Donation
-
TTD: తిరుమల శ్రీవారికి రూ. 6 కోట్ల విరాళం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. కోటి విలువైన డిడిలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ ట్రస్టులకు గతంలో దాత అనేక మార్లు విరాళంగా అందజేశారు. -
అదానీ అంశంపై దుమారం చెలరేగుతోంది: రేవంత్ రెడ్డి
-
‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’
ఉద్యోగం ఇస్తాం.. కానీ జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు ఉద్యోగార్థులే విరాళంగా చెల్లించాలి.. అవును మీరు విన్నది నిజమే. ఇవి ఏకంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పిన మాటలు. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు దరఖాస్తులు కోరారు. ఈమేరకు చేసిన వినూత్న ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాం. ఈ పొజిషన్లో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగార్థులకు పూర్వానుభవం అవసరంలేదు. తమ స్థానంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది’ అన్నారు.ఉద్యోగి రూ.20 లక్షలు విరాళం‘ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి వేతనం ఉండదు. పైగా ఆ వ్యక్తి రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి కోరికమేరకు జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళం ఇస్తుంది. రెండో ఏడాది నుంచి మాత్రం రూ.50 లక్షలకు తగ్గకుండా ఆ ఉద్యోగికి వేతనం చెల్లిస్తాం’ అని దీపిందర్ తెలిపారు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!రెజ్యూమె అవసరం లేదు‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు రెజ్యూమె పంపాల్సిన అవసరంలేదు. 200 పదాలకు తగ్గకుండా తమ వివరాలు తెలియజేస్తూ కవర్ లెటర్ పంపించాలి. దీన్ని d@zomato.comకు పంపించాలి’ అని చెప్పారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రూ.20 లక్షలు ఫీజు పెట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌ను దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత
న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. VIDEO | Veteran CPI(M) leader Sitaram Yechury’s mortal remains brought to AIIMS, Delhi. The CPI(M) general secretary died on Thursday, August 12, in Delhi after battling a lung infection. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7eTYgwssEG— Press Trust of India (@PTI_News) September 14, 2024క్లిక్ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు -
వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్
-
వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట రూరల్: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తరఫున ఒక నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే పార్టీ తరఫున సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత విపత్తులోనూ వారికి అండగా ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలని హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలం విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విషయం మరోమారు తేటతెల్లమైందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో వరద ప్రభావంపై కేంద్రానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ లేఖ రాయడాన్ని ఆయన ఉదాహరించారు. ప్రభుత్వ ఖాతాలో ఉన్న రూ.1,345.15 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగంలో రేవంత్ సర్కారు మౌనంగా ఉందన్నారు. విపత్తు నిర్వహణ నిధులున్నా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాదికి సంబంధించి రూ.208 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జూన్ నెలలోనే జమ అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపమని ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయుల తొలగింపు దుర్మార్గం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌టైమ్ లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం తొలగించడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి మీరిచ్చే కానుక ఇదేనా సీఎం గారూ? అంటూ ప్రశ్నించారు. మూడు నెలలుగా పెండింగులో ఉన్న జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించడమే ప్రజాపాలనా అని నిలదీశారు. ఖమ్మంకు ఆరు లారీల్లో నిత్యావసర సరుకులు వరద బాధితులకోసం గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మంకు ఆరు లారీల్లో నిత్యావసర సరుకులు పంపిస్తామని హరీశ్‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ, వరదల కారణంగా మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్‌లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను హరీశ్‌రావు పరిశీలించారు. రైతులు నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 30 వేలు నష్టపరిహారం అందించాలన్నారు. భక్తరామదాసు, పాలమూరు పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వం వాటి వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతు దేవయ్యకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా, సిద్దిపేటలో పలువురు స్థానికులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు విరాళాలు ప్రకటించారు. -
నెల జీతం విరాళంగా ఇస్తాం: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. -
వరద బాధితులకు రూ.కోటి సాయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.కూటమి ప్రభుత్వ «ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని.. అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ తరఫున ఉడతా భక్తిగా కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ విజయవాడలో వరద బాధితులకు వైఎస్సార్సీపీ తరఫున రూ.కోటి సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. మంగళవారం విజయవాడ బ్రాహ్మణవీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ నేతలు వెలంపల్లి, సామినేని ఉదయభానులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ భారీ విరాళం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని నిన్న స్వయంగా వైఎస్ జగన్ సమీక్షించిన సంగతి తెలిసిందే. బాధితులతో మాట్లాడిన ఆయన.. వాళ్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన విరాళ ప్రకటన చేశారు. ‘‘వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు’’ అని సమావేశంలో పలువురు నాయకులు జగన్‌కు తెలిపారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవన్నారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. ఫలితంగా.. వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా.. వారికి మందులు కూడా లభించడం లేదన్నారు. జగన్ స్పందిస్తూ.. తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తాయని.. అయినా నింద వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని నేతలతో ఆయన అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని.. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ చెప్పారు. ఈ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు
‘ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా.. మన మాతృభూమిని మరవకూడదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. జన్మభూమికి సేవ చేసేందుకు ముందుకు రావాలి. ముఖ్యంగా విద్యా రంగంలో చేసే సేవ.. భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళమిచ్చాను. అదే విధంగా పాఠశాల స్థాయిలోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను’ అని అంటున్నారు.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త డాక్టర్ కృష్ణ చివుకుల. ఇంత భారీ విరాళంతో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..ఎంతో కొంత తిరిగివ్వాలి.. మనం పుట్టి పెరిగి, మన అభివృద్ధికి పునాది వేసిన మాతృభూమికి.. ఎంతో కొంత తిరిగివ్వాలి అనేది నా ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తు తరాలు ఎదిగే అవకాశం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో నేను ఐఐటీ మద్రాస్‌కు విరాళమిచ్చాను. 74 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాను.మా సంస్థ నంబర్‌వన్ పరిశ్రమగా ముందుకెళుతోంది. ఆదాయం విషయంలో ఆందోళన లేదు. అందుకే.. నేను చదివిన ఐఐటీ మద్రాస్‌కు, అక్కడి విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడేలా విరాళమిచ్చాను.విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే దేశాభివృద్ధికి తోడ్పడినట్టే.. విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే.. భవిష్యత్తులో అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందనేది నా నమ్మకం. ఎందరో విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులతో.. ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఇలాంటి వారికి తోడ్పడితే ఉన్నత విద్యావంతులుగా రూపొందుతారు. తద్వారా నిపుణులైన మానవ వనరుల కొరత కూడా తీరుతుంది. ఇది సంస్థల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఇతర పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని ఆశిస్తున్నాను.స్వదేశంలో చదువులకే ప్రాధాన్యమివ్వాలి.. ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు.. విదేశీ విద్య కోసం యూఎస్, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి స్వదేశంలో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలనేది నా అభిప్రాయం. 1.3 బిలియన్ జనాభా ఉన్న మన దేశంలో 10 లేదా 11 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్లినా.. ఆందోళన చెందక్కర్లేదు. అయితే వారు తమ చదువు పూర్తయ్యాక మన దేశానికి తిరిగొచ్చి సేవలు అందించాలి. మేం చదువుకునే రోజుల్లో ఇన్ని మంచి విద్యా సంస్థలు లేవు కాబట్టే నేను అమెరికా వెళ్లాను. పెట్టుబడిదారులు ముందుకు రావాలి.. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకెళుతోంది. అమెరికా ఆర్థిక పురోగతి మందగమనంలో ఉంటే.. మన ఆర్థిక పురోగతి దినదిన ప్రవర్థమానమవుతోంది. ఇదే చక్కని సమయంగా భావించి పెట్టుబడిదారులు ముందుకు రావాలి. మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి, ఉద్యోగ కల్పన, దేశ అభివృద్ధికి సహకరించాలి.ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి.. యువతలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్నారు. ఇందుకోసం పరిశోధనలపై దృష్టి పెడుతున్నారు. అయితే.. వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే వ్యాపార ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి. కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా.. సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఆలోచనలు చేయాలి.ఆత్మవిశ్వాసంతో కదలాలి.. యువత ముఖ్యంగా.. జెన్–జెడ్ వారు ఏ పని తలపెట్టినా, ఎందులో అడుగుపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. తమపై తాము నమ్మకంతో వ్యవహరించాలి. చేయగలమా? లేదా? అనే మీమాంసతో ఉంటే అడుగులు ముందుకు పడవు. ఇది అంతిమంగా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో అడుగులు వేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.కష్టపడటమే.. విజయానికి సూత్రం.. నేటి తరం విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుతాయని గుర్తించాలి. చదువుకునే సమయంలోనే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు పొందేలా కృషి చేయాలి. సర్టిఫికెట్ల కోసం కాకుండా.. శ్రేష్టత కోసం చదవడం ముఖ్యమని గుర్తించాలి.కృష్ణ చివుకుల గురించి..ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. విద్యాభ్యాసం విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఐఐటీ బాంబే నుంచి బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్), ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. తుమకూరు యూని వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. 1976లో అమెరికాలోని హాఫ్మన్ ఇండస్ట్రీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1990లో న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. 1997లో.. ఇండో– యూఎస్ ఎంఐఎం టెక్నాలజీ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. దీన్ని మెటల్ ఇంజక్షన్ మోడలింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు.దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు..ఇప్పుడు మన విద్యా రంగం ఉన్నతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఐటీలు, ఎన్ఐటీలతోపాటు మరెన్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.వీటిని మరింత అభివృద్ధి చేస్తే.. మరింత నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి.మంచి వేతనాలు అందించాలివిదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న విషయం.. వారికి భవిష్యత్తులో లభించే వేతనాలు. మన దేశంలో చదువుకున్నవారికి కూడా మంచి వేతనాలు అందించేలా పారిశ్రామికవేత్తలు, సంస్థలు అడుగులు వేయాలి. నైపుణ్యాలకు అనుగుణంగా ఆకర్షణీయ వేతనాలివ్వాలి. ప్రతిభావంతులను నియమించుకుంటే సంస్థలను వృద్ధి బాటలో నడిపించొచ్చు. ఇది కార్యరూపం దాల్చితే యువత దేశంలోనే చదువుకునేందుకు ముందుకొస్తారు. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్‌డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్ వరద బాధితులకు రెండు కోట్ల రూపాయలు భారీ విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదల వల్ల భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. సర్వస్వం కోల్పోయిన వారికి చేయూతనిచ్చేందుకు పలువురు నటీనటులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇలాంటి కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలి. వారికి మనమంతా అండగా ఉండాలి’’ అని ప్రభాస్ కోరారు. -
బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల.. ఐఐటీ మద్రాసుకు 220 కోట్ల భారీ విరాళ ప్రకటన!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్'ను నెలకొల్పారు.మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.దాతృత్వంలో మేటి..కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డు అందజేశాయి.బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. -
Us Elections: ట్రంప్‌కు మస్క్ భారీ విరాళం!
న్యూయార్క్: పాపులర్ బిలియనీర్, టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విరాళమిచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేస్తున్న అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఎ ప్యాక్)కు మస్క్ డొనేట్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ ఒక కథనం ప్రచురించింది.అయితే సరిగ్గా ఎంత మొత్తం మస్క్ విరాళంగా ఇచ్చారనేది తెలియరాలేదు. ఎ ప్యాక్ తమ గ్రూపునకు విరాళమిచ్చిన వారి జాబితాను జులై 15న అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఎన్నికల్లో తాను బైడెన్, ట్రంప్‌లలో ఎవరి తరపున ఖర్చు పెట్టబోనని మస్క్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మస్క్ ట్రంప్‌నకు విరాళమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోసం ధనవంతుల నుంచి ప్రచార నిధుల సేకరణలో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మస్క్ కూడా ట్రంప్‌నకు విరాళమివ్వడం గమనార్హం.ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌లలో మస్క్ ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. -
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్‌లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు. -
సంపదనంతా దానం ఇచ్చేస్తున్న వారెన్ బఫెట్!
బెర్క్‌షైర్ హతావే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ రూ.44,200 కోట్లు దానం చేస్తున్నారు. ప్రపంచంలో 10వ అత్యంత సంపన్నుడైన బఫెట్ 5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం.సంపాదనకు, సంపదకు మారుపేరైన వారెన్ బఫెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించిన విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు (సుమారు 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు.తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్ విరాళంగా ఇచ్చారు.ఉన్నదంతా ఇచ్చేసే ఆలోచనబెర్క్ షైర్లో1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని 93 ఏళ్ల బఫెట్ యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీలునామాను ఆయనతదనంతరం ఆయన పిల్లలు అమలు చేయనున్నారు. బెర్క్‌షైర్ సుమారు 880 బిలియన్ డాలర్ల సమ్మేళనం. ఇది బీఎన్ఎస్ఎఫ్ రైల్రోడ్, గీకో కార్ ఇన్సూరెన్స్, యాపిల్ వంటి స్టాక్స్‌తో సహా డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది. -
రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..
చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్ గురించి సవివరంగా తెలుసుకుందాం.ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్ గ్రూప్ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్ ల్యాండ్‌స్టైనర్ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారుమందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్..భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్ యూనిట్ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. రక్తహీనత: ఐరన్ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరంబ్లడ్ డిజార్డర్స్: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!) -
మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
గతంలో చనిపోయిన మనిషి శరీరం వ్యర్థం ఎందుకూ పనికిరాదు అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుతం అలా కాదు. చనిపోయిన (నిబంధనల ప్రకారం) వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణ దానం చేయవచ్చు. లేదంటే మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు నిమిత్తం దానం చేయవచ్చు. తాజాగా ఒక సంస్థ మానవుల మలాన్ని దానం చేయాలని కోరుతోంది. ఇందుకు వారికి కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది షాకింగ్‌గా అనిపించినా, మీరు చదివింది నిజమే. ఎందుకో తెలుసుకోవాలటే ఈ కథనాన్ని చదవాల్సిందే.అమెరికా, కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే సంస్థ వైద్య పరిశోధనలు, ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయిత ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది.మానవ మలాన్ని కంపెనీ ఏమి చేస్తుంది?ఆరోగ్యకరమైన, కలుషితంకానీ, వ్యాధి-నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారినుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాదిరకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారి తీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.There's a man currently paying $500 per 💩 sample on a hunt to try and find the "0.1% of people with healthy, unperturbed, disease-resistant microbiomes". He's screened over 1 million people and still hasn't found what he's looking for. https://t.co/xyEyL1NXcp https://t.co/9Rt2hZdYzI pic.twitter.com/m0ZXQB7kcR— Katherine Champagne (@keccers) March 18, 2024 ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తోంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్ల ఒక్కో శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తారు. రోజూ మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు 180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) చెల్లించనుంది. అయితే దాదాపు 10లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1 శాతం కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది, తద్వారా వారు ఈ "అధిక నాణ్యత గల మలం దాతలను" పరిశోధకులతో కనెక్ట్ చేస్తుంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ ,వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్ ప్రకారం, సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే, సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయనీ, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తర తరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయోమ్ పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1 శాతం మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు, వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్లో ఉన్న ఒక వీడియోలో “స్టూల్ డోనార్” కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరినైనా కాపాడవచ్చని వివరించింది. అలాగే సెలక్ట్ అయిన డోనార్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. -
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో క్యూఆర్ కోడ్‌ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్‌ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్‌గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్‌కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
మరోసారి ఇన్ఫోసిస్ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం
బెంగళూరు: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీసీఐటీఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. -
శిరోజాలు దానం చేయండి
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె. సామాజిక సేవ ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది. 9 మంది సాయం ఒకరికి మేలు ‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్. హెయిర్ డొనేషన్ ఒడిశా ‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్. -
రీల్ కాదు.. ‘కాల్’ నాయక్!
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్’ అనే సినిమాలో.. నాయక్ భాయ్‌గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్ సీన్‌తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్ సీన్ ఒకటి గతంలో హైదరా బాద్ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు. నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నుంచి అందిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. టార్గెట్లు నిర్దేశించి మరీ.. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్రావు, పి.రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్‌రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశా రు. వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్ టీమ్‌కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్‌కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్ ఆడియోలను వినిపించే వారు. అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్ టీమ్ ఇన్చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం. తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ప్రణీత్‌రావు టీమ్ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్ చెప్తోంది. ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.రాధాకిషన్‌రావు నిర్వర్తించారు. తన టీమ్ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్‌రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్ రికార్డులను కూడా ప్రభాకర్‌రావుకే అందించేవారని తెలిసింది. ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీమ్ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. పరిచయస్తులకు ప్రభాకర్‌రావు ఫోన్లు! ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్ జరిగిన సమయంలో తాను రెగ్యులర్ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుత్రరత్నం లీలలు.. ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్‌తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి, తన కుమారుడు ఫోన్ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసే సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్‌హౌస్ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారం. -
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్‌కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్‌ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్‌గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్‌ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
స్టార్ హీరో కోటి రూపాయల విరాళం.. ఎందుకంటే?
గతేడాది లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో దళపతి విజయ్. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీ స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సడన్ షాకిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా హీరో విజయ్ కోటి రూపాయల విరాళం అందించి తన ఉదారతన చాటుకున్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన కోటి రూపాయల చెక్‌ను అందించారు. కాగా.. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవనం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. @actorvijay Thank u means just two words but means a lot to a person wen he does it from his heart. Well, am talking about my favourite actor our very own #ThalapathiVijay brother for DONATING ONE CRORE towards our #SIAA #NadigarSangam building work. God bless u. Yes we always… pic.twitter.com/EzJtoJaahu — Vishal (@VishalKOfficial) March 12, 2024 -
బీజేపీకి పార్టీ ఫండ్‌గా ప్రధాని మోదీ రూ.2వేల విరాళం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. ‘నమో’ యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని ప్రధాని మోదీబీజేకి పార్టీ ఫండ్‌గా అందజేశారు. ఈ సందర్భంగా ‘నమో’ యాప్ ద్వారా ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పేమెంట్‌కు సంబంధించిన స్లిప్‌ను షేర్ చేశారు. ‘బీజేపీకి దోహదపడటం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయటం సంతోషంగా ఉంది. ‘నమో’ యాప్ ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్ ’లో పోస్ట్ చేశారు. I am happy to contribute to @BJP4India and strengthen our efforts to build a Viksit Bharat. I also urge everyone to be a part of #DonationForNationBuilding through the NaMoApp! https://t.co/hIoP3guBcL pic.twitter.com/Yz36LOutLU — Narendra Modi (@narendramodi) March 3, 2024 డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్.. ప్రచార కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన కూడా రూ. 1000 విరాళాన్ని పార్టీకి అందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణం కోసం నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. నమో యాప్ ద్వారా అందరూ ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో పాల్గొనండి’ అని జేపీ నడ్డా ‘ఎక్స్’ ద్వారా పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2022-2023 ఏడాదిలో బీజేపీ రూ. 719 కోట్లు సేకరించినట్లు తెలిపింది. అదేవిధంగా 2021-2022తో పోల్చితే 17 శాతం అధికం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2022 -2023 ఏడాదికి రూ. 79 కోట్లు, 2021-2022 ఏడాదికి రూ. 95.4 కోట్లు పార్టీ ఫండ్ సేకరించినట్లు పేర్కొంది. -
కాలేజీకి భారీ విరాళం.. ట్యూషన్ ఫీజు మాఫీ!
ఆ మెడికల్ కాలేజీకి ఊహించని రీతిలో ఒక బిలియన్ డాలర్లు(రూ. 10 కోట్లు) విరాళంగా అందాయి. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మాఫీ చేసి, వారికి ఫీజు భారాన్ని తగ్గించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ఉదంతం చోటుచేసుంది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో, ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరి వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి, మోంటెఫియోర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్‌స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్ బోర్డ్ మెంబర్ రూత్ ఎల్ గాట్స్మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. We are profoundly grateful that Dr. Ruth Gottesman, Professor Emerita of Pediatrics at @EinsteinMed, has made a transformational gift to #MontefioreEinstein—the largest to any medical school in the country—that ensures no student has to pay tuition again. https://t.co/XOy9HZLbfD pic.twitter.com/1ijv02jHFk — Montefiore Health System (@MontefioreNYC) February 26, 2024 -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పార్టీకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ
దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తామని ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా 37,400డాలర్లను సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ-టీనేజ్లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్‌రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్‌గా నిలిచింది. 2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
వజ్రాల వ్యాపారి రాముడికి సమర్పించిన విరాళమెంత?
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక శ్రీరాముని జన్మభూమిలో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించిన చారిత్రాత్మక ఘట్టాన్న ప్రపంచవ్యాప్తంగా అనేకమంది భక్తులు చూసి తరించారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం భక్తులు విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా ప్రజల నుంచి 2,500 కోట్లు వచ్చాయి. రూ. 68 కోట్ల విలువ చేసే బంగారం ఈ క్రమంలో సూరత్‌కుచెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ ఇచ్చిన విరాళం విశేషంగా నిలుస్తోంది. ఇదే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన అతిపెద్ద విరాళంగా భావిస్తున్నారు. రూ. 68 కోట్లు విలువ చేసే 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, బలరాముడి ఆలయంలోని డ్రమ్, త్రిశూల్ వంటి నిర్మాణాలలో ఉపయోగించారట. ఎవరీ దిలీప్ కుమార్ లఖి దిలీప్ కుమార్ లఖి తండ్రి కూడా వజ్రాల వ్యాపారి . 1947లో విభజనకు రెండు సంవత్సరాల ముందు 1944లో జైపూర్ వచ్చారు. చిన్నప్పటి నుండే దిలీప్ కుమార్, కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూ డైమండ్ వ్యాపారంలో రాణించారు. ప్రస్తుతం సూరత్‌లో ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీకి యజమాని. 6వేలకు పైగ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు. థాయిలాండ్, అమెరికా, దుబాయ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 33 కిలోల బంగారం, 2.51 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే దేశంలోని బిలియనీర్లు ఎంత ఇచ్చారో స్పష్టంగా తెలియనప్పటికీ వారితో పోలిస్తే దిలీప్ చాలా బెటర్ అంటున్నారు నెటిజన్లు. అయోధ్యకు ఆర్థిక ఊతం మరోవైపు వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,అయోధ్య రామమందిరం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారబోతోంది. అయోధ్య ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. -
ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా?
జనవరి 26 గణ తంత్ర దినోత్సవాల్లో తమిళనాడు సీఎం ప్రత్యేక అవార్డును ఒక పేద మహిళ గెల్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె పేరు ఆయి అమ్మాళ్‌ను అలియాస్ పూరణం. ఆమె మదురై జిల్లా పూడూర్నివాసి. నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషి చేసిన తన దివంగత కుమార్తె జ్ఞాపకార్థం ఆమె తన 7 కోట్ల రూపాయల విలువైన భూమిని తమిళనాడు ప్రభుత్వానికి అందించడం విశేషంగా నిలిచింది.. సంబంధధి పత్రాలను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె కార్తిగాకు అందజేశారు. అమ్మాళ్ చేసిన దాతృత్వానికి స్పందించిన తమిళనాడు సీఎం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. అమ్మాళ్ కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తోంది. కోడికులంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌కు హైస్కూల్‌గా అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ. 7 కోట్ల విలువైన స్థలాన్ని జనవరి 5న విరాళంగా ఇచ్చింది. రెండేళ్ల క్రితం మరణించిన తన కుమార్తె జనని పేరును పాఠశాలకు పెట్టాలన్నది ఆమె కోరిక. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన పూర్ణం, జనని చిన్నపిల్లగానే ఉన్నపుడే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయిన తరువాత కారుణ్య ప్రాతిపదికన తన భర్త ఉద్యోగాన్ని పొందింది. కష్టపడి బిడ్డను బి.కామ్ దాకా చదివించుకుంది. కానీ అనూహ్యంగా జనని కూడా చనిపోయింది. దీంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని నిరుపేద పిల్లలు చదువుకోవాలంటూ విరాళంగా ఇచ్చేసింది. అలా తన బిడ్డను కల నెరవేర్చాలని భావించింది. Madurai Woman donates Landto School | சிறப்பு விருது | Madurai Pooranam Amma | CM MK Stalin #maduraiwomandonateslandtoschool #womandonateslandworth7crores #maduraigovernmentschool #maduraipooranamamma #kodikulamschool pic.twitter.com/TWqz1dBMAv — OH Tamil (@ohtamil) January 27, 2024 முதல் நாள் சுமார் ஏழு கோடி மதிப்புள்ள நிலத்தை கல்வித்துறைக்கு கொடையாக அளித்துவிட்டு மறுநாள் வங்கியில் கிளார்க் வேலையை சத்தமில்லாமல் செய்துக் கொண்டிருக்கும் ஆயி பூரணம் அம்மாளின் கரங்களைப் பற்றி வணங்கினேன். pic.twitter.com/5tat2Z7dC9 — Su Venkatesan MP (@SuVe4Madurai) January 11, 2024 -
Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది. పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు. ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్సైట్ పేర్కొంది. -
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్‌కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి తమవంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా అందించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. గత నవంబర్‌లో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన సాగించే బైద్యనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నాని చెప్పాడు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగున్నదని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించి అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. ఇది కూడా చదవండి: రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి! -
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
ఆ ఆదాయం మొత్తం ఇచ్చేస్తా: ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్-హమాస్ వార్ నేపథ్యంలో టెస్లా అధినేత ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. X Corp will be donating all revenue from advertising & subscriptions associated with the war in Gaza to hospitals in Israel and the Red Cross/Crescent in Gaza — Elon Musk (@elonmusk) November 21, 2023 ఈ మేరకు మస్క్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గాజాను పాలించే హమాస్ మధ్య భీకర పోరుకు నాలుగు రోజుల తాత్కాలిక విరామం ప్రకటన తరువాత మస్క్ సాయం ప్రకటన వచ్చింది. గత నెలలో, ఎలాన్ మస్క్ గాజాలోని గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు కనెక్టివిటీని అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్దానికి నిన్నటికి(నవంబరు 21) 46 రోజులు గడిచింది. ఈ దాడుల్లో 13వేలమందికి పైగా మరణించారు. OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation. The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG — Israel Defense Forces (@IDF) November 19, 2023 చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక -
మలాలా యూసఫ్‌జాయ్ రూ.2.5 కోట్ల విరాళం
లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు. -
అవయవదానంతో అమరుడయ్యాడు
గుంటూరు: తాను మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కట్టా కృష్ణ అనే యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అయిన కృష్ణ అవయవదానంతో అమరుడు అయ్యాడు. పుట్టెడుదుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక కృష్ణ ఈనెల 25న బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ముగ్గురి సంతానంలో ప్రథముడైన కృష్ణ మరణాన్ని తల్లిదండ్రులు రాజు, మల్లేశ్వరి జీర్ణించుకోలేక పోయారు. అనంతరం తమ బిడ్డ దూరమైనా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి తమ కుమారుడి అవయ వదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కృష్ణ గుండెను తిరుపతికి, కాలేయాన్ని విశాఖపట్నంకు, రెండు కిడ్నీల్లో ఒకటి విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి, రెండోది గుంటూరు రమేశ్ ఆస్పత్రికి, రెండు కళ్లు (ఇద్దరికి అమర్చేందుకు) గుంటూరులోని సుదర్శిని ఆస్పత్రికి తరలించారు. విజయవంతంగా గుండె మార్పిడి తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం సుమారు 5.10 గంటలపాటు కష్టపడి గుండెమార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన కృష్ణ గుండెను కర్నూలుకు చెందిన శ్రీనివాసన్ (33)కు అమర్చారు. శ్రీనివాసన్ గుండె సంబంధిత సమస్యతో మూడు నెలల క్రితం శ్రీపద్మావతి ఆస్పత్రికి వచ్చాడు. అతనికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి మార్పిడి అనివార్యమని తేల్చారు. అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేయించారు. ఈ క్రమంలో కృష్ణ అవయవదానంతో శ్రీనివాసన్‌కు చికిత్స చేశారు. విశాఖలో గ్రీన్‌చానెల్.. కృష్ణ కాలేయాన్ని తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ విమానాశ్రయంకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తరలించారు. విమానాశ్రయం నుంచి 6 నిమిషాల్లోనే ఆస్పత్రికి కాలేయాన్ని చేర్చారు. సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరేందుకు ట్రాఫిక్ పోలీసులు విశేష కృషి చేశారు. సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. ఓ ప్రాణం నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతలా ఆతృత పడతారో మరోసారి నిరూపించారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంవోతో చర్చలు జరిపిన నేపథ్యంలో గుండె మార్పిడి అవసరాన్ని ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా, వేగంగా తరలించేందుకు ప్రత్యేక చాపర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలానే రూ. 13 లక్షలు ఖరీదైన గుండె మార్పిడి వైద్యానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి నిధులను మంజూరు చేయించారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయంకు గుండెను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా తిరుపతి విమానాశ్రయంకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌చానల్ ద్వారా 23 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవ దానం
వేలూరు: రాణిపేట జిల్లా సిప్‌కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది. ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్‌కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ
RIL Director Anant Ambani దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ భారీ విరాళమిచ్చింది.భారీ వర్షాలు , వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి వాటితో అతలా కుతమైన ఉత్తరాఖండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ప్రతినిది తనయ్ ద్వివేది ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’) ఈ మేరకు అనంత్ అంబానీ ఒక లేఖ రాశారు. తాము అందించిన సాయం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నామని ని అంబానీ సిఎం ధామీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్ ద్వారా తాము పలు విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 10 సంవత్సరాలకు పైగా రాష్ట్రానికి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. మరోవైపు ఆర్ఐఎల్కు, అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) కాగా రిలయన్స్ ఫౌండేషన్ 2021లో కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లను అందించింది. మహమ్మారిపై సమిష్టి పోరాటంలో దేశం పట్ల ఆర్థిక సహాయం చేయడం తన కర్తవ్యమని కంపెనీ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ , కేదార్నాథ్ ఆలయ కమిటీలకు ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఏడాది రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్కూలు అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం
-
విమాన ప్రయాణం.. మధ్యలో లేచి డబ్బులు కావాలంటూ
కొన్ని కార్యక్రమాలకు విరాళాలు సేకరించడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటివి సాధారణంగా రోడ్లపైనో లేదా బస్సుల్లో సేకరిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా ఏకంగా విమానంలో విరాళాలు అడుగడం ప్రారంభించాడు. అయితే అతను నెట్టింట ఫేమ్ కోసం ఇలా చేశాడా లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ప్రజలకు రెండు పూటలా భోజనం తినడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఓ పాకిస్తాన్ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తుండగా.. సడన్‌గా లేచి విరాళాల కోసం ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించడం మొదలు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరో వైపు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అటు ఐఎంఎఫ్‌తో పాటు స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వీడియో వైరల్ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn — Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023 చదవండి ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్! -
50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ నందన్ నీలేకని మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తను చదువుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకి భారీ విరాళానని ప్రకటించారు. తన 50 సంవత్సరాల అనుబంధాన్ని పురస్కరించుకుని రూ. 315 కోట్లను విరాళంగా ఇచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) నందన్ నీలేకని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి ఒక అవగాహన ఒప్పందంపై మంగళవారం అధికారికంగా సంతకాలు చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి ఐఐటీ బాంబేలోని టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. ఐఐటీ బాంబేతో తన జీవితంలో ఒక మూలస్తంభంలాంటిది. ఇవాల్టి తన ప్రయాణానికి పునాది వేసిందని నీలేకని పేర్కొన్నారు. తన విజయానికి బాటలు వేసిన ఇలాంటి గౌరవప్రదమైన సంస్థతో 50 ఏళ్ల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థకు సాయం చేయడం సంతోషంగా ఉందని నీలేకని పేర్కొన్నిరు. ఇది కేవలం డబ్బు సాయం మాత్రం కాదు.. తన జీవితానికి చాలా అందించిన గొప్ప ప్రదేశం పట్ల తనకున్న గౌరవం, అలాగే రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల ఇది తన నిబద్ధత అన్నారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) ఐఐటీ బాంబేతో అనుబంధం నీలేకని 1973లో ఐఐటీ బాంబేలోఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. గతంలో కూడా ఇదే ఇన్స్టిట్యూట్కి 85 కోట్లు అందించారు. దీంతో మొత్తం సహకారం రూ. 400 కోట్లకు చేరుకుంది. 1999 - 2009 వరకు ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో పనిచేశారు. 2005-2011 వరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఉన్నారు. 1999లో ప్రతిష్టాత్మకమైన విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును, 2019లో ఐఐటీ బాంబే 57వ కాన్వకేషన్‌లో భాగంగా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు నందన్ నీలేకని. (మరిన్ని బిజినెస్వార్తలు, ఆసక్తికర కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్) To mark 50 years of my association with @iitbombay, I am donating ₹315 crores to my alma mater. I am grateful to be able to do this🙏 Full release: https://t.co/q6rvuMf2jn pic.twitter.com/f8OEfZ1UTq — Nandan Nilekani (@NandanNilekani) June 20, 2023 -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆధ్యాత్మిక కేంద్రంగా కాకినాడ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కారు ఉక్రెయిన్‌కే!!
రిగా(లాత్వియా): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కార్లను లాత్వియా అధికారులు ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. రష్యాతో జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ ప్రయత్నం సాయంగా ఉంటుందని అంటున్నారు. ఈ కార్లను నడిపిన మాజీ యజమానుల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 0.15% పైనే ఉందట. ఇప్పటికే ఇలా పట్టుబడిన 8 కార్లు ఉక్రెయిన్‌కు పంపామని లాత్వియా దేశ రెవెన్యూ విభాగం తెలిపింది. కొనుగోలు చేసిన, విరాళంగా అందిన కార్లను దెబ్బతిన్న, యుద్ధం జరిగే ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వినియోగిస్తామని ఉక్రెయిన్‌కు చెందిన అగెండమ్ గ్రూప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి ఇలాంటి 1,200 కార్లను అందజేసినట్లు వెల్లడించింది. లాట్వియా రోడ్లపై మద్యం తాగి కార్లలో తిరిగే వారు ‘పేలని కమికాజ్ డ్రోన్లు’వంటి వారని చమత్కరించింది. ‘సాధారణంగా స్వాధీనం చేసుకున్న కార్లను అమ్మేయడమో, విడగొట్టి అమ్మేయడమో చేస్తుంటాం. అయితే, ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనే వీటిని అక్కడికి పంపిస్తున్నాం’అని లాత్వియా అంటోంది. పట్టుబడిన కార్లను వారానికి 25 చొప్పున అగెండమ్కు అందజేస్తామని లాత్వియా అధికారులు హామీ ఇచ్చారు. -
టీటీడీకి కోటి విరాళం
తిరుమల: టీటీడీకి ఆదివారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. వివరాల ప్రకారం.. తన భర్త వడ్లమూడి రమేష్ బాబు జ్ఞాపకార్థం టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీని దాతల కార్యాలయంలో ఆదివారం ఆమె అందజేశారు. -
చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!
కష్టాల్లో ఉంటే అయినవారే పట్టించుకోని రోజులివి.. నోరు తెరిచి సాయం కావాలని అడిగిన చూసి చూడనట్లు వదిలేసే కాలం ఇది. అలాంటిది ముక్కు ముఖం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా ఆదుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. ఎస్ఎంఏ అనే వ్యాధి సోకిన 15 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.అమెరికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నా ఆయన కోట్లు దానం చేసి కనీసం తన పేరు, వివరాలు చెప్పకుండా బాలుడికి కొత్త జన్మను అందించాడు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ కుమారుడు నిర్వాణ్(15 నెలలు). నిర్వాణ్ స్పైనల్ మస్క్లర్ అట్రోఫీ(వెన్నుముక కండరాల క్షీణత) అనే అరుదైన వ్యాధితో బాధపడతున్నాడు. ఎస్ఎంఏ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్ టైమ్ డ్రగ్ అయిన జోల్జెన్మ్సా ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని మెడికల్ ప్రిస్క్రిప్షన్, పిల్లల తల్లిదండ్రుల లేఖతో అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అంతేగాక ఎస్ఎమ్కే కేసులు, దీని డ్రగ్ డెవలప్మెంట్ పరిశోధనలు తక్కువగా ఉండటం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఇది ఒకటి. దీంతో గత నెల జనవరిలో బాలుడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం క్రౌడ్‌ఫండ్ అకౌంట్ తెరిచారు. ఫిబ్రవరి 19 వరకు వారికి రూ.5.42 కోట్లు విరాళంగా అందాయి. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ఖాతాలోకి ఎవరో వ్యక్తి తన పేరు చెప్పకుండా భారీ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 1.4 మిలియన్ డాలర్లు తమకు అందినట్లు బాధిత కుటుంబం ఫేస్బుక్లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 11.50 కోట్లు. ఇంత మొత్తం విరాళంగా ఇచ్చి బాలుడికి కొత్త జీవితాన్ని అందించాడు. అయితే ఈ డబ్బులు ఎవరూ విరాళంగా ఇచ్చారో తమకు తెలియదని కుటుంబ నిర్వాణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అతనెవరో, తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలిపారు. తమ జీవితంలో ఇదొక అద్భుతమని వర్ణించారు. ఇప్పటి వరకు అజ్ఞాత దాతతో సహా 72,000 మంది వ్యక్తులు నిర్వాణ్‌కు విరాళాలు అందించారు. దీంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. చదవండి: కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది! -
సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం
అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మహాశివరాత్రి పర్వదినాన గుజరాత్‌లోని సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఆలయంలో తనయుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్‌తో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు 1.51 కోట్ల విరాళం ఇచ్చారాయన. ఇక ఆలయంలో ఈ తండ్రీకొడుకుల ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరేబియా సముద్ర తీరంలో కొలువైన సోమనాథ్ ఆలయానికి.. 12 జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా పేరుంది. મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણી સાથે આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરે મહાદેવને શિશ ઝૂકાવી દર્શન કર્યા હતા.#MukeshAmbani #Ambani #AkashAmbani #SomnathMandir #Somnath pic.twitter.com/oAAFmNUFYf — Gujarat Samachar (@gujratsamachar) February 18, 2023 ఇదిలా ఉంటే కిందటి ఏడాది సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ముకేశ్ అంబానీ.. కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి విదితమే. -
నాడు - నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
-
గురువాణి: సంస్కార వైభవం
రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు. రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు. వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు. బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు. కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా తానా కార్యవర్గము.. అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తానా నాయకత్వం22222222222 సహాయం చేసింది. తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదే పురుషోత్తం చౌదరి తన మిత్రులతో కలిసి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన 10 లక్షల రూపాయలు సమకూర్చారు. వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా తానా కార్యవర్గం స్థానిక శాసనసభ్యులు పయ్యావుల కేశవ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, రైతు కోసం కో చైర్ రఘు ఎద్దులపల్లి, వెంకట్ మాలపాటి, పీ.వీ.కే.కే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, గ్రామ సర్పంచ్ రామ్మోహన్ అండ్ర, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు డెసెంబర్ 2, 2022 నుంచి జనవరి 7, 2023 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. తదనంతరం తానా కార్యవర్గము కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞాన భారతి విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన తానా చేయూత కార్యక్రమంలో భాగంగా 35 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. అంతేకాకుండా దాదాపు 1000 మందికి పైగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ తానా చేయూత కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి తన తండ్రి గుదె వెంకటరామప్ప గారి జ్ఞాపకార్థం మూడు లక్షల, 50 వేల రూపాయలను 30 మంది విద్యార్థులకు సహాయంగా అందించారు. ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థులు, ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, జ్ఞాన భారతి విద్యాసంస్థల యాజమాన్యం రమేష్ బాబు మోదుపల్లికి తానా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తరిమెళ్ళ రాజు నేతృత్వంలో కళాకారుల బృందం సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన భారతి విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వీక్షకులకు కార్యక్రమానికి వన్నెలు దిద్దారు. -
ప్రభుత్వ ఆసుపత్రులకు రెయిన్బో సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.1.2 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను రెయిన్బో ఆసుపత్రి విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను అమర్చేందుకు సహకారం అందించిన రెయిన్‌బోను అభినందించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ..మొత్తం ఇన్ఫెక్షన్లలో మూడోవంతు పోస్ట్–ఆపరేటి వ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు అధ్యయనాలు రుజువు చేశాయని తెలిపారు. ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా ఫంగస్ 13 రెట్లు తగ్గించొచ్చన్నారు. పరికరాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి అందజేసిన అనంతరం.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ విరాళం అందించామన్నారు. -
టాంపా బే నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి స్పందన
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా టంపాబే నాట్స్ విభాగం చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌లో నాట్స్ సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్ పిలుపుకు స్పందించి దాదాపు 20 కుటుంబాలు ఈ ఫుడ్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తాజా పండ్లు, కూరగాయలు, వెన్న, పాలు, పాల ఉత్పత్తులు సేకరించారు. చిన్నారులు, మహిళలు అందరూ కలిసి ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని ఆహార ఉత్పత్తులను విరాళంగా అందించారు. 2500 పౌండ్ల ఆహారం ఈ కార్యక్రమంలో మొత్తం 2500 పౌండ్ల ఆహారాన్ని సేకరించి టంపాలోని పేద పిల్లల ఆకలి తీర్చే హోప్ చిల్డ్రన్స్ హోమ్‌కు విరాళంగా అందించారు. దాదాపు 70 మంది పిల్లలకు ఆహారం సరిపోతుందని హోప్ చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు తెలిపారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శేఖర్ కోన, శివ చెన్నుపాటి, రాహుల్ చంద్ర గోనె, భాస్కర్ సోమంచి, అనిల్ అరెమండ, విజయ్ దలై, రమేష్ కొల్లి, ప్రసన్న కోట, రవి చౌదరి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరంతో పాటు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండకు నాట్స్ టంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, సలహా కమిటీ సభ్యులు సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ టీం సభ్యులు నవీన్ మేడికొండ, హరి మండవ, భావన దొప్పలపూడి, భార్గవ్ మాధవరెడ్డి, శ్రీనివాస్ బైరెడ్డి, శిరీష దొడ్డపనేని ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడానికి కృషి చేశారు. పేద పిల్లల కోసం చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ ఉమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు. -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్!
వ్యాపారస్తులు ఉన్నత శిఖరాలకు చేరి బిలియనీర్లుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక్కడి వరకు వారి పయనం ధనార్జన, పేరు ప్రఖ్యాతలంటూ ఒకేలా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర సంపాదన మాత్రమే జీవితం కాదని కొందరు తెలుసుకుంటున్నారు. అందుకే చాలా మంది ధనవంతులు ఛారిటీలకు, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వారి సంపదను ఖర్చు పెడుతుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందేసి తమ ఆస్తిలో సగం భాగం లేదా మొత్తం కూడా ఇచ్చేస్తుంటారు. తాజాగా ఒక సంపన్నుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! యూఎస్ లోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైన్ హాబీ లాబీ (Hobby Lobby) వ్యవస్థాపకుడు డేవిడ్ గ్రీన్ తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదను శాపంగా పేర్కొన్నారు. అందుకే తన కంపెనీని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు. తన కంపెనీని విడిచి పెట్టడంపై స్పందిస్తూ తాను కేవలం నిర్వాహకుడినేనని.. తన వ్యాపారానికి దేవుడే నిజమైన యజమానని నిజం తెలుసుకున్నాని, దాని ఫలితమే ఈ నిర్ణయమని చెప్పారు. తన విజయానికి తన విశ్వాసమే "నిజమైన మూలం" అని వివరించాడు. యజమానిగా, కంపెనీని విక్రయించే హక్కుతో సహా కొన్ని హక్కులు, బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. అయితే తన కంపెనీ విస్తరించే కొద్దీ, ఆ ఆలోచన తనని మరింత బాధపెట్టడం ప్రారంభించిందని తెలిపాడు. ఇంకా చెప్పాలంటే సంపద ఓ రకంగా శాపంలాంటిదని అభిప్రాయపడ్డాడు. అయితే గ్రీన్ తన కంపెనీని ఎలా వదులుకుంటున్నాడు అనే వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అయితే గత వారం ఫాక్స్ & ఫ్రెండ్స్ వీకెండ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ ఓటింగ్ స్టాక్‌లో 100% ట్రస్ట్‌కు తరలించబడిందని ఆయన చెప్పారు. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
ఆంజనేయాలయం కోసం భూదానం చేసిన ముస్లిం
షాజహాన్‌పూర్(యూపీ): ఆంజనేయ ఆలయ నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి భూదానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. ఢిల్లీ–లక్నో 24వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కచియానా ఖేరి గ్రామంలో హనుమాన్ ఆలయం అడ్డంకిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికుడు బాబూ అలీ తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు. దీంతో రోడ్డపై ఆలయాన్ని పడగొట్టి అలీకి చెందిన స్థలంలో పునర్నిర్మించనున్నారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది బుధవారం చెప్పారు. ఈ మేరకు భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిందని తిల్హార్ డెప్యూటీ జిల్లా మహిళా మేజిస్ట్రేట్ రాశీ కృష్ణ వెల్లడించారు. హిందూ – ముస్లిం ఐక్యతను అలీ మరోసారి చాటిచెప్పారని రాశీ పొగిడారు. ఇదీ చదవండి: మా లక్ష్మణరేఖ తెలుసు -
ఈరోజుల్లో ఇలాంటి నిజాయితీపరులు ఉన్నారా?
ఓ గుర్తుతెలియని వ్యక్తి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసి తనవంతు సాయంగా రూ.201 సాయం చేశాడు కమల్ సింగ్ అనే యువకుడు. గతేడాది జూలై 7న ఫోన్ పే ద్వారా సాయం అందించాడు. ప్రస్తుతం ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఇతడు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. అయితే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అతని ఫోన్‌పేలోకి రూ.201కి వచ్చాయి. ఈ నంబర్ ఎవరిదా అని చూడగా.. గతంలో ఓ తల్లికి చికిత్స కోసం సాయం చేసిన విషయం గుర్తుకువచ్చింది. ఆమె కుమారుడే ఇప్పుడు డబ్బు తిరిగి పంపాడు. అమ్మ ఎలా ఉందని అడగ్గా.. బాగుందని బదులిచ్చాడు సాయం పొందిన వ్యక్తి. అంతేకాదు తన వ్యాపారం ఇప్పుడు బాగా సాగుతోందని, అందుకే తన తల్లికి వైద్యం కోసం సాయం చేసిన వారందరికీ తిరిగి డబ్బులు పంపిస్తున్నాని చెప్పాడు. అంతా మనీ మైండెడ్ మనుషులున్న ఈరోజుల్లో ఇంకా ఇలాంటి నిజాయితీపరులు ఉన్నారా? అని కమల్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్లో షేర్ చేసి అతడ్ని ప్రశంసించాడు. తల్లి చికిత్సకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని ఇప్పుడు అందరికీ తిరిగి చెల్లిస్తున్న కూమారుడ్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని నిజాయితీ, మంచి మనసును చూసి శభాష్ అంటున్నారు. చదవండి: ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా! -
బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ భారీ విరాళం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా మూడవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి శనివారం సెప్టెంబర్ 17న అందజేశారు. అక్కడి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామన్నారు. ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్నబాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు సునీత తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. స్వయంకృషితో ఎదిగిన సునిత లాంటి కళాకారులు అందరికీ ఆదర్శమని ఆమె మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సత్య, పొదుపులక్ష్మీ ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!
ప్రకృతి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వాడుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కొందరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన వ్యాపారవేత్త యోవోన్ చుయ్‌నార్డ్ తన కంపెనీ ‘పెటగోనియో’ని పర్యావరణ పరిరక్షణకై లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇకపై ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం,అటవీ భూములు సంరక్షణకు పాటుపడే సంస్థలకు అందజేయనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్యాపిల్లలు కూడా మద్దతునిచ్చారు. ఆయన దీనిపై స్పందిస్తూ.. ప్రకృతి అందిస్తున్న వనరులను ఉపయోగించుకుంటూ వాటిని నగదు రూపంలో మార్చుకుంటున్నాం. ఇకపై పెటాగోనియో తన సంపాదనను తిరిగి ప్రకృతికే అందిస్తుందన్నారు. పెటాగోనియో ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. కాగా అవుట్డోర్ ఫ్యాషన్ సంస్థగా పెటగోనియాను 50 ఏళ్ల కిందట ప్రారంభించారు. చదవండి: దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే! -
AP: నాడు–నేడుకు దేవి సీ ఫుడ్స్, అవంతి గ్రూప్ విరాళం
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్రకు, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్ రూ.2 కోట్ల విరాళం అందించాయి. విరాళానికి సంబంధించిన డీడీలను సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి దేవి సీ ఫుడ్స్ ఎండీ పోట్రు బ్రహా్మనందం, అవంతి గ్రూప్ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్ అందజేశారు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? -
దానఫలం.. చూడగలం..
మనుషులకు ఉండవలసిన పది మానవీయ లక్షణాలలో దానగుణం మొదటిది అంటుంది బౌద్ధం. ఎందుకంటే దానం అంటే త్యాగం కాబట్టి. తన సంపదని, తన శ్రమని త్యాగం చేయడమే కాబట్టి. వ్యక్తుల కష్టాలు తీర్చడానికి దానం ఉపయోగపడుతుంది. కన్నీరూ తుడుస్తుంది. ‘వ్యక్తుల కంటే ధర్మం కోసం కృషి చేసే సంఘానికి దానం చేయడం మరింత మేలు’ అంటాడు బుద్ధుడు. ఒకడు వైశాలి నగర సమీపంలోని మహావనం లో కూటాగార శాలలో బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు వైశాలికి చెందిన లిచ్ఛవీ గణరాజు కుమారుడైన సింహసేనాపతి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. సింహుడు తీర్థంకర మత అభిమాని. అయినా అతనిలో రేగే అనేక సందేహాల్ని తీర్చుకోవడానికి బుద్ధుని దగ్గరికే వచ్చేవాడు. ఆ రోజు... వచ్చి బుద్ధునికి నమస్కరించి ఒక పక్కన కూర్చొన్నాడు. బుద్ధుడు అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత సింహసేనాపతి అంజలి ఘటిస్తూ– ‘‘భగవాన్! మీరు అనేకమార్లు దాన విశిష్టత గురించి చెప్పారు. ఏ దాత తాను చేసిన దానానికి ఆనందం పొందగలడు?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఒక తాను దానం చేయాలి అని అనుకున్నప్పుడు తాను చేయబోయే దానాన్ని తలచుకుని ఏ కొంచెమైనా బాధపడకూడదు. అలాగే దానం చేస్తూ... ఏదో చేస్తానని అన్నాను. చేయక తప్పడం లేదు’ అని బాధపడకూడదు. ఆ విధంగానే దానం చేశాక కూడా ‘‘దానం చేయాలని అనుకున్నాను సరే. కాని దానం చేసి ఉండకూడదు. చేసినా అంత చేసి ఉండకూడదు.’’ అని అప్పుడూ బాధపడకూడదు. ఇలా ఈ మూడు సమయాల్లో ఏ దాత బాధపడడో ఆ దాత దాన ఆనందాన్ని పొందుతాడు’’ అన్నాడు బుద్ధుడు. అప్పటికే బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం అనాథ పిండకుడు, మాత విశాఖ, మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనుడు... ఇంకా ఎందరో దాతలు పేరు పొందారు. వారందరి విషయం తెలిసిన సింహ సేనాపతి – ‘‘భంతే! దాన ఫలాన్ని ప్రత్యక్షంగా చూడ్డం సంభవమేనా?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు పిసినారి. శ్రద్ధలేని వాడు. మరొకరు దాత. శ్రద్ధ గలవాడు. వీరిద్దరిలో సాధారణ ప్రజలే కాదు, పండితులు, అరహంతలు ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తారు?’’ ‘‘భగవాన్! దాత దగ్గరికే వెళ్తారు’’ ‘‘భిక్షువులు, మునులు, పండితులు, ధ్యానులు ముందుగా ఎవరి దగ్గర భిక్ష గ్రహిస్తారు’’ ‘‘శ్రద్ధగలవాడు, దానగుణం కలవాని దగ్గరే ముందుగా భిక్ష స్వీకరిస్తారు’’ ‘‘వారు ముందుగా ఎవరికి బోధిస్తారు?’’ ‘‘శ్రద్ధగల దాతకే భగవాన్’’ ‘‘బతికున్నప్పుడు, మరణించాక కూడా వీరిలో ఎవరు సత్కీర్తిని పొందుతారు?’’ ‘‘అలాంటి సత్కీర్తి దాతలు మాత్రమే పొందగలరు భగవాన్’’ ‘‘రాజు కొలువుకి, పండిత పరిషత్తుకి, ధర్మ సభలకి, ఏ పరిషత్తులకైనా వెళ్ళితే... ఎవరు గౌరవం పొందుతారు?’’ ‘‘భగవాన్! ఏ సభలకైనా వెళ్ళి గౌరవం పొందగలిగేది శ్రద్ధ గలవాడైన దాత మాత్రమే’’ అన్నాడు. ‘‘చూశావా సింహా! దాత పొందే సత్కీర్తి, గౌరవం దాన ఫలమే! దానఫలం ప్రత్యక్షంగా కనిపించే సత్యమే కదా!’’ అన్నాడు. ‘‘భగవాన్! ఇకపై దాన గుణాన్ని పెంపొందించుకుంటాను’’ అని శిరస్సు వంచి ప్రణమిల్లాడు సింహసేనాపతి. – డా. బొర్రా గోవర్ధన్ -
ప్రభాస్ మంచితనం.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం
Prabhas Donated Two Lakh Rupees To Deceased Fan Family: పాన్ ఇండియా స్టార్, మనందరి డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన మంచి చాటుకున్నాడు. తన సినిమా విడుదల రోజు ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ ఫ్లెక్సీ కడుతున్నాడు. అనుకోకుండా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసి చలించిపోయిన ప్రభాస్ చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభాస్ తనవంతు సాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇదివరకు కేరళ, ఏపీ వరదల్లో చిక్కుకున్నప్పుడు ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఈసారి తన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నిజమైన డార్లింగ్ అనిపించుకున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాగా ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. చదవండి: రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిమాని ఆత్మహత్య -
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
ఉక్రెయిన్‌కు రూ.77 కోట్ల విరాళం ప్రకటించిన స్టార్ హీరో
హాలీవుడ్ స్టార్, 'టైటానిక్' హీరో లియొనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు భారీ విరాళాన్ని ప్రకటించాడు. రష్యా భీకర దాడులతో దద్దరిల్లిపోయిన ఉక్రెయిన్‌కు తనవంతుగా రూ.77 కోట్లను విరాళంగా అందించాడు. కాగా ఉక్రెయిన్‌తో లియొనార్డోకు అవినాభావ సంబంధం ఉంది. ఇతడి అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. కానీ 1917లో తన తల్లిదండ్రులతో కలిసి జెర్మనీకి వలస వెళ్లింది. జెర్మనీలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయిన ఆమె 1943లో లియొనార్డో తల్లి ఇర్మెలిన్కు జన్మనిచ్చింది. ఇతడు ఏడాది వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా లియొనార్డో అమ్మమ్మతో ఎక్కువ సమయం గడిపేవాడు. లియొనార్డో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్‌కు వెళ్లేదామె. అతడి యాక్టింగ్ కెరీర్‌కు ఎంతగానో సపోర్ట్ చేసిన హెలెన్ 93 ఏళ్ల వయసులో 2008లో మరణించింది. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టార్ హీరో ఉక్రెయిన్‌కు ఏకంగా 77 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. Leonardo DiCaprio just donated 10 million to the Ukraine armed forces. absolute stud. #LeonardoDiCaprio @LeoDiCaprio #humanitarian — Michael Rosenbaum (@michaelrosenbum) March 9, 2022 -
ఉక్రెయిన్ సైన్యానికి నా ప్రైజ్‌మనీ: స్వితోలినా
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. -
చిన్న వయసు.. పెద్ద మనసు
సాక్షి, గాలివీడు (కడప): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ. గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. -
‘మన ఊరు – మన బడి’కి రూ.కోటిన్నర విరాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి కరీంనగర్ టీఆర్ఎస్ నాయకుడు, ‘చల్మెడ’వైద్య కళాశాల యజమాని చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పందించారు. తన తండ్రి చల్మెడ ఆనందరావు సొంత గ్రామం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేటలో పాఠశాల భవనాన్ని రూ. కోటిన్నరతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన నరసింహారావు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేసేలా రూపొందించిన బిల్డింగ్ ప్లాన్‌ను అందజేశారు. భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం నాటికే ప్రభుత్వానికి అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆయన మంత్రికి తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’అనే కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనర్సింహారావు స్కూల్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. -
యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు. -
అవ్వా.. నీకు వందనం! అందుకే ఆ ఊరే మొక్కుతోంది మరి!
ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్లకు సాయం చేశారా?. సపోజ్.. మీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉందనుకోండి!.. ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? ఇక్కడో బామ్మ మరో ప్రస్తావన లేకుండా దానం చేసేసింది. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. హుచ్చమ్మ చౌద్రి.. వయసు 75 ఏళ్లు. ఉండేది హవేరీ జిల్లా కునికేరి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే బసప్ప చౌద్రిని పెండ్లి చేసుకుని ఆ ఊరికి కాపురం వచ్చింది. ఎన్నో ఏళ్లు గడిచినా పాపం పిల్లలు కలగలేదు ఆ జంటకు. ఒకరికొకరు తోడుగా పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతికేవాళ్లు. ముప్ఫై ఏళ్ల క్రితం బసప్ప చనిపోయాడు. అప్పటి నుంచి హుచ్చమ్మ ఒంటరిది అయ్యింది. కానీ, ఆమె కాయకష్టం ఆగలేదు. ఊరికి కష్టం.. పొలం పనులు చేసుకుంటున్న హుచ్చమ్మకి.. ఒకరోజు పంచాయితీలో పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం చెవిన పడింది. స్కూల్లో బడి లేదు. ఎక్కడైనా స్థలం దొరికితే కట్టాలని అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ ముందుకొచ్చింది. తన ఎకరం స్థలం తీసుకోమని చెప్పింది. అది వినగానే అందరూ కంగుతిన్నారు. నిజంగానే అంటున్నావా హుచ్చమ్మా? అన్నారు. ‘మనస్ఫూర్తిగా..’ అంటూ కాగితాలపై సంతకాలు చేసేసింది ఆమె. అలా ఆ ఊరికి స్కూల్ వచ్చింది. అటుపై పిల్లల ఆట స్థలం కోసం ఇబ్బంది పడకూడదని ఆ పక్కనే మరో ఎకరం కూడా ఇచ్చేసింది. ఈసారి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అధికారులు.. ఆమెకు ఆ స్థలం విలువ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ భూమిలో ఇనుము ధాతువు ఉందని, ఎకరం కనీసం అర కోటి రూపాయలకు తక్కువకు పోదని ఆమెకు వివరించారు. కానీ, నవ్వుతూ ఆ పెద్దావిడ ‘ ఆ డబ్బు నేనేం చేసుకోను అయ్యా.. ఆకలి తీర్చుకునేందుకు పని చేస్తున్నా.. సంపాదించుకుంటున్నా. ఇలాగైనా ఈ ఊరి బిడ్డలు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా’ అంటూ సంతకాలు చేసేసింది. హుచ్చమ్మ ఇప్పుడు అదే స్కూల్లో ఆమె మధ్యాహ్నన భోజన పథకం కింద వంట మనిషిగా పని చేస్తోంది. బడి బంద్ ఉన్న టైంలో పొలం పనులు చేసుకుంటోంది. బడిలో అంతా ఆమెను అజ్జీ(అవ్వ) అని పిలుస్తున్నారు. తల్లి ప్రేమను నోచుకోకపోయినా.. ఊరి బిడ్డలకు ప్రేమగా వండిపెడుతోంది. 300 మంది ఆప్యాయంగా అవ్వా అంటుంటే సరిపోదా? అంటూ బోసినవ్వులతో చెప్తోంది హుచ్చమ్మ. అందుకే ఆ అవ్వ సాయానికి ఊరంతా మొక్కుతోంది ఇప్పుడు. -
స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్వాన్కు చెందిన బండారి బ్రదర్స్ సోమవారం తమ కుటుంబం తరఫున రూ.50లక్షల విలువైన డీడీలను ఈఓ గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారు ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, సోదరుల తరపున ఈ విరాళం అందించామని తెలిపారు. -
‘ఏపీఎస్డీఎం’కి విర్కో గ్రూప్ కంపెనీ భారీ విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే.. -
యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్ ల్యాబ్ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు. మరో రూ.50 లక్షలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. స్వర్ణతాపడానికి బంగారం అందజేత యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తలపై జుట్టు ప్రతి ఒక్కరికీ ఎంతో అపురూపం. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. అలాంటిది క్యాన్సర్ బాధితులకు ఇచ్చే చికిత్సలో తల వెంట్రుకలు మొత్తం పోతే వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారి కోసం మేమున్నామంటూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ముందుకు వస్తున్నారు. వారి కోసం కేశాలు దానం చేసి విగ్గుల తయారీకి సహకరిస్తున్నారు. ఇటీవల కర్నూలులో నిర్వహించిన కేశదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపి ఇవ్వడం కారణంగా వారి తలవెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తలవెంట్రుకలు తిరిగి రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి నుంచి వేదన మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే మనోవేదన వారిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఇలాంటి వారికి ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబయిలోని నోవా హాస్పిటల్ వారు ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. దాతల ద్వారా వారికి అందిన వెంట్రుకలను విగ్గులుగా మార్చి కీమోథెరపి ద్వారా వెంట్రుకలు కోల్పోయిన వారికి అందజేస్తున్నారు. కేశదానానికి విశేష స్పందన యువభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో రాయలసీమలో మొదటిసారి గత నెల 29వ తేదీన నిర్వహించిన కేశదానం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కేశదానానికి ముందుగా 25 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా 49 మంది మహిళలు, యువతులు, పిల్లలతో పాటు నలుగురు యువకులు కేశదానానికి ముందుకు వచ్చారు. స్థానిక దేవిఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నలుగురు యువకులు క్యాన్సర్ బాధితుల కోసమే వెంట్రుకలను 15 సెం.మీ. కంటే ఎక్కువగా పెంచి మరీ కేశదానం చేశారు. నంద్యాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటహరీష్ అనే యువకుడు ఇప్పటికే రెండుసార్లు కేశదానం చేశారు. ఈ కార్యక్రమంపై యువభారత్ సేవా సమితి వారు నెలరోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో అధికంగా మహిళలు భాగస్వామ్యమయ్యేలా చేశారు. ఎంతో తృప్తినిస్తోంది క్యాన్సర్ బాధితుల కోసం చేసే కేశదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదట భావించినప్పుడు అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. క్రమంగా కార్యక్రమం ఉద్దేశాన్ని అందరికీ చెప్పి ఒప్పించాం. అనూహ్యంగా 53 మంది తరలివచ్చి కేశ దానం చేయడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నేను కూడా కేశదానం చేశాను. ఇప్పటికే 22 సార్లు రక్తదానం కూడా చేశాను. ఎవ్వరైనా కేశదానం చేయాలనుకుంటే హైదరాబాద్‌లోని కోట సంపత్‌కుమార్ (9992345678, 93463445)కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు ఏర్పాట్లు చేస్తారు. –సి. రేణుక, యువభారత్ సేవా సమితి సహాయ కార్యదర్శి, కర్నూలు నేనూ దానం చేశా క్యాన్సర్ బాధితుల కోసమని కేశదానం చేస్తున్నారని తెలిసి అక్క వారితో కలిసి నేనూ వెళ్లాను. అక్కడ ఆంటీలు, అక్కలు వారి వెంట్రుకలను కత్తిరిస్తూ ఉంటే ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా. క్యాన్సర్ బాధితుల కోసం విగ్గులు తయారు చేసి ఉచితంగా ఇస్తారని చెప్పడంతో నేను కూడా నా వెంట్రుకలను కత్తిరించి వారికి ఇచ్చాను. నాతో పాటు నా స్నేహితులు సైతం ఇచ్చారు. – సి. శ్రీమహి, కర్నూలు -
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం
సాక్షి, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి సీఎం జగన్‌కి జ్ఞాపిక అందజేశారు. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్) ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.వెంకట రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ వరం... స్పాట్లో రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ -
శభాష్ అంజలి.. మంచి పని చేశావ్!
కట్నం డబ్బును మంచి పనికి వినియోగించి శభాష్ అనిపించుకుంది ఓ పెళ్లికూతురు. పెద్ద మొత్తంలో నగదును సమాజ సేవకు అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. (చదవండి: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’) ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!) #positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE — Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021 దీనికి సంబంధించిన కథనాన్ని ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం క్లిప్పింగ్‌ను త్రిభువన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. దీంతో అంజలి కన్వర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచావంటూ పొగడుతున్నారు. (చదవండి: అనుపమ అలుపెరగని పోరాటం.. ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!) -
భార్య చివరి కోరిక.. 17 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన భర్త !
ఉజ్జయినీ: మనకి ఇష్టమైన వాళ్ల కోరికలను తీర్చడానికి ఎన్నో చేస్తుంటాం. అదే కోరిక వాళ్లకి చివరిదైతే ఎలాగైనా తీర్చేందుకు సిద్ధపడుతాం. అలా ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 కేజీల బంగారన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బొకారో నివాసి సంజీవ్ కుమార్, రష్మి ప్రభ భార్యాభర్తలు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయానికి రష్మి ప్రభ నిత్యం వెళ్లి అమ్మవారిని దర్శించుకునేది. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవలే చనిపోయింది. చనిపోయే ముందు ఆమె అమ్మవారికి తన నగలను సమర్పించాలని అదే తన చివరి కోరికగా భర్త సంజవీ కుమార్‌కు తెలిపింది. దీంతో తన భార్య చివరి కోరికను తీర్చేందుక ఆ వ్యక్తి తన భార్య ఆభరణాలు, 310 గ్రాముల బరువున్న నెక్లెస్‌లు, గాజులు, చెవిపోగులు సహా సుమారు రూ. 17 లక్షల విలువైన ఆభరణాలను అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియాకు వెల్లడించారు. చదవండి: Viral Video: భీకర గంగా ప్రవాహం.. క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్, అయితే.. -
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది.