
ఓ గుర్తుతెలియని వ్యక్తి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసి తనవంతు సాయంగా రూ.201 సాయం చేశాడు కమల్ సింగ్ అనే యువకుడు. గతేడాది జూలై 7న ఫోన్ పే ద్వారా సాయం అందించాడు. ప్రస్తుతం ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఇతడు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు.
అయితే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అతని ఫోన్‌పేలోకి రూ.201కి వచ్చాయి. ఈ నంబర్ ఎవరిదా అని చూడగా.. గతంలో ఓ తల్లికి చికిత్స కోసం సాయం చేసిన విషయం గుర్తుకువచ్చింది. ఆమె కుమారుడే ఇప్పుడు డబ్బు తిరిగి పంపాడు. అమ్మ ఎలా ఉందని అడగ్గా.. బాగుందని బదులిచ్చాడు సాయం పొందిన వ్యక్తి. అంతేకాదు తన వ్యాపారం ఇప్పుడు బాగా సాగుతోందని, అందుకే తన తల్లికి వైద్యం కోసం సాయం చేసిన వారందరికీ తిరిగి డబ్బులు పంపిస్తున్నాని చెప్పాడు.
అంతా మనీ మైండెడ్ మనుషులున్న ఈరోజుల్లో ఇంకా ఇలాంటి నిజాయితీపరులు ఉన్నారా? అని కమల్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసి అతడ్ని ప్రశంసించాడు.
తల్లి చికిత్సకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని ఇప్పుడు అందరికీ తిరిగి చెల్లిస్తున్న కూమారుడ్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని నిజాయితీ, మంచి మనసును చూసి శభాష్ అంటున్నారు.
చదవండి: ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా!
Comments
Please login to add a commentAdd a comment