family disputes
-
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
Karnataka: ఇంటి పెద్ద అత్తా? కోడలా?.. ఇంటింటా ‘గృహలక్ష్మి’ కలహాలు!
కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు. దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు. -
‘కింగ్‌మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్‌ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
కుటుంబ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమీకృత కోర్టుల ద్వారా కుటుంబ వివాదాల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ చెప్పారు. కొన్నికేసుల విచారణ సాగుతున్నప్పుడు కక్షిదారుల కంటే న్యాయవాదులే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారని, అది సరికాదన్నారు. ఆయన శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కలసి హైదరాబాద్‌లో కుటుంబ వివాదాల సమీకృత కోర్టుల సముదాయాన్ని ప్రారంభించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లా డుతూ‘‘దేశంలో దాదాపు 11.4 లక్షల కుటుంబ వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ వివాదాల ప్రత్యేక కోర్టులు లేని రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే కల్పతరువుగా పేరు పెట్టుకున్న ఈ కోర్టులు కూడా కక్షిదారులు విడాకులు, మధ్యవర్తిత్వం ఇలా వారు ఏది కోరితే అది ఇస్తుంది. కానీ ఏది కోరుకున్నా అది వారి భవిష్య త్‌పై ప్రభావం చూపుతుందని మరవద్దు. కుటుంబ వివాదాలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం పెద్దలు గుర్తించాలి. మనోవికాసం కక్షిదారులకు మాత్రమే కాదు. బుద్ధి సరిగా లేని వారందరికీ అవసరమే. న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులను చట్టాల ఆధారంగానే కాకుండా మనసుతో ఆలోచించి పరిష్కరించాలి’’అని రామసుబ్రమణియన్ సూచించారు. ఇక ‘‘తల్లిదండ్రుల వివాదాల కారణంగా పిల్లలు చిన్న వయసులో కుంగుబాటుకు గురవుతున్నారు. ఎంతోమంది కోర్టు తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని వస్తారు. తొలుత మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి’’అని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. ‘‘1970లోనే కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1980 తర్వాత అది కార్యరూపం దాల్చి కోర్టుల ఏర్పాటు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 535 ఫ్యామిలీ కోర్టులు ఉండగా, అందులో 16 మాత్రమే తెలంగాణలో ఉన్నాయి’’అని జస్టిస్ సంజయ్‌కుమార్ వివరించారు. కక్షిదారులకు ఉపయుక్తం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ‘‘హైదరాబాద్‌లోని అన్ని ఫ్యామిలీ కోర్టులు ఒకే భవన సముదాయంలో ఉండటం కక్షిదారులకు ఉపయుక్తం. కోర్టులకు వచ్చే వారికి వాటిని చూడగానే సాధారణంగా వ్యతిరేక భావన కలుగుతుంది. అయితే మెడిటేషన్ రూం, ప్లే ఏరియా, మీడియేషన్ రూం ఇలా ఈ కోర్టును చూస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుంది’’అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. దాదాపు 5,900 కేసులు ఈ కోర్టులకు బదిలీ కానున్నాయని జస్టిస్ నవీన్‌రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఇతర హైకోర్టుల న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉన్మాదిగా మారిన భర్త..డంబెల్‌తో భార్య తలను..
సాక్షి, కృష్ణరాజపురం: కుటుంబ గొడవలతో ఇనుప డంబెల్‌తో భార్యను కొట్టి చంపాడో కిరాతక భర్త. జీవితాంతం తోడు నీడగా చూసుకుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి దారుణంగా బలిగొన్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురం పరిధిలోని రామ్మూర్తినగరలో ఉన్న హొయ్సళ స్ట్రీట్‌లో గురువారం చోటు చేసుకుంది. లిడియా (44) భర్త చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యురాలు. వివరాలు.. మోరిస్, లిడియాలకు 15 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మోరిస్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఉదయం ముగ్గురు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తరువాత భార్యభర్త గొడవపడ్డారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన మోరిస్ ఇనుప డంబెల్‌ను తీసుకుని భార్య తలను నుజ్జు చేశాడు. రక్తపుమడుగులో ఆమె శవమైంది. ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో రామ్మూర్తినగర పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో పిల్లలు అనాథల్లా మారారు. (చదవండి: బెంగళూరులో దారుణం.. వేధింపులు తాళలేక వైద్యురాలు ప్రియాంశి మృతి) -
కంటిరెప్ప ఆగ్రహం, కనుపాపలు దూరం
సాక్షి, బళ్లారి: కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ కలహాలతో ఆవేదన చెందింది. తానొక్కటే ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాథలవుతారని అనుకుని, ముందు వారిని నీటిలోకి పడేసి తరువాత తాను దూకింది. ఈ విషాద ఘటన శనివారం రాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా జాలిగేర గ్రామ సమీపంలోని విఠలవాడి తండాలో జరిగింది. తరచూ కుటుంబ కలహాలు వివరాలు... తండాకు చెందిన రాముచౌహాన్కు సింధగి తాలూకాకు చెందిన గీత (32)తో 8 సంవత్సరాల క్రితం వివాహమైది. వీరికి సృష్టి (6), కిషన్ (3), సమర్థ (4) అనే పిల్లలున్నారు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా దంపతులు గొడవ పడ్డారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన గీత ముగ్గురు పిల్లలను సంప్‌లోకి తోసి ఆమె కూడా దూకింది. కొద్ది సేపటికి ఇరుగుపొరుగు గమనించేటప్పటికీ నలుగురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తికోట పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రెండేళ్ల కొడుకుని మూడు అంతస్తుల బాల్కనీ నుంచి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ వద్ద ఉన్న స్లమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తండ్రి కొడుకులిదర్నీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మన్సింగ్ అతడి భార్య పూజా కుటంబ కలహలతో గత కొన్ని నెలలుగా వేర్వేరుగా నివశిస్తున్నారు. ప్రస్తుతం పూజ తన ఇద్దరు పిల్లలతో కల్కాజీలో ఉంటున్న తన నానమ్మ వద్దే ఉంటోంది. గత రాత్రి మన్సింగ్ తన భార్య పూజ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మన్సింగ్ కోపంతో.. తన రెండేళ్ల కొడుకుని 21 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుంచి పడేసి..ఆ తర్వాత అతను దూకేశాడు. ఈ మేరకు పోలీసులు మనసింగ్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ సమయంలో తాగి ఉన్నాడని పూజ నానమ్మ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి) -
కన్న తల్లే కర్కశంగా..చిన్నారులపై పెట్రోల్ పోసి..
సాక్షి, కోలారు: ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కష్టం తెలియకుండా ఆదుకోవాల్సిన తల్లే నిప్పంటిస్తే చిన్నారుల ప్రాణాలు విలవిలలాడాయి. ముళబాగిలు వద్ద అంజనాద్రి కొండపై బుధవారం తెల్లవారుజామున ఇద్దరు కూతుళ్లపై తల్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలో మరో కూతురు కూడా ఆస్పత్రిలో మరణించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన తల్లి జ్యోతి కుటుంబ కలహాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడడం తెలిసిందే. తల్లికి కస్టడీ, తండ్రికి విచారణ తల్లి ఇప్పుడు కోలారు జైలులో జ్యుషియల్ కస్టడీలో ఉంది. మంటల్లో పెద్ద కుమార్తె అక్షయ అక్కడికక్కడే మరణించగా చిన్న కుమార్తె ఉదయశ్రీ బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయినట్లు ముళబాగిలు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. ఘటనలో ఉదయశ్రీ కి 60 శాతం కాలిన గాయాలు అయ్యాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక చివరకు ప్రాణాలు విడిచింది. కాగా జ్యోతి భర్త తిరుమలేశును విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. (చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..) -
పండుగపూట విషాదం.. ప్రేమించి పెళ్లి.. చిన్నచిన్న గొడవలకే
సాక్షి, రామగుండం(కరీంనగర్): పండుగపూట ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పాలకుర్తి మండలం కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నింపింది. బసంత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య– కళావతి దంపతుల కూతురు అనూష (24), అదే గ్రామానికి చెందిన మేడం బాపు కుమారుడు మేడం రాకేశ్ ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తన తల్లిగారింట్లో ఉన్న అనూషను శనివారం రాత్రి రాకేశ్ వారి ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఎప్పుడో పురుగుల మందు తాగిన అనూష ఆదివారం వేకువజామున బాత్రూంకు వెళ్లి కిందపడిపోయింది. నోటివెంట నురుగులు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మారంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బసంత్‌నగర్ ఎస్సై మహేందర్‌యాదవ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని.. గ్రామంలో విషాదం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలు అనూష తండ్రి కందుల శంకరయ్య ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అనూష ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల కారణంగానే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. భార్యాభర్తలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్ శాఖ, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకూ విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైద్యుల సంఘం రూపొందించిన పోస్టర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆరి్థక ఇబ్బందులు, అనారోగ్యాలతో కూడా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకు రావొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒత్తిడిలేని విద్యా విధానమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తోందన్నారు. అనంతరం ‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మేం ఆత్మహత్య చేసుకోం’ అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ టీకే రాణా, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భార్య వేధింపులు తాళలేక...
యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్‌నోట్ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్‌తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ రూ. 17 వేలు టోపి) -
ఎంత పని చేశావు తల్లీ..
అమ్మా.. నవమాసాలు మోసి మాకు జన్మనిచ్చావు. అల్లారుముద్దుగా పెంచావు. గోరుముద్దలు తినిపించావు. ఏ చిన్న జబ్బు చేసినా నీవు తల్లడిల్లి పోయావు. నీవే కొండంత అండ అని భావించాము. నీళ్లు చూస్తుంటే భయమేసింది.. అయినా నువ్వున్నావన్న ధైర్యంతో నీవెంటే నడిచాము. నీటిలో ఊపిరి ఆడలేదు. బయటకు తీయమ్మా... అని వేడుకున్నాం. కానీ అప్పటికే అంతా అయిపోవడంతో చిన్నారులు తల్లితో పాటు ప్రాణాలు విడిచారు. శింగనమల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బి.రామాంజినేయులుకు పదేళ్ల క్రితం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన కవిత(27)తో వివాహమైంది. వీరికి సంతోష్ (7), భార్గవి (3) సంతానం. గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే..నాలుగు నెలల క్రితం తాడిపత్రి పట్టణానికి మకాం మార్చారు. రామాంజినేయులు గుజిరీ షాపులో పనికి వెళుతుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. రామాంజనేయులు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రోజూ దంపతులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా వాదులాడుకున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం ఉదయం 11 గంటల తరువాత పుట్టింటికి వెళుతున్నానని భర్తకు చెప్పిన కవిత కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. బస్సులో బయల్దేరి శింగనమల క్రాస్ వద్ద దిగింది. అక్కడి నుంచి పిల్లలతో కలిసి రంగరాయల చెరువు మరవకట్టపైకి నడుచుకుంటూ వెళ్లింది. జీవితం నరకప్రాయంగా అనిపించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లలు దిక్కులేని వారు కాకూడదని.. వారినీ తనవెంటే తోడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని చెరువులోకి దూకారు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, శింగనమల సీఐ అస్రార్ బాషా, ఎస్ఐ వంశీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీయించి..పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, పిల్లలు చనిపోయినా భర్త సంఘటన స్థలం వద్దకు రాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (చదవండి: ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్) -
తెగని పంచాయితీ.. అత్తవారింటికి వచ్చిన అల్లుడు.. ఇదే అదనుగా..
శాలిగౌరారం (నల్గొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మామిడికాయల జయమ్మ కుమార్తె సారికను నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(35)కు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేయగా, కిరణ్ ఎమ్మార్పీఎస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో రోజురోజుకూ పోషణ ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం మానేసిన సారిక ఆరు నెలల క్రితం కుమారుడు, కుమార్తెను వెంటపెట్టుకొని చిత్తలూరులోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. కానీ భార్యభర్తల మధ్య బేదాభిప్రాయాలు తగ్గకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా భర్తపై పోలీసులకు ఫిర్యాదు ఈనేపథ్యంలో భర్త కాపురానికి తీసుకుపోవడంలేదని 20రోజుల క్రితం సారిక శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పోలీసులు భార్యాభర్తలకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అక్కడనుంచి కిరణ్ హైదరాబాద్‌కు పోగా, సారిక చిత్తలూరులో ఉంటోంది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కిరణ్ చిత్తలూరు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కిరణ్ మద్యం ఇంటికి తెప్పించుకొని తాగాడు. భోజనం తర్వాతా ఆర్థికపరమైన విషయాలతో దంపతుల మధ్య వాదనలు జరిగాయి. కొంతసమయం తర్వాత కిరణ్ ఇంట్లో నేలపై నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన సారిక రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న కిరణ్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సారిక అక్కడనుంచి బయటకు వెళ్లి వంగమర్తిమీదుగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయింది. దీంతో అర్వపల్లి పోలీసులు సంఘటన గురించి శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తలూరుకు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవరావు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తరలింపు అడ్డగింత మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ సారికతో పాటు మరో నలుగురి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. హత్యలో ఐదుగురి పాత్ర? మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు హతుడి కుటింబికులు ఆరోపిస్తున్నారు. వారిలో సారికతో పాటూ చిత్తలూరుకు చెందిన ఆమె అక్క బండారు నాగమ్మ, ఆమె కుమారుడు బండారు శివప్రసాద్, యాదాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవికి చెందిన ఓ వ్యక్తి, నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు..
సాక్షి,హుబ్లీ (కర్ణాటక): అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. మహమ్మద్‌రఫిక్ నదాఫ్ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే నివాసం ఉంటున్నాడు. అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజును ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. చదవండిః కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..! -
హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి..
సాక్షి, చిలకలగూడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన సెంట్రింగ్ కార్మికుడైన ముస్తాల రవి, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి పార్శిగుట్టలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న నాగలక్ష్మి (24) తన కుమార్తెలు రిత్విక(4), రెండున్నరేళ్ల సిరిని వెంటతీసుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్వగ్రామంతోపాటు సన్నిహితులు, బంధు మిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త రవి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అడ్మిన్ ఎస్ఐ తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు..
సాక్షి, ఆదోని(కర్నూలు): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. పట్టణంలోని మరాఠగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిస అయిన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాక వివాహ సమయంలో తీసుకెళ్లిన రూ.8 లక్షలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని మాధవి విలపించారు. చదవండి: భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఇల్లాలు -
భర్తను కడతేర్చిన భార్య.. అసలు ఏంజరిగిందంటే
సాక్షి, చిన్నకోడూరు(మెదక్): కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఇంటిని పట్టించుకోకపోవడం, వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరిగింది ఈ విషాదక ఘటన. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు మర్కంటి ఎల్లయ్య(55)కు భార్య నర్సవ్వ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూతురు రేణుకకు 2014లో అదే గ్రామానికి చెందిన ఇప్ప మహేందర్‌తో వివాహం జరిపించారు. కాగా ఎల్లయ్య, నర్సవ్వ మధ్య కుటుంబతగాధాలతో తరచూ గొడవ పడుతుండేవారు. దీనిపై కుల పెద్దల సమక్షమంలో ఎల్లయ్యను మందలించినా మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఎల్లయ్య భార్యతో గొడవ పడి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో ఎల్లయ్య పడుకున్నాక తెల్లవారు జామున 5 గంటల సమయంలో నర్సవ్వ ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త ఎల్లయ్య మెడను నరికింది. బలమైన గాయాలు కావడంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
భర్త ఇంటి ముందు 40 రోజుల పోరాటం విషాదాంతం
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): కట్టుకున్నవాడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన నరహరి సుజిత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి (32)కి 2011లో ఆన్లైన్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి ప్రస్తావన రాగానే పలుమార్లు సుజిత్ దూరం పెట్టడంతో సుహాసిని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2020 నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సిటీలో కొంతకాలం కాపురం చేశాడు. తల్లిదండ్రులను ఒప్పించి తీసుకెళ్తానని ఊరికెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ తాను రాకపోవడంతో సుహాసిని హుజూరాబాద్ వెళ్లి భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. అయినా భర్త, అత్తమామల మనసు కరగలేదు. మరోవైపు సుజిత్ మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసి మనస్తాపం చెంది బుధవారం భర్త ఇంటి ఎదుట గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. సుజిత్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో సుహాసిని పేర్కొంది. తన చావుకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించి తన అవయవాలను దానం చేయాలని చెప్పింది. మృతురాలు సోదరుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఓ భర్త కోసం ఇద్దరు పెళ్లాలు గొడవ పడటం చాలా చూశాం. కానీ ఓ భార్య కోసం ఇద్దరు భర్తలు తగువులాడుకోవడం ఎక్కడైనా చూశారా.. తాజాగా హైదరాబాద్‌లో ముద్దుల భార్య కోసం ఇద్దరు భర్తలు ఎంతకైనా తెగించేందుకు సిద్దమయ్యారు. ఆమెను దక్కించుకునేందుకు పోరాడుతూ.. రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్లాడుకున్నారు. చివరకు ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్లాం పంచాయితీ మీడియా ముందుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన శశికాంత్‌కు మొదటి భార్య చనిపోవడంతో ఆమె సోదరి దుర్గకు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్లు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఇటీవల ఫేస్బుక్లో సత్య ప్రసాద్ అనే వ్యక్తితో దుర్గకు పరిచయం ఏర్పడింది. వీరి ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకొని అతనితోనే ఉంటుంది. అయితే భార్య కనిపించడం లేదని మొదటి భర్త శశికాంత్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దుర్గ- సత్య ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు సత్యప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తాను దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, గతంలో ఆమెకు పెళ్లైన విషయం తెలియదని సత్యప్రసాద్ పోలీసులకు తెలిపాడు. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? దీంతో పోలీసులు దుర్గను కూడా విచారించాలనుకోగా.. మూడు నెలల కిందట కనిపించకుండా పోయి మహిళ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. ఆమె మాట్లాడుతూ.. తనకు శశికాంత్‌తో పెళ్లి జరగలేదని సత్యప్రసాద్‌నే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు పిల్లలు లేరంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేగాక భర్తతో కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దుర్గ మొదటి భర్తతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ వచ్చారు. దుర్గను ఇంటికి రమ్మని అడిగారు. అయితే వాళ్లేవరో తనకు తెలియదంటూ దుర్గ తిట్టిపోసింది. మీడియా ముందే ఆమె ఇద్దరు భర్తలు దుర్గ తనదంటే తనదేనని వాగ్వాదానికి దిగారు. చివరికి. ప్రియుడు సత్య ప్రసాద్తోనే ఉంటానని దుర్గ తేల్చి చెప్పింది. ఇక ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. చదవండి: బండి సంజయ్‌కు రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు -
భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన టి.రవీందర్ (45), వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రవీందర్‌పై గతంలో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి..
సాక్షి, మరిపెడ(వరంగల్): ఆస్తికోసం దారుణం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి భర్తపై భార్య దాడిచేసింది. చితకబాది ఎడమచెవిని కోశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్‌సింగ్‌తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రూప్‌సింగ్‌తండాకు చెందిన గుగులోతు కోట్యా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని పేరుమీద ఉన్న మూడెకరాల భూమిని తమ పేరున చేయాలని భార్య విజయ, కుమారుడు పవన్ కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. వీరిమధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శనివారం కుమారుడి సహాయంతో భర్త కంట్లో కారం కొట్టి కత్తి, కర్రలతో దాడి చేసింది. ఎడమ చెవును కోశారు. కోట్యా భయంతో బయటకు పరుగుతీసి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈ విషయంపై మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో భార్య, కుమారుడిపై ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: కారాగారంలో కర్మాగారం -
అక్కను హతమార్చిన తమ్ముడు
సాక్షి, గుంటూరు: తోబుట్టువును సోదరుడే హతమార్చిన ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టాభిపురం ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి కథనం ప్రకారం మారుతీనగర్‌కు చెందిన కొవ్వూరి యేసు నగరంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తాడు. 30 సంవత్సరాల క్రితం తన అక్క సీతామహాలక్ష్మి కుమార్తె దానమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు. అయితే రెండు నెలల క్రితం యేసు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అనంతర కాలంలో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శనివారం భార్యాభర్తలు తారాస్థాయిలో గొడవపడడంతో సీతామహాలక్ష్మి ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. దీంతో కోపం పెంచుకున్న యేసు తెల్లవారు జామున ముందు గదిలో నిద్రిస్తున్న అక్క సీతా మహాలక్ష్మమ్మను పలుగుతో మెడపై నొక్కి హత్యచేశాడు. అనంతరం మరోగదిలో నిద్రిస్తున్న భార్య దానమ్మను హతమార్చేందుకు యత్నించాడు. దానమ్మ పెనుగులాడడంతో అలికిడికి పెద్ద కుమారుడు ఆదిసురేష్ నిద్రలేచి తండ్రిని అడ్డుకున్నాడు. తల్లీ, కుమారుడు ఇరువురు మరోగదిలోకి వెళ్లి తలుపులు వేసుకోని కేకలు వేయడంతో యేసు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): భార్యతో గొడవెందుకు కొడుకా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. పండుటాకు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఛాతి ఎడమ భాగంలో పొడవడంతో అక్కడికక్కడే కూప్పకూలి ప్రాణాలొదిలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల పరిధి లోని చింతచెట్టుతండా గ్రామపంచాయతీ జేత్యతండాకు చెందిన మూఢావత్ రవి వ్యవసాయం చేసుకుంటూ భార్య విజయ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మద్యానికి బానిసై.. రవి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మద్యం విషయంలోనే దంపతులు గొడవ పడ్డారు. తనను మద్యం తాగనీయకుంటే చస్తానని, కత్తి తీసుకుని ప్రాణం తీసుకుంటానని భార్యను బెదిరించాడు. పెద్దపెట్టున అరుస్తుండడంతో భర్త తీరుకు విసుగుచెందిన విజయ పిల్లలను తీసుకుని తండాలోనే బంధువు ఇంటికి వెళ్లింది. గొడవ పెట్టుకోవద్దని అన్నందుకు.. కాగా, మూఢావత్ రవి ఇంటి ఎదురుగానే ఇస్లావత్ బంగారి(60), భర్త చందుతో కలిసి జీవనం సాగి స్తోంది. వీరికి కుమారుడు, కుమార్తెకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, రవి తన భార్యతో గొ డవ పెట్టుకుండుడం విన్న బంగారి నచ్చచెప్పేందుకు అతడి ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవపెట్టుకోవద్దని, బాగా జీవించాలని చెప్పి ంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తితో ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. బంగారి ఛాతి ఎడమ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తాళ్లతో బంధించి.. రవి ఘాతుకానికి ఎదురుగా అరుగుపై కూర్చున్న బంగారి భర్తతో పాటు మరికొందరు హతాశులయ్యారు. వెంటనే వారు అక్కడికి వెళ్లే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి బంగారి ప్రాణాలు వది లింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మరికొందరు తండావాసులు నిందితుడు రవిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. బంగారి మృతదేహాన్ని రవి ఇంటి ఎదుట ఉంచి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేపట్టారు. బంగారి మృతి వార్త తెలుసుకున్న బంధువులు తండాకు చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. .తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రపోండు ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, వీరబాబు, శ్రీనయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు(మెదక్): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలు.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో..
న్యూఢిల్లీ: సాధారణంగా వైవాహిక జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహలు ఉండటం సహజమే. అయితే, ఈ మధ్యకాలంలో భార్యభర్తలు క్షణికావేశంలో ఒకర్నిమరోకరు హతమార్చుకుంటున్నసంఘటలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అమిత్ కుమార్, మిక్కి ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమిత్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వీరు సమయ్‌పూర బడ్లీలోని ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇతని సోదరుడు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉండేవాడు. కాగా, అమిత్ కుమార్‌కు.. మిక్కికి మధ్య కలహలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడు రోజులకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో భర్త.. గత సోమవారం భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను.. కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, సోదరుడు ఈరోజు (మంగళవారం) వెళ్లి సోదరుడికి ఫోన్ చేశాడు. ఎంతసేపటికి కాల్ ఆన్సర్ చేయకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత.. అతని ఇంటి తలుపుని తట్టారు. ఎంతసేపటికి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని అమిత్ ఇంటి తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ.. అమిత్, మిక్కి, ఇద్దరు పిల్లలు.. విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భార్యతో గొడవ.. మొబైల్ ఇంట్లోనే ఉంచి భర్త అదృశ్యం
సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కనిపించకుండా పోయిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్‌చారి(38), స్వాతిలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ప్రైవేట్ ఉద్యోగం చేసే ప్రభాకర్‌చారికి తాగుడు అలవాటు ఉంది. కాగా స్వాతి లాలాపేట్‌లో ఉండే తన తల్లి అనారోగ్యంగా ఉండటంతో పిల్లలను తీసుకుని ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఈ నెల 14న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని సామగ్రి కనిపించలేదు. ఈ విషయమై భర్తను ఆరా తీయగా తానే అమ్మేశానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రభాకర్ చారి తన మొబైల్‌ను ఇంట్లో ఉంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవ.. కుమారుడితో కలిసి భర్త అదృశ్యం..
సాక్షి, పటాన్చెరు(మెదక్): భార్యతో గొడవపడి ఓ భర్త, తన కుమారుడితో అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలానికి చెందిన ప్రసాద్ బతుకుదేరువు కోసం పటాన్చెరు జెపి కాలనీకి వచ్చాడు. కూలీ పనులు పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న భార్య సాయవ్వతో గొడవపడి తొమ్మిదేళ్ల కుమారుడు రామకృష్ణను తీసుకొని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వారి కోసం తెలిసిన వారు, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో సాయవ్వ పోలీసులను ఆశ్రయిచింది. సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
దంపతుల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
సాక్షి, పటాన్చెరు(హైదరాబాద్): భార్యతో గొడవపడి భర్త అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట్ గ్రామానికి చెందిన గణేష్ వృతిరీత్యా బార్బర్. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన గణేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో భార్య ఫోన్ చేయగా నేను ఇంటికి రావడం లేదని చెప్పి ఫోన్ స్వీచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గణేష్ బావమరిది సత్యనారాయణ ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..
చండీగఢ్: హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెంది ఒక గదిలో విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్ ప్రాంతంలో కలకలంగా మారింది. కాగా, కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగానే సాముహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతి చెందిన వారి ముఖాలపై, గొంతులపై కత్తిపోట్లు ఉన్నాయి. కాగా, కుటుంబ పెద్ద మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. చదవండి: Traffic Challan కమిషనర్ ఆఫీస్ ఎదుట బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం -
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. భర్త ఆత్మహత్య
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రాహుల్‌గౌడ్, సుందరయ్య నగర్‌కు చెందిన మౌనిక రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, శుక్రవారం భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన రాహుల్ గౌడ్ (27) శనివారం ఉదయం పురుగుల మందు తాగి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ తన వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇదివరకే మరణించగా ఉన్న ఒక్క కొడుకును కొల్పోవడంతో తల్లి అనాథగా మిగిలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: Tamilnadu: వివాహితతో ఇద్దరు యువకుల వివాహేతర సంబంధం.. -
మామను హత్య చేసిన అల్లుడు..
సాక్షి, హఫీజ్‌పేట్(హైదరాబాద్): అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూహఫీజ్‌పేట్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన షేక్ హఫీజ్(45) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తన కూతురు రెష్మా బేగంకు ఓమర్తో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న షేక్ హఫీజ్ తన కూతురు రెష్మా బేగంతో పాటు ఆమె ఇద్దరు కుమారులను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె మరో కుమారుడు తన తండ్రి ఓమర్ వద్ద హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో ఉన్నాడు. అయితే ఆదివారం ఉదయం తన మనవడిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. దీంతో ఓమర్ మామ హఫీజ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో కత్తితో తలపై నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఓమర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది -
తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు
ఓ మండలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి కూతురు ఉంది. ఇటీవల అత్త, మామ ఇంట్లో ఉంటున్నారని భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో ఉండేవారు. లాక్డౌన్ తర్వాత ఇద్దరూ జిల్లా కేంద్రానికి వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతను ఆటో నడిపేవాడు. భార్య ఓ దుకాణంలో పనిచేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో ద్వారా అశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో పాటు తరచూ అతను మద్యం తాగడం వల్ల గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ క్రైం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కాలంతో పాటు మనుషులు పరుగెడుతున్నారు. ఫలితంగా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పలుసార్లు మనస్పర్థలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్తున్నారు. మహిళలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని ఒక్కటి చేస్తున్నారు. మరికొందరు మాత్రం పట్టు విడవకుండా చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏడాది కాలంగా గృహహింస కేసులు పెరిగాయి. ఆనందోత్సాహాలతో అన్యోనంగా కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య క్షణికావేశాలు, భావోద్వేగాల కారణంగా పట్టు, విడుపులు లేని ధోరణి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే గోరంత సమస్యను కొండంతలుగా చేసుకుని విడిపోతున్నారు. పంతాలు, పట్టింపులకు పోయి తానేమీ తక్కువ కాదంటూ రాజీ పడకుండా ఆలోచన శక్తిని కోల్పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారి కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. దంపతులతో పాటు వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్న కుటుంబాల్లో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేక పక్కదారి పడుతున్నారు. (చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే) కౌన్సెలింగ్ సెంటర్‌తో భరోసా ఇలా చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చక్కదిద్దేందుకు, వివిధ రూపాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ విడిపోవాలనుకుంటున్న దంపతులకు సర్దుకుపోవాలంటూ వారిలో అనుబంధాన్ని పెంచేందుకు మహిళా పోలీస్‌స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ భరోసా ఇస్తోంది. విడిపోవాలనుకున్న దంపతుల్లో ఆశలు చిగురింపజేసి కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు సరైన మార్గనిర్దేశం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. (చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో) వందల సంఖ్యలో దంపతుల మధ్య వివాదాలు ప్రతినెలా వందల సంఖ్యలో ఠాణాకు వస్తున్నాయి. వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే హిందూ సంప్రదాయంలోనూ అనుబంధాలు బీటలు బారుతున్నాయి. ఇద్దరి మధ్య అవగాహనలోపం.. భార్యాభర్తల బంధం విలువ తెలియకపోవడంతో ఇటీవల కాలంలో పోలీస్స్టేషన్లకు ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయి. అందులో కొన్ని కౌన్సెలింగ్ ద్వారా సద్దుమణుగుతుండగా చాలా వరకు యువ జంటలు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దంపతుల మధ్య విభేదాలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటమే కారణమవుతోంది. ఎవరికి వారు ఒంటరిగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నందున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా అనుభవం ఉన్న పెద్దలు సర్దిచెప్పే అవకాశం ఉండేది. దీంతో అక్కడికక్కడే సమస్య పరిష్కారమై దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. అయితే ఉరుకులు, పరుగుల జీవితంలో పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే మనోధైర్యం లేక విడాకుల వరకు తీసుకెళ్తోంది. కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాం కౌన్సెలింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తాం. చిన్న సమస్యలతో కోపంగా మా వద్దకు కొందరు వస్తారు. వారి కుటుంబసభ్యులు కానీ, పెద్ద మనుషులతో కానీ మాట్లాడాలని చెబుతాం. చాలా కేసులు ఫిర్యాదుల వరకే ఉంటాయి. ఇటీవల పెళ్లయి నెల రోజులకే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు రావడం చూస్తుంటే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన భార్యాభర్తల సమస్యను మొదట గుర్తిస్తాం. దీనికి పరిష్కారం దొరికితే నిజాయితీగా కలుస్తారనుకుంటే కలపడానికి యత్నిస్తాం. ఇక ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మారరనే వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తాం. - హన్మప్ప, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ వివాదాలకు కారణాలివే ఆర్థిక సమస్యలు, భర్త మద్యానికి, ఇతర వ్యసనాలకు బానిస కావడం, వివాహేతర సంబంధాలు, దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి అనుమానం, అదనపు కట్నం, ఇరువర్గాల కుటుంబసభ్యుల అనవసర జోక్యం, ఇతర వేధింపులు కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం చదువుకున్న వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువ జంటలు భర్త తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుందోనని ముందే మానసికంగా ఇబ్బందిపడి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ గొడవలకు కారకులవుతున్నారు. -
పక్కా ప్లాన్.. భార్యకు మద్యం తాగించి దారుణం
లాలాపేట: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండి పార్టీవాడకు చెందిన శకత్వాల దర్శన్ ఈసీఐఎల్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య సౌందర్య(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉన్నారు. భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి సౌందర్య భర్త దర్శన్‌తో గొడవపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దర్శన్ మధ్యహ్నం పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో సౌందర్యను టవల్ సాయంతో గొంతు బిగించి హతమార్చాడు. నేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మైనర్ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!) -
సంతానం కలగడం లేదని.. భార్యను!
సాక్షి, నల్గొండ : సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14ఏళ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పరశురామ్ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: నోయిడాలో ఉద్యోగం.. స్వగ్రామానికి వచ్చి లాడ్జిలో.. వివాహేతర సంబంధం: మెడ నొక్కి.. పెట్రోల్ పోసి! -
లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు
సాక్షి, బహదూర్‌పురా: కుటుంబ కలహాల నేపథ్యంలో లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన హబీబ్ హష్మీ (52) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన హబీబ్.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు. పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్ ఇంట్లోకి వెళ్లి సాయంత్రం 5.45 గంటలకు లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్ హష్మీ వెంటనే కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం
కరీమాబాద్: భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆందోళనకు గురైన భర్త.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ గిరికుమార్ వివ రాల ప్రకారం.. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన జి.వనజ– హరికృష్ణ మూడేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. హరికృష్ణ మద్యానికి బానిసై తరచూ భార్యను కొడుతూ వేధిస్తుండటంతో మిల్స్‌కాలనీ పోలీసులకు ఆమె ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా, ఆందోళనకు గురైన హరికృష్ణ శనివారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి తనతో తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా, కానిస్టేబుల్ రఘుపతిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా, అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: ప్రాణం తీసిన దీపం) -
మార్చి 5 లోగా రూ.5 లక్షలు ఇవ్వాలి.. లేదంటే
సాక్షి, హైదరాబాద్: విడాకులు తీసుకునే సమయంలో భార్యకు భరణంగా ఇస్తానన్న డబ్బు ఇవ్వని భర్తపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 5లోగా భరణంలో కొంత భాగం రూ.5 లక్షలు చెల్లించాలని లేకపోతే భర్తకు చెందిన ఆస్తులను వేలం వేయిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సూర్యాపేటకు చెందిన ఎ.లక్ష్మీతులసి, మహబూబ్‌నగర్ పట్టణంలోని షాషాబ్‌గుట్ట ప్రాంతానికి చెందిన ఎ.సురేందర్ భార్యాభర్తలు. వీరి మధ్య విభేదాలు రావడంతో 2006లో ఫ్యామిలీ కోర్టు వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ లక్ష్మీతులసి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ సమయంలో భార్యకు భరణంగా రూ.10 లక్షలు ఇస్తానని సురేందర్ పేర్కొన్నారు. 2006లో విడాకులు మంజూరైన సమయంలో తమకు ఏడాది, మూడేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారు పెద్దవాళ్లు అయ్యారని, ఈ నేపథ్యంలో భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ లక్ష్మీతులసి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. రూ.40 లక్షలు, తనకున్న భూమిలో కొంత భాగాన్ని పిల్లల పేరుతో రిజి స్ట్రేషన్ చేస్తానని గత విచారణ సమయంలో చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని లక్ష్మీతులసి ధర్మాసనానికి నివేదించారు. మహబూబ్‌నగర్ శివార్లలోని పాలకొండలో సురేందర్‌కు దాదాపు 7 ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం ఎకరా కోటి రూపాయల వరకు ధర పలుకుతోందని తెలిపారు. అలాగే వారసత్వంగా ఒక ఇంటిలో కొంత భాగం కూడా సురేందర్‌కు వచ్చిందని, ఇంత ఆస్తి ఉన్నా తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ భూముల విలువతోపాటు సురేందర్‌కు వచ్చే ఇంటి భాగం విలువ ఎంతుందో తెలుసుకొని తమకు నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్‌ను గత ఏడాది డిసెంబర్లో ఆదేశించింది. ఇటీవల ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. అయితే ఇప్పటికీ సురేందర్ డబ్బు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, మార్చి 5లోగా డబ్బు జమ చేయకపోతే ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరిస్తూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. చదవండి: 22 నుంచి హైకోర్టులో భౌతిక విచారణ నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు -
ప్రాణం తీసిన పాత కక్షలు
భవానీపురం(విజయవాడ పశి్చమ): బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతి చెందిన ఘటన విద్యాధరపురం చెరువు సెంటర్లోని రాములవారి గుడిపైగల కొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసులు, ఫిర్యాదుదారు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... ఊరి్మళానగర్ పోలేరమ్మ గుడి వద్దగల న్యూ ఫ్లేమ్ ఏజెన్సీలో గ్యాస్ వెల్డర్‌గా పని చేస్తున్న సగల శ్రీను తల్లిదండ్రులు, వడ్రంగం పని చేస్తున్న సోదరుడితో కలిసి స్థానిక చెరువు సెంటర్లోని రామాలయం కొండపైన నివసిస్తున్నారు. అతని తల్లి కనకరత్నం సమీప బంధువులైన రామిశెట్టి సతీష్, సగల యేసు తరచూ శ్రీను కుటుంబంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్రీను తమ్ముడు భాస్కర్ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా చెరువు సెంటర్ దగ్గరకు వచ్చే సరికి సతీష్ అతనిని దుర్భాషలాడుతూ కొట్టాడు. భాస్కర్ ఇంటికి వెళ్లి తల్లి కనకరత్నంతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఆమె భాస్కర్‌ను తీసుకుని కిందకు వెళ్లి భాస్కర్‌ను ఎందుకు కొట్టావని నిలదీసింది. సతీష్ ఆమెను కూడా దుర్భాషలాడుతూ నిన్ను, నీ కొడుకును ఎప్పటికైనా చంపేస్తానని బెదిరించాడు. కొండపై నుంచి తోసేశారు అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సతీష్, యేసు.. శ్రీను ఇంటి దగ్గరకు వచ్చి అసభ్యంగా తిట్టటం మొదలు పెట్టారు. శ్రీను, తల్లి కనకరత్నం బయటకు వచ్చి వారిని వెళ్లిపొమ్మని చెప్పినా వినకుండా గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిద్దరూ తల్లీ, కొడుకులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కనకరత్నంను కొండపై నుంచి తోసేయడంతో ఆమె దాదాపు 30 అడుగుల కింద ఉన్న డ్రెయినేజి గట్టుపై పడిపోయింది. దీంతో ఆమె తలపగిలి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ జె. మురళీకృష్ణ, ఎస్ఐలు ఎంవీవీ రవీంద్రబాబు, జె. కవితశ్రీ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తల్లిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పైనుంచి తోసేశారని, ఆమె చావుకు కారణమైన సతీష్, యేసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సతీష్, యేసులను అదుపులోకి తీసుకుని వారిపై హత్య కేసును నమోదు చేశారు. -
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం
సాక్షి, కర్నూల్: జిల్లాలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంటి నుంచి బయల్దేరి వాకింగ్‌కు వెళ్లిన కొడుకుపై తండ్రి కత్తులతో దాడిచేసిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హర్షవర్ధన్ అనే యువకుడు తీవ్రగాయాల పాలవ్వగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి శ్రీనివాస ఆచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి!
సాక్షి బయ్యారం : ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సత్తమ్మ బయ్యారం జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ బయ్యారంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఉంటోంది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లో భార్యతో కలసి నివాసం ఉండే కుమారుడు ప్రశాంత్(30) తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. చదవండి: ఫీజు చెల్లించలేక తనువు చాలించింది అయితే వీరికి మహబూబాబాద్‌లో ఓ ఇల్లు ఉండగా దానిని అమ్మేసి హైదరాబాద్‌కు వెళ్లిపోదామని ఇటీవల ప్రశాంత్ తన తల్లితో వాదన పెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించకపోవటంతో ప్రశాంత్ సోమవారం..తల్లి లేని సమయం చూసి భార్యను వేరే గదిలో ఉంచి గడియపెట్టాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఫ్యానుకు ఉరివేసుకుంటున్న దృశ్యాలను బంధువులకు పంపించి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ భార్య ఆరునెలల గర్భవతి కాగా.. కుటుంబసభ్యులు మంగళవారం శ్రీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలా జరగడం అందరిలోనూ విషాదం నింపింది. -
చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి
సాక్షి, సంగారెడ్డి: ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి చెరువులో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆదివారం ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారిని గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. పాప మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా చంపి చెరువులో పడేశారా, లేక తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
-
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో విషాదం చోటు చేసుకొంది. కుటుంబ కలహాలతో గౌతమి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. బాలాజీ నగర్ సమీపంలోని నీటి గుంటలలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ధరణి (4), తోనేశ్వర్ (3)ను నీటి గుంటలోకి తోసేసి తర్వాత తాను దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ కలహాలే కారణం అని స్థానికులు చెబుతున్నారు. గౌతమి భర్త వెంకటరమణ వీఆర్వోగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతి పొందాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవి ఏఎన్ఎంగా పనిచేస్తోంది. రెండో భార్య గౌతమి గృహిణి. అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇటీవల కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో గౌతమి తన ఇద్దరు కుమారులతో కలసి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
-
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన నగర్లో విషాదం నెలకొంది. ఓ వివాహిత మూడేళ్ల కుమారుడిని చంపి తానూ ప్రాణాలు తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గుళ్లం మమతా అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుమారుడు రియాన్ష్ కుడిచేతిని కత్తితో కోయడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు మృతి చెందాడు. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి మమత దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మమత సొంతూరు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికిగా తెలిసింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. (చిన్నారులపై పిడుగు) -
దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్) : కూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్పల్లి హాసాకొత్తూర్‌లోని మారుతినగర్లో నివాసముండే తన కూతురు ఇరుగదిండ్ల నీలా ఇంటికి శనివారం వెళ్లాడు. తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు ఇరగదిండ్ల రాములు(45), వియ్యంకురాలు రేణుకను కోరాడు. కొడుకు ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పారు. (ఆ గ్రీన్జోన్లో 21 మందికి కరోనా పాజిటివ్! ) దీంతో కోపోద్రిక్తుడైన బోదాడు రాజెం వారిని బెదిరిస్తూ కూతురుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాములు అతని భార్య అడ్డు చెప్పగా గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాజెం అక్కడే ఉన్న కర్రతో రాములును మోచాడు. తలకు బలమైన గాయం కావడంతో కింద పడిపోయాడు. కొడుకు మిరేష్ ఘటనా స్థలానికి చేరుకొని తండడ్రిని నిజామాబాద్ ఆస్పతత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాములు మరణించాడు. మిరేష్ ఫిర్యాదు మేరకు బోదాసు రాజెంపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (కరోనా వ్యాక్సిన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ) -
కూతురిని పూడ్చి పెట్టి.. తల్లి ఆత్మాహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాలు.. పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత అనే మహిళ.. తన భర్త, 18 నెలల కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కుంటుంబ కలహాలతో కుసుమలత తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చిన్నముషిరివాడ వుడా కాలనీ కొండలమీద నుంచి ఓ మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కొండ ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పింది. ఈ క్రమంలో కొండపైన పోలీసులు గాలిస్తుండగా.. ఎర్ర కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి, తండ్రి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళ ఆత్మహత్య ప్రయత్నం విఫలమవడంతో శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. -
తమ్ముడిని హతమార్చిన అన్న
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో తల్లిదండ్రులపై కత్తితో దాడికి ప్రయత్నించిన తమ్ముడిని అడ్డుకోబోయిన అన్న అదే కత్తితో సోదరుడిని హతమార్చాడు. తీవ్ర రక్తస్రావమైన తమ్ము డు శివకుమార్ (30) మృతి చెందాడు. కన్నాపూర్‌కు చెందిన పొట్టవత్తిని గంగారాం, రాజేశ్వరిల చిన్నకుమారుడు శివకుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మానసిక పరి స్థితి బాగలేక తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో ఆదివారం శివకుమార్ కన్నాపూర్‌కు వచ్చాడు. తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించడంతో వారు సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 9గంటల ప్రాంతంలో శివకుమార్ మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులపై కత్తితో దాడి చేయగా.. అక్కడే ఉన్న సోదరుడు సతీశ్ అడ్డుకున్నాడు. శివకుమార్ సతీశ్‌పై కూడా కత్తితో దాడికి పాల్పడగా.. అప్రమత్తమైన శివకుమార్ నుంచి కత్తి లాక్కొని దానితోనే దాడి చేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ జగిత్యాలరూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
మొదటి భార్యను మర్చిపోలేక దారుణం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త భార్యను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ నగర్లో నివాసముంటున్న వెంకటేశ్, స్వప్నకు మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే, 15 ఏళ్ల క్రితమే వెంకటేశ్‌కు మరో మహిళతో వివాహమైంది. దీంతో మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేశ్ తరచూ స్వప్నతో గొడవకు దిగేవాడు. మొదటి భార్య కారణంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్ స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో పాటు రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆందోళనకు గురైన వెంకటేష్ భార్యను చంపిన వెంటనే తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్, స్వప్న మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి -
భార్య కాపురానికి రావడం లేదని..
సాక్షి, పశ్చిమగోదావరి : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఎదుటే గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు.. భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో.. ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. భార్య తనతో కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితున్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!
సాక్షి, నిజామాబాద్ : కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కర్కశంగా మారాడు. ముక్కుపచ్చలారని ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు.. తండ్రి విజయ్ తుల్జారాం, కొడుకు దినేష్ రాజస్తాన్ వాసులుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, కల్లూరు: కుటుంబ కలహాల వల్ల మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కల్లూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు (32) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పురుగు మందు తాగి మృతి చెందాడు. వెంకటేశ్వర్లు కులాంతర వివాహం చేసుకుని ఖమ్మంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. శివరాత్రి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కల్లూరు వచ్చారు. బుధవారం రాత్రి వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె మొదటి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం భార్య, భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య సౌజన్య ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. ఆమెను వెంటనే కల్లూరులోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కప్పలబంధం రోడ్ సమీపంలో శ్మశాన వాటిక దగ్గర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వెళ్తున్న హోమ్‌గార్డు గమనించి కొన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. -
తల్లి, కుమార్తె ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి, కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ఏసీనగర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరానికి చెందిన కన్నప్ప, రాజేశ్వరమ్మ దంపతులు. వీరికి శారద (35) కుమార్తె ఉంది. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి కొంతకాలం తర్వాత మృతి చెందాడు. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో అప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది. 2004లో శారద అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి నీలిమ (13), గణేష్ ఇద్దరు పిల్లలు ఉనానరు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 2010లో ఇద్దరు విడిపోయారు. శారద తన ఇద్దరి పిల్లలను పెట్టుకుని ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తిరుపతి కిరణ్ అలియాస్ చందుతో ఆమెకు పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందట వారు ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. తొలి రోజుల్లో అపోలో హాస్పిటల్ సమీపంలో, ఆ తర్వాత బాలాజీనగర్ సీపీఎం కార్యాలయం సమీపంలో నివాసం ఉండేవారు. రెండేళ్ల కిందట ఏసీనగర్ çశానిటరీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో చేరారు. నీలిమ, గణేష్‌లను మల్లెల సంజీవయ్య స్కూల్లో 8, 6వ తరగతుల్లో చేర్పించారు. ఆటో, ఇతర పనులు చేసి వచ్చిన సంపాదనతో పిల్లలను చదివించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తరచూ శారద బంధువులు ఇంటికి వచ్చి ఆమె యోగక్షేమాలను తెలుసుకుని వెళ్లేవారు. అప్పుల బాధలు పెరగడంతో.. కిరణ్‌కుమార్ (ఫైల్) కిరణ్ కొంతకాలం కిందట తెలిసిన వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అవి తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ విషయమై కిరణ్, శారద మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి సమయంలో శారదకు చెప్పకుండా కిరణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శారద అతని కోసం గాలించింది. కిరణ్ తిరుపతిలోని అతని తల్లిదండ్రుల వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడి వెళ్లి తిరిగి రావాలని ప్రాధేయపడింది. అతను నిరాకరించాడు. ఇటీవల అతను అక్కడ నుంచి కూడా కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులిచ్చిన వారు శారదపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శారద పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కిరణ్ కనిపించకపోవడంతో అతని తండ్రిని పిలిచి విచారించారు. అతను అప్పులన్నింటిని తానే కడుతానని అంగీకరించడంతో సమస్య సర్దుమణిగింది. తిరుపతికి వెళ్లదామని చెప్పి.. శారద శనివారం రాత్రి తిరుపతికి వెళ్లదామని స్కూల్ నుంచి వచ్చిన కుమార్తె, కుమారుడికి తెలియజేసింది. అనంతరం ముగ్గురూ కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. గణేష్ మూత్ర విసర్జన చేయాలని తల్లికి చెప్పడంతో పక్కనే ఉన్న బాత్రూమ్కు వెళ్లమని చెప్పింది. గణేష్ అటు వెళ్లిన వెంటనే శారద కుమార్తె నీలిమను తీసుకుని ఇంటికి వచ్చేసింది. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన గణేష్ తల్లి, అక్క కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. అప్పుడే రైలు వెళ్లడంతో తనను వదిలి తిరుపతికి వెళ్లిపోయి ఉంటారని ఏడుస్తూ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్నాడు. గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని తమ వెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారించగా జరిగిన విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం వరకు పోలీసులు అతన్ని తమ వద్దనే ఉంచుకుని స్కూల్ ప్రాధానోపాధ్యాయురాలు హైమావతికి సమాచారం అందించారు. ఆమె రైల్వేస్టేషన్‌కు చేరుకుని గణేష్‌ను తీసుకుని అతని ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఉన్నారేమో చూడమని గణేష్‌ను లోపలికి పంపగా తలుపు నెట్టడంతో తెరుచుకున్నాయి. పడక గదిలో తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేళాడుతూ, అక్క మంచంపై మృతి చెంది ఉన్నారు. ఈ విషయమై స్థానికులు బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మరో కేసు విచారణలో ఉండటంతో సంతపేట ఇన్స్పెక్టర్ సీహెచ్ కోటేశ్వరరావు, బాలాజీనగర్ ఎస్సై ఏడుకొండలులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శారద మృతదేహాన్ని కిందకు దించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే శారద తొలుత తన కుమార్తెకు విషం ఇచ్చి ఆపై ఉరేసి, మృతి చెందిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువుల వివరాలను సేకరించి వారికి సమాచారం అందించారు. మృతురాలి పెద్దమ్మ కుమారుడు షణ్ముగణం, బంధువులు హుటావుటిన నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్న షణ్ముగం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతురాలి సెల్‌ఫోను, కిరణ్ సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్స్వాడ్ ఘటనా జరిగిన ప్రాంతంలో కలియ తిరిగింది. మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భర్త, పిల్లల మృతి
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కె.కోటపాటు మండలం చంద్రయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. వివరాలు.. అనంతగిరి మండలానికి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చంద్రయ్యపేటలోని ఓ కోళ్లఫారంలో గత 6 నెలలుగా పని చేస్తున్నారు. నిన్న రాత్రి (శనివారం) కోళ్లఫారం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో చిన్న, చింటూ, వీణలు అక్కడికక్కడే మృతి చెందగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి విశాఖపట్నం తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
కుమార్తెతో పాటు దంపతుల ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూర్మల్ గూడ గ్రామంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకొని మృతి చెందారు. మృతులు వడ్డె హనుమంతు, చంద్రకళ, మంజుల(9)గా గుర్తించారు. మృతుడు హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు సమాచారం. ఇటీవల గొడవ జరగడంతో మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఇంటినుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. భయంతోనే రెండో భార్య, కుమార్తెతో కలిసి హనుమంతు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
తాగుడుకు బానిసై హోంగార్డు మృతి
కల్హేర్(నారాయణఖేడ్) : ఒ హోంగార్డు కుటుంబ కలహాల కారణంతో కావాల్సిన వారు దురం కాగా విధులకు వెళ్లకుండా తాగుడుకు బానిసై చివరకు ఇంట్లోనే మరణించాడు. వివరాల్లోకి వెళితే కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన సార పాండురంగగౌడ్ కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి స్వగ్రామం బీబీపేటలో స్వంత ఇంట్లో పాండురంగగౌడ్ శవమై కనిపించాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన చుట్టుపక్కల వ్యక్తులు ఇంటి తలుపులు తెరిచి చూశారు. పాండురంగా గౌడ్ మృతిచెంది ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోవడంతో వాసన వెదజల్లింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్‌లో పుట్టింటిలో ఉంటున్న మృతుడి భార్య కల్పనకు గ్రామస్తులు సమచారం ఇచ్చారు. కల్హేర్ ఎస్ఐ సాయిరాం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. మృతుడు పాండురంగగౌడ్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాండురంగగౌడ్ మృతితో బీబీపేటలో విషాధఛాయలు అలుముకున్నాయి. అతిగా మద్యం తాగడంతో రెండు రోజుల క్రితం మరణించి ఉండోచ్చని ఎస్ఐ సాయిరాం తెలిపారు. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
నాగర్‌కర్నూల్ రూరల్ : కలహాలు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి, కూతురు మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భూషయ్య, మహాదేవి(30) అలియాస్ మాధవి భార్యాభర్తలు.. వీరికి అచ్యుత, మౌనిక(4నెలలు) కూతుళ్లు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందు తాపి తాను తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా తల్లి మహాదేవితో పాటు ఆమె కూతురు మౌనిక ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారి అచ్యుత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాధితులుగా మారుతున్న అత్తలు
తెలుగు సినిమాలు, సీరియల్స్ ప్రభావం అనుబంధాలపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు కోడలు అంటే బానిస అని.. పనిచేయడానికే వచ్చిందని భావించి అత్తలు పెత్తనం చెలాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులకు కాలం చెల్లింది. పెత్తనాన్ని సహించేందుకు ఇప్పటి కోడళ్లు సిద్ధంగా లేరు. చట్టాలు కావచ్చు.. మారిన ఆర్థిక పరిస్థితులు, సమాజంలో వస్తున్న మార్పు ఇందుకు కారణం కావచ్చు. ఒకప్పుడు అత్త చేతిలో తన్నులు తిని ఆడబిడ్డపై ఫిర్యాదు చేస్తూ తన సంసారాన్ని కాపాడాలని కోడళ్ల బాధలు పోలీస్స్టేషన్లలో వినబడేవి. ఇప్పుడు నిశితంగా గమనిస్తే కోడలు కూడు పెట్టడం లేదని, కొడుకు కూడా ఆమె మాటే వింటున్నాడని ఆస్తులన్నీ లాక్కున్నారని నగరం నుంచి మొదలు మండల స్థాయి పోలీస్స్టేషన్లలో వారానికి ఒక ఫిర్యాదైన అందుతోంది. ప్రభుత్వం ఇటువంటి కేసుల కోసం ఆర్డీఓ కోర్టులను ఏర్పా టు చేసింది. మన జిల్లాలో వందకు పైగా ఫిర్యాదులు ఈ కోర్టులోకి వచ్చాయి. అంటే పరిస్థితి ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మహిళా సంఘాల బాధ్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు అత్తల బాధితుల తరఫున పోరాడేవారమని, ప్రస్తుతం పరిస్థితి మారి కోడళ్ల బాధితుల తరఫున కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. దీనికి వారు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇలా ఉన్నాయి. చెన్నారావుపేట వరంగల్ : ఒకప్పుడు ఇంట్లో అత్త పెత్తనం సాగేది. అత్త అంటేనే కోడలుకు వణుకు..! ఇప్పుడు సీన్ రివర్సయింది. వచ్చిన చట్టాలు కావచ్చు.. మారిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు.. గత ఐదేళ్లలో చాలా మార్పు వచ్చింది. అత్త పెత్తనానికి చెక్ పడింది. ఇటీవల కాలంలో కోడళ్ల ప్రవర్తన ఆశ్చర్యానికి తావిస్తోంది. దీనికి సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా తోడవుతోంది. టీవీ సీరియల్స్‌లో కేవలం అత్తలను విలన్లుగా చూపించడంతో బాధితులుగా మారుతున్న వారి ఉదాంతాలు వెలుగులోకి రావడం లేదని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. కోడళ్లు కూడా బాధ్యతగా ఉంటేనే భారతీయ సంస్కృతికి వారసులమవుతామని గుర్తించాలి. ప్రేమ, ఆప్యాయతలు తగ్గాయి.. అప్పటి రోజులకు, ఇప్పటి రోజులకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రేమ, అప్యాయతులు చాలా తగ్గాయి. అత్తాకోడళ్ల మధ్య ఆప్యాయతలు పెరగాలంటే ముందుగా సహనం కలిగి ఉండాలి. చెప్పే మాటలు ఓపిగ్గా విని అర్థం చేసుకున్నప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ మీడియా ప్రభావం, సెల్‌ఫోన్, సీరియల్స్, ఉద్యోగ బాధ్యతలు తదితర కారణాలతో కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఓపిక లేక కుటుంబ కలహాలకు దారి తీస్తుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వారి కోసం వరంగల్‌లో వన్‌స్టాప్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అందులో లీగల్ కౌన్సిలర్, సోషల్ కౌన్సిలర్, మెడికల్ సఫోర్ట్, ఆర్థిక సాయం, తాత్కాలిక నివాసం లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 170 కేసులు రాగా అందులో సుమారుగా 80 వరకు పరిష్కారమయ్యాయి. - సబిత, జిల్లా సంక్షేమ అధికారి సీన్ రివర్స్.. ఇక్కడ కొడుకుల ప్రమేయం ఉంది. ఒకప్పుడు తల్లులకు మద్దతుగా నిలిచిన కొందరు కొడుకులు.. ఇప్పుడు భార్యలకు మద్దతు పలుకుతున్నారు. కారణం చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నేను, నా భార్య, నా పిల్లలు అనే భావనకు వచ్చారు. దీంతో భార్య చూస్తే సరే.. లేదంటే వృద్ధాశ్రమానికి తల్లిదండ్రులను పంపుతున్నారు. భార్యకు నచ్చ చెప్పుకుని కన్నవారిని బాగా చూసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల పోలీస్‌స్టేషన్ బాట పడుతున్న అత్తలు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. మితిమీరిన పెత్తనమే కారణం.. సమాజంలో చాలా మంది సంతోషంగా బతుకుతుంటే తాము మాత్రం ఎందుకిలా బానిసలుగా బతుకలన్నా ధోరణీ కోడళ్లలో పెరిగి తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీస్స్టేషన్లలో పెరుగుతున్న ఫిర్యాదులే సాక్ష్యం. అత్తల మితిమీరిన పెత్తనం వారి బతుకులను రోడ్డున వేయడమే కాకుండా కుటుంబాల పరువును కూడా తీస్తుంది. అత్త చెప్పిందల్లా వినాలనే పరిస్థితి ఇప్పుడు లేదు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ప్రతి మహిళా తన భర్తతో సొంతోషంగా గడపాలని, పిల్లలకు నచ్చిన వాటిని అందించాలని, వారి కోర్కెలను తీర్చాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో అత్తలు సహకరించకపోతే తిరుగుబాటుకే కాదు హత్యలకు కూడా వెనుకాడటం లేదు. మార్పులు తెచ్చిన చట్టం.. కోడళ్ల తరుపున కేంద్ర ప్రభుత్వం గృహ హింస చట్టం తెచ్చింది. దశాబ్దకాలానికి పైగా వచ్చిన ఈ చట్టం ఊహించని మార్పులు తెచ్చింది. అప్పటి వరకు పెత్తనం చెలాయించిన అత్తలు ఈ చట్టం దెబ్బకు నోళ్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ కారణం చేతనైన ఇంటి కోడలు అత్తింటి వారిపై వరకట్నం పేరుతో వేధించినా, ఏ ఇతర కారణమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. అత్త, మామ, ఆడపడుచూతో సంబంధికులను అరెస్ట్ చేస్తున్నారు. బెయిల్ కూడా రాకుండా కఠినంగా చట్టం అమలు చేయడంతో పరిస్థితి ఈ విధంగా వచ్చింది. ఏమంటే కోడలు ఎక్కడ ఫిర్యాదు చేస్తుందోనని నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ఈ క్రమంలో కోడలు తప్పులు ఉన్న చెప్పుకోలేని పరిస్థితిల్లో అత్తలు పడిపోయారు. దీంతో దశాబ్దాలుగా క్రమంగా వచ్చిన మార్పు ఏడాదిలో అత్తలను బానిసలుగా మార్చేసింది. ఆర్థిక స్వాతంత్య్రం.. ఇటీవల కాలంలో మహిళలు ఉన్నత చదువులు చదవి చైతన్యవంతులయ్యారు. అన్ని సమాజిక వర్గాల్లోను సాప్ట్వేర్ లేదా మరే ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొంది ఆర్థికంగా వెసులుబాటు పొందుతున్నారు. దీంతో అత్త ఇచ్చే సంపాదనపై ఆధారపడలేక పోవడం, ఆమె పెత్తనాన్ని సహించలేక ఎదురు తిరగడం ప్రారంభించారు. ఇది వృద్ధాప్యంలో వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడి కోడలు చూడక, కొడుకు గెంటేయడంతో స్టేషన్ల బాట పడుతున్నారు. బాధ్యతలు పంచుకోవాలి.. ఇటీవల కాలంలో కోడళ్ల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తోంది. కేవలం అత్తింట్లో హక్కుల సాధనకే చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ భారతీయ సంస్కృతిలో అత్త మామలను చూడడం కూడా కోడళ్ల బాధ్యతే. కానీ దానిని మరుస్తున్నారు. దీనికి సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా తోడవడం సమస్య మరింత పెరగడానికి కారణమవుతోంది. కేవలం అత్తలను విలన్లుగా చూపించడంతో బాధితులుగా మారుతున్న వారి ఉదంతాలు వెలుగులోకి రావడం లేదు. కానీ సమాజంలో కనబడకుండా ఈ సమస్య చాపకింత నీరులా పెరుగుతోంది. కోడళ్లు కూడా బాధ్యతగా ఉంటేనే భారతీయ సంస్కతికి వారసులమవుతాం. - గోగుల సృజనారెడ్డి, సైకాలజిస్ట్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారుసమాజంలో ఉన్న వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి భారత సర్కారు 1983లో భారత శిక్షాస్మృతిలో 498-ఏ సెక్షన్ ప్రవేశపెట్టింది. నేడు అదే సెక్షన్(498-ఏ) కుటుంబ విలువలకు నష్టం కలుగచేస్తూ..మహిళల రక్షణ కోసం వినియోగించాల్సిన చట్టాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో కుటుంబ విలువలకు నష్టం కలుగుతుంది. ఈ చట్టం వల్ల రక్షణ అటుంచి కుటుంబ సభ్యులను, అత్తమామలను వేధించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో చట్టం లక్ష్యం నెరవేరడం లేదు. అంతేకాకుండా తల్లిదండ్రులు కష్టపడి చదివించి ప్రయోజకులను చేస్తే వారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తూ అనాథలుగా మారుస్తున్నారు. నేటి సమాజంలో ఇటువంటి దుస్థితికి అడ్డుకట్ట వేయడానికి సుప్రీం కోర్టు సీనియర్ సీటిజన్ ప్రొటెక్షన్ చట్టం ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం ఆర్డీఓ నేతృత్వంలో కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారో వారిపై ఆర్డీఓ కోర్టులో ఫిర్యాదు చేయాలి. విచారించి 90 రోజుల్లో ఆర్డీఓ కోర్డు ద్వారా తల్లిదండ్రులకు జీవన భృతిని తమ పిల్లల నుంచి ఇప్పిస్తుంది. - కొడిదల శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారానికి మూడు, నాలుగు కేసులు వస్తున్నాయి..భార్యభర్తల పంచాయితీలు, అత్తాకోడళ్ల గొడవలు వారానికి మూడు నాలుగు కేసులు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నాయి. దాదాపుగా స్టేషన్లోనే కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేస్తున్నాం. సమస్య తీవ్రంగా ఉంటే వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నాం. - కూచిపూడి జగదీష్, ఎస్సై -
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
భువనగిరి క్రైం : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన తల్లి పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనతో పాటు ముగ్గురి పిల్లలకు పురుగుల మందు తాగించింది. స్పందించిన స్థాని కులు వెంటనే 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో గురువా రం జరిగింది. భువనగిరిరూరల్ పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డినాయక్ తండాకు చెందిన భూక్య రెడ్డినాయక్ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య భారతి ఇంటివద్ద ఉంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పల్లవి, ఉదయ్, వైష్ణవిలు. వీరు స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. గతంలో దంపతులిద్దరూ గొడవ పడగా భారతి తన పుట్టినిల్లు అయిన మేడ్చల్ జిల్లా రాజుబొల్లారంతండాకు వెళ్లిపోయింది. ఇటీవల రెడ్డినాయక్ రాజుబొల్లా రం వెళ్లి తన భార్యను తిరిగి రెడ్డినాయక్ తండాకు తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి మళ్లీ భార్యాభర్తకు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి గురువారం పిల్లలను పాఠశాలకు కూడా పంపించలేదు. మధ్యాహ్నం సమయంలో పిల్లలను తీసుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్లి ముగ్గురు పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించి తాను కూడా తాగింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి క్రిమిసంహారక మందు తాగినట్టు చె ప్పింది. భారతి తండ్రి వెంటనే రెడ్డినాయక్ తండాలోని భారతి ఇంటి పక్క వాళ్లకు సమాచారం అం దించాడు. సమాచారం తెలుసుకున్న ఇంటి పక్క వాళ్లు వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వా రిని చూసి 108కి సమాచారం అందించారు. 108 వచ్చే లోపే ద్విచక్ర వాహనాలపై వారు నలుగురిని తీసుకుని అనాజీపురం గ్రామం వద్ద 108కి ఎదురుగా వెళ్లి ఎక్కించారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు వారిని ఉప్పల్‌లోని ఓప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భారతి ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఏస్ఐ సాగర్‌రావు తెలిపారు. -
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్
తలకొండపల్లి(కల్వకుర్తి): పిల్లల సెల్‌ఫోన్ గొడవ ఏకంగా ఓ ప్రాణాన్ని తీసింది. పిల్లల కొట్లాటలో పెద్దలు కలుగజేసుకోవడంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ గొడవలో గాయపడిన వ్యక్తి నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని వెల్జాల్లో చోటు చేసుకుంది. వివరాలు ఎస్సై సురేష్‌యాదవ్ కథనం ప్రకారం.. వెల్జాల్ గ్రామానికి చెందిన మంద అంజయ్య(42), మంద రాములు స్వయానా అన్నదమ్ములు. వారి కుటుంబాలతో వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో అంజయ్య ఇంటికి ఆయన తమ్ముడి కూతురు శ్రీవాణి వచ్చి అంజయ్య కొడుకును ఏడ్పించసాగింది. దీంతో కోపం వచ్చిన అంజయ్య భార్య పార్వతమ్మ వచ్చి తమ్ముడిని ఎందుకు ఏడిపిస్తున్నావని శ్రీవాణిని నిలదీసింది. దీంతో ఆవేశానికిలోనైన శ్రీవాణి అక్కడున్న సెల్‌ఫోన్‌ను తీసుకొని గోడకేసి బలంగా కొట్టడంతో పగిలిపోయింది. అప్పుడే ఇంటికొచ్చిన అంజయ్యకు సెల్‌ఫోన్ పగిలిన విషయం గురించి భార్య పార్వతమ్మ చెప్పింది. కోపోద్రిక్తుడైన అంజయ్య పగిలిన సెల్‌ఫోన్ మనకెందుకు ఆ ఫోన్‌ను వారికి ఇచ్చిరమ్మని భార్య పార్వతమ్మను తన తమ్ముడు రాములు ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లగానే రాములు భార్య సుమిత్ర.. పార్వతమ్మతో గొడవ పడింది. పైగా పార్వతమ్మను నానా మాటలతో తిట్టి పోసింది. విషయం తెలుసుకున్న అంజయ్య కూడా అక్కడికి వచ్చాడు. అంజయ్య రాగానే తమ్ముడు రాములు కూడా రంగంలోకి దిగాడు. భార్యాభర్తలు(రాములు, సుమిత్ర) ఇరువురు కలిసి అంజయ్యను తిట్టారు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో తమ్ముడు రాములు తన అన్న అంజయ్య గొంతు పట్టుకుని గోడకు బలంగా కొట్టాడు. అంజయ్య తలకు బలమైన దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. మెరుగైన చికిత్స నిమిత్తం అంజయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ అంజయ్య గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి కేస్ వివరాలు తెలుసుకున్నారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా..
విజయనగరం లీగల్ : ఇద్దర సోదరుల మధ్య ఆస్తి తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. మనస్తాపానికి గురై స్థానిక గౌడవీధికి చెందిన బండారు పైడి వెంకటేశ్వరరావు (51) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి టూటౌన్ ఎస్సై అశోక్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మూడు లాంతర్ల సమీపంలో వెంకటేశ్వరరావు పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల కిందట అతని తల్లిదండ్రులతో పాటు భార్య, పెద్ద కుమార్తె మృతి చెందారు. అనంతరం సోదరుడు వాసు ఆస్తి పంచాలంటూ తరచూ వేంకటేశ్వరరావును వేధించసాగాడు. కొంతకాలం గడిచాక పెద్దల సమక్షంలో పంచుకుందామన్నా వినకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం పాన్‌షాపు నుంచి ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు కిటికీలోంచి చూడగా, వెంకటేశ్వరరావు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై అశోక్ సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో ఆస్తి పంపకాలకు సంబంధించి తమ్ముడు వాసు వేధింపుల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సోదరుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కవిటి: తలగానపుట్టుగకు చెందిన కాళ్ల సుజాత(33) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న మాటపట్టింపులు, భర్త చెడు తిరుగులకు అలవాటు పడడం, భార్య ను పట్టించుకోకపోవడం తదితర కారణాల నేపథ్యంలో మనస్తాపానికి గురై భార్య సుజా త ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల కృష్ణారావుతో సుజాతకు పదేళ్ల క్రితం వివాహం అయిం ది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి సోదరుడు కోరాడ షణ్ముఖరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ పారినాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరణంపై అనుమానాలు తన సోదరికి వివాహం జరిగిన నుంచి భర్త కృష్ణారావుతో తరచూ చిన్నచిన్న ఘర్షణలు వచ్చేవని షణ్ముఖరావు పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఈ మృతికి ఘర్షణలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయన్న విషయం సందేహాస్పదంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బాధను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాల్ని ఫిర్యాదుదారుడు షణ్ముఖరావు, ఆమె బంధువులు వ్యక్తం చేశారు. పోలీసులు లోతుగా పరిశీలించి తన సోదరి మృతికి కారణాలు అన్వేషించి ఆమె పిల్లలు ఇద్దరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు. -
కొత్తపల్లిలో వ్యక్తి దారుణ హత్య
త్రిపురారం(నాగార్జునసాగర్) : అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం సా యంత్రం ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన అలుగుల పెద్దవెంకట్‌రెడ్డి (52)కి తన తమ్ముడు అలుగుల జంగారెడ్డి మధ్య ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న రెండు ఎకరాల 24 గుంటల భూమి కొలతల్లో కొంత తేడాలు ఉండడంతో ఇరువురి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు అలుగుల జంగారెడ్డి తన భూమిని ఇటీవల రైతు తిరుపతయ్యకు అమ్ముకున్నాడు. విషయం తెలుసుకున్న అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి కొత్తపల్లి గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దల మాటలను పట్టించుకోకుండా జంగారెడ్డి రెండు రోజుల క్రితం తన భూమిని కొలత చేయిస్తుండగా అన్న పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడకు వెళ్లి తమ్ముడితో గొడవపడ్డారు. ఈనేపథ్యంలో తన అన్నపై తమ్ముడు జం గారెడ్డి కక్ష పెంచుకున్నాడు.ఈక్రమంలో మంగళవారం సాయంత్రం అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లాడు. విష యం తెలుసుకున్న జంగారెడ్డి, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి అన్న పెద్ద వెంకట్‌రెడ్డిని కత్తులతో పొడిచి చంపాడు. తీవ్ర రక్తస్రావం అయి పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. దాడిచేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్య విషయం తెలుసుకున్న హలియా సీఐలు ధనుంజయగౌడ్, ఎస్ఐ సతీష్‌కుమార్ ఘటన స్థలం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనకు గల కారణాలను విచారించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసమే తన భర్తను మరిది జంగారెడ్డి హతమార్చారని మృతుడి భార్య కనకదుర్గ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
పోలీసులపై దాడికి యత్నం
సూర్యాపేటరూరల్ : భార్యాభర్తల పంచాయితీ విషయంలో పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్‌తో సూర్యాపేట మండలం య ర్కారం ఆవాసం దుబ్బతండాకు చెందిన లీలావతికు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సం తానం. అయితే కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ భర్త బాలు నాయక్‌పై భార్య లీలావతి మూడు రోజుల క్రితం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విషయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను ఎస్ఐ శ్రీనువాస్ ఇరువర్గాలను గురువారం స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వస్తూనే పోలీసులపై ఆగ్రహం..? మిర్యాలగూడ నుంచి బాలునాయక్, అతని తమ్ముడు రమేష్‌తో పాటు మరి కొందరు బంధువులు స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు వస్తూనే బాలునాయక్ తమ్ముడు రమేష్ తాను డీజీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తానని, కేసు విషయంలో నువ్వు ఎంత తీసుకుని మమ్ముల్ని పిలిపించావని ఎస్ఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. స్టేషన్లో ఉన్న పోలీసులు బాలునాయక్, రమేష్‌లను సముదాయించి స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాలునాయక్, రమేష్‌తో పాటు వచ్చిన బంధువులు అందరూ కలిసి పోలీసులపై దాడి చేసే యత్నించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దాడికి యత్నించిన వారు మద్యంతాగి ఉండడంతో పోలీసులు సముదాయించినా వినలేదు. భార్య బంధువుల ప్రతిఘటనతో.. అయితే బాలునాయక్ బంధువులు పోలీసులపై దాడికి యత్నిస్తున్న తీరును చూసి అవాక్కౖన లీలావతి బంధువులు ప్రతిఘటించి వెంబడించా రు. దీంతో బాలునాయక్ బంధువులు పరారీ కావడంతో గొడవ సద్దుమణిగింది. బాలునాయక్, బంధువులను సముదాయించే సమయంలో హోంగార్డు జానకిరాములు కిందపడిపోయాడు. ఆరుగురిపై కేసు నమోదు.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురిపై కేసు న మోదు చేసినట్లు సూర్యాపేట వన్‌టౌన్ ఎస్ఐ క్రాం తికుమార్ తెలిపారు. కేసు నమోదైన వారిలో రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్, రమేష్, రా జేశ్వరి, రమావత్ శాంతి, వినోద, కవిత ఉన్నారు. స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు స్టేషన్‌కు వచ్చారు. ఘర్షణ జరిగిన సంఘటన గురించి సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్‌లపై దాడి చేసే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు. -
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
నెక్కొండ : ఎలాంటి సంబంధం లేని ఓ బాలిక అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంజరుపల్లి శివారు ధర్మతండాలో ఈ నెల 30న రాళ్లు విసరడంతో అదే తండాకు చెందిన బాలిక అఖిల మృతిపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న మరుసటి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై నవీన్‌కుమార్‌లను కలిసి వివరాలు తీసుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబ నేపథ్యం ప్రకారం.. వారి ఆర్థిక విషయాలపై గొవడకు కారణం, బాలిక మృతిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ రిపోర్టును మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు, జిల్లా ఉన్నతాధికారులు, బాలల సంక్షేమ కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు నాలుగో సంతా నం కాగా, పదో తరగతి చదివిన పెద్ద కూతురు(మూగ)కు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆమెను వృత్తి విద్యా కోర్సు చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రెండో కుమార్తెకు వివాహం జరుగగా, మూడో కుమార్తెను నెక్కొండ కస్తూర్భా గురుకులంలో 8వ తరగతిలో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం తరుఫున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణలో అంగన్వాడీ టీచర్ సుధ, ఆయా పూలమ్మ, తండావాసులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల ఆత్మహత్య
కొల్చారం(నర్సాపూర్) : మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన లంబాడి లక్ష్మణ్ భార్య ప్రేమ్‌లి(45) ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందును సేవించడంతో చికిత్స కోసం మెదక్ తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ్‌లి మృతికి కుటుంబ కలహాలే కారణమని కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పెంటయ్య తెలిపారు. పదిహేను రోజుల నుంచి ప్రేమ్‌లికి, భర్త లక్ష్మణ్, కుమారులకు మధ్య గొడవలు జరగినట్లు తెలిసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సైతం గొడవ జరగడం, కుమారుడు చేయి చేసుకోవడంతో పనస్థాపం చెందిన ప్రేమ్‌లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. పైతరలో : మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన బోయిని మల్లేశం భార్య రాజమణి(35) కుటుంబ కలహాల కారణంగా మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పెంటయ్య తెలిపారు. -
జీవితంపై విరక్తితో.. ఉరివేసుకొని లెక్చరర్ ఆత్మహత్య
ఖమ్మంఅర్బన్: ధంసలాపురం కొత్తూరులో నివాసం ఉంటూ నగర శివారులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కొచ్చర్ల రఘు (23) ఆత్మహత్యక పాల్పడినట్లు మంగళవారం గుర్తించారు. సీఐ నాగేంద్రాచారి, ఎస్ఐ మోహన్‌రావు, మృతుడు తండ్రి జాని కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన రఘు 2010లో లక్ష్మి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాలు పాటు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. లక్ష్మి భర్త రఘు, అతని తల్లిదండ్రులపై కేసు పెట్టగా కోర్టులో నడుస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో కూడా రఘు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ఖమ్మంలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కాలేజీలో చదువుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రేమించాడు. ఆ విద్యార్థిని రఘు ప్రేమను తిరస్కరించింది. భార్య దూరం కావడం, ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో జీవతంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇంట్లో రఘు ఎంతసేపటికి ఫోన్ ఎత్తక పోవడంతో గదిలో పరిశీలించగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్‌రావు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
తల్లాడ: మండలంలోని మల్లవరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దుగ్గిదేవర అనూష(25), భర్త నరసింహారావు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనూష తండ్రి శెట్టిపల్లి క్రిష్ణయ్య, కొన్ని రోజుల క్రితం ఇద్దరికి సర్దిచెప్పాడు. అయినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. బుధవారం ఉదయం తన కుమారుడిని, కుమార్తెను తల్లాడలోని బాలభారతి పాఠశాలకు పంపించి ఇంటికి వెళ్లింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో అక్కడకక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన సంఘటన రాచకొండ నేరేడ్‌మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విడాకుల కేసు విచారణ నిమిత్తం మల్కాజ్గిరి కోర్టుకు హాజరైన శ్రీధర్ అనే వ్యక్తిని అతని బావమరుదులు నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపారు. మూడేళ్ల క్రితం శ్రీధర్ కు మల్కాజ్‌గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో సుహాసిని తన భర్త శ్రీధర్‌పై కేసు పెట్టడంతో విడాకుల వివాదం కోర్టులో నడుస్తోంది. ఇవాళ ఉదయం కోర్టుకు హాజరై కారులో వెళ్తుండగా శ్రీధర్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేసి, కత్తితో నరికి చంపారు. కాగా తన కుమారుడి బావమరుదులైన వినయ్, విగ్నేష్ లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా తన కొడుకును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ తండ్రి అన్నారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
తాడిపత్రి: భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి టీటీడీ కల్యాణ మండపం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న రామసుబ్బారెడ్డిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు...అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా భార్య సులోచనమ్మ సహా ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభలను నిన్న రామసుబ్బారెడ్డి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ వైపు భార్య, పిల్లలను అతికిరాతకంగా సుత్తితో హతమార్చడంతో పాటు, పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. triple murder, ramasubbareddy, tadipatri, sulochana, family disputes, suicide, హత్యలు, రామసుబ్బారెడ్డి, తాడిపత్రి, సులోచన, కుటుంబకలహాలు,ఆత్మహత్య -
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
-
అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు
-
అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యతో పాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను కూడా దారుణంగా హతామర్చాడో వ్యక్తి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక కృష్ణాపురం 40 అడుగుల రోడ్డులో రామసుబ్బారెడ్డి ... భార్య, ఇద్దరు కుమార్తెలు మంగళవారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే రామసుబ్బారెడ్డి.... భార్య, పిల్లలను సుత్తితో కొట్టి హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య
గుంటూరు: కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తూరుకు చెందిన దొడ్ల వీరమ్మ(30), దొడ్ల శ్రీనివాసరావు(34) దంపతులకు పదిహేనేళ్ల కింద వివాహమైంది. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసరావు అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడని, ఇద్దరూ తరుచూ గొడవపడేవారని స్థానికులు చెప్పారు. దీంతో జీవితంపై విరక్తి చెంది వీరమ్మ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించగా బుధవారం మృతిచెందింది. దీంతో వీరయ్య గురువారం వేకువజామున పురుగుల మంది సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. -
వివాహిత ఆత్మహత్య
గోదావరిఖని(పెద్దపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన రెజీనా(34) కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య
రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం మందరం గొల్లపల్లిలో భార్యాభర్తలు వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య(40), వెంకట సుబ్బమ్మ(37) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిధ్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు కలిసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భార్య రాలేదని, వాట్సప్ లో చెప్పి..
తిరుపతి : తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త ప్రేమికుల దినోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ తన డెత్ డేట్ అంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించి మరీ ఉరితాడుకు వేలాడాడు. చనిపోయే ముందు జనన, మరణ తేదీలు, ఉరితాడుతో వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసి అందరికి షేర్ చేశాడు. మెసేజ్ చూసి ఇంటికి రావాలని.. ఇది చివరి కోరిక అని అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు రావడానికి వీలుగా ముందురోజే విమాన టికెట్లు కూడా తీశాడు. మంగళవారం తిరుపతిలో జరిగిన ఈ విషాదాంతం వివరాలిలా ఉన్నాయి. ఎస్వీయూ వీసీ చాంబర్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీహరి 2006లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. బీటెక్ చదివిన శ్రీహరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో, 2015 అక్టోబర్‌లో వీసీ దామోదరం పీఏగా నియమించుకున్నారు. శ్రీహరికి ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరుకు చెందిన విద్యాలతతో వివాహమైంది. కొంతకాలం తిరుపతిలోని ఎస్వీనగర్‌లో నివాసం ఉండేవారు. వీసీ పీఏగా నియమితులయ్యాక రెడ్ బిల్డింగ్ క్వార్టర్స్‌లోని హౌస్ నెంబర్ 42కు షిఫ్ట్ అయ్యారు. పెళ్లి అయి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో నిత్యం భార్యభర్తలు గొడవలు పడేవారని సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం విద్యాలత పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి బాధ పడుతూ వచ్చిన శ్రీహరి మంగళవారం తనువు చాలించాడని వారు తెలిపారు. శ్రీహరి ఆత్మహత్మకు ముందు వాట్సప్‌లో డిస్ప్లే పిక్చర్లో పుట్టిన తేదీ.. మరణించిన తేదీ అని, ఫోటోల మధ్యలో ఉరితాడు పెట్టి పిక్చర్ తయారు చేశాడు. కొంత మంది మిత్రులకు పోస్ట్ చేశాడు. హైదరాబాద్‌లో ఉన్న తమ్ముడు, చిన్నాన్నకు మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి రావడడానికి వీలుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. మెసేజ్‌కు స్పందించి శ్రీహరి ఇంటికి చేరిన మిత్రులకు ఉరితాడుపై వేలాడుతూ కన్పించాడు. వీసీ దామోదరం తదితరులు శ్రీహరి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.l -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
పానగల్(వనపర్తి): కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమొద్దుల గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రహ్లాద్(27), మల్లమ్మ(22) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి 16 నెలల బాబు అనాథ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జిల్లాలో కేసులు పెరిగాయి
బుట్టాయగూడెం: జిల్లాలో భూ సమస్యలు, కుటుంబ తగాదాలు, చీటింగ్ కేసులు పెరిగాయని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. శనివారం ఆయన బుట్టాయగూడెం పోలీస్‌స్టేషషన్‌ను సందర్శించారు. స్టేషషన్లో నమోదైన కేసులు, సిబ్బంది వివరాలను ఎస్సై డి.రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తరహాల్లో కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలు ఓరకంగా ఉంటే జిల్లాలో మరికొన్ని చోట్ల మరోరకమైన సమస్యలతో కేసులు నమోదవుతున్నాయన్నారు. సరిహద్దు తగాదాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతంలో గ్రామాల్లో పంచాయతీలు జరిగేవని, అక్కడే చిన్నపాటి సమస్యలు పరిష్కారం కాగా ఇప్పుడు అవికూడా పోలీస్‌స్టేషన్‌న్లకు రావడంతో కేసులు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, హత్యానేరాల సంఖ్య తగ్గిందన్నారు. గతేడాది 62 హత్యకేసులు నమోదు కాగా ఈ ఏడాది 43 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.జిల్లాలో నేర పరిశోధన రేటు కూడా బాగా పెరిగిందన్నారు. జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు రావడమే ఇందుకు నిదర్శమన్నారు. ఏజెన్సీలో భూ సమస్యలకు సంబంధించి పోలీసుల ప్రమేయం ఏమీ ఉండదన్నారు. సమస్య వచ్చినప్పుడు స్థానిక తహసీల్దార్, ఆర్డీవో సమక్షంలో బాధితులు పరిష్కరించుకోవాలని సూచించారు. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ప్రొటెక్షన్ ఇస్తే అప్పుడు భూ యజమానికి పోలీసులురక్షణ కల్పిస్తారన్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేవని చెప్పారు. జిల్లాలో నెలకు రెండు,మూడు సార్లు కూంబింగ్ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. -
తాడేపల్లిలో దారుణ హత్య
తాడేపల్లి(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మర్రేడి ఏసుబాబు, జయలక్ష్మి(33) దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, ఏసుబాబుకు భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కత్తితో నరికి చంపాడు. ఒక కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లగా పక్కనే మంచంపై నిద్రిస్తున్న మరో కూతురును అరవకుండా నోరు మూశాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో జయలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన సీఐ సురేష్‌బాబు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే ఏసుబాబు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం
తాడేపల్లి: కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం డోలాస్నగర్కు చెందిన నర్సింహారావు, దుర్గ దంపతులు మంగళవారం రాత్రి గొడవపడ్డారు. బుధవారం ఉదయం దంపతులిద్దరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే మంటలను ఆర్పి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కంబదూరు: మండలంలోని కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక(28)అనే వివాహిత కుటుంబ క లహాలతో పురుగుల మందు తాగి ఆ త్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన వివరాలు.. సోమవారం భర్త బ్రహ్మనందరెడ్డితో కలసి ఆమె పొలంలో బెండ పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ గొడవపడ్డా రు. భర్త పంటకు మందు పిచికారీ చేసే పనిలో ఉండగా ఆమె పురుగుల మందును తాగి ఆకస్మకరక స్థితిలోకి వెళ్లింది. కొద్దిసేప టి తర్వాత భర్త గమనించి ఆమెను వెంటనే కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంత పురం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. రెం డు రోజులగా వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. -
గుంటూరులో దారుణం
నాదెండ్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి ఎనిమిదినెలల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసింది. ఈ సంఘటన జిల్లాలోని నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య తన ఎనిమిది నెలల చిన్నారి ఖుర్షిద్‌ను సోమవారం తెల్లవారుజామున గొంతు నులిమి హత్య చేసింది. కాగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు అంటున్నారు. -
బేగంపేటలో మహిళ దారుణ హత్య
హైదరాబాద్ : బేగంపేటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం సాయంత్రం ప్రకాశ్‌నగర్ బస్టాండ్ వద్ద ఆటోలో వెళ్తున్న మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నగరానికి చెందిన కవిత, ఈశ్వర్ భార్యభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. 40 రోజుల క్రితం కవిత అదృశ్యమైనట్లు ఈశ్వర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో కవిత ఆమె తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మంగళవారం వారిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈశ్వర్ భార్యను గొంతుకోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రవమైన కవిత అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఈశ్వర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య
ఏలూరు అర్బ¯ŒS : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక తంగెళ్లమూడిలో యామవరపు అశోక్ (32) అనే వ్యక్తి భార్య లక్షి్మతో కలిసి ఉంటూ పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలిద్దరూ కీచులాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురైన అశోక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన భార్య లక్ష్మి స్థానికుల సాయంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అశోక్ మరణించాడని నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
కుటుంబ కలహాలతో తోడికోడళ్లు సూసైడ్
-
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య
రాజుపాలెం: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చౌటపాపాయపాలెం పరిధిలోని పులిచింతల నిర్వాచిత కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిర్వాసిత కేంద్రానికి చెందిన కుంబా వెంకాయమ్మ(26)కు, భర్త శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇంటి ఆరుబయట భార్యాభర్తలు, అత్త నిద్రించగా... వెంకాయమ్మ అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తెల్లవారు జామున గమనించిన అత్త చుట్టుపక్కల వారి సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. సీఐ శ్రీధర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్య
-
మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్య
► ఒంటిపై 25 కత్తిపోట్లు.. ► కుషాయిగూడలో ఘటన హైదరాబాద్: రాజధానిలోని కుషాయిగూడలో శనివారం రాత్రి రైల్వే మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శెట్టిపల్లి గోపాలకృష్ణ (32) కుషాయిగూడ హౌజింగ్ బోర్డుకాలనీలోని నోముల ఎన్క్లేవ్ పెంట్‌హౌస్‌లో తన తల్లి జ్యోతితో కలసి నివసిస్తున్నాడు. 2012 నాగ వినీలతో ఈయనకు వివాహం కాగా.. ఇటీవల మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. గతంలో గోపాలకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. ఘట్కేసర్ సమీపంలో కోళ్ల ఫామ్‌లు నిర్వహించాడు. ఈ రెండు వ్యాపారాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. రుణాలిచ్చిన బ్యాంకర్లు, ఇతర వ్యక్తులు కొంతకాలంగా ఈయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈయన ఆస్తులు అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు అంటున్నారు. ఇంతలో రాత్రి 9 గంటల సమయంలో హత్యకు గురయ్యాడు. కాపుగాసి.. పిల్లల్ని కిందకు తీసుకెళ్లి..! దీపావళి నేపథ్యంలో కృష్ణ నివాసం ఉండే అపార్ట్మెంట్లో పిల్లలు.. ఆ బిల్డింగ్‌పై రాత్రి టపాసులు కాల్చుతున్నారు. ఇంతలో ఒక మహిళతోపాటు మరో ఇద్దరు పెంట్‌హౌజ్‌కు చేరుకున్నారు. హత్య ప్లాన్‌కు పిల్లలు అడ్డువస్తారని భావించి.. టపాసులు ఇప్పిస్తానని ఆ మహిళ పిల్లలను కిందకి తీసుకెళ్లింది. అప్పుడే రాత్రి భోజనం చేసి బయటకు వచ్చిన కృష్ణపై దాడిచేసి 25 కత్తిపోట్లు పొడిచారు. తల్లి బయటికి వచ్చేలోగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణ ప్రాణాలు వదిలాడు. నిందితులు అప్పటికే పరారయ్యారు. 15 రోజుల కిందట కూడా దుండగులు కృష్ణ హత్యకు యత్నిం చినట్లు స్నేహితులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉరివేసుకుని వ్యక్తి మృతి
ఏలూరు అర్బన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఓ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల కథనం ప్రకారం.. స్థానిక 4వ డివిజన్ సత్యనారాయణ పేటకు చెందిన ఆంబోతుల చక్రధర్ భార్య సంతు, ఇద్దరు పిల్లలతో కలిసి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. చాలాకాలంగా భార్యాభర్తలిద్దరికీ మధ్య మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన చక్రవర్తి భార్యాపిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీనిని గమనించిన భార్య స్థానికుల సాయంతో అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్సై కె.రామారావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ బలవన్మరణం
జంగారెడ్డిగూడెం : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ విషపదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని వెంకటరామానుజపురానికి చెందిన మారెడ్డి సుభాషిణి (36) మంగళవారం విషపదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో భర్త పోతురాజు లేని సమయంలో విషపదార్థం తిని అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుభాషిణి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమెకు ఇంటర్మీడియెట్ చదువుతున్న కూతురు, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. -
భార్యపై దాడి.. కూతురితో కలిసి ఆత్మహత్య
తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామచంద్రం కుటుంబ కలహాల కారణంగా భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో రామచంద్రంతో పాటు చిన్న కూతురు మృతి చెందారు. కాగా దాడిలో గాయపడిన భార్యతో పాటు, పెద్దకూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
పర్వతగిరి : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కల్లెడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ముంజాల సురేష్ (30) భార్య కళ్యాణి కొద్దిరోజులుగా కాపురానికి రావడం లేదు. దీంతో అతడు మనోవేదనకు గురై ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి ఆవరణలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. సురేష్ తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బూరగు వెంకట్రావు తెలిపారు. సురేష్ కుటుంబ సభ్యులను వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేష్ పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకులు ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, పల్లెపాటి శాంతిరతన్‌రావు, పట్టాపురం ఏకాంతం, బోయినపల్లి యుగంధర్‌రావు, మాదాసి సుధాకర్, చినపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొంపెల్లి దేవేందర్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి శనివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. వెంగళ్‌రావ్‌నగర్ సిబ్లాక్ తాతయ్యబడి సమీపంలో నివాసం ఉంటున్న కె. శ్రీనివాసులు (36) నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. 12 ఏళ్ల కిందట ఉమతో వివాహమైంది. వారికి పిల్లలు లేకపోవడంతో ఐదేళ్ల కిందట ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అతనికి రెండేళ్ల కిందట బోడిగాడితోటకు చెందిన మంజులతో వివాహం చేశారు. ఇటీవల శ్రీనివాసులు గూడూరులో ఓ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని తన పేరుపై రాయమని మంజుల ఒత్తిడి చేసింది. ఆ స్థలాన్ని సగం తనను చిన్నతనం నుంచి పెంచిన తల్లి, చెల్లెలు స్వాతిపై, మిగిలిన స్థలాన్ని ఆమె పేరుపై రాస్తానని భార్యకు చెప్పాడు. ఈ విషయంపై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. రెండు రోజుల కిందట శ్రీనివాసులు తన మరదలు వివాహం నిమిత్తం భార్యతో కలిసి బోడిగాడితోటకు వెళ్లారు. అక్కడ స్థల విషయమై తీవ్ర వివాదం జరిగడంతో భార్యను పుట్టింట్లో వదిలి పెట్టి శుక్రవారం ఇంటికి వచ్చాడు. రాత్రి వరకు చెల్లెలు స్వాతి వద్ద ఉన్నాడు. 10 గంటలకు ఇంటికి చేరుకుని భార్యకు ఫోన్ చేశాడు. వారి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పనికి వెళ్లమని చెప్పేందుకు స్వాతి తన అన్న ఇంటి వద్దకు వచ్చి తలుపులు తెరచి చూడగా శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకుని ఉండటానిన గుర్తించి ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జగత్సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఖానాపురం : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పాకాల సరస్సు వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సంపేట మండలంలోని దాసరిపల్లి శివారు సీతారాంనాయక్ తండాకు చెందిన వాంకుడోతు సాంబయ్య(34) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో సోమవారం విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేయించడానికి నర్సంపేటకు వచ్చాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం పాకాల చెక్‌పోస్టు సమీపంలో సాంబయ్య ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. దానికి దగ్గర్లోనే అతడు విగత జీవిగా కనిపించాడు. పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య శాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు హరీష్, కుమార్తె హారిక ఉన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త
మూలపాడు (ఇబ్రహీంపట్నం): మద్యానికి బానిసైన భర్త కుటుంబ కలహాలతో భార్యను హత్యచేసి పరారయ్యాడు. మూలపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆళ్లదాసు సూర్యనారాయణ కూలీ పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను నిత్యం భార్య రమాదేవి (30)తో గొడవపడేవాడు. కేతనకొండ రంగుల కంపెనీలో పనిచేసి ఇంటికొచ్చిన తన భార్యతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఇరువురి మద్యన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆవేశంతో తన వద్ద ఉన్న కండువాతో రమాదేవిని గొంతు నులిమి చంపాడని బందువులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడిఉన్న భార్యను చూసి అనుమానంతో సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చూపించాడు. ఆమెను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు నిర్థారించాడు. భార్య చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి మరణించి తండ్రి పరారీలో ఉండటంతో మృతురాలికి చెందిన ఇద్దరు మగబిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బంధువుల్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం సీఐ డి.చవాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పిల్లలకు విషమిచ్చి, ఉరేసుకున్న తల్లి
బుక్కరాయసముద్రం(అనంతపురం): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం కొట్టాలపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్, భారతి దంపతులు ఆదివారం రాత్రి గొడవపడ్డారు. స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సోమవారం ఉదయం ఆనంద్ నిద్ర లేచి చూసేసరికి భార్య ఉరేసుకుని, ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(4), ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు అతడు పోలీసులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భార్యాబిడ్డలపై గొడ్డలితో దాడి.. ఆత్మహత్య
అచ్చంపేట(మహబూబ్‌నగర్): కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను కత్తితో కిరాతకంగా నరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(46), దాలమ్మ 40 దంపతులకు నలుగురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన వెంకటయ్య భార్యతో పాటు పిల్లలను చంపేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భయపడిపోయిన దాలమ్మ పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టి భర్తతో వాదులాడుతుండగా.. కోపోద్రిక్తుడైన భర్త కత్తితో ఆమె పై దాడి చేశాడు. అనంతరం భార్య చనిపోయిందనుకొని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మాహుతి యత్నం చేసిన వివాహిత మృతి
అనంతగిరి: కుటుంబ కలహాలతో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట గ్రామానికి చెందిన పార్వతి (27) గత నెల 23న తన ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం)లో చోటుచేసుకుంది. మండలంలోని నాంచారిపేటకు చెందిన పోతగాని అరుణ(32) మంగళవారం అర్థరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుధవారం ఉదయం మృతి చెందింది. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో ఆమె మనస్తాపం చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగప్రసాద్ తెలిపారు. -
కుటుంబ కలహాలతో ముగ్గురు బలవన్మరణం
తాంసి(ఆదిలాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘోరం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన పాండురంగ, ఆశాబాయి(40) దంపతులకు దత్తు(12), లక్ష్మి (10) అనే పిల్లలున్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన పాండురంగ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆశాబాయి.. మంగళవారం రాత్రి సమీపంలోని బావి వద్దకు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. ముందుగా వారిని బావిలోకి తోసేసి, తానూ దూకింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. -
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
నకిరికల్లు(గుంటూరు): ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గుండె సావిత్రి(65) ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు. అయితే కుంటుంబ కలహాలతో సావిత్రి ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. కాగా, ఈ రోజు సావిత్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. ఆస్తి తగధాల నేపథ్యంలో సావిత్రి హత్యకు గురై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కిరాతకుడు..
- కుటుంబ కలహాలతో కూతురిని చంపిన తండ్రి - మృతదేహాన్ని క్వారీలో పడేసిన వైనం - మద్యం మత్తులో ఘాతుకం - కర్ణాటక రాష్ట్రం కల్లూరులో ఘటన తాండూరు రూరల్: కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుటుంబ కలహాలతో ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. మద్యం మత్తులో మృగంలా మారి చంపేసి మృతదేహాన్ని క్వారీలో పడేసి పరారయ్యాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు మండలం సంగెంకాలన్ సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు మండలం సంగెంకాలన్ గ్రామానికి చెందిన నజాబేగంను ఏడేళ్ల క్రితం ముంబైకి చెందిన శంషీర్ వివాహం చేసుకున్నాడు. సంగెంకాలన్‌లో ఉంటున్న దంపతులకు కుమారుడు సోయాబ్ఖాన్, కూతురు గుల్శరా(4) ఉన్నారు. చిన్నారి స్థానికంగా అంగన్వాడీ పాఠశాలలో చదువుతోంది. కొంతకాలం పాటు పాలిషింగ్ యూనిట్లో పని చేసిన ఇటీవల పనిమానేశాడు. మద్యానికి బానిసై భార్య నజాబేగంను వేధించసాగాడు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం శంశీర్ కుటుంబీకులతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో మధ్యాహ్నం 3 గంటలకు కూతురు గుల్శరాకు బిస్కెట్లు కొనిస్తానని చెప్పి ఆమెను సంగెంకాలన్కు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామం వైపు వెళ్లాడు. కుటుంబీకులు, స్థానికులు అతడిని వెంబడించగా రాళ్లతో దాడి చేశాడు. కూతురును గొంతునులిమి చంపేసిన శంషీర్ మృతదేహాన్ని కల్లూరు శివారులోని ఓ నాపరాతి క్వారీలో పడేశాడు. అక్కడి నుంచి ఓ లారీలో చించోలి నుం చి చాంగ్లేర్ మీదుగా వెళ్తుండగా స్థాని కులు ఓ వాహనంలో వెంబడించి అతడిని పట్టుకొని కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా కూతురి హత్య విషయం తెలిపాడు. క్వారీ నుంచిమృతదేహం వెలికితీత.. కర్ణాటక రాష్ట్రం కల్లూరు శివారులోని ఓ పాడుబడ్డ క్వారీలోంచి మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మిర్యాణ్ ఎస్ఐ హేమంత్‌కుమార్ చించోలి ఫైర్ ఆఫీసర్ శివరాజ్ కంగ్టీ సాయంతో వెలికితీయించారు. విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసిన తల్లి నజాబేగం తల్లడిల్లిపోయింది. మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని ఆమె హృదయ విదాకరంగా రోదించిన తీరుకు స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చించోలి డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. అనంతరం అక్కడి చందాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటంబీకులకు అప్పగించారు. నిందితుడు శంషీర్ను రిమాండుకు తరలించినట్లు మిర్యాణ్ పోలీసులు తెలిపారు. -
కుటుంబ కలహాలతో వివాహిత మృతి
అనంతపురం: కుటంబకలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం మార్తాడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రహీమాన్ అదే గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి షాహిన్(30)ను వివాహం చేసుకున్నాడు. రహీమాన్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, కుటుంబకలహాలతో షాహిన్ శనివారం అమ్మగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్టు సమాచారం. -
చిన్నాన్నే హంతకుడు
- ఎనిమిదేళ్ల ఫ్రాన్సిస్కో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు - కుటుంబ తగాదాలే హత్యకు కారణం సాక్షి, ముంబై: గత సోమవారం బడికెళ్లి అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక శుక్రవారం శవమై తేలింది. హంతకుడు ఆ బాలిక చిన్నమ్మ భర్త కావడంతో ఇన్ని రోజులు ఎవరికి అనుమానం రాలేదు. గత నాలుగైదు రోజులుగా నాటకీయంగా మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. నవీ ముంబై ఐరోలి సెక్టర్ నంబరు-8, ఏకవీర దర్శన్ సొసైటీలో నివాసముంటున్న ఫ్రాన్షేలా సోఫియా ఫ్రాన్సిస్కో (8), న్యూ హోరైజన్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం బడికెళ్లిన ఫ్రాన్షేలా సాయంత్రం ఏడు గంటలైనా ఇంటికి రాలేదు. సొసైటీ బయట స్కూల్ బస్సు దిగిన ఫ్రాన్షేలా అక్కడే ఆగిన కారులో ఉన్న వ్యక్తితో చాలా సేపు మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాని కారులో ఉన్నది ఎవరనేది తెలియకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంట్లో పనిచేసి మానేసిన పనిమనిషిపై అనుమానం వ చ్చి, ఆమెపై దృష్టి సారించినా ఆధారాలు రాబట్టలేకపోయారు. తర్వాత సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. అపహరణకు గురైన రోజు సాయంత్రం ఓ వ్యక్తి 2 నిమిషాల్లో అపార్టుమెంట్లోకి వచ్చి వెళ్లినట్లు కనిపించింది. ఆయన నా చెల్లెలు భర్త క్లారెన్స్ అని ఫ్రాన్షేలా తల్లి చెప్పింది. దీంతో అతనిపై పోలీసులకు అనుమానం రాలేదు. కాని అతని ఫోన్ లొకేషన్ గుర్తించగా సోమవారం సాయంత్రం మీరారోడ్-ఘోడ్‌బందర్ నిర్మాణుష్య ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. అతడు నిర్మాణుష్య ప్రాంతానికి ఎందుకెళ్లినట్లు, 2 నిమిషాల కోసం అపార్టుమెంట్లోకి ఎందుకు వచ్చి వెళ్లినట్లు.. అని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు క్లారెన్స్‌ను పిలిపించి విచారించగా, కుటుంబ తగాదాల వల్ల తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. సోమవారం రాత్రే గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పాడు. శుక్రవారం ఉదయం పోలీసులు ఘోడ్‌బందర్ పరిసరాల్లోంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు. బాలిక ఒంటిపై గాయాలైన గుర్తులున్నాయి. హత్యాచారం జరిగిందా? అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు అపహరణకు గుైరె నట్లు తెలియగానే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రాన్షేలా తండ్రి, తన కూతురుని తోడళ్లుడే హతమారుస్తాడని కలలో కూడా ఊహించుకోలేదని కంటతడి పెడుతూ అన్నాడు. -
కొడుకు మాట వినడం లేదని... తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి(కుల్కచర): కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కుల్కచర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ,శ్రీలత భార్య, భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు రాజు తల్లి శ్రీలతతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కూడా వీరిద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు తరచూ వాగ్వివాదానికి దిగడంతో మనస్తాపం చెందిన శ్రీలత సోమవారం మద్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తులో ఉందని పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. -
భార్యను కడతేర్చిన భర్త
కడప: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు. ఈ సంఘటన కడప జిల్లాలోని తాలుక పోలీసుస్టేషన్ పరిధిలోని తారక రామనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మహబూబ్‌జాన్(32)కు మల్లికార్జున్‌తో గతంలో ప్రేమ వివాహం అయింది. ఈ మద్య తరచూ వారిద్దరి మద్య గొడవలు జరుగుతుండటంతో మల్లికార్జున్ ఆదివారం మధ్యాహ్నం భార్య మహబూబ్జాన్ను హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించి మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి హత్య
వీణవంక(కరీంనగర్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తపెల్లి గ్రామానికి చెందిన కుమార్ గౌడ్(22)ను గుర్తు తెలియని వ్యక్తులు ఉరివేసి చంపారు. మృతదేహాన్ని అతని టాటాఏస్ వాహనంలోనే ఉంచి అతని అత్తగారి ఊరైన ఘన్ముకుల శివారులో వదిలేసి వెళ్లిపోయారు. కుమార్ వివాహం ఘన్ముకుల గ్రామానికి చెందిన కోమలతో ఆరేళ్ల క్రితం అయింది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, కుమార్ హత్యకు కుటుంబకలహాలే కారణమని గ్రామస్తులు అంటున్నారు. -
నేదురుమల్లి కుటుంబంలో డిష్యుం డిష్యుం
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఎన్బీకేఆర్ విద్యాసంస్థల మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలన్న అంశంపై కుటుంబంలోని ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. చైర్మన్‌గా తనకే అధికారాలున్నాయంటూ నేదురుమల్లి పద్మనాభరెడ్డి గురువారం నాడు కాలేజీకి రాగా.. ఆయనకు టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ పూలమాల వేసి ఆహ్వానం పలికారు. పద్మనాభరెడ్డి రాకతో కళాశాలలో వాతావరణం వేడెక్కింది. ఈ విద్యాసంస్థలకు తానే శాశ్వత అధ్యక్షుడనని, విద్యాసంస్థలపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని స్పష్టంచేశారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాంకుమార్‌రెడ్డిని అడ్డుకున్న సిబ్బంది ఆ తర్వాత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు, విద్యాసంస్థల కరస్పాండెంట్ రాంకుమార్‌రెడ్డి వచ్చేందుకు ప్రయత్నించగా కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. పద్మనాభరెడ్డి సారథ్యంలోనే కళాశాల నడవాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంకుమార్‌రెడ్డి అనుచరులు ఇద్దరు కళాశాల సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వాళ్లపై సిబ్బంది తిరగబడ్డారు. కళాశాలపై సర్వహక్కులు తనకు ఉన్నాయని రాంకుమార్ రెడ్డి అన్నారు. ఇరువర్గాలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు. మోహరించిన ఇరువర్గాలు రాత్రి వరకు కళాశాలలోనే రాంకుమార్‌రెడ్డి, పద్మనాభరెడ్డి ఉండటంతో పోలీసులకు ఇరువర్గాలను నియంత్రించడం కష్టంగా మారింది. కళాశాల వెలుపల సాయంత్రం ఇరువర్గాల అనుచరులు కత్తులు, కర్రలతో దాడికి సిద్ధమవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అయినా ఇరువర్గాలు శాంతించలేదు. దీంతో సీఐ రత్నయ్య చర్చలు త్వరగా ముగించాలని నాయకులను ఆదేశించారు. -
అల్లుడే నిందితుడు
వీడిన హత్య కేసు మిస్టరీ కుటుంబ కలహాలే కారణం దుండిగల్: సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇటీవల జరిగిన భాస్కర్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. నిత్యం తాగి వచ్చి గొడవపడుతుండటంతో అల్లుడే అతడిని బండరాయితో మోది చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బృంగి భాస్కర్(48) 25 ఏళ్ల క్రితం సావిత్రి అలియాస్ సంధ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భర్తతో గొడవలు జరుగుతుండటంతో ఆరేళ్ల క్రితం తన కూతురు సంగీత, కుమారుడిని తీసుకొని సంధ్య సూరారం డివిజన్ సాయినగర్‌కు వచ్చి ఉంటోంది. కాగా, కుమార్తె సంగీతను బొంతపల్లిలో కూలీగా పని చేసే శ్రీకాకుళం జిల్లా సార్వకోట గ్రామానికి చెందిన సాయిబలి పోలయ్య అలియాస్ రాము(32) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా సూరారం పరిధిలోని రాజీవ్‌గృహకల్పలో ఉంటున్నారు. భాస్కర్ రోజూ కూతురి ఇంటికి వచ్చి తన భర్య విషయమై గొడవ చేసేవాడు. ఈనెల 28న సాయంత్రం సూరారం రోడ్డులో అల్లుడు రాముకు భాస్కర్ కనిపించాడు. ఇద్దరూ కలిసి అక్కడి కల్లు దుకాణానికి వెళ్లి పీకలదాక తాగారు. అక్కడి నుంచి ఇంటికి వస్తూ కొంత మద్యం కొనుక్కొని కట్టమైసమ్మ చెరువు సమీపంలోని గుంతలో మళ్లీ తాగారు. తాగిన మైకంలో ఉన్న ఇద్దరూ కుటుంబ విషయాలపై చర్చించుకొని గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన రాము మామ భాస్కర్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండిగల్ పోలీసులు ఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా జాగిలం అల్లుడి ఇంటికి వెళ్లింది. దీంతో రామును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం, భర్త మృతి
ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం వల్లిపాడులో శుక్రవారం దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలతోనే దంపతులు ఈ అఘయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, ఏఎస్ఐపై దాడి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం జౌల (కె)లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన ఏఎస్ఐపై ఇరు కుటుంబాల సభ్యులు రాళ్ల దాడి చేశారు. దాంతో గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పాపం.. పసివాళ్లు!
పాపం.. లోకం తెలియని పసివాళ్లు. చదువులమ్మ తోటలో ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగొలిపే సంగతులతో అలరించే పువ్వులు. అమ్మానాన్నల ఆవేశాగ్నికి ఆహుతయ్యారు. ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కాలినగాయాలతో ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా.. అమ్మ కోసం ఆరాటపడిన ఆ చిరునవ్వులు బోసిపోయాయి. కొడంగల్ రూరల్ / మహబూబ్‌నగర్ క్రైం / తిమ్మాజీపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొడంగల్‌కు చెందిన గొల్ల భీమమ్మ, బాల్‌రాజ్ దంపతులకు కుమార్తెలు నందిని (6), విజయలక్ష్మి (4), ఎనిమిది నెలల శ్రీలక్ష్మి ఉన్నారు. సుమారు నాలుగేళ్లక్రిత బతుకుదెరువు నిమిత్తం తిమ్మాజీపేట మండలం మరికల్‌కు వలస వెళ్లారు. నందిని జడ్చర్ల పట్టణంలోని న్యూ మెమోరియల్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతుండగా విజయలక్ష్మి తల్లివద్దే ఉండేది. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో తాగుడుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య సోమవారం ఉదయం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది. గ్రామస్తులు గమనించి వెంటనే నలుగురినీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చి కిత్స పొందుతూ అదే అర్ధరాత్రి విజయలక్ష్మి, నందిని మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళవా రం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులు అనుకోని సంఘటనతో విగతజీవులుగా మారడంతో కొడంగల్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ బలరాంనాయక్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
-
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
*పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం *అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత *చండూరు మండల కేంద్రంలో ఘటన చండూరు: క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాతాల రఘు(32) హైదరాబాద్‌కు చెందిన కల్పన(28)ను 3సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. రఘు వృత్తిరీత్యా వైద్యుడు. మండల కేంద్రంలోనే సంజీవిని వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వీరికి 11నెలల కూతురు(చిన్ని) ఉంది. కాగా భార్యాభర్తలిద్దరూ ఇటీవల కొన్ని రోజులుగా కుటుంబ విషయాల్లో గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో కల్పన పత్తిపంటకు వాడే మోనోక్రొటోఫాస్‌ను తాగింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన భర్త రఘు తట్టుకోలేక మిగిలిన మందును తాగాడు. ఆపస్మారక స్థితికి చేరిన అతడిని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
జవహర్‌నగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన పబ్బోజు హరి(40), పద్మ(34) దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరి కుమార్తెలు శ్రావ్య(13) సోనీ(11) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు.కార్పెంటర్ పనిచేసే హరి నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ పోషణకు డబ్బు లు ఇచ్చేవాడు కాదు. దీంతో పద్మ స్థానికంగా ఓ లేడిస్ టైలర్స్‌లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మద్యం మానేయాలని పలుమార్లు ఆమె భర్తను బతిమాలినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఇటీవల దంపతులకు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఈక్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో భార్యాభర్తలు తిరిగి తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటల బాధ తాళలేక బయటకు పరుగులు తీసింది. భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో తాను బతికి ఫలితం లేదని భావించిన హరి కూడా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చిన్న కూతురు సోనీ విషయం గమనించి గఓ బకెట్ సాయంతో తల్లిదండ్రులపై నీళ్లు పోసింది. స్థానికులు మంటలు ఆర్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను చికి త్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే హరి మృతిచెందాడు. తండ్రి మృతిచెం దడం, తల్లి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడడంతో శ్రావ్య, సోనీ లు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వేతో బయటపడ్డ కుటుంబ కలహాలు
-
సమగ్ర సర్వేతో బయటపడ్డ కుటుంబ కలహాలు
సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కుటుంబ కలహాలు కూడా బయటపడుతున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా ఉన్న మహిళ.. ఇప్పుడు తనను కుటుంబంలో భాగంగా చేయాలని కోరుతూ ఇంటికి వచ్చింది. అయితే, మూడేళ్లుగా కనీసం ముఖం కూడా చూపించలేదని, తన కొడుకును కూడా తనకు చూపించలేదని ఇప్పుడు ఎందుకు వచ్చావని అంటూ ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి తిరస్కరించారు. ఆమె తమపై తప్పుడు కేసులు పెట్టిందని, హత్యాయత్నం, 498ఎ కేసులు పెట్టిందని చెబుతున్నారు. ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని కూడా తాను కోర్టులో కోరినట్లు ఆమె భర్త చెబుతున్నారు. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదరు మహిళ ఇంటిముందు బైఠాయించింది. కానీ చుట్టుపక్కల కుటుంబాల వాళ్లు కూడా మహిళనే తప్పుబడుతున్నారు. అత్తమామల పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించేదని అంటున్నారు. కేవలం తమ ఆస్తి కోసమే ఆమె ఇప్పుడు వచ్చిందని ఆమె అత్తమామలు అంటున్నారు. ఇన్నాళ్లూ తమతో ఎలాంటి సంబంధాలు లేకుండా, సమాజంలో దుర్మార్గంగా చిత్రీకరించిందని చెబుతున్నారు. సర్వే మాట దేవుడెరుగు, కుటుంబ కలహాలతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
చంపేసి..చచ్చిపోయాడు
పటాన్చెరు రూరల్: కుటుంబ కలహాలతో భార్యను దారుణంగా నరికి చంపిన ఓ వ్యక్తి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని భానూర్ గ్రామంలో సోమవారం జరిగింది. బీడీఎల్ భానూర్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భానూర్ గ్రామానికి చెందిన మోటె నారాయణ (55), మోటె చంద్రమ్మ (48) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పిల్లలందరికీ వివాహాలై వేరుపడడంతో చంద్రమ్మ, నారాయణలు కూడా చిన్న కుమారుడు మోటె కుమార్ ఇంటి పక్కనే మరో ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితేకుటుంబంలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో దంపతులిద్దరూ తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దంపతులిద్దరూ గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో నారాయణ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి నిద్రలేచిన నారాయణ గొడ్డలితో చంద్రమ్మపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నారాయణ మనువడు తలుపుకొట్టినా ఎవరూ తీయక పోవడంతో ఇంట్లోకి తొంగి చూశాడు. నారాయణ, చంద్రమ్మలు విగత జీవులుగా కనిపించడంతో వెంటనే విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో నారాయణ చిన్న కుమారుడు కుమార్ వెంటనే తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా రక్తపు మడుగులో తల్లి, మరోచోట తండ్రి మృతి చెంది కనిపించారు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా, బీడీఎల్ సీఐ రవీందర్‌రెడ్డి, రామచంద్రాపురం డీఎస్పీ కవిత సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన భార్య
కరీంనగర్ : దంపతుల మధ్య తరచూ చోటు చేసుకునే చిన్నపాటి ఘర్షణ భర్త హత్యకు దారి తీసింది. దాంతో తాళి కట్టిన భర్తను... భార్య ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టి చంపింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భార్య ముక్కు కొరికిన భర్త
తాండూరు : ఓ శాడిస్టు భర్త కుటుంబ కలహాలతో కోపోద్రిక్తుడై భార్య ముక్కు కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగిపోయింది. వివరాల్లోకి వెళితే ..రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌కు చెందిన వడ్డే బాలకృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో వీరు నిన్న గొడవపడ్డారు. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన బాలకృష్ణయ్య భార్య ముక్కు కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగి, తీవ్ర రక్తస్రావం అవటంతో బిగ్గరగా కేకలు వేసింది. వెంటనే పక్కనే ఉన్న కార్మికులు ఘటనా స్థలానికి చేరుకోవడటంతో బాలకృష్ణయ్య పారిపోయాడు. బాధితురాలిని తాండూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. -
రెండో శని, ఆదివారాల్లో ఫ్యామిలీ కోర్టు విధులు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 ఫ్యామిలీ కోర్టులు ప్రతి నెలా రెండో శని, ఆదివారాలు పనిచేయనున్నాయి. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
భార్య,కొడుకును కడతేర్చిన కసాయి
-
కిరాయి హంతకులతో భార్య, కొడుకును కడతేర్చిన కసాయి
హైదరాబాద్ నాగోల్‌లో దారుణం... కుటుంబ స్పర్ధలే కారణం సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కసాయిగా మారాడు. కిరాయి హంతకులతో కలిసి కట్టుకున్న భార్యను, కన్నకొడుకును కత్తులతో పొడిచి మరీ కడతేర్చాడు! ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట కుడకుడ ప్రాంతానికి చెందిన గుర్రం శశిధర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్. నార్కట్‌పల్లి మండలం నెమానికి చెందిన విజయలక్ష్మిని 1996లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను రెండో పెళ్లి చేసుకోవడంతో కొంతకాలంగా విజయలక్ష్మికి, అతనికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత మేలో భర్తపై ఆమె సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టుచేశారు. తర్వాత విజయలక్ష్మి తన కుమారుడు సాకేత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వచ్చి రోడ్ నంబర్ 1లోని సాయిమిత్ర అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. తనపై కేసు పెట్టిందన్న కోపంతో శశిధర్‌రెడ్డి బుధవారం రాత్రి 9.15 సమయంలో ముగ్గురు కిరాయి హంతకులను వెంటబెట్టుకుని విజయలక్ష్మి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. పోలీసులమని చెప్పడంతో వాచ్‌మన్ వారిని విజయలక్ష్మి ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. శశిధర్‌రెడ్డి, మిగతా ముగ్గురు లోనికెళ్లి విజయలక్ష్మి (38), పక్కనే ఉన్న సాకేత్‌రెడ్డి (14)లపై తల్వార్లతో దాడి చేసి హత్య చేశారు. అదే గదిలో ఉన్న వారి బంధువు సంధ్య కేకలు వేయడంతో కిరాయి హంతకుల్లో భుజంగరావు, మోహన్‌రావు గోడ దూకి పారిపోగా మూడో వ్యక్తి మధుసూదన్‌రావును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శశిధర్‌రెడ్డి మాత్రం బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో తలుపులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందంటూ శశిధర్‌రెడ్డి ఆమెను కొన్నేళ్లుగా వేధిస్తున్నట్టు, ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. కిరాయి హంతకులను వరంగల్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన వారిగా గుర్తించినట్టు ఎల్బీ నగర్ డీసీపీ రవివర్మ తెలిపారు.