jagityal district
-
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
-
రాజకీయ కక్షతోనే మారు గంగారెడ్డిపై దాడి
-
అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి..
జగిత్యాల: తీసుకున్న అప్పుపై వడ్డీ కట్టక జాప్యం చేస్తుండడంతో రుణం ఇచ్చిన వ్యక్తి కనీస మానవత్వం మరచి.. దాష్టీకం ప్రదర్శించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పుప్పాల సందీప్ అదే గ్రామానికి చెందిన ఏశవేని గణేశ్‌కు జరుపుల సాగర్ అనే వ్యక్తి నుంచి రూ.1,12,000ను గత మార్చిలో అప్పుగా ఇప్పించాడు. అప్పు పత్రం గణేశ్‌కు బదులు సందీప్ పేరు మీద రాసుకున్నాడు. ప్రతినెలా వడ్డీ కడుతూ వస్తున్న గణేశ్ రెండునెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహంతో సాగర్ ఆదివారం సందీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సందీప్ తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమెను చంపుతానని బెదిరించి, బూతులు తిట్టి ఇంట్లో బంధించి తాళం వేశాడు. గమనించిన స్థానిక మహిళ మీరా సాగర్‌ను మందలించి తాళం తీసి బాధితురాలిని బయటకు తీసుకొచ్చింది. సందీప్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జగిత్యాల: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, జగిత్యాల: పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కిషన్రావుపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వెళ్తుండగా ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైక్‌పై ఫాలో అవుతుండగా రాజ్‌కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ఆయన శ్రీఆంజనేయస్వావిుకి శేష వస్త్రాలు, తమలపాకులు, పండ్లు సమర్పించారు.మూలవిరాట్టుకు అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, అఖిల్‌కృష్ణ, రామ్, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు -
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మంది స్టెప్పులు! వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
-
రోడ్డుపైకి వచ్చిన చేపలు
-
చీకటి దారిలో వెలుగు పాట
అమ్మానాన్నలు లేక అనాథగా మిగిలినా.. రెండు కళ్లు శాశ్వతంగా చీకటిమయమైనా బతుకుపోరులో వెలుగు దారులు వెతుక్కుంటూ ముందుకుసాగుతున్నాడు. అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే నిరాశవాదులకు మిట్టపల్లి శ్రీనివాస్ జీవితం ఒక దిశా నిర్ధేశం చేస్తుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లెకు చెందిన గాయకుడు మిట్టపల్లి శ్రీనివాస్. తూర్పున సూర్యుడు ఉదయించినా.. తనకు మాత్రం బతుకంతా చీకటే. బాల్యంలోనే అమ్మానాన్నల మరణం అతడిని ఒంటరిని చేసింది. కష్టాలు నీడలా వెన్నంటి ఉన్నా.. కళ్లులేని చీకటి బతుకు వద్దని ఏనాడు అనుకోలేదు అతడు. బతుకు దారిలో వెలుగు రాదనీ తెలిసినా.. తన గాత్రంతో లోకాన్ని చూడాలనే సంకల్పం తనను ముందుకు నడిపిస్తోందంటున్నాడు మిట్టపల్లి శ్రీనివాస్. మట్టి వినాయకుల తయారీ.. అనాథగా మిగిలి ఒంటిరిగా అద్దె ఇంట్లో ఉంటూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నాడు. ఇంటి పనులతోపాటు బట్టలు ఉత్కుకోవడం దగ్గరి నుంచి అన్నం, కూర వండుకుని తినడం వంటి అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటాడు. చిన్నతనం నుంచే పర్యావరణాన్ని కాపాడాలంటూ అవగాహన కల్పిస్తూ, రెండు కళ్లు చూడలేకపోయినా పద్నాలుగేళ్లుగా మట్టి వినాయకులు తయారుచేసి వాటిని విక్రయిస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. శాపమైన పేదరికం మిట్టపల్లి శ్రీనివాస్ నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్‌కు తన పదమూడో ఏట నుంచే కష్టాలు మొదలయ్యాయి. అందరి పిల్లలాగే పుస్తకాలతో బడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరాక అమ్మతో బీడీలకు దారం కట్టేవాడు. నాన్న బీమండిలో సాంచాలు నడుపుతూ తన రోగాలకు, నొప్పులకుపోను మిగిలిన సొమ్ముతో ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పదమూడేళ్ల వయసులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఎడమ కన్నులో పువ్వు ఏర్పడి కన్ను మసకగా కనపడడం మొదలైంది. కానీ రెక్కాడితేగాని, డొక్కాడని బతుకులు. తన అంధత్వానికి పేదరికం ఎలా నిలిచిందో చెబుతూ – ‘నాన్న లక్ష్మీరాజం బీమండిలో సాంచాలపై పనిచేస్తుంటే అమ్మ లక్ష్మీ ఇంట్లో బీడీలు చుట్టి కుటుంబాన్ని వెళ్లదీసింది. ‘అమ్మా, కన్ను మసకబారుతోంది’ అంటే ‘అయ్యో..’ అని బాధపడింది. అప్పుడు ఆపరేషన్‌కి రూ.70 వేల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఏ పూటకాపూటే తినే రోజుల్లో ఆస్పత్రికి పోయే ఆర్థిక స్తోమత లేదని తెలిసి కాలం కరిగిపోయింది. ఏడాది తిరిగేలోగా కన్ను పూర్తిగా కానరాకుండ అయింది. అప్పటికే అమ్మ కూడా లోకాన్ని విడిచిపోయింది. తొమ్మిదో తరగతిలో నరాలు క్షీణించి మరో కన్నుసైతం మసకబారింది. పరీక్ష రాయలేని పరిస్థితిని గమనించి, మా సారు నాన్నకు కబురు పంపాడు. అక్కడా ఇక్కడా అప్పు పుట్టిన పదిహేను రోజుల్లోనే ఉన్న ఒక్క కన్నూ పూర్తిగా కానరాక పోయింది’అని తన జీవితంలో చీకట్లు కమ్ముకున్న తీరును గుర్తు చేసుకున్నారు మిట్టపల్లి శ్రీనివాస్. బడిలో మొదలైన బతుకు పాట.. తొమ్మిదో తరగతిలో చూపు కోల్పోయిన శ్రీనివాస్ చదువుకోవాలనే ఆశను కోల్పోలేదు. స్రై్కబ్ సాయంతో పది, ఇంటర్ పరీక్షలు పూర్తిచేశాడు. శ్రీనివాస్ చిన్ననాటి నుంచే పాఠశాల వార్షికోత్సవం, జాతీయ పండుగల్లో పాటలు పాడేవాడు. ఇంటర్ పూర్తిచేసిన శ్రీనివాస్ పాటలో తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ సాగుతున్నాడు. ఆరో తరగతిలోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి అందుకున్నాడు. డ్రాయింగ్ కాంపిటిషన్లో సైతం బహుమతులు కూడా గెలుచుకున్నాడు. పాటలే జీవితంగా సింగర్‌గా మారాలని అప్పుడే అనుకున్నాడు. రెండు కళ్లు పోయినా సింగర్ కావాలనే తన కలను చంపుకోలేదు. తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు భక్తీగీతాలు, ఆల్బమ్ పాడిన శ్రీనివాస్ ఇప్పుడు టీవీ షోలలో రాణిస్తున్నాడు. ప్రముఖ టీవీ చానళ్లతో పాటు యూట్యాబ్‌లో శ్రీనివాస్ పాటలు ల„ý లాది మంది నుంచి ఆదరణ లభిస్తోంది. శ్రీను పాడిన ‘రాత రాసే బ్రహ్మదేవుడా..’ పాటతో పాటు శివరాత్రి సందర్భంగా ఇటీవల మైక్ టీవీ విడుదల చేసిన ‘బోళా శంకరా.. ఈశ్వరా.. శంబోశివా..’ పాటతో శ్రీనివాస్ గొంతు మరింత ప్రాచుర్యం పొందింది. యశ్పాల్ రాసిన ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగింది. పాటతోనే లోకాన్ని చూస్తున్నా రెండు కళ్లు లేవనే బాధ కన్నా కంటికి రెప్పలా కాపాడే అమ్మానాన్న ఇద్దరూ నన్ను అనాథను చేసి వెళ్లిపోయారనే బాధ ఎక్కువగా ఉంది. చీకటి పడిందంటే అడుగుబయటపెట్టేవాన్ని కాదు. రాత్రిపూట అమ్మ నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లేది కాదు. అర్ధరాత్రి వరకు అమ్మ బీడీలు చేసి, వచ్చిన పైసలతో బతుకె వెళ్లదీసింది. నాన్న భీమండిలో సాంచాల పనిచేసేవాడు. అమ్మ పోయిన తర్వాత నాన్న నాకోసం ఇంటికి వచ్చి, కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాన్న కూడా మరణించాక ఇప్పుడు చీకటే లోకంగా బతుకుతున్న. పాటతో లోకాన్ని చూడాలని, నిరుపేదల బతుకుల్లో చీకటి తొలగించే వెలుగుదివ్వెగా నా పాట ఉపయోగపడాలన్నదే నా సంకల్పం. – మిట్టపల్లి శ్రీనివాస్ ఒంటరి జీవితం.. స్వయం పాకం.. 29 ఏళ్ల శ్రీనివాస్ గత పద్నాలుగేళ్లుగా చీకటేæలోకంగా బతుకు వెళ్లదీస్తున్నాడు. తల్లి లేదు తండ్రీ లేడు, రెండు కళ్లు లేవు, ఇల్లు లేదు, జాగ లేదు.. అయినా ఏనాడూ బతుకు భారం అనుకోలేదు. ఇంకొకరికీ భారంగానూ ఉండాలనుకోలేదు. అలాగని ఆత్మహత్య ఆలోచనను తన దరికి రానీయలేదు. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ కాలంతో పోటీపడుతున్నాడు. తన తొమ్మిదో ఏట తల్లి లక్ష్మి, పదిహేడో ఏట తండ్రి లక్ష్మిరాజం అనారోగ్యంతో మరణించారు. పద్నాలుగేళ్లుగా శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు తానే అన్ని పనులు చేసుకుంటాడు. తానే అన్నం, కూరలు వండుకుంటాడు. వంటకు అన్ని సరుకులు ఒక్క దగ్గర పెట్టుకుని చేతి స్పర్శతోనే ఉప్పు కారం మోతాదు అంచనా వేసుకుని కూర వండుకుంటాడు. అన్ని వేలలా స్నేహితులే అండగా ఉంటున్నారని వారి సాయంతోనే ప్రోగ్రాంలకు పాటలు పాడేందుకు వెళ్లగలుగుతున్నానని అంటాడు శ్రీనివాస్. – పాదం వెంకటేశ్, సాక్షి, జగిత్యాల ఫొటోలు : జవ్వాజి చంద్రశేఖర్ -
తమ్ముడిని హతమార్చిన అన్న
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో తల్లిదండ్రులపై కత్తితో దాడికి ప్రయత్నించిన తమ్ముడిని అడ్డుకోబోయిన అన్న అదే కత్తితో సోదరుడిని హతమార్చాడు. తీవ్ర రక్తస్రావమైన తమ్ము డు శివకుమార్ (30) మృతి చెందాడు. కన్నాపూర్‌కు చెందిన పొట్టవత్తిని గంగారాం, రాజేశ్వరిల చిన్నకుమారుడు శివకుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మానసిక పరి స్థితి బాగలేక తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో ఆదివారం శివకుమార్ కన్నాపూర్‌కు వచ్చాడు. తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించడంతో వారు సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 9గంటల ప్రాంతంలో శివకుమార్ మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులపై కత్తితో దాడి చేయగా.. అక్కడే ఉన్న సోదరుడు సతీశ్ అడ్డుకున్నాడు. శివకుమార్ సతీశ్‌పై కూడా కత్తితో దాడికి పాల్పడగా.. అప్రమత్తమైన శివకుమార్ నుంచి కత్తి లాక్కొని దానితోనే దాడి చేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ జగిత్యాలరూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
ఆటోలో ఈవీఎంలు..జగిత్యాలలో కలకలం
-
ఓట్ల యుద్ధానికి సిద్ధం
కోరుట్ల: రాజ్యాంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారిగా ఓటు హక్కును తీసుకున్నానని టీమాస్ వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ‘ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ.. గొంగడి.. గజ్జెలు.. జమ్మి చెట్టు మీద పెట్టిన’ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్, పూలే భావజాలానికి అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కలయిక ఈ సమయంలో చాలా ముఖ్యమన్నారు. ఈ దిశలో టీమాస్ సన్నాహాలు సాగిస్తుందన్నారు. కేవలం 7 శాతం జనాభా లేని వారు 93 శాతం జనాభా ఉన్న వారిని పాలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సామా జిక, ఆర్థిక దోపిడీ జరుగుతున్న రీతిలోనే ఓట్ల దోపిడీ కొనసాగుతుందని గద్దర్ చెప్పా రు. తక్కువ శాతం ఓట్లున్న వారు పాలకులు కావడం సరికాదన్నారు. బహుజనులంతా కలసికట్టుగా ఓట్ల యుద్ధానికి సిద్ధం కావా లని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం 2.39 లక్షల మంది ఉన్న అగ్రవర్ణాలవారు రాజకీయంగా ఎదుగుతున్నారని, 30 లక్షల మంది బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నప్పటికీ రాజకీయంగా గుర్తింపులేదన్నారు. బహుజనులంతా కలసి కట్టుగా మా ఓట్లు మాకే అనుకున్నప్పుడు ఈ పరిస్థితికి చరమగీతం పాడవచ్చన్నారు. ఓట్ల యుద్ధానికి బహుజనులు సిద్ధమైతే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. యువత ఓట్ల దోపిడీకి తెరవేయాలన్నారు. -
కొండగట్టు కేసు..పిల్లల మృతదేహాలు లభ్యం
జగిత్యాల జిల్లా : కొండగట్టు సమీపంలో తండ్రి చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. పిల్లలను హత్య చేసి భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామ శివారులోని బొగ్గులకుంట వద్ద సోమవారం జరిగిన సంగతి తెల్సిందే. వివరాలు..ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం శివపురి గ్రామానికి చెందిన నికోడ అశోక్ తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి రైలులో వచ్చారు. రాత్రి కొండగట్టులో నిద్రించి ఆదివారం మధ్యాహ్నాం భార్య పిల్లలను అశోక్ తన వెంట బొగ్గులకుంట వైపు తీసుకెళ్లాడు. అడ్డుచెప్పిన భార్యకు ఇక్కడ కోనేరు ఉందని స్నానం చేద్దామని నమ్మబలికాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత ఏడాదిన్నర వయసున్న చిన్న కూతురు అక్షిత గొంతు నులిమి చంపాడు. వెంటనే పెద్దమ్మాయి అంజలి(4)ని చంపే ప్రయత్నంలో భార్య లక్ష్మి అడ్డుకోవడంతో ఆమె మెడకు వైరుతో బిగించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ ఘటనలో లక్ష్మి కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూసేసరికి పెద్దపాప, భర్త కనిపించలేదు. ఆదివారం రాత్రి 11 గంటల సమయానికి ఎలాగోలా రహదారికి చేరుకుని తల్లిదండ్రులకు, సోదరులకు సమాచారం ఇచ్చింది. వారి సహాయంతో సోమవారం వాంకిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల సహాయంతో అడవిలో వెతకగా చిన్నారి అక్షిత శవం లభ్యమైంది. పెద్ద కూతురు అంజలి శవం కూడా మంగళవారం పరిసరాల్లోనే లభ్యమైంది. భార్యపై అనుమానం పెంచుకునిఈ హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అటు వైపు వెళ్తే.. అంతే సంగతులు
వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం.. యువతులపై లైంగికదాడులకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. ఎప్పుడూ ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు బయట చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ రౌడీగ్యాంగ్ అడ్డూఅదుపులేకుండా అకృత్యాలకు పాల్పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో వరుసగా జరుగుతున్న ఘటనలు వేలెత్తిచూపుతున్నాయి. సాక్షి, జగిత్యాల : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట, లింగంలపేట, హస్నాబాద్ అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా హస్నాబాద్‌కు చెందిన ప్రేమజంటను బ్లాక్మెయిల్ చేసిన ఆ గ్యాంగ్ ఒకరి తరువాత మరొకరు నలుగురు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి ఆరోగ్యం క్షీణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో ఆ గ్యాంగ్ సభ్యులను గుర్తించిన బాధితురాలి బంధువులు వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అతను తాము చేసిన నేరాలనూ ఒప్పుకున్నాడు. కేవలం వీరే కాదూ.. ఇలాంటి కామాంధులు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. లవర్స్ స్పాట్...! జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట లవర్స్‌స్పాట్‌గా పేరొందింది. గుట్ట ప్రాంతం కావడం, జన సంచారం లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చే ఆ ప్రాంతంలో ప్రేమజంటలు వాలుతుంటారు. అక్కడ ప్రేమాయణం ముగించుకుని తిరుగుముఖం పడుతున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ప్రతి రోజు ఎంతో మంది ప్రేమికులు లవర్స్‌స్పాట్‌కు పరుగులు పెడుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. అటువైపు పోలీసులూ దృష్టిసారించకపోవడంతో ఆ ప్రాంతం వ్యభిచారానికీ కేరాఫ్‌గా మారింది. అంతేకాదూ.. ధర్మపురికి వెళ్లే దారిలో ఉన్న ముప్పాలచెర్వు... గొల్లపల్లికి వెళ్లే దారిలో ఉన్న నల్లగుట్టతోపాటు జాబితాపూర్ అడవి ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు బయటికి పొక్కకపోవడంతో అది తెలియక యువతులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రంగంలో పోలీసులు..! హస్నాబాద్ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ అనంతశర్మ, జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్ ఈ నెల 3న హస్నాబాద్, లింగంపేట, అంబరిపేట ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులపై ఆరాతీశారు. మొబైల్ టీంను ఏర్పాటు చేసి.. అంబరిపేట, హస్నాబాద్, లింగంపేట మార్గం మధ్యలో నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. రెండ్రొజుల్లో ఔట్‌కట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేస్తామని ఎస్పీ అనంతశర్మ తెలిపారు. -
కలెక్టరేట్ పనులకు అడ్డంకి
కార్యాలయం ఖాళీ చేయని పంచాయతీరాజ్ మరమ్మతులకు అడ్డంకిగా మారిన వైనం జగిత్యాల అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా జగిత్యాల జిల్లా దసరాకు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కార్యాలయాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. జగిత్యాలలోని పంచాయతీరాజ్ శాఖ భవనాన్ని కలెక్టరేట్ కోసం, గెస్ట్‌హౌస్‌ను కలెక్టరేట్ సిబ్బంది కోసం కేటాయించారు. వీటి మరమ్మతులకు రూ.11 లక్షలు మంజూరు కాగా కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులను మొదలుపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం కోసం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను అప్పగించారు. అయితే పంచాయతీరాజ్ అధికారులు తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడంతో మరమ్మతులకు అడ్డంకిగా మారింది. పంచాయతీరాజ్ శాఖ భవనం జీ ప్లస్ వన్ కలిగి ఉంది. పైన కలెక్టర్ చాంబర్‌తో పాటు కాన్ఫరెన్స్‌హాల్, ఇతర సిబ్బందికి కేటాయించారు. ఈ పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారు. కలెక్టర్ చాంబర్ కోసం నూతన కిటికీలు, తలుపులు ఏర్పాటు చే స్తున్నారు. పైన చకచకా పనులు జరుగుతున్నప్పటికీ... కింది ఫ్లోర్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఖాళీ చేయలేదు. ఆ శాఖ అధికారులు మాత్రం తమకు షిఫ్టింగ్ ఆర్డర్స్ రాలేదని, ఆర్డర్స్ వస్తేనే ఖాళీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇంతవరకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి షిఫ్టింగ్‌కు సంబంధించి నోటీసులు రాలేదని తెలిసింది. దీంతో ప్రహారీతోపాటు గేట్లు తదితర మరమ్మతులు చేపడుతున్నారు. గోడలకు రంగులు వేస్తున్నారు. సోమవారం సబ్‌కలెక్టర్ శశాంక పంచాయతీరాజ్ శాఖ అధికారులను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించినా స్పందన కనిపించలేదు. దసరాకు ఇంకా ఐదు రోజులు రోజుల సమయమే ఉంది. ఒకవైపు గడువు ముంచుకొస్తుంటే మరమ్మతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎలాంటి మరమ్మతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ ఈఈ చాంబర్‌ను డీఆర్వోకు కేటాయించనున్నట్లు తెలిసింది. మిగతా గదులను కలెక్టరేట్ సిబ్బంది కోసం కేటాయించనున్నారు. అన్ని శాఖలు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోనే.. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి కేటాయించిన ఆర్‌అంబీ గెస్ట్‌హౌస్‌లోనే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయూష్, పబ్లిక్ హెల్త్, ఏడీ గ్రౌండ్‌వాటర్, ఏడీ ఇండస్ట్రీస్, ఏడీ మైన్స్ అండ్ జియోలజీ, ఎస్ఈ రూరల్ వాటర్ సపై ్ల కార్యాలయాలకు సైతం కేటాయించారు. ఇటీవల ఏడీ గ్రౌండ్‌వాటర్ శాఖ వారు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు తాళం వేసుకుని వచ్చారు. ఇన్ని శాఖలు ఇందులోనే ఉండటంతో ఈ కార్యాలయం మాదంటే మాదని లొల్లి జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ అధికారులు అక్కడికి షిఫ్ట్ కావడం లేదని తెలిసింది.