
కాజల్ అగర్వాల్
‘‘మనం హాయిగా బతకడానికి ఏవేవో కావాలనుకుంటాం. కానీ అంతిమంగా కావాల్సింది మానసిక ప్రశాంతతే. అది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాళ్లను ఆరాధనాభావంతో చూసేదాన్ని. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైనది అని అర్థం అయింది. ఎటువంటి ఒత్తిడిలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఏం లాభం?’’ అన్నారు కాజల్. అలాగే కరోనా వైరస్‌పై పోరాడేందుకు తన వంతు సహాయాన్ని అందించారు. ‘కరోనా క్రైసిస్ చారిటీ కోసం’ (సీసీసీ మనకోసం)కు 2 లక్షల రూపాయిల విరాళం ప్రకటించారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment