
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో తల్లిదండ్రులపై కత్తితో దాడికి ప్రయత్నించిన తమ్ముడిని అడ్డుకోబోయిన అన్న అదే కత్తితో సోదరుడిని హతమార్చాడు. తీవ్ర రక్తస్రావమైన తమ్ము డు శివకుమార్ (30) మృతి చెందాడు. కన్నాపూర్‌కు చెందిన పొట్టవత్తిని గంగారాం, రాజేశ్వరిల చిన్నకుమారుడు శివకుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మానసిక పరి స్థితి బాగలేక తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో ఆదివారం శివకుమార్ కన్నాపూర్‌కు వచ్చాడు.
తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించడంతో వారు సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 9గంటల ప్రాంతంలో శివకుమార్ మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులపై కత్తితో దాడి చేయగా.. అక్కడే ఉన్న సోదరుడు సతీశ్ అడ్డుకున్నాడు. శివకుమార్ సతీశ్‌పై కూడా కత్తితో దాడికి పాల్పడగా.. అప్రమత్తమైన శివకుమార్ నుంచి కత్తి లాక్కొని దానితోనే దాడి చేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ జగిత్యాలరూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment