
RIL Director Anant Ambani దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ భారీ విరాళమిచ్చింది.భారీ వర్షాలు , వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి వాటితో అతలా కుతమైన ఉత్తరాఖండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ప్రతినిది తనయ్ ద్వివేది ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’)
ఈ మేరకు అనంత్ అంబానీ ఒక లేఖ రాశారు. తాము అందించిన సాయం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నామని ని అంబానీ సిఎం ధామీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
రిలయన్స్ ద్వారా తాము పలు విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 10 సంవత్సరాలకు పైగా రాష్ట్రానికి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. మరోవైపు ఆర్‌ఐఎల్‌కు, అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు)
కాగా రిలయన్స్ ఫౌండేషన్ 2021లో కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లను అందించింది. మహమ్మారిపై సమిష్టి పోరాటంలో దేశం పట్ల ఆర్థిక సహాయం చేయడం తన కర్తవ్యమని కంపెనీ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ , కేదార్‌నాథ్ ఆలయ కమిటీలకు ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఏడాది రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.