అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి.. | The Lender Behaved Harshly Towards The Mother | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి..

Published Tue, Jul 25 2023 10:21 AM | Last Updated on Tue, Jul 25 2023 10:54 AM

The Lender Behaved Harshly Towards The Mother - Sakshi

జగిత్యాల: తీసుకున్న అప్పుపై వడ్డీ కట్టక జాప్యం చేస్తుండడంతో రుణం ఇచ్చిన వ్యక్తి కనీస మానవత్వం మరచి.. దాష్టీకం ప్రదర్శించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

పుప్పాల సందీప్‌ అదే గ్రామానికి చెందిన ఏశవేని గణేశ్‌కు జరుపుల సాగర్‌ అనే వ్యక్తి నుంచి రూ.1,12,000ను గత మార్చిలో అప్పుగా ఇప్పించాడు. అప్పు పత్రం గణేశ్‌కు బదు­లు సందీప్‌ పేరు మీద రాసుకున్నాడు.  ప్రతినెలా వడ్డీ కడుతూ వస్తున్న గణేశ్‌ రెండునెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహంతో సాగర్‌ ఆదివారం సందీప్‌ ఇంటికి వెళ్లాడు.

ఆ సమయంలో ఇంట్లో సందీప్‌ తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమెను చంపుతానని బెదిరించి, బూతులు తిట్టి ఇంట్లో బంధించి తాళం వేశాడు.  గమనించిన స్థానిక మహిళ మీరా సాగర్‌ను మందలించి తాళం తీసి బాధితురాలిని బయటకు తీసుకొచ్చింది. సందీప్‌ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement