. ఆతర్వాత జైలు సెంట్రల్ టవర్ వద్ద గోడపై చెక్కిన అమరుల పేర్లను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి వెనుదిరిగారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896–1906లో నిర్మించారు. ఈ పర్యటనలో భాగంగా చెన్నై–పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు. మూడు ద్వీపాలకు కొత్త పేర్లు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేస్తున్నట్లు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..‘స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్రస్తావించాల్సి వస్తే నేతాజీ పేరును గర్వంగా ప్రకటిస్తాం. ఆయన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి తొలి ప్రధాని. ఆయన అండమాన్ గడ్డపై భారత్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేశారు. అండమాన్ నుంచి దేశం స్ఫూర్తి పొందుతోంది. 1943లో ఇదే రోజున అండమాన్, నికోబార్ దీవులను షహీద్, స్వరాజ్ దీవులుగా గుర్తించాలని నేతాజీ సూచించారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవంగా మొబైల్ ఫోన్ల ఫ్లాష్లైట్లను ఆన్ చేయాలని కోరడంతో స్టేడియం ఒక్కసారిగా వెలుగుజిలుగులతో కాంతులీనింది. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. -
కుంభమేళాలో పాల్గొనండి
సాక్షి ,హైదరాబాద్: ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాలో పాల్గొనాలంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్ మహాన్ తెలంగాణ ప్రజలను ఆహ్వానించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారాలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. యునెస్కో వారసత్వపు హోదా పొందిన కుంభమేళాకు దేశంలోని గ్రామ గ్రామాల నుంచి ప్రజలు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానిస్తున్నామని మహాన్ తెలిపారు. ఆధ్యాత్మికం, ప్రభుత్వం ఏకతాటిపై నడుస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇదనీ, మేళా విజయవంతానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. గతం కంటే మిన్నగా ఏర్పాట్లు రూ.ఐదు వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రకాల వసతులు గతం కన్నా మిన్నగా సమకూర్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రాథమిక సదుపాయాలు, ప్రారిశ్రామికాభివృద్ధి) రాజేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తెలిపారు. జనవరి 15న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా మార్చి 4వరకు జరుగుతుందన్నారు. ముఖ్యమైన మౌని అమవాస్య రోజున 4 కోట్లమంది భక్తులు పాల్గొనవచ్చని, మొత్తం మేళా పూర్తయ్యేనాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరవచ్చన్నారు. ప్రతీరోజూ ప్రయాగలో 7 క్యూసెక్కుల నీరు ఉండేలా చూస్తున్నామని, మౌని అమావాస్య మొదలు 5 ముఖ్యమైన కుంభమేళా రోజుల్లో 8 క్యూసెక్కుల నీరు ఉంటుందని రాజేశ్ కుమార్ తెలిపారు. అందరూ కలసి పాల్గొనే వీలున్న ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏటిఓ చైర్మన్ రంగారెడ్డి, ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్ సాంస్కృతిక కమిటీ చైర్పర్సన్ ప్రశాంత్ లహోటి పాల్గొన్నారు. గవర్నర్ , కేటీఆర్‌ను ఆహ్వానించిన యూపీ సర్కార్ కాగా కుంభమేళాలో పాల్గొనాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును యూపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహాన శనివారం రాజ్‌భవన్, ప్రగతిభవన్లను సందర్శించి గవర్నర్ నరసింహన్, కేటీఆర్‌లకు ఆహ్వానలేఖలను అందించారు. -
స్త్రీలోక సంచారం
జనవరి 19 నుంచి అలహాబాద్‌లో మొదలయ్యే ప్రయాగ కుంభ మేళా ఉత్సవాలకు వచ్చే మహిళా భక్తులతో మర్యాదగా ఎలా మసులుకోవాలో, వారికి అవసరమైన సదుపాయాలకు లోటు రాకుండా ఎలా నిర్వహణ ఏర్పాట్లు చేయాలో పోలీస్ సిబ్బందికి, పారామిలటరీ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)లోని ‘గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (జీబీపీఎస్‌ఎస్‌ఐ) ముందుకొచ్చింది. మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది వస్తుండగా, వారిలో సగం మంది మహిళలే ఉంటారన్న అంచనా ఉంది కనుక ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రత్యేక ఘాట్లను నిర్మిస్తున్నారు. కుంభ్ ఏరియా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.పి.సింగ్‌కి వచ్చిన ఈ ఆలోచనతో కుంభమేళ ఉత్సవాలను ఈసారి ‘ఉమెన్ ఫ్రెండ్లీ’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ ఆదివారం ఈ రద్దీ మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో ‘ట్రావంకోర్ దేవస్వం బోర్డు’ అందోళన చెందుతోంది. అయితే అందుకు వేరే కారణం ఉంది. కోర్టు తీర్పుతో లభించిన స్వేచ్ఛతో చెన్నైలోని ‘మానితి’ అనే సంస్థ సభ్యులు (వీరంతా యాభై ఏళ్లలోపు వారే) 50 మంది ఇవాళ అయ్యప్ప దర్శనానికి శబరిమల చేరుకోబోతున్నారు. వారి రాకను ప్రతిఘటిస్తున్న స్థానిక రాజకీయ పక్షాల కారణంగా తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వీలైనంత వరకు ఇరువైపుల వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకు దేవస్వం బోర్డు పోలీసు యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతోంది. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
యూపీ సీఎం సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన అలహాబాద్ పేరును మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ పేరు మార్పు ప్రతిపాదన గవర్నర్ ముందు పెట్టామని.. అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం ‘ప్రయాగ్ రాజ్’ వాడుకలోకి వస్తుందని చెప్పారు. కుంభమేళా ఏర్పాట్లపై మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఏర్పాటు ప్రారంభమయ్యాయి. కుంభమేళా జరిగే ప్రాంతంలో అన్ని సదుపాయలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పాంత్రంలో ఎటీఎంలు, సెల్ టవర్లు, చేతిపంపులు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం’ అని సీఎం అన్నారు. 2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుంది. దాదాపు 192 దేశాల నుంచి కోట్లలో భక్తులు రానున్నారు. -
కన్నుల పండువగా తెలంగాణ కుంభమేళా
-
‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా కుంభమేళా
న్యూఢిల్లీ: కుంభమేళాను ‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో గుర్తించింది. ఈ మేరకు యునెస్కో ట్విటర్లో వెల్లడించింది. సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాలు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 9న ముగియనున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనంగా కుంభమేళాకు పేరు. ‘కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం గర్వించదగ్గ విషయం’ అని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. ఈ గుర్తింపుతో ప్రజలు తమ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా కాపాడుకోవడానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుంది. -
ఐఎస్ టార్గెట్ కుంభమేళా
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో లాస్‌వెగాస్ తరహా దాడులతో విరుచుకుపడతామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) హెచ్చరించింది. రానున్న రోజుల్లో కుంభమేళా, త్రిసూర్‌పురంలో జనసమ్మర్థంపై భారీ దాడులకు దిగుతామని పదినిమిషాల ఆడియో క్లిప్‌లో ఐఎస్ హెచ్చరించింది. మలయాళంలో హెచ్చరిస్తూ ఈ ఆడియో క్లిప్‌లు విడుదలయ్యాయని తెలిసింది. కుంభమేళా, త్రిసూర్ పురం వంటి ఉత్సవ వేడుకలే లక్ష్యంగా భారీ విధ్వంసంతో చెలరేగుతామని ఐఎస్ హెచ్చరించింది. భారత్‌లో ఉగ్ర దాడి తప్పదని ఖురాన్‌ను ఉటంకిస్తూ ఈ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. మ్యూజిక్ కాన్సర్ట్‌లో లాస్‌వెగాస్ కాల్పుల్లో పెద్దసంఖ్యలో అమాయక ప్రజలు మరణించిన ఉదంతాన్ని ఈ క్లిప్‌లో విస్పష్టంగా ప్రస్తావించారు. లాస్‌వెగాస్ కిల్లర్ తమ మనిషేనని ఐఎస్ పేర్కొంది. మీ మేథకు పదును పెట్టంది...విషం కలిపిన ఆహారం వారికివ్వండి...ట్రక్లు ఉపయోగించండి..త్రిసూర్‌పురం లేదా మహా కుంభమేళాపై ప్రజలే లక్ష్యంగా విరుచుకుపడండి అంటూ ఈ క్లిప్‌లో ఉగ్రమూకలను ప్రేరేపించారు. కనీసం రైలు పట్టాలు తప్పేలా ప్రయత్నించండి..కత్తులతోనూ స్వైరవిహారం చేయంటి అంటూ ఈ క్లిప్‌లో మేల్ వాయిస్ ఉంది. కాగా ఆప్ఘనిస్తాన్ నుంచి టెలిగ్రాం మెసెంజర్‌ను ఆడియో క్లిప్‌గా మార్చారని పోలీసులు చెబుతున్నారు. క్లిప్‌లో ఉన్న మేల్ వాయిస్ ఐఎస్ నేత రషీద్ అబ్దుల్లాదిగా చెబుతున్నారు. అబ్ధుల్లాపై పలు సెక్షన్ల కింద ఎన్ఐఏ చార్జిషీట్ రూపొందించింది. ఆడియో క్లిప్‌తో నిఘా వర్గాలు, పోలీసు శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు యూరప్, మధ్య ప్రాచ్యం నుంచి భారత్ వైపు దృష్టిసారించడం తీవ్ర ఆందోళనకరమని ఆడియో క్లిప్‌లపై స్పందిస్తూ మాజీ కేబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి వి బాలచంద్రన్ వ్యాఖ్యానించారు. -
చాయ్‌వాలాగా మారిన సీఎం
ఉజ్జయిని: వెళ్లిన ప్రాంతాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి తగిన విధంగా ప్రవర్తిస్తుండటం, దుస్తులు ధరించడం రాజకీయ నేతలకు అలవాటే. ఉజ్జయినిలో జరుగుతోన్న మహా కుంభమేళాలోమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పనినిచేశారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా సిప్రా నదీ తీరంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంప్ లను శుక్రవారం తెల్లవారుజామన సందర్శించిన ఆయన చాయ్ వాలా అవతారం ఎత్తారు. కెటిల్ చేతబట్టుకుని అక్కడున్న భక్త పరివారానికి చాయ్ పోసి సంతోషింపజేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏప్రిల్ 22న మొదలై మే 21 వరకు కొనసాగే సింహస్థ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సిప్రా నదీ తీరంలో గురువారం భారీ వర్షం, ఈదురు గాలులు చోటుచేసుకోవడంతో గుడారాలు కూలి ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు. (చదవండి: కుంభమేళాలో అపశ్రుతి) -
కుంభమేళాలో అపశ్రుతి
భారీ వర్షం, పిడుగుపాటు, ఈదురు గాలులకు ఏడుగురు మృతి ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో భారీ వర్షం, ఈదురు గాలులకు గుడారాలు కూలి ఆరుగురు మరణించగా.. పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో 90 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈదురు గాలులకు యాత్రికులు, సాధువుల కోసం ఏర్పాటుచేసిన గుడారాలు కొట్టుకుపోయాయి. దీంతో పాటు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గేట్లు ఎగిరి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉజ్జయిని సమీపంలోని ఉండస ఘాట్ వద్ద పిడుగుపాటుకు గుర్తుతెలియని యాత్రికురాలు మృతి చెందినట్లు వెల్లడించారు. యాత్రాస్థలంలో విద్యుత్‌ను నిలిపేశారు. గుడారాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కుంభమేళాలో అపశృతిపై ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన సాధు సంతులు, యాత్రికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్విటర్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను చౌహాన్ ప్రకటించారు. -
నేటి నుంచి చండీరుద్ర మహాయాగం
♦ 12 ఏళ్ల పాటు కొనసాగనున్న మహత్కార్యం ♦ వంచవటి క్షేత్రంలోప్రారంభించనున్న కాశీనాథ్‌బాబా న్యాల్కల్: మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులో మంజీర నది సమీపంలో వెలసిన పంచవటి క్షేత్రంలో కుంభమేళ ఉత్సవాలు నిర్వహించిన పీఠాధిపతి కాశీనాథ్‌బాబా మరో మహత్కార్యాన్ని తలపెట్టారు. దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని పుష్కర కాల చండీరుద్ర మహాయాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగా పండి దేశప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ ఈ యాగాన్ని తలపెట్టినట్టు కాశీనాథ్‌బాబా చెప్పారు. 12 సంవత్సరాలు పాటు(2028 మార్చి 28 వరకు) ఏకదాటిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పంటలు పండక, దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న ప్రజల క్షేమం కోసం ఈ యాగాన్ని 36 లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహామునులు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయని కాశీనాథ్‌బాబా తెలిపారు. గతంలో రాజులు ఇ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘట నలు ఉన్నాయన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని క్షేత్రం ఆవరణలో యజ్ఞాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. హాజరుకానున్న ప్రముఖులు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల పీఠాధిపతులు, రుషులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. నేడు బీదర్ సిద్దరూడ మఠం పీఠాధిపతి శివకుమార్‌స్వామి, తమ్లూర్ పీఠాధిపతి సద్గురు శివానంద శివాచార్యస్వామి, 9న అంతర్గామ పీఠాధిపతి ఏకాంబ గజేంద్ర కరుణ్ మహారాజ్, 10న బిచుకుంద సంస్థానం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్, 11న అనంతగిరి సరస్వతి క్షేత్రం పీఠాధిపతి అష్టావధాని అష్టకాల నర్సింహ రామశర్మ, 12న శ్రీ వేంకటస్వామి మహారాజ్‌తో పాటు బర్దీపూర్, కుప్పానగర్, రాయగిరి, అంగడిపేట, కొండాపూర్, ముంగి, కమలాపురం మఠాల పీఠాధిపతులు దత్తగిరి మహారాజ్, మల్లికార్జునస్వామి, బసవలింగ మల్లయ్య గిరి మహారాజ్, శ్రీవాసుదేదానంద సరస్వతి స్వామి, సచ్చిదానంద ఉద్దవ మహారాజ్, సంగ్రాం మహారాజ్, దేవగిరి మహారాజ్ తదితరులు యాగంలో పాలుపంచుకోనున్నారు. ముఖ్య అథితులుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డి తదితరులు వస్తారని కాశీనాథ్‌బాబా చెప్పారు. కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నారు. -
కుంభమేళాలో భక్తుల ఆనందహేల
-
కుంభమేళా ఉత్సవం
-
కుంభమేళాకు పటిష్ట భద్రత
- 1000 సీసీటీవీ కెమెరాలతో నిఘా..పోలీసుల పహారా - అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక ఏర్పాట్లు ముంబై: నాసిక్‌లో జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరిగే కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కుంభమేళాకు మొదటి పదిహేను రోజుల్లో 12 నుంచి 13 లక్షల ప్రజలు హాజరవుతారని ముఖ్య కార్యనిర్వహణాధికారి బీకే ఉపాధ్యాయ అంచనావేశారు. ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నామని ఆయన తెలిపారు. 1000 సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన, ఇతర రాష్ట్రాల పోలీసులు సాధారణ దుస్తుల్లో గస్తీ కాస్తారని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండటానికి నాసిక్‌లో ప్రత్యేక ఆరోగ్య విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2003 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది యాత్రికులు మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. -
చెట్లు నరకడమెందుకు..
సాక్షి, ముంబై: కుంభమేళా ఏర్పాట్ల కోసం ఏకంగా 2,400 చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, పర్యావరణ నష్టాన్ని ఎలా పూడుస్తారని ముంబై హైకోర్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) పరిపాలన విభాగాన్ని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన స్పష్టమైన నివేదికను త్వరలో అందజేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. వచ్చే సంవత్సరం ఆగస్టులో నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి కోటికిపైగా భక్తజనం వస్తారని అంచనావేశారు. అందుకు రోడ్లను వెడల్పు చేయడం, ఇతర సదుపాయాలు కల్పించాలంటే అడ్డువస్తున్న చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెట్లను తొలగించని పక్షంలో వచ్చే భక్తులకు పూర్తి సదుపాయాలు కల్పించం కష్టమని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. దీంతో వాటిని నరికి వేయడానికి అనుమతివ్వాలని ఎన్ఎంసీ పరిపాలన విభాగం కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ధార్మిక కార్యక్రమానికి వందేళ్ల పాత చెట్లు, ఇంత పెద్ద సంఖ్యలో తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉందని, కాని ఎన్ఎంసీ కార్పొరేషన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఎలా పూడుస్తారో ముందు తేల్చాలని కోర్టు కోరింది. అదేవిధంగా కుంభమేళా జరిగే పరిసరా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా కుంభమేళాకు అవసరమయ్యే నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. త్వరగా నిధులు అందజేస్తే ఏర్పాట్లు, ఇతర పనులు ప్రారంభిస్తామని ఇదివరకే ఎన్ఎంసీ విజ్ఞప్తి చేసింది. కాని ఎవరి వాటా ఎంతో తేలకపోవడంతో నిధులు ఇంతవరకు పంపిణీ కాలేదు. -
కుంభమేళా ఏర్పాట్లకు నిధులివ్వండి
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి నాసిక్‌లో ఏర్పాట్లకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) ప్రతినిధులు కోరారు. మేయర్ అశోక్ ముర్తాదక్, డిప్యూటీ మేయర్ గుర్మిత్ సింగ్ బగ్గా ఆధ్వర్యంలోని ఎమ్మెన్నెస్ సభ్యులు గురువారం మాజీ మంత్రి ఛగన్ బుజ్బల్ను కలిశారు. ఈ మేరకు శుక్రవారం మేయర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కుంభ మేళాకు ఇంకా ఎనిమిది నెలలు వ్యవధి మాత్రమే ఉందన్నారు. అయితే ఇంతవరకు నాసిక్ లో కుంభమేళా ఏర్పాట్లకు తగినన్ని నిధులు అందలేదని అన్నారు. నాసిక్‌లో కుంభమేళా ఏర్పాట్లకు రూ.2,505 కోట్ల అంచనావ్యయంతో తాము ప్రతిపాదనలు పంపితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,052 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొత్తం ఖర్చులో తాము కేవలం మూడోవంతు మాత్రమే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటం అన్యాయమన్నారు. ఇప్పటివరకు ఏర్పాట్ల కోసం రూ.350 కోట్ల ఖర్చు పెట్టగా ప్రభుత్వం రూ.222 కోట్లు మాత్రమే చెల్లించందన్నారు. కాగా, ఎనిమిది నెలల వ్యవధిలో మిగిలిన పనులు పూర్తికావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందేనన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. -
జూలైలో గోదావరి పుష్కరాలు
సాక్షి, హైదరాబాద్: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను 2015 సంవత్సరం జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా నిర్వహించాలని రాజీవ్ శర్మ పేర్కొన్నారు. పుష్కర ఘాట్లు, దేవాలయాలకు వెళ్లే రోడ్లను తీర్చి దిద్దాలని. ఈ మొత్తం పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాసర, భద్రాచలం, ధర్మపురి ఈ మూడు ప్రాంతాల్లో ఒకదానిని ప్రధాన పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని, పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పేరును సీఎం సిఫారసు చేసినందున దానిపై మరోసారి ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. -
‘కుంభమేళా’లా జనమొస్తే.. మీరేం చేస్తారు?
న్యూయార్క్ మేయర్‌తో మోదీ చర్చలు న్యూయార్క్: పట్టణాల ఆధునీకరణ ప్రాజెక్టుపై బాగా దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ మేరకు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియోతో సమావేశమయ్యారు. పెద్ద నగరాలకు ఎదురవుతున్న సమస్యలు.. ముఖ్యంగా ఉగ్రవాదం, ప్రజలకు ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై చర్చించారు. ఒకవేళ భారత్‌లోని కుంభమేళా లాంటి సందర్భాలు వస్తే భారీగా తరలివచ్చే తొక్కిసలాటలు జరగకుండా చూడడం ఎలా? వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ఎలా వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే సెప్టెంబర్ 11 దాడుల తర్వాత న్యూయార్క్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. కాగా అహ్మదాబాద్‌తో సోదర నగర సంబంధమున్న కొలంబస్ నగరం.. నరేంద్ర మోదీ తొలి అమెరికా పర్యటనను పురస్కరించుకుని ప్రశంసాపూర్వక ప్రకటన విడుదల చేసింది. క్యాన్సర్ నిపుణుడితో మోదీ భేటీ: ప్రముఖ కేన్సర్ నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ హెరాల్డ్ వర్ముస్తో మోదీ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ప్రజారోగ్య రంగంలో జరుగుతన్న పరిశోధనల్లో సాయం చేసేందుకుగాను భారత్‌కు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. 74 ఏళ్ల హెరాల్డ్ వర్ముస్ 1960లలో ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ఆసుపత్రిలో తన అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో డెరైక్టర్‌గా ఉన్నారు. 30 నిమిషాలపాటు ఆయనతో సమావేశమైన మోదీ.. పలు అంశాలపై చర్చించడంతోపాటు కేన్సర్ పరిశోధనల్లో భారత్‌కు సహకరించాల్సిందిగా కోరారు. గ్రౌండ్ జీరోవద్ద మోదీ నివాళి: న్యూయార్క్‌లో 2001 సెప్టెంబర్ 11న అల్‌కాయిదా ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ గ్రౌండ్ జీరో స్మారక చిహ్నంవద్ద నివాళులర్పించారు. 9/11 మ్యూజియంను కూడా సందర్శించారు. కాగా, మోదీ గౌరవార్థం భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు ఆదివారం న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సభకు 46మంది అమెరికా ప్రతినిధులు హాజరుకానున్నారు. మోదీకి సమన్లు అందిస్తే రూ. 6 లక్షలు అమెరికా మానవ హక్కుల సంస్థ నజరానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయవంతంగా కోర్టు సమన్లు అందజేసినవారెవరికైనా సరే 10 వేల అమెరికన్ డాలర్లను (సుమారు రూ.6 లక్షలు) నజరానాగా ఇస్తామని అమెరికన్ జస్టిస్ సెంటర్ (ఏజేసీ) ప్రకటించింది. అరుుతే భద్రతా వలయంలో ఉన్న ప్రధానికి అలా సమన్లు జారీ చేయగల అవకాశమే లేదని భారత్ స్పష్టం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు సంబంధించి మానవహక్కుల సంస్థ ఏజేసీ మోదీపై దావా దాఖలు చేసింది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో.. నగరంలో ఆయన పాల్గొనే పలు కార్యక్రమాల సందర్భంగా సమన్లు జారీ చేసే ఏ వ్యక్తికైనా 10 వేల అమెరికన్ డాలర్లు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించినట్లు న్యూయూర్క్కు చెందిన లీగల్ అడ్వైజర్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ తెలిపారు. మోదీకి సమన్లు అందజేసిన వ్యక్తి అందుకు సంబంధించిన ఫొటో కానీ లేదా వీడియోను అందుకు రుజువుగా తేవాల్సి ఉంటుందని చెప్పారు. సమన్ల జారీకి ఏజేసీ స్వయంగా సైతం కొంతమందిని ఏర్పాటు చేసుకుంది. న్యూయూర్క్ రాష్ట్ర చట్టాల మేరకు 10 అడుగుల దూరం నుంచైనా, సంబంధిత వ్యక్తిపై పత్రాలను విసిరివేయడం ద్వారానైనా సమన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ఏజేసీ పేర్కొంది. ఇలా చేసినా సమన్లు జారీ అరుునట్టుగానే పరిగణిస్తారు. యూఎస్ ఫెడరల్ కోర్టు గురువారం మోదీకి సమన్లు జారీ చేసింది. అందులో మోపిన అభియోగాలకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. -
ఔరా.. అదిరింది డేరా..
కుంభమేళాలు జరిగినప్పుడు, ఇతర పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు డేరాలు వేసుకుని ఉండటం వంటివి మనకు తెలిసిందే. టెంట్లో పెద్ద సదుపాయాలేం ఉంటాయి. బ్రిటన్‌లోని గ్లాస్టన్బరీలో ఉన్న డేరాల్లో మాత్రం అన్ని సదుపాయాలూ ఉంటాయి. హోటళ్లలో స్టార్ హోటళ్లు ఎలా వేరో.. టెంట్లలో ఇవి అలా వేరు. వాస్తవానికి ఇదో హోటల్.. పేరు పాప్ అప్. ఇందులో మొత్తం 150 టెంట్లు ఉంటాయి. సాధారణ, లగ్జరీ రూముల్లాగా.. ఇందులోనూ సాధారణ, లగ్జరీ, సూట్ టెంట్లు ఉంటాయి. ఇది సూట్ టెంట్ ఫొటో. ఇందులో నాలుగు విలాసవంతమైన పడక గదులు, అత్యాధునికమైన సదుపాయాలున్న బాత్రూంలు రెండు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. సూట్ టెంట్లో ఉండాలంటే రోజుకు రూ.2 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
కుంభమేళా పనులకు నిధుల కొరత
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి జిల్లాలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ఎంసీకి కేటాయించిన నిధులు తగిన రీతిలో అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కుం భమేళా నిమిత్తం జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్రం నిర్ణయించింది. జిల్లాకు రూ.2,378.71 కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కమిటీ నిర్ణయించింది. వీటిలో ఎంఎంసీకీ రూ.1,052.61 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్ఎంసీకి కేవలం రూ.222.17 కోట్లు అందజేసింది. కేంద్రం నుంచి ఎన్ఎంసీకి ఇంతవరకు నిధులు ఏమాత్రం అందలేదు. ఇదే సమయంలో, పనుల్లో తన వంతు నిధులను సకాలంలో విడుదల చేయాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు డివిజనల్ రెవెన్యూ కమిషనర్(నాసిక్ డివిజన్) ఏక్నాథ్ దావ్లే లేఖ రాశారు. ‘అత్యున్నత కమిటీ, హై-పవర్ కమిటీ సమావేశాల సమయంలో కుంభమేళాకు సంబంధించిన పనులకు కేటాయించిన నిధుల్లో 33 శాతం అంటే రూ.350 కోట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మిగిలిన సొమ్ము (సుమారు రూ.700 కోట్లు)ను నాసిక్ మున్సిపల్ కార్పొరేషనే సమకూర్చుకోవాలని చెప్పింది. అయితే ఈ నెల మొదటి వారంలో జరిగిన కుంభమేళా సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.350 కోట్లు, లోన్ల ద్వారా రూ.350 కోట్ల పైనే నివేదిక సమర్పించింది. మిగిలిన రూ. 352.61 కోట్ల నిధుల గురించి ఎటువంటి ప్రణాళిక రూపొం దించలేదు. కుంభమేళాకు ఇంకా ఎంతో సమయం లేదు. సాధుగ్రాం, తాత్కాలిక నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, తాత్కాలిక పార్కింగ్ స్థలాల ఏర్పా టు వంటి పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు చూస్తే సకాలంలో అందడంలేదు.. ఇలా అయితే కుంభమేళా సమయానికి నిర్దేశించిన పనులు పూర్తిచేయడం కష్టమే..’ అని ఆ లేఖలో ఏక్నాథ్ స్పష్టం చేశారు. కాగా నగర మేయర్ యతిన్ వాఘ్‌ను ఈ విషయమై సంప్రదించగా..‘కుంభమేళా పనుల పూర్తిలో ఎన్ఎంసీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సమాన బాధ్యత ఉంది. అలహాబాద్, ఇతర నగరాలకు కేంద్ర నిధులు అందాయి. మాకు కూడా కేంద్ర నిధులు విడుదల కావాల్సి ఉంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తాం. ప్రస్తు తం మేము ఎన్ఎంసీ తరఫున నిధుల సమీకరణలో తలమునకలై ఉన్నాం..’ అని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో కుంభమేళా జరగనుంది. ఎన్ఎంసీ కి కేటాయించిన 96 పనుల్లో రూ.529.55 కోట్ల విలువ చేసే 29 పనులను ఇప్పటికే ప్రారంభించా రు. వీటిలో రూ.432.49 కోట్ల ఖర్చు ప్రతిపాదనతో 17 రోడ్డు పనులు, గోదావరిపై రూ.16.97 కోట్ల అంచనాతో మూడు వంతెనలు, రూ.65.01 కోట్ల అంచనా ఖర్చుతో ఐదు నీటి సరఫరా పనులు, అలాగే రూ.15.08 కోట్ల అంచనా ఖర్చుతో నాలుగు మురికినీటి ప్రక్షాళన పనులు ఉన్నాయి. -
దీపావళి, కుంభమేళా భలే..భలే
వాటికి అమెరికా వెబ్సైట్ జాబితాలో చోటు న్యూయార్క్: భారత్‌లో జరిగే దీపావళి పండగ, కుంభమేళాలు ప్రపంచంలో తప్పనిసరిగా పాల్గొనదగ్గ ఉత్సవాలని అమెరికాకు చెందిన న్యూస్‌వెబ్‌సైట్ హఫింగ్టన్పోస్ట్ వెల్లడించింది. ఈ వెబ్సైట్ రూపొందించిన తప్పనిసరిగా పాల్గొనదగ్గ ఉత్సవాల జాబితాలో ఈ రెండు ఉత్సవాలకు చోటు లభించింది. దీపాల వెలుగులు, బాణసంచా.., మిఠాయిలు, లక్ష్మీ పూజలతో దీపావళి పండగ ఎంతో ఆకట్టుకునేలా ఉంటుందని, అలాగే లక్షలాదిమంది పాల్గొనే కుంభమేళా కూడా శాంతియుతంగా సాగే అతిపెద్ద ఉత్సవమని ఆ వెబ్సైట్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనదగ్గ ఇతర ఉత్సవాల్లో బ్రెజిల్‌లోని రియో డిజెనేరియోలో జరిగే కార్నివాల్, జర్మనీలో జరిగే బీర్ ఫెస్టివల్, స్పెయిన్‌లో జరిగే టమాటాల ఉత్సవం ఉన్నట్టు వెల్లడించింది. -
కుంభమేళాకు ముమ్మర ఏర్పాట్లు
ముంబై : నగరానికి ఉత్తరాన ఉన్న నాసిక్-త్రయంబకేశ్వర్ పట్టణాల్లో 2015లో జరిగే కుంభమేళాకు సుమారు కోటి మంది హాజరు కావచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. ఆ మేరకు కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తోంది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళా సందర్భంగా ‘సాహీ స్నాన్’కు హాజరయ్యే యాత్రికులకు అవసరమైన భోజన, నివాస వసతులు, మరుగుదొడ్లు, రోడ్లు, రవాణా సదుపాయాలు, బ్రిడ్జీలు వంటి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించాం. దీనికోసం రూ.2,380 కోట్ల అంచనా బడ్జెట్‌ను ఆమోదించాం. మేళాకు హాజరయ్యే సుమారు రెండు లక్షల మంది సాధు సంతుల వసతి నిమిత్తం ‘సాధుగ్రామ్’ నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని నిర్ణయించామ’ని తెలిపారు. దీని కోసం తగినన్ని కేంద్ర నిధుల సమీకరణకు శనివారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి కోరనున్నట్లు చవాన్ తెలిపారు. 2015లో కుంభమేళా జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుగుతుంది. ఆగస్టు 29 , సెప్టెంబర్ 13, 18 తేదీల్లో సాహీ స్నానాలను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి మన దేశంలో నాసిక్, త్రయంబకేశ్వర్ సహా ఉజ్జయిన్, అలహాబాద్, హరిద్వార్‌లలో కుంభమేళాను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 2003లో జరిగిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 60 లక్షలమంది హాజరయ్యారు. ఈ మేళా సమయంలో గోదావరి నదిపై రామ్‌కుంద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మహామేళాకు తగిన ఏర్పాట్లు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖలు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి.‘సాధారణంగా కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులు, తర్వాత దగ్గరలోనున్న షిర్డీ, శని-సింగణాపూర్, భీమశంకర్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన రక్షణ ఏర్పాట్లతోపాటు మిగతా సదుపాయాలను కూడా సమకూరుస్తున్నాం..’ అని రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు.కుంభమేళా ప్రారంభ సమయానికి నాసిక్, సమీప ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర టూరిజం, ప్రజాపనుల శాఖ మంత్రి చగన్ భుజ్‌బల్ వివరించారు.