
సాక్షి, న్యూఢిల్లీ : కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ 21 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రధాని ఇటీవల కుంభమేళాలో వారి సేవలకు గాను పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ పారిశుద్ధ్య కార్మికులు నిజమైన కర్మ యోగులని ప్రశంసించారు.
ప్రధాని ఇటీవల తీసుకున్న సామాజిక వితరణ చర్యల్లో భాగంగా కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులకు రూ 21 లక్షల విరాళం అందచేశారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) బుధవారం ట్వీట్ చేసింది. ప్రధాని సామాజిక సేవా కార్యక్రమాల్లో చూపిన చొరవ, ప్రకటించిన సాయాలకు సంబంధించిన పలు ఉదంతాలను పీఎంఓ ఈ ట్వీట్‌లో ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment